Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాంస కరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ ఇహలోకంలో సుఖంగా ఉంటే దివ్యమైనటువంటి లక్షణాలు ఏర్పడతాయి. దానివలన దివ్య సుఖాలు ఏర్పడతాయి. దివ్య సుఖాల వలన మోక్ష సుఖాలు ఏర్పడతాయి. దానినే వివేక చూడామణి లో శంకర భగవత్పాదులు ఐహికానందము, ఆముష్మికా నందము, కైవల్యా నందము అని మూడు పేర్లు పెట్టి మనకి పరిచయం చేశారు. అవి, అవి రాలేదా మీ తాతకి అని చెప్తూ, భౌమ సుఖముల దివ్య సుఖముల మోక్ష సుఖముల పొందెనట్టి అచ్యుతుని పరుని వితత యోగీంద్ర నికర గవేశ్యమాణ చరణ సరసిజయుగలు శశ్వత్ ప్రకాశు భక్తవత్సలు విశ్వసంపాద్యు హరిణి. అటువంటి వానిని నువ్వు సేవించవయ్యా! నాయనా! నువ్వెళ్లి పనిలో ఉండు. నీకు కావలసింది తండ్రి అంకపీఠం కదా! నువ్వు తప్పకుండా దీన్ని సాధిస్తావు. నీ తాత మనువు సాధించాడు. ఆయనను పుట్టించిన బ్రహ్మే సాధించాడు. నీకేమీ అసాధ్యం కాదు వెళ్ళమన్నది. వెళ్ళు అనగానే ఆయన తయారీ వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే చూడండి నారదుడు ఎదురయ్యాడు. మనం ఎప్పుడైనా ఒక మంగళాకానికి వెళ్ళేటప్పుడు శివం కనే బయలుదేరుతాం. కారణంలోకి రాగానే ప్రపంచంలోకి ఇలాగే ఎవడూ "శివం ఎక్కడికి పోతుందండి?" అంటాడు. ఎక్కడికి పోదు. అది అక్కడే ఉంటుంది. మనం వెళ్లగలమో లేదో. మనం అక్కడికి ఎప్పటికైనా చేరగలమో లేదో. భావనతో పరమాత్మ వైపు వెళ్ళాలి. అయితే మన సంకల్పాలు శుద్ధంతో కూడి ఉన్నట్లయితే, పరమేశ్వరాయత్తం అయినట్లయితే, మనీషాయత్తం గనక అయినట్లయితే తప్పకుండా తగిన గురువు మన జీవితంలోకి ప్రవేశిస్తాడు. తగని గురువు రాకూడదు. తగని గురువు వస్తే ఉన్న శాంతి కూడా పోతుంది. తగిన గురువు వస్తే శాంతి ప్రశాంతి అవుతుంది. ప్రశాంతి ప్రసన్నం అవుతుంది. ప్రసన్న స్థితిలో నుంచి కాంతి, దాంతి, హాయి, మోక్షం అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి వెంబడి వెంబడే మనకు ఏర్పడతాయి. నారదుడు ఎదురైనాడు. "నాయనా! చిన్న పిల్లవాడివి. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి బయలుదేరావు?" అన్నాడు. "నాకు తెలియదా?" "తెలుసు." కానీ అడగాలి. ఎక్కడికి అంటే చెప్పాడు. ఇదిగో జరిగింది చెప్పి, "మా అమ్మ" అంటే పినతండ్రి పినతల్లి ఇలా అన్నదని గాని, తండ్రి తనను ఆదరించలేదని గాని మాట చెప్పకుండా, "మా అమ్మ, మా బ్రహ్మ, మనువు అంటే మా తాతలు, ముత్తాతలు పరంపరలో అయితే పరమేశ్వరుడిని హరిని కీర్తించారో అటువంటి వాణ్ణి కీర్తించమని చెప్పమన్నది మా-- చేసుకోమన్నది తపస్సు. వెళుతున్నాను కానీ ఎక్కడ చేయాలో తెలియలేదు. యమునా తీరంలో చేసుకోమని మాత్రం మా-- మాట అన్నది. తీరం ఎన్ని వేల కిలోమీటర్లో తెలియదు. నేను ఎక్కడికి పోవాలో" అన్నాడు. అందుకనే గురుతు చూపించేవాడే గురువు. మార్గం చూపించాలి. ఇదిగో నువ్విలా హాయిగా గనక వెళ్లినట్లయితే నువ్వు తొందరగా స్వస్థానానికి చేరుతావు. ఇదిగో ఫలానా వాడు అలా వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు అని నాలుగు కథలు చెప్తే ఓహో! మనం కూడా వెళ్లొచ్చు అన్నమాట. అన్నట్లుగా. విను పుత్రక! బాలు-- బాలుడవై అనయంబును క్రీడలందు ఆసక్త మనంబున తిరిగెడు నీ, ఇక్కాలంబున నీకు అవమాన మానములు లేవన్నున్. హాయిగా ఆడి, పాడి ఎవరితోనో పిల్లలతో ఆడుకునే వేళ మానావమానాలు లేని స్థితి నీకెట్లా ఏర్పడింది పుత్రక అన్నాడు నారదుడు. ఇది అవమానం అని నీకు తోచలేదే, అదే ఆశ్చర్యం కలుగుతున్నది నాకు అన్నాడు. కావున వివేకము గల పురుషుండు తనకున్ ప్రాప్తంబులగు దుఃఖములు దైవవశంబుగా తలచి. మనకో దుఃఖం, అననుకూలత జీవితంలో ఏర్పడుతుంది. ఏర్పడగానే దేవుడికి మన యందు దయ తగ్గిపోయిందని లేదా మనమేదో పాపం చేసేసామని లేదా ఎవరో మనల్ని యాతన పెట్టడానికి వాళ్ళు కంకణం కట్టుకొని ఈరోజు వ్రతం చేస్తున్నారని ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దన్నాడు. నీకేదైనా ఒక దుఃఖం ఏర్పడింది అంటే అమదానందమైనటువంటి సుఖం తీరం వైపు తీసుకెళ్లడానికి పరమాత్మ చిన్న మెలిక పెట్టాడు అంట. రోగం వచ్చిన ప్రతివాడు పోతాడా? రోగం వస్తుంది. ఎందుకు పోవాలంటే శరీరానికి అప్పుడప్పుడు జ్వరం రావాలి. వైద్య శాస్త్రంలో. జ్వరం వస్తే మనం జాగ్రత్త పడతాం. జ్వరమే రాలేదనుకోండి, వీడు గుట్టుకుమంటాడు. జ్వరం వస్తే అందరి attention వాడి మీద ఉంటుంది. ఎప్పుడు మందు వెయ్యాలి, ఏం చేయాలి, వీణ్ణి ఎలా చూసుకోవాలి, లేచాడా లేదా, లేచిన తర్వాత నిన్న ఉన్నట్టు ఉన్నాడా లేదా? చూశారా! ఏమీ లేదనుకోండి, ఏదో లేస్తాడనుకుంటాం వాళ్ళేవడు అది. కాబట్టి దుఃఖాలన్నీ కూడా దైవానుగ్రహమే అనుకోమంటాడు. తావన్మాత్రంబునన్ పరితుష్టుండగు నీవును తల్లి చెప్పిన యోగమా-ర్గ్గ ప్రకారంబున సర్వేశ్వరానుగ్రహము పొందెదనంటివేనీ. నీ తల్లి తపస్సు చెయ్యన్నది. చెయ్యి అంటే ఎలా చేయాలి? ఐదేళ్ళ పిల్లవాడివి వాడివి. తపస్సు చేసుకునే వయస్సు కాదు. శరీరం చేత పూజ చేయాలి. వాక్కు చేత తపస్సు చేయాలి. మనస్సు చేత ధ్యానం చేయాలి. అంతఃకరణ చేత చైతన్యాగ్ర స్థితిని సాధించాలి. మూడు ఎక్కడున్నాయి? శరీరం మనదే. శరీరం ఉంది కాబట్టి మనస్సు ఉన్నది. శరీరము మనసుతో పాటు వాక్కు ఉన్నది. కాబట్టి నీ పూజ, నీ జపము, నీ తపము, నీ ధ్యానము, నీ ధారణ, నీ సమాధి ఎక్కడ ఉన్నాయి అంటే అన్నీ అంతరంగంలో ఉన్నాయి. లోపలే ఉన్నాయి. బయట ఏమీ లేవు. కాబట్టి మూడింటిని నువ్వు దాన్ని అలా వాడుకో నాయనా అని చెప్తున్నాడు నారదుడు. చెప్పి...ఇలా వెనక చేసినట్లయితే నీకు అనన్యాభిషిక్తంబు ప్రదంబును పొంద ఇచ్ఛించిన నాకు సాధు మార్గం చెప్పమన్నాడు. నేను చేయగలిగిన మార్గం చెప్పవయ్యా అని అడిగాడు ధ్రువుడు. నువ్వేదో పెద్ద మాట చెప్తే నాకేం అర్థం కాదు, నేనేం చేయాలి మా అమ్మ ఇళ్ళ మంది? యమునా నది తీరానికి వెళ్లి కూర్చొని హరిని ధ్యానించు అన్నది. తపస్సు చేసుకో రది. తపస్సు అంటే తెలీదు, ధ్యానం అంటే తెలీదు, నేనేం చేయాలి అని అడిగాడు. నీవు భగవంతుండగు అజుని ఊర్వు వలన జనించి వీణావాదన కుశలుడివై నువ్వు కూడా బ్రహ్మ తొడలో నుంచే పుట్టే-పుట్టిన వీణ పట్టుకున్న వాడివి నువ్వు మామూలు వాడివి కాదు. కాబట్టి కథంతా నీకు తెలుసు. నువ్వెలాగ వచ్చావో అలాగే నాక్కూడా ముక్తి మార్గం చెప్పమంటే అన్నాడు. విను నిన్ను మోక్షమార్గంబునకున్ ప్రేరేచిన వాడిప్పుడు ధీరజనోత్తముడు వాసుదేవుండగుటన్. ఇక్కడే ధ్రువుడికి ద్వాదశ అక్షర మంత్రం ఉపదేశం చేశాడు నారదుడు. ద్వాదశాక్షరి అదేమిటో తర్వాత చెప్తా. హైగా అజస్త్ర ధ్యాన ప్రవణ చిత్తుండవై, అజస్త్రం అంటే అసంఖ్యాకమైన, ఎడతెరిపి లేకుండా ఉండేటువంటి ధ్యాన మాత్రలు, అనేకమైన ధ్యాన స్థితులు ఏర్పడతాయి. నువ్వు ఏం చేయొద్దు హరి నామాన్ని, హరి రూపాన్ని తలుచుకుంటూ ఉండు. నువ్వేం చేయనక్కర్లేదు కూర్చో మన్నాడు. అరయమునాతట మునతగు హరి సాన్నిధ్యము సుచియు అతి పుణ్యమునై పరగిన మధువనమునకు సరసగుణా సనువు మేలు సమకూరు అతటన్. యమునా నదీ తీరంలోనే మధువనం అని ఒకటుంది. అక్కడికి వెళ్ళు. మధువనంలో గనుక నువ్వు ప్రవేశించినట్లయితే నీ మనస్సు పరమేశ్వరుడి యందు ఏకాగ్రమైనటువంటి ఒక స్థితిని పొందుతుంది. దానిలో నుంచే పూజ, జపము, తపము, ధ్యానము అన్నీ ఏర్పడతాయి. వెళ్ళమన్నాడు. యమునాతటినీ శుభ తోయములన్ త్రొంకి నిష్ఠతో అతట నారాయణునకు నమస్కృతులు ఆయతమతి చేసి చేయు యమ నియమములన్. యమము, నియమము అని రెండున్నాయి. పతంజలికి అష్టాంగ యోగంలో. రెండు పాటించు నాయనా. యమ నియమాలు అంటే ఇంద్రియాలు దాటించు. అంటే మా అమ్మ ఎట్లా ఉన్నదో, మా నాన్న ఎట్లా ఉన్నాడో, నేను వదిలిపెట్టి వచ్చేసానే, మళ్ళీ మా అమ్మని చూస్తానో లేదో, అవన్నీ వదిలిపెట్టు. పరమేశ్వరుడే నీ తల్లి అనుకో, నీ తండ్రి, గురువు, దైవం అనుకో. అనుకొని స్థిమితంగా నువ్వు అక్కడ కూర్చో. కూర్చుంటే పరమాత్మే నీకో రోజున కావలసిన మోక్ష మార్గాన్ని, మోహ క్షయ మార్గాన్ని, కాల మార్గాన్ని, యోగ మార్గాన్ని, అధ్యాత్మ మార్గాన్ని అన్నింటినీ కూడా నీకు అనుగ్రహ వర్దానం చేస్తాడు. అని చెప్పి వెళ్లిపోయినాడు. ఈయన కూడా నెమ్మదిగా మధువనానికి చేరుకున్నాడు. మధువనం అడ్రస్ చెప్పాడు, పట్టుకున్నాడు, వెళ్ళాడు. కని ముందట కనుగొనే మధువనమును చూస్తూ ఉండగానే ధ్రువుడి మనసులో ఒక ఆనందం కలిగిందట. ఎప్పుడైనా అంతే చూడండి. ఒక పరమ శుద్ధుడైనటువంటి ఒక వ్యక్తిని మనం దర్శించినప్పుడు, వారిని మనం చటారుడు చూసినప్పుడు, అంతవరకు మనసులో ఉన్నటువంటి ఆందోళనలన్నీ కూడా ఒక్కసారి ఎటుపోతాయో పోతాయి. మనకి తెలీదు. ఆయనేం మాట్లాడ్డూ మనతో, కనపడ్డాడంతే. కనపడిన మరుక్షణమే మన మనసు ప్రసన్నం అయిపోతుంది. అట్లాగే మధువనం వెళ్ళవలసిన ప్రదేశాన్ని చేరుకున్నాడు గనుక ధ్రువుడికి ముని దేవయోగి వర్ణిత గుణ పావనము దుర్భ-దుర్భవ జల పద వనమును నిఖిలైక పుణ్య పర భవనమున్. నిఖిలైకమైనటువంటి ప్రపంచంలో ఏకైకము ఒకటిగా ఉన్నటువంటి మధువనం ఆయనకి దగ్గర ఉంది. దగ్గరకు రాగానే హృదయం ఆనందతాండవం చేసింది. చేసి చెప్తున్నాడు. సకల భూతేంద్రియాశయమగు హృదయంబునందు. ఇది తపస్సు చేసే విధానం. చాలా గొప్ప పద్యం రాశాడు పోతన. తపస్సు అంటే ముక్కు మూసేసుకుని ప్రాణాయామం చేసి, ప్రత్యాహార సాధనలు చేసి, ధ్యాన ధారణ అతీతమైనటువంటి చారణం చేయటం కాదట. ఏమిటి అంటే ఇది భక్తి యోగానికి సంబంధించింది గనుక సకల భూతేంద్రియాశయమగు హృదయంబునందు విషయముల చండాలీక మహదాది తత్త్వ సమాజమ్ములకు ఆధారభూతమును ప్రధాన పురుషేశ్వరుడైనట్టి శాశ్వత బ్రహ్మంబు తనదైన హృదయ పద్మమున నిలిపి. స్వామి మొత్తం, పద్యమంతా ఒక్క మాటలో చెప్పారు. ఒకే ఒక శబ్దం. అందుకే స్వామి బోధలు అది అందుకోవాలి. అందుకోగలిగితే సర్వ ఉపనిషత్తుల కంటోపాఠం. విషయ వాంఛ తగ్గించుకో బంగారు, విష్ణు వాంఛ పెంచుకో. ఎంత అందమైన మాటలు చూడండి. విషయ వాంఛ తగ్గించుకో, విష్ణు వాంఛ పెంచుకో అంతే. విష్ణువే మనల్ని ఆక్రమిస్తే విషయమేక్కడుంది? ఈయన కూడా అదే చెప్తున్నారు. విషయాన్ని వదిలిపెట్టండి. నీకు హృదయమనే పద్మం ఇచ్చాడు. పద్మంలో రోజూ దాన్ని డస్ట్ బిన్ గా వాడే కంటే దాన్ని పవిత్ర మంజూషికగా, ఒక పేటికగా, ఒక అద్భుతమైనటువంటి పరమాత్మ పీఠికగా వాడుకోగలిగితే ఎంత గొప్ప విషయం అంటూ తనదైన హృదయ పద్మమున నిలిపి హరి రూపమున కంటే అన్యంబు నెరుగక చిత్తము అవ్విభుని యందు చేర్చి ఉన్న కథన ముల్లోకములు సాల కంప ముందే. ధ్రువుడు ఇలా వెళ్ళాడు మధువనంలో కూర్చున్నాడు. మునులు, విరాగులు, వైష్ణవులు అంటే విష్ణువు యొక్క భావన యందు తరించేవారు వైష్ణవులు అని. వైష్ణవులు అంటే మతాన్ని ఆశ్రయించిన వాళ్ళు కాదు. విష్ణువే పరమాత్మ అన్న భావనలో మనస్సును నిరకడ చెందించుకున్నవారు. వాళ్ళందరూ ఉన్నటువంటి మధువనంలోకి ధ్రువుడు వెళ్ళి కూర్చోగానే యోగ మార్గం అప్రయత్నంగా, రమణ మహర్షి అదే అంటారు.భగవాన్ పూజలు, తపాలు, ధ్యానాలు, విచారణలు ఇవన్నీ అవసరమా అంటే, అవసరమే ఎప్పటిదాకా అంటే till you reach a stage where there will be an effortless effort. effortless effort వెళ్ళేదాకా ఇది కావాలి. అక్కడికి వెళ్ళాక అవసరం లేదన్నారు. ముందే అవసరం లేదని ఎవరు చెప్పడానికి వీల్లే. కానీ దాటుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి ఇవన్నీ అక్కర్లేదు అది. ఎప్పుడైతే ఇంత తీవ్ర తపస్సులో ఉన్నాడో మూడు లోకాలు ఒక్కసారి కంపించిపోయినాయి. వేడి యోగాగ్ని వలన మరియు పేర్చియై అర్థకుందు ధరణిని ఒక్క పాదంబున చేర్చి నిల్చున్న వేళ. ధ్రువుడు అందుకనే గొప్పవాడయినాడు. ఏం చేశారు మిగతా వాళ్ళంతా చెట్టు కింద హాయిగా ఏదో కృష్ణాజినం వేసుకొని పులి చర్మం వేసుకొని దానిమీద కూర్చొని తపస్సు చేస్తూ చేతిలో అక్షమాల పెట్టుకొని లేదా రుద్రాక్ష పెట్టుకొని ఓం నమో నారాయణాయ అంటున్నారు. ధ్రువుడు అట్లా కాదు. ధృడమతిగా వెళ్ళాడు. ఒంటి కాలు మీద నుంచున్నాడు తపస్సు. ఒంటి కాలు కాదు పాదం కూడా నేలమీద అప్పలే. కుడివేలి బొటనవేలు ఏదైతే కుడి పాదంలో ఉన్న బొటనవేలు ఏదైతే ఉన్నదో అది దానిమీద భూమిని ఆల్, భూమ్మీద ఆన్చి దానిమీద నిల్చున్నాడు. ఎందుకని అంటే దానికి ఒక యోగ రహస్యం ఉంది. కుడి పాదము యొక్క బొటనవేలు నుంచి సుషుమ్నా నాడి ప్రారంభమవుతుంది. సుషుమ్నా నాడి మనందరికీ జ్ఞానికే కాదు అందరికీ జీ, జన్మ ఎత్తిన ప్రతి వాడికీ డెబ్బై రెండు వేల నాడులు ఉన్నప్పటికీ కూడా వెనక ఉన్నటువంటి వీణాదండంలో వెన్నుపూసకి మూలాధారం నుంచి ప్రారంభమై ఇడా పింగళ ఇట్లా entwine అయి వెళుతూ ఉంటాయి. వాటి మధ్యలో నుంచి నెమ్మదిగా సుషుమ్న వెళుతుంది. దానినే లలితా సహస్ర నామంలో అమ్మవారిని ఎలా వర్ణించారు శంకర భగవత్పాదులు లేదా వ్యాసులంటే తామర తూడులో ఉన్నటువంటి సన్నని దారపు పోగువలె అన్నాడాయన. తామర తూడు యొక్క తామర తూడుకి importance ఏం లేదు. దాని మధ్యలో బిందు స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారు ఒక తంత్రి ఒక దారంగా ఉన్నది గనుక సహస్రారానికి link అయి ఉన్నది. కాబట్టి సుషుమ్నా నాడి పుట్టుక అక్కడ. అక్కడ నుంచి అందుకనే గురువు యొక్క పాదపద్మాలలో రెండు బొటనవేళ్ళు ప్రధానం. ఇడా పింగళా నాడులను గనుక రెండింటినీ రెండు బొటనవేళ్ళతో పట్టుకోగలిగినట్లయితే గురువు సుషుమ్నలో నుంచి పరిపూర్ణమైనటువంటి ద్వాదశాంత స్థానానికి చేరుస్తాడు. అది పాద నమస్కారానికి అర్థం అది. కాబట్టి అక్కడిదాకా ఒక్, ఒక్క పాదంబున చేర్చి నిల్చున్న వేళ పేర్చి అబ్బాలు అంగుష్ట పీడ చేసి. ఎప్పుడైతే ప్రపంచంలో గొప్ప తపస్సు జరుగుతుందో భూలోకంలో ఉన్నట్టే ఎవడన్నా పైకి వస్తుంటే అసూయ ఎట్లాగో స్వామిని అడిగారు. స్వామి మంచివాణ్ణి ప్రపంచం ఎందుకు బాధిస్తుంది అని అడిగారు. అసూయ వలన అన్నారంట. ఒక్కటే మాట. ఇంకేం లేదట. మంచివాడు వాడు మంచివాడు. వాడు ప్రపంచం వీడు మంచివాడని ముద్ర వేసింది. ఎందుకు వాణ్ణే వాళ్ళు target చేస్తాడంటే అసూయ వలన. నేను అక్కడికి వెళ్లలేకపోయినానే అని ఒకటి, వెళ్లలేనేమో అనేటువంటి ఒక ఆత్మన్యూనతా భావం వల్ల పైకి వచ్చే ప్రతి వాణ్ణి కూడా హింసించడానికి ఒకడు ఉండాలి. నా ఉద్దేశ్యంలో వాడు ఉండాలి. వాడు ఉంటేనే వీడి సాధన హాయిగా సాగుతుంది. కదా. ఒక్కడు ఉంటే చాలు. వీడు వీడు అలా వెళుతుంటాడు. వీడి ప్రయాణం వీడిది. వాడి ప్రయాణం వాడిది. వాళ్ళు ఎక్కడా కలుసుకోరు. వీడున్నంత కాలం వాడు ఉంటాడు. వాడున్నంత కాలం వీడు ఉంటాడు. సరే వీళ్ళందరూ ఏం చేశారంటే నారాయణమూర్తి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్లారు. వెళ్లి ధ్రువుడు ఐదేళ్ళ పిల్లవాడు ఏదో ఇంట్లో అలిగి వచ్చేసాడనుకున్నాం గాని బొటనవేలు మీద నుంచొని తీవ్ర తపస్సు చేస్తున్నాడే, ముల్లోకాలు కంపించిపోతున్నాయి, శ్వాసలన్నీ ఆగిపోతున్నాయి. చల్లగా హాయిగా పడుకున్నటువంటి అమర లోకంలో అందరికీ నిద్ర లేకుండా అయిపోయింది. దీనికేదో నువ్వే చూడాలయ్యా అన్నారు. ఏం చూడాలి రెండే మార్గాలున్నాయి. తపస్సు ఆపనన్నా ఆపాలి. అంటే వాడికి వరం ఇవ్వాలి. వరం ఇవ్వాలంటే వీళ్ళని ముందు బుజ్జగించి పంపాలి. ఎందుకంటే ఆయన నాటకం కూడా నడవాలి. మనం కూడా అంటాం కదా స్వామి గ్రేట్ అండి స్వామి ఈజ్ గాడ్ కానీ చుట్టూ ఉన్నవాళ్ళే అంటాం మనం. అయితే స్వామి ఏమంటారంటే మీకు ఏం తెలియదు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నేను ఎందుకు పెట్టుకున్నానంటే వాళ్ళు వదిలిపెడితే మీరు ఇక్కడ బతకలేరు. అందుకని నా దగ్గరే పెట్టుకున్నానంటారు ఆయన. కాబట్టి ఇది లోకరీతిలో స్వామి ఇచ్చే జవాబు. అలాగే వీళ్ళంతా నారాయణమూర్తి దగ్గరికి వెళ్లారు. వెళ్లి అడిగారు వాళ్ళు కూడా. వాళ్ళు వెళ్ళినా కైవారం చేయవలసిందే. హరి పరమాత్మ కేశవా చరాచర భూత శరీర ధారివై పరబ్రహ్మువు నీవు ఇట్లులుగ ప్రాణ విరోధ నెరుంగ మెందు ముందు ఇరువుగ దేవదేవ జగదీశ్వర సర్వ శరణ్యా నీ పదాంబురుహము అర్ధిమై శరణు నొందెద మాతిహరి యోంచి కావవే. సర్వస్త జనుల యందు నీ హరివంశం ఉన్నది గాని వాడొక్కడి యందు ఇంత ఎక్కువ ఉన్నదేమయ్యా? వాణ్ని ఏదో నువ్వు control చెయ్ అని అడిగారు. అప్పుడు ఆయనన్నాడు కథంతా స్వామి లాగానే అన్నమాట. ఉత్తానపాదుడనే రాజున్నాడు. అప్పుడు కథ చెబుతారు స్వామి. మనమే యాతన పడి రక్షించమని అడిగితే వాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పి నేను చూస్తాలే అంటారు. అలాగే నారాయణమూర్తి కూడా చెప్పి సరే మీరు వెళ్ళండి. హాయిగా మీ పనిలో మీరుండండని వెళితే హరికి ప్రణామంబులు ఆచరించి త్రివిష్టపంబునకు చేరెదరు అంటే స్వర్గ లోకానికి అంటే ఎవరెవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు హరీశ్వరుండు విహంగ కులేశ్వర యానుడై గరుడగమనుడై వచ్చాడాయన. గరుడగమనుడై రావటం అనేది అందమైన దృశ్యం అది. అదేమిటంటే ప్రాణానికి సంకేతం.మనస్సు పాముకి సంకేతం రెండింటిని ఒక చోట పెట్టుకుంటాడు ఆయన ఆదిశేషువు గరుడ ప్రతి ఒక చోట ఉంటాయి విశేషం లేదు దానికంటే ఇది పడదు ఇది కంటే దానికి పడదు కానీ పదివేల శేషుల కింద హాయిగా ఆయన పడుకుంటాడు గరుత్మంతుడు అక్కడే కూర్చుని ఉంటాడు ఆయన ఎప్పుడు పిలుస్తాడో ఎక్కించుకు వెళ్దామని అది విహంగ కులేశ్వర యానుడై మిగ భృత్యుడైన ధ్రువుని కనుగొను వేడుక జనింప ఆయనకు కూడా వేడుక జనించింది కోరికలు లేని పరమాత్మకు కూడా రోజున కలిగిన కోరిక ఏమిటంటే ధ్రువుడు ఎవడో ఇంత చెప్తున్నారు వీళ్ళు ఒకసారి చూసి వద్దాం తెలియదా ఆయనకి తెలుసు ధ్రువుడి దగ్గరికి వెళ్ళాలి పరమేశ్వరుడికి వేడుక ఉత్సాహం అని రెండు ఉంటాయి అందుకనే సిరికిన్ చెప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు పరివారమున్ జీరడు అభ్రగపతిన్ బన్నింపడు ఆకర్ణికాంతర దమిల్లము చక్కనొత్తడు వివాహ ప్రోద్ధిత శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై ఉత్సాహం ఆయనది భక్తుడ్ని కాపాడాలన్న ఉత్సాహం ముందు వైకుంఠము సున్నా సిరి గూడా సున్నాయి ఎవరికీ ఏం చెప్పవలసిన పని లేదు సర్వ స్వతంత్రుడు సర్వాధ్యక్షుడు గనుక పరమాత్మ అలాగే వెళ్లి మధువనమునకు అప్పుడు చని ధ్రువుండు పరువడి యోగది పాకతివ్రంబైన బుద్ధికే నిజమనోంబురుహ ముకుళమందు కటిత్ప్రభాయత మోర్తియట తిరోధానంబు నన్నంది తత్క్షణంబు చాలా కీలకమైన పద్యం రాశాడు పోతనామాత్యుడు ఆయన ఏం చేశాడంటే వచ్చాడు పరమేశ్వరుడు మనసు పరమాత్మ దాకా వెళ్లాలంటే కొన్ని వేల జన్మలు వందల ఏళ్ళు కావాలి గాని ఆయన మన దగ్గరికి రావటానికి ఒక సెకను కూడా పట్టదు అనుకున్నాడు వచ్చేశాడు వచ్చేసేసరికి ధ్రువుడి మనసు ఎట్లా ఉన్నది అంటే అంతా హరి యొక్క ఊహ ఉన్నది హరి యొక్క గుణగానం ఉన్నది సంకీర్తన ఉన్నది హరి ఇట్లా చేశాడు ఎట్లా చేశాడు అంత గొప్ప వాడు ఇంత గొప్ప వాడు భావ స్వరూపంతో పరమాత్మ ధ్రువుని హృదయంలో ఉన్నాడు సాక్షాత్తు స్వామి వచ్చేస్తే మాట్లాడుతున్నాం కదా తలుపు తీసుకుని ఇక్కడికి వచ్చారు అనుకున్నాం ఏమవుతాం మనం అదే అయింది ధ్రువుడికి అది పువ్వు పడితేనే ఆనందపడతాం ఆయనే వచ్చేస్తే ఆయన వచ్చేస్తే అనటానికి ఆయన అసలు ఇక్కడ నుంచి వెళితేగా అక్కడే ఉన్నారుగా అది కాబట్టి మనస్సుని అట్లా రాజరంజితం చేసుకోవాలి ధ్రువుడు కూడా ఒక్కసారి శ్రీమహావిష్ణువు తన కట్టెదుట నుంచోగానే అవునా కాదా అని సంభ్రమం చెందాడు ఆయన దాన్లే ధ్రువుడిని చూశాడు వెళ్ళిపోతున్నాడు అంట తిరిగి వెంటనే ఒక సెకనులో జ్ఞాని గనుక మనీషా యత్నంలో ఉన్నాడు గనుక ఒక్క క్షణం ఆలోచి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే పట్టుకున్నాడు హరిణి అంటే ఆయన దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు మూర్తిన్ కనుగొని సంభ్రమునం సమ్మదాశ్రువులు రాల పులకీకృత అంగుడగుచు కళ్ళంబడి అశ్రుధారలు కట్టినాయి మనకు స్వామిని చూసినా అవే కలుగుతాయి స్వామిని చూస్తే కోరికలు ఏం పుట్టవు కళ్ళంబడి నీళ్ళు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే స్వామి మనలో ఉన్నటువంటి హృదయ పద్మాన్ని మీటుతారు మీటినప్పుడు జన్మ జన్మాంతరాలుగా పేరుకున్నటువంటి అనేక కర్మల వలన ఏర్పడిన దుఃఖం అంతా నశించి ముందు దుఃఖధారలు బయటకు వస్తాయి తర్వాత ఆనందాశ్రువులు వెల్లివిరుస్తాయి వేడినీళ్ళు చన్నీళ్ళు రెండూ లోపల నుంచి అందుకే స్వామి అంటారు కన్నీరు తెప్పించేది నేనే కన్నీరు తప్పించేది నేనే రెండూ నేనే అయినప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావ్ అన్నాడు అది దండ ప్రణామాలు చేసి ఆయన కూడా మనలాగ ఆయన్ని ప్రార్థించి ఎలా ప్రార్థించాడు సాక్షాత్తు పరమాత్మే తన కట్టెదుట నుంచున్నప్పుడు వరమతి ఆప్త బాంధవ భవద్ఘన బోధన సేతుడై భవచ్ఛరణంబు పొందినట్టి విధివర్గము సుప్తజనుండు బోధమందర యగసూచురీతి నకనునట్టి ముముక్ష శరణ్యమైన నీ చరణమునం కృతజ్ఞుడగు సజ్జనుడు ఎట్లు తలంపకుండెడున్ ఏది ఊహించానో అది సాకారమై అదే మూర్తిమంతమై అదే నా ముందు ఒక బొమ్మై అదే సాకారమై కనిపిస్తే నా హృదయం ఎంత ఆనందపడిపోతున్నదో తెలుసునా అన్నాడు పసివాడు కదా వాడి ప్రార్థన అలాగే ఉంటుంది వాడికి ఈయన గురించి కథలు ఎక్కువ తెలియవు నేను ఏది ఊహించానో అలాగే నువ్వు ప్రత్యక్షమయినావు అది నాకు ఆనందం కలిగించింది అరవిందోదర తావకీన చరణ ధ్యానానురాగోల్ల సచ్చరితాకర్ణన జాత భూరిసుఖముల్ స్వానందక బ్రహ్మమందు అరయం లేవట అసలు బ్రహ్మపదం సంగతి పక్కన పెట్టవయ్యా తావకీన చరణ ధ్యాన ఆచరణ అనే అనేకమైన యోగ ప్రస్థానాలలో ఉన్నటువంటి ఆనందమే ఆనందమట అదే నిజానికి భౌమ్యం లోకానికి సంబంధించినటువంటి ఆనందాలట అలాగే స్వానందక బ్రహ్మమందు అరయం లేవట దండ హృద్భుట విమానాకీర్ణులై కురునా సురలోకస్తుల చపనీల సుజన స్తోమైక చింతామణి చింతామణి అంటే చింత తీర్చే మణి అని అర్థం చింతలు పెంచేది చింతామణి కాదు చింత తీర్చేది చింతామణి పరమేశ్వరుడి చింత జీవుడికి మూడు ఉన్నాయి చితి చింత చింతన చితి తప్పదు చింత తప్పదు స్వామి అన్నారు పుట్టుట ఒక చింత పెరుగుట ఒక చింత పోవుట ఒక చింత ఇక్కడ పెరుగుట ఒక వింత ఇవన్నీ స్వామి చెప్పినవే కాబట్టి ఇక్కడ ఇదంతా ఒక చింత అయితే పోతానేమో అనే చింత రెండోదైతే అసలు చింతన గనక ఉన్నట్లయితే చింతలు నశిస్తాయి కదా అంటున్నాడు ధ్రువుడు కూడా హరి భజనీయ మార్గనీయతాత్మకులైభక్తిపై వరలిన భక్తి యుక్తుల గువారల సంగతి కల్గజేయు సత్పురుష సుసంగతిన్ యసన దుస్తర సాగరము అప్రయత్న తన్ తరస భవత్కథామృత రసంబున మత్తుడ నై తరించెదన్. భవసాగరాన్ని దాటాలి అంటే నీ దివ్య గాధరు అనేటువంటి పడవ ఎక్కితే చాలు. స్వామి ఏం చెప్పారు? మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం. మీరు నావ ఎక్కండి అంతే నేను తీసుకెళ్లి అవతల గట్టున చేర్చేస్తా. మీరు చేయవలసింది ఏం లేదు. నీరు సిద్ధం, నావ సిద్ధం, నావికుడు సిద్ధం. మీరు వచ్చి ఎక్కండి అంతే. నేను నడిపిస్తా. ఇది గురు చరణాలను ఆశ్రయిస్తే మనస్సు యందు గురు చరణాలు అంటే మానస భజరే. రే అంటే ఒరే అని సంస్కృతంలో. అట్లా గనక ఉన్నట్టయితే నేను మిమ్మల్ని నడిపిస్తాను. అలాగే అంటూ ధ్రువుని చేత వినుతింపబడి ధ్రువుడు ఇంత స్తోత్రం చేస్తుంటే పరమానందంగా విన్నాడు బ్రహ్మ రుద్రాదులంతా వచ్చి చెప్పారు నిజమే అసలు పిల్లవాడు నా ముందును కూర్చొని నా గురించి చెప్తున్నాడు వీడు. ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు. ఓహో నేను ఇంత విషనాధ వారు అన్నట్టు. మీ నాన్న అంత గొప్ప వాడురా నమస్కారం చేయమని. అట్లాగే నాన్నకు ఎలాగు నమస్కారం చేయంట. పక్కనున్నవాడు మీ నాన్న కంటే గొప్పవాడు అంటే వాడితో పాటు ఈయనకీ అని. ధ్రువుని చేత హృత్యానురక్తుండైన భగవంతుడు ఒక మాటన్నాడు. ధీరవ్రతా రాజ రాజన్య కుమారక నీ హృదయమందు అసలిన కార్యంబు ఆరూఢిగా ఎరుగుదున్. నీ మనసులో గూడు కట్టుకున్నటువంటి భావం నాకు పూర్తిగా తెలుసు. ఆరయది వందరా నిదై నను ఇత్తున్. ఆలోచన చేస్తే అది నువ్వు నిజానికి అందరూ పొందేది కాదు గానీ నీకిచ్చేస్తా అన్నాడు. నీకేం కావాలో నాకు తెలుసు. అది అందరూ పొందలేరు. నేను ఇచ్చేస్తా అన్నాడు. ఇచ్చేస్తా అని అన్నవాడు పరమాత్మ ఏం చేస్తాడంటే మనం ఇస్తా అంటే చూస్తాను అని అర్థం. కదా. ఎప్పుడూ కూడా పని చేయండి అంటే చేస్తాను అని ధ్రువుడ్లాను చూస్తాను అంటాడు నెమ్మదిగా బలహీనమైన గొంతుతో. అంటే చూస్తా అంటు చేయం అని పొలైటుగా చెప్పడం అది. చూడటంలోనే ఉంది. చేస్తా అనంటే చే చేయాలి.
SSSMC · audio

Bhagawata Navaneetham - 28

Home

Bhagawata Navaneetham - 28

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 26:42

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

    Now playing
  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67