No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి స్వరూపం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతా పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ భాగవత నవనీతంలో తృతీయ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకోవలసిన సన్నివేశం ఇది. మానవ సంకల్పాలు ఎలా ఉన్నా స్వామి సంకల్పాలు భిన్నంగా ఉంటాయి. మళ్ళీ ఎట్లా December పదహేడున ప్రారంభమైందో మళ్ళీ January పదహేడునే నా గురించి మాట్లాడుకోండి అని ఆయన నిర్ణయం కాబట్టి ఈరోజున పరమ ఉత్కృష్టమైనటువంటి సన్నివేశం భారతీయ అధ్యాత్మ చరిత్రలో మనకి ఇదేం కొత్త కాదు చాలా పాత కథ అంటే జ్ఞానికి ఆ దేహానికి ఉన్న వయస్సుకి సంబంధం లేదు. జ్ఞాని కావాలి అంటే ఒకడెభై ఏళ్ళు రావాలి, ఎనభై ఏళ్ళు రావాలి, జీవితానుభవం అంతా పొందాలి అప్పుడు scriptures అన్నీ చదవాలి దాని అంతరార్థాలు తెలుసుకోవాలి అప్పుడు వయస్సు తే-- చేత జ్ఞాని అవుతాడు కావచ్చు అని. కానక్కర్లేదు ఎందుకంటే ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు, వివేకానంద స్వామి, శంకర భగవత్పాదులు, రమణ మహర్షి, భగవాన్ సత్యసాయి వీరంతా పదహారేళ్ళు రాకుండానే తమ దివ్యత్వాన్ని ఈ జగత్తుకు చాటారు. ఈ అవతార పురుషులంతా శ్రీరామచంద్రుడితో సహా, ఇక మన కథానాయకుడు కృష్ణుడు వెనుక అయినట్లయితే అసలు యోగమాయని చేధించుకొని చెరసాలలో ప్రభవించిన మరుక్షణమే దివ్యత్వాన్ని ప్రకటన్ చేశాడు. కాబట్టి జ్ఞానికి ఆ జ్ఞాని దేహానికి ఉన్న వయస్సుకి ఏ రకమైన సంబంధం లేదు. అందుకనే వయస్సు చిన్నదైనా ఆయన జ్ఞాన వృద్ధుడు అంటాం. జ్ఞానం చేత వృద్ధుడు అంటే వృద్ధి పొందిన వాడు అని ఒక అర్థం, వృద్ధాప్యాన్ని అనుభవిస్తున్న వాడు అంటే ఆ ముదిమితనం అంతా ముఖములో నుంచి ఏర్పడింది, సంతోషం లో నుంచి ఏర్పడింది. సంతోషం ఎందువల్ల కలిగింది అంటే పరమాత్మ యొక్క తత్వ విచారణ వలన కలిగింది. పరమాత్ముడి యొక్క నామ, రూప, భావ, తత్వార్ధాలని పరిపూర్ణంగా అనుభవించాడు కనుక వయస్సుతో నిమిత్తం లేకుండా, ఈ ప్రపంచం తో నిమిత్తం లేకుండా, ఎన్నెన్ని కార్యకలాపాలలో తాను మగ్నుడై ఉన్నప్పటికీ కూడా తనదైనటువంటి ఆత్మానుసంధానంతో ఆ నిత్యమైన, సత్యమైన, భవ్యమైన, దివ్యమైనటువంటి ఆనంద తారక స్థితిలో సంచారం చేస్తాడు గనుక శంకర భగవత్పాదులు ఓ మాటంటారు "యోగ రతో వా భోగ రతో వా సంగ రతో వా సంగ విహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ" నువ్వు యోగంలో ఉండు, భోగంలో ఉండు, ప్రపంచంతో కూడి ఉండు, ప్రపంచాన్ని వీడి విరాగిగా ఉండు, ఎక్కడుంటే నువ్వు ఎక్కడుంటే ఏమి నీ చిత్తము గనక పరమాత్మ యందు లగ్నమై ఉన్నట్లయితే అది నీకిచ్చే ఆనందమే ఆనందం అది మాత్రమే ఆనందం అంటాడు. నిజానికి వ్యాస ప్రోక్తమై, బమ్మెర పోతనామాత్య కృతమైనటువంటి భాగవతం ఆంధ్ర జాతికి ఒక అత్యద్భుతమైనటువంటి భక్తి భాండాగారం ఇది. ఇందులో ఆత్మానుసంధానంతో ప్రారంభమవుతుంది. రామాయణ కల్పవృక్షం లాగానే "ఆత్మ నిత్యమ్ము కలాజవచ్ఛిన్నమ్ము అపరిణామం అప్రమేయం మది అచట తెలివి" అంటూ ఎట్లా ప్రారంభమైందో, నిజానికి భాగవతం కూడా కృష్ణుడి కథతో కృష్ణుడి యొక్క జననంతో ప్రారంభం కాలే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అధ్యాత్మ భూమికలో నుంచి పరీక్షిత్ మహారాజు కారణంగా మనందరికీ కూడా ఈ భాగవత తత్వం మనకి అవకాశము అందుబాటులోకి వచ్చింది గనుక పూర్ణమైనటువంటి పరమాత్మ పదహారు కళలతో విరాజిల్లినటువంటి అవతార మూర్తులు ముగ్గురు. ఆ ముగ్గురిలో మొదటివాడు రామచంద్రుడు, రెండవ వాడు శ్రీకృష్ణ పరమాత్మ, మూడవవాడు భగవాన్ సత్య సాయి. ఈ పదహారు కళలంటే దివా రాత్రులు లేవు, చీకటి వెలుగులు లేవు, పాత కొత్త లేదు, తెలిసిన వాడు, తెలియని వాడు లేదు. పూర్ణమైనటువంటి మహా ద్వైత స్థితిలో సాధకుడిని నడిపించేటువంటిది గనుకనే అది భగవత్ తత్వాన్ని ఎరిగినటువంటి వారు భాగవత తత్వాన్ని ఎరిగినటువంటి వారు భాగవతులు అవుతున్నారు గనుక భాగవతుల కథలన్నీ కలిపితే భాగవతం అవుతున్నది గనుక ఇక్కడ చిన్న విశేషం ఏమంటే శ్రీమద్రామాయణ కల్పవృక్షాన్ని క్రితం సారి మనం ప్రారంభించిన ఏడు రోజులకి స్వామి రామాయణ మహా ప్రవచనాలు చెప్పించారు పుట్టపర్తిలో. అట్లాగే భాగవత తత్వ ఈ నవనీతాన్ని ఎప్పుడైతే మనం ప్రారంభించామో సరిగ్గా వారం తెరక్కకుండా స్వామి భాగవతం మీద ఏడు ఉపన్యాసాలు పూర్ణం చేసేశారు. ఇది దివ్యమైనటువంటి అనుగ్రహం. ఇవన్నీ స్వామి దయ వల్ల కలుగుతాయి, కరుణ వల్ల జరుగుతాయి అనటానికి మనకి ఏమిటి నిదర్శనం అంటే ఇవే నిదర్శనాలు. కాబట్టి ఇవాళ కథాంశం ఏమిటంటే తృతీయ స్కంధంలో దేవహుతి కపిలుడు. కపిలుడు దేవహుతికి కొడుకు. కర్దమ మహాముని దేవహుతి పరమేశ్వరుడిని ప్రార్థించారు. ఆ రోజు తల్లిదండ్రులల్లా పరమాత్ముడిని ఒకటే ప్రార్థించే వాళ్ళు. ఏమనంటే మాకో కొడుకుని ఇవ్వమని కాదు.పున్నామ నరకం నుంచి తప్పించే ఓ బిడ్డనివ్వమని కాదు, పిల్లలు లేకపోతే ఎట్లా ఆనందాన్ని కలిగించే ఓ పిల్లవాడిని ఇవ్వమని కాదు, పిల్లని ఇవ్వమని కాదు. నీవంటి కొడుకుని మాకివ్వమని అడిగారు వాళ్ళు అది. నీవంటి కొడుకు ఆ-- ఆయనేమంటాడంటే "నావంటి వాడు ఇంకొకడు లేడు గనుక నేనే మీ కొడుకుగా పుడతాను" అంటాడాయన అది. అట్లా వచ్చిన వాడే కపిల మహాముని. ఈ కపిల మహాముని తల్లిదండ్రులిద్దరూ కూడా దేవహుతి కర్దములిద్దరూ భగవంతుణ్ణి, పరమాత్మని ప్రార్థించి "అయ్యా! జీవన తత్వాన్నంతా ఎరిగి పరమ భాగవతోత్తమమైన జీవితం గడపాలని, ఆత్మ అంటే, మోక్షం అంటే, భక్తి అంటే, అసలు జీవితం అంటే, ఆపై పరమాత్మ అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకోవాలి కనుక మాకో కొడుకుని, నీవంటి కొడుకుని ఇవ్వమని" అడిగితే, ఆయన వీరి యందు ఉన్నటువంటి దయా విశేషం చేత ఒక్కటే మాటన్నాడు. "నేనే మీ గర్భంలో ప్రవేశించి మీ బిడ్డనై పుడతాను" అని. ఆ బిడ్డనై పుట్టినటువంటి వాడు, బిడ్డడుగా వచ్చినటువంటి వాడు కపిల మహాముని గనుక ఆ కపిలుడు దత్తాత్రేయుడి అవతారం కంటే ముందు అవతారం. కపిలుడై దత్తాత్రేయుడై అంటాడు అన్నమాచార్యుల వారు. తానే, తానే ఇందరి గురువు అంటాడు. ఎందరి గురువు అంటే ఉన్న వాళ్ళందరికీ ఆయన ఒక్కడే గురువు అట. కాబట్టి ఆ కపిలుడు ఏం చెప్పాడు ప్రధానంగా అంటే, మనం తొలినాళ్ళలో చెప్పుకున్నాం భగవంతుని యొక్క అవతారాలు ఇరవై రెండు అయితే ఇరవై ఒక్క అవతారాలు వచ్చినాయి. ఇరవై రెండవ అవతారం కల్కి అవతారం ఇంకా రాలే. కలి భంజనం చేసి కలియుగాన్ని పరిసమాప్తం చేయటానికి ఓ ధర్మ ప్రభువు ప్రపంచంలోకి రావాలి గనుక ఆయన ఒక horse power తో వస్తాడు. గుర్రం ఎక్కి వస్తాడు. ఆ గుర్రం ఎక్కి చైతన్య స్ఫూర్తిమంతమైనటువంటి శాంతి పతాకాన్ని చేత ధరించి వస్తాడు. ఆ చేత ధరించి వచ్చేటువంటి ఆ పరమ పురుషుడు కల్కిగా సంభావింపబడతాడు గనుక ఆ కల్కి అవతారం ఇంకా రావలసి ఉన్నది. అందులో ఒక్కొక్క అవతారం ఒక్కొక్క తత్వాన్ని విచారణ చేస్తే కపిలుడు ఏం బోధించాడంటే, కేవల అధ్యాత్మని బోధించలేదు. అధ్యాత్మని, యోగ శాస్త్రాన్ని సమన్వయం చేశాడు. అధ్యాత్మ విద్య theory మనకు అర్థం కావాలంటే, యోగ విద్య practice. Theory లేని practice, practice లేని theory రెండూ దండగ. రెండూ అర్ధ సత్యాలు గనుక పూర్ణ సత్యం ఎట్లా ఉన్నదీ అంటే అధ్యాత్మ విద్యని ఇదిగో ఇట్లా విచారణ ద్వారా, సద్గోష్ఠి ద్వారా, సత్సంగం ద్వారా, సత్సాంగత్యం ద్వారా అనేకమైన విచారధారులుగా మానవుడు పొందవలసి ఉన్నది. అయితే యోగ విద్య ద్వారా తాను తెలుసుకున్నటువంటి విద్యని తన శరీరము నుండే తాను అనుభవించవలసి ఉన్నది. అది ఎట్లా అంటే "ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ" అన్నటువంటి ఒకటి, నీవు నేను లేదు ప్రకృతి పరమాత్మ అనే రెండు, లేదు జీవుడు దైవము అన్న రెండు అంటే ద్వంద్వం. మూడు గుణాలు సత్వ రజస్ తమో గుణాలు. చతుర్విధ పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ నాలుగింటి తర్వాత అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటువంటి ఐదు కోశాలు. మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనబడేటువంటి ఆరు చక్రాలు. ఈ ఆరింటిని కదిలించేటువంటి సహస్రారము. అలాగే సప్తజ్ఞాన భూమికలు, అష్టాంగ యోగాలు, నవవిధ భక్తులు ఇవన్నీ కలిపినట్లయితే అది యోగవిద్య విధానం కాబట్టి యోగవిద్య ప్లస్ అధ్యాత్మ విద్య లేదా అధ్యాత్మ విద్య యోగశాస్త్రం రెండూ కలిపినట్లయితే దాని పేరు సాంఖ్యము అన్నారు. ఆ సాంఖ్యము అనేటువంటిది ఎవరు బోధించారయ్యా అంటే ఇదిగో గురోర్గురువైనటువంటి కపిల మహాముని బోధించారు. ఎవరికి బోధించాడు? శిష్యులు ఎవరూ లేరు ఆయనకి. ఎక్కడో చెట్టు కింద కూర్చోలేదు. ఇదిగో ఇది శాస్త్రం, ఇది ప్రమాణం అని చెప్పలేదు. తల్లి అడిగింది. ఎలా అడిగిందంటే, తాను కన్న బిడ్డే అయినప్పటికీ కూడా ఆ బిడ్డలో తాను పొందినటువంటి వరాన్ని గుర్తుపెట్టుకున్నదమె. ఏమని? "నీవంటి కొడుకు నాకు కావాలి" అంటే ఆయనేమన్నాడు? "నేనే నీ కొడుకుగా పుడతాను" అన్నాడు గనుక ఈ పుట్టినవాడు హరి తప్ప మరొకడు కావటానికి వీల్లేదు. కాబట్టి భగవంతుడే బిడ్డగా మన ఇంట్లో ఆడుతూ ఉన్నప్పుడు, పాడుతూ ఉన్నప్పుడు, మనతో కూడి ఉన్నప్పుడు వాణ్ణి ఏమడగాలి? "నువ్వు బాగా చదువుకో, నాకంటే పెద్దవాడివిగా బాగా సంపాదించు" అని అధునాతనమైన తండ్రి అడిగినట్టు అడుగుతాడా? తల్లి అడిగినట్టు అడుగుతుందా? ఏమడిగిందంటే, "నాయనా! ఆత్మ అంటే ఏమిటి?" అని అడిగింది. "చెప్తానమ్మా!" అన్నాడు. "ఆత్మ అంటే నాశనము లేనిది ఆత్మ" అన్నాడాయన. "దానికి పుట్టుక లేదమ్మా, [దగ్గు] మరణము లేదు, స్థితి లేదు కాబట్టి దాని పేరు ఆత్మ. ఆత్మకి అచ్చమైనటువంటి పేరు నేను." మనందరం ఉన్నాం. నేను చేశాను, నేను అన్నాను, నేను ఇప్పుడే చూసి వచ్చాను అని అంటూ ఉంటాం. ఆ నేను ఎవరు అని, ఇప్పుడు ఇప్పటిదాకా భజన పాడింది ఎవరు అని, నా దృష్టిలో మీకు పేర్లు ఉండొచ్చు గానీ ఆ పాడింది ఒక్కడే ఆయన సాయి పరమాత్మ. ఆ సాయి పరమాత్మ ఈ దేహాన్ని ఆవేశిస్తాడు ఆ కాసేపు. ఆవేశించి తను పాడతాడు. ఆ పాడుతున్నప్పుడు మనం దేహమే మనంగా భావిస్తాం గనుక నేను రో-- నిన్నటికంటే ఈవేళ బాగా పాడాను అనుకుంటాం. ఏం కాదు. నిన్న పాడింది ఆయనే, ఈవేళ పాడింది కూడా ఆయనే. కాబట్టి ఆ దివ్యమైనటువంటి నేనుని విచారణా మార్గంలో తల్లికి బోధ చేశాడాయన.కపిలుడు తల్లికి బోధ చేసినప్పుడు ఆయన వయస్సు నాలుగు సంవత్సరాలు కూడా దాటలే. "అంతేనా నాయనా?" అని అడిగింది. చూడండి జిజ్ఞాసువు శిష్యుడు ఎలా ఉండాలంటే, "ఇంతేనా ఇంకేదన్నా ఉన్నదా?" అని కాస్త అడుగుతూ ఉండాలి. అడుగుతుంటే గురువుగారు కావలసిందంతా చెప్తూ ఉంటాడు. తల్లినైనా అంతే, "ఏమ్మా ఇంకేదన్నా కష్టం ఉందా?" అని అంటే, "కాస్తేమిటి కావలసినంత ఉంది" అంటుంది. కావలసినంత మనకక్కడ ఉన్నది అంటే ఇవ్వటానికి తల్లి ఎట్లా సిద్ధంగా ఉన్నదో గురు స్వరూపమైనటువంటి కపిలుడు తల్లికి చెప్పాడు. ఆత్మ అంటే చావుపుట్టుకలు లేనిదని మాత్రమే కాదు, అన్నిటా ఆవరించి ఆవహించి ఉన్నటువంటిది దాని పేరు ఆత్మే. అదే ఒక్కొక్క వస్తువుగా రూపాంతరీకరణం జరిగినప్పుడు అభివ్యక్తమైనప్పుడు అంటే మనకు కనిపించినప్పుడు ఓ చెట్టుగా, ఓ పుట్టగా, ఓ మిట్టగా, ఓ గుట్టగా, ఓ ఆకాశంగా, ఒక నదిగా, ఒక గాలిగా అనేకంగా కనిపిస్తూ ఉన్నది. కనిపిస్తున్నదంతా కూడా వస్తువైతే వస్తువును నడిపిస్తున్నది మాత్రం ఆత్మేనమ్మా అన్నాడాయన. కాబట్టి ఆ నడిపిస్తున్నటువంటి ఆత్మలన్నీ దానికి సంస్కృతంలో పేరు సత్. ఆత్మలన్నీ సంగమించినట్లయితే సత్తులన్నీ సంగమించినట్లయితే దాని పేరు సత్ సంగమం. అది సత్సంగం. సత్సంగానికి వెళ్తున్నా అంటా, ఉపన్యాసం ఇవ్వటానికి కాదు సత్ సత్తులతో కూడటానికి వెళ్తున్నా. దేహాలు వేరువేరుగా ఉన్నా, రూపాలు వేరువేరుగా ఉన్నా, జీవన స్థితులు వేరువేరుగా ఉన్నా, మాలో మా అందరిలో అఖండమైన చిద్ఘనమైనటువంటి అనాహతమైనటువంటి ఒక వస్తువు ఉన్నది. హతము కానటువంటి వస్తువు. ఎక్కడా ఖండనం చేయటానికి వీలులేని అఖండము ఆత్మైక స్వరూపమైనటువంటి ఒక ఆత్మ భావన ఉన్నది గనుక దానిలో అందరం కూడి దేనిని గురించి విచారణ చేస్తాం అంటే వీటన్నిటికీ మూలమైన పరమాత్మను గురించి విచారణ చేస్తాం అని చెప్పాడు. "అంతేనా?" అని అడిగింది. కాదమ్మా! ఆత్మ అంటే అది ద్వేషం ఎరుగదు. దానిని తెలుసుకోవలెనేవారు చాలామంది కోట్ల మంది ఉండవచ్చునేమో కానీ దానికి తెలుసుకోవలసిన అవసరం అంటూ ఇంకేం లేదు. It is already known. It knows everything. కానీ దానిని తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కోటానుకోట్ల మంది. ఆత్మ ఏదన్నా ఎరగవలసి ఉన్నదా అంటే అసలు దానికి పేరే ఎరుక. ఆ ఎరుక, స్ప్రుహ, స్పర్శ, జ్ఞానము, ఆత్మ వీటన్నింటినీ కూడా పర్యాయపదాలు గనుక ఈ సత్ ఈ ఆత్మ అనేటువంటిది నిత్యము, సత్యము, శాశ్వతము, సంపూర్ణము, అవచ్ఛిన్నము, అపరిణామం. అది దానికి మార్పు లేదు. ఇవాళ పుట్టి కాస్త పెరిగి కొన్నాళ్ళు ఉండి ఒరిగిపోయేది కాదు. దానికి పుట్టుక లేదు, స్థితి లేదు, ఎదుగుదల లేదు, ఒదుగుద-దలలేదు, పెరుగుదల కూడా లేదు గనుక ఇది స్థిమితంగా ఉన్నది. దీనికి ఏ రకమైన గుణాలు లేవు. లేవా అంటే త్రిగుణాతీతంగా ఉన్నది. అవస్థాత్రయాతీతంగా ఉన్నది. కనుక ఈ అవస్థాత్రయాతీతమై త్రిగుణాత్మభావాన్ని దాటినటువంటి ఏ వస్తువైతే ఉన్నదో అది ఆత్మ. "ఇంతేనా?" అన్నది. తెలుసుకుంటున్నది "ఇంతేనా?" అంటున్నది. ఇంకొక మాట చెప్పాడాయన. ఈ ఆత్మ నేనుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే భగవాన్ రమణ మహర్షి ఆధునిక కాలంలో మానవుడి యొక్క ప్రథమ తలపు ఏది అనంటే నేను అన్నారాయన. ప్రథమ తలపు. మనం ఏదన్నా పని చేయబోతున్నాం. ఓ వంద మందితో కూడి పని చేయబోతున్నాం. కానీ మనం ఏమంటామంటే నేను అక్కడికి వెళుతున్నాను. నేను వెళుతున్నాను. ప్రతివాడూ నేను అనుకుంటూనే ఇక్కడికి వస్తాడు. కాబట్టి నేనులన్నీ ఏమిటంటే నేనులుగా భిన్నంగా ఉన్నాయి. శరీరాలుగా భిన్నంగా ఉన్నాయి. కానీ నేనుగా ఒక్కటిగా ఉన్నది గనుక ఆ నేనే నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒక స్ప్రుహ అన్నాడు. "నాయనా! ఈ నేనుని నేను ఎలా తెలుసుకోవాలి?" అని అడిగింది. భక్తి మార్గంలో ఉండాలమ్మా అన్నాడు. భక్తి మార్గం అనంగానే మనకు గుడి, పూజ, జపం, దానం, ప్రదక్షిణలు, వ్రతాలు, ముడుపులు, కొండ ఎక్కటం, కొండ దిగటం కదా. జోలె కట్టటం, జోలె విప్పటం ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. ఇవి ఏవీ భక్తి కాదు. భక్తి అండి అంటే ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అన్నివేళలా పరమాత్మతో తన చిత్తాన్ని మనీషా యత్తం చేయటం. అంటే జ్ఞానాధిక్యమైనటువంటి స్థాయిలో కేవలం ఓ పుస్తకంతోనో, ఒక శ్లోకంతోనో, ఒక చిన్న అనుభవంతో పరమాత్మతో కూడి ఉండేది భక్తి కాదు. జ్ఞానాధిక్యమై ఉండాలి. తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళేటువంటి ఒకానొక స్థితిలో ఒక సంస్థితమైనటువంటి స్థాయిలో పరమాత్మని ఉపాసనా మార్గంలో అనుభవించాలి. ఆ ఉపాసనా మార్గంలో ఆయన వేరు నేను వేరన్న భావన కాకుండా ఆయనలో నుంచే నేను వచ్చాను. ఏ బిడ్డనైనా అడగండి, నేను ఆ తానులో ముక్కనే అంటుంది. అంతేగా. తల్లిలో నుంచి ఎట్లాగైతే తనయుడో తనయో ఎట్లైతే వచ్చిందో తల్లికి బిడ్డకి సంబంధం ఎట్లా ఆ అభేదంగా ఉన్నదో అలాగే జీవుడికి పరమాత్మ కూడా అభేదమైన, అద్వితీయమైన, అద్వైత బ్రహ్మణీయ మనోజ్ఞమైనటువంటి స్థాయి ఏదైతే ఉన్నదో దాని పేరు మాత్రమే భక్తి. ఆ భక్తిలో పరమాత్మని ఉపాసన చేయటానికి ఆయన భావనకు దగ్గరగా ఉండటానికి పూజలు చేసుకుంటాం, సంతోషం. చేయకూడదని ఎక్కడా లేదు, చేయాలి. ఎలా చేయాలి అంటే ఇదే ముక్తినిస్తుందని కాక ముక్తికి వెళ్ళటానికి ఇదొక మార్గం అని పూజ చేయాలి. అలాగే దానం, త్యాగం, వ్రతం ఇవన్నీ కూడా సత్కర్మలు. ఈ సత్కర్మల వలన చిత్తశుద్ధి కలుగుతుంది. మనో మాలిన్యాలు నశించి ఒక నిర్మలమైన, నిశ్చలమైన, నిశ్చితమైన ఉ-నిరంతరమైనటువంటి ఒక ఆత్మానుసంధానం వైపు దారి తీస్తుంది గనుక, ఆ భక్తిలో పరమాత్మని ఒక విగ్రహంగా, ఒక బొమ్మగా, ఒక చిత్రపటంగా సంభావన చేసి దాని యందు మన మనస్సును లగ్నం చేస్తాం. ఆ కాసేపే ఆయన వేరు మనం వేరు. నిజానికి పూజలు అందుకుంటున్న వాడు ఆయనే, పూజ చేస్తున్న వాడు కూడా ఆయనే. కపిల సాంఖ్యంలో ఉత్తమోత్తమమైనటువంటి స్థాయి. అంతేతప్ప చేసేవాడు వేరు చూసేవాడు వేరు అని కాదు. ఆ చేస్తున్న వాడే చూస్తున్నాడు, చూస్తున్న వాడే చేస్తూ ఉన్నాడు. చేయకపోయినట్లయితే-- అందుకే స్వామి దీన్ని చాలా అందంగా ఎలా చెప్పారంటే, ఒక భక్తుడికి ఒక భగవంతుడికి ఉన్న relation ఎటువంటిది అంటే, a reaction, a reflection and a resound. sound ఉంది గనుక resound ఉంది. light ఉంది గనుక reflection ఉంది. అసలంటూ అది ఉన్నది గనుక మనమంటూ ఉన్నాం. బింబ-ప్రతిబింబ భావంతో ఉన్నాం. అద్దం ఉంది గనుక మనం ఉన్నామా? మనం ఉన్నాం గనుక అద్దం ఉన్నదా అంటే, మనం ఉన్నాం గనుక అది ఉంది, అది ఉన్న-ఉన్నది గనుక మనము ఉన్నాం. ఈ బింబ-ప్రతిబింబ భావంతో రెండుగా కనిపిస్తున్నాయి. ఈ రెండుగా కనిపిస్తున్నది ఒకటే అనేటువంటిది అది భక్తి యొక్క ఉత్తమోత్తమమైనటువంటి స్థితి. రెండవది, భక్తి పరిమళించినప్పుడు, ఒక పరిపాకమైన దశను చేరుకున్నప్పుడు అది ప్రేమగా మారుతుంది. వైష్ణవ సాంప్రదాయాన్ని తీసుకోండి. ఆ గొప్ప సాంప్రదాయంలో భగవంతుణ్ణి వాళ్ళు ప్రేమిస్తారు. పూజిస్తూనే, స్నానం చేయిస్తూనే, ఆయనకు బట్టలు కడుతూనే, ఆయనకు అగరుబత్తులు వెలిగిస్తూనే, ఆయనకు కైంకర్యం చేస్తూనే, నైవేద్యం చెప్తూనే-- చేస్తూనే, ఏం చేస్తారయ్యా అంటే ఒక బిడ్డగా చూస్తారు. భక్తిలో ఓ గురువు శిష్యుడు ఉన్నాడనుకుందాం. ఆ గురువు మామూలుగా లోకరీతిలో ఎప్పుడూ శిష్యుడు గురువు గారికి సేవ చేస్తూ ఉండాలి అని ఒక బోధ. కానీ గురువు ఏమనుకుంటాడంటే, ఈ శిష్యుడికి ఎప్పుడైనా నేను పూజ చేయగలుగుతానా అని అనుకుంటాడు. శిష్య పూజ important. ఎందుకంటే, లేదా అంటే శిష్య పూజ ఉంది. దానికి నండూరి రామకృష్ణమాచార్య గారు చక్కని పద్యం చెప్పారు. ఏమిటా పద్యం అంటే, అయ్యా అందరూ వచ్చి గురువు గారికి దండలు వేస్తారు, నమస్కారం పెడతారు, అంతా బానే ఉంది. ఇది ఎట్లా ఉన్నదంటే, ఇవాళ మంచి పెరుగు తిన్నాం అని ఒకడు వచ్చి చెప్తున్నాడు. కుండెడు పాలు, తోడు పెట్టటానికి ఒక చిన్న చుక్క. కుండెడు పాలు గురువుగారు గనక అయితే, శిష్యుడు అయినట్లయితే, ఆ తోడు చుక్క ఎవడంటే, ఇదిగో గురువుగారు. చుక్క ఎట్లాగపోయినా చుక్కే. చుక్క అంటే అందమైనది అని అర్థం. ఆ చుక్క చుక్కే, అది తోడు పెట్టగలదు. కానీ పాలే బాగా లేకపోతే ఏం చేద్దాం అని అడిగారు. కాబట్టి పాలు బాగుంటే ఆ ఒక్క చుక్క కుండెడు పాలని పెరుగుగా చేయగలదు గనుక, గురు శిష్య సంబంధం అంతా కూడా బింబ-ప్రతిబింబ భావంతో ఉంటుంది. అలాగే ఒక తండ్రి తన కొడుకు తన కంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు ఆంతరంగికంగా ఆనందాన్ని అనుభవిస్తాడు. దాని పేరు పుత్రాధిజ్జేయ పరాజయం. అది పరాజయం అంటే ఓటమి కాదు. తనను దాటి ఎదిగాడు గనుక తండ్రికి ఆనందం. అలాగే గురువు కూడా శిష్యాధిజ్జేయ పరాజయం. ఒక శిష్యుడు తనను దాటి ఉత్తమోత్తమమైనటువంటి కావ్య సృష్టి చేసినా, అధ్యాత్మ భూమికలో ప్రకాశమానంగా వెలిగిపోతున్నా గురువుకి ఆనందమే కానీ, గురు శిష్యులకు పోటీ ఉండదు. ఇది తల్లి, తండ్రి, బిడ్డల యొక్క అనుబంధంగా, పరమాత్మ-జీవాత్మల యొక్క సంబంధంగా ఉండాలి. దీని పేరు భక్తి. అంతేనా? అన్యభక్తి, అనన్యభక్తి, అనేకానేకమైన భక్తులున్నాయి దీంట్లో. మనకు తెలిసే తొమ్మిది, నవవిధ భక్తులు అన్నారు. అవన్నీ ఒక ఎత్తయితే, అసలు పరమాత్మతో మనకు ఉండవలసినటువంటి బంధం ఎలా ఉండాలి అంటే, ఆ పూజ టైంలో ఒక గంట సేపు ఆయనకీ మనకీ relation అని కాకుండా, అన్నివేళలా ఆయనతో మనం కూడి ఉండాలి. ఆయన భావం మనకుండాలి. ఆయనే నడిపిస్తున్నాడు, ఆయనే తినిపిస్తున్నాడు, ఆయనే కనిపిస్తున్నాడు, ఆయనే చూపిస్తున్నాడు. అన్నీ కూడా attributions అన్నీ కూడా పరమాత్మకు గనక చెందించి, నాదేం లేదన్నట్లుగా ఉండగలిగినట్లయితే దాన్ని భగవద్గీతలో ఆయన కర్మ సన్యాసం అన్నాడు. కర్మ చేయాలి, కర్మ చేస్తున్న కర్త, చేయిస్తున్న కర్త ఒకడున్నాడు అనేటువంటి భావనలో ఉండగలిగితే దాని పేరు పరిపూర్ణమైనటువంటి భక్తి. ఇక మూడవది, మూడవ స్థాయి, భక్తిలో ఒక emotional support కావాలి. అది ఎవరు ఇవ్వగలరు అంటే, అది ఎవరి దగ్గర సమృద్ధంగా ఉన్నదో వాళ్ళు ఇవ్వగలరు. ఒక బిడ్డకి ఒక తల్లి తండ్రి ఇవ్వగలరు. ఓ శిష్యుడికి ఓ గురువు ఇవ్వగలడు. అలాగే జీవుడికి పరమాత్మ మాత్రమే ఇవ్వగలడు. ఆ emotional support ఏమిటంటే, అలసిన వేళ, సొలసిన వేళ, కష్టం వచ్చిన వేళ, దుఃఖం ఆవరించిన వేళ, సంతోషం దొరకని వేళ, సంతోషం విడిన వేళ, ఆనందం కూడిన వేళ దానిని పంచుకోగలిగిన, శతాధికంగా పెంచగలిగిన ఒక వస్తువు కావాలి. ఆ వస్తువు పేరే సద్వస్తువు. ఆ సద్వస్తువే భక్తిలో ఉన్నటువంటి వాడు, అంటే నిజమైనటువంటి భక్తుడు ఆత్మగా సంభావన చేస్తాడు. ఈ మాటలన్నీ ఎవరు ఎవరికి చెప్తున్నారంటే, బిడ్డ తల్లికి చెప్తున్నాడు. కపిల మహాముని తన తల్లి అయినటువంటి దేవహూతికి చక్కగా చెప్తూ ఉన్నాడు. ఇక భక్తి అంటే ఏమిటో మనకు కొంత అర్థమైంది. అయి, నాయనా మోక్షం అంటే ఏమిటి? అందరూ దాని గురించి అంటారే. ఏమిటి మోక్షం అంటే మరణించాక స్వర్గానికి వెళ్ళటమా? నరకానికి వెళ్ళటమా? వైకుంఠానికి వెళ్ళటమా? ఏమిటి అంటే, ఇవి ఏవీ కాదమ్మా! స్వర్గ నరకాలు నీ మనసు ఉన్నంత కాలం ఉంటాయి. మనసు నశించిన తర్వాత స్వర్గం అంటూ నరకం అంటూ రెండు లేవు.మోక్షం అంటే మోహ క్షేమే మోక్షం. మోహం అంటే ప్రపంచంలో జీవుడు ఆశయా బద్ధతే లోకే కర్మణా బహు చింతయా. ఆశలేని మానవుడు లేడు. వాడికి ఆశ ఉండాలి. రేపు ఉంటాను అంటే వాడు బతుకుతాడు. రేపుడు-- ఈ రోజే నీకు ఆఖరి అంటే రేపు వాడు బతకడు. ఈరోజు మరణించి-- మరణిస్తాడు వాడు. కాబట్టి ఆశని ఆధారం చేసుకుని జీవించేటువంటి మానవుడు తన యొక్క కర్మకాండలన్నీ కూడా పరమాత్మ యందు మనస్సును పెట్టి కర్మ ఫలాన్ని ఆశించకుండా ఎవరైతే తమ జీవయాత్రని తామరాకు మీద నీటి బొట్టుగా సాగిస్తారో అది మోక్ష స్థితి. అసలు నాకు మోక్షం కావాలి అని కూడా అడగనక్కర్లేదట. ఎందుకనంటే పరమాత్మ యందు సమర్పణ చేసినవాడు, శరణాగతి పొందిన వాడు, వినయంగా ఉన్నటువంటి వాడికి మోక్షము సిద్ధమై ఉంటుంది. అందుకనే శంకర భగవత్పాదులు అంటారు, నాలుగు విషయాలు తెలుసుకొని పరమాత్మ భావనలో నిలకడ చెందినటువంటి మీరు ఆ శాస్త్రం, ఈ శాస్త్రం అని ఎందుకు పరిగెత్తాలి? సిద్ధాంతం సిద్ధంగా వడ్డించటానికి రెడీగా ఉంటే మళ్ళీ భిక్షాటనకు వెళ్ళవలసిన అవసరం ఉన్నదా? అంటారాయన. చాలా అందంగా. భిక్షాటనకి ఎవరు వెళ్తారు? అందుబాటులో లేనివారు, అవసరమైన వారు, ఎవరైనా పెడితే నాలుగు-నాలుగు ముద్దలు తెచ్చుకుందాం అనేవారు వెళతారు. సిద్ధాంతమే ప్రతిరోజూ సిద్ధంగా ఉంటే భిక్షాటనతో ఏం పని? అంటూ ఈ భక్తి సామ్రాజ్యంలో, దానిలో ఉన్నటువంటి వాడు మోక్ష సామ్రాజ్యంలోకి రావటానికి నీకు ఇవ్వబడినటువంటి శరీరమే అన్నీ సమకూర్చింది అన్నారు. చేతి మోచేయి నీకు తలగడ. ఓ మహారాజు గారు ఓ పెద్ద పట్టె మంచం ఓసారి ఊహిద్దాం, పడుకున్నాడనుకుందాం. అన్ని తలగడలు, ఆ హంసతూలికా తల్పం మీద వాడు పడుకున్నా మంచి నిద్ర రావాలి అంటే మన మోచేయి తలకింద పెట్టుకుంటే దానిని మించిన గొప్ప నిద్ర ఎవ్వరికీ రాదు. ఆ మోచేయి మహిమ అది. అది. కాబట్టి అది ఉన్నంగా ఇవన్నీ ఎందుకు? అడిషనల్. ఏది అడిషనల్ అంటే మోచేయి అడిషనల్ కాదు మోచేయి సహజం. అడిషనల్ మనమన్నీ కొనుక్కున్న డన్లప్పులు, స్లీప్ వెల్లు, ఆ స్లీప్ డౌన్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏది-ఏది ఉన్నదంటే పరమాత్మ. రెండవది ముంజేయి అనేటువంటి ఒక అక్షయపాత్ర, ఒక భిక్షాపాత్ర నీకు ఇవ్వబడి ఉన్నప్పుడు ఇది అక్షయం, ఇది భిక్ష. ఈ భిక్ష కూడా ఒక గృహస్తు దగ్గరికి ఒక నిజమైనటువంటి సన్యాసి మూడుసార్లే ఎలుగెత్తి పిలవాలి. మూడు సార్లు. భవతి భిక్షాందేహి అని ఆ మూడు-మూడవ పిలుపుకు కూడా గనుక లోపల నుంచి గృహిణి రాకపోతే ఆ ఇల్లు వదిలిపెట్టి రెండో ఇంటికి వెళ్ళాలి. అలాగే మూడు ఇళ్లలోనే ఆయన సంపాదించుకోవాలి. మూడు ఇల్లు ఇంటూ మూడు ముద్దలు. ముగ్గురు వేస్తే చాలు. మూడు మూళ్ళు తొమ్మిది. ఆ తొమ్మిది ముద్దలతో తన శరీరాన్ని తాను పోషించుకోవాలి. అంటే మానవుడికి ఇరవై నాలుగు గంటలు ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలి అంటే తొమ్మిది ముద్దలు చాలు. పిడికిళ్ళు. ఈ తొమ్మిది ము-ముద్దల వలన శరీరము, ఇందాక చెప్పిన పంచకోశాలన్నీ కూడా స్థిమితంగా ఉంటాయి గనుక దానిని ఎట్లా అందుకోవాలి అంటే ఈ ముంజేయి మించినటువంటి భిక్షాపాత్ర లేదు. ఇది అక్షయపాత్ర ఎందుకు అవుతున్నది అంటే స్వామి చెప్పారు, కుడిచెయ్యి సంపాదించటానికి ఇవ్వబడింది. ఎడమ చెయ్యి దీనికి తెలియకుండా దానం ఇవ్వటానికి ఇవ్వబడింది. అం-అంతేగాని మనం అన్నట్లు మా వాడు రెండు చేతులా సంపాదిస్తున్నాడంటే ఒకటి బ్లాకు, రెండోది వైటు. అది. ఆ రెండో చెయ్యి. ఆ రెండో చేతికి వాల్యూ లేదు. రెండో చేతికి వాల్యూ ఎప్పుడంటే కుడిచేతికి ఒక చేతికి తెలియకుండా దానం చెయ్యాలి.
SSSMC · audio
Bhagawata Navaneetham - 21
Bhagawata Navaneetham - 21
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 28:10
More in this series