Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం ప్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్ఫురతాత్ పరమమహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ వామనుడు ఎలా వచ్చాడు పరీక్షిత్ మహారాజుకి అసలు ఇది వీడికి కథ ఎలా తెలుసు అంటే మన బోటి వాడికి కలిగే ప్రశ్నలే సందేహాలే పరీక్షిత్ మహారాజుకు కూడా కలిగినయి. ఒక ఉత్తముడైన గురువు గనుక దొరికినట్లయితే వేయవలసిన ప్రశ్న వెయ్యాలి వేయదగిన ప్రశ్న వెయ్యాలి సమాధానం పొందాలి. అసలు అందుకే గురువు దగ్గరికి వెళ్ళాలి సందేహ నివృత్తి చేసుకోవటానికి వెళ్ళాలి. శుకమహాదేవుడు ఎప్పుడైతే భాగవతం చెప్తూ ఉన్నాడో పరీక్షిత్ మహారాజు మూడు ప్రశ్నలు వేశాడు. మనకు కూడా అదే సందేహం వస్తుంది ఏమిటవును నిజమే వామనుడు ఎందుకు వచ్చాడు అని. [పాట] బలి అంబురహ నేత్రుడు ఏమిటికి నై పాదత్రయం వేడే. శ్రీ మహావిష్ణువు కదా పోయి పోయి మూడడుగుల నేల బలి అనేవాడిని ఎందుకు అడిగాడు మూడు అడుగులు అంటే ఏమిటి అసలు అవి మూడు అడుగులు ఇవ్వలేడా అసలు వాడికి కావాలా పోనీ ఎవడో ఇచ్చాడు ఏం చేసుకుంటాడండి మూడడుగుల్లో three square feet కాదు ఇవాళ మూడు వేల మూడు లక్షల ఎకరాలు ఉన్నా మాకు చాలలేదు అంటున్నారు three square feet అడిగాడంట పోయి ఎందుకు అడిగాడు పరీక్షిత్తు అడుగుతున్నాడు రాజై. [పాట] నిశ్చలుండు పూర్ణుడు లబ్ధ కామముడు రమా సంపన్నుడై తా పరస్థలికిన్ దీనుని మాట్కి ఏల చనియే. అసలు తానే అందరికీ ఇవ్వగలిగిన పరమాత్మ అమ్మవారితో కూడా ఉన్నాడు ఆయన లక్ష్మీ సమేతుడై ఉన్నాడు. లక్ష్మి వల్ల కూడా అంతటి వాడు తనంతట తాను వెళ్లి ఇది కావాలి అని అడిగాడేమి [పాట] తప్పేమియున్ లేక సరే వీడు వెళ్ళాడు బానే ఉందయ్యా [పాట] తప్పేమియున్ లేక నిష్కలుషున్ బంధనమేల చేసెను. పాపాత్మము పాపము ఎరగనటువంటి బలిని ఎందుకు అంతగా హింసించాడు విష్ణువు అసలు విష్ణువు ఎందుకు వెళ్ళాడు [పాట] వినం కౌతూహలంబు ఎడిన్. కుతూహలంగా ఉంది చెప్పవయ్యా అని అడిగాడు. అప్పుడు శుకుడు చెప్తున్నాడు ఏమనంటే [పాట] పురూహుతుచే అంటే ఇంద్రుడు వచ్చి పోయి భార్గవులచే బలి యటకేలకు బతికి. భార్గవులు అంటే రుద్రులు కాదు భృగు వంశానికి చెందినటువంటి భృగు మహర్షి సంతతి అంతా వీళ్లకు గురువులు వీళ్లకు advisors. వాళ్ళ అందరి కారణంగా ఎలాగో బతికి బట్టకట్టి బలి [పాట] వారి చిత్తంబు రాతుల్చి శిష్యుడై వర్తింప వారు ఆతని భక్తి వలన మెచ్చి విశ్వజిత యాగంబు విశ్వజిత్ యాగం దాని పేరు అంటే విశ్వాన్ని జయించే యాగం. అశ్వమేధ యాగం horse power mind power ఏదైతే ఉన్నదో అది మేధ అశ్వ horse power లో ఉంటుంది అశ్వమేధ యాగం గనుక చేస్తే sharpen అయి brighten అయి ఒక velocity ని ఒక వేగాన్ని పొందుతుంది అలాగే విశ్వజిత్ యాగంబు విధితోడ చేయింప సశాస్త్రీయంగా చేయిస్తే [పాట] భవ్య కాంచన పట్ట బద్ధ రథము ఒక బంగారు రథము [పాట] నకు ఆజుల బోలు హరుల కంటి రథ జము మహా దివ్య ధనువు [పాట] పూర్ణ తూణ యుగలంబు కవచంబు తొలుత హోమ పావకుండిచ్చె. రథం ఇచ్చాడు తూనీరాలు బాణాలు ఇచ్చాడు అంబుల పొది ఇచ్చాడు అలాగే సూర్యదేవుడికి ఉన్నటువంటి ఏడు గుర్రాలను పోలిన దానితో సమానమైన ఏడు గుర్రాలు బలి పొందాడట విశ్వజిత్ యాగంలో [పాట] అమ్రాన పద్మ మాల కలుషహరుడగు తన తాత కరుణ ముసగే సోమశంకాస శంఖంబు శుక్రుడిచ్చే. గురువుగారు శుక్రుడు కూడా ఒక శంఖం ఇచ్చాడు పూరించడానికి జై జై ధ్వానం చేయడానికి శబ్దం వింటూనే అమరులంతా పారిపోయేట్టుగా ఇచ్చాడు ఇస్తే [పాట] పాణియు రథಿಯು గృహిణియు తూనియు ధ్వనియును శ్రగ్వి తురగీ దేరత్రాణియు వికృత విమత ప్రాణియ మణికనక వలయ పాణియు అగుచున్. సర్వ ఐశ్వర్యాలు కూడా బలి వశమైపోయినయి మూడు లోకాలకు వాడు అధిపతి. ఇక్కడ చాలా విచిత్రం ఏమిటంటే అమరుల మీద యుద్ధం చేయాలి మళ్ళీ రాజ్యాన్ని పొందాలన్న బలి విశ్వజిత్ యాగం తర్వాత చాలా ఉత్తమ జీవితం గడిపాడు వాడు మొదటిసారి ఓడిపోయినాడు తర్వాత వాళ్ళు భయపడి పారిపోయినారు కానీ వీడు ధర్మబద్ధుడైనటువంటి జీవితాన్ని మాత్రం బలి గడిపాడు. అందుకే పరీక్షిత్ మహారాజు అడిగాడు మంచివాడు కదా వీడి మీదకి ఆయన ఎందుకు పోయినాడు పోయి మూడడుగులు వాడేదో వాడు యాగం చేసుకుంటుంటే ఈయన ఎందుకు వెళ్ళాడు అని ఎందుకు వెళ్ళాడు అంటే మనం అనుకుంటాం మనం ఏం చేయలేదు ఎందుకు అనుభవిస్తున్నాం అని ఇప్పుడు ఏం చేయాలి అప్పుడో చేసాం ఏం చేస్తాం మరి పాత account settle చేయడానికి వచ్చాం చేస్తాం ఏదో రోజున చేస్తాం కాస్త ముందో వెనకో బలి పరిస్థితి కూడా అంతే [పాట] బలుదానంబున విప్రులంతనిపి. బ్రాహ్మణులందరికీ దానం ఇచ్చేసి ఆనంద పరిచాడట దాన్ని స్వామి చాలా ఆనందంగా చెప్పారు చాలా సంతోషంగా మనకు అర్థమయ్యే రీతిలో ఒక బ్రాహ్మణుడు ఎలా సంతోషిస్తాడంటేఎట్లా ఉంటుందంటే మూడు వస్తువులున్నాయట ప్రపంచంలో తమలపాకు తట్ట, బ్రాహ్మణుడి పొట్ట, పొగాకు కట్ట ఒకటేనన్నట్ట, అన్నాడు స్వామి. ఏమిటి పొగాకు కట్ట అంటే స్వామి ఎప్పుడెళ్లారు పొగాకు కట్టలు ఎప్పుడు చూశారనిపిస్తుంది. సర్వజ్ఞుడు పొగాకు కట్టలో కూడా ఆయనే ఉన్నాడు. దాన్ని అది ఎందకుండా తడుపుతూ తడుపుతూ ఉంటాడట, బ్రాహ్మణుడి పొట్ట అలాంటిదేట. తమలపాకులు కూడా వరుసగా బొత్తి చేసి దాన్ని తడుపుతూ తడుపుతూ ఉంటారు. కాబట్టి ఏదోటి వీడు నములుతూ ఉంటాడట. అందువల్ల మూడు ఒకటే. వాడికి దానం ఇచ్చి ఆనంద పరిచాడట. రెండవది, తద్భక్తో తప్తులన్ పొంది పెద్దలకున్ వొక్కి విశిష్ట దేవతల అంతర్భక్తి పూజించి నిర్మలు ప్రభాదుని జీర, ప్రహ్లాదుడు ఎవడికి నాకు తాత, ఎవడికి తాత? బలికి తాత. ఆయన దగ్గరికి వెళ్లి, నమ్ర శిరుడై రాజద్ర దారూఢుడై వెలిగెన్ దానవ భక్త శైల శిఖరోత్తే జలనాగ్ని ప్రభం. అట్లా మంచి పనులు చేస్తూ దానాలు చేస్తూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ తాత పాదుల్ని కలుస్తూ వినమ్రంగా ఉంటూ హాయిగా ఉన్నాడు బలి. అది అప్పటి వాడి పరిస్థితి. ఖండిత మృత్యు కృతాంతులు ఖండిత సురసిద్ధ సాధ్య గంధర్వాదుల్ విండిత దిశలు అమరాహిత దండాధీశ్వరులు సములు తన్ను కొలవంగన్. తనతో సమానమైనటువంటి దిక్పాలకులంతా తననే కొలుస్తూ ఉంటే ఒక ఆనందం కలిగిందట. మనకు మనతో సమానమైన వాడే మనకు దండం పెట్టాడనుకోండి ఎంత ఆనందం అది. అంటే వాడు నా గొప్పతనాన్ని అంగీకరిస్తున్నాడు అని. ఎంత అహంకారం చూడండి. మనతో సమానమైన వాడు అసలు మనకు నమస్కారం చేయటం లేవట అని అనుకోవాలి జీవుడు. అయితే రౌణ మహర్షి కూడా చిక్కు ప్రశ్న ఎదుర్కొన్నారు. భగవాన్! అసలు పాద నమస్కారాలు ఇవన్నీ వట్టి దండగ అనే మీరు అంటూ ఉంటారు కదా, ఎందుకు బహిరంగ విన్యాసం అని. కానీ అందరం చేస్తుంటే మీరేం మాట్లాడరేమిటి అని అడిగారు. ఏం లేదప్పా! మీకు తెలియని ఒక చిన్న రహస్యం ఉంది. మీరంతా ఏమో నాకు దండం పెట్టేస్తున్నారని అనుకుంటారు. నేను మీ అందరికీ ఎప్పుడో దండం పెట్టా. దాని ప్రతిచర్యే ఇది అన్నారాయన. అది. కాబట్టి భగవంతుడు కోరడు. భగవంతుణ్ణి మనం కోరాలి. కోరటంలో పాద సంస్పర్శ, గురుపాద సంస్పర్శ సాధకుడికి అది ఒక సిద్ధిని, ఒక శాంతిని, ఒక ఆనందాన్ని, ఒక హాయిని, ఒక సర్వ దుఃఖ హరణాన్ని ఇస్తుంది గనుక గురుపాద సంస్పర్శన చేయాలి. చూపున గగనము మింగుచు వేపున దివియు భువియు ఆతల శీలం సేయ, రూపించుచు ధనుజేంద్రుడు ప్రాపించెను దివిజ నగర పదము నరేంద్ర! పరీక్షిత్ మహారాజా! ఇట్లా వెళ్లాడయ్యా, అందరూ కో-సేవిస్తూ ఉండగా ఇంద్రలోకానికి వెళ్లాడు. అక్కడ మాయరు నగవులకును కనుమోయరు కాలంబు కతనము దియరు. వాళ్ళకి నిద్ర లేదు, ఆహారం లేదు, వయస్సు లేదు, పెద్దరికం లేదు, వృద్ధాప్యం లేదు, రోగం లేదు, జాడ్యం లేదు. అలా ఉన్న మనుషులను చూశాడట వాడు మొదటిసారి. మనం కూడా ఎప్పుడన్నా చూడగలమా అని చూస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు longevity నలభై ఎనిమిది ఏళ్ళు ఇండియాలో, ఇప్పుడు ఎనభై ఏడు ఏళ్ళు. ఎనభై ఏడు ఏళ్ళు ఢోకా లేకుండా బండిని నడిపించవచ్చు. తర్వాత ఏదున్నా అది bonusse. అది. మనకు అసలుది ఇష్టం లేదు. అది ఎలాగూ ఇచ్చావు bonus సంగతి ఏమిటంటాం. కదా. కిలో వంకాయలు వంద రూపాయలు పెట్టుకొని రెండు పుచ్చు అయినా ఏమైనా అడుగుతాం, దిక్కులేనట్టు. ఎవరినీ మనకు కూర లంబు బతికే దాని మీద మనం అలా అడుగుతూనే ఉంటాం. రెండు కాయలు ఏం-ఏమవుతుంది నీ దాన్ని పాపం. రెండు కాయలే దానికి లాభం. అది కాస్త మనం మింగేస్తాం. అది. వీడు కూడా అదే. పుణ్య జలంబుల పాయలు సురరాజు వీటి ప్రమదా జనముల్. ఇందిరా ఇంద్ర లోకంలో ఉన్నటువంటి ప్రమదా జనం అంతా స్త్రీమూర్తులంతా కూడా సర్వాంగ శోభితంగా చాలా సానందంగా హాయిగా తొల్లుతూ కేరింతలు వేస్తూ అసలు దుఃఖమే అరివేనటువంటి జీవుల వలే ఉన్నారట. బలి వచ్చి విడియుట జలవేది వీక్షించి గట్టిగా కోపపు కాపుబెట్టి. వీడెవడో బలి వచ్చాడు వాడు. ఇంద్రుడికి ఎప్పుడూ కూడా, రాజుగారు మనమనుకుంటాం మనమే హాయిగా నిద్రపోతాం, రాజుగారికి నిద్ర ఉండదు. అసలు రాత్రిపూట ఎవడు వస్తాడు, ఎవడు బూడుస్తాడు, ఎవడు పట్టుకుపోతాడు, ఎవడు మనల్ని defeat చేస్తాడో, ఎవడు రాజ్యం కాజేస్తాడో ఇది భయం. మన దగ్గర ఏం లేదుగా. వచ్చిన వాడికి వాడికి కావాల్సింది తప్ప మనకేం పోయేదేం లేదు. కాబట్టి మనం హాయిగా నిద్రపోతాం. వాడికి నిద్రే దొరుకుతుంది అంతే. వీడు కాపలా పెట్టాడట. దేవవీరులు తాను దురతా మంత్రిణి రప్పించి సురవైరి రాక చెప్పి ప్రళయానలు భంగి భాసిల్లుచున్నాడు ఘోర రాక్షసుల కూడి. వాడు మన కోడి చనినేడు మరల వీడి తించే, తపంబున వీనికి ఇంత వచ్చే. ఒకసారి మన చేతిలో వీడు ఓడిపోయాడు కదా. ఓడిపోయిన వాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు? లోగా వాడు ఏం బలం సంపాదించాడు? బలం సంపాదించకపోతే మన సామ్రాజ్యంలోకి వీడు రాడు కదా. అసలు ఇవన్నీ పొంది నా లోకం దాకా ఎలా వచ్చాడని ఆలోచనలో పడిపోయాడు. దురాత్మకునకు ఎవడు తోడయ్యే, ఇంక వీని గెల్వను ఏది త్రోవా. వీణ్ణి గెలవాలంటే దారి ఏది? ఎన్ని సేయువారము ఎక్కడి మగటిమి వెదురు మోహరింప ఎవ్వడూపు. ఎవడున్నాడు మనల్ని రక్షించే, దిక్కు ఎవడన్నా ఉన్నాడా లేదా అని అనుకుంటూ. అప్పుడు సురరాజుకి ఆచార్యుడున్నాడు. సురరాజు ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క గురువు బృహస్పతి, ఆచార్యుడు. బృహస్పతి చెప్పాడు, నాయనా కష్టకాలం వచ్చినప్పుడే కదా, అంతేగా ఒంట్లో బాలేస్తేనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. రోజూ మన friend అయినా వాడి ఇంటికి పోం. వెళ్తామా?ఉన్నది గని కలుపుతున్నాం. వినవయ్య దేవేంద్ర వీనికి సంపద బ్రహ్మ వాదులు భృగు ప్రవర్ధను వర్ధినిచ్చిరి రాక్షసులెదురను నిలువంగ హరీశ్వరుండు తక్క. వీళ్ళని ఎదుర్కోవాలంటే నువ్వు నేను వాడు వీడు కాదయ్యా ఒక్క పరమేశ్వరుడు అయిన హరి మాత్రమే అర్హుడైనటువంటి వాడు శక్తిమంతుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఈశ్వరుడు దక్క అన్యజనులు నీవు నీసముల్ నీకంటే అధికులు చాలరు రాజ్యంబు చాలు నీకు విడిచిపోవుట నీతి విభుద నివాసంబు విమతులు అలగడు వేళ సూచి మరలి మరునాడు వచ్చుట మా మతంబు విప్రబలము వీడికి వృద్ధి వచ్చే వారి కైకొనకు ఇట మీద వాడిసడు తలగుము అందా కరిపు పేరు తడపవలదు. మన కాలం కలిసిరానప్పుడు అయ్యో ఏమైపోతుందో ఏమైపోతుందో అని శత్రువుల గురించి ఆలోచించే కంటే కాలం కలిసి వచ్చేదాకా గనక కాస్త కాచుకొని ఉండగలిగితే కాస్త ఓపిగ్గా నిబ్బరంగా శత్రువు పోతాడు యాతనలు తొలగిపోతాయి. జీవితం వైరాగ్యమే జీవితం వైభోగం జీవితం కాదు వైభోగం మనల్ని అక్కడక్కడే తెప్పుతుంటుంది గంగిరెద్దు గానిగెద్దు లెక్కలో. వైరాగ్యం ఉన్నచోట నుంచి ఒక విచార ధారలోకి నెట్టి జీవిత పరిసత్యాలని అర్థం అయ్యేట్లు చేసి కర్మ నిష్ఠలో నుంచి అందుకే స్వామి అంటారు బంగారము కంసాలి కథ చెప్తారు ఆయన ఎప్పుడు. డాలరు బంగారు బిళ్ళ తీసుకొచ్చి వాడికిచ్చి దీన్ని ఏదన్నా నగ చేయి అంటే డాలర్ కొన్నప్పుడు మనకు ముద్దు గాని వాడికేం ముద్దు దాన్నేం చేస్తాడు ముందు నిప్పుల్లో పడేస్తాడు పుటం పెడతాడు కాలుస్తాడు కోస్తాడు మళ్ళీ కత్తిరిస్తాడు డిజైన్ వేస్తాడు సమ్మెట పొట్టు గురి చేస్తాడు వాడు నగ వచ్చే దాక ముందు నగ చేసే స్వర్ణకారుడు కూడా తాను చేసిన వస్తువు తనకు ఆనందం కలిగించాలి అప్పటిదాకా వస్తువు మనకివ్వడు చేశాను గాని ఇంకా తృప్తి లేదమ్మా నాలుగు రోజులు వెయిట్ చెయ్ అంటాడు మనకేమో అది ఎప్పుడు వేసుకుందాం అని మనకి అయిపోవాలి వాడికేమో ఎప్పుడు బాగా చేసిద్దాం అని వాడికి. పరమాత్మ కూడా అంతే మనం కష్టాలు వచ్చాయి ఇబ్బందుల్లో ఉన్నాం అని అనుకోవటానికి వీలు లేదు పుటం పడాలి పడితేనే కర్మలన్నీ నశిస్తాయి కనుక ఆయన కూడా అదే చెప్పాడు. కాల కాల ప్రదర్శయకు బృహస్పతి విని మాటలన్నీ విని కామ రూపులైనటువంటి వీళ్ళంతా కూడా శిష్యవత్సలుడు భృగువాదులు అతని చేత శతాశ్వమేధంబులు చేయించిరి. తత్కాలంబున భవికాలంలో కింద ఎలా ఉంది వీటి లోకంలో అంటే అర్ధను నేడరు అసలు అడిగిన వాడు పొందకుండా పోడు వాడు ఏం అడిగితే అది ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. దాతలుంచడరు సర్వారంభముల్ పొందు ప్రత్యర్ధుల్ లేరు మహోత్సవములందు రాగారముల్ పొల్చు గూఢార్థం విప్రులు వర్షముల్ కురియు కాలారంభములై భాత్రికిన్ సార్ధంబయ్యే వసుంధరా తత్వము అసురేంద్రాధీసు రాజ్యంబునన్. అప్పుడు అదితికి మళ్ళీ భోగం నాకెప్పుడు వస్తుంది అని కదా వెళ్ళింది కశ్యపుడి దగ్గరికి. తన తనూజుల పోలు తనుజుల గొనుటయు వేల్పులల్లను బాగ వెలగుటయును భావించి సురమాత పరితాపమును పొంది వగరు అనాధాకృతి అనరుచుండ అమ్మటి నిమిటి కశ్యప బ్రహ్మ మరి ఒకనాడు సమాధి మాని తన కుటుంబిని ఉన్న ధమంబు నేగి నాతిచే విహితార్చనమును బడిసి, ఇదంతా కథ నేను చెప్పిందే కశ్యపుడి దగ్గరికి వెళ్ళింది ఆయన వచ్చాడు వచ్చేప్పటికి ఆయనకివ్వవలసిన అర్ఘ్యపాద్యాలిచ్చింది అదితి ఆయన్ని కూర్చోబెట్టింది కూర్చోబెడితే ఆయన వేసిన ప్రశ్నలు పద్యం చాలా important మన ఇంట్లో కష్టం వచ్చింది అన్నప్పుడు కారణాలు ఏమన్నా ఉన్నదేమో కాస్త వెతుక్కోవచ్చు పద్యం ఇది. కశ్యపుడు అదితి దుఃఖాన్ని చూసి ఆమె స్వయంగా తన భార్య అయినప్పటికీ కూడా ఆయన అడిగిన మొదటి ప్రశ్న తెరవా విప్రులు పూర్ణులే బ్రాహ్మణులు బ్రాహ్మణులుగా ఉన్నారా? వాళ్ళేమన్నా అబ్రాహ్మణులైపోయినారా? అంటే బ్రాహ్మణ్యాన్ని ఏమన్నా దాటిపోయారా? బ్రాహ్మణత్వ ఎక్కడన్నా మంట కలిపిందా? వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తున్నారా లేదా? చలగునే దేవార్చన యాతముల్ ఆచారముల్ తరితో వెలుతురే గృహస్తులు మనకు తెలిసిన గృహస్తులంతా తృప్తిగా ఉన్నారా? తృప్తి ఇంట లేదో దుఃఖం ప్రవేశిస్తుంది తృప్తి ఇంట ఉంటుందో సంపద ప్రవేశిస్తుంది. విప్రుడైన వాడు అంటే కులం చేత బ్రాహ్మణుడు కాదు బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు తాను గనుక జగత్తుకి జ్ఞానబోధ చేయకపోతే తెలిసింది తెలిసినట్లుగా చెప్పకపోతే అనర్థం ఏర్పడుతుంది తెలిసింది తెలిసినట్లు చెప్పాలి తెలిసినంత చెప్పాలి తెలుసుకొని చెప్పాలి అన్వర్థం చెప్పకూడదు. దేవార్చనా ఆచారాలు చేయాలి స్త్రీలు గాని పురుషులు గాని చేయవలసిన విహిత కర్మలు చేయాలి. సుతుల్ ధర్మానుసంధానులే కొడుకులు కూతుళ్ళు వీళ్ళంతా వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తున్నారు కదా కొడుకు ఏం చేయాలి తల్లి తండ్రి మాట వినాలి గురువు దగ్గరకు వెళ్ళాలి దైవం ఉన్నాడని నమ్మాలి నాలుగే వాడు చేయవలసిన పని. సరే తల్లి తండ్రి అనే ధిక్కారం చేసిన వాడు గురువు దైవాన్ని పొందలేడు వాడు.ఈ రెండింటితో ప్రారంభమైతే మిగతా రెండు automatic గా వాడికి లభిస్తాయి. మరి అజ్ఞాత గత కోటికి అన్నమిడుదే. లోకం ఆకలి అని ఎవడన్నా వాకిట్లోకొస్తే తాను తినవలసిన దాంట్లో నుంచే ముద్ద తీసి పెట్టడం జరుగుతున్నదా లేదా అని అడిగాడు. అంటే ఇవన్నీ జరగాలి అని. నీరంబు నున్ తోయడే. ఒకవేళ అన్నం పెట్టలేకపోతే కనీసం మంచి నీళ్లన్నా పోస్తున్నారా లేదా అందుకనే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాడు అడక్కుండా మంచి నీళ్లు ఇవ్వాలి. వాడు ఎలాగో అడగలేడు పాపం. మనం ఇవ్వగలిగింది ముందు అది తర్వాత సంగతి తర్వాత. మన దగ్గర ఏదన్నా మీకు ఏం కావాలంటే అది అంటారు కొందరి ఇళ్లల్లో. వాళ్లకు ఉండొచ్చుగా కానీ మనం తాగాలిగా. కదా. Whatever you want అంటారు. మనకు అవ్వక్కర్లే మంచి నీళ్లు ఇవ్వాలి. దాహార్తి తీర్చాలి. మరలేక అర్ధులు దాసులన్ సుజనులన్ మన్నింపుటే పైదలి అన్నమైన తక్రమైన తోయంబైన తక్రమంటే మజ్జిగ. మజ్జిగ ఉంటే రెండోది నీళ్లు మజ్జిగ వరుస చెప్తున్నాడు చూడండి. అన్నమైన తక్రమైన తోయంబైన శాఖమైన తనకు గరువు కొలది అతిధి జనులకు అడ్డమాడ కయిడరేమి లేమా వారు కలిగి లేనివారు. ఎంత అందంగా రాశాడో చూడండి. అన్నీ ఉండి లేని దౌర్భాగ్యులు ఎవరంటే నీళ్లు ఇవ్వలేని వారు కనీసం మజ్జిగ ఇవ్వలేని వాళ్ళు అన్నం పెట్టలేని వాళ్ళు. ఎందుకు ఏం కలిగి ఉంటే ఏం లాభం. ప్రయోజనం లేదంటున్నాడు. అంటే దానం నేర్పుతున్నాడు. ఇది ఎందుకు నేర్పుతున్నాడంటే రాబోయే కథంతా దీని మీద ఆధారపడిది. నీళ్లు ఇవ్వటానికి మనం ఇంత యాతన పడుతున్నాం. వాడు మొత్తం తీసుకెళ్ళమన్నాడు. బలి రాక్షసుడై ఉండి కూడా. సరే. నెలత విష్ణునకు నిఖిల దేవాత్మకునకు ఆననంబు శిఖయు అవని సురులు వారు తనియ తనియు అవలోచనుండ తడు తనియ జగములన్ని తనియా. ఇంకొక మాట లోకంలో బ్రహ్మజ్ఞాని అయినటువంటి బ్రాహ్మణోత్తముడు గనక ఉన్నట్లయితే అటువంటి వాడికి గనక నీవు ఆదరంగా గనక ఒక పూట అన్నం పెట్టినట్లయితే, కృష్ణగిరి స్వామి వారు ఒక మాటన్నారు. ఒక ఉత్తమోత్తముడు అయినటువంటి ఒక వ్యక్తి గనక మన ఇంట ఒక పూట భోజనం కూడిస్తే ఒక లక్ష మంది విష్ణువులు అన్నం తిన్నట్లు లెక్క. లక్ష మందట. ఒక్కడు అన్నం విస్తరి వేసుకుని తిన్నట్టు అయితది. అంటే ఏమిటి? వాడికి అన్నం పెట్టాలని మనకు ఉండాలి. వేళగాని వేళ వచ్చాడు. చేయరాని టైంలో వచ్చాడు. వాడికి ఆకలి అప్పుడేసింది. వాడికి ఇల్లు అప్పుడు దొరికింది. పెడతావనో నమ్మకం. నీకు ఉండుకుంటున్నావు, నీ భర్తకు ఉండుతున్నావు, పిల్లలకు ఉండుతున్నావు, చాకిరీ చేస్తూనే ఉన్నావు వాళ్ళకి జీవితాంతం పుట్టినప్పటి నుంచి పోయేదాకా చేయాల్సిందే. వాడు ఎవడో జీవితంలో ఒక పూట వస్తాడు మన వాకిట్లోకి కాస్త అన్నం పెట్టు. అది చెప్తున్నాడు ఆయన. బిడ్డలు వెరతురనీకర, ఇంకో హాల్ మార్క్ చెప్తున్నాడు. పిల్లలు ఏమిటి మన పిల్లల్ని నీ దగ్గర అయినా భయపడుతున్నారా భయభక్తులతో ఉన్నారా అంటే అసలు ఏం లేదండి My father is my friend అంటాడు వీడు. Then it's a downfall. Father friend ఏమిటి? Father fatherయే son sonఏ. కొడుకు తండ్రి దగ్గర భయభక్తులతో ఉండాలి. వినయంతో ఉండాలి. పాతతరం వాళ్ళు తమ తండ్రిని నాన్న అని పిలిచేవాళ్ళు కాదు. ఆడవాళ్ళు అయితే అసలు పిలిచేవాళ్ళు కాదు. తన సొంత తండ్రిని బాబాయి అని పిలిచేవాళ్ళు. అదేమిటంటే ఏమో నాన్న అంటే భయం వేసేదని. ఏం భయం అంటే గౌరవంతో కూడిన భయం. ఇవాళ సీమారేఖ తొలగిపోయింది. అలా ఉండాలంటున్నాడు ఆయన. గొట్టంబులు సేయక ఎల్ల కోడెండ్రును రెండో కొడుకులే బానే ఉన్నారా అంటే బానే ఉన్నారు అని అంటుంది ఈవిడ. మరి కోడళ్ళ సంగతి ఏమిటన్నాడు. ఆవిడ అదితి గనక వాళ్ళు మంచివాళ్ళే అని ఉంటుంది. అనదో లేదో తెలియదు. కోడళ్ళు మంచివాళ్ళని చెప్పే అత్తలైతే లేరుగా లోకంలో. ఏదో లోపం వెతికి వాళ్ళని హింస పెట్టడమే వాళ్ళకి ఉన్నటువంటిది. ఒట్టారకం పెకనడతురే ఎడ్డము కాకున్నదే మృగవేక్షణ ఇంటన్. ఎందుకంటే భాగవతం లోకాన్ని వీడి చెప్పలేదు పోతన గాని వేదవ్యాసుడు. లోకాన్ని మించి అధ్యాత్మ లేదు. మనమంతా ఏదో మరణానంతరం గొప్ప అధ్యాత్మ యోగం ఉంది అక్కడికి ఎక్కడికో పోతామని. అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ గనక స్వామి మనకు నేర్పింది అదే. అన్నీ ఇక్కడ ఉన్నాయి బంగారు. అన్నీ ఇక్కడ అనుభవించండి హాయిగా అనుభవించండి. పైనంటూ ఏం లేదంటే స్వామి కూడా పొరపాటు పడుతున్నారు పైన లేదంటారేంటి ఉన్నదంతా పైనని మనం ఉన్నదంతా ఇక్కడనే ఆయన. మనం చెప్పవలసింది ఆయనే, ఆయన చెప్పవలసింది మనం చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాం. సరే. ఎందకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు బంచలమ చాలి పడియ నేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగనేడు. చెప్తున్నది కశ్యప ప్రజాపతికి. ఎటువంటి దేవేంద్రుడు అడవుల్లో పడిపోయాడు ఇవాళ. గెకలిమి గరాబు బిడ్డలు జయంతాదులు జయంత వసంత కంతుడు వాళ్ళు ముగ్గురు. కంతుడు అంటే మన్మథుడు. వసంతుడు అంటే వసంత కాలానికి అధిపతి. జయంతుడు అంటే నిత్య మన్మథ మూర్తి వాడు. ముగ్గురూ కూడా సౌందర్యానికి సౌందర్య పిపాసకి కారణమైనవారు ప్రేరణ అయినవారు రూపుదిద్దుకున్నటువంటి వారు గనుక వాళ్ళంతా కూడా శవరార్ధకుల వెంట చనిరి నేడు అమరులకు ఆధారమగు అమరావతి అసురులకు ఆటపట్టయ నేడు బలి జగముల నెల్ల బలియుచున్నాడు వాని గెలువరాదు వాసవునకు.యగ భాగమెల్ల అతడు అప-అపహరించు కడగి సురల కొక్క కడియు నీడు. యజ్ఞాలు జరుగుతున్నాయి, యాగాలు జరుగుతున్నాయి బలి బానే ఉన్నట్టున్నాడు కానీ, యజ్ఞ ఫలం ఎవరికి ఇవ్వాలి? దేవతలకి ఇవ్వాలి. కానీ బలి తన బలిమి చేత, మూడు భువనాల మీద ఉన్న ఒక ఆధిక్యం చేత, ఆధిపత్యం చేత యజ్ఞభాగాన్ని కూడా ఇంద్రుడికి ఇవ్వటం లేదు, ఇంద్రుడికి అందటం లేదు. ఇది పరిస్థితి అని చెప్పగానే ఒక్కసారి ముహూర్తం మాత్రము చింతించి, ఆయన బ్రహ్మజ్ఞాని కదా! ఒక్కసారి కళ్ళు మూసుకుని ఏమవుతుంది అని చూసి, విజ్ఞాన దృష్టిని అవలంబించి, జ్ఞాన దృష్టిని అవలంబించి కాదు, విజ్ఞాన దృష్టి. అంటే లోక దృష్టితో సమస్యను చూశాడు ఆయన. జ్ఞాన దృష్టితో చూస్తే అది అంతే, నీ కర్మ అనుభవించనేవాడు. లోక దృష్టితో చూసినప్పుడు అనుభవాన్ని ఎలా దాటాలో చెప్పాలి. భావి కాల కార్యంబు విచారించి రాబోయే రోజులు, రాబోయేవి ఏమవుతాయి అనేది ఒక్కసారి ఆయన దృశించాడు, దర్శించాడు. దర్శించి అతిథికి చెప్పాడు ఏం జరగబోతున్నదో. జనకుండవ్వడు జాతుడవ్వడు కొడుకెవడు? పిల్లవాడెవడు? వైరాగ్యంగా చెప్తూ, జనిస్థానంబులె చోటు సంజననంబెయ్యెడి నేనులే కొలది సంసారంబులే రూపముల్ వినుమా ఇంతయు విష్ణుమాయ తలపం వేరేమియున్ లేదు. అసలు ప్రపంచంలో ఉన్న సంబంధ బాంధవ్యాలు అన్నీ విష్ణుమాయేనన్నాడు. విష్ణుమాయలో ప్రేమ కూడా ఒక మాయేనన్నాడాయన. ప్రేమ మాయ, అది కూడా పెద్ద పెనుమాయ అన్నాడు. మోహనిబద్ధంబు నిదానమింతటికి ఛాయా వినబోటేమికిన్ అని అయితే నీకు ఏం చేయాలో చెప్తాను విను. భగవంతున్ పరమున్ జనార్దన్న్ కృపాపారీణు సర్వాత్మకున్ అందుకే భాగవతంలో త్రేతాయుగంలో, కృతయుగంలో యోగం చేయాలి. త్రేతాయుగంలో యజ్ఞం చేయాలి. ద్వాపర యుగంలో అర్చన చేయాలి. కలియుగంలో నామస్మరణ చేయాలి. నాస్తి నాస్తి కలిౌ నాస్తి హరినామ వినా గతిః అదే చెప్తున్నాడు కాలానికి. జగదీశున్ హరిసేవ జేయుము అతడున్ సంగచ్ఛమున్ పొంది నీకగు ఇష్టార్ధములెల్లనిచ్చు నిఖిలార్ధ వాప్తిసేకూరడున్ భగవత్ సేవల పొందరాదే బహు సౌభాగ్యంబుల ప్రేయసీ. ప్రేయసీ అంటే ప్రేమతో అన్నమాట కాదు. ప్రేయస్సు నుంచి శ్రేయస్సులోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్రేయస్ స్వరూపంగా ఉన్న నీ మనస్సు, నా కొడుకులు ఇలా అయిపోయారు, రాజ్యం పోయింది, దేవతలంతా ఇబ్బంది పడుతున్నారు, నువ్వు యాతన పడుతున్నావు, ఇది ప్రేయస్సు. విష్ణు మాయగా కూడి ఉన్నటువంటి మాయా జగత్తులో నువ్వు ఉన్నావు, బయట పడు. బయట ఎలా పడగలవు? హరినామ సంకీర్తనం చెయ్. ఆయనకి సేవ చెయ్. ఆయన గురించి విచారణ చెయ్. తత్వార్థ విచారణ చెయ్. నీకు కావలసినవన్నీ నీకు లభిస్తాయి.
SSSMC · audio

Bhagawata Navaneetham - 37

Home

Bhagawata Navaneetham - 37

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 27:38

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

    Now playing
  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67