Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విసత్ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యోమాహం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్ఫురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ వీరభద్ర విజయంలో వీరభద్రుడి మూలం ఏమిటి అంటే మళ్ళీ శివుడే. శివుడి ప్రతినిధి ఆయన. శివుడి ప్రతినిధి అని మనల్ని అంటాడు కదా. స్వామి devotee ఇంత మంచివాడైతే, ఇంత గొప్పవాడైతే అసలు స్వామి సంగతి ఏమిటి అని ప్రశ్న వేస్తుంటారు. కాబట్టి మనం ఉండవలసింది ఏమిటంటే స్వామికి devotee గా ఉండిపోతే మనకు క్షేమం. ఎందుకని? మనల్ని చూసి మన తండ్రి యొక్క గొప్పదనాన్ని, మన తండ్రిని చూసి మనం ఉండవలసిన లక్షణాన్ని ప్రపంచం నిర్దేశిస్తుంది కనుక స్వామి devotee గా ఉన్నాం అని అనుకున్న మరుక్షణం ఆయన devotee లాగానే ఉండాలి. ఆయన మన తండ్రి అని అనుకున్నప్పుడు ఆయన బిడ్డవలె సంచారం చేయాలి. అప్పుడు ప్రపంచం మనకి స్వామికి గౌరవాన్ని, ఒక కీర్తిని, ఒక భక్తిని, ఒక విశ్వాసాన్ని కలిగి మన యందు ఉంటుంది గనుక వీరభద్రుడు ఎలా పుట్టాడు, ఇవన్నీ కూడా ఆయన చాలా అందంగా. అసలు అమ్మవారు ఎందుకని యోగాగ్నిని రగుల్చుకున్నది అనేది పోతనామాత్యుడు చాలా అద్భుతంగా చెప్తారు. ఆమె చితి పేర్చుకోలేదు. యోగాగ్ని రగుల్చుకున్నది. యోగాగ్నిని రగుల్చుకున్నది నిండా విచారణ చేశాం మనం. త్రికూటనాం నిస్థితే అంతరంగే అని భ-శంకర భగవత్పాదులు చెప్పారని మూలాధారంలో నుంచి యోగాగ్నులు, వాయువులన్నీ బయల్దేరి సత్చక్రాలు దాటి విశుద్ధాన్ని దాటి ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చి శూన్యంలో లయమై అక్కడ సుషుమ్నా నాడి పడగ విప్పి దానిలోకి వెళుతుందని మనం విచారణ చేశాం. విచారధారకు అనుగుణమైనటువంటి ఒక యోగ ప్రస్థానమే వీరభద్ర విజయం. వీరభద్ర విజయంలో, చెప్పాం కదా, సర్వ దిక్కుల వారు చనుచుండిరి. ఎలా వెళ్తున్నారు మన, సర్వ దిక్కుల వారట. నాలుగు దిక్కుల నుంచి అంటే తూర్పు ఇంద్రాది దేవతలందరూ కూడా బయల్దేరారు. ఉత్తరంలో ఉన్నటువంటి కుబేర స్థానంలో ఉన్నవారంతా బయల్దేరారు. అలాగే దక్షిణంలో ఉన్నటువంటి యమకింకరులంతా కూడా బయల్దేరారు. ఎందుకంటే యజ్ఞం జరిగినప్పుడు అక్కడ జరిగేటువంటి వినాశనం ఏదైతే ఉన్నదో వినియోగింపబడిన ప్రతి వస్తువుని కూడా స్వక్షేత్రానికి చేర్చడానికి వీళ్ళు కూడా కాపాలికులు ఉండాలి. కాపాలికులంతా కూడా బయల్దేరారు. అలాగే పశ్చిమ దిశలో నుంచి పరిపూర్ణమైనటువంటి జ్ఞానమూర్తులంతా కూడా బయల్దేరారు. అంటే జ్ఞానులు, విజ్ఞానులు, తపస్సులు, తాత్వికులు, ముముక్షువులు, దేవీదేవతా స్వరూపాల సమూహాలు సకుటుంబంగా, భార్యా సమేతంగా వాళ్ళంతా కూడా దక్షప్రజాపతి దానికి వెళుతూ ఉన్నారు. కమరాలు నవరత్న తాటంక లోచులు చెకుటద్దములతో చెలిమి చేసి. వాళ్ళు వెళుతుంటే చెవులకి వేసుకున్నటువంటి లోలాకులున్నాయే, వాటి యొక్క కాంతి చెక్కల మీద పడి ప్రతిఫలిస్తున్నాయట. ఒకటికి రెండుగా కనిపిస్తున్నాయట. తాటంకం అంటే చెవి కమ్మ. మహనీయ తపనీయ పదకజ్జతులు అంపభాగంబులు ఆదరింప అంచిత చినిచినାంబర ప్రభలతో మేఖలాకాంతులు మేలమాడ. కట్టుకున్నటువంటి చీరలు, చీరల మీద వేసుకున్నటువంటి వడ్డాణాలు, ఇవన్నీ కూడా చీరతో వడ్డాణమా, వడ్డాణంతో చీరా. ఎందుకని వెళుతున్నారు? దక్షప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి కాబట్టి సాలంకృతమైనటువంటి స్త్రీమూర్తులంతా వెళుతున్నారు. చంచల సారంగ చారు విలాస నప్రభలు నల్దిక్కుల అభికొనగ నిల్చు వేడుక భర్తృసమేతలగుచు మానితంబుగ దివ్యవిమాన యానలగుచు ఆకాశపధాన అరుగుచున్న ఖచర గంధర్వ కిన్నరాంగనల చూచి. అప్పటికే విమానాలున్నాయి. ఇప్పటికే కాదు. ఎవరి విమానం వాళ్ళు ఎక్కేళ్లారట. వి--ఎవరి విమానంలో వాళ్ళు ఎలా వెళుతున్నారంటే సర్వ దిక్కులు చూస్తూ వెళుతున్నారట. ఎందుకని అటు చూస్తున్నారంటే వాళ్ళంతా ఒక్కొక్క దిక్కులో ఉండటానికి అలవాటు పడ్డవాళ్ళు. ఇవాళ మొట్టమొదటి సారిగా శూన్యంలో ఆకాశంలోకి వచ్చారు. నాలుగు దిక్కులు చూసుకుంటూ ప్రకృతిని, ఆకాశ గమనాన్ని అంతా కూడా ఆనందిస్తూ నెమ్మదిగా వెళుతున్నారు. ఆకాశమే కాంతివంతమైపోయింది అంటాడు పోతన పరమాద్భుతంగా. వెళుతుంటే ఊరికే వెళతారా? జాతరకి గాని, వేడుకకి గాని మాట్లాడకుండా మౌనంగా వెళ్ళేవాడెవడు? మౌనంగా వెళ్ళరు. అట్లా ఉంది, ఇట్లా ఉంది, ఆహా! ఎంత బాగుంది అని ఒకడు, ఏం బాధ లేదు అని రెండో వాడు. మాటలు మాటలు పోగులతో వెళుతున్నారట. ముతమున కల్మషోద్భవ విభూతి కనుమ్ వెన నవ్య కామినుల్ పదువులు బట్టి భూషణ దిభాషితలై నిజనాభ యుక్తులై మదకలహంస పాండుర సమంచిత దివ్యవిమాన యానలై అదే చనుచున్నవారు కనులు అభ్రపదంబున నీలకంఠరా. "అరుగో నయ్యా అలా వెళుతున్నారు. నన్ను అడుగుతావేంటి? వాళ్ళంతా మన రాకెట్ లో నుంచి పోతుంటే ఏమవుతుందో చెప్పమంటావేంటి? నువ్వు చూడు. నీలకంఠరా కాస్త కళ్ళు తెరవవయ్యా" అని అమ్మవారు అంటే అనిఅనఘా విను లోకంబున లోకం లోకరీతి చెబుతున్నది అమ్మవారు అయ్యవారితో అమ్మవారైనా అయ్యవారికి అలాగే చెప్పాలి వేరే రకంగా చెప్తే ఆయన వినడుగా అనఘా విను లోకంబున జనకుని గేహమున కలుగు సకల సుఖంబుల్ కనయలు అవి సంప్రీతిన్ కనుగొనక ఏరీతి నిలుచుకాయము అభవా నీకంటే పుట్టుక లేదు గాని నాకు పుట్టుకుందిగా శివా నీకు తండ్రి ఎవడో నాకు తెలీదు అభవా అది శబ్దం ప్రయోగం అనమాట నీకు పుట్టుక లేదు కాబట్టి నీకు పుట్టిల్లు లేదు నీవు అమ్మా నాన్న ఎవరంటూ నువ్వే చెప్పలేవు అందరికీ నేను నాన్ననని చెబుతున్నాను గాని నువ్వెవడివి నీ నాయన ఎవడు అంటే లేదు నీకు కథ లేదు మాకుంది మేము ఎక్కడ పుట్టాం అంటే మా తండ్రి హిమోత్పర్వతరాజు ఆయనకు ఇల్లు ఆవాసం కొండో ఏదో ఒకటి ఉంది ఆయనకి అంటే నాకు అడ్రస్ ఉంది డ్రస్ కూడా ఉంది నీక రెండూ లేవన్నది అది కాబట్టి నా అడ్రస్ ఏంటంటే మా నాన్న ఇల్లు లోకంలో తండ్రి ఇచ్చేటువంటి సుఖాన్ని పొందటానికి బిడ్డలు ఎక్కడికి చేరుతారయా అందుకే అందరూ వెళుతున్నారు అన్నది కాబట్టి నా యందు ప్రసన్నుడవై నా మనో అభిష్టం ఏంటంటే మా తండ్రి చేసే యాగం చూసి వస్తాను పంపించు అని అడిగింది కళ్యాణి నీ మాట కడు నొప్పు నువ్వు చెప్పింది పర్ఫెక్ట్ నువ్వేం తప్పు చెప్పలే అంటే సరే అనకుండా ఉండటానికి ఇది ముందు ముందు కాళ్ళ బంధనం చెప్పినవన్నీ రైటే కానీ అంటాడు ఈయన కూడా అదే పద్ధతిలో కళ్యాణి నీ మాట కడు నొప్పు బంధువుల్ పిలవకుండి నన్ సంప్రీతించనుదు రంటివి ఇదియుల సైనను దేహాభినో నమదవున అమర్షణను కడకి ఆరోపిత ఘనకోప దృష్టులు కారేని పోదగు దాని వినుము విలుత విద్యా తతోవిత్తవయో రూప కులములు సుజనులకు గునంబు ఇవియ కుజనుల యెడ ద్వేష హేతంబులై వివేకంబు సరచు మహాత్ములైన వారి మహాత్మ్యము ఆత్మగర్వమున చేసి జడులు పొడగాన జాలరు జలజనేత్రా నువ్వు చెప్పినవన్నీ ఎవరి గురించి ఎటువంటి తండ్రి గురించి హిమోత్పర్వతరాజుని గురించి చెప్పు ఒప్పుకుంటా మళ్ళీ దక్ష ప్రజాపతి కూతురుగా ఉన్నావంటున్నావే దక్ష ప్రజాపతి వేరు హిమవంతుడు వేరు అంటే పురుషుల యందు పుణ్య పురుషులు వేరయా అని తండ్రుల యందు పుణ్య తండ్రులు వేరయా అందరూ తండ్రులే జన్మిస్తారు కానీ తండ్రి ఎవడు విచారణ చేసుకోవాలి గుణవంతుడా కులవంతుడా భాగ్యవంతుడా ప్రేమపూరితమైనటువంటి హృదయం ఉన్నవాడా లేడా అంతేగాని జన్మ ఇచ్చాను గనుక తండ్రి కావడానికి వీల్లేదంటున్నాడు శివుడు జన్మ ఇచ్చిన ప్రతి వాడు తండ్రే గనుక అయితే ప్రతి బిడ్డ కూడా తన తండ్రి యింట ఆనందాన్ని పొందాలి అట్లా లేదు కదా వాళ్ళంతా కుమతులు కదా అంటున్నాడు అని కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆయు లేగ వారు అనాదరమున బొమలు ముడివడంగ భురిరోషాక్షులై చూతురు అదియు గాక సుదతి వినుము నిన్ను పిలిచాడా దక్ష ప్రజాపతి పిలవలే రారామ్మని ఏమి అనలేదు ఆహ్వానం లేదు కానీ నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు ఎందుకు వచ్చావు వాడు కనుబొమలు ముడుస్తాడు వాడి సంగతి నాకు తెలుసు నిన్ను పిలిచానా అంటాడు అంతేకాదు విను అని సమదిరిప్పు ప్రయుక్త పటుపాయక జజ్జితాంగుడై యుదుఃఖమున తరంగి నిద్రగనుగాని కృశింపడు మానగుండు యమా బుమా వినును ఇష్ట బాంధవ దురుక్తులు మర్మములంట నాట చిత్తమున అహర్నిశంబు పరితాపము నుందు కృశించు ఇప్పుడున్ పిలవని ఆహ్వానం అందని చోటికి గనుక మనం వెళ్ళినా వీడు ఎందుకు వచ్చాడని చూసినా తామస గుణం చేత ఒక మాట గనుక పొరపాటున ఏదన్నా మనల్ని అన్నా అన్నవాడు మరిచిపోతాడు అనిపించుకున్నవాడు జీవితం అంతా కృశించిపోతాడు నువ్వు చెప్తున్నావు లోకరీతి ఉన్నదో నేను కూడా ఉమా నీకు కూడా నేను ఇదే చెప్తున్నాను అన్నాడు ఆవిడ ఒక మాట అన్నది నువ్వేమన్నా అనుకో ఒక్కసారికి ఏమనద్దు సీతాదేవి కూడా అదే అంది రామా నిన్ను ఏమన్నా అడిగానా ఏదన్నా ఇది నాకు కావాలి అని నోరు తెరిచి ఎప్పుడన్నా అడిగానా ఒక్క బంగారు వేడిని తప్ప అన్నది అది చాలు ఏది అడక్కూడదో అది అడిగింది ఇక్కడ కూడా అమ్మవారు అంటే చూడండి యోగం అనుభవించవలసి వచ్చినప్పుడు మన బుద్ధి అటు వైపు నడిపిస్తుంది కర్మానుసారంగా బుద్ధే నడిపిస్తుంది ఇటా అటా ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామా అనుకుంటాం ఇక్కడికి వస్తాం కాసేపు ఏదో స్వామి సంగతులు మాట్లాడుకొని వెళ్ళిపోతాం పూట బానే ఉంటుంది రోజూ స్వామి సంగతులు ఇరవై మూడు గంటలక ఉంది వేళ వెళ్ళకపోతే ఏమనుకున్నాం అనుకోండి అనుకొని ఇంకో చోటికి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళాక ఏమనిపిస్తుంది అంటే హాయిగా అక్కడికి వెళ్తేనే బాగుండేదేమో యాత్ర ఎంత పడ్డాం అనిపిస్తుంది అమ్మవారి పరిస్థితి కూడా లోకంలో ఉన్న స్త్రీ కంటే భిన్నంగా లేదు కుపితాత్మయై స్వస్వమాన రహితు ఆత్మ దేహంబు సగమిచ్చినట్టి భవుని విడిచి మూఢాత్మయగుచు అం వెలదిచెనియే జనకు చూచెడి వేడుక సందడింపమనస్సులో నిన్న కపిలుడు చెప్పాడు కోరిక ఒకటి పుట్టుతూ ఉండగానే దానిని సంహారం చేయమన్నాడు. లేకపోతే కోరిక ఆశగా మారుతుంది ఆశ దురాశగా మారుతుంది దురాశ దుర్దశ వైపు దారి తీస్తుంది. సగభాగం ఇచ్చినటువంటి పరమాత్మని కూడా పరమేశ్వరుని కూడా అమ్మవారు వదిలిపెట్టి "ఎంత చెప్పినా ఈయన వినటం లేదు అయినా నేను వెళ్తున్నాను" అని చెప్పి ఆవిడ బయలుదేరితే కరుణాపూర్ణ సుహాబ్ధి అయినటువంటి పరమేశ్వరుడు అమ్మవారిని ఒంటరిగా పంపిస్తాడా? పోనీ అయ్యవారికి చెప్పాలా భటులు వాళ్ళంతా ఉన్నారుగా ప్రమథగణాలన్నీ ఉన్నాయి అనేకమంది దేవతా స్వరూపాలన్నీ నిత్యము సదాశివ దర్శనం కోసం నించొని ఉంటాయి. ఎందుకంటే సదాశివుడు eternal. విశ్వేశ్వరుడు ప్రపంచం ఉన్నంత కాలం ఉంటే ఆయన పేరు విశ్వేశ్వరుడు. విశ్వానికి ఈశుడు విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుడు ఇక్కడ manifest అయి అభివ్యక్తమైనప్పుడు విశ్వేశ్వరుడు ఎట్లా అయినాడు? అభివ్యక్తం కాకుండా యోగ మార్గంలో గనక అనుభవంలోకి తెచ్చుకుంటే ఆయన పేరు సదాశివుడు. అన్ని అవస్థలలో ఉంటాడు గనక. [చదువుతున్నాడు] మానిని చనుచుంద మునిమన్న దాది సహస్ర సంఖ్యాత రుద్రానుచరులు. వేలకు వేలుగా రుద్రానుచరులంతా అమ్మవారి వెనక వెళ్తున్నారట position లోకి వచ్చేశారు వాళ్ళు. అమ్మవారు ఒక్కతే వెళ్ళటానికి వీల్లేదు గనక. [చదువుతున్నాడు] యక్షులు నిర్భయులై వృషభేంద్రుడి మున్నిడు కొలుచు సమ్ముద్రిత గాల్చు కందుకాంభుజ శారికా తాళవృంత దర్పణ భవనాత పత్ర ప్రసూనమాలిక సౌవర్ణమణి విభూషణ ఘనసార కస్తూరిక చందనాది వస్తువులు కొంచు నేగి. అమ్మవారు వెళ్తున్నది అంటే కస్తూరి చందనం ఆవిడ ఆభరణాలు ఆవిడ మణులు ఆవిడకున్న చీరలు అన్నీ కూడా వస్తువులన్నీ పట్టుకొని వీళ్ళంతా వెళ్తూ [చదువుతున్నాడు] వస్తువులు కొంచు నేగి సర్వాణి కదిసి. అమ్మవారిని దగ్గరకు కదిసి సమీపించి [చదువుతున్నాడు] శంఖ దుందుభి వేణు విశ్వనములత్త. శంఖము దుందుభి వేణువు అనేటువంటి మూడు నాదాలు వినిపించేటట్లుగా [చదువుతున్నాడు] మానితంబైన వృషభేంద్ర యాన చేసి. అమ్మవారిని వృషభం తీసుకొని వచ్చారు "అమ్మా! దీనిమీద వేళ ఎక్కు దీనిమీద బయలుదేరు నువ్వు సింహవాహినివని మాకు తెలుసు అయినా ఈవేళ శివుడేం రావటం లేదు" అంటే ఆయన కారు free గా ఉంది దీన్ని ఎక్కమన్నాడు. అప్పుడు వృష-- వృషభేంద్ర యాన చేసి అది చేసి [చదువుతున్నాడు] యజ్ఞ భూమాంగులై అగ్ని నరిగి అరిగి. యజ్ఞం ఎక్కడ జరుగుతున్నదో భూమార్గం వైపు నెమ్మదిగా నడిచి వెళ్తుంటే యజ్ఞశాల ప్రవేశించింది అమ్మవారు. అమ్మవారు ఒక్కతే కనపడుతూ ఉన్నదట. యజ్ఞ ప్రాంగణంలో రుద్రులంతా కనపడట్లే అదృశ్య రూపంగా ఉన్నారు. దృశ్య రూపంగా ఎవరున్నారంటే ఒక్క అమ్మవారే. ఎందుకని అమ్మవారు అంటే దక్షుడు ఇంట ప్రవేశించినప్పుడే ఆమె అదృశ్య రూపాన్ని వదిలిపెట్టాలి వ్యక్త రూపం కావాలి. వ్యక్త రూపం వస్తేనే సతీదేవి వచ్చిందని వాళ్ళకి ఒక ఊహ కలుగుతుంది. [చదువుతున్నాడు] చనుదెంచిన మగువను జననియు సోదరులు తక్క సభగల జనులెల్లను దక్షులవల భయమున అనయను నప్పుడు ఆదరింప రేయిరి మహాత్మ. తల్లి చూడలేదట, సోదరీమణులు దగ్గరకు తీయలేదట. ఆమెకి సోదరులున్నారు వాళ్ళు దగ్గరకు తీయలేదు అంతెందుకు అసలు సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్క దక్షుడి యొక్క భయం వలన వాళ్ళు ఈమెను పలకరించలేదు. ఎవరైనా మన ఇంటికి వస్తే ఎంత ఆదరించాలి ఎంత దగ్గరకు తీయాలి వచ్చారా అనాలి ఎట్లా ఉన్నారని అనాలి కుశల ప్రశ్నలు వేయాలి అవేం లేవసరా అని పట్టించుకోలేదట. ఈయన జన కూడా అటువైపు తల కూడా తిప్పి చూడలేదట వస్తే వచ్చింది పోతే పోయిందని కూర్చున్నాడు వాడు. అవమానం భరించలేక పాపం వాళ్ళందరినీ కథంతా ఉందిగా పద్యాలు మనకు అక్కర్లా ఒక్కొక్కళ్ళని అడిగింది "ఎందుకని నాతో మాట్లాడటం లేదు? ఎంత ఆయాసం ఎంత ప్రయాణం చేసి వచ్చాను నేను. అందునా ఎందుకు వచ్చాను? ఇదేం వేడుకా? జాతరా? కాదే. నా తండ్రి వాజపేయ యజ్ఞం చేస్తుంటే యజ్ఞ ఫలాన్ని పొందటానికి నేను రావలసిన అవసరం లేదా?" లేదనుకున్నాడు దక్షుడు కావాలనుకున్నది అమ్మవారు. సరే ఎవరూ ఏం ఉలకలేదు ఏం పలకలేదు ఎందుకంటే అప్పటికే దక్ష ప్రజాపతి అనేకమైనటువంటి తత్తుల చేత మదోమ్మత్తుడై ఉన్నాడు వాడు. బ్రహ్మనీ విష్ణువునీ కూడా మీరు రండి అని దగ్గరికి వెళ్లి పిలిచిన వాడు కాదు కబురు పెట్టాడు వాళ్ళకి. కబురు పెడితే వస్తారు వాళ్ళు గాని వాడి ఊహ. కానీ వాళ్ళు కూడా అలా వెళ్లారు ఎందుకని అంటే శివుడు సంహార కాండ ఆయన పని గనుక ఆయన చూసుకుంటారు వరాలు ఇచ్చేవాడు వేరు వరాలు పుచ్చుకొని తుంచేసేవాడు వేరు గనుక యజ్ఞ సభా మధ్యంలో దక్షుడు దగ్గరగా ఉండగా తండ్రిని సమీపించి మాట అడిగింది. "ఎప్పటికైనా పలకరిస్తావా?" అని అడిగింది. దక్షుడు చలించలే. చలించకుండా పెడముఖంగా ఉన్నాడట వాడు. పెడముఖం వయచి నుంచున్నాడు. నుంచున్నాడు యజ్ఞం కొనసాగించండి అంటున్నాడు. ఎవరో వస్తే మన యజ్ఞం ఆగుతుందా ముహూర్తం ప్రకారం ప్రారంభించమంటున్నాడు. [చదువుతున్నాడు] కామ క్రోధాది శత్రు విఘాతియగు సతీ దేవి ఉదన్ముఖియై జలంబు లాచనంబు జేసి సుచియై మౌనంబు ధరించి. చూడండి ఎప్పుడైతే ఎవరూ పలకరించలేదో ఆమెను మౌనం ఆశ్రయించింది.అక్కడ ఉన్నటువంటి పుణ్య జలాలు చేతిలో తీసుకున్నది ఆచమనం చేసింది శుచి చేసుకున్నది అంటే ఆమెకు శుచి లేదా అమ్మవారు కదా అంటే దక్షుడు యన్ దక్షుడి వంటి యజ్ఞ వాటిలో ప్రవేశించినందువలన అమ్మవారికి ఆవరణ దోషం ఏర్పడింది అది అందుకనే మనం కూడా అన్ని చోట్లకి వెళ్ళకూడదు ఆవరణ దోషం విక్షేప దోషం మల దోషం అని మూడు ఉంటాయి జీవుడికి ప్రధానంగా ఆవరణ దోషం ఆవరణ దోషంలో స్వామిని గురించినటువంటి అనేక మంచి విషయాలు వినబడేటువంటి చోటకి గనక మనం వెళితే మన మనస్సు ఆనందతాండవం చేస్తుంది ఓహో స్వామిని గురించి ఇలా కూడా అనుకోవచ్చు కదా ఇంతవరకు తోచలేదే ఇట్లా ఉపాసన చేద్దాం అని మనస్సు స్వామి వైపు వెళుతుంది ఆవరణ మంచిదే పెండాలు బానే ఉంది మైకులు బానే అంతా బానే ఉంది అక్కడ స్వామి లేరు ఏమైనా ఆనందం కలుగుతుందా కలగదు మనకి కలగనటువంటి దక్ష ప్రజాపతి ఆవరణంలోకి వచ్చింది గనక ఆవిడకి ఏకకాలంలో ఆవరణ దోషం మలదోషం విక్షే మల అంటే మాలిన్యం భావ మాలిన్యం ఎవరు పలకరించరు అంతా తిరస్కారమే అంతా లోచూపు అంతా కిందచూపు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఆమె జగజ్జనని మాములు ఆవిడ కాదు వెళ్ళింది అయినా సరే ఆమె పరిస్థితి అది ఉదం ముఖియై జలంబుల ఆచమనంబు చేసి శుచియై మౌనము ధరించి మాటలు ఇంకా అయిపోయినాయి [కొట్టు] ఇంకా ఆవిడ వెళ్లి పలకరించడానికి మనుషులే లేరక్కడ చితాసనయై భూమియందు ఆసీనయగుచు నేలమీద పద్మాసనం వేసుకుని కూర్చున్నది యోగమార్గంబున శరీర త్యాగము చేయ తలంచి యోగ మార్గంలో శరీరాన్ని వదిలిపెట్టేద్దాం అనుకున్నది ఏముంది ఒకవేళ తండ్రి పలకరించలేదు తోబుట్టువులు మాట్లాడలేదు ఏదో నిరాదరించారు ప్రాణాలు పోగొట్టుకుంటామా ఆమె అన్నది శరీరాన్ని నేను వదిలి పెడతాను ఎందుకు అయిందో అమ్మ పరమ రహస్యం చెప్తారు అది నవనీతం ఎందుకని అమ్మవారు శపిస్తే దక్షుడు ఒక్క నిమిషంలో పోయేవాడు శపించదు కారణం వాడు ఎంత దుర్మార్గుడు అయినా జన్మకు కారణమైన తండ్రి అయినాడు రెండు అమ్మవారు యజ్ఞాన్ని ప్రోద్బలం చేసి నిలబెడుతుందే తప్ప యజ్ఞ వాటికని దేహంతో ధ్వంసం చేయదు రెండు మూడవది తన వెనక వచ్చినటువంటి రుద్ర గణాలు అన్నీ కూడా ఉన్నాయి ఒక్కసారి వాళ్ళని వెనక ఒక్కసారి ఒక order వేసినట్లయితే దక్ష వాటికంతా అటు ఇటు కకావికలం చేయగలరు వాళ్ళు వాళ్ళు అవసరం తనకి లేదు మరి శరీరాన్ని ఎలా వదిలి పెట్టాలి ఏదో కుప్పకూలిపోయి గుండె ఆగిపోయి మరణించినట్టు మరణించడానికి వీల్లేదు యోగ మార్గాలు ఉన్నాయి యోగ మార్గంలో శరీరాన్ని వదిలిపెట్టిన అటువంటి వారు మన కాలంలో మనకి తెలిసి కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని తన చుట్టూ ఉన్నటువంటి వారికి అందరికీ చెప్పాడు రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకి నేను శరీరం వదిలి పెడుతున్నాను కపాల భేదనం జరగబోతున్నది నేను యోగ మార్గంలో శరీరాన్ని ఇక్కడ వదిలి పెడుతున్నాను అన్నాడు అంత గట్టివాడే అని నమ్మకం ఉన్నా వాళ్ళు practical గా ఎప్పుడూ చూసిన వాళ్ళు కారు గనుక వాళ్ళంతా గడియారాలు సరి చూసుకుని పెట్టుకున్నారు ములక మంచం మీద పద్మాసన స్థితుడై యోగ మార్గంలో మూలాధారంలో ఉన్నటువంటి వాయువును ఒక్కసారి బిగదీసి పైకి తీసి మనం చెప్పుకున్న మూల బంధనం జలంధర బంధనం ఓజ్జాన బంధనం మూడు బంధనాలు చేశాడు ఆయన మూల బంధం అంటే మూలాధారం నుంచి నడుము వరకు ఉన్నటువంటి నాభి వరకు ఉన్నటువంటిది మూల బంధం గాలిని బంధించాడు గాలిని ఎప్పుడైతే బంధిస్తామో physics ప్రకారం అది వేడెక్కుతుంది వేడెక్కిన దానిని ఇంకా బిగಿಯలాగాడు దానిని ఓజ్జాన బంధనం చేశాడు ఓజ్జాన బంధనం చేసి బిగించిన దానిని జలంధర బంధనం చేశాడు విశుద్ధ చక్రం దాకా అక్కడి దాకా జలంధర బంధనం అయిగా అయిపోగానే మూడు బంధనాలు కాగానే ఇక్కడ ఉన్నటువంటి వేడి గాలి సుషుమ్నా అనేటువంటి పలగని తాకింది ఇది యోగ విశేషం యోగ మార్గంలోకి అట్లా శరీరాన్ని ఒక్కసారి కుంభింపజేస్తాను ఒక్కసారి బిగబట్టినట్లయితే ప్రాణం పోతుంది అని ఆమె నిర్ణయించుకుంది యోగ మార్గం ద్వారా గనక శరీరాన్ని వదిలిపెట్టిన ట్లయితే శరీరం సుమారుగా ఇరవై ఒక్క రోజులు ప్రాణం వదిలిపెట్టినప్పుడు ఎట్లా ఉంటుందో ఇరవై ఒకటవ రోజు కూడా అట్లాగే ఉంటుంది అలా ఉన్నటువంటి వారు ఇద్దరు మళ్ళీ అందులో అరవింద యోగి ఒకరు అరవింద యోగి కూడా శరీరాన్ని అలాగే యోగ నిద్రలో ధారణ ముద్రలో దాన్ని వదిలిపెట్టారు అలాగే పరమహంస యోగానంద పరమహంస యోగానంద క్రితం రోజు సాయంకాలం British ambassador తో మాట్లాడారు ఆయన చాలా విషయాలు మాట్లాడారు హి వాజ్ లైక్ blossomed flower వికాసమానం చెందినటువంటి సహస్ర దళాలతో ఉన్నటువంటి ఒక పద్మంలా ఉన్నాడు పరమహంస యోగానంద మరునాడు ambassador చెప్పారు again at the same time I will come and meet you sir అన్నాడు మళ్ళీ ఇదే సమయానికి రేపు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని అన్నాడు for you there is tomorrow for this body there is no tomorrow that's it కరెక్ట్ గా time క్రితం రోజున కలిసారో అలాగే ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు వదిలిపెట్టిన తర్వాత ఆయనది కూడా ఇరవై ఒక్క రోజు శరీరంలో ఉన్న పరిమళాలు ఇంకా మామూలుగా ఉన్న స్థాయి కంటే గొప్పగా ఉన్నాయి ఇది మన చరిత్రలో అటువంటి వాళ్ళని కూడా మనం చక్కగా స్మరించుకోవాలి ఎందుకంటే యోగశాస్త్రం ఎవడికి యోగం అంటే ఆసనాలు అయిపోయినాయియోగా, యోగా master అంటే వాడు మూడు ఆసనాలు నేర్పేసి మూడు వేలు కాజేస్తున్నాడు, అది. అంతే, అది కాదు యోగం అంటే అంతరంగమైన సాధన. దానిలో మూలాధారం నుంచి సహస్రారం దాకా వాడు ప్రయాణం చేయాలి. దానికి అధ్యాత్మ విద్య ఉండాలి. ఏమా నియమాలన్నీ ఉండాలి. నిన్న చెప్పుకున్నవన్నీ ఉన్నట్లయితే అధ్యాత్మ plus యోగ విద్య, శాస్త్రం. రెండూ కలిస్తే సాంఖ్య అని చెప్పుకున్నాం. సాంఖ్య విద్యలో వాడు పూర్ణుడు కావాలి గనుక అమ్మవారికేముంది యోగ విద్య ఆమె, ఆమె అసలు యోగం. [శ్వాస] వరుస ప్రాణాపాన వాయు నిరోధంబుగా ఉంచి, వరుస ప్రాణాయామం చేసింది. క్రమ ప్రా-ప్రాణాయామం చేసింది. క్రమ ప్రాణాయామంలో శ్వాసని ఎట్లా ఆపాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ తుంచాలి, ఎక్కడ గతి నిరోధనం చేయాలి, అది తీసుకొచ్చేటువంటి అనేక వాసనా భూమికలన్నీ ఎలా వదిలిపెట్టాలి, తెలిసిన అమ్మవారు గనుక వరుస-- అంటే in a order ఒక particular order లో యోగ విద్యని [శ్వాస] ప్రాణాపాన వాయు నిరోధంబుగా ఉంచి వానిని ఏకముగా నాభితలమున గూర్చి అంతట ఉదానము దాకా, ఇప్పుడు నేను చెప్పింది ఉదానం అంటే, నెకయించి బుద్ధితో హృదయ పద్మమున నిల్పి సహస్రారం దాకా వెళ్ళి, వెళ్ళేటువంటి మార్గంలో వాని మెల్లన కంఠమార్గమున మరి భూమధ్యమున వసింపజేసి శివాంగ్రిరాజీవ చింతనముచే నాధునివక్క అన్యంబు చూడక అం మహాత్ముని యంకపీఠంబునందు ఆదరంబున ఉండు దేహంబు దక్షుబలని దోషంబు విడువదలచి తాల్చె తనువున అవిరాగ్ని ధారణములు మూలాధార, ఓజ్జ్యాన, జాలంధర బంధనాలు దాటి యోగా తారావళిలో శంకర భగవత్పాదులు ఇవన్నీ వర్ణిస్తారు. చెప్పుకుందాం ఒకరోజున. మూడింటిని బిగించి దక్షుని వలన జరిగినటువంటి ఒక మాలిన్యాన్ని పోగొట్టుకోవటానికి యోగాగ్ని రగుల్చుకున్నది. ఎందుకనిటంటే శివుని దగ్గరకు మళ్ళీ ఇదే శరీరంతోనే వెళ్ళను అన్నది. ఎందుకు వెళ్ళవమ్మా? వెళ్ళొచ్చు కదా? దక్షుణ్ణి సంహారం చేసింటే, నా తండ్రి తన ప్రాణంతో సమానంగా పెంచి, "ఇదిగో నా బిడ్డను నీకిస్తున్నాను" అని కాళ్ళు గడియ కన్యాదానం చేసి అన్యాపదేశంగా, పరోక్షంగా నా తండ్రికి నేను దూరంగా ఉన్నప్పుడు కూడా నన్నేమని పిలిచాడో తెలుసునా? పార్వతీ, గౌరీ అని పిలవలే. దాక్షాయణి అని పిలిచాడు. దక్ష పుత్రికా అంటూ నా తండ్రికి ఉదాత్తమైనటువంటి గౌరవాన్ని ఇచ్చాడు నా తండ్రి. అటువంటి వాణ్ని, అటువంటి పరమశివుణ్ణి నిందించాడు వీడు. కాబట్టి దాక్షాయణి నామంతో ఉన్న దేహంతో మళ్ళీ నేను నా పరమశివుడి దగ్గరకు చేరను అన్నది. ఎంత గొప్ప భావనో చూడండి. అంక భాగంలో కూర్చున్నట్లుగా, అంక భాగం ఏమిటి సింహాసనం. నేలమీద కూర్చున్నది లేచింది, అయ్యవారి అంక భాగంలో కూర్చొని యోగాగ్ని రగుల్చుకొని దాక్షాయణి అయిన నా తండ్రికి, దాక్షాయణి పేరు ఎందుకు వచ్చింది? తన తండ్రి పేరుతో కలిపి. ఇకపై దాక్షాయణే గనక లేకపోతే శివుడు ఇంకెవర్ని పిలుస్తాడు? ఇకపై ఎవరినీ పిలవకుండా ఉండు గాక అని యోగాగ్నిలో తన శరీరాన్ని పావకం చేసింది.
SSSMC · audio

Bhagawata Navaneetham - 31

Home

Bhagawata Navaneetham - 31

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 28:12

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

    Now playing
  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67