Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం ప్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబెన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాత్ పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ వేదవ్యాస ప్రోక్తమై పోతనామాత్య కృతమైనటువంటి శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలో నిన్న గజేంద్ర మోక్షణం విన్నాం. ఈరోజు వామనావతార ఘట్టం వామన చరితం వామన చరితం అంటే మనకి స్థూలంగా కథ తెలుసు బలి చక్రవర్తిని మూడు అడుగుల నేల అడిగాడని కుడి ఎడమ పాదాలతో కొన్ని లోకాలు ఆక్రమించాడని మరి మూడో అడుగు ఎక్కడ అని అడిగాడని దిక్కుతోచని బలి తన బ్రహ్మ రంధ్రం మీదే పాద సంస్పర్శనం చేయమన్నాడని మనకి రకంగా బలి పాతాళ లోకానికి వెళ్ళాడని స్థూలంగా మనకందరికీ అర్థమయ్యేటువంటి కథ అయితే కథ వెనక చాలా ఉంది. ఏమున్నది? భాగవతంలో మూడు రకాలుగా కథా కథనం సాగుతుంది. ఒకటి జీవుడి వేదన పరమేశ్వరుడి కరుణ. రాక్షస భావాలకి అమరులైనటువంటి సత్వగుణ ప్రధానులైన సాధకుల భావాలకి సంఘర్షణ. అంటే దేవతలకి రాక్షసులకి పోరాటం. ఎప్పటికైనా రాక్షస సంహారం చేయాలి, దేవతలను రక్షించాలి అది పరమాత్మ కర్తవ్యం. అది లోకంలో జరిగినా లోకానికి ఆయనకు వెళ్లటం ఆయనకు అలవాటే. ఎందుకంటే నిజానికి లోకంలోకి వెళ్లటం అనే మాటే లేదు. అన్ని లోకాల్లో ఆయన ఉన్నాడు గనుక. కాకపోతే అభివ్యక్తమవుతాడు manifest అవుతాడు. manifest అయినప్పుడు ఇదిగో మత్స్య అవతారం, ఇదిగో కూర్మావతారం, ఇదిగో వరాహ అవతారం, ఇదిగో ఈవేళ వామనావతారం అని కథలుగా చెప్పుకుంటాం. ఇక నాలుగోపాయం ఒకటుంది. నాలుగోపాయం ఏమిటంటే ఉత్తములైనటువంటి తల్లిదండ్రులు పరమాత్మతో సంభాషించగలిగిన ఒక స్థితి ఏర్పడినప్పుడు వాళ్ళు ఒకటి కోరుతారు. భోగభాగ్యాలు అడగరు, సంపద అడగరు, కీర్తి అడగరు, ఆయుష్షు అడగరు, ఆరోగ్యం అడగరు. ఇవన్నీ లోకానికి సంబంధించిన విషయాలు. మీ వంటి కొడుకుని మాకు ఇవ్వమని అడుగుతారు తల్లి తండ్రి కూడా. ఆయనేమంటాడంటే "బానే అడిగారు గాని నా వంటి వాడు మరొకడు లేడు కదా! ఏం చేయాలి?" అని ఆలోచనబడి "నేనే మీ కడుపున పుడతాను" అంటాడు. చూశారా? అడగటంలో అందం ఉంది, ఇవ్వటంలో కూడా అందం ఉంది. ఇంతదాకా వచ్చిన అందరూ నీవంటి కొడుకుని, దత్తాత్రేయుణ్ణి కూడా అట్లాగే అడిగారు. "నీలాంటి కొడుకు కావాలంటే ఉండడమ్మా నాలాంటి వాడు, త్రిగుణ్య లోకోత్తరుడు ఎక్కడుంటాడు? నువ్వు అడిగావు గనుక నేనే వస్తాను" అలా వామనావతార ఘట్టం కూడా చాలా ఉదాత్తమైనటువంటి ఘట్టం అది. ఒక చరిత్ర, ఒక భావన. నవనీతం అది ఒకరోజు సాయంకాలంలో తేలిపోయే వ్యవహారం కాదది. కాస్త జాగ్రత్తగా సమయం తీసుకుని విచారణ చేయాలి. విచార ధారలో వ్యాసులవారు రామాయణ మహామాలారత్నమని హనుమాన్ చాలీసాని ఒక శోకంలో నుంచి శ్లోకం పుట్టింది అని వాల్మీకి మానుషాద ప్రతిష్ఠాంత మగమశ్శాశ్వతీ సమాః యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్ దాంట్లో నుంచి రామాయణం పుట్టింది. ఒక నిస్ప్రుహలో నుంచి, నిర్వీర్యత్వంలో నుంచి ఆదిత్య హృదయం పుట్టింది. అంపశయ్యాగతుడైనటువంటి భీష్ముడి యొక్క అంతరంగ గానంగా విష్ణు సహస్రనామం పుట్టింది. లోకోత్తర పురుషుడైనటువంటి యోగీశ్వర కృష్ణుడు అర్జునుడికి సంగ్రామ రంగంలో బోధిస్తే భగవద్గీత పుట్టింది. కాబట్టి ఉత్కృష్టమైనటువంటి విషయాలన్నీ కూడా అననుకూల పరిస్థితుల్లో నుంచే ఏర్పడ్డాయి. అందుకనే కడుపు నిండినవాడు కవిత్వం రాస్తే వీనుల విందుగా ఉంటుంది. ఆలోచనేం సాగదు. కడుపు నిండని వాడు కవిత్వం రాస్తే మనస్సు ఒక్కసారి ఒక ఉద్విగ్నతకు లోనవుతుంది. జీవితాన్ని తాకిన ఒక స్పర్శానుభూతి కలుగుతుంది గనుక కావ్యం రసమయం, కావ్యం లోకోత్తరం, అది లోకమయం కూడా. అందులో ఉన్న పాత్రలన్నీ మన పాత్రల్లానే ఉంటాయి. అది విచిత్రం. భగవంతుడు అందరికీ ఎట్లా ఒక్కడై ఉన్నాడో అన్ని సమయాల్లోనూ భగవంతుడి యొక్క విచారణ గాని, ఆయన తత్వం గాని ఒకే రీతిలో ఉంటుంది. కానీ ఆయన కాచే విధానం మాత్రం వేరువేరుగా ఉంటుంది. అది వేరువేరుగా ఉన్నందువలన అవి కథా కథనంగా ఉన్నాయి. ఇందులో ద్వైతాద్వైత మార్గం ఉందది. రామాయణం కానివ్వండి, భారతం కానివ్వండి, భాగవతం కానివ్వండి వాఙ్మయమైనా ద్వైతంగా చెప్పాలి. అంటే చెప్పేవాడుండాలి, వినేవాడుండాలి. అది ద్వైతం. పురుషోత్తముడైనటువంటి పరమాత్మ గురించి ఉండాలి. ఒక సూర్యజనుడైనటువంటి వాడు ఆయన గాథ చెప్పాలి. మామూలు వాడు చెప్తే కుదరదన్నాడు. సూర్యజనుడు అంటే దానిలో ఒక సూర్య అంటే శ్రేష్టుడు. శ్రేష్టుడు అంటే దర్శనం చేసినవాడు. దేనిని దర్శనం చేసినవాడు? వస్తు దర్శనం చేసినవాడు కాదు. ఇదిగో ఇది కృష్ణుడి బొమ్మ అని చెప్పేవాడు వస్తు దర్శనం చేశాడు.అసలు కృష్ణుడు ఎవడు? ఎట్లా వచ్చాడు? ఎక్కడున్నాడు? వాడు నాలో ఉన్నాడా? తత్వ విచారణలో మునిగి తత్వార్ధాన్ని ఎరిగినటువంటి వాడు ముక్తుడవుతాడు. ముక్తుడి యొక్క అనుభవమే భాగవతం అవుతుంది. కనుక ఇక్కడ ఇద్దరు మహాపురుషులు కూర్చున్నారు. అడుగుతున్న వాడెవడు పరీక్షిత్ మహారాజు, మామూలు వాడు కాదు. చెబుతున్న వాడెవడు సుఖావధూత, సుఖ మహర్షి, సుఖ దేవుడు. అవధూత తత్వంలో పరాకాష్టకు చెందినటువంటి సుఖ దేవుడు. ఆయన నోటి నుంచి చెప్తున్నాడు గనుకనే వేదవ్యాసులవారు భాగవతాన్ని నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవసంయుతం హి వత భాగవతం ప్రసమాలయం ముహురహో రసికా భువి భావుగాః లోకంలోనే ఉండాలి. లోకానికి అసలు మనం ఎందుకు వచ్చాం అని ఎప్పుడన్నా విచారణ చేస్తే, "ఏముందండి కష్టాలు పట్టానికి వచ్చాం" అంటారు కొందరు. అసలు ప్రపంచం అంతా హాయిగా ఉంది ఇక్కడ కాసేపు ఉందామని వచ్చాం అంటారు రెండో వాడు. ఇక్కడ అసలు సకల సంపదలు, భోగాలు ఉన్నాయి అవన్నీ అనుభవించడానికి వచ్చాం అంటాడు మరొకడు. అసలు సృష్టి రహస్యం అంతా తెలుసుకోవాలంటే ఇక్కడికి వస్తే తప్ప తెలియదు గనుక తెలుసుకుందామని వస్తున్నాను అంటున్నాడు మరొకడు. సృష్టి ద్వారా, ప్రకృతి ద్వారా, ప్రపంచం ద్వారా పరమాత్మ తత్వాన్ని ఎరగటానికి వచ్చానన్నాడు మరొకడు. అసలు వాడు నిజ సాధకుడు ఏమంటున్నాడంటే అమృత లోకంలో ఉండగా ఒకానొక రోజున పొరపాటున భూలోకం ఎలా ఉంటుంది అని చిన్న ఊహ కలిగిన మాత్రాన మానవ జన్మ ఎత్తి నేను వచ్చా. వచ్చి తల్లి గర్భంలో, మనం ఇది విచారణ చేశాం భాగవతం మొదటి రోజున. తల్లి గర్భం నుంచి విడిపడే దాకా పూర్వ స్మృతులతో, ఆనందాలతో, జ్ఞాపకాలతో, నాడు చేసిన అనేకమైనటువంటి పుణ్య కార్యకలాపాలతో మనస్సు ఆనందభరితమై ఉన్నప్పటికీ జీవుడిగా శరీరాన్ని ప్రపంచంలోకి తెచ్చుకున్నప్పుడు, ప్రకృతితో ఒక అనుబంధం ఏర్పరుచుకున్నప్పుడు ఆకలి, నిద్ర అనబడేటువంటి రెండు జాజ్యాలు పుట్టినాయి శరీరానికి. రెండు జాజ్యాలు ఒకటి ఆకలి దైహికమైన ఆకలి తింటే పోతుంది అది. మరి మానసికమైన ఆకలికి ఏం చేద్దాము? మనస్సుని పరమాత్మ వైపు నడపాలి. మరి హృదయానికి ఆకలి ఉన్నదా? దానికి ఆకలి లేదు, దప్పిక లేదు. అది సాక్షిభూతం. కాబట్టి దేహం ఉన్నది, మనస్సు ఉన్నది, చిత్తం ఉన్నది, అహంకారం ఉన్నది, అహం స్పురణ ఉన్నది, ఆత్మానుసంధానం జరగాలి. ఆత్మానుసంధానం అంటే నేను ఎవరు అంటే మన బయోడేటా నిండా మనం గతించిన కాలంలో మనం సాధించిన విజయాల పట్టిక ఉంటుంది. నిజానికి కాల గర్భంలోవి ఎప్పుడో చెల్లిపోయినయి. వాటికి మనకేం సంబంధం లేదు. ఈవేళ వర్తమానంలో మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం అన్నది ప్రశ్న. ప్రశ్నకి స-సమాధానం "బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే". అనేకమైనటువంటి జన్మలు ఎత్తి, ఎత్తి వచ్చి ఇప్పటికీ క్షణానికి భాగవతం అంటే ఏమిటి? పరీక్షిత్ అంటే ఎవడు? శుకుడు ఎవరు? ఆయన ఏం అడిగాడు? ఈయన ఏం చెప్పాడు? కథనంలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి? కథనంలో ఉన్న చమత్కారం ఏమిటి? జీవన గమనం ఎట్లా ఉన్నది? శైలి ఎట్లా ఉన్నది? ఇవన్నీ కూడా విచారణకు లోనైన మనస్సు కనుక ఇక్కడ జ్ఞానాన్ని గురించి ఒక క్షణం ఆగి ఆలోచిస్తున్నాం. ఇది ఉత్తమోత్తమ జన్మ. మనలాగానే కోటానుకోట్ల జీవులు ఇక్కడ ఉన్నాయి, మనవంటివారు. కానీ అందరికీ అభిలాష ఉన్నదా? జ్ఞానం ఎరుగుదామని ఉన్నదా? భాగవతం చదవాలని ఉన్నదా? అని అంటే ఇప్పుడు లేదు గానీ ఎప్పుడో ఒకరోజు వాడికి కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అంటే అది కలిగేదాకా జన్మ ఎత్తాలి. ముక్తి ఎప్పుడు అని భగవాన్ ని అడిగినప్పుడు రమణ మహర్షిని, ముక్తి ఏమిటో అనుభవం కాగానే ఇక జన్మ ఉండదు. అదేమిటో తెలుసు కానీ అనుభవం వచ్చేదాకా జన్మలు ఇట్లా ఎత్తుతూ ఉండవలసిందే. అయితే ఇక్కడ ఒక గరుడ పురాణం కానీ, ఇంకో పురాణం కానీ, అయ్యా జన్మ ఎత్తొచ్చేసాం. ఏదో స్వామి దేవుడని నమ్మాం బానే ఉంది. మేము బానే బతుకుతున్నాం. ఏదో చిన్న చిన్న తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. కథలో చెప్పినట్టుగా మేము ఏమన్నా యమలోకానికి వెళ్తాமா? దాని సంగతి ఏమిటి? అజామీలుడి కథ పరిష్కారం చేసింది అది. ఎట్లా అంటే మానవ దేహాన్ని, మానవ జన్మని ఎత్తిన జీవుడికి మళ్ళీ జంతు జన్మ లేదు. "జంతునాం నరజన్మ దుర్లభం" జంతువులకి నరజన్మ ఎట్లా లేదో, నరజన్మ ఎత్తిన వాడికి ఎన్ని మహా పాపాలు చేసినా జంతు జన్మ లేదు గానీ పాపాలన్నీ ప్రక్షాళన చేసుకోవటానికి అనేక జన్మలు మాత్రం ఎత్తాలి. అనేక జన్మలు ఎత్తి మురికి అంతా పోగొట్టుకునే కంటే మురికంటూ ఒకటి ఉన్నదని, బట్టలు మాసినయ్యని, మూట మనదేనని, ఆగామి, సంచిత, ప్రారబ్ధ మూడు కర్మలు మన దగ్గరే ఉన్నాయని, వాటిని ఇక్కడే మనం ఉతుక్కోవాలని, ఆరబెట్టుకోవాలని, క్షాళన చేసుకోవాలని స్ఫురణ గనుక ఉన్నట్లయితే దానికి మార్గం ఏమిటి? మూడు యోగాలు చెప్పబడ్డాయి. ఒకటి కర్మ యోగం, రెండు భక్తి యోగం, మూడవది జ్ఞాన యోగం. రమణ మహర్షి భక్తికి, జ్ఞాన యోగానికి మధ్య ఒక యోగం ఉన్నది అని ప్రతిపాదన చేశారు. అది ఆయన స్వానుభవం. అయితే తర్వాత ప్రపంచం అంతా దాన్ని అంగీకరించింది. ఏమిటి యోగం అంటే జ్ఞాన యోగంలో ఒక ఎరుక ఏర్పడుతుంది. యోగంలో నీతో నీవు కూడి ఉంటావు. నీతో నీవు కూడి ఉన్నట్లయితే అది పూర్ణమైనటువంటి జ్ఞానం. అందుకనే భగవాన్ శరణాగతి పొందు, పొందు, పొందు అంటారే, సరెండర్, సరెండర్ అని అరుస్తున్నారే అందరూ. ఎవరికి సరెండర్ కావాలి? అని అడిగితే పాల్ బ్రంటన్ ఆయన అన్నారు "Surrender to the self".ఇంకొకడికి surrender కావటం చాలా తేలికే. మనకి మనం surrender కావటం చాలా కష్టం. మనల్ని, మనల్ని మనం విమర్శించుకోవటం కష్టం. మనల్ని మనం ఒక balance sheet assess చేసుకోవటం కష్టం. ఇంకెవరి గురించైనా రాయండి అంటే, టవుల్, టవుల్ రాసి అప్పజెప్తమ్. మీ గురించి కాస్త రాయండి అంటే, ఏముందో మనకు తెలీదు. కాబట్టి ప్రతి వాడు ఇంకోడి చేత రాయబడాలి. కాబట్టి దేనికి surrender కావాలంటే surrender to your own self. అంటే ఆత్మ భావనకి నువ్వు శరణాగతి పొందాలి. అంటే ఇది మాట్లాడుతున్నది అంతా లోపల ఉన్న ప్రాణైక శక్తి, ఆత్మ, vital being, ఏదో పేరు పెట్టుకుందాం. అలాగే జరుగుతున్నదంతా జరిపిస్తున్న వాడు ఎవడో ఉన్నాడు. మనమైతే కాదు. అసలు వినిపిస్తున్న వాడు ఎక్కడో ఉన్నాడు. వాడు మనం కాదు. అందుకే విశ్వనాథవారు రామాయణ కల్పవృక్షం లో మొదటి పద్యం మనం గుర్తుచేసుకోవాలి. "పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబయీని" శరీరంబు నీదే. "కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగకెట్లు ఏతదధిష్టాత ఎవడో యజమానుడనిన అష్టమ తనువు వాడు" వాడు, వాడు అంటున్న. లోపల వాడు అంటున్న. అంటే మనం కాదని తెలుస్తోంది. "కలలి నన్నేమి మిగిల్చితి నా సామీ బిట్టు నేనన్నది అభిజ్ఞగాక" ఏం మిగిల్చావయ్యా? నేను, నేను అని చెప్పుకున్నాను ఇంతకాలం. చివరికి ఏం తెలిసాను అంటే, నేను అనబడేటువంటి శరీరంతో ఉన్నటువంటి నేను, శరీరంలో ఉన్నటువంటి నేను బిట్టు కొద్దిగా అభిజ్ఞగాక. ఒక చిన్న గుర్తు అది. దేనికి గుర్తు అంటే, నువ్వు ఉన్నావు అనటానికి మేమంతా గుర్తు అన్నాడాయన. దేవుడు ఉన్నాడా అనంటే రమణ మహర్షి కూడా ఇదే సమాధానం ఇచ్చారు. You are the proof of god's existence. అంటే జీవుడు లేక దేవుడు లేడు, దేవుడు లేక జీవుడు లేడు. ఇది స్వామి వేళ మనకు చెప్పారు. భక్తుడు లేక భగవంతుడు లేడు, భగవంతుడు లేక భక్తుడు లేడు. వామన చరిత అంతా కూడా మనకి చెప్పేది అదే. ఏమున్నది వామన చరితలో? అసలు వామన శబ్దం అనంగానే ఒక బ్రహ్మచారి, ఒక వటువు, గొడుగు వేసుకొచ్చేవాడు. కొన్ని ప్రభావాల వలన మనకలా picturisation అయిపోయింది mind లో. వామనుడు అంటే వమనం చేసేవాడు అని అర్థం. దేనిని వమనం చేసేవాడు అంటే బయట పడేసేవాడు అని అర్థం. చూడండి, ఒక వాంతి కలిగే భావం కలిగింది మనకి. ఒక-ఏమనిపిస్తుంది అంటే, అదేదో అయితే బాగుండు అనిపిస్తుంది. కదా. సరే కాసేపు అయ్యాక అది ఏర్పడిందా బయట పడటానికి. బయట పడ్డది. అది లోపల ఉన్నంతసేపు యాతన. బయట పడగానే హాయిగా నిద్రపోతాడు జీవుడు. అంటే బయట పడాలి. అది దుఃఖం గాని, సుఖం గాని, ఆనందం గాని, సంతోషం గాని, it must be vented out. కానీ దానిని వమనం చేసేటువంటి వాడు వామనుడు అని ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటంటే, మనసుతో కూడి ఉన్నవాడు జీ-జీవ పరమైన మనసుతో కూడి ఉన్నవాడి మనసును దైవ పరం చేసేవాడు వా మనః వామనుడు అన్నాడు. మాములు వామనుడు అంటే చిన్నవాడు, పొట్టివాడు ఇట్లా ఏవో. వాడు వామనావతారం అంటే మరుగుజ్జని రకరకాలుగా అలా వేషం వేశారు. అలా లేదాయన. ఆయన వరపుత్రుడుగా తనను తాను స్వయంభువుగా అదితి గర్భ ప్రవేశం చేసినప్పటికీ కూడా కశ్యప మహాముని యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవాసుర సంగ్రామం సృష్టికి ఆరంభం నుంచి ఉన్నది. అంటే మంచికి చెడుకి మధ్య సంఘర్షణ గనక లేకపోతే చెడు పోదు, మంచి నిలవదు. ఎంత యుద్ధం జరిగినవివ్వండి, ఎన్నన్నీ అననుకూలాలు ఏర్పడినవివ్వండి, ఎంత యాతనామయ జీవితం కానివ్వండి, ధర్మం ప్రకారం గనక జీవిస్తే నువ్వు విజి-విజేతుడివి అవుతావు. లేకపోతే పరాజితుడివి అవుతావు. కాబట్టి జయం నాదే, జయం మనదే అని ఎవరికి అంటే ధర్మాన్ని ఆశ్రయించిన వాడికి, కాస్త ఆలస్యమైనా జయం తధ్యం. తధ్యమైనటువంటి జయాన్ని కైవసం చేసుకోవాలి కనుక దేవాసుర సంగ్రామంలో ఒక యుద్ధంలో బలి అనబడేటువంటి వాడి చేతిలో, వాడు ఇంద్రుడి చేతిలో ఓడిపోయినాడు. అప్పుడు బలికి అధికారం కావాలి. అధికారం ఎవరు కోరుకుంటారట అంటే రాక్షసులు కోరుకుంటారట. అధికారం ఉంటే చాలా పనులు చేస్తాము అని. అధికారం ఉంటే చాలా పాప పనులు కూడా చేయాల్సి వస్తుంది. మంచివి కాదు. పాపము చేయాలి. కర్మానుభవాలు కూడా అనుభవించాలి. అందుకనే కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని ఒక అద్భుత శ్లోకం జగత్తుకి ఇచ్చాడు. "రాజపుత్రా చిరంజీవ మాజీవ మునిపుత్రక జీవవా మరవా సాధో మాజీవ మామర మునిపుత్రక" రాజకుమారుడా కలకాలం జీవించవయ్యా, ముని పుత్రక తక్షణం మరణించవయ్యా అన్నాడు. పొరపాటు పడ్డాడు కావ్యకంఠులు ఎక్కడో రాయటంలో. ముందు లైను, తర్వాత ఇట్లా రెండు కంగారు పడ్డాడు అనుకుంటాం. రాజపుత్రా చిరంజీవ నువ్వుండాలి ఇక్కడ. ఎందుకుండాలిరా అంటే, నీ తండ్రి చేసిన అన్యాయాల ఫలితాన్ని అనుభవించటానికి నువ్వుండాలి. అందువల్ల నువ్విక్కడ ఉండమన్నాడు. ముని పుత్రక నువ్వు మరణించమన్నాడాయన. మీ తండ్రి అన్యాయం చేయలేదు. కాబట్టి నీకిక్కడ ఋణాలు ఏం లేవు. కర్మ బంధనాలు లేవు. కాబట్టి ఇలా పుడుతూనే నువ్వు మరణించవచ్చును అన్నాడు. మార్కండేయుడు చూడండి. ధ్రువుడు మరణించటం అంటే, మాములు జీవుడు మరణించే మరణ భావన నుంచి దాటి పూర్ణాద్వైత భావనకు వెళ్ళటమే. మార్పు చెందటం మరణం.మన మరణాలన్నీ నిర్యాణాలు పరమాత్మ స్థాయికి వెళ్ళిన వారి మరణాలన్నీ నిర్వాణాలు అంటే ముక్తులవి నిర్యాణం వేరు నిర్వాణం వేరు నిర్యాణం అంటే దేహంగా పుట్టి దేహంగా మెట్టి దేహంగా గిట్టాడు ప్రపంచానికి వాడు బరువై జీవించాడు ఉంటే ఉన్నాడు పోతే పోయినాడు వాళ్ళు ఉన్నారుగా మరి అలాంటి వాళ్ళు ఉన్నారు పుట్టాడు సర్వ ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు తాను సామాన్య జీవితాన్ని గడిపాడు కాలగర్భంలో ఎండిన తీగ చిట్టచివర ఉన్న గుమ్మడికాయ ఎట్లాగైతే తొడిమ విడివడినట్లుగా దేహాన్ని వదిలిపెట్టాడో అటువంటి వాడు జీవన్ముక్తుడు అవుతున్నాడు గనుక ముని పుత్రక నువ్వు మరణించవయ్యా జీవవా మరవా సాధో సాధు జీవితాన్ని గడుపుతున్న వాడా! నువ్వు మరణించనూ వద్దు జీవించనూ వద్దు ఇదేమిటి? ఏదో ఒకటే జరగాలి జీవించన్నా ఉండాలి పోవాలి నువ్వు జీవిస్తూ జనానికి ఆనందం కలిగించాలి నీవు దేహాత్మ భావాన్ని ప్రతిక్షణం మరణింపజేసుకోవాలి నీవు ముక్తుడివి అయిపోతూ ఉండాలి ఇది మూ-- మూడవది ఇక చిట్టచివరి వాడు వ్యాధుడు అంటే వేటగాడు వేటగాడి కుమారుడా! నీవు ఖచ్చితంగా మరణించు అన్నాడు ఎందుకంటే నీ బాణాహుతి చేత ఒక ప్రాణి విలవిలలాడుతున్న దుఃఖాన్ని నువ్వు కన్నారా చూసావు అదేమిటో నీకు అనుభవంలోకి రావాలి అంటే నువ్వు మరణించక తప్పదు అన్నాడు కనుక ఎట్లాగైతే వీడు బలి కనబడేటువంటి వాడు ఇంద్రుడి చేతిలో ఓడిపోయినాడో వాళ్ళకి ఒక గురువు ఉన్నాడు ప్రపంచంలో మంచి వాళ్ళకి మంచి గురువు చెడ్డవాళ్ళకి చెడ్డ గురువు ఎప్పుడూ దొరుకుతాడు చెడ్డవాళ్ళకి చెడ్డ గురువు ఏం చేస్తాడంటే వాళ్ళు ఇవాళ మన వాళ్ళు నియో గురూస్ అని నియో గురూస్, న్యూ ఏజ్ గురూస్, మార్కెటింగ్ గురూస్, మేనేజ్మెంట్ గురూస్ ఇక ప్రతి వాడు గురువే పాతాళ భైరవి గురువు లాగా అట్లా వాడు మాంత్రికుడు గురువేగా కాబట్టి గురు శబ్దం అపఖ్యాతి పాలైపోయింది [ముక్కు తోముకున్న శబ్దం] వేషం వేసుకోకపోతే వాడు గురువు కాదేమో గురువుకు ఒక నిర్దిష్టమైనటువంటి రూపురేఖలు మనం నిర్ణయం చేసేసాం అట్లా ఉంటే వాడు గురువు కాకపోతే వాడు గురు స్థానానికి కుదరదు అని గురువు అంటే తనను తాను ఎరుగు ఎరుకలో ఆంతరంగికంగా పూర్ణ ముక్తుడైన వాడు గురువు ప్రాపంచికంగా ఎన్ని కార్యకలాపాలు వాడు ఉండనివ్వండి వీటితో వాడికి ఏం సంబంధం లేదు ఎవరినీ మధ్య పెట్టడు నీకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ఏం చెప్పడు తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తాడు తన దారి వెంట తాను వెళుతూ ఉంటాడు వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఎంతమందికో ఒక అనుభవం కలుగుతుంది అనుభవాలేవీ నాకు సంబంధం లేదంటాడు ఉత్తమోత్తమ గురువు నా దృష్టిలో నా అనుభవంలో అటువంటి గురు స్థానంలో ఉన్న వారిలో ఇవాళ నెంబర్ వన్ ఎవరు అంటే శివానందమూర్తి గారు చాలా గొప్ప గురువు మిగతా గురువులు మామూలు సాధారణ గురువు ఆయనతో హిమ్లీలో రోజు పొద్దున పూట అనుష్టానం చేసుకొని ఆయన వస్తున్నారు నేను ఆయన కలిసి వస్తున్నాం ఆయన చుట్టూ వెనకాల ఒక పది మంది శిష్యులు భక్తులు అనుకోండి వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకో వెనకబడి పోయారు నేను ఆయన కాస్త ముందు నాలుగు అడుగులు ముందున్నాం ఎవరో వచ్చి నెమ్మదిగా మీ అనుగ్రహం వలన సమస్య తీరింది అని చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన ఈయన అన్నారు ఇలాగే చెప్తూ వెళుతూ ఉంటారు వాటితో మనకేం పని మన దారిలో మనం అలా వెళ్ళిపోతూ ఉంటే జరిగేవి జరుగుతూ ఉంటాయి మనకేం సంబంధం అది అలా జరగవలసి ఉన్నది అంతే అన్నారు కారణం ఏమిటి? మరి ఇవాళ ఆయన ఒక్కడిని గురించి ఎందుకు చెప్పుకున్నాం అంటే శివానందమూర్తి గారి తొలి గురువు భగవాన్ రమణ మహర్షి కాబట్టి అకర్తృత్వం సహజంగానే ఏర్పడి తీరాలి తీరకపోతే అటువంటి మహాత్ముణ్ణి దర్శనం చేసిన ఫలితం వీనికి దక్కుండేది కాదు అయితే దక్కింది కదా అని అది నిలబెట్టుకున్నటువంటి స్థాయి గనుక ఉత్తమోత్తమ గురువులలో హి ఈజ్ నెంబర్ వన్ ప్రథమ స్థానం ఆయనది అనుష్టానం ఉంది అదేదో చేసుకోమని చెప్తారు అవన్నీ మామూలే కానీ దేనికి తాను కర్తృత్వాన్ని మాత్రం వహించడు దేన్నీ అంటించుకోరు హాయిగా సుఖంగా ఉంటారు రమణ మహర్షి లాగా నిత్యసుఖి రాజయోగి సరే అటువంటి వాళ్ళు కూడా ప్రాతఃస్మరణీయులు మనందరం వాళ్ళని తలుచుకోవాలి గొప్పవాళ్ళు వాళ్ళు ప్రపంచానికి తమ తపస్సు చేత మౌన శక్తి చేత ఒక ఆధ్యాత్మిక భూమిక చేత దివ్య జీవన విధానం చేత పదుగురి జీవితాన్ని వెలిగించేటువంటి మహాత్ములు కాబట్టి వాళ్ళని స్వామి అందుకే అన్నారు అందరిలో నన్ను నాలో అందరినీ చూడగలిగిన స్థాయికి రా బంగారు అన్నారు అందరిలో ఆయన్ని చూడాలి ఆయనలో అందరినీ చూడాలి అంతేగాని గురువును విభజించుకోకూడదు మనం ఎందుకంటే spiritual parlance లో We are not supposed to pronounce on the other ఇంకో గురువుని గురించి చెడ్డగా గాని తక్కువ చేసి గాని వ్యాఖ్యానం చేయకూడదు అది-అది అసలు వ్యక్తుల పట్లే ఉండకూడదు గురువు పట్ల అసలు ఉండకూడదు సరే ఇదిగో ఇటువంటి బలి ఏం చేసాడంటే శుక్రుణ్ణి వాళ్ళ శుక్రాచార్యుడు గనుక అధికారం లేకపోతే అసలు ఏం నాకు తోచటం లేదు ఇంద్రుడు గెలిచాడు వాడు వైభవంగా అనుభవిస్తున్నాడు మళ్ళీ నా రాజ్యం నాకు కావాలి ఏం చేయమంటారు అని అడిగాడు వీడు రాక్షసులకు గురువు నిజానికి వీడు రాక్షస గురువు వీడు ఏమన్నాడంటే విశ్వజిత్ అనే ఒక యాగం ఉందట చేసుకో అంటే నేను చేసేది ఏం లేదు మీరు దగ్గరుండి చేయించండి అన్నాడు వాడు సరే నేను చేయిస్తాను అన్నాడు చేయిస్తే త్రిభువనాల మీద వాడికి ఆధిపత్యం వచ్చింది మూడు లోకాల మీద అప్పుడు మూడు లోకాలే చెప్పేవాళ్ళు తర్వాత విడగొడితే పధ్నాలుగు లోకాలు అది వేరే విచారణ మూడు లోకాల మీద ఆధిపత్యం రాగానే వాడికి కలిగినటువంటి మొట్టమొదటి భావన ఏమిటంటే ముందు ఇంద్ర లోకానికి వెళ్లి రావాలి ఇంద్రుణ్ణి చూసి రావాలి నా దర్పాన్ని ప్రకటించాలి అని వాడు బయలుదేరి వెళ్ళాడు ఇంద్ర లోకానికి వెళ్ళేసరికి అక్కడంతా వర్ణనంతా ఉంది అంటే ప్రపంచంలో భోగం బంగారపు గోడలు వెండి మేడలులేకపోతే బంగారపు రోడ్లు అలాంటివి అనుకోండి అట్లా ఎంతన్నా ఊహించవచ్చు. అవన్నీ ఉన్నటువంటి ఇంద్రలోకాన్ని వాడు ఆక్రమించాడు. ఎట్లా ఆక్రమించాడంటే ధ్వనులు చేస్తూ వెళ్ళాడు, శబ్దాలు చేస్తూ వెళ్ళాడు, నినాదాలు చేస్తూ వెళ్ళాడు. వాడి అరుపులకి రాక్షస జాతి అరుపులకి ఇంద్రుడు పారిపోయినాడు అక్కడినుంచి. ఇంద్రుడు ఎప్పుడైతే పారిపోయినాడో దేవీదేవతలంతా కూడా వాళ్ళ వాళ్ళ స్వస్థానాల నుంచి వైదొలగారు. వైదొలగిన తర్వాత వాళ్ళ తల్లి అయినటువంటి అదితి దగ్గరకు వెళ్ళబోయినారు. వెళ్ళటానికి ముందు జరిగిన కథ ఏమిటంటే, ఏం చేయాలి? మళ్ళీ మన రాజ్యం మనం సంపాదించుకోవాలి, మన ప్రదేశంలో మనం సుఖంగా ఉండాలి అని అనుకున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే "వాళ్ళ గ్రహాలు బాగున్నాయి, వాళ్ళ time బాగుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళని మనం ఏం చేయొద్దు. కాసేపు తల వంచుకొని ఉం-ఉంచు-ఉందాం." North India లో ఒక చిన్న adage ఉన్నది. ఏమిటంటే "సర్జుకున సర్జుకాన" అవసరమైతే తల వంచాలి, అవసరం లేకపోతే తల తుంచాలి అని. లేదు తల ఎత్తి వెళ్ళాలి అని. అణువుగాను కాలేదు ఏం చేస్తాం? తల వంచుకొని వెళ్ళిపోవాలి. కాసేపు అహంకారం లేదనుకొని వంచితే అవే జరిగిపోతాయి. ఎప్పుడైతే మాట శ్రీమన్నారాయణుడు చెప్పాడో వీళ్ళకి కాస్త పాపం ఆశ నశించింది. సాక్షాత్తు రక్షించేవాడే ఇలా చెప్పాడేమిటి అని "మీ మీ స్థానాలలో ఉండి మంచి రోజులు వచ్చేదాకా కాచుకొని ఉండండి" అన్నాడు, ఉన్నారు. ఉన్నటువంటి సమయంలో అదితికి చాలా బాధ కలిగింది. తన కొడుకులంతా అంటే అమృత పుత్రులంతా, దేవతలంతా దిక్కులేని వారు అయిపోయినారు అనుకొని కశ్యప ప్రజాపతి దగ్గరికి, ఆయన ఒక ప్రజాపతి. ఆయన దగ్గరికి వెళ్లి అడిగింది, "ఏమిటి పరిస్థితి?" అని. ఆయన అసలు యోగ నిష్ఠలో ఉన్నాడు. ఆయన ఇల్లు ఇల్లాలు ఇవన్నీ ఎప్పుడో వదిలిపెట్టిన వాడు. కానీ కాస్త కించిత్ దివ్య దృష్టితో చూశాడు. చూసి "ఓహో! ఇలా జరిగిందా? ఏమన్నా మీరు ఉండే చోట అధర్మం పెచ్చరిల్లిందా? ఇన్ని అన్-అనుకూలాలు ఎందుకు ఏర్పడ్డాయి?" ఇవన్నీ అడుగుతూ వెళుతూ ఉన్నాడు. అయితే ఆయనొక మాట ఏం చెప్పాడంటే "మనం కలిసి శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేద్దాం" అన్నారు. ఇందాక చెప్పినట్టుగా ప్రార్థనకు ఆయన లొంగాడు, వచ్చాడు. రాగానే "మీవంటి కొడుకు గనక కంటే రాక్షసుల మీద యుద్ధం చేసి మా సామ్రాజ్యం మేము వెనక్కి తెచ్చుకుంటాం" అన్నది అదితి. మళ్ళీ అదే సమాధానం "నావంటి వాడు లేడు, నేనే వస్తాను" అన్నాడు. అలా వచ్చిన వాడే వామనుడు.
SSSMC · audio

Bhagawata Navaneetham - 36

Home

Bhagawata Navaneetham - 36

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 27:07

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

    Now playing
  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67