Skip to content
Transcript తెలుగు
శుకదేవుడు చెప్తున్నాడు మంచి ప్రశ్న వేస్తున్నావయ్యా. హరినామ సంకీర్తనం చేయి నీకు ముక్తి కలుగుతుందని కదా నేను చెప్తున్నాను నేను జ్ఞానబోధ చేయట్లే మధ్య మధ్యలో జ్ఞానం చెప్పాడు నిన్న చెప్పాడు ఆయన. యోగానుసంధానం ఎలా చేయాలి, ఆత్మానుసంధానం ఎలా చేయాలి, ఆత్మని యోగాన్ని ఎట్లా కలపాలి నిన్న అది పూర్ణ విచారణ అయిపోయింది మళ్ళీ పునః చెప్పుకోనక్కర్లా అంటే ఆత్మవిద్య theory యోగవిద్య practice. theory, practice కలిపితేనే మనకు మార్కులు పడతాయి కదా theory లో eighty percent వచ్చి practical zero అనుకోండి ప్రయోజనం లేదు practical గా చాలా perfect గా ఉన్నాం theory తెలీదు అనుకోండి అంటే నీకు ఆరోజు ఇవ్వబడి నాకు కాస్త తెలుసు తప్ప అంతా తెలియదు అని కాబట్టి theory లో perfect ఉండాలి ఆత్మవిద్య అంతా తెలుసుకోవాలి. అదేమిటి బ్రహ్మ పదార్థం ఏమిటి దాని తత్వం ఏమిటి దాని స్థితి ఏమి దాని శక్తి ఏమి అది ఎన్ని రూపాలుగా వర్ణించబడుతుంది ఎన్ని రూపాలుగా వర్ణించబడినా మళ్ళీ శంకర భగవత్పాదులు అన్నట్టు ఆత్ అంటే ఏమి మా అంటే లేదు అసలు ఏమీ లేదు మరి ఏమీ లేని దాని గురించి ఇంత సేపు విచారణ ఎందుకంటే అసలు ఉన్నదంతా ఆత్మే నువ్వు అనుకున్నట్టు ప్రత్యేకంగా లేదు అన్నారాయన. ప్రత్యేకంగా నీ వలె లేదు నువ్వు ఊహించినట్లుగా లేవు నువ్వు కోరుకున్నట్లుగా లేదు ఎవరో నీకు బోధించినట్లుగా లేదు అది ఎట్లా ఉండాలో అట్లా ఉన్నది ఉన్నదంతా కూడా నిన్న హరిమయము విశ్వము అన్నాడాయన. అసలు సర్వ ప్రపంచము హరిమయముగా ఉన్నది హరిమయము కాని ఒక వస్తువు లేనే లేదన్నాడు. కొనసాగింపుగానే ఎవరికి మొక్కాలి ఏం చేయాలి అందునా ప్రధానమైనటువంటి పద్యం చూడండి స్వామి కూడా ఎంతకాలం స్వామి మహిమల గురించి ఒక మాట చెప్తూ ఏనుగు మీద వాలిన ఒక దోమకే మీరు భ్రమచిపోతున్నారే మహిమల దగ్గరే ఆగిపోతే ఎట్లా ఏనుగుని గమనించండి అన్నారు స్వామి. ఏనుగు మీద ఒక దోమ వాలటం పెద్ద విషయమా అన్నారు స్వామి. సృష్టికర్తని గమనించండి సృష్టింపబడ్డ వస్తువు ప్రభావంలో పడకండి అన్నారు. మహిమ ఉండాలి అది ఆనందం కలిగిస్తుంది మహిమని అనుగ్రహంగా భావించాలి అనుగ్రహం మన తపస్సాఫల్యంగా భావించాలి గనుక పరమాత్మని ఇలా మనం ఊహించాలి ఇలా భావించాలి ఇలా ప్రేమించాలి. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవ స్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్టి ప్రముఖ అమరాధిపులకున్ ప్రాపింప రాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై ముక్యెదన్ తత్వార్థినై ముక్యెదన్ పరమాత్మ నీ తత్వం ఏమిటో చెప్పవయ్యా నీ సంగతి అంతా తెలుసుకోవాలి నేను. నీ మూలం ఏమిటి నువ్వు ఎవరు అది నాకు నువ్వే ఎరుకపరచాలి. నువ్వు ఎవరో గనుకనే చెప్పగలిగినట్లయితే నాకీ సాధన అంతా ఎందుకు. నువ్వు దేవుడువు అవునో కాదో నిర్ణయించే శక్తి నా దగ్గర ఉన్నట్లయితే ఇంకా నాకు సాధనే అక్కర్లేదు. అవునో కాదో తేల్చుకోలేని దిస్థితిలో ఉన్నాను గనుక పరమాత్మ కనపడుతున్న నీవు ఈశ్వరుడివేనా అన్న భావన మనస్సు తొలుస్తూ ఉన్నది గనుక నీ యొక్క గుణగణాలన్నీ కూడా నువ్వై ఉండాలి అని నేను ఊహిస్తున్నా అంటూ తత్వార్థినై ముక్యెదన్ తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం. పరీక్షిత్ మహారాజుకు కూడా కృష్ణుడు దేవుడని తెలుసు ఎలా తెలుసుకోవాలి ఈనే హరి అని తెలుసుకోవాలి అంటే శుకదేవుడి వంటి వాడు రావాలి విదురుడు వంటి వాడు రావాలి మైత్రేయుడు అంతటి వాడు రావాలి వస్తే చెప్తే తప్ప అర్థం కాదు. తపముల్ చేసిననో మనోనియతినో దానవ్రతావృత్తినో జపమంత్రంబులనో శృతిస్మృతులనో సద్భక్తినో ఎన్ని చెప్తున్నాడో చూడండి వీటిలలో ఒక్కటినా చాలట తప తపస్సు అన్నా చేయి మనోవృత్తులన్నా ఆపేసెయ్ లేదా దానవ్రతాలన్నా చేయి శృతిస్మృతుల ఏర్పరిచినటువంటి ఒకానొక భక్తి వలననో అప్లు లబ్ధప్రదుండౌ నని బ్రహ్మరుద్ర ముఖరుల్ భావింతురు యౌవాని అపర్గాధిపుడు ఆత్మమూర్తి సులభుడవు గాక నాకు ఎపుడున్ ఆత్మమూర్తి ఎవరు అంటే బ్రహ్మ అంటే నాలుగు తలలు గల శివ బ్రహ్మ అని మనకు తెలుసు. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ అంటే రూపం ఉంది. విష్ణుమూర్తి చతురబాహుః చతుర్భుజః చతురమైన బాహువులు గలవాడు చాలా బలమైనటువంటి వాడు ఒక చేత పుష్పం పట్టుకున్నాడు చేత గద ఒకవైపు చక్రం ఒకవైపు శంఖం ఓహో ఈయన విష్ణువు మరి సదాశివుడికి వర్ణం ఏమిటి అని. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వమైనటువంటి పరమేశ్వరుడి యొక్క నిరాకారం తెలుసుకోవాలి అంటే శివుణ్ణి ఆశ్రయించాలి. శివుడు ఎవరు అంటే మళ్ళీ కైలాస శివుడు కాదు కైలాస శివుడికి మూలమైన సదాశివుడు కావాలి. సదాశివుడు అంటే ముగ్గురికీ మూలమైనటువంటి వాడు గనుక ఆమె ఆయనతో కూడి ఉన్నదే పార్వతీదేవి అని సదాశివ సంభావన చేయమంటున్నాడు సదాశివుడుగా భావించు ఆయన నువ్వున్నా లేకపోయినా ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పట్నుంచి ఉన్నాడంటే అనంతం ఎవరూ లెక్క పెట్టలేరు ఎంతకాలం ఉంటాడంటే ఏమో యుగాలు కల్పాలు కల్పాంతాలు యుగయుగాంతాలు ఎన్నెన్ని జరుగుతాయో మనం లెక్కకి కొన్ని లక్షల సంవత్సరాలు తీసుకుని కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఇదిగో నడుస్తున్న కలియుగం అంటున్నాం మరి కలియుగం తర్వాత మళ్ళీ యుగం ఉంటుంది.ప్రళయం వస్తుంది, మళ్ళీ కలియుగం పోతుంది. ప్రళయం రావటం అంటే ఏం లేదు రేపు thirty first పోయి first వచ్చినట్లే. అది. ప్రళయం రావటం పోవటం అంటే ఏం లేదు. వస్తుంది వస్తుంది అంటే ఏం రాదు, రాదు రాదు అంటే వస్తుంది. కాబట్టి అనుకున్నది జరిగితే దాని పేరు జీవితం కాదు. అనుకోని జరగటమే జీవితం. జీవితంలో positive ఉంటుంది, negative ఉంటుంది. positive ని పట్టుకోవాలి negative ని వదిలిపెట్టాలి లేదా ఎదుర్కోవాలి, పోరాడాలి, దాటాలి గంభీరంగా. మన శక్తి చాలకపోతే సమాజ శక్తి తీసుకోవాలి. సమాజ శక్తి కూడా చాలకపోతే సర్వేశ్వర శక్తి తీసుకోవాలి. సమాజము, సర్వేశ్వరుడు మనకు ఎప్పుడు సాయపడతారు అంటే మనం సమాజంలో ఉంటే సమాజం మనకు సాయపడుతుంది. అందుకనే స్వామి "సమాజ సేవే సర్వేశ్వర సేవ". నువ్వు సమాజంలో ఉండు. మీ కుటుంబం ఎంత పెద్దది అంటారు. మనకు ఊహ తెలియనప్పుడు ఇదేమి అధ్యాత్మ పరిచయం లేదనుకోండి, ఏం లేదండి మా అమ్మ, నాన్న, నేను, నా భార్య, మాకు పుట్టిన పిల్లలు ఇది మా సంసారం అంటాం. ఇవాళ మీ కుటుంబం ఎంత పెద్దది? How big is your family అని ప్రతి వాడు అడుగుతాడు. మాదే సాయి కుటుంబమంతా మాదే, మేము సాయి కుటుంబంలో భాగం అంటాం. చూశారా? [అందరూ ఒకేసారి చప్పట్లు వాక్యం] సాయి కుటుంబం ఎంత అంటే కోట్లు. కోట్లకి ఒక చిన్న linkage ఉంది. linkage ఏం లేదు సాయిరాం అంతే. అంటార్కిటికాలో కూడా ఒక సాయిరాం అని ఎవడో మనల్ని పలకరిస్తే వాడు మన బంధువైపోతాడు. ఇది సత్యసాయి భగవానుడు ప్రపంచానికి సాధించి పెట్టినటువంటి గొప్ప, అపురూప వరం. ఒక మనిషిని గెలవటానికి ఏం తపస్సు చేయక్కర్లే, ఏం జపం చేయక్కర్లే, వాడితో మనం ఏం వాడి చుట్టూ, వాడి ఇంటి చుట్టూ తిరగక్కర్లే సాయిరాం అంటే చాలు. అది హాయిరామ్ అన్నమాట. అది. [నవ్వు] "శ్రీపతియు యజ్ఞపతియు ప్రజాపతియు బుద్ధిపతియు జగదధిపతియున్ భూపతియు యాదవ శ్రేణిపతియున్ గతియునైన నిపుణు భజింతున్" కృష్ణుడట. యా-యాదవ కులానికి. ఆయన యాదవ కులం అనేది ఎందుకు వాడుతాడు అంటే అక్కడ కులము అంటే సంఘము అని అర్థం. మనం చెప్పుకునే ఇవాళ caste system కాదు. caste system లేదసలు. ఎందుకంటే ఇక్కడ చిన్న విచారణ చేసుకోవాలి. "చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా" కదా. ఇవి నేనే సృష్టించాను అన్నాడు. నలుగురిని విభజించి పెట్టాడా అని. పెట్టలే. ఒక individual ని గనక మనం తీసుకున్నట్లయితే జ్ఞానము ఎరిగి జ్ఞాని అయి జ్ఞానబోధ చేస్తున్న వేళ వ్యక్తి బ్రాహ్మణుడు. అంటే బ్రహ్మత్వాన్ని గురించి చెప్తున్నాడు వాడు. వాడే సూటు బూటు వేసుకుని ఇదంతా వదిలిపెట్టి వ్యాపారంలోకి వెళ్లి, వ్యాపారంలో పది గంటలు ఉంటే క్షణాన వాడు వైశ్యుడు. అవసరమైన వేళ ఇంకొక మనిషికి రక్షగా గనక నిలబడితే క్షణాన వాడు క్షత్రియుడు. మరీ అవసరమైనటువంటి వేళ ఏదన్నా ఆపందం గనక జరిగినట్లయితే కాపాడటానికి తన భుజబలంతో నిలబడితే వాడు శూద్రుడు. అంటే నాలుగు ఎవరిలో ఉన్నాయి అంటే ఒక్కడి యందు ఉన్నాయి. కాబట్టి ఒక్కడిలోనే నాలుగు ఉన్నాయి తప్ప నలుగురు మనుషులు వీడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు, వీడు శూద్రుడు అనటానికి వీల్లేదు. నలుగురు వృత్తిని బట్టి ఏర్పడ్డాయి, బలాన్ని బట్టి ఏర్పడ్డాయి, సన్నివేశాన్ని బట్టి ఏర్పడ్డాయి, సందర్భాన్ని బట్టి ఏర్పడ్డాయి. కాబట్టి యాదవ కులాగ్రణి అంటే యాదవ కులాన్ని ఉద్ధరించటానికి కృష్ణ పరమాత్మ సంఘంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దానికి ఒక కథ ఉంది. యాదవ కులం శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యంగా రావటానికి ముందు యాదవ కులంలో ఆయన పుట్టలే. పుట్టింది దేవకి, వసుదేవులకు పుట్టాడు, క్షాత్రంగానే పుట్టాడు. పెరిగి ఎక్కడ పెరిగాడు అంటే యాదవ సంఘంలో పెరిగాడు. యాదవ సంఘంలో అసలు దేవకి వసుదేవుల్ని మనం చా-కారాగారం కథ అయిపోగానే మర్చిపోతాం. ఈయన బుట్టలో కూర్చున్న మరుక్షణమే కథ మాయమైపోతుంది. అక్కడి నుంచి దేవకి, యశో-యశోద వీళ్లంతా మనకి మహానందుడు వీళ్లంతా కనిపిస్తారు. అశాంతము సాగినటువంటి కృష్ణ గాథ అంతా కూడా యాదవ సంఘంతో కూడి ఉన్నది గనుక ఆయన తన ఉనికి చేత, అస్తిత్వం చేత, ప్రమాణం చేత, గుణం చేత, జ్ఞానం చేత, మహిమ చేత, లీలా వైభవం చేత ఆయన యాదవ కులాగ్రణి అయినాడు. యాదవ కులాన్ని ఆయన ఉద్ధరించాడు. అది. "అణువో కాక కడున్ మహావిభుడో అచ్ఛిన్నుడో చిన్నుడో" రెండుగా చెప్తాడు పద్యం. చాలా గొప్ప పద్యం ఇది. పరమాత్మ ఎలా ఉన్నాడంటే అణువో? అణువా ఆయన? లేదు బ్రహ్మాండమా? లేదు విచ్ఛిన్నం చేయటానికి వీలుగా ఉన్నాడా? అవచ్ఛిన్నంగా ఉన్నాడా? అఖండంగా ఉన్నాడా? "గుణియో నిర్గుణుడో యెటంచు విభుతుల్ కుంతీభవ తత్వమార్గణులై విభుపాదపద్మ భజనోత్కర్షంబులన్ తత్వవీక్షణము చేసెదరు అట్టి విష్ణు పరమున్ సర్వాత్ము సేవించెదన్" కాస్త చదువుకున్నటువంటి వాడు ఈనా అదా ఇదా? అణువా? బ్రహ్మాండమా? ఈన అఖండుడా? అనంతుడా? అచ్యుతుడా? నిరుపమానుడా? నిరుపమేయుడా? అతుల్యుడా? ఎవరు అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ జీవితం గడుపుతారో, జీవితమంతా గడిపినా ఒక సమన్వయానికి రాలేరో, అటువంటి హరిని నేను కీర్తిస్తున్నాను. అలా అనుకోవయ్యా అంటున్నాడు పరీక్షిత్ మహారాజుని. కృష్ణుడు ఎలా ఉంటాడు, ఆయన హరి ఎట్లా అయినాడో చెప్పు అంటే నేను ఎలా చెప్పను అని చెప్తున్నాడు శుకుడు. శుకదేవుడంతటి వాడు ఏమంటున్నాడంటే నేను హరిని గురించి ఎలా వర్ణించి చెప్పను. ఆయన ఇంతే అని చెప్పటానికి నేను ఎలా చలుతాను అంటున్నాడు. అంతే కాదు "జగతుత్పాదన బుద్ధి బ్రహ్మకు మదిన్ సందింప ఊహించి"ఈ పద్యం కూడా చాలా critical. అసలు పద్యం భాగవతం చెప్పేవాళ్ళు ఎందుకు చెప్పరో నాకు అర్థం కాదు. బ్రహ్మ బొమ్మలు గీస్తాడు కదా! మన బొమ్మలన్నీ ఆయనే గీసాడు మనం అనుకున్నాం. గీస్తాడు, రూపం ఇస్తాడు, ఊపిరి ఊస్తాడు. అమ్మవారేమో వీణాదండం అంటే మన వెన్నెముక దానిని వీణగా చేసుకొని సప్తస్వరాలు అంటే సప్తజ్ఞాన భూమికలు, ఆరు చక్రాలు, నడవ కదలనటువంటి సహస్రారం అన్నింటినీ కూడా వేణువు మీద, వీణ మీద వాయిస్తూ ఊపిరిగా మనలో అది ప్రవేశపెట్టి ప్రాణ చైతన్యంగా తయారుచేసి మనల్ని అక్కడొక చిన్న పిండి బొమ్మను చేసి దానికి ఊపిరి ఊది ఇక్కడికి వదులుతాడు అని కదా. ఇక్కడికి అంటే మన తల్లి గర్భాలయంలోకి వదిలిపెడతాడు అని. ఆయువు ఆయనే ఇస్తాడు, లోపల వాయువు ఆయనే ఇస్తాడు, రూపము ఆయనే ఇస్తాడు. ఆయన చేతిలో brush ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం అలా రూపాంతరీకరణం చెందుతాం. మన దోషం ఏం లేదు. బొమ్మ గీసిన వాడు వాడు, విసిరేసిన వాడు వాడు. కాకపోతే ఇక్కడ చిన్న ప్రమాదం ఉంటుంది. ప్రమాదం అని మనం అనుకుంటాం. కవరు మీద address రాసేటప్పుడు మాత్రం పొరపాటు పడతాడు బ్రహ్మ అని. ఎందుకంటే ఆయనకి నాలుగు తలలు ఉన్నాయి కదా! ఒకటి ఆలోచిస్తూ రెండోది post box లో వేస్తాడు. అందుకని పరమ దుర్మార్గుడు ఒక రాజ కుటుంబంలో పుడతాడు, పరమ ధార్మికుడు ఒక డబ్బులేని చోట పుడతాడు. కానీ ఇద్దరూ ఇక్కడ జీవయాత్ర సాగించవలసిందే. అది కేవలం చమత్కారం మాత్రమే. అయితే బ్రహ్మకి బొమ్మను సృష్టించాలి అని ఊహ ఎవరు కల్పిస్తారు? ఎవరిస్తారు? అది విచారణ చేస్తున్నాడు త్యాసులవారు. జగత్ ఉత్పాదన బుద్ధి బ్రహ్మకు మదిం సందిమ్ప ఊహించి, భగవంతుడు సరస్వతిన్ బనుప అమ్మవారిని పంపించాడట. పద్మాస్యతా అభిభున్ మగనింగా నియమించి సరస్వతీ దేవిని పిలిచి జగత్తును సృష్టి చేయించు అన్నాడట. ఎవరు? మన హరి. అంటే ఆమె ఏం చేసిందంటే ఎవరో ఒకర్ని అక్కడ వాళ్ళని చూసి నువ్వు నా భర్తవి. నువ్విక్కడుండి నీకో పని చెబుతానందిట అమ్మవారు. ఏమిటా పని అంటే జగత్ ఉత్పాదన బుద్ధి నూహించి జగత్తును పుట్టించాలి అని హరికి ఒక ఆలోచన కలిగినప్పుడు సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఇదిగో అటువంటి వాణ్ణి ఎవడినన్నా వాడు ప్రవేశపెట్టేంటే ఆయనని తన మగనిగా ఊహించి నియమించి తద్భువన సామ్రాజ్య స్థితిన్ సృష్టి పారెవు జేసెన్ మును బ్రహ్మను అట్టిగుణి ఆరంభించు సేవింపదగున్. ముందు ఏం చేశాడు? సదాశివ ప్రార్థన చేశాడు. సదాశివ ప్రార్థన అయిన తర్వాత బ్రహ్మను అంటే సదాశివుడు లేకపోతే బ్రహ్మ లేడు అని అర్థం. కాబట్టి మనకు తెలిసిన మహేశ్వరుడు, calendar శివుడు వీళ్లంతా కాదు. శివుళ్ళు కాదు. సదాశివుడనేటువంటి వాడు సృష్టికి మూలంగా ఒకడున్నాడు. వాడు సరస్వతీ దేవిని నియమించాడు. అడిగాడు వెళ్ళి అమ్మా! సృష్టి రచన సాగాలి నువ్వే ఏర్పాట్లు చేయ్ అన్నాడు. నువ్వు నా భర్తగా ఉండు, నీకేం చేయాలో నేను చెప్తానన్నది ఆయన చేత బొమ్మలు గీయించింది ఈవిడ. కదా. అటువంటి బ్రహ్మను నేను ఈవేళ తలుస్తున్నాను. సదాశివుడి తర్వాత బ్రహ్మ. మన లెక్క ఏమిటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటాం. నిజానికి మహేశ్వర, బ్రహ్మ తర్వాత విష్ణు. విష్ణు అంటే ఏది exist అవుతున్నదో లోకమంతా విష్ణుమయం. పద్యం చదువుకున్నాం కదా నిన్న. విశ్వమంతా విష్ణుమయం. విష్ణువు అసలు ఎక్కడొచ్చాడు ఇంకా బ్రహ్మ పుట్టలేదే అంటే బ్రహ్మ పుట్టాడు ఇప్పుడే. బ్రహ్మ ఎలా పుట్టాడయ్యా? సరస్వతీదేవి వల్ల పుట్టాడు, నియమించబడ్డాడు. సరస్వతీదేవికి బ్రహ్మను ఎందుకు నియమించాలని అనిపించింది? హరి అనబడేటువంటి పరమాత్మ లేదా హరుడు అనబడేటువంటి ఒక సదాశివుడు ఇదిగో బ్రహ్మను సృష్టించు, నియమించు అని అడిగింద-- అడిగాడు గనుక అది జరిగింది. మానధనుల్ మహాత్ములు సమాధి నిరూఢులు అన్నుఖాంబుజ ధ్యానమరంద పానాత్మ భజంబుల వాసి ముక్తులై లూనతనంద అట్టి మునిలోక శిఖామణికిన్ విశంకట జ్ఞాన తమోనభోమణికి సాధుజనాగ్రణి నేను ముఖ్యజన్. ఎవరయా? అంటే ఇదిగో పరమాత్మ అయినటువంటి విష్ణువుకి సాధుజనాగ్రణి సదాశివుడు బోళాశంకరుడని మనం అడక్కుండానే అడిగిన దానికంటే అధికంగా, అనుకున్నదానికంటే చాలా ముందుగా, చాలా instantaneous గా ఇస్తాడని మనం చెప్పుకున్నాం కల్పవృక్ష విచారణలో. అయితే హరి అనేటువంటి వాడు సాధుజనుడైన వాడికి మాత్రమే దొక్కుతాడు. సాధుజనుడు ఎవరంటే సత్వగుణ ప్రధానంగా ఉన్నవాడు. అధ్యాత్మలో ఉన్నా వాడు సాధువుగా ఉండాలి, స్వాదువుగా ఉండాలి, సత్వగుణంగా ఉండాలి. రజస్తమో గుణాలు దాటగలిగిన ఒకానొక స్థాయికి ప్రయత్నం చేస్తున్న వాడై ఉండాలి గనుక అటువంటి సాధుజనాగ్రణి అయినటువంటి పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను. కారణ కార్య హేతువగు కంజదళాక్షుని కంటే అన్యులెవ్వరలు రేరు. ప్రపంచంలో ఏం జరగాలన్నా కారణం ఉండాలి, కార్యం ఉండాలి. కార్యం జరగాలంటే కారణం ఉండాలి. కార్య కారణాలకు మూలమైన పరమాత్మ ఉండాలి. పరమాత్మ లేకుండా ప్రపంచం సాగదని చెప్తూ అందులో కంజదళాక్షుని కంటే మరొక వ్యక్తి లేడు. తండ్రి భగవంతుని అనంతుని విశ్వభావనోదారుని సద్గుణావలు ఉదాత్తమతిన్ కొనియాడకుండి నం చేరవు చిత్తముల్ ప్రకృతి చందని నిర్గుణమైన బ్రహ్మమున్. అటువంటి హరిని గనక మనం కూడకపోయినట్లయితే ఎటువంటి హరి? కంజదళాక్షులైనటువంటి వాడు తండ్రిగా, భగవంతుడిగా మనం అందుకే స్వామిని తల్లి, తండ్రి, గురువు, దైవం అని నిర్ణయించుకున్నాం. కనుక మన బోటి వాళ్ళకి చింత లేదు, భయము లేదు.ఆ ఆవరణంలోకి రాని వాళ్ళకి ఇంకా సాయిబాబా అనుకునే వాడికి మాత్రం ప్రమాదమే. వాడికి ఎందుకంటే అనుభవం రావాలి అంటే ఇంకా సమయం పడుతుంది గనుక తండ్రి భావన, పితృ భావన, జగదీశ్వర భావన, జగత్తుని రక్షించటానికి పూనుకొని ఉన్నటువంటి వాడి యందున్న భావన, నిర్గుణ పరబ్రహ్మానికి చేరాలి అంటే అటువంటి హరి యందు మన చిత్తం గనుక లగ్నం కాకపోయినట్లయితే ముక్తి లేదు అని చెప్తున్నాడు శుకదేవుడు. అంటే నీకో మనసు అంటూ ఉంటే, నీకో చిన్న ఆలోచన ఉంటే, పరమేశ్వరుడిని సంభావించాలి, భజించాలి, పూజించాలి, ఉపాసించాలి, అనుభవించాలి, దృశ్యంగా చూడాలి అని గనుక చిన్న ఆలోచన ఉన్నట్లయితే, నీ చిత్తాన్ని హరి యందు లగ్నం చెయ్ అని చెప్తున్నాడు. పరమేశ్వరుని యందు లగ్నం చెయ్. అయితే చేస్తాం అండి రేపు పొద్దునే, మహాశివరాత్రి కూడా రాబోతోంది. ఈసారి ఎప్పుడూ ఉపవాసం లేదను గానీ, ఉపవాసం చేసేస్తాను అంటే వ్యాసులవారు చెప్తున్నారు "ఉపవాస వ్రత శౌచ శీల మఖ" అంటే యజ్ఞం "సంజోపాసనా గృహ్ క్రియా జప ధాన్యాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి సేకూరదు" అదిట. లెక్క తెల్చేశాడు ఆయన. ఎంత అందంగా తెల్చాడంటే ఒకే ఒక్క line లో తెల్చాడు. మనకేమనిపిస్తుందంటే, ఇవన్నీ చేయాలేమో, ఇన్ని చెప్తున్నారే అని. అది రాదు అంటే, రాదంటే మనమెందుకు చేస్తాం? వస్తుందంటే చేస్తాం. కాబట్టి ఉపవాస గుర్తుపెట్టుకోవాలి. స్వామి అందుకే చూడండి, స్వామిని analogy చేసుకోకపోతే సో స్వామి యొక్క తత్వం మనకర్థం కాదు. ఆయనన్నారు "In Sai avatar there is no fasting, it is always a feasting" అన్నారు స్వామి. మనకా fasting అలవాటు లేకపోతే బాగుండదేమో, ముక్తి రాదేమో. పోన్లే శివుడికి కోసం, శివుడికి చేస్తే నీకోసం చేసుకో. శివుడికి అసలు ఆకలి ఎక్కడుంది? జాగరణ ఎక్కడుంది? ఆయన నిన్ను అడిగాడా చెయ్యమని? కాబట్టి ఉపవాస వ్రత పౌర్ణమి వచ్చింది సత్యనారాయణ వ్రతం చేసేద్దాం. last year పది లక్షలు లాభం వచ్చింది. ఈసారి బాగా చేస్తే అందులో లక్ష లేదనుకుంటే వచ్చేటప్పుడు ఇరవై అంటే పది మిగిలినట్లేగా అని చెయ్యొద్దంటున్నాడు. శౌచ. శౌచ చాలా విచిత్రమైనటువంటి స్థితి ఇది. మనకేమనిపిస్తుందంటే, మహాత్ముణ్ణి దర్శనం చేయడానికి వెళ్ళాలి అంటే మంచిదే అవకాశం ఉంటే. హాయిగా తలారా స్నానం చేసి తల అర పెట్టుకొని, తలారా అంటే తల నిండుగా అని కాదు, తల అర పెట్టుకొని అనమాట. అర పెట్టుకొని తడి-తడి దాంతో వెళ్ళకూడదు అని శాస్త్రమే మాట్లాడవలసి వస్తాయి. కాబట్టి దానికి తగిన attire వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి అని. ఒకసారి నేపాల్ నుంచి తిరువణ్ణామలైకి మన బోటి సాధకుడు భగవాన్ను చూడాలి అని వచ్చారు. ఎక్కడ నేపాల్ 1930 ప్రాంతంలో కథ. ప్రయాణం చేశాడు, చేశాడు, చేశాడు వారమో పది రోజులో చేసి ఉంటాడు. ఒళ్లంతా మట్టి, బట్టలన్నీ మాసిపోయినయి. కానీ అతని మనస్సు యందు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏమిటంటే భగవాన్ను చూడాలి వెంటనే. మరి అంత దూరం ఎందుకు వెళ్ళేది మనం పుట్టపర్తి వెళ్ళే స్వామిని చూడ్డానికి. వెళ్ళేసరికి ఆయన అక్కడ ఉన్నారు. విచిత్రంగా ఇతను అక్కడ ఎప్పుడైతే అక్కడ చేరుకున్నాడో, ఆయన మంచం మీద కూర్చొని ఉన్నారు. ఆయన చుట్టూ ఇలాగ పది మంది, పదిహేను మంది కూర్చొని ఉన్నారు. ఇతనికి లోపల ఒక శంక ఏర్పడింది. పది రోజులు ప్రయాణం చేశాం train లో అందరితో పాటు కూర్చొని. మనక్కూడా ఉంటుందది. వాళ్ళంతా చెడ్డవాళ్ళు అయినట్టు, వాళ్ళ మధ్యలో మనం ప్రయాణం చేసి మనం పాడైపోయి వచ్చినట్లు కదా. పది మంది కూడా అదే అనుకుంటారు. లాయరు గారు పిల్లి కథ చెప్పుకున్నాం అట్లా. సరే మట్టితో, ఒంటితో, ఇటువంటి బట్టలతో ఆయన్ను చూడటం ఏంటి? మహాత్ముడాయన వెలిగిపోతున్నాడు అని అనుకుంటున్నాడు. అనుకుంటున్నట్లుగానే ఆశ్రమంలో ఉన్నటువంటి వాడు ఒకడు ఉంటాడు. దేవుడికి rules ఉండవు. ఆశ్రమం నడుపుతున్నాం మనం అనుకునే వాడికి rules ఎక్కువుంటాయి. వాడేమన్నాడంటే, "పక్కన నుంచో, పక్కన నుంచో, భగవాన్ అక్కడ కూర్చున్నారు, పక్కన నుంచో" అన్నాడు. తంతంత దూరం నుంచి ఆయన్ను చూశారు. చూసి ఆయన నెమ్మదిగా కరుణాపూర్ణ సుధాబ్ధి, గురువైనా నిజమైన గురువు, ఆయనేమన్నారంటే ఒక సముజ్ఞ చేశాడు రమ్మనమని. పాపం ఇతను bag అవన్నీ అక్కడ పడేసి గబగబా భగవాన్ దగ్గరికి వెళ్ళేప్పటికీ అక్కడ ఒకడున్నాడు. వాడన్నాడు "కొంచెం దూరంగా పిలి-వస్తే వచ్చావు, దూరంగా ఉండు" అంటే అప్పుడు భగవాన్ చెప్పారు, "శాస్త్రాలలో ధూళిపాద దర్శనం అని ఒకటున్నది తెలుసునా? నువ్వు ఎట్లా ఉన్నావో అట్లా వచ్చి ఎట్లా ఉన్నాడో అట్లా ఉన్నవాణ్ణి చూడగలిగితే దాన్ని మించిన కైవల్యం ఏముంది?" అన్నారు. అది. మనకంతా వేషం ప్రధానం అయిపోయింది. దురదృష్టవశాత్తు విషయం వెనక్కి పడిపోయింది. విషయం ఇవ్వాళ ఎవరికి కావాలి? నాలుగు పద్యాలు చెప్పటానికి, నాలుగు మాటలు చెప్పటానికి పారాఫర్నిలియా కావాలి, అవసరమా? కావలసింది శుద్ధమైన ఆత్మ కావాలి. పరమేశ్వరుని యందు భక్తి కావాలి. నీవు నమ్మిన దాని యందు నీకు విశ్వాసం ఉండాలి. కనుకనే శుచి, అంతఃశుచి చాలా ప్రధానం. బాహ్య శుచి భగవంతుడు, ఆయనకి సంబంధం లేదు. స్వామి కూడా ఒక మాట అన్నారు. "నీ బాహ్యంతో నాకు ఎప్పుడూ ఎట్టి పరిస్థితిలోనూ సంబంధం లేదు. నీ భావంతోనే నాకు సంబంధం" అన్నారు. మనం భావంతో పరమాత్మని చూశాం, పరమాత్మని కోరుకున్నాం దానిని బట్టి ఆయన react అవుతారు తప్ప, అట్లాగే గనకైతే ప్రపంచంలో ఉన్న డబ్బున్న ప్రతి వాడికి భగవంతుడు అక్కర్లా. వాడు కాస్త వెళ్లి మా-మా-మన mall లోకి వెళ్లి ఎట్లాగైతే ఒక వస్తువు కొన్నాడో అట్లా శాంతిని డబ్బు పెట్టు కొనుక్కోవచ్చు. వాడు పుట్టపర్తి రావలసిన పనేముంది? వాడి దగ్గర అది లేదు. వాడికి అర్థమైంది మన దగ్గరున్న డబ్బుతో అది రాదు. ఇది కావాలి అంటే డబ్బు అక్కర్లేదు. డబ్బు అక్కర్లేని దేవుడు ఎవడన్నా ప్రపంచంలో ఇంతవరకు ఉన్నాడు అంటే అదొక్క సత్యసాయి భగవానుడు తప్ప ఇంకొకడు లేడు.ఎందుకంటే ఆయన దగ్గర హుండీలు లేవు రసీదు కట్ చేసేవాళ్ళు లేడు మనం మనం కూడా ఆయనకి ఏమి ఇవ్వలే ఏదన్నా ఒకటో రూపాయి అక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళమే తప్ప ఆయనకి ఇచ్చింది ఏమి లేదు ఇంతవరకు. ఉపవాస వ్రత శౌచ శీల మఖ యజ్ఞాలు చేసేద్దాం ఎందుకైనా మంచిది అందరూ చేశారు కదా యజ్ఞాలు చేసేట్లా విష్ణు లోకానికి వెళ్లారట అంటే యజ్ఞం చేసినా నీకు ముక్తి లేదు అన్నాడు ఈయన అంతే కాదట సంధ్యోపాసనా అగ్ని క్రియా జప దాన ధ్యానాది కర్మముల మోక్ష ప్రాప్తి చేకూరదు. అంటే ఇక road dead end అనుకోకూడదు దాని వలన రాదు అంటే దేని వలన వస్తుందో కూడా చెప్తాడు దేని వలన వస్తుంది అంటే అచ్చపు భక్తిన్ అచ్చపు భక్తి నిజమైన భక్తి స్వామి మనకు అసలు ఏమి ఇవ్వక్కర్లేదు ఆయన ఇవ్వటమేమిటి ఎన్నిస్తారు ఆయన ఇవ్వటం మొదలు పెడితే మన ఇల్లు చాలదే అనుకున్నాం అనుకోండి ఆయనకీ సుఖం మనకీ సుఖం ఆయన ఏమి ఇవ్వక్కర్లేదు మనం ఏమి పుచ్చుకో అక్కర్లేదు అలాగే అది దాని పేరు అచ్చపు భక్తి అచ్చపు భక్తిన్ హరి పుండరీక నయనున్ సర్వాతిశాయన్ రమాధిపు పాపఘ్ను పరేషు అచ్యుతును అర్ధిన్ కొల్వలేకుండినన్ నాలుగు గనక పరమాత్ముని గురించి విచారణ చేస్తూ ఒక్క హరిని గనక మనం పట్టుకోగలిగినట్లయితే దానం లేదు ధ్యానం లేదు యోగం లేదు ధారణ లేదు అవన్నీ academic గా అవన్నీ మనకు అవసరమేమో కానీ ముక్తి కావాలి అంటే మాత్రం ఒక హరినామ సంకీర్తనం చాలు హరి యొక్క గుణగానా గుణాలన్నీ కూడా విశేషణంగా గనక ప్రార్థించగలిగినట్లయితే దాని వలన రూప ఉపాసన జరుగుతుంది నామోపాసనలోనే రూపోపాసన ఉంది శివుడి మీద భజన చేయండి శివుడే కనపడతాడు మరుక్షణం రాముడి మీద ఇంకొకరు భజన ఎత్తుకుంటే శివుడు మాయమవుతాడు రాముడు వస్తాడు కదా అంటే నామ రూపాలు అభిన్నంగా ఉన్నాయి రెండు కలిసి ఉన్నాయి నామం తలుచుకుంటే రూపం వస్తుంది రూపం తలుచుకుంటే నామం వస్తుంది కాబట్టి రెండు భిన్నంగా లేవు అభిన్నమైనటువంటిదే అద్వైత స్థితి అట్లా భావించేవాడు భావించబడినటువంటి పరమాత్మ ఒకటి అన్నటువంటి భావనకే పూర్ణాద్వైతం అని పేరు ఇక అసంపూర్ణం లేదు అర్థం లేదు అది పూర్ణమైనటువంటి అద్వైతం. పరమేసుచే జగములు సచరాచర కోటితో సముద్దీపితమయ్యే విభుని దివ్య కళాంశజు లబ్జ గర్భ గౌరీపతి ముఖ్య దేవ ముని బృందములు ఎవ్వడు అనంతుడు అచ్యుతుండు పురుషోత్తముండు కరుణాంబుధి కృష్ణుడు నరేశ్వరా నేను ఇందాకటి నుంచి హరి హరి అని ఇవన్నీ చెప్పానే వాడెవడో కాదయ్యా మొన్న మొన్నటి వరకు మీ తాత దగ్గర ఉన్నటువంటి కృష్ణ పరమాత్మే హరి ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి. కృష్ణుడు పరీక్షిత్ మహారాజుకి తాతగారు అనుకుందాం అంటే ఒక వరుసలో అసలు తాత ఎవడు అర్జునుడు అర్జునుడికి స్నేహితుడు గనుక ఈయన కూడా తాత తాత అంటే మనం మన లెక్కలో తాత అని కాదు ఎవరు తరింపజేయటానికి వచ్చారో వాడి పేరు తాత అందుకనే వైష్ణవ సాంప్రదాయంలో తాత పాదులు అంటారు తాత పాదులు అంటే మనకి అనుగ్రహాన్ని ఇచ్చి ముక్తి మార్గాన్ని బోధించేటువంటి పెద్ద మనిషి అని అర్థం తాత పాదుల వారు ఎవరు అంటే శ్రీకృష్ణుడే నీకు అని దీనికి మళ్ళీ స్వామి సమన్వయం అది వస్తుంది తప్పదు భాగవతం స్వామిదేగా మరి ఆయన ఏమన్నారు మనం అనుకున్నట్లుగా ఎవరు సత్య సాయితో సంపర్కం పెట్టుకున్నారో వారి ఇరవై ఒక్క తరాలనే కాచుకుంటానన్నారే కాబట్టి ఇరవై ఒక్క తరాల వరకు దీనికి విధాత ధాత ఎవరంటే స్వామి ఎలా అవుతున్నారో ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు కృష్ణుడు అవుతున్నాడు అని సమన్వయం. పరమేసుచే జగములు చరాచర కోటితో చర అచర నడిచేవి నడవనివి కదిలేవి కదలనివి కనబడుతున్నవి కనపడనివి అర్థమైనవి అర్థం కానివి తెలుస్తున్నవి ఇంకా తెలియవలసినవి రెండు ద్వంద్వాలుగా ఉన్నటువంటి సంపూర్ణ స్థితికి మూలమైనటువంటి కృష్ణుడే హరి అన్నాడు అనగానే పరీక్షిత్తుకు ఒక ఆనందం కలిగింది అటువంటి పరమాత్మనా నేను చూశాను అటువంటి పరమాత్మ నా యొక్క ప్రాణాన్ని నిలబెట్టిన వాడు చక్రబంధం వేసి సుదర్శన చక్రం వేసి యోగ మాయా అనుగ్రహ విశేషం చేత నా తల్లి గర్భంలో నాకు ఊపిరి ఊదిన వాడు సాక్షాత్తు ఇక్కడ బ్రహ్మ కాదు ఎవరంటే పరమేశ్వరుడు అయినటువంటి హరి అయిన శ్రీకృష్ణుడే
SSSMC · audio

Bhagawata Navaneetham - 19

Home

Bhagawata Navaneetham - 19

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 29:08

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

    Now playing
  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67