Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం, సౌందర్య సార సర్వస్వం. మందస్మిత మనోహరం. వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. ప్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం. మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం. ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాత్. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ. సప్త ద్వీప విశాల భూభరము దోస్తంభ మున్పుని సంప్రాప్త శ్రీయుతుడై మహావిభవ సంపచ్చారుతుం గల్గి దుర్యాప్తిం జెందక వైష్ణవార్చనల మీరన్ కాలమున్ పుచ్చుచున్ సుప్తింబుందక యొత్తె సద్గుణ గరిష్టుండు అంబరీషుండిలన్. సంపదలున్నాయి, ఐశ్వర్యాలున్నాయి, రాచరికం ఉంది, అధికారం ఉంది. ఉన్నది గడని ఆయన తిని పడుకోలేదట. ఏం చేసాడయ్యా? ఇరవై నాలుగు గంటలు హరినామ సంకీర్తనంతో మనసును నిలబెట్టుకున్నాడట ఆయన. ఎక్కడ ఆయన ఏం చేశాడు? చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద అందు అంటే అక్కడ అని అంద అంటే అక్కడే అని అర్థం. అందు అంటే అక్కడ కూర్చున్నాం వేరు, అక్కడే కూర్చున్నాం వేరు. ఈయన చిత్తం ఎక్కడున్నదంటే శ్రీహరి పాదపద్మాల మీద ఉన్నది. పలుకులు హరిగుణ పఠనమందున కరములు విష్ణు మందిర మార్జనములందున. రాజై యుండి శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం తన ఇంట్లో అంతఃపురం లో ఎక్కడున్నదో స్వయంగా తుడిచేవాడట ఒంగి. అది మార్జనం అంటే మనం తెలుగులో ఊడ్చటం అంటాం. చిప్రి పెట్టి తుడవడం అంటాం. అట్లా అన్నమాట. శ్రవ-శ్రవములు హరి కథా శ్రవణముల మంద చూపులు గోవింద రూప వీక్షణ మంద శిరము కేశవ నమస్కృతుల యంద పదములు ఈశ్వర దేహ పరిసత్పుణములంద కామంబు చక్రి కైంకర్య మంద. కామము అంటే ఆయనకు ఒక కోరిక ఉందట. అది ఏమిటయా అంటే చక్రికి, విష్ణువుకి సేవ చేయడమే ఆయన కోరిక ఇంకేం లేదు. సంగమం అచ్యుత జనత అనుసంగ మంద ధ్యానము అసురారి భక్తాగ్రి కమల మంద రసన తులసీ దళములంద రతులు పుణ్య సంగతుల యంద. రాజచంద్రమునకు ఆయనకి రుచి చాలా ఆనందం కలిగించేది తులసి దళం అట. దాన్ని పరమాత్మకు చూపించే తులసి దళాన్ని నోట్లో వేసుకునేవాడు. అంటే పుట్టుక చేత, స్వభావం చేత, సాధన చేత, తతీక్ష చేత, లోచూపు చేత, సంస్కారం చేత ఏం పొందాడయ్యా అంటే హరి యందు అనన్యమైనటువంటి ఒక భక్తి పారమ్యాన్ని పొందాడాయన. హరియని సంభావించును హరియని దర్శించు అంటు నాగాణించున్ హరియని రుచిగొనతలచును హరి హరి గను అంబరీషు అలవియ పొగడన్. ఎవరిని చూసినా హరి అంటాడట. ఎవరితో మాట్లాడినా హరి అంటాడట. సన్నివేశం మనకి రామాయణంలో కూడా ఉంది. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు పధ్నాలుగు నెలలు, ఇక్కడ పధ్నాలుగు సంవత్సరాలు. అయోధ్య అను వీధిలో పుట్టిన ప్రతి బిడ్డకి కూడా రామచంద్ర అని పేరు పెట్టుకున్నారు. ఇంకో పేరు పెట్టుకోలేవారు. ఎందుకని అంటే ఎవరినైనా అలాగే పిలవాలని అనుకున్నారట. అలాగే ఒకళ్ళనొకళ్ళు రామా అని పలకరించుకునేవారట. రామా అంటే రెండర్థాలున్నాయి. ఒకటి రామచంద్రుడు అని అర్థం, రామా అంటే స్త్రీమూర్తి అని కూడా అర్థం. రామా, రామలంతా కూడా రామాలు అయినారు. శివ అంతా శివా అయినట్టుగా. శివా అంటే పార్వతి, శివ అంటే శివుడు. దీర్ఘం ఇచ్చామా స్త్రీ అవుతుంది, హస్వం చేశామా పురుషుడు అవుతాడు. ఇట్లు పుణ్య చిత్తంబు ఈశ్వరాయత్తంబునయ్యల నల్లన రాజ్యంబు చేయుచున్న సమయమున. హాయిగా ఇది ఇలా రాజ్యం చేస్తున్నాడు. ఒక చిన్న ఊహ కలిగింది. కోరికలు కలుగుతాయి కదా! మనకి హాయిగా ఉన్నా కోరికలు కలుగుతాయి, దుఃఖంలో ఉన్నా మరింత కోరికలు కలుగుతాయి. ఆయనకి హాయిగా ఉన్నటువంటి వేళ ఒక ఊహ కలిగింది, కోరిక కలిగింది. హరులందు కరులందు ధనము నందు కేళివనములందు పుత్రులందు బంధుమిత్రుల యందు పురము నందు అంతిపురము నందు ఈహమాని. ఒక ఊహ పుట్టిన తర్వాత ఈహ పోయిందట, కోరిక పోయిందట. ఎవరియందు, రాజ్యం యందు, ప్రజల యందు అందరియందు అసలు అనాసక్తి ఏర్పడింది. సరే అట్లా ఉంటూ ఉండగా సంసారం నుంచి మనస్సు ఎప్పుడైతే బయటకు వచ్చి ఏకాంతంలో భక్త పరవశుడై ఉన్నటువంటి వేళ పురుషోత్తముడు ప్రతిభట శిక్షుండు నిజజన రక్షణంబు అయినటువంటి ఈశ్వరుడికి పరమానందం కలిగింది. ఇంతే ఇటువంటి ఒక భక్తుడు ఉంటే చాలదా అని ఆయనకే అనిపించింది. శ్రీ మహావిష్ణువుకి. అనిపించి ఏం చేసాడంటే అంబరీషుడి దగ్గరికి తన చక్రాన్ని ఇచ్చేశాడు. చక్రాన్ని నీ దగ్గర పెట్టుకో అన్నాడు. దేనికి గుర్తు? స్వామి మనకు ఉంగరమో గొలుసో ఇచ్చారు. ఇచ్చారుగా. ఎందుకు ఇచ్చారంటే తనకు గుర్తుగా ఇచ్చారు. నా దగ్గర ఉన్నంత సేపు ఎట్లా ఉన్నావో నా ప్రతినిధిగా ఉన్న వస్తువు నీ దగ్గర ఉన్నంత సేపు నువ్వు అట్లాగే ఉండు అని ఆయన ఇచ్చారు. అది దాని వెనక...అంటే స్వామితో కూడి ఉన్నట్లయితే మనం ఎలా ప్రవర్తిస్తామో స్వామికి చెందిన వస్తువు మన దగ్గర ఉంటే మనం కూడా అలా ఉండాలి అని అందుకనే చక్రాన్ని ఇచ్చాడు. అప్పుడు తన తోడి నీడ కైవడి అనురూప గుణాజ్జైన ఆత్మ మహిషితో ఎప్పుడైతే చక్రం కూడా వచ్చేసిందో భగవంతుడి అనుగ్రహం మన మీద ఉన్నదని ఆయనకి ఆనందం కలిగి భార్య సహధర్మచారుడితో కూడి జనవిభుడు ద్వాదశి వ్రతమమరంగ హరి కూర్చి చేసే ఒక్క ఏడు అధిపా శుకుడు చెప్తున్నాడు ఒక ఏడాది ద్వాదశి వ్రతం చేసాడు అంట మనం ఏడాదిలో ఒక రోజు చేస్తాం అంతే ఈయన మూడు వందల అరవై ఐదు రోజులు చేశాడు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై రెండు రోజులు వ్రతంలోనే అయిపోయింది వ్రతం ముగిసే ముందు ఉపవాసం ఉండాలి ఎందుకని శరీరంలో ఏర్పడేటువంటి అనేకమైనటువంటి స్థితులన్నీ కూడా సమతుల్యంలోకి రావాలి కనుక ఉపాస-ఉపవాసం ఉండాలి ఉపవాసం మార్గంలో ఎప్పుడైతే ఉన్నాడో మూడు రోజుల్లో అప్పుడు ఆయనకి ఏమనిపించింది కార్తీక మాసంబున మూడు రాత్రులు ఉపవసించి కాళింది జలంబుల స్నాతుండై మధువనంబున మధువు అనేటటువంటి ఒక తోట పక్కన మహాభిషేక విధానంబున విహిత పరికర సంపన్నుడై హరిని అభిషేకంబు చేసి మనోహరంబులైన గంధంబులు సమర్పించుచి అభినవామోదంబులైన పుష్పంబుల పూజించి ఉపవాసం చేశాడు అర్చన చేశాడు అభిషేకం చేశాడు చూడండి భాగవతంలో నవమ స్కంధం దాకా మహాపురుషులంతా వేదవ్యాసుడితో సహా సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నారు ఏమైపోయింది సరస్వతీ నది ప్రయాగలో ఆమె ఇప్పుడు అంతర్వాహిని గంగా యమునా సరస్వతి గంగా యమునా కలిసి కనిపిస్తాయి ఒక నల్లటి చాలుగా ఒక చారగా సరస్వతీదేవి అంతర్వాహిని అయి కలుస్తుంది గనుక అది త్రివేణి సంగమం అయింది కాబట్టి సరస్వతీ నది ఎండిపోలేదు ఇవాళ మధ్య కూడా రీసెర్చ్ లో తేలింది ఏమిటంటే దక్షిణాదిలో సేతువు ఎట్లా ఉన్నదో అట్లాగే సరస్వతీ నది ప్రవహిస్తూనే ఉన్నది కాకపోతే గంగా యమునలు ఊర్ధ్వ స్థాయికి వెళ్ళినాయి గనుక అది తన దారిన తాను వెళుతూ ఉన్నది జ్ఞానం కూడా ఒక సరస్వతీ ప్రవాహమే అది బయటకు కనపడేది కాదు వేషంలో బయటపడేది కాదు అది ఆంతరంగికమైనటువంటిది అది వాడి హృదయానికి సంబంధించింది అది వ్యక్తికి పరమైనటువంటిది అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడు ఉపవాసం అయిపోయే టైంలో దానాలు ధర్మాలు ఇవ్వాలి అనేక గోవులను తీసుకొచ్చాడు కాళ్ళకి వెండి పట్టాలు కట్టించాడు కొమ్ములకి బంగారపు పూత పూయించాడు అలంకారం చేశాడు అటువంటివన్నీ కూడా గోవులను దానం చేశాడు తెక్కండ్రు విప్రవరులకు రెక్కున అతి భక్తితోడ కడుపులు నిండన్ చొక్క పుటన్నం విడి విభుడు ఎక్కడ పారణము సేయవు చొగింపన్ దానధర్మాలు అయిపోయినాయి అర్చనలు అయినాయి అభిషేకం అయింది ఆరాధన అయింది పారణ చేయాలి పారణ చేయటం అంటే తాను కూడా కస్తూరి ముద్దను తిని అప్పటికే మూడు వందల అరవై నాలుగు రోజులు పూర్ణం అయిపోయింది ఈయన ఏలింది ఒక రోజు హాసుర నిగమ దోపన్యాసుడు సుతపో ఉలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడు అతిథి అయ్యే తన్ నివాసమునన్ పరీక్షలు ఇలాగే వస్తాయి మూడు వందల అరవై నాలుగు రోజులు రాసి రేపు పొద్దునే పరీక్ష అంటే మనకు జ్వరం వచ్చినట్లుగా ఒక్కరోజు రాకపోతే తర్వాత మర్నాడు రావచ్చుగా నెల సేల్లేగా అట్లా రాదు పరీక్ష వల్లే వస్తుంది అది పరీక్ష నాడే వస్తుంది రాలేకపోతే మనకి దొంగ జ్వరం కూడా వస్తుంది కానీ వీడికి ఏమైందంటే వ్రతభంగం చేయటానిక అన్నట్టుగా దుర్వాసుడు వచ్చాడు. వాడికి పాపం చేద్దామని రాలే వచ్చాడు అంతే సమయానికి అలా కూరాడు అతిథిగా వచ్చాడు వచ్చిన వాడు మామూలు వాడు కాదు వాడు వస్తే ఈయన ఏం చేశాడు రాజు గారు అసలే బ్రహ్మర్షి కూర్చోబెట్టాడు ఉచితాసనం మీద కాళ్ళు కడిగాడు అయ్యా మీకు ఏం కావాలి అన్నాడు అది కావాలి ఇది కావాలి మీతో ఎంతమంది వచ్చారు అన్నాడు అందరికీ ఇదిగో నా పారణం చేసే సమయంలో మీరు వచ్చారు మృష్టాన్న భోజనం చేసి శిష్య సమేతంగా నన్ను ఆశీర్వదించండి అని పాపం అడిగాడు అడిగితే ఆయన ఏమన్నాడు అంటే మంచిదేనయ్యా ఇక్కడ ఎక్కడ మీ ఇంట్లో కనుక మీ అందరం స్నానం చేస్తే వాకిట్లో ఉన్న బావి ఎండిపోతుంది ఇక్కడ ఏదన్నా నది ఉంటే చెప్పు అక్కడ స్నానం చేస్తా అన్నాడు కాళింది ఈనది ఉందిగా అక్కడికి వెళ్లి రండి అన్నాడు వెళ్ళాడు ఆయన వెళ్ళాడు వాడు దుర్వాసుడు వెళ్ళాడు అంతే స్నానం చేసి రా అన్నాడు అన్నవాడు స్నానం చేసి ఏం చేయాలి రావాలి రాకుండా ఏమైపోయినాడో తెలీదు ఎంతకీ రాడు అతిథి రాకుండా భోజనం చేయకూడదు భోజనం చేయకపోతే వ్రత ఫలం దక్కదు పారణం చేయాలి చేయాలా చేయకూడదా మీమాంసలో ముని నీరు సచ్చి వెడలడు నీళ్ళల్లో దిగిన మునిగారు బయటికి రాడు చనియెడు ద్వాదశియు ఎంత చనియే నీలో నవపారణయున్ వలయును వినిపింపుడు అర్హ ధర్మమిదము ఎట్టిదియో అతిథి రాలేకపోయా ద్వాదశి గడియలు అన్నీ వెళ్ళిపోతున్నాయి పారణం చేయాలి నేను ఇది పూర్తి చేయాలి వ్రతం కదా ధర్మ విహితమైనటువంటి ఒక మార్గం చెప్పండి నా యజ్ఞశాలలో ఉన్న వాళ్ళందరినీ అంబరీషుడు అడిగాడు అప్పుడు వాళ్ళు అన్నారు అతిథివో రాణివోఅతిథి పా ఒకవేళ అతిథి రాకపోతే మనకు time ఇస్తారు కదా sharp one o clock వస్తా అంటాడు వాడు రాడు అప్పుడు స్నానానికి వెళ్తాడు వాడు అక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా డొక్కలు ఎండిపోతుంటాయి వాడు బయటకు రాడు, యాతన పెడతారు అటువంటి అతిథులు కూడా ఉంటారు మనకి కాకపోతే పరీక్ష అది. అటువంటి సమయాల్లో ఏం చేయాలి అంటే [కొట్టు] "ఈ ద్వాదశి పారణంబు మానుట పాడి కాదు కుడువకుండరాదు కుడుచుటయు కాదు" తిన్నట్టు కాదు తిననట్టు కాదు ఒక చిన్న సలహా ఇస్తాం "సలిల భక్షణంబు సమ్మతంబు" కాస్త గుక్కెడు నీళ్ళు తాగండి తాగవయ్యా రాజా తాగినట్టే తాగినట్లయితే పారణం పూర్తయినట్లు వ్రతం పూర్తయినట్లు తిన్నట్టు కాదు తిననట్టు కాదు ఇంతలోపు ఎంత సేపు ఉంటాడు నీళ్ళల్లో రాడా అని వీళ్ళు పాపం సలహా ఇచ్చారు. సలహా ఇచ్చినా "మనమున హరిన్ తలంచి" మళ్ళీ పాపం ఆయన పరమాత్మకే నాయనా ఇటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినవాడు దూర్వాసుడు మామూలు వాడు కాదు ఇంకోడు ఇంకోడైతే కాసేపు నచ్చ చెప్పొచ్చు ఆయన ఒప్పుకోడు అటువంటి వాడితో నాకు ఇబ్బంది అయినా నీకు చెప్పుకుంటున్నా అన్నాడు "పారణంబు చేసి జలంబుల మునిగిన తపసి రాకకు ఎదురు చూచున్న సమయములో" ఈయన ఇలా గుక్కెడు నోట్లో వేసుకున్నాడో లేదో దూర్వాసుడు వస్తున్నాడు [కొట్టు] చూడండి ఇంతకంటే పరీక్ష ఎవడికి గృహస్తుకు ఉంటుందా? ఆయన వస్తున్నాడు ఎలా వస్తున్నాడు శిష్య సమేతంగా వస్తున్నాడు హాయిగా స్నానం చేసి మన వాళ్ళంతా ఎదురు చూస్తున్నారని "యమునలోకృత కృత్యుడై వచ్చి రాజు చే సేవతుండై" రాగానే మామూలుగా మళ్ళీ కృత్యులో కూర్చోబెట్టారు [కొట్టు] "రాజ చేష్టితంబు బుద్ధిలో ఊహించి" వాడికి దివ్యజ్ఞానం ఉంది వీడు మంచి నీళ్ళు తాగాడురా అని వాడికి అనిపించింది అనిపించి ఎప్పుడైతే తాగాడో "బ్రహ్మముడితో" కోపం వచ్చింది వాడికి "అగర్రెడి మేనితో" క్రోధం రాగానే శరీరం ఊగిపోయింది "ఆగ్రహిం నుంచి రెట్టిం నుంచి ఆకలి కొట్టు మిట్టాడంగా" అసలే ఆకలి ఉంది లోపల పైన కోపం ఏదో అవమానం చేసినట్టు "నేయి సంపదున్ మత్తు మృశంసు దురహంకారు యెందరు కంటిరే విష్ణు భక్తుడు గాడు వీడు" నన్ను అవమానించిన వీడు విష్ణు భక్తుడు అని ఎలా అనుకుంటున్నారయ్యా "నన్ను కుడువరమ్మని మును ముట్ట కుడిచినాడు" నన్ను భోజనానికి రా అని చెప్పి ముందే గొంతు చేసాడే "ధర్మ భంగంబు జేర్చి దుష్కరుండయ్యే అయినా ఇప్పుడు చూపెద అన్ని దిశల నేను కోపింతు మాంచు వాడెవ్వడు" నేను ఇప్పుడు కోపిస్తా వీణ్ణి అంటే శపిస్తా వీడికి శాపం నుంచి వీడిని బయట పడేసేవాడు ఎవడున్నాడో నేను చూస్తా అంటూ అరుస్తున్నాడు ఊగుతున్నాడు సరే అక్కడ కోపం వచ్చిన వాడి పద్యం ఎందుకు అయినా రాసాడు ఈయన "పడపడ పంగుకి కుచ్చు" పళ్ళు కటకట "భీకరుడై కనుగ్రೇ నిప్పు కల పుటపుట రాల గండము రూపంద మనేంద్రుడు హుంకరార్చుచున్ జటమద వెంటగా తెరికి చక్కన గానవ కృత్యనాయుదే ఒక్కట పరశూన హస్తయుతగా వనరించి కవించె రాజుపై కాలామల సన్నిభయై శూలాయుధ హస్త యగుచు సురసుర సుర్కన్ వేల పదంబుల తొక్కుచు వాలి మహా కృత్య మనుజ వల్లభుజేరిన్" దూర్వాసుడి వలన మహా కృత్య అనేటువంటి ఒక రాక్షసి పుట్టింది రాక్షసి తప్ప సాత్విక గుణమైనటువంటి అంబరీషుడి దగ్గరికి చేరింది అయితే "ఆ ప్రకారమెరిగి హరి విశ్వరూపుడు వెర్రి తపస్సి సేయు వేడవంబు చక్కబెట్టు మనుచు" వీడు వెర్రి తపస్వి అన్నాడు విష్ణువు వీడేం తపస్వి ఎలా ఉండాలి కోపం పోయుండాలి తపస్సు చేశాడు కానీ వెర్రివాడు వీడు ఎవరి మీద ఆగ్రహించాలో ఎవరి మీద ఆగ్రహించకూడదో సమయం ఏమిటో అసమయం ఏమిటో తెలియదు అని ఏం చేసాడంటే అయిందేం పోయింది [కొట్టు] అందుకే అంబరీషుడి దగ్గర ముందే చక్రం పెట్టించాడు ఆయన అంబరీషుడికి చక్రం ఇచ్చాడుగా వీడి భక్తికి మెచ్చి ఆయన ఏం చేసాడంటే వెళ్ళు వాడి సంగతి చూడు అన్నాడు చూడమన్నంగానే అది పూజా మందిరంలో నుంచి లేచింది చక్రం లేచి దూర్వాసుడు ఎక్కడున్నా అట్లా గిరగిర తిరుగుతూ వాడివైపు వెళ్ళింది వెళితే వాడు ఏం చేశాడు కృత్య మహా కృత్య దేన్నైతే వాడు సృష్టించాడో కోపంలో దానిని చక్రం ఖండనం చేసింది అదే మరణించింది అయిపోయిన తర్వాత ఏం మిగిలింది ఆవిడ శాపం ఇచ్చినటువంటి దూర్వాసుడు మిగిలాడు వాడి వైపు వెళుతుంటే వాడికి భయమేసింది వాడి కళ్ళ ముందే వాడు సృష్టించింది పోయింది కదా అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో పరిగెత్తుతున్నాడు చక్రం కూడా ఏం చేసిందంటే "భువిదూరన్ భువిదూరు అబ్ధిదర అబ్ధుల్ సచ్చు ఉద్వేగియై దివిబ్రాకన్ దివిబ్రాకు దిక్కులకు పో దిగ్గీధునంబోవు చిక్కి ఎసన్ బ్రుంగిన గ్రుంకు నిలువ నిలుచున్" పరిగెత్తు పరిగెత్తు ఆయాసం చాలితే చక్రం కూడా అయిపోతుంది పరిగెత్తితే పరిగెత్తుతుంది ఎక్కడన్నా దొరితే దూరుతుంది కాదని ఏదో తపోశక్తితో ఆకాశంలోకి అటలోకంలోకి వెళితే చక్రం కూడా లేస్తుంది ఎందుకంటే చక్రం వచ్చిందే అసలు అక్కడి నుంచి కదా దానికే వైకుంఠం కొత్తగా దూర్వాసుడికి తప్ప "క్రీడింప క్రీడించు ఒక్కబడిన్ తాపసు వెంటనంటి హరి చక్రంభువన్య దుర్వక్రమై" ఎవ్వరూ ఆపడానికి వీలు లేని పరిస్థితి వస్తే మొట్టమొదట వాడు ఏం చేసాడంటే పద్యాలక్కర్లా బ్రహ్మ లోకానికి పోయినాడు పోయి విష్ణు చక్రం నా వెనక పరిగెత్తుకొస్తున్నది వేయ్ నువ్వు కాస్త చెప్పి ఆపు బ్రహ్మదేవుడా నేను పొరపాటు చేశానా చేయలేదా తర్వాత చూద్దాం ముందు చక్రం వస్తుంది దాన్ని ఆపు అన్నాడుఆయన ఆయన పని ఏంటంటే బొమ్మ గీయటం అడ్రస్ లో కవర్ లో పెట్టడం right address wrong address పోస్ట్ చేయటం. ఆయనకేం సుఖంగా అమ్మవారు వీణ వాయిస్తూ ఉంటుంది సంకల్పాలు జరుగుతుంటాయి జీవులంతా తర మీద కనిపిస్తుంటారు. వీడు మహా పుణ్యం చేశాడు వీడిని రాజును చేస్తాడు మహా పాపం చేశాడు బంటును చేస్తాడు. దుర్భాగ్యాన్నిస్తాడు సౌభాగ్యాన్నిస్తాడు. ఇలా విధి అంతా కూడా బొమ్మ అంతా గీసి నుదుట ఒక చిన్న గీత గీసేసి sign చేసి పంపిస్తాడు. ఇక wrong address right address మనం వచ్చి ఇక్కడ పడిపోతాం. పనిలో ఆయన ఉంటే దుర్వాసుడు వచ్చి చక్రం వస్తుంది దూడం అంటాడు. సరే ఆయన ఏమన్నాడంటే, "కరిమర్దిన్ దిపరాధ సంజ గలై కాలంబు కాలాత్ముడై పరిధిన్ మిండగజేసి లోకములు చోటున్ విభుండెవ్వడో హరిపూర్తిన్ కనుగేవ కెంపుకదరన్ భస్మంబు గాజేయు. ఆహరి చక్రానల కీలకు అన్యుగ కరండు అడ్డంబు కానేర్చునే". అసలు మహా ప్రళయ తరువుకొస్తున్నట్టుగా వచ్చేదానికి ఎవడెళ్లి అడ్డం నించుంటాడయ్యా ఆగు అనేలోగా వీడు మాయమైపోతాడు నశించిపోతాడు. ఇది ఇట్ల అయ్యేది పని కాదు. నా పని ఏంటంటే వాళ్ళు కొంతమంది పని చేయని వాళ్ళుంటారు నా పని ఇంతే అంటాడు. అంటే తర్వాత చేయగలడు కానీ చేయడు time లో. "యేనుభవుడా" నేను బ్రహ్మని. వీడికి తెలీదా? చేస్తున్నాడని పని చేయదలుచుకోలే. "దక్షుడు ఇంద్రాదులు ప్రజాపతులు భృగుడు భూతపతులు శిరమునందు దాల్తుము అతని ఆజ్ఞ జగద్ధితంబంచు భూరి కార్యమతులమనుచు". మేమందరం కూడా ఒక్కడి ఆజ్ఞకి లోబడి ఉంటాం. ఆయన పేరు విష్ణువు. వస్తున్న చక్రం కూడా విష్ణువుది కాబట్టి ఇందులో నేను నేనే కాదు అని ఒక list ఇచ్చాడు. వీళ్ళెవరూ నీకు అడ్డం రాರು ఒక పని చెయ్ కైలాసానికి దాకా వెళ్ళు అక్కడైనా పని జరుగుతుంది అన్నాడు. వీడికి ఎక్కడైతే ఏం పని జరగాలి కైలాసానికి చేరాడు. అక్కడ ఆయన ఏం చేశాడంటే అమ్మవారితో హాయిగా ఆడుకుంటున్నాడు. ఆయనకి లాస్యం, నాట్యం, తాండవం, ధ్యానం, యోగం, తపస్సు రామ రామ జపం చేసుకుంటాడు రాముడు శివుడు. "జానాతి రామ తవ నామ రుచిమ్ మహేశో" రామా! నీ నామ రుచి తెలియాలి అంటే ఒక్కడికి తెలుసయ్యా వాడి పేరు శివుడు అన్నాడు అది. "జానాతి దూర్బల పరాక్రమమిశచాపో" నీ భుజబలం నీ ధనుర్బలం తెలియాలి అంటే ఒక్క శివధనుస్సుకే తెలుసు. "జానాతి గౌతమసతీ చరణ ప్రభావం" రామ పాద ప్రభావం ఒక్క హల్యకే తెలుసు. "జానాతి దూర్బల పరాక్రమమిశచాపో జానాత్యమోఘపటు బాణగతి పయోధిః" రావణబ్రహ్మ కూడా తెలీదు ఇంకా దయతో యుద్ధం చేశాడు. అసలు వారధి కట్టేచోట సముద్రుడి వైపులా బాణం తీస్తేనే సముద్రుడు ఒనికి బయటకు వచ్చాడు. అలాగే అట్లా శివుడి పని అలా ఉంటే ఆయనేం వినిపించుకున్నట్టుగా లేడు. అది వినిపించుకోడు శివుడు అది వింటాడంటాం గానీ విననివాడే శివుడు అసలు. "విమవయ్యటండ్రి" దుర్వాసుడి భాష మారిపోయింది. "ఈ విశ్వేశ్వరుని యందు చతురాస్య కోజీవకోశములు తెక్కు వేల సంఖ్యల గూడి వీళ్ళతో ఇబ్బంగినగుచుండు చనుచుండు అదియు గాక యవ్వానిచే భ్రాంతినేమందుచున్నారమేను దేవలుడు అసురేంద్రసుతుడు నారదుడు అజుడు సనత్కుమారుడు ధర్ముడు కపిలుడు" ఇక వీళ్ళందరూ వీళ్ళంతా బ్రహ్మవేత్తలు నారదుడు కపిలుడు ఇటువంటి వారంతా కూడా మేమందరం కూడా ఒకడినే ఆశ్రయించి ఉంటాం అన్నాడు శివుడు. ఏం చేయాలి అని. "నీవు అం మహాత్ముని శరణంబు వేడు" అన్నాడు శివుడు. పోయి హాయిగా విష్ణువునిది వాడి చక్రం ఆయనది ఆయన ఆపగలిగితే ఆయన ఆపాలి నా వల్ల కూడా కాదు పొమ్మన్నాడు. సరే వెళ్ళాడు. ఆయన వెళ్ళేప్పటికి ఆయన ఎలా ఉన్నాడంటే "అలవైకుంఠప్రదంబులు నగరిలో ఆమూల సౌధంబు దాపల" మనకు తెలుసు. "మందారవనాంతరాంబృతసరః ప్రాంతేందు కాంతోపలోత్పల బ్రహ్మావినోదియగు అపన్నప్రసన్నుండు" ఆయన అక్కడ అలా ఉంటే "ఆ వైకుంఠములోని బ్రహ్మమణి సౌధాగ్రంబుపై లచ్చి తాక్రేవన్నలన నర్మభాషణములన్ క్రీడింప" విష్ణువు అమ్మవారు గుసగుసలు చెప్పుకుంటున్నారట వీడు వెళ్ళని సమయంలో. ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు మన మొండివాడి గురించే. పాపం ఇలా అయిపోయాడే అంబరీషుడి గురించే అనుకొని ఉండాలి time లో. వాళ్ళకి వేరే ఎవరున్నారు మనమందరం వారి బిడ్డలం కాబట్టి వారికి గుసగుసలు కోకోలు ఏం లేవు. సృష్టి ఇది ఎలా నడుస్తుంది వీళ్ళని ఎలా రక్షించాలి వాళ్ళ తాపత్రయమంతా అది. "క్రీడింతు పుణ్యం హరిన్ దేవాధీశ్వరుగాంచి వరదవో దేవేశ భక్త రక్షా విద్యాపరతంత్ర మాంతగదే చక్రానల జ్వాలలన్" చక్రంలో నుంచి వచ్చే జ్వాలలు ఆపినన్ను కాపాడవయ్యా అని అంటుంటే ఆయన అప్పుడన్నాడు, "నాకు మేలుగోరనా భక్తులకాని భక్తిజనులకేన పరమగతియు భక్తుడెందు జనిన పరతంత్రు వెనువెంట ఒవు వెంట తగులుకోడ భంగి" ఆవు వెంట ఎలా వెళ్ళాలో దూడ ఎలా తల్లి ఆవు వెనుక బిడ్డ ఆవు ఎలా వెళుతుందో నా భక్తుల వెనుక నేను అలా ఒక దూడలాగా వెళతాను తప్ప వేరే వెళ్ళను. నా భక్తులు ఎక్కడుంటే వాళ్ళ వెనకే వెళతాను నాకు మార్గం వేరే లేదు అన్నాడీయన. విష్ణువు చూడండి అంటే పరమేశ్వరుడి యొక్క విభూతి దివ్యతత్వం. "తనువు మనువు విడిచి తనయుల చుట్టాలాలి విడిచి సంపదాలి విడిచి సన్నగాని నన్నగాని అన్యనొవడు ఎరుంగని వారిని విడువను ఎట్టివారినైనా" ప్రపంచమంతా వదిలిపెట్టి నిల్చుంటాడే వాడు ఎటువంటి వాడు గానీ వాణ్ణి మాత్రం నేను వదిలిపెట్టను అన్నాడు. ఇక మూడవది, "సాధుల హృదయంబు నా యది సాధుల హృదయంద నేను జగముల నల్లన్ సాధుల నేన ఎరుంగుదు సాధులెరుంగుదు నాదు చరితము విప్రా" సాధువు ఎవడు అసాధువు ఎవడో నాకొక్కడికి తెలుసు. మనం స్వామికి ఎప్పుడూ ఉత్తరాలు రాయక్కర్లేదు వీడు చెడ్డవాడు బాగా పని చేయట్లేదు వీణ్ణి తీసేయండి అని రాయకూడదు. ఆయనకన్నీ తెలుసు ఎవర్ని ఎప్పుడు ఉంచాలి ఎవర్ని తీకెయ్యాలి తన కార్యక్రమంలో ఎవరుండకూడదు అన్నీ ఆయనకు తెలుసు. కానీ అమాయకత్వం చేత అహంకారం చేత మనం అటువంటి పాపకృత్యాలకు పాల్పడతాం. కార్యక్రమంలో ఆయనకు తెలుసు దేన్ని ఎట్లా వాడుకోవాలి తన కార్యక్రమాన్ని తాను ఎట్లా నడపాలి కనుక నా గురించి వాళ్ళ గురించి నాకెట్లా తెలుసో నా తత్వం కూడా వాళ్ళకే తెలుసు అన్నాడు మరి. ఇంకా అందరికీ తెలియదు ఊరికేనే కనిపిస్తుంటాం అని.
SSSMC · audio

Bhagawata Navaneetham - 49

Home

Bhagawata Navaneetham - 49

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 25:37

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

    Now playing
  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67