No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతా పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ పురుషుడు నిద్రలో కలల పొందు అనర్థకముల్ ప్రబోధమందు అరయగ మిచ్చలై పురుషునందు ఘటింపని కైవడిం పరేశ్వరునకు ఆత్మనాధునకు సర్వ శరీరికి కర్మ సాక్షికిన్ పరువడి పొందదన్నటికి ప్రకృతి దోషములు అంజనా మణి ఓ నిద్రపోతాం నిద్రలో కల వస్తుంది కలలో ఒక అనుభవాన్ని పొందుతూ ఉంటాం ఎట్లాగైతే కల మెలకువగా మారగానే బయటకు వచ్చి అందు ఏర్పడిన అనుభవం గాని దాని యందు ప్రవేశించిన పాత్రలతో గాని జీవుడికి మెలకువతో ఎట్లా సంబంధం లేదో అట్లాగే ఆ ఎవరియందు మనస్సు లగ్నం చేసి ఉన్నామో ఆ పరమాత్మ యందు మాత్రమే గనుక ఇహలోకంలో కూడా ఉండగలిగినట్లయితే అది ఉత్తమోత్తమమైనటువంటి స్థితి అని చెప్తున్నాడు చెప్పి అన్నింటికంటే గర్భస్థ శిశువు యొక్క వేదన అలా పక్కనబెడితే వృద్ధుడు కూడా పసిబాలుడే it is a it is called retreat పెద్దవారు అవుతున్న కొద్ది వాళ్లలో పసితనం బయటికి వస్తూ ఉంటుంది మనకు అర్థం కాదు ఈయన చాలా పెద్దవాడు కదా మనల కంటే కూడా ఇలా అడుగుతున్నాడు ఏంటి డెబ్భై ఏళ్ళు వచ్చిన వాడు అంటాడు sudden గా భాగవత సప్తాహంకు వెళ్లాలంటే చందమామ బుక్కు పట్టురా బయటికి వెళ్తే అంటాడు ఇదేంటది నే కదా చదవవలసింది అని వారిలో ఉన్నటువంటి child మేల్కొంటాడు తాను పొందనివి పొందాలని అనుకున్నవి పొందలేకపోయినవి పోగొట్టుకున్నవి ఇక దొరకవేమో అన్నటువంటి ఒక భావన వీటన్నింటి కారణంగా వృద్ధుడు తన కాలాన్నంతా కూడా గడుపుతుంటాడు ఆ వృద్ధుడు కాలం అలా గడపకూడదు ఎలా గడపాలి ఇలా గడపాలి అలా గడుపుతున్న వాడి యొక్క పరిస్థితి ఏమిటో కపిలుడు తల్లికి చెప్తున్నాడు అమ్మా! నీవు కూడా వృద్ధాప్యానికి వెళ్తావ్ నిన్ను కూడా ముసలితనం ఆవహిస్తుంది ఎలా ఉంటుందో నేను చిన్న బొమ్మ గీసి చూపిస్తున్నా అన్నాడు చెప్పరా నాయనా అంది ఈ కపిలుడికి ఆ తల్లికి ఎంత వయస్సులో ఎంత తేడా ఉన్నా ఆ గురు స్థానంలో కూర్చొని బోధిస్తున్నాడు ఆయన ఆమె వినటానికి సిద్ధంగా ఉన్నది ఎందుకని సిద్ధంగా ఉన్నది అంటే శుద్ధాంతరంగం ఏర్పడింది గనుక సిద్ధంగా ఉన్నది బలిమిశాలక మందభాగ్యుడై కుమతియై పోనియప్పుడు క్రియాహీనుడగుచు ఏదో పనులు చేద్దాం అని ఉంటుంది ఏం చేయలేం తవిలి వృధా ప్రయత్నంబులు చేయుచు మూఢుడై కార్పణ్యమున చలించు అట్టి అతిన్చనుడగు వామి చూచి తద్దారసుతాదులు ఆత్మలను వీడు ఉడుగడు అశక్తుడు ప్రోవగా జలడితడని సిగ్గింతురు అర్థి కృషీవలుండు బడుగు ముసలద్దు రోసినపగిది అంతాతడు ఏ వెంటలను సుఖంబు అందలేక తాను పోషించు జనులు తన్ తనర బ్రోవ బ్రతుకు ముదిమియు మిక్కిలి బాధపడుచు వీడు అనుకుంటాడట అంటే చిన్నవాడు ఈయనకి ఎందుకండీ ఇవన్నీ అయి ఏమి ఏడట్ల అయితే ఈయనకెందుకు కృష్ణా రామా అనుకోకుండా అంటాడట చిన్నవాడు వాడేంటాడట కృష్ణా రామా అనుకునే శక్తే లేదురా నాకు అనుకుందామంటే వయసు పోయింది నా పరిస్థితి ఇట్లా ఉన్నది కాస్త నాకు కృష్ణా రామా వినిపించండి అనిపించండి అంట నా దగ్గర time లేదంట నా నీ దగ్గర కూర్చునే time లేదు మిగతా అంతా time నా దగ్గర ఉంది అంటున్నాడట వడు ఇది ఎప్పటి మాట వ్యాసుల వారి సమయంలో ఇవాళ వృద్ధుడి యొక్క పరిస్థితి కూడా అంతే పాపం ఏదో స్వయంగా చేసుకోవాలి అని అనుకుంటాడు చేసుకోలేడు చేసిపోలేడంటే ఎవడి మీదో ఆధారపడాలి ఆధారపడ్డ వాడికి మూడు ఉండాలి అది మూడు ఉండాలి మూడు ఉండాలి మూడు ఏంటంటే time ఉండాలి డబ్బు ఉండాలి ముందు చేయాలనే సంకల్పం ఉండాలి ఆ మూడు ఉండవు గనుక ప్రపంచం నుంచి మూడు ఉండదు మూడు ఉండవు రెండు ఉండవు కాబట్టి ఎవడు నష్ట జాతకుడు ఈ సమయంలో అంటే వృద్ధాప్యానికి వచ్చిన వాడే నష్ట జాతకుడు అయ్యో ఇవన్నీ నేను ముందే చేసుకొని ఉన్నట్లయితే ఎంత బాగుండును చాలామంది చూడండి అది అజ్ఞాన భూమికే నెమ్మదిగా కాశీ వెళదాము అని అనిపిస్తుంది ఓ ముప్పై ఏళ్ల వయసులో అనిపిస్తే ఏం నష్టం ఏం లే వాడు వెళ్తాడు వస్తాడు ముంచెడన్నా ప్రయాణం చేస్తాడు డెబ్భై ఏళ్లు వచ్చాక ఒకసారి కాశీ అనేది విన్నాము అందరూ వెళ్లి వచ్చారు మనం కూడా వెళదాం అని అనుకుంటే అది ప్రమాదకరం అంటున్నాడు ఈయన ఎందుకు ప్రమాదకరం అంటే అక్కడ నువ్వు వెళితే ప్రయాస ఆయాసమే తప్ప ముక్తి ఆనందం నీకు రెండూ లభించవు కారణం శరీరం నీకు సహకరించదు గనుక శరీరము ద్వారా నువ్వు ఆనందాన్ని కూడా తెచ్చుకోవాలి శరీరాన్ని అట్లా వాడుకోవాలి శరీరం మాధ్యం కనుస్ ధర్మ సాధనం అదే కర్మ సాధనానికి కూడా మూలం కాబట్టి సరే ఇంకా అనేక కష్టాలన్నీ కూడా చెప్పాడు ఆ కష్టాలు ఇప్పుడు చెబితే పెద్దవాళ్లందరికీ బాధ కలుగుతుంది ఇదేందో మన గురించే రాశారు ఈ పద్యం అని ఏదో కృష్ణా రామా అని గొంతెత్తి పాడదామంటే కఫం వండబడుతుంది అన్నాడు ఇక్కడ ఉందా పద్యంఆ ఏ రెండు కాబట్టి ఏమనుకోవాలి అంటే స్వామి మనల్ని ముప్పై ఏళ్ల నుండి లోపలికి లాక్కున్నారు అదే ఆనందం అనుకోవాలి. ఇవాళ పాడుదాం అన్న పాట పాడుదాం అన్న గొంతు రావాలి కదా శరీరం సహకరించాలి మనసు ఉండాలి దానికి శరీరానికి ఉత్సాహం ఉండాలి లోపల metabolic activity ఉండాలి ఇవేమి ఉండవు కాబట్టి జఠరాగ్ని అల్లా మందాగ్ని గా మారిపోతుంది. ఎలా తినేవాడిని వయసులో అంటాడు అది అయిపోయింది అండి ఇప్పటి సంగతి ఏమిటంటే మందాగ్ని తినలేడు తిన్నా అరగదు మనకు కావాల్సింది వాడు పెట్టడు వాడు ఏం పెట్టాడో అది తినాలి మనకు కావాల్సింది వాడు పెట్టడు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే నేను doctor గారు చెప్పారు నువ్వు ఇది తినొద్దు అని అంటాడు పోతే పో తింటూ పోతానురా అంటాడు వీడు [నవ్వు] తింటూ పోకూడదు తినకుండా పోవాలి నువ్వు అంటాడు వీడు [నవ్వు] కాబట్టి వాడు ఆ వృద్ధుడి యొక్క లక్షణం ఇది కంఠనాళమున ఘరఘరమని శబ్దంబు దొరాయ ఎప్పుడూ కళ్ళు కళ్ళు తవ్వుతూ ఉంటాడట ఎందుకంటే ఆ esophagus అంతా block అయిపోతుంది లోపల కండరాలన్నీ సంకోచ వ్యాకోచాలు నశించిపోతాయి. ఆ కాబట్టి ఆ హృషీకాలు ఇంద్రియాలు హృషీకేశుడు అంటే ఇంద్రియాలకు ఈషుడు అని హృషీకం అంటే ఇంద్రియం ఆ ఇంద్రియాలన్నీ మన యందు మంచి పటువుగా ఉన్నప్పుడే శక్తి ఉన్నప్పుడే మన మాట అవి విననప్పుడు వాటి చేత మనం మాట వినేట్టుగా చేసుకోవాలి అదే అధ్యాత్మ సాధన. తర్వాత ఏదో ఎనభై ఏళ్లు వచ్చాయి ఆ ఇంద్రియాలు ఉంటే వాటంతట అవే నెమ్మదిగా ముసుగుపోతాయి దాన్ని చేయగలిగే సహజంగా పోతాయి అవి దానిలో మన ప్రయత్నం ఏమీ లేదు. ఇక్కడ ఈ గర్భస్థ శిశువు అంటే ఈవేళ తల్లులు అయినవారు తల్లులు కావలసినవారు బిడ్డలను కనబోయేటువంటి వారు ఆ తల్లి గర్భంలో ఆ శిశువు వాడి ఆ జీవుడి వేదన విన్నట్లయితే ఆ రోజులలో లాలి పాటలలో జోల పాటలలో లేదా సీమంతం పాటలలో పరమాత్మను గురించి మాత్రమే వాళ్ళు పాటలు పాడేవారు. అటువంటి శివుడు నిన్ను రక్షించు గాక అటువంటి కృష్ణుడు నిన్ను కాపాడు గాక అటువంటి రాముడే నీ కడుపున పుట్టు గాక ఎంత అందమైన భావాలు అవి. ఇవన్నీ విని విని ఒక జాతి ఉత్తమోత్తమమైన జాతి పుట్టింది లేకపోతే జరిగి ఉండేది కాదు. ఇక్కడ ఈ గర్భస్థుడైనటువంటి వాడు జనయత్రి గర్భమంగన ఘన క్రిమి విణ్మూత్ర రక్త గర్తములో నన్ మునుగుచు జఠరాగ్నిని దిన దినమును తంతప్యమాన దేహుండగుచున్. తంతప్యమాన దేహుడవుతున్నాడట వాడికి నెమ్మదిగా దేహం ఆకారం ఏర్పడుతుంది ఆకారం ఏర్పడి ఏమిటి నాకు అక్కర్లేని తొడుగులు అన్నీ వస్తున్నాయి కాళ్లు పుడుతున్నాయి చేతులు పుడుతున్నాయి కన్ను మొలుస్తున్నది అన్నీ గుంటలు ఉన్నాయట. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కళ్ళ place లో రెండు చుక్కలు ఉన్నాయి చెవుల place లో రెండు చుక్కలు ఉన్నాయి ముక్కు దగ్గర రెండు నోటి దగ్గర ఒక చుక్క ఇవన్నీ ఏమిటంటే ఖాళీ ప్రదేశాలు. ఈ ఖాళీ ప్రదేశాలు నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఈ పది నెలల కాలంలో తొమ్మిది నెలల కాలంలో నిజానికి పూర్ణం అవుతున్నాయి. అవుతున్నప్పుడు సంతోషించాలి జీవుడు నాకు అక్కర్లేదా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటున్నాడు ఇవన్నీ నేను అనుభవించేశా కదా మళ్ళీ కొత్తగా ఎందుకు పుడుతున్నాయి ఎందుకు మొలుస్తున్నాయి అంటున్నాడు. దీనవదనుడగుచు దేహి దేహంబు వలన నిర్గమింపదలచి వాడు కోరుతాడట అసలే గర్భం నుంచి నన్ను బయటకు పంపొద్దు అంటాడట వాడు. మనమేమో ఎప్పుడు శిశువు దయం అవుతుందా ఎప్పుడు పిల్లవాడు పుడతాడా ఎప్పుడు మన ఇల్లంతా పండగ అవుతుందని బయట ఉన్న వాళ్ళం అనుకుంటున్నాం తల్లి నేను ఎప్పుడు తల్లిని అవుతానని ఆమె కోరుకుంటున్నది జీవుడు ఏమంటున్నాడు అంటే నేను బయటకు వెళ్ళను అంటున్నాడట అది. నెలలను ఎన్నికొనుచు నెలకొని గర్భంబు వలన వెడల ద్రోయువారు గలరే నెలకొని బహు దుఃఖములకు ఆలయమైన ఈ గర్భ నరకము నేను వెడలజాల బహిర్ ప్రదేశమునకు వచ్చిన అనుపమ దేశ మాయా విమోహితత్ముడనై ఘోరమైనట్టి సంసార చక్రమందు పరిభ్రమణ శీలినై యుండ వలయు గాను తాను అదిగాక గర్భము నందుండు శోకంబు అపశయించి ఆత్మకు అనయంబు సారథి అయినట్టి రుచిర విజ్ఞానమున తమోరూపమైన భూరి సంసార సగరోత్తారణంబు చేసి ఈ ఆత్మను అరసి రక్షించుకొందు. ఆత్మ విచారణ చేసి నేను ఆత్మను ఎరుగుతాను తప్ప మళ్ళీ ఒక దేహాన్ని పొంది ప్రపంచంలోకి వెళ్లి మళ్ళీ మాయామేయ జగత్తులో నన్ను నేను పోగొట్టుకోను అంటున్నాడట అక్కడ ఉండగానే వాడికి ఆత్మ జ్ఞానం గురించి ఆత్మ తత్వాన్ని గురించి ఆలోచనలు పుడుతూ ఉన్నాయి అందుకనే రుచిర విజ్ఞానం అది చాలా అందమైన వెలుగుతో కూడిన ప్రకాశమానమైనటువంటి ఒక జ్ఞాన భూమిక ఆ అధ్యాత్మ భూమికను వదులుకొని నేను మళ్ళీ ఎందుకు ఇక్కడికి రావటం అనుకుంటున్నాడట. భ్రమగుచున్న దుర్యశన భాజనమై ఘనదుఃఖ మూలమై అరయగ తెక్కు తూట్లు గలదై నవరంధ్రముల కాయం అన్నారు తొమ్మిది తూట్లు ఉంది ఈ శరీరానికి. తెక్కు తూట్లు గలదై క్రిమి సంభవమైన యెట్టి దుస్తర బహు గర్భవాసముల వాడికి స్పృహ ఉందట ఎన్ని గర్భాలు ఆశ్రయించానో ఎన్నెన్ని సార్లు ఈ ప్రపంచంలోకి నేను వచ్చానో వచ్చినప్పుడల్లా నాకు ఇదే జరుగుతున్నది ఇంతకంటే ఉత్తమమైన స్థితి మాత్రం కలగటలేదు అని అనుకుంటూ సంగతి మాన్పుటకై భజించెదన్ తల్లి గర్భంలో ఉండగా నేను దీనిని గురించి భజించెదన్ అంటే సేవించెదన్ అని ఒక అర్థం విచారణ చేయటం అని రెండో అర్థం భజించటం అంటే భజన చేయటం కాదు.ఎవరిని అంటే సరసిజనాభ భూరిభవ సాగర తారక పాదపద్మముల్ పరమేశ్వరాయత్తమైనటువంటి పరమేశ్వరుని గురించి ఆయన యొక్క దివ్య పాదములను స్మరిస్తూ ఆ గురు చరణాంభుజముల దగ్గర ఉండి మళ్ళీ నేను ఆత్మవిభూతిని పొందుతాను తప్ప నాకు ఈ జన్మ వద్దంటున్నట్టు జీవుడు ప్రతి జీవుడు. అంటే మరి ఈ ప్రపంచం నడిచేది ఎట్లా? ప్రతి వాడు ఆత్మ వైపు వెళ్ళిపోయి నేను ప్రపంచంలోకి రాను అంటే మరి ఆయన సృష్టించుకున్న ఈ బొమ్మరీళ్ళు ఏమైపోవాలి? ఏడాదికి ఒక కొత్త బొమ్మలు కొనాలి మనం. పైన పైనవి తీసేయాలి. తీస్తున్నామా లేదా? బొమ్మల కొలువు మనకు నేర్పేది అదేగా. బొమ్మల కొలువు అంటే మనకున్న బొమ్మలన్నీ exhibition కాదు. విరిగిన, కరిగిన, తరిగిన, ఒరిగిన బొమ్మలు బయటపడేయి. పైగా ఎవడో వచ్చి చెప్తాడు విరిగిన బొమ్మ ఇంట్లో ఉండకూడదు అంత మంచిది కాదు అంటాడు. ఎవరికి? దానికా? మనకా? దానికి. కాబట్టి దానికి ఉద్వాసన చెప్పు. ఒకటి తగ్గింది గనుక దాన్ని replace చేయాలి. దేంతో? మరొక దానితో. జీవుడు కూడా ఒక బొమ్మ. ఇది ఎంత పంచదార బొమ్మ అంటే నీళ్ళల్లో పడేసి ఐదు నిమిషాలు వదిలేస్తే నీరు అదిగా మారిపోతుంది. దాంట్లో కలిసిపోతుంది. ఇంకేం ఉండదు. కాబట్టి [గొంతు సవరించిన శబ్దం] దేవహుతికి మరల మరల చెప్పాడట. పునః పునః చెప్పాడట. ఆత్మవిద్యనే పునః పునః చెప్పుకోవాలి. ఎందుకనంటే వైరాగ్యం భయాన్ని కలిగించదు స్పష్టతనిస్తుంది. వైరాగ్యం భ్రాంతిని కలిగించదు భ్రాంతిని తొలగిస్తుంది. బ్రహ్మాన్ని చూపిస్తుంది. పరమోదారమైనటువంటి ఆత్మతత్వ విచారణలోకి వెళ్ళటానికి కపిలుడు దేవహుతికి ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి అధ్యాత్మ భావనావీచిక ఈరోజు. దీంతో తృతీయ స్కంధం పూర్ణమైపోయింది. ఈ తృతీయ స్కంధంలో ప్రధానంగా జీవుడి యొక్క వేదన, జీవుడి యొక్క నివేదన, ఇవన్నీ కూడా నేను ఆత్మగానే ఉంటాను అన్నటువంటి మనం. దీనికి జాషువా గారు ఒక పద్యం చెప్పారు. వీడు అసలు ఎక్కడివాడో, ఏ దేశం వాడో నాకు తెలియదు. నిన్న మొన్న ఇచట మొలచినాడు. నిన్న మొన్న ఇక్కడ పుట్టాడు వీడు. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడికి ఆకలి లేదు, దప్పిక లేదు, ఇది కావాలి అది కావాలని కామన లేదు. అలా తల్లి గర్భంలో నుంచి బయట పడ్డాడో లేదో నాకు ఇది కావాలి అది కావాలి అంటాడే అని. దాని మీద కొం- ఇంకొద్దిగా విచారణ ఉన్నది. పోతనామాత్యులు గొప్పగా రాశారు ఆయన. ఆ విచారణ ఏమిటంటే పిల్లవాడు పుట్టగానే ఏడుస్తాడు మనం సంతోషిస్తాం అది అలవాటుగా మారిపోయింది. కొంత సమయం అయిన తర్వాత ఇంకాస్త ఏడుస్తాడు, ఎక్కువగా. వాడికి ఆకలి అవుతుందేమో అని మనం నిర్ణయిస్తాం. వాడి ఏడుపు అది కాదట. ఇంకా స్మృతులు కొద్దిగా మిగిలి ఉన్నాయట, లేశమాత్రంగా. ఆ స్మృతులు ఈ ఏడుపులో కొట్టుకుపోయి పోవాలి. అప్పుడు ఎవడో వీడిని ఎత్తుకుంటాడు. ఎత్తుకోవటం అంటే స్పర్శ కలిగింది. దేనితో స్పర్శ కలిగింది అంటే దివ్యమైనటువంటి తల్లి గర్భాలయంలో నుంచి బయటకు వచ్చిన జీవుడు ప్రాకృతమైనటువంటి ఒక పురుషుడో ఒక స్త్రీ యొక్క తనువుతో ఒక స్పర్శ ఏర్పరచుకున్నాడు గనుక ఆ తనువులో నుంచి ఆకలి, కోరిక, నిద్ర, మూడు పుట్టినాయి. ఈ ఆకలి వలన కోరిక, కోరిక వలన నిద్ర, నిద్ర వలన పెరుగుదల, పెరుగుదల వలన ఒరుగుదల, ఒరుగుదల వలన మరణము, ఇవన్నీ కూడా ఒక ఏకకాలంలో ఏర్పడినయట. అందుకనే బిడ్డ పుట్టగానే ఉత్తమమైనటువంటి స్త్రీమూర్తిని ఎత్తుకోమని అంటారు. ఎవరు ఆ ఉత్తమమైన స్త్రీమూర్తి అంటే ఎవరు చక్కగా అన్నివేళలా భగవంతుని యందు మనస్సులు లగ్నం చేసుకొని భగవన్నామాన్ని స్మరిస్తూ భగవంతుడు ఉన్నాడన్న నమ్మికతో జీవిస్తూ ఉన్నదో అటువంటి స్త్రీమూర్తికి ఆ బిడ్డని ముందు తాకమని అంటారు. అంతేగాని మన అమ్మమ్మే అయినా ఆమె భక్తురాలు కాదనుకోండి ప్రయోజనం ఏం లేదు. కాబట్టి ఆ భగవద్భక్తి వాడికి ఆ స్పర్శ ద్వారా గ్రహిస్తాడు గనుక ఆ స్పర్శకి మరొక పేరు, అదొక శరీరం. స్పర్శ అనేది ఒక శరీరం. ఆ శరీరం పేరు కింపురుష శరీరము అని పేరు. ఆ కింపురుష శరీరంలో నుంచే, స్పర్శలో నుంచే emotional support మనకు కలుగుతుంది. మనకో దుఃఖం కలిగింది. స్కూల్లో ఏదో జరిగింది. పిల్లకో పిల్లవాడికో. వాడొచ్చి వాడు ఏం చేయడు. వెళ్ళేడు. ముందు అన్నం లేదా ఏం లేదా పుస్తకాలు ఎక్కడ పారేసి తల్లి ఒళ్ళోకెళ్ళి ఆ దూరి ఉండిపోతాడు. ఉండిపోయి ఇంకాస్త ఎక్కువ ఏడుస్తాడు. అప్పుడు తల్లి అడుగుతుంది, ఇదంతా కథ నడుస్తుంది. నడిచాక ఇంతేనా అంటుంది తల్లి. ఓహో అంత జరిగితే ఇంతేనమాట అనుకొని ఇది మర్చిపోతుంది. జరిగిందంతా. ఇది ప్రతిరోజూ జరిగేదే. అలాగే ఈ నిత్య జీవితం కూడా అధ్యాత్మ జీవితం కంటే నిజానికి భిన్నమైంది కాదు. కపిలుడు వంటి వాడు ఒక తల్లికి బోధ చేయటం ఒక భారతదేశంలో, ఇక్కడ మాత్రమే సంభవించింది. ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఇవి ఇట్లాగే ఈ భాగవతం చెప్పబడుతూనే ఉంటుంది, వినబడుతూనే ఉంటుంది. అనేకమైన కోణాలలో, అనేకమైన రీతులలో. ఎందుకనంటే ఎవరైనా కానీ మన సంస్కారాన్ని బట్టి, మన ప్రాప్తిని బట్టి, మన శక్తిని బట్టి, మన అనుభవాన్ని బట్టి, మన అనుభూతిని బట్టి మనకా వస్తువు యొక్క స్థితి మనకు అర్థమవుతుంది. వస్తువులో మార్పు లేదు. దానిని మనం అనుభవించిన తీరుతెన్నులలోనే మార్పు గనుక ఆ దివ్యమైనటువంటి తృతీయ స్కంధంలో కపిలుడు చేసినటువంటి చాలా గాఢమైనది, చాలా గట్-- తర్వాత తర్వాత విచిత్రం ఏమిటంటే రామాయణం చాలా నెమ్మదిగా హాయిగా కథలా ప్రారంభమై జ్ఞానభూమికలో అంతమవుతుంది. భాగవతం జ్ఞానభూమికతో ప్రారంభమై శ్రీకృష్ణ కథా గానంతో ఇక ఆయన కథలు, ఆయన లీలలు అవి నవ్వులే నవ్వులు, సంతోషమే సంతోషం. ఎందుకంటే ఆయన మహానంద స్వరూపం కాబట్టి పూర్ణ చైతన్య విలసితమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి యోగ భూమికి చెందినవాడు గనుక ఆ భావనే వేరు, ఆ భాగవత గాథే వేరు గనుక ఆ దివ్య సీమలోకి సర్వేశ్వరుడైనటువంటి స్వామి మనందరినీ కూడా చల్లగాహాయిగా ఈ ఉత్తరాయణ పుణ్యకాల విశేషంలో ఈ ఏడు రోజులు చూడండి ఎంత అనుగ్రహం లేకపోతే స్వామి మనందరినీ ఒక చోట కూర్చి నా కథ వినండి అన్నారు. అది ఆయన కథే భిన్నం ఏం కాదు. ఎదగగలిగితే ఎరగగలిగితే లేకపోతే ఆయన వేరు ఈయన వేరు. కాదుగా మన వరకైతే కాదు. కాబట్టి సర్వేశ్వరుడైన స్వామి మన మన యందు పరిపూర్ణమైన అటువంటి కరుణని ప్రవాహ వేగంతో కురిపించాలని మనల్ని నడిపించాలని స్వామిని ప్రార్థిస్తూ రేపు చక్కగా చతుర్థ స్కంధంలోకి వెళ్దాం. వెళ్లేలోగా ఒక చిన్న విశేషం ఉన్నది. ఆ విశేషం ఏంటంటే రామాయణ కల్పవృక్షం మనం చెప్పుకున్నటువంటి రోజుల్లో ఆ రాముడి ప్రయాణంలోనే ఒక రాగం పుట్టింది. ఆ ప్రయాణంలో పుట్టేమో రాగం అది. అది రామప్రియ రాగం మనకు తెలుసు బాగా అలవాటైపోయింది. రాముడికి కూడా ఇష్టముంటుందా? అన్నంత గొప్ప రాగం అది. రాముడికే ఇష్టం కలిగించి ఒక నిమిషం ఆగాడాయన. అమ్మవారే ఆశ్చర్యపోయి అడిగింది. దేనికి ఆగడే అయినా ఇక్కడ ఎందుకు ఆగాడు అని. ఏమో నానానా నాదంలో నుంచి ఒక సుమధురమైన నాదం వినిపిస్తోంది అని అందుకని దానికి రామప్రియ రాగం అనే పేరు పెట్టారు. అలాగే ఈ భాగవత నవనీతంలో ప్రధానంగా ఒక భావన ఏర్పడింది ఏంటంటే భాగవతం అంతా కూడా హంసానంది. అసలు భాగవతమే హంసానంది. అనేక రాగాలలో హంసానంది రాగం ఆధ్యాత్మిక రాగం అది. ఉత్తమోత్తమమైన రాగం. అది జీవుడు దేవుడు అనబడేటువంటి ఒక గ్రంథి ఉన్నది మనలో. గ్రంథి అంటే ముడి. చిన్న ముడి. ఆ ముడిలో ఒక చిన్న సందు ఉన్నది. ఎంత ప్రదేశం అంటే అది సన్నటి సూది మాత్రమే వెళ్లగలిగినంత. ఆ గ్రంథి భేదనం గనుక జరిగినట్లయితే జీవుడు దేవుడు రెండూ ఒకటే. కలిపి కట్టబడే ఉన్నాయి కానీ ముడిపడి ఉన్నాయి. ముడి విడిపడి పోవాలి. ఆ లోపల ఉన్నటువంటి ఆ సూదిమన దూడేటువంటి సందు ఏదైతే ఉన్నదో దాని పేరు చిత్తు జడము. చిత్తు అంటే పరమాత్మ. జడము అంటే జీవాత్మ. ఆ రెండూ గ్రంథిగా ఉన్నది గనుక దాని పేరు చిజ్జడ గ్రంథి. ఆ చిజ్జడ గ్రంథి లోపల ఇటు నుంచి అటు గాలి వెళితే రాగం పుడుతుంది. రాగం అంటే ఏమున్నది? స్వరం అంటే ఏమున్నది? notation అంటే ఏమున్నది? ఏం లేదు ఉన్నదంతా గాలి. గాలి అంటే కనపడనటువంటి పరమాత్మకు అది సంకేతం. అలాగే అది శబ్దమయం శబ్ద వాహిక కూడా. శబ్దాన్ని మోసుకు వెళ్ళేది అదే అసలు శబ్దం యొక్క అదృశ్య స్వరూపమే గాలి గనుక ఇది ఈ రాగం పేరు హంసానంది రాగం. ఈ హంసానంది అంటే హంస అంటే జీవుడు. వాడి అధిష్టానం ఎవడు అంటే పరమాత్మ. ఆయన ఎవరంటే పరమహంస ఆయన. ఆ ఈ హంస ఈ ఆనంది రాగంలో హంసానంది రాగంలో చిజ్జడ గ్రంథిలో ఆ సందులో నుంచి ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఒక రాగాన్ని ఆలాపిస్తాడు. ఆ రాగంలో పరమాత్మ పరమహంస ఎవరు అంటే శ్రీ కృష్ణ పరమాత్మ. ఆ ద్వారంలో నుంచి వెళ్ళిన వారు ఎవరంటే ఎనిమిది మంది అష్ట భార్యలు కారు పదహారు వేల మంది గోప గోపికా కాంతలంతా కూడా ఆ ద్వారంలో నుంచి చిజ్జడ గ్రంథిలో నుంచి ఇవతల నుంచి అవతలకు వెళ్లారు. ఇవతల నుంచి అవతలకి అంటే ప్రదేశం అనే గట్టును దాటి సువిశాలమైనటువంటి సుందరమైన అటువంటి అధ్యాత్మ భూమికలోకి శ్రీకృష్ణ పరమాత్మ తీసుకుని వెళ్ళాడు. అందుకనే కృష్ణ పరమాత్మ యుద్ధం చేయటానికి వచ్చిన వాడు కాదు చేయించటానికి వచ్చిన వాడు. మురళి వాయిం-- అందరూ వాయిస్తే చూట్టానికి వచ్చిన వాడు కాదు. తాను వాయిస్తూ ఉన్నప్పుడు అందరూ వినేట్టుగా చేయటానికి వచ్చాడు గనుక జిహారం జిహారం సుజానేన మౌఖ్యం దుహానం దుహానం సుధాం వేణునాదైహి లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమేతన్ నమస్కార్ అంటాడు లీలాశుకుడు. కాబట్టి ఇవాళ మళ్ళీ కచ్చిగూడ సమితి ఏమో స్వామి దయ దాని యందు నిండుగా ఉంది. ఉండి రామావతారానికి రామప్రియ రాగంలో పాట కట్టి నాకిచ్చారే అలాగే ఈ భాగవత నవనీతం సమయంలోనే తొలినాళ్లలోనే అధ్యాత్మ లో నుంచి కానంద గీతike కదా పాడటానికి వీలుగా హంసానంది రాగంలో కృష్ణ పరమాత్మ పరంగా ఒక గీతికని సృష్టించమన్నట్లుగా అంటే ఒక ఆలోచన కలగటం ఆ ఆలోచన అనబడటం అనబడిన ఆలోచన వినబడటం వినబడినటువంటిది జరిగిపోవడం జరిగింది గనుక ఇవాళ హంసానంది రాగంలో శ్రీకృష్ణ పరమాత్మ పరంగా స్వామి పరంగా చెప్పబడినటువంటి గీతాన్ని చక్కగా ఆలపించి ఆలకించి పరమాత్మకి సమర్పించుకుందాం.
SSSMC · audio
Bhagawata Navaneetham - 23
Bhagawata Navaneetham - 23
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 23:28
More in this series