No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాద్రి శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్త్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంవేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం సద్బ్రహ్మ స్వరూపాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణాల బిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ వ్యాసకృతమై బొమ్మెర పోతారామాచార్యులచే ఆందోళికరింపబడినటువంటి శ్రీమద్మహాభాగవతంలో భాగవత నవనీతంగా ఇవాళ ధ్రువుడి కథ చెప్పుకోబోతున్నాం. రామాయణం అది అఖండమైనటువంటి కథ రాముడి ప్రయాణం. గమ్యస్థానం చేరుకునే దాక ఆయన సాగించినటువంటి ఒక అధ్యాత్మ ప్రయాణం, ప్రస్థానం. కాబట్టి కథా కథన రీతంట ఒక సన్నివేశం తర్వాత మరొక సన్నివేశం ఏర్పడుతూ ఉంటుంది. భాగవతం ఒక కథా గుచ్ఛం, బొకే. దానిలో ఏ పువ్వు దాని అందం దానిదే, దేని గొప్పతనం దానిదే. ఏ భాగవతుడి కథ అయినా పరమార్ద్రమైనది గనుకనే భగవంతుణ్ణి మెప్పించగలిగినటువంటి దివ్య జీవన గాథలు. కాబట్టి నిన్న వీరభద్ర విజయం అయితే ఇవాళ ధ్రువుడు ఎట్లా వచ్చాడని, ఎట్లా వచ్చాడో వచ్చాడు అట్లా ఉన్నాడు అని. ఆ ఉన్నటువంటి ఆ ధ్రువుడు స్వామి అనుగ్రహం చూడండి ప్రతి దానిని మనం స్వామి భక్తులుగా స్వామిని పరమేశ్వరుడుగా భావించిన వాళ్ళంగా ఒక్క క్షణం గనక మన మనస్సుని ఆ విషయం మీద పెడితే అనేక రహస్యాలు మనకు తెలుస్తాయి. ఇవాళ పౌర్ణమి, ఇవాళ ధ్రువ తార చంద్రుడితో పోటీపడి వెలిగిపోతుంది గగన మండలంలో. అదే రోజున ధ్రువుడి కథ వస్తుందని మనం అనుకున్నామా? ఇది స్వామి దయ. ఎన్ని కోట్ల నక్షత్రాలు గగనాంతరాలలో ఉన్నప్పటికీ కూడా ధ్రువ నక్షత్రం మానవుడికి మార్గోపదేశనం చేస్తుంది. మనందరం పుట్టాం, కొన్నాళ్ళు ఉంటాం, ఏదో రోజు వదిలిపెట్టి వెళ్ళిపోతాం ఇది సత్యం. కానీ పుట్టటం, పెరగటం, పోవటం మాత్రమే మానవ జీవితానికి లక్ష్యం కాదు. లక్ష్య గమ్యాలు ప్రాపంచికంగా ఎన్ని ఉన్నా ప్రతి జీవుడికి కూడా ఒకే ఒక్క గమ్యం ఉన్నది. అది పరమోత్కృష్టమైనటువంటి అధ్యాత్మ పీఠంలోకి తాను ప్రస్థానం చెందాలి, అక్కడికి చేరాలి. అది చిన్న వయసులోనే గనుక ప్రారంభమైనట్లయితే ముదిమి నాళ్ళలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, పరమేశ్వరుడి యొక్క నామాన్ని, ఆ రూపాన్ని, ఆ భావాన్ని, తత్వాన్ని చక్కగా ఉడికి పట్టగలిగినటువంటి ఒక నేర్పు అప్పటికి మనకు తెలుస్తుంది. అందుకనే ఈ భాగవతం అంతా ఎక్కడి నుంచి పుట్టింది? అంటే నిజమకల్పతరోర్జలితం ఫలం వేదవేదాంతములు అనేటువంటి కల్పవృక్షం నుంచి జారినటువంటి ఒక పండు ఇది. జలితం కింద పడ్డది. ఫలం ఏం పడ్డదయ్యా? చెట్టు పడ్డదా? కొమ్మ పడ్డదా? అంటే పండు పడింది. పండు ఎలా పండింది అంటే శుకముఖాదంబృతద్రవసంయుతం చిలుక అనబడేటువంటి ఒక శుకుడు భారవత కల్పవృక్షం మీద కూర్చుని ఉన్నాడు. ఆ పండు తింటున్నాడు ఆయన. శుకుడి యొక్క ముఖం అంతా చూస్తే ఆ ఫలం ముట్టుకున్నందువలన దానిని కొట్టినందువలన ఆయన ముఖం అంతా కూడా భగవంతుని యొక్క భావన అనేటువంటి అమృతంతో తడిసిపోయింది అట. అది శుకముఖాద్ అమృతద్రవం అమృతద్రవ సంయుతం దాంతో కూడి ఉన్నది. అటువంటి ఆ పండు పడ్డది అనగానే ఏం చేయాలంటే కిభక్త భాగవతం రసమాలయం అసలు పండు కింద పడ్డది ఒక పండు అయితే భాగవతమేనే తాకితే ఆ అన్ని పండ్లు నావే అయిపోతాయి. కిభక్త భాగవతం రసమాలయం ఎవరు ముహురహో రసికా భువి భావుకాః ముహురహో ఆనందపడండయ్యా ఎవరు ఆనందపడాలి? రసికులైన మీరందరూ ఆనందపడండి. ఎవరు ఆ రసికులు? భగవంతుని రసము నందు రాసిక్యము కలిగినవారు. భగవంతుని యొక్క అమృతత్వం వైపు మనస్సుని ఆయత్తం చేసినవారు. భగవంతుడు తప్ప అన్యం లేదని ని-నికామమైనటువంటి జీవితాన్ని, భద్ర జీవితాన్ని గడిపేవాళ్ళు. అటువంటి వాళ్ళు ముహురహో రసికా భువి ఈ లోకంలో ఈ లోకం చేసుకున్న అదృష్టం ఏంటంటే భావుకాః మనస్సు ఇచ్చాడు కదా, విశ్లేషించే బుద్ధి ఇచ్చాడు కదా, అనుభవించవలసిన అంతరంగంని ఇచ్చాడు కదా పరమాత్మ. అసలు నీకు ఇవ్వనిది ఏమున్నది? కాబట్టి శుకుడంతటి వాడు అనుభవించినటువంటి భాగవత ఫలాన్ని మేము కూడా ఇవాళ అందుకోబోతున్నాం. ప్రతిరోజూ ఒక పండు మనం ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తున్నాం అంటే చేతికొచ్చే బత్తాయిను, చేతికొచ్చే ఆ స్వీట్ ప్యాకెట్ కాదు. అది ఏమిటయ్యా అంటే దాని నిండా భగవంతుని ప్రేమ ఉన్నది. మానవ రూపంలో ఉన్నవారు అందిస్తున్నటువంటి ప్రేమ ఉన్నది కాబట్టి ఆ ప్రేమని ఇంటిదాకా తీసుకుని, మోసుకుని వెళ్తున్నాము అని అర్థం. కాబట్టి ఇవాళ ధ్రువ ఉపాఖ్యానం ఇది. ఎవడు ఈ ధ్రువుడు అంటే ఒకడు ఉత్తానపాదుడు అనేటువంటి రాజు. సూక్ష్మంగా కథ. తర్వాత ఆ మాటలు చాలా బాగుంటాయి విందాం. ఉత్తానపాదుడు అనేటువంటి ఆయనకి ఇద్దరు భార్యలు. ఒక భార్య పేరు సునీత.ఒక ఆమె సునీతి నిజానికి, ఆ అది మార్చేసి సునీత అని పెట్టుకున్నారు, అర్థం ఏం లేదు దానికి. సునీతి, సురుచి ఇద్దరు. సురుచి అంటే బాహ్య వస్తువు, ప్రాపంచికమైన వస్తువు. మానవ జీవ లక్షణానికి గుర్తు సురుచి. దివ్య లక్షణానికి సునీతి. అందులో ఈ సురుచి అనేటువంటి ఆమెకి ఉత్తముడు అనే కొడుకు. ఈ రెండవ సునీతికి ఎవరు పుట్టారు అంటే ఎడుగో ధ్రువుడు. అంటే ఇద్దరు భార్యలు, వారి వలన కలిగిన ఇద్దరు బిడ్డలు. ఉత్తానపాదుడు రాజు. అందులో రాజు గారికి సురుచి అంటే చాలా ఇష్టం. ఇష్టం ఉన్న దాని కడుపున పుట్టాడు గనుక ఉత్తముడు అన్నా ఇష్టమే, ఆ కొడుకు అన్నా ఇష్టమే. అంటే కొడుకులు రెండు రకాలు ఉంటారు. ఒకడు pampered son, రెండో వాడు spoiled son అని. Pampered son ఏ రోజుకైనా spoiled son గా రూపాంతరం చెందుతాడు. "నువ్వు బాగా చదువుకో, వృద్ధిలోకి రా, పైకి రా, పేరు వంశం నిలబెట్టు" అనే మాటలు ఇద్దరికీ చెప్తారు తల్లిదండ్రులు. విన్నవాడు ఈ పాయలోకి వస్తాడు, వినని వాడు ఆ పాయలో ఉంటాడు. ఈ ఉత్తముడు రోజూ ఆయన సభలో కూర్చుని ఉంటే రాజు గారు రోజూ ఉద్యోగానికి వెళ్ళాలి కదా. వెళితే ఈ ఉత్తముడు అనేటువంటి వాడిని "రారమ్మా" అని పిలిచి అంకపీఠం మీద కూర్చోబెట్టుకునేవాడు. ధ్రువుణ్ణి దగ్గరకు రానిచ్చేవాడు కాదు. ఇవాళ ఆధునిక కాలంలో parenting అనే దాని మీద, దీని మీద కొన్ని లక్షల వ్యాపారం, కోట్ల వ్యాపారం జరుగుతున్నది. ఆ పిల్లల మధ్య మాత్సర్యాలు ఉండకూడదని, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అన్న భావంతో పెంచకూడదని, అందరూ సమానంగా పెంచబడాలని, ఒకవేళ మన ప్రేమ వారి యందు ఉన్నప్పటికీ కూడా అధికాధికంగా ప్రదర్శించకూడదని, ఇవన్నీ కూడా మనకు ధ్రువ ఉపాఖ్యానం చెప్తుంది. అయితే ఒక్కొక్కసారి శాపం కూడా జీవుడికి వరం అవుతుంది. ఎవరికి అవుతుందో తెలుసునా? ఉత్తముడికి. ఉత్తముడి పాలిటి శాపం ఏదో ఒక రోజున వాడికి వరం. అధముడికి ఇవ్వబడేటువంటి వరం ఎప్పటికైనా అది వాడి పాలిట శాపం, అంతే. దుర్మార్గుడికి ఇస్తాడు, సన్మార్గుడికి ఇస్తాడు వరాలు దేవుడు. ఎలా వాడుకున్నారన్నదే ప్రధానమైనటువంటిది కాబట్టి, ఈ ధ్రువుడు పాపం దూరంగా బిక్కుబిక్కుమంటూ నుంచునేవాడు. ఈ రెండో చోట ఖాళీగా ఉంది కదా, తండ్రి నన్ను ఒక్కసారి పిలిచి అక్కడ కూర్చోబెట్టుకుంటే బాగుండును అని వాడి కోరిక. తండ్రి తెలవడు. ప్రతిరోజూ ఇదే తంతు. ఇలా జరుగుతూ, జరుగుతూ ఉన్నటువంటి సమయంలో-- అయితే ఈ కథని రేపో మాపో రక్షా శాపంతో మరణించబోయేటువంటి పరీక్షిత్తుకి భాగవతంలో ఎందుకు చెప్పారు? అప్పుడు ఆయనకేం ఉపయోగం? ఆయన ఏం రాజు కాదు. ఆయన పిల్లల్ని ఆయన ఏం పెంచలేదు, పాడు చేయలేదు, ఏం చేయలేదు. ఈ కథ ఎందుకు చెప్పాడు అంటే ఇక్కడ ప్రతీకాత్మక, ఏదైనా సరే అనేక గాథలు పురాణంగా చెప్పబడినప్పటికీ కూడా పురాణ గాథలన్నీ ప్రతీకాత్మకము. రెండు రకాలవి. ఒకటి ప్రకాశంగా చెప్తారు, బయటకు చెప్తారు. కొన్ని రహస్యంగా చెప్తారు. ఈ రెండూ వేదంలో వాడబడినటువంటి మాటలు. ప్రకాశంగా చెప్పబడేది కథ. రహస్యంగా వినబడేది అంతరార్థం. కథగా చెప్తూనే ఒక నీతిని జాతికి బోధించాలి గనుక ఆ తండ్రి ఇద్దరు భార్యలు, ఇద్దరు కొడుకులతో సాగుతున్నటువంటి కథని పరీక్షిత్ మహారాజుకి ఎందుకు చెప్పాడు అంటే తర్వాత జనభరతుడి కథ ఒకటుంది, దానికి దీనికి లింక్ ఉన్నది. మళ్ళీ దేనికదే కాదు. మనం మన శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో ఏ కోరికతో ఈ దేహాన్ని వదిలి పెడతామో, ఎక్కడి వరకు మన సాధన పూర్తి చేసుకుని శరీరాన్ని వదిలి పెడతామో, అక్కడి నుంచి మళ్ళీ మనకు మరొక జన్మ ఇవ్వబడి మన కథ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దేనియందు మనస్సు వ్యామోహాన్ని చెందిందో దాన్ని మళ్ళీ పొందటానికి, మళ్ళీ పోగొట్టుకోవటానికి జన్మ ఇవ్వబడుతుంది గనుక జనభరతుడి కథకి ఇది నిజానికి బీజప్రాయమైనటువంటిది. ఇది ఒక intro, ఒక preamble లాంటిది ఈ ధ్రువుడి కథ. అయితే ధ్రువుడు లక్ష గమ్యాలు రెండు ఉన్నాయి చూడండి వాడు వచ్చాడు సభలోకి, అన్నాడు. ఓ రోజు, ఎన్నాళ్ళు ఉంటాడు? వాడు చిన్నవాడు. ధ్రువుడి ఈ కథ వ్యాసులవారు, బమ్మెర పోతన కూడా ఆ ధ్రువుడి వయస్సు కూడా నిర్ణయించారు. ఐదు సంవత్సరాల పిల్లవాడి కథ ఇది. అంటే వాడు అసలు ఎటువంటి స్థితిలో ప్రశ్న వేశాడో చూడండి. ఎట్లా సాధన చేశాడో చూడండి. వాడన్నాడు, "నేను కూడా ఒక్కసారి వేళ నీ దగ్గర కూర్చుంటాను" అన్నాడు. పాపం రాజుకి ధ్రువుడంటే ఇష్టమే. వీడంటే ఎంత ఇష్టమో సురుచి అంటే అంత భయం. చూశారా, ఎందుకు భయం అంటే, భయం ఎప్పుడు పుడుతుందో తెలుసునా? వ్యామోహము, వ్యసనము ఉన్నచోట భీతి కలుగుతుంది. అది లేనిచోట పరమేశ్వరుడి వలె జీవుడు సంచారం చేయగలడు. అందుకనే మహామంత్రార్ణవ గ్రంథంలో పరమేశ్వరుడికి ఎన్ని నామాలు ఇవ్వబడినప్పటికీ ఆయనకు ఇవ్వబడినటువంటి ఒక అక్షరంతో ఉన్న పేరు సహ, కూడి ఉన్నవాడు. సహ ప్లస్ ఐ, సాయి అన్నమాట. అది సహ మూలం, పురుష శబ్దం అది. అలాగే అక్షరాలు మనకు తెలుగులో యాభై ఆరు ఉన్నాయి, మిగతా భాషల్లో వాటికి కావలసినవి ఉన్నాయి. ఈ పంచాశత్ అంటే యాభై ఆరు అక్షరాలలో మూలం ఏదయ్యా అంటే ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనేది అకార, ఉకార, మకారాలతో కూడి ఉన్నది గనుక ఆ ఓంకారమే ప్రణవ శబ్దము, ప్రథమ శబ్దము, ప్రథమ తలపు కూడా అయినది. కాబట్టి ఇది ఓం, అది సహ అయినట్లే పరమేశ్వరుడి యొక్క స్వభావమే అని ఎవరన్నా గనక అడిగినట్లయితే ఉపనిషత్తులు వాటికి ఇచ్చినటువంటి పేరు అభీహి అన్నారు.నాభి, అభి అంటే భీతి, భీతి లేని వాడు పరమాత్మ అని అర్థం. భీతి ఆయనకెందుకు లేదయ్యా అంటే, ఆయనకసలేం అక్కర్లేదు. ఫలానా వస్తువు కావాలి అంటే పొందగలమో లేదో భయం. పొందాము, నిలబడుతుందో నిలబడదో భయం. నిలబడింది, ఎవడన్నా దోచుకుపోతాడో, దాచుకుపోతాడో భయం. చూసారా, వస్తువు రావటంతోనే భయం కాబట్టి పూర్ణమైన, శుద్ధమైన, చైతన్య స్వరూపమైన పరమాత్మకి ఇది కావాలి అని కానీ, ఇది అక్కరలేదని కానీ, వీడు నాకిష్టుడని కానీ, వీడు నాకు ఇష్టుడు కాని వాడని కానీ లేదు. సర్వజీవ సమ్మతమైనటువంటి సమభావాన్ని, ప్రేమభావాన్ని జీవుల యందు సమస్త సృష్టి యందు ఎనభై నాలుగు లక్షల జీవరాశి యందు ప్రకటన చేసేటువంటి వాడి పేరే పరమాత్మ. ఆ పరమాత్మే పాంచభౌతిక దేహాన్ని తీసుకుని వస్తే వాడి పేరు రాముడు, కృష్ణుడు, సత్యసాయి అన్నమాట. పాంచభౌతిక దేహం తీసుకొని రానంతవరకు స్వామి పేరు కూడా ఏమిటయ్యా అంటే సహ. ఉపనిషత్తు ప్రకారం స్వామి పేరేమిటి? అభి. అసలు ఇది కాదండి, నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన తత్వమైన స్వామి పేరేమి? ఓం ఇది. ఓం సహ అభి. ఈ మూడు పేర్లు స్వామికి ఇవ్వబడినటువంటి స్వామి వంటి అవతార మూర్తులకు ఇవ్వబడినటువంటి పేర్లు. కానీ మనుష్య దేహం తీసుకొని వచ్చారు. మనుష్య లోకంలో సంచారం చేయాలి. ఆ పేరు ఉండటానికి వీలు లేదు గనుక దేహానికి కూడా శరీరం ఉన్నది కాబట్టి ఓ పేరు. అందుకే స్వామి అంటారు. అన్నీ పెట్టు పేర్లే బంగారు, పుట్టు-పుట్టు లేని వాడికి పుట్టు పేరే లేదు అన్నారు. అన్నీ మనం పెట్టుకున్న పేర్లే. మనం పెట్టుకున్నవి కాస్త ఐదు అక్షరాలు, ఫైవ్ క్యారెక్టర్స్ దాటిపోతే, పన్నెండు దాటితే సెల్ కూడా ఒప్పుకోదనుకుంటా. చివర ఎక్కడో అక్కడ కోయమంటుంది అది. ఇండికేషన్ ఇస్తుంది, రికార్డు సేవ్ చేయదు. కాబట్టి పెద్దది ఉండటానికి వీల్లేదు, చిన్నది ఉండటానికి వీల్లేదు. లోకం గుర్తించేట్లుగా ఉండాలి. కానీ ఇప్పుడు చెప్పుకున్న ఈ చిన్న కథలో [గొంతు సవరించిన శబ్దం] చూడండి, అద్భుతమైన పేర్లు పెట్టారు ఆ పాత్రలకి. సురుచి, రుచి ఉంటే ఒకటికి రెండు సార్లు తింటాం కదా! పొరపాటున బాగుంది అంటే అయితే వేసుకోండి అంటాం. [నవ్వు] బాగా లేదు అంటే, అయ్యో నేను చేసింది బాగాలేదేమో అని దుఃఖిస్తారు. కాబట్టి ఈ సురుచి ప్రాపంచిక వస్తువుకి సంకేతం. సునీతి అంటే అసలే నీతి అందులో మంచి నీతి. మంచి నీతి ఏమున్నదయ్యా అంటే భగవంతుణ్ణి చేరుకో, ఎప్పటికైనా భగవంతుడంతటి వాడివి కదా! ఆ భగవత్ తత్వాన్ని ఎరుగు, భగవంతుడు ఉన్నాడని నమ్ము. హాయిగా నీ జీవితం గడుపు, నువ్వెందుకు మోస్తావు బలువంతా? చూసారా, ఇది సునీతి. ఈ సునీతిలో స్వామి చెప్పిన మూడు మాటలు గుర్తు పెట్టుకోవాలి. ఆ సునీతి ఉన్నటువంటి జీవుడు ఎవడైనా సరే పాపభీతి, సంఘనీతి, దైవ ప్రీతి. ఈ మూడు ఎక్కడి నుంచి స్వామి చెప్పారంటే ఉపనిషద్ వాక్యాలు ఈ మూడు. స్వామి నోట వచ్చేటువంటివన్నీ కూడా, మాటలన్నీ కూడా ఉపనిషత్తులలో నుంచే వస్తాయి. ప్రత్యేకించి రావు. కాబట్టి ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చినయి అంటే సునీతిలో నుంచి వచ్చినయి. ఇక తండ్రే ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడు అంటే ఉత్తానము, తెలిగేటువంటి పాదములు, దివ్యమైన పాదము అంటే పదము, పదము అంటే స్థిరము, స్థిరము అంటే పదవి. అక్కడ ఉండేవాడు. ఉన్-ఉన్నత పదవిలో ఉండేటువంటి వాడు గనుక ఉత్తానపాదుడైనాడు. సునీతి, సురుచి, ఉత్తముడు అంటే మంచి మంచి బాలుడు. వాడు ఒకడు కొడుకు. ఇక ధ్రువుడు, నిశ్చయ బుద్ధి కలిగిన వాడి పేరు ధ్రువుడు. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ధృడమైనటువంటి, నిశ్చితమైన, నిశ్చలమైన, అకుంఠితమైనటువంటి భావన ఎవరికి ఉన్నదో వాడి పేరు ధ్రువుడు. అందుకనే తారలు ఎన్ని ఉన్నా ధ్రువతార ఒక్కటే. అంటే అది పడదు, పతనం కాదు, గగన గగనాంతరాలలో, ఖగోళాలలో అత్యున్నతమైనటువంటిది, చంద్ర సమానమైనటువంటి కాంతి కలిగినటువంటిది, స్వయం ప్రకాశం కలిగినటువంటి నక్షత్రం అది. కనుక ఆ ధ్రువ నక్షత్రాన్ని గురించి ఇవాళ విచారణ చేయబోతున్నాం. కథంతా తెలుసు కాబట్టి ఆ కథలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విందాం. దానిలో ఇవాళ goal oriented, career oriented, life oriented అని పిల్లలకి చెప్తున్నాం మనం. చదువు కానీ goal oriented. ఏమవ్వదా అనుకుంటున్నాం. ఏమి కాగలడో వాడికి తెలియదు. ఏమి కాగలడో వాడి చేతిలో లేదు. కానీ మనం వాడిని అడుగుతుంటాం. లేదా చిన్నప్పుడు అడిగితే వాడు నువ్వేమవుతావురా అంటే నేను డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ని అవుతాను అంటాడు పాపం. వాడు అన్నాడో లేదో గాని వాడిని మన్నించం మనం. వాడేం కావాలో నిర్ణయించి మొదలు పెడతాం. కాబట్టి ఇక వాడికి యాతన ప్రారంభం. శ్రీరామ! చుట్టాం వాడిని వదిలిపెట్టేసాం. ఇక వాడలా యాతన పడుతూ ఉంటాడు. అవుతాడో కాదో తర్వాత. కానీ అన్ని శబ్దాలు పుట్టే నిశబ్దమందు, అన్ని యుగాలు మదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, అరయ నారాయణాన్వేషితం. ఎందుకొచ్చింది ఈ మానవ జన్మ అంటే పరమాత్మని ఎరుకలోకి తెచ్చుకోవటానికి, అనుభవంలోకి తెచ్చుకోవటానికి. ఎక్కడున్నాడయ్యా ఈ పరమాత్మ? అక్కడా? ఏం లేదక్కడ. పోనీ ఇక్కడా? ఇక్కడా లేడు. అక్కడా లేడు, ఇక్కడా లేడు కాదు. అక్కడా ఉన్నాడు, ఇక్కడా ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని అర్థం. ఆ అంతటా ఉన్నటువంటి వాడు నీలో లేకుండా ఎలా ఉంటాడు? నీలో కూడా ఉన్నాడు. కాబట్టి నేను నీలో ఉన్నానని స్వామి అన్నప్పుడు మనం భయపడక్కర్లే, అంతటా ఉన్న స్వామి నాలో కూడా ఉన్నాడు. ఈ ధృడమైనటువంటి ఆ ఎరుక కలగటానికి అరయ నారాయణాన్వేషితం. హనుమాచార్యులవారు ముప్పై మూడు వేల పైగా సంకీర్తనలు రాశారు.వెంకటేశ్వర స్వామిని అనేక దేవీదేవత స్వరూపాలుగా భావన చేసి లాలించి అనేక భక్తి రసమైన శృంగారమయమైన వైరాగ్య భూమికలో ఉన్న కీర్తనలు చేసి చివరికి అలసిన వేళ అంటే అనుభవం వచ్చిన వేళ ప్రపంచంతో అలసిన వేళే పరమాత్మతో యోగించిన వేళ అప్పుడు అన్నాడు చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం ఎక్కడున్నావ్ నా లోపల ఉన్నావు నువ్వు నా లోపల ఉన్న వాడిని వదిలిపెట్టి బయట ఉన్న ముప్పై మూడు కోట్ల దేవతల రూపంలో నిన్ను భజించాను కానీ నాలో ఉన్నావు చూడు ఆయనకు నీకు మంగళం ఇక తర్వాత ఆయన కీర్తన రాయలేదు కాబట్టి మనం కూడా ఈ అధ్యాత్మ సాధనలో ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్నెన్ని విచార ధారలలో మన జీవితం అంతా గడిచిపోయినా ఎరగవలసింది ఒక్కటే నీకు పరమాత్మ తల్లి తండ్రి గురువు దైవం ఈ నలుగురి కంటే నీవు ఎట్లాగైతే భిన్నం కావో అట్లాగే పరమాత్మ కంటే నీవు కూడా భిన్నం కాదు ఈ ధృడమైనటువంటి ఒక సంకల్ప శుద్ధి ఉండాలి అందుకనే ఇవాళ ప్రధానంగా యువ యువత ఏం చేయాలి అంటే లక్ష్య గమ్యాలు పెట్టుకోవాలి ఆ లక్ష్య గమ్యాలకి దేవుడి మీద భారం వేయాలి జీవ ప్రజ్ఞను కూడా ఉపయోగించాలి అందుకే స్వామి అంటారు జీవ ప్రజ్ఞ ప్లస్ దైవ ప్రజ్ఞ అదే ఒక దివ్యమైనటువంటి కలయిక కేవల జీవ ప్రజ్ఞతో అన్నీ సాగవు కేవలం స్వామి అనుగ్రహంతో సాధించలేం ఈ రెండు ఎట్లా అంటే బంగారపు కంచం అన్నారు అంచు ఉండాలి కదా ఆ అంచు ఉంటేనేగా పదార్థం బయటకు పడకుండా ఉండేది కాబట్టి జీవ ప్రజ్ఞ దైవ ప్రజ్ఞ కలిస్తే ఏమవుతుందో మనకు ధ్రువోపాఖ్యానాన్ని ఆ పోతనామాత్యుడు చెప్తున్నాడు ఒకనాడు సుఖలీల ఉత్తానపాదుండు నెరిప్రియురాలైన సురుచిగన్న కొడుకు ఉత్తము తన తొడలపై ఇడుకొని ఉపలాలనము చేయుచున్న వేళ అర్ధి తదారోహణాపేక్షితుండైన ధ్రువుని కనుంబని తివక వాడు చూస్తున్నాడట ఈ ఉత్తానపాదుడికి తెలుస్తోంది పాపం ధ్రువుడు కూడా వద్దామని దగ్గర కూర్చోవాలని వాడికి అనిపిస్తోందని కానీ లక్ష్యపెట్టక ఆదరింపకుండుటకు గర్వించి ఆ సురచియు సవతి బిడ్డండైన ధ్రువుని జూచి సవతి బిడ్డ స్టెప్ సన్ అంటామే వాడిని చూసి ఏమనిపిస్తుందంటే తండ్రి తొడ యెక్కు వేడుక తగిలనేని పూని నా గర్భమున నాడు పుట్టక అన్య గర్భమున పుట్టి కోరిన కలదనేడు జనకు తొడ యెక్కు భాగ్యంబు సవతి కొడుకా ఒరేయ్ ఆ తండ్రి తొడ మీద కూర్చోవాలి అని గనక అనుకున్నట్లయితే నావంటి త్రిమూర్తి గర్భాలయంలో ఉండవలసింది రా నువ్వు ఇక్కడ కాకుండా ఇంకెవరి గర్భంలోనో ఉన్నావు కనుక నీకు ఆ అదృష్టం పట్టలేదు అని అన్నది చూసారా అవమానించింది ఆమె నా గర్భంలో పుట్టిన వాడు ఎక్కడ కూర్చున్నాడో చూడు అనగానే వీడి జన్మ కంటే కూడా వాడికి ఒక రోషం ఒక అభిమానం కలిగింది తన తల్లిని ఇలా అన్నాడే అన్నదేవిడ అని ఆవిడ అహంకరించింది అన్నది అభిమానం లజ్జ రెండింటి కారణంగా ధ్రువుడు బిక్కబోయి కూర్చున్నాడు అప్పుడు అదిగాన నీవు అధోక్ష పద పద్మము రాశ్రయింపు పాయక హరిని ఆ ఉదరమున పుట చేయును వదలక అట్లైన ముదము వడసెదవు అనగా ఓ పని చెయ్ అయిపోయిందేదో అయిపోయింది హరినామ సంకీర్తనం చెయ్ హరిని తీవ్రంగా తపస్సు చెయ్ ఇది కావాలి అది కావాలి అని కాకుండా గనక అంటే ఎప్పటికైనా ఆయనకో దయ కలిగి నా గర్భంలో నీకు జన్మనిస్తాడు అప్పుడు నీ తండ్రి దగ్గరికి వెళ్లి హాయిగా కూర్చునే అవకాశం కలుగుతుంది అన్నది అది హెళనే ఎకసక్కమే నీ వల్ల కాదు అన్నట్లే కానీ ధ్రువుడికి మార్గోపదేశనం చేసింది అంటే హరిని గనక చేస్తే ఇప్పుడు మనం అంటాం చలిసా చదువుకోరా ఎనభై మార్కులు పైన వస్తాయి అంటాం అనగానే అప్పుడు వెళ్తాడు వాడు ఆంజనేయస్వామి గుడికి కదా ఊరికే నువ్వెళ్ళురా అంటే వాడు వెళ్ళడు ఆహా నీకు మార్కులు ఎక్కువ వస్తాయి అన్నప్పుడే వాడు అక్కడికి చేరుతాడు గనుక అలాగే వీడికి మార్గం చూపించింది చూపించి అని ఈ రీతి అపశ్యచనములు పిన తల్లి యప్పుడు జనకుడు విన గాథను ఆడిన దుర్భాషాఘన శరములు మనము నాటి ఆర్య బెట్టన్ మాటలు మునుకులై తోచినాయి శర సంధానం జరిగినట్టు బాణాలు వేసినట్టుగా వేసింది చిన్న చిన్న వయస్సు చిన్న మనస్సు పసి మనస్సు ఐదేళ్ల వాడు వాడు యాతన కలిగింది ఈ దేవిచ్చి ఇట్లా అంటుంది నాకు తండ్రి తండ్రి దగ్గర కూడా వెళ్ళనివ్వదా అని అంటుంటే అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళాడు మామూలుగా రోషం కలగగానే బయట ఎవరన్నా ఏదన్నా అనగానే వాడు ఏం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు వాడు మగ పిల్లవాడు గాని ఆడపిల్ల గాని తండ్రికి ఏం కంప్లైంట్ ఇవ్వరు కంప్లైంట్స్ అన్నీ ఇంట్లో మోస్తారు వాళ్ళు అలాగే వెళ్లి కూర్చుంటే సవతి ఆడిన మాటలు సారె తలచి కొనుచు తీర్చిన దుఃఖాగ్ని కుములుచుండె దావ పావక శిఖల చేతగిలి కాంతి విసతి కందిన మాధవీలతిక బోలే మాలతీమాధవునకు తీగుండేది తెలుగు వాళ్ళ ఇళ్లల్లో అది ప్రధానమైనటువంటి పూల చెట్టది ఆ పోతనామాత్యుడు మరి వాళ్ళ వాకిట్లో కూర్చొని అది చూసి రాసేసాడు రాసి ఏమన్నాడంటేఆ వేడి గాలులు తగిలినప్పుడు వాకిట్లో ఉన్నటువంటి మాధవీలత ఎట్లా ఉడికి పోయిందో, వాడిపోయిందో సునీతి హృదయం కూడా అలాగే పిల్లవాడికి జరిగినటువంటి యాతనను బట్టి అంత యాతన కలిగింది. అయితే సునీతి గౌరవప్రదమైనటువంటి తల్లి, అసూయ లేనటువంటి తల్లి, తన బిడ్డ యొక్క ఔన్నత్యాన్ని, ఉద్ధతిని కోరేటువంటి తల్లి, ప్రేమ గుండె నిండారింపుకున్నటువంటి తల్లి. నిజమే నీ కర్మ అనుభవించాను అనలే, ఉత్తమురాలు గనుక ఆవిడ ఏమన్నదంటే. అనగా ఈ దుఃఖమునకు పని లేదు అన్యులకు ఫలసొలయ బలవంతంబై తన పూర్వజన్మ దుష్కృత ఘనకర్మము వెంట నంటగా ఎవ్వల నన్. ఏదో పాత కాలంలో పాపం చేసి ఉంటాం రా! నీకు నాకు, ఇగో నా కడుపున పుట్టినందుకు నీకు, నిన్ను కన్నందుకు నాకు ఇదిగో యాతన కలిగింది. అయితే నాది వదిలేసెయ్, నన్ను ఆయన ఎప్పుడూ కూడా భార్యగా గౌరవించింది లేదు, దగ్గర తీసుకున్నది లేదు. కానీ నిను ఆడిన ఆ సురుచి వచనములు సత్యంబగును. నీ పినతల్లి అన్న మాట మాత్రం correct, అవే నిజమవుతాయి అవుగాక! సర్వశరణ్యుండ నగల హరిచరణంబులు గొను జనకుని అంక్రమెక్కగా తలచితేనిన్. ఇంకా నువ్వు గనక నీ తండ్రి యొక్క ఆ ఆ తొడల మీద కూర్చోవారని గనక నీకు కనిపించినట్లయితే, ఆమె చెప్పిందే నిజం సర్వశరణ్యుడు అయినటువంటి హరిని మాత్రం నువ్వు ఆశ్రയിస్తారా? అన్నది తల్లి కూడా. పినతల్లి దారి చూపించింది ఒక negative aspect, తల్లి దానిని positive aspect గా మార్చింది. నిజమే! నీ తల్లి తెలియదు, సవతి తల్లి, పినతల్లి ఆ తెలుసన్నదో తెలియక అన్నదో రా! ఇదిగో తిట్టు నీకు వరం అయింది. తిట్టు అంటే శాపం. వరం అయిందనా అనగానే పినతల్లియైనా సురుచి ఆదేశంబున అధోక్షజును ఆశ్రయింపుమని ఒక్కమాట చెప్పింది. అంటే పిల్లవాడికి చెప్పింది ఏంటంటే ఆ రోజు పిల్లవాళ్ళు వినేవాళ్ళు, గనుక చెప్పింది. వింటారు గనుక తల్లి చెప్పింది. చెప్తూ ఏం చెప్పింది అంటే మరి తపస్సు చేయాలంటే ఇందాక భజన పాడారే, యమునాతీర విహారంలో కృష్ణుడు విహారం చేశాడు అని మనం భజన విన్నాం. యమునా తటి ప్రాంతంలో హరి సంబంధించిన అటువంటి అవతారాలన్నీ అక్కడ ఆడినాయి, కూడినాయి. అది కృష్ణుడా? అది హరి హరి స్వరూపమా? ఎట్లా ఉన్నప్పటికీ కూడా నారాయణాంశ లో వచ్చిన అవతారాలకి యమునకి ఒక సంబంధం ఉంది. అయితే రాముడికి యమునకి సంబంధం లేదు. రాముడికి సరయుకి సంబంధం ఉన్నది. అలాగే నదికి పరమాత్మకి. పరికింపనీ విశ్వపరిపాలన మునకై అర్ధిగుణ వ్యక్తుడైన యట్టి నారాయణుని పాద నలినముల్ సేవించి తగ బ్రహ్మ బ్రహ్మపదంబు నుందే. నువ్వేం భయపడకు, హరిని కీర్తించు. కీర్తించినట్లయితే ఏం ఆయన్ని కీర్తించినందువల్ల కదా బ్రహ్మకి బ్రహ్మపదం వచ్చింది. ఘనుడు మీ తాత ఆ మనువు, వీళ్ళంతా మనువంశం వాళ్ళు. మీ తాత మనువు కూడా సర్వాంతరయామిత్వమగు ఏకమైన దృష్టి చేసి యాగముల యెదించితా భౌమ సుఖముల, దివ్య సుఖముల, మోక్ష సుఖముల, జీవుడు మూడు సుఖాలు పొందాలి. భౌమ సుఖం పొందాలి. అంటే భూలోకంలో ఇహలోకంలో కూడా సుఖంగా ఉండాలి.
SSSMC · audio
Bhagawata Navaneetham - 27
Bhagawata Navaneetham - 27
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 27:51
More in this series