No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం పురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం సబ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ వేదవ్యాస ప్రోక్తమై బ్రహ్మర పోతనామాత్య కృతమైనటువంటి శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో ప్రవేశించాం. దశమ స్కంధంలో ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉయ్యాలలో ఊగుతున్నటువంటి వేళ అక్కడ ఆగాం మనం. ఉయ్యాలలో ఉన్నవాడు దిగాలిగా. దిగిన తర్వాత ఏం చేయాలి? సరే ఉయ్యాలలో ఉన్నప్పుడే సుఖం ఉయ్యాల దిగటం అంటే సుఖం వదిలిపెట్టడం అన్నమాట. నాలుగు వైపులా నాలుగు దిక్కులా కాపాడే నాలుగు తాళ్లు మనకు దూరం అయిపోతాయి. నేలమీద నడుస్తాం ప్రాపంచికమైన అనేక విన్యాసాలు అనేక అనుభవాలకి మానవుడి జీవితం విలవుతూ ఉంటుంది. ప్రతి అనుభవంలో నుంచి ఒక ఉదాత్త శైలిలో ఒక ఉదాత్త స్థాయిలో మహోదాత్తమైనటువంటి ఆంతరంగిక సిద్ధి శుద్ధి జరిగేలాగా జీవుడు నిరంతరము కూడా భగవన్నామస్మరణం చేయాలి శరణు పొందాలి సమర్పణగా ఉండాలి వినయశీలురుడిగా ఉండాలి. ఏది ఎట్లా జరిగినా ఇదంతా పరమేశ్వరుడి యొక్క దివ్యలీలా వైభవంగా మనం భావన చేయాలి. ఈ నేపథ్యంలో భాగవతంలో కథ కాకుండా అంతరార్థంగా విచారణ చేశామని అన్నా. శ్రీకృష్ణ పరమాత్మ ఉయ్యాలలో పడుకున్నప్పుడు అంగాంగీ భావంతో ఎటువంటి దేవతలను మనం దర్శనం చేయాలి. ఒక పసి పిల్లవాడిని ఉయ్యాలలో ఊగుతున్నప్పుడు పరమాత్మకి సేవ చేసినట్టుగా చేయాలి. ఒక్క తల్లి ఆ పని చేస్తుంది. తండ్రికి అవకాశం ఉండదు తల్లి మాత్రం ఆ బిడ్డ పరమాత్మ యొక్క ప్రతినిధిగా బావి-- బావిస్తుంది. పరమాత్మ తనకు అనుగ్రహించినటువంటి ఒక వరదానంగా ఫలంగా భావన చేసి ఆ బిడ్డ తనంతట తాను కాళ్లమీద నిలబడి సచ్చరిత్రుడు కావాలి అని అన్నివేళలా ఒక ఉదాత్తమైనటువంటి స్త్రీ కోరుకుంటూ ఉంటుంది. యశోద పరిస్థితి అంతే. యశోద నిన్న చెప్పుకున్నాం ఆవిడ మంత్రం. యశోదతో ఉన్నటువంటి నందుడు గురువు. ఈ మంత్రము గురువు కలిసి ఒక జ్ఞాన స్వరూపుడిని తయారు చేసినారు. ఈ జ్ఞాన స్వరూపుడుగా తయారైనాడా అంటే తయారైనదే జ్ఞాన స్వరూపంగా ఇక్కడికి వచ్చింది. మహోత్కృష్టమైనటువంటి భగవద్గీతని మహాభారత సంగ్రామ వేళ బోధించటానికి ముందు జరిగినదంతా కూడా పూర్వరంగం. పరమేశ్వరుడి యొక్క దివ్యలీలా వైభవం అది. ఆ వైభవ స్థాయిని మనం విచారణ చేసినట్లయితే భాగవత కథలో ఆయన ఒక్కొక్కళ్ళని చంపుతూ వెళ్లినట్టుగా కనిపిస్తుంది మనకి. రాముడు అన్నాడు ఈ మాటే. తాటకుని చంపగానే విశ్వామిత్రుడితో శ్రీరామచంద్ర ప్రభువు అన్న మాట ఏమిటి? నేను ఒక స్త్రీమూర్తిని చంపటానికై అవతారం తలంచి వచ్చింది ఇందుకా నా జన్మ అన్నాడు. అంటే పంచభౌతిక దేహాన్ని ధరించిన అటువంటి పరమాత్మ కూడా ఒక్కొక్కసారి మాయావరణం కారణంగా స్మృతిని కోల్పోయి ప్రాకృతమైనటువంటి అనేక భావనలకు లోనై తాను కూడా ప్రతిస్పందిస్తూ ఉంటాడు. ఆ ప్రతిస్పందన ఫలితమే రాముడి యొక్క ఆ వైరాగ్యం. ఆయన నిత్య వైరాగి మనో సన్యాసి రాముడు. అసలు రాముడు ఎవడుంటే ఆయన సన్యాసి. ఏ సన్యాసి? మనో సన్యాసి ఆయన. మనస్సును సన్నిహించాను అన్నాడు ఆయన. మనస్సును సన్నిచిన్-- సన్నిహించిన వాడు జీవన్ముక్తుడు అని అర్థం. తాటక సంహారం చేసిన, శుభాహువును చంపిన, శూర్పణఖ నాభిభంగం చేసిన, ఆల్య శాపవిమోచనం చేసిన, రావణ యుద్ధంలో రావణుడిని హతం చేసిన, పురుషోత్తముడు అయినటువంటి ధర్మమూర్తిగా ఆ యుగంలో నిలబడిన, ఎలా చేశాడు ఆయన? వైరాగివేళ చేశాడు. ఎక్కడా తాను కర్త్రుత్వాన్ని వహించలేదు. కర్త్రుత్వం వహించక పోయినట్లయితే జీవికి సుఖం ఎక్కువ. అంటే కర్త్రుత్వం అంటే ఏం లేదు. నేను చేశాను, నేను చేశాను కొంతమంది ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. ఇది నేను చేశాను, ఇది నేను చేశాను, ఇది నేను చేశాను. వదిలిపెట్టమన్నాడు ఆయన. ఆ నేను చేశాను వదిలిపెట్టి నిన్న రెండు విషయాలు నిన్న నవనీతం మన ఇంటికి పట్టుకెళ్ళిన రెండు చిన్న వెన్న ముద్దలున్నాయి. జ్ఞాని ఏమనుకుంటాడు అంటే పరమేశ్వరుడు నన్ను సర్వదా రక్షిస్తూ ఉంటాడు అని జ్ఞాని అనుకుంటాడు. అనన్య భక్తి పారంగ్యంలో పతాక స్థాయికి వెళ్ళిన వాడు అయ్యో భగవంతుడికి ఏమన్నా అవుతుందేమో అనుకుంటాడు. అది భగవంతుడికి ఏం కాదు అని స్థిమితమైన మనసున్నవాడే జ్ఞాని అవుతున్నాడు. ఈ అనన్య భక్తి, ఈ జ్ఞానం ఈ రెండూ కూడా చాలా దగ్గర సంబంధంగా కనిపిస్తాయి. ఆయనకేవండీ ఏం కోరుతున్నాడు? మా దేవుడు బాగుండాలని కోరుకుంటున్నాడు. ఆయనకు ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాడు. ఆయన మనకట్లాగే పరిగెత్తాలని కోరుకుంటున్నాడు. ఇది జ్ఞాని లక్షణం కాదు. జ్ఞాని ఆ జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉంటాడంతే. ఆ పరమాత్మ నడిచాడా లేదా, వచ్చాడా లేదా, చూశాడా లేదా, నిన్నట్లా నిన్నటికి, ఇవాళ్టికి ఏమన్నా తేడా ఉందా? ఏమీ పట్టదాయనకి. అనన్య భక్తి ఉన్నవాడికి బరామీటర్ ఎప్పుడూ అక్కడుంటుంది. నిన్న బాగున్నారే, ఇవాళేమిటో డల్ గా ఉన్నారంటాడు. చూసే చూపు అంతే. పరమాత్మ ఎలా ఉన్నాడంటే ఆయన ఎలా ఉండదలుచుకున్నాడో ఆరోజుకు అట్లా ఉన్నాడు అంతే. ఆ లక్ష్య లక్షణాల రెండింటినీ గమనించుకుంటూ నిన్న విచారణ పూర్ణం చేసుకున్నాం.దిగమకల్పటరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం దివత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహా ఈ లోకంలో ఉన్న వారందరికీ ఆనందం కలిగించేది భాగవతం. ఇవ్వాళ వసుదేవుడి దగ్గరికి, కంసుడి దగ్గరికి కప్పం కట్టడానికి వెళ్ళిన నందుడు వసుదేవుడితో కూడా కాసేపు మాట్లాడాడని, ఆ మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ వ్రజభూమికి తిరిగి వచ్చాడని, వ్రజభూమి అంటే అది ముముక్షు భూమి అని, మధురా అని పేరుతో ఉన్నప్పటికీ కూడా తామసంతో కూడిన కంసుడు అక్కడ రాజ్యం ఏలుతున్నాడని, ఈ రెండింటికీ మధ్య కాలము అనేటువంటి యమునా ఒక నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నదని, కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చినటువంటి పరమాత్మకి కాలము అధీనమే కాబట్టి ఆ కాలరాత్రి, ఆ కాలరాత్రి, ఆ మధ్యరాత్రి, ఆ నక్షత్రంలో వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మను తీసుకుని వెళుతున్నప్పుడు కాలమే ఆయనకు ఎడమిచ్చి పక్కకి తప్పుకున్నది. ఎందుకంటే ఆయన అవతార కార్యక్రమంలో కాలము అడ్డం రావటానికి వీల్లేదు. వీలైతే కాలము ఆయనకు సహకరిస్తుంది. కాలం కూడా ఆయనకు ఒక ఉపకరణం అవుతుంది. అందుకనే జ్ఞాని యొక్క సంకల్పాలు జగద్ధితంగా ఉంటాయి. జగత్ కల్యాణం కోరి ఉంటాయి. జగత్తు అన్నివేళలా బాగుండాలి అని కోరుకుంటాయి. మానవుడు సాధారణ జీవుడి యొక్క సంకల్పాలన్నీ "ఈ పని చేస్తే నాకు ఏం లాభం వస్తుంది" అన్న ఆలోచనలో ఉంటాయి. "నాకేదో కావాలి" అని చేసినట్లయితే ఆ కార్యము సిద్ధించదు. దానికి ఫలితం లేదు. కర్మకాండ, కర్మయోగం సాగిస్తూ వెళుతూ ఉండాలి మన దారిన మనం. రావలసిన ఫలాలు అందుకుంటూ ఉండాలి. అందుకున్నవన్నీ పంచిపెడుతూ ఉండాలి. అందుకున్నవన్నీ దాచిపెట్టకూడదు. అందుకే స్వామి అన్నారు "దాచిపెడితే అన్నీ పాచిపోతాయి" అన్నారు. అది బ్లడ్డు, దుడ్డు రెండూ చెప్పారు కదా. బ్లడ్డు దాచిపెట్టుకోవడానికి లేదు ఇవ్వాలి. ఇస్తే కొత్త రక్తం వస్తుంది. దుడ్డైనా అంతే, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అన్నారు. దాచిపెట్టు లాకర్లో పెట్టు అలాగనే చూస్తూ ఉంటే అదేం పెరగదు, పిల్లలు పుట్టదు కదా. ప్రపంచంలోకి దాన్ని పంపించాలి. దానికి ఒక value addition ఇవ్వాలి, దానికి గౌరవం ఇవ్వాలి. చక్కని చోట వాడాలి, జాగ్రత్తగా వాడాలి. అక్కరకు వచ్చేట్టుగా వాడాలి. ఇంకొకరికో, మనకో ఆనందం కలిగేలా దాన్ని వాడుకుంటూ ఉండాలి. ఇది వినియోగం. వినియోగం వేరు, వితరణ వేరు. వితరణ అంటే ఇచ్చి ఉరుకోవటం. వినియోగం అంటే సద్వినియోగం అయ్యిందా కాలేదా. అందుకనే business principles లో కూడా "trust but have a check" అని ఒక మాట ఉంటుంది. మనం అందరినీ నమ్మాలి but have a check. చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏదీ దుర్వినియోగం కాదు. అది పరమాత్మ శక్తి అయినా, జీవుడి తపస్సు అయినా, సాధకుడి సాధన అయినా, భాగవతుడి యొక్క పరమేశ్వరుని యందున్న అనన్యమైన భక్తి అయినా ఇవన్నీ ఒకటే. అనేటువంటి ఆ భావనా సూత్రం ప్రకారంగా ఆ నందుడికి వసుదేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే "కాలం ఎప్పుడూ ఒకలా ఉండకపోవచ్చేమో నందా. నీ పిల్లలు బాగా పెరుగుతున్నారు అని నువ్వు చెప్పావు, నాకు చాలా సంతోషం కలుగుతుంది. కానీ ఆ పిల్లలు పెరిగేటువంటి చోట ఏ రకమైన ఉత్పాతాలైనా జరగవచ్చేమో. కొత్తవారు ఎవరైనా రావచ్చేమో చూసుకో" అన్నాడు. కొత్తవారు ఎవరో అక్కడ పుట్టారు అంటే ఇక నందుడు ఎవర్నీ లోపలికి రానీవ్వడు. ఎవడూ గనక లోపలికి రాకపోతే వ్రజభూమి విస్తారం కావడానికి వీల్లేదు. కాబట్టి అందరూ వస్తుండాలి. ఆ వస్తున్న వాళ్ళ మీద ఒక జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచమన్నాడు. ఇంతలోనే నందుడు రానే వచ్చాడు. నిన్న చెప్పాం ఏడు ఆహ్ శിലశైలాలను నిర్మాణం చేశాడని, దాని నిండా బంగారం ఉంచాడని, సుమారుగా ఒక లక్ష గోవులను దానం ఇచ్చాడని, ఆ నందుడి ఆనందమే పరమానందంగా భాసిల్లిందని విచారణ. అయితే స్వామి ఒక అందమైన మాట చెప్పారు. మనందరం గుర్తుపెట్టుకోదగిన మాట. "A calamity is a very short interval between two pleasures. A pleasure is a small calamity between two calamities." అది pleasure కూడా కాదన్నారు. రెండు దుఃఖాల నడుమ సుఖం, రెండు సుఖాల నడుమ ఒక దుఃఖం. అవి ఎప్పుడూ పొంచి ఉంటాయి. ఇదే ఆనందం, ఇది ఇట్లాగే ఉంటుంది అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే life is never straight. It is transitional. ఒక sound wave లాగా వెళుతుంది. దాన్నే మనం ఉదాత్త, అనుదాత్త అని రెండు పేర్లు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. ఆ sound wave లో ఒకటి పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళింది అంటే కిందికి రావాలి. కిందికి వస్తున్నది అంటే పైకి వెళుతుంది అని అర్థం. అందుకనే "a winner is always a potential loser. A loser is always a potential winner." ఈ రెండింటినీ గమనించుకున్నట్లయితే నెమ్మదిగా సరే గోపగోపికలంతా వస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లావణ్యాన్ని, ఆ మౌధ్యాన్ని, ముగ్ధత్వాన్ని, ఆ శిశుత్వాన్ని, పశిత్వాన్ని, పరమతత్వాన్ని సాకారాంగా, ఒక తేజస్వరూపంగా, సర్వాంగీణమైనటువంటి మనోజ్ఞ సౌందర్య శరీరి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకుంటూ వాళ్ళ ఆనందంలో వాళ్ళున్నారు. ఆ ఆనందం ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి అజాగ్రత్త వైపు దారి తీస్తుంది. మహదానందంలో ఉన్నాం అనుకోండి. మన ఇంట్లో పెద్ద పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఒక రెండు వందల మంది మన ఇంట్లోకి వచ్చారు. మన బీరువాల తాళాలు వేశామా లేదా, పరుపు కింద పెట్టిన నెక్లెస్లు ఉన్నాయా లేదా పట్టించుకోం. అసలు ఎవడూ లేనప్పుడు ప్రతి పది నిమిషాలకి అల్లది ఉందో లేదో చూస్తుంటాం. చూడవలసినవేళ చూడం, చూడనక్కరలేని వేళ చూస్తూ ఉంటాం. ఎందుకని అంటే ఇంతమంది ఉన్నారు, దొంగ ఎలా వస్తాడని. అసలు ఆ దొంగ వాళ్ళ మధ్యలోనే ఉంటాడు అని తెలియక. అది. కాబట్టి అలా వచ్చిందే పూతన.అలా పూతన ప్రవేశించింది. ఎలా ప్రవేశించిందది? అక్కడక్కడ-అక్కడక్కడ కంసుడి మరణానికి కారణమైనటువంటి నవ శిశువులందరినీ వధిస్తూ వచ్చింది, తింటూ వచ్చింది. తినటం అంటే ఒకే రకంగా కృష్ణుడి దగ్గరకు వచ్చినట్టుగా రాలా, బహురూప వేషధారిణి అది. ఏ రకమైన రూపం కావాలంటే కామరూప విద్యా రహస్యం తెలిసింది. పరకాయ ప్రవేశం చేయగలిగినటువంటి కొన్ని క్షుద్రమైన విద్యలు తెలిసినటువంటిది గనుక negative energy కి సంకేతంగా పూతన వచ్చింది. ఈ negative energy ని పంపిన వాడెవరంటే negative energy కి మూలమైన కంసుడు. వాడు తామసం, వాడి పనుపున వచ్చినటువంటి పూతన కూడా తామస గుణ ప్రధాన సంపన్నమైనది గనుక అది అనేకమైనటువంటి, అది అనేటువంటి మాట ఎందుకు వాడుతున్నాం అంటే ఆమె స్త్రీమూర్తి కదా! జ్ఞానులు అది, ఇది అనకూడదు కదా! వాడు, ఆమె అనాలి కదా! అంటే ఇక్కడ ఆమెను తర్వాత పరమ భాగవతోత్తముడైన వేదవ్యాసుడు, బొమ్మల పోతనామాత్యుడు అసలు పూతన ఎవరో చెప్పినప్పుడు పూతనకి నమస్కరించబోతున్నాం ఇవాళ మనం. అది. ఎప్పుడన్నా నమస్కరించేటట్టుగా behave చేసిందా? కానీ అసలు విషయం తెలిసినప్పుడు నమస్కరిస్తాం. అది. ఇక్కడే వచ్చింది. ఎక్కడా కంసుడి మాట లేకుండా చాయిపోతున్నది, పిల్లలంతా దాని నోట్లోకి వెళ్లిపోతున్నారు. చంపుతున్నది. ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నది. అట్లా వస్తూ-వస్తూ ఏ ప్రాంతంలోకి వచ్చిందంటే వ్రజభూమిలోకి ప్రవేశించింది. ఆ వ్రజభూమిలో ప్రవేశించగానే దానికి మనం అనుకున్నాం అది ముముక్షు ప్రదేశము అని పేరు పెట్టుకున్నాం. ముముక్షు ప్రదేశాలు కొన్ని ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు పరమ ప్రశాంతమైనటువంటి ఒక చిత్తం మనకు ఏర్పడుతుంది. మన ఆందోళనలన్నీ కూడా అణగి ఉంటాయి. మనస్సుకు ఏర్పడిన అనేకమైన వృత్తులు నెమ్మదిగా నశిస్తూ వస్తాయి. మనకు తెలియకుండానే ఒక శాంతి పరిఢవిల్లుతుంది. అది దివ్యమైనటువంటి ఆవరణ ప్రభావం. ఆ ఆవరణ ప్రభావం ఎవరి వలన ఏర్పడుతుందంటే దానికి అధిష్టానమైన వ్యక్తి వలన ఏర్పడుతుంది. ఇవాళ వ్రజభూమికి భౌతికార్థంలో ఎవడు యజమాని అంటే మహానందుడు, నందుడు. నందుడు ఆ ఊరికి అధికారి. కానీ నందుడికి ఆనందం ఇచ్చేవాడెవడు? పురుషోత్తముడైనటువంటి కృష్ణ పరమాత్మ. ఆయనే అక్కడ ఉయ్యాలలో ఉన్నాడు గనుక వ్రజభూమి అంతా ప్రశాంత భూమి అయింది, ప్రసన్న భూమి అయింది, పవిత్ర భూమి అయింది, పావన భూమి అయింది, తపోభూమి అయింది, ధన్యభూమి అయింది, యోగ భూమిక కాబోతున్నది. ఆ యోగ భూమికలోకి ఎప్పుడైతే పూతన ప్రవేశించిందో, ఎక్కడా ఏ ఇంట్లోనూ స్త్రీమూర్తి కనపట్టలేదట. స్త్రీమూర్తి కనపట్టలేదు, చిన్నపిల్లలు అసలు కనపట్టలేదు. ఇదేమిటి అసలు? అంటే వ్రజభూమిలో అసలు సంతానమే కలగలేదా? ఎక్కడా విస్తారమైనటువంటి సంసార ప్రయోగం జరగలేదా? ఏ రకమైనటువంటి expansion లేదా అంటే అక్కడ ఇద్దరు బాలురున్నారు. ఒకడు బలరాముడు, రెండవవాడు కృష్ణుడు. వాళ్ళిద్దరూ ఉన్న కారణంగా అసలు అక్కడ ఎవరికీ కూడా పిల్లల్ని కనాలన్న ఆలోచన కూడా పోయిందట స్త్రీమూర్తులకి. ఎందుకని కలిగింది? అంటే ఆ వచ్చిన వాళ్ళంతా కూడా వైరాగ్య భూమికలో నిలకడ చెందినటువంటి యోగులు గనుక, లేదా యోగినులు గనుక వారికి సంసారం పట్ల అపేక్ష లేదు. నాకు పిల్లలు కలగాలి, నేను తల్లిని కావాలి లేకపోతే నా జన్మ వృథా అని వాళ్ళు అనుకోవట్ల. నేను పుట్టాను, వచ్చాను, పరమాత్మ ఇక్కడున్నాడు, వాడితో నేను ఎలా ఆడుకోవాలి, వాణ్ని నా సొంతం ఎలా చేసుకోవాలి అన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆవరణం చుట్టూనే అందరి ఆలోచనలు సాగుతున్నాయి. దానికి మూలమైనటువంటి, శేష భాగమైనటువంటి బలరాముడి యందు బలము చేత, రమ్యత చేత, సంకర్షణ చేత పరమాత్ముడికి అన్నగా వచ్చాడాయన. మామూలుగా వచ్చాడా? అటు బలరాముడు మంచి అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉన్నాడు బలరాముడు. బలరాముడు అంటే మనకెంత గడ్డాలు, మీసాలు పెట్టి చూపిస్తారు, అట్లా లేదాయన. కృష్ణుడి లాగానే ఉన్నాదాయన కూడా. కానీ కృష్ణుడు నీలదేహ ఛాయలో ఉన్నాడు. ఆ నీల వర్ణ ఛాయలో ఆ దేహంతో ఉన్నాడు. ఈయన మెరిసిపోతున్నటువంటి పసుడి వర్ణంలో బలరామ దేవుడున్నాడు. ఆయన్ని కూడా బలరాముడు అనరు, బలరామ దేవుడు అంటారు. ఆ బలరామ దేవుడు అంటే దేముడు అనే మాట లేదు. దేముడు అని రాయకూడదు, దేవుడు అని రాయాలి. దేవుడు అంటే ఆడేవాడు, ఆడించేవాడు అని అర్థం. అది. ఈ పరమాత్మ చేసిన ఈ సృష్టి అంతా కూడా ఒక-ఒక క్రీడా స్థలం. ఇక్కడ ఆడుతున్న మనమంతా ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళమే. మరి ఎలా ఆడుతున్నామయంటే ఆయన ఆడిస్తున్నాడు గనుక ఆడుతున్నాం. ఆడిస్తున్నవాడు కనపడడేమి అని, అసలు వాడు ఎందుకు కనపడాలి? పోనీ కనపడితే ఏం చేయబోతున్నాం? కనపడకుండానే ఇంత ఆట ఆడిస్తున్నాడే, కనపడితే ఏం చేస్తాడు అని. అందుకే ఆయన కనపడడు. కనపడితే ఇక ఆయన్ని ఆట ఆడనివ్వం మనం. అందువల్ల ఆయన పనిలో ఆయన, మన పనిలో మనముంటాం. అటువంటి ప్రదేశంలో పూతన ప్రవేశించింది. ప్రవేశించి ఎక్కడున్నారు ఈ స్త్రీమూర్తులంతా అంటే యశోద ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారట. తిరుగుతూ ఏం చేస్తున్నారు? మనం ఎప్పుడూ చెప్పుకునేది, జిహానం జిహానం సుజానేన మౌజ్యం దుహానం దుహానం సుధాం వేణునాదై లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమే తన్ నమస్తాః అంటున్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముగ్ధత్వం పుట్టినప్పటి నుంచి అట్లాగే ఉన్నదట. ఏ తేజస్సుతో మొట్టమొదటిసారి కనిపించాడో అలాగే కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన చేతిలో ఇంకా వేణువు రాలేదు కానీ ఉయ్యాల దగ్గరకు వెళ్లి ఊపుతున్నప్పుడు ఆయనలో నుంచి వెలువడేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేణునాదం సుధామయంగా వినిపిస్తున్నదట. ఆ ఆకర్షణా వలయంలోకి వీళ్ళందరినీ, ముక్త జీవులందరినీ కూడా లాక్కొస్తున్నాడు పరమాత్మ.అంతేకాదు ఆ ఉయ్యాలలో పడుకున్నాడు గాని ఆ ఉయ్యాలంతా భోనమోహనమైనటువంటి ఈ లోకంగా కనిపిస్తున్నదట. ఈ లోకంలో ఎలా ఉన్నాడు అడ్డంగా పడుకున్నట్టు కనిపించినా లిహానం లిహానం సుజానేన మౌధ్యం ఎన్నిసార్లు చూసినా అవని ఆకాశము కలిపినటువంటి విరాట్ మూర్తిగా ఉయ్యాలలో కనిపిస్తున్నాడట. అంత అందమైన ఒక బొమ్మ కొనుక్కున్నాం అనుకోండి ఓ వెయ్యి రూపాయలు పెట్టి, దాన్ని ఎలా జాగ్రత్తగా చూస్తాం బొమ్మ అది ఒకటి బొమ్మ కింద పడితే పోవచ్చు రేపు రంగు మారొచ్చు చెయ్యి విరగొచ్చు కాలు విరగొచ్చు అన్నీ దానికి పోవటానికి అన్ని లక్షణాలున్నాయి. బ్రహ్మ ఏ దొరికితే ఆ బ్రహ్మ దొరికాడు గోపికలకి. ఎలా దొరికాడు అంటే ప్రతిరోజూ చూస్తున్నారు ఎప్పుడూ చూద్దాం అనిపిస్తుంది. ప్రతిరోజూ వింటున్నారు మళ్ళీ విందాలని అనిపిస్తున్నది. ఎందుకని అంటే పుట్టిననాటి నుంచి ఈ వరకు కూడా ఏ రకమైన ముగ్ధత్వము కూడా మారిపోకుండా జారిపోకుండా ఉన్నది. అటువంటి సమయంలో పూతన ప్రవేశిస్తే యశోద cloud nine అంటాం చూడండి cloud nine దానిమీద మహదానందంలో ఆవిడ నేల విడిచే గాలిలో ఆకాశంలో తేలిపోతున్నది ఆనందం వల్ల. అటువంటి సమయంలో యశోద ఆనందం ఇంటి యజమానురాలు ఆనందంగా ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ ఆనందం ఉంటుంది. ఆ ఇంట్లో యజమానురాలు ఆనందంగా లేదనుకుందాం ఒక ఐదు నిమిషాలు ప్రతి వాళ్ళు బిక్కు బిక్కుమంటూ ఉంటారు. మళ్ళీ ఆవిడ నవ్వితే అప్పుడు అమ్మయ్య ఏదో బానే ఉంది అంతా సక్రమంగా ఉంది లేకపోతే ఏదో ఇట్లా ఉన్నదని దిగులు పడిపోతారు. కాబట్టి యశోద ఆనందమే వచ్చిన వారందరికీ ఆనందంగా యశోద యొక్క ఆనందానికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉనికి రూపము అస్తిత్వము తేజస్సు బ్రహ్మత్వము అన్నీ కారణంగా యశోద ఆనందం పదిరెట్లు పెరిగి ఉన్నది. అంతా సర్వానందమయమైనటువంటి స్థితిలో వ్రజభూమి మహదానందంగా ఉన్నటువంటి వేళ ఆ పూతన ప్రవేశించింది. ఎట్లా ప్రవేశించాలి? రాక్షసిలా వచ్చి ఎత్తుకు వెళ్లిపోతే లాభం లేదు. రానివ్వరు ముందు లోపలికే ఒక, ఒక క్షణంలో యశోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న రోదనం చేశాడు కొద్దిగా ఏడ్చాడు. ఏడ్చాడు అనంగానే తల్లికి వాడికి ఏదో ఆకలి వేసింది అని అనిపిస్తుంది. వాడికి అయిందో లేదో ఇంక తెలీదు కానీ అయినట్టు సంకేతం వస్తుంది. వీడికి పాలిచ్చేటువంటి వేళ గనుక పాలిద్దామని దగ్గరికి వెళుతున్నది. ఆ సమయం చూసింది పోతన, పూతన. చూసి ఒక్కసారిగా తన దేహాన్ని జగన్మోహనమైనటువంటి రూపంగా మార్చుకుంది. అంటే అంతవరకు ఆ వ్రజభూమిలో అంతా అంతఃసౌందర్యంతో వెలిగిపోతున్న స్త్రీమూర్తులే తప్ప బాహ్య సౌందర్యంతో ఆకర్షణవలయంలోకి లాగగలిగిన ఒక్క స్త్రీ లేదు. వాళ్ళ సౌందర్యమంతా ఆంతరంగికం అది pure pristine clear perfect కానీ ఈ ప్రపంచ ఆకర్షణకు కూడా ఒక స్త్రీమూర్తి కావాలి గనుక అటువంటి ఆకర్షణ ఉన్నట్టుగా ఒక దేహాన్ని నిర్మాణం చేసుకున్నది యశోదకి అడ్డం వెళ్ళింది. అడ్డం వెళ్ళి ఈ పిల్లవాడికి నేను పాలిస్తాను అన్నది. యశోదకి పోనీలే అనుకుంది. పోనీలే అని ఎందుకు అనుకున్నది ఆమె కదా ఇవ్వవలసింది అంటే అలా రోజూ గోపగోపికలంతా వంతుల వారీగా ఆయనతో ఆ క్రీడలో ఆ మాతృత్వాన్ని అనుభవిస్తున్నారు. కడుపునే బిడ్డ, బిడ్డ పుట్టాలా అవసరం ఉందా ఎవరికో పుట్టినటువంటి బిడ్డ మన బిడ్డ కాదా అన్న భావన గోపగోపిక స్త్రీలందరికీ ఉన్నది గనుక ప్రతిరోజూ స్తన్యమిచ్చి పరమాత్మకి ఆనందాన్ని కలిగిస్తూ ఆనందాన్ని మళ్ళీ తమలో క్షీరంగా పాలుగా మార్చుకుంటున్న ఆ స్త్రీమూర్తుల స్థాయిని అర్థం చేసుకున్నటువంటి పూతన పాలు పాలిస్తాను అని వెళ్ళింది. ఆ వెళ్ళినటువంటి వేళ యశోద పక్కకి తప్పుకున్నది పూతన ఆయన్ని చూస్తున్నది ఎవరిని శ్రీకృష్ణ పరమాత్మని. ఆయన ఉండి హాయిగా క్షీరసాగరంలో ఉయ్యాలలో పడుకొని ఉన్నాడు వచ్చేవాళ్ళు వస్తున్నారు పోతే, పోయేవాళ్ళు పోతున్నారు. ఆనందమంతా చూసేవాడిదే తప్ప పడుకున్న వాడిది కాదు. నిజానికి ఆసుపత్రిలో మంచం మీద ఎవడన్నా పడుకున్నాడు అనుకోండి కష్టం ఎవరికి? వాడికేం లేదు వాడిని చూడటానికి వంద మంది మనుషులు ఓ డాక్టరు ఆ కావలసిన అన్ని వసతులు వాడికి అక్కడ ఏర్పడుతూ ఉంటాయి. వాడి ప్రమేయం ఏం లేకుండా వాడికి సేవలు జరిగిపోతుంది. ఈ మెట్లు ఎక్కి దిగి చూసి వచ్చి వెళ్లి ఇవన్నీ అరేంజ్ చేస్తారే దుఃఖం వాడిది. కాబట్టి కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడంటే హాయిగా పడుకొని ఉన్నాడు వచ్చేవాళ్ళు వస్తున్నారు పాలిచ్చే వాళ్ళు ఇస్తున్నారు ఆయన అనంతుడు అచ్యుతుడు పరమాత్మ ఎవరైతేనేమి ఆయనకందరూ తల్లులే అందరూ బిడ్డలే. అందుకనే అన్నమాచార్యులవారంటారు "చేరి యశోదకు శిశువితడు" యశోదకి శిశువు కానీ సర్వ జగత్తుకి ఈయన తల్లి అంటారు తండ్రి అంటారు. ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు అంటారు. ఈ ధారుణి అనేటువంటి అంటే ఈ భూమి అనేటువంటి దానికి తండ్రి ఎవరయ్యా? వసుంధరా దానికి బ్రహ్మ ఎవరంటే పరమాత్మే కదా అని వెంకటేశ్వర స్వామి నాయన చక్కగా సంకీర్తన చేస్తాడు. నిన్న చెప్పుకున్నాం పరమాత్మకు వచ్చిన కష్టాలు కూడా కాస్త చెప్పాడు. పామ జన్మే లేని వాడికి జన్మ వచ్చింది. పుణ్యాహవచన కార్యక్రమాలు అక్కర్లేని వాడికి అవన్నీ జరిగినాయి. ప్రపంచంలో అక్కర్లేని వాడికే అన్నీ జరుగుతాయి కావలిసిన వాడికి ఏవీ జరగవు. ఇది కావాలి అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నాకేమీ అక్కర్లేదని మీ ఇంట్లో మీరు కూర్చోండి అన్నీ జరుగుతాయి. ఇది, ఇది జీవిత సత్యం. పరమాత్మకి కూడా అటువంటి వాడే చక్కనిగా ఇష్టం. చేయు సేయుతరిన్ విధాత కరుణించెన్నందు సంతోష దృష్టియుతుండై నగుచున్ జనార్ధనుని మాక్కిన్ బుల్చు రోషించి ఉన్న యెడన్ రుద్రుని భంగి వొప్పుసుఖానందము పొంది తన్మయుడై బ్రహ్మము భాతి బాలుడు అమరున్ బాహుళ్య వాయంబు నన్. ఎలా ఉయ్యాలలో పడుకున్నాట్టంటే ఎప్పుడన్నా కోపం నటించినట్టు పసిపిల్లవాడికి చికాకు కలిగినట్టు ఆ కృష్ణుడు గనక కనిపిస్తే శివుడు పడుకున్నట్టు ఉన్నాడట. అసలు ఏమీ లేకుండా ఆహాయిగా కళ్ళు మూసుకుని పసిబాలుడు నిద్రపోతుంటే బ్రహ్మాండం రచనా కార్యక్రమంలో ఉన్నాడా అన్నట్టు బ్రహ్మ ఉన్నాడట. కాళ్ళు చేతులు అటూ ఇటూ ఆడిస్తూ సర్వ జగత్తుని మూడు వందల అరవై డిగ్రీలలో చూస్తూ ఆ చిన్న ఉయ్యాల పరిధిలోనే పరవశంగా అటూ ఇటూ తిరుగుతున్న కదులుతున్న మెదులుతున్నటువంటి పరమాత్మ విష్ణువుగా కనిపిస్తున్నాడట. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే ఏకరూపమై శ్రీకృష్ణుడుగా ఉయ్యాలలో ఉన్నాడు అని అర్థం. అప్పుడు ఆ సమయంలో కంసు పంపున బాలఘాతిని పూతన ఎవరయ్యా ఈ పూతన అంటే బాలఘాతిని, పిల్లలను చంపేది అని అర్థం. పల్లెల మండల పట్టణముల ఇల యలచో బలహింసగ విన్చుచు చనుచు ఎవ్వని పేరు శ్రవణ వీధి పడిన యెంత సర్వభయ నివారణమగు అట్టి దైత్యాంతకుండు అవతరించియున్న నందుని పల్లెకొకనాడు ఖేచరీ వచ్చి ఖేచరీయే వచ్చిందట. అదేదో సముద్రం దాటి యమునానది దాటి మేళమీద పరిగెత్తి రాలే. ఖేచరీ అంటే ఖే అంటే ఆకాశం. ఆకాశయానం చేసి direct గా అక్కడ దిగిందట. ఎవరి పేరు వినబడితే శత్రుభయంకర సంకీర్తనం అవుతుందో ఎవరి నామము వలన సర్వ ఇంద్రియాలు కూడా క్షమిస్తాయో అటువంటి పరమాత్మని కన్న నందుడు బ్రజభూమిలోకి ఖేచరీ విద్య అది ఆధునిక కాలంలో అంటే కలియుగంలో శంకర భగవత్పాదులు ఒక్కసారే దాన్ని వినియోగించారు. ఒకే ఒక్కసారి. తన తల్లి మరణించినప్పుడు తల్లికి తాను ఒక అభయం ఇచ్చారు. సన్యాసం తీసుకున్నప్పుడు ఆమె ఏం కోరలే. నాయనా! నువ్వు ఎక్కడ ఉన్నా నా ప్రాణ నిర్గమన వేళ నా దగ్గరే ఉంటావా? అని అడిగింది. ఉందు అని ఆదేశించింది. ఆ ఉందు అని ఆదేశించినందువలన ఎక్కడో ఉన్న శంకర భగవత్పాదులు కేవలం ఒక క్షణమాత్ర కాలంలో ఖేచరీ విద్య వలన దానిని ఉపాసన చేసి కాలడిలో ఆయన దిగారు. అది మనం చూస్తాం. అది చరిత్రలో ఉన్నటువంటి విషయం. ఆ ఖేచరీ అది positive ఇది negative కానీ ఇది negative గా కనిపించే positive అన్నమాట.
SSSMC · audio
Bhagawata Navaneetham - 57
Bhagawata Navaneetham - 57
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 27:17
More in this series