Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ పరీక్షిత్ మహారాజుకి శాపం ఇవ్వబడిన మరుక్షణమే ఆయనకి మిగిలిన ఆయుష్షు ఎంతంటే కేవలం ఏడు రోజులు. శాపం వచ్చేసింది. శాపం ఎవరిచ్చారు? శమీక మహాముని యొక్క కొడుకు ఇచ్చాడు. పుత్రుడు ఇచ్చాడు. వాడి పేరు శృంగి. శృంగి అంటే కొమ్ములు కలవాడు అని ఒక అర్థం శిఖరం చూసిన వాడు అని రెండో అర్థం. శృంగం అంటే కొమ్ము. అందుకనే శివుడ్ని శృంగాంతర ప్రదేశం నుంచి చూడాలి నంది ద్వారా. నందికి రెండు కొమ్ములుంటాయి కదా, దాని మధ్యలో నుంచి నిరాకార నిర-- పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉన్నదో నిర్గుణాన్ని చూడాలంటే శృంగాంతర మధ్య ప్రదేశం లో నుంచి చూడాలి. కనుక శృంగి ఎప్పుడైతే ఇలా అన్నాడో పరీక్షిత్ మహారాజు అక్కడే ఆయనకు అర్థమైపోయింది ఎలా పొరపాటు పడ్డా అని. కోపం ఎవరికి రావాలి, ఎప్పుడైతే కొడుకు మాట వినిపించిందో ఇక్కడేదో జరుగుతున్నది అని అనిపించిందో, నిలువెంటనే ఆయన శమీక మహాముని కళ్ళు తెరిచాడు. వారించాడాయన. "అలా కోప్పడకూడదు. ఆయన ఎవరి పుత్రుడవు? మెల్లో వేశే వేశాడు. ఏముందది చిన్న పని" అంటే ఆయన జ్ఞాని. కనుక దాన్ని పట్టించుకోలే. భారత వంశం పరమ భాగవతం హయమేధయాజి ఆచార ఫలం మహానయ విశారదు రాజకులైక భూషణున్ నీరము గోని నేడు మన నేలకు వచ్చిన యద్ధి భక్తి సత్కారము చేసి పంప సనుగాక శపింపగ నీకు ధర్మమే అటువంటి కురువంశంలో పుట్టాడు. అశ్వమేధయాగం చేసిన వంశంలో నుంచి వచ్చాడు. మామూలు వాడు కాదు. ఏదో మన అరణ్యానికి వేటకు వచ్చాడు. వేటకు వచ్చిన వాడికి ఏదో కావలసిందంటే సత్కారం చేసి పంపాలి గాని శాపం చేసి పంపిస్తే ఎట్లా? ఎట్లా శాపం ఇవ్వచ్చు నాయనా? అని భూపతికి నిడపరాధమ శాపము తానిచ్చే బుద్ధి చాపల నున మా పాపడు వీర ధరించిన పాపము తొలగించు కృష్ణా పరమేశా హరి. నా కొడుకు చేసిన పొరపాటును మన్నించి పరమాత్మ, రాజుని నువ్వు రక్షించవయ్యా అన్నారు శమీక మహాముని. అంటే శమీక మహాముని యొక్క ఔదార్యం చూడండి. తన మెల్లో ఎవడో వచ్చి పా-- పాము చచ్చిపోయిన పామును వేసుకువెళ్లినా ఆయన దాన్ని పెద్ద పట్టించుకోలేదు. కొడిచిన, తిట్టిన, కొట్టిన పడుతుందురు గాని పరమ భాగవతులు పరమ భాగవతునికి లక్షణాలు మూడు ఉంటాయి. కొడిచిన, వాళ్ళెవరన్నా వచ్చి కొడిచిన, తిట్టిన, కొట్టిన పడుతుందురు గాని పరమ భాగవతులు తారు ఒడబడరు వాడికి చలగబడరు. చేయగ కొడుకా మారు సేయక విభుడు ఎగ్గు సేయ కోరడు నీకున్ పరమ భాగవతోత్తముడైనటువంటి పరీక్షిత్ మహారాజు నీకు నువ్వు శాపం ఇచ్చినా సరే అంటే శాపం అంటే తిట్టు. అన్నప్పటికీ కూడా నీ వైపు ఆయన రాజ్యం రాడయ్యా అని అంటూ చలగరు కలగరు సాధులు మెలితములైన నరుల వలన మేలున్ కీడున్ నెలకొనినైన ఆత్మకు ఒలయవు సుఖదుఃఖ జయము యుగ్మములగుచున్. ఏమన్నది స్వామి అన్నట్లుగా నమస్కారం అందదు, పురస్కారం లేదు, తిరస్కారం లేదు. మూడు నాకందేవి కాదు. నువ్వు తిరస్కరించావా? నాకేం చెందదు. నేను accept చేస్తేగా. నమస్కరించావా? నేను అందుకుంటే కదా. పురస్కరించావా? నన్నేమన్నా ఊరేగింపులు చేశావా? ఏవీ దీనికి నేను లొంగను అన్నాడు స్వామి. కానీ మనమేం చేస్తున్నాం? పురస్కరిస్తున్నాం, తిరస్కరిస్తున్నాం, నమస్కరిస్తున్నాం. మూడు చేస్తూనే ఉన్నాం. ఆయన నాకేవి చెందవు అని చెప్తున్నారు ఆయన. అయినా చెందుతాయి స్వామి నీకు. నిన్ను ఊరేగించకపోతే మాకు birthday celebrate చేసి పూర్తి కాదు. మీరు ఎప్పుడెప్పుడన్నా ఇంకా మాకు స-- పని చేయలేదు అని తినకపోతే మా నోరు ఊరుకోదు. కాబట్టి జీవ లక్షణం ఇదంతా కూడా. అప్పుడు శమీక మహాముని కొడుకును చేసిన పాయా-- పాపానికి సంతాపించెంది. ఒక ముని కుమారుడ్ని పిలిచి వృత్తాంతం అంతా కూడా పరీక్షిత్ మహారాజుకి, ఆయన విన్నాడో లేదో ఎందుకంటే ఆయన వెళ్లిపోయినాడు అప్పటికే. కాబట్టి నువ్వెళ్లి ఇక మా కొడుకు శాపం ఇచ్చాడు ఇక ఏడు రోజులే, దాన్ని ఏం చెప్పలేదు. కాబట్టి ఉన్న సమయాన్ని జాగ్రత్త పెట్టుకో అని పంపించాడట. పంపిస్తే అక్కడ ఏమయ్యింది? సుప్రశాపం తెలిసింది. మనకు తెలియనంతవరకు దుఃఖం లేదు. కదా? ఏదైనా విషయం తెలిస్తేనే దుఃఖం. తెలియకపోతే ఉంది హాయి, సుఖం. ఆలోచించాడు, అందర్నీ పిలిచాడు. మరి ఇంకా ఏడు రోజులే, ఏం చేద్దాం? ఏడు రోజులు గనక ఎవరికైనా రాజ్యం అప్పజెప్తే వాళ్ళు ఏం చేయగలరో మనకు చేసి చూపిస్తారు. కదా? ఏడు రోజులు కాదు ఏడు గంటలు. పరీక్షిత్ మహారాజు రాజ్యం ఏలడాన్ని గురించి విచారించ- పొందలే. అయ్యో నా ఆయుష్షు ఉన్నది తగ్గిపోయింది. ఇంకా హరినామ సంకీర్తన ఎప్పుడు చేసుకుంటా?ఆ పరమ పురుషుడు యొక్క దివ్య విశేషాలన్నీ ఎప్పుడు తెలుసుకుంటాను? నా జీవితం ఇలాగే తెల్లారిపోతుందా? అని ఒక విచారానికి లోనైనాడు. లోనై [పఠిస్తున్నాడు] గోవులకును బ్రాహ్మణులకు దేవతలకు ఎల్ల పొత్తు చెంపున పీడల్ కావునచు పాప మానసము విధమున పుట్టకుండని వాలింతును. పోయి పోయి ఒక బ్రాహ్మణుడ్ని హింస పెట్టానే, అతడ్ని హింస అనే చోట వేటకెళ్లానే, ఫలానా చేశానే పరీక్షిత్ మహారాజు ఆలోచించుకుంటున్నాడు. దీన్నుంచి నేను ఎట్లా బయట పడాలి? దీనికి మార్గం ఏమిటి? అని అంటే [పఠిస్తున్నాడు] దామోదర పద భక్తిన్ కామాదుల గెలిచిన వాడు కావున కరుణం భూమీసుడు అరుగడై సామర్థ్యము కలిగి దోష సంగిన్ శృంగిన్. అప్పుడు వృత్తాంతం అంతా వాడు చెప్తే కాసేపు ఉన్నాడు ఏం చేయబోతున్నావు అని. వెంటనే పరీక్షిత్ మహారాజు యొక్క సంస్కారం అన్నింటికంటే కూడా చాలా భిన్నమైనది, ఉదాత్తమైనది. రాచరిక సింహాసానాన్ని పక్కన పెట్టేశాడు. వెంటనే [పఠిస్తున్నాడు] తులసీ సంయుక్త దైత్యచిత్ పదరజ స్త్రోత్రంబు కంటెన్ మహోజ్వలమై వికృతి గ్రంథ సంయుక్త జగత్ సౌభాగ్య సంధానియై కలితోషావలి నలబాకు దివిషద్యంద ప్రవాహంబు లోపలికిం బోయి మనుష్యమానుడగుచు ప్రాయోపవేశంబు నన్. ప్రాయోపవేశం చేస్తా. ఏడు రోజులు అంటే నిజానికి సప్తజ్ఞాన భూమికలు అందుకోవాలి జీవుడు. అందుకే ఆయన ఏడు రోజులు చెప్పారు. శుభేచ్ఛ, విచారణ, సంసక్తి, పదార్థ భావని ఇట్లా ఏడు సప్తస్థానాలు, సప్త చక్రాలు, జ్ఞాన భూమికలు దాటి జీవుడు బహోత్కృష్టమైనటువంటి బ్రహ్మ పదానికి వెళ్ళాలి గనుక ఏడు రోజులు బ్రాహ్మణులందరినీ పిలిచాడు, రాజుల్ని పిలిచాడు, అందరినీ కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని ఏడు రోజుల ప్రాయోపవేశానికి దీక్షకు ఆయన పూనుకున్నాడు. ఎందుకంటే ప్రాయోపవేశం చేసినప్పుడు లోపల ఉన్నటువంటి అనేక అహంకారాలు అణిగిపోతాయి. పోగొట్టుకుందాం అనుకునేవాడికి. తెలుసుకునే వాడికి ఏడు రోజుల్లో ఏడు డెబ్బై రెండు పెరుగుతాయి అంతే. రెండోది శరీరమే తానుగా భావించిన స్థితి నుంచి తాను శరీరము మాత్రమే కాదనే భావనలోకి వస్తాడు ఇది రెండవది. ఇక మూడవది ఇందాక చెప్పుకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా పరమేశ్వరుని ముఖం అవుతాయి మూడవది. నాలుగవది హింసా ప్రవృత్తి ఒక సంస్కారం గనక లోపల ఉన్నట్లయితే అది అహింసా ప్రవృత్తిగా మారుతుంది. అరిషడ్వర్గాలన్నీ కూడా హరిషడ్వర్గాలైపోతాయి. పరమేశ్వరాయత్తం అవుతాయి. అలాగే విషయ వాంఛలన్నీ కూడా విష్ణు వాంఛలుగా మారుతాయి. లోకం, భూలోకం స్వామి అన్నారుది. అసలు మీరంతా కూడా గోలోకానికి చెందిన వాళ్లే. గోలోకానికి చెందిన వాళ్ళు మరి ఏం కావాలని కోరుకున్నారో గానీ భూలోకానికి వచ్చారు. భూలోకానికి వచ్చిన ప్రమాదం లేదు మాలోకంలో కలుసుకున్నారు ఏమన్నారు స్వామి. అది మా అంటే అజ్ఞానం, గో అంటే జ్ఞానం. మధ్యలో ఏముందంటే భూ ఉన్నది. భరించేది ఉన్నది గనక ఇక్కడ ఆగాం అట మనం. మన దారి గోలోకమా? మాలోకమా? అంటే ఏమండీ గోలోకం. మాలోకం నుంచి దాటాలి. మాయా ఆవరణం నుంచి దాటాలి గనుక ప్రాయోపవేశం వలన కలిగేటువంటి లాభాలు అన్నింటినీ తాను పొందుతూ నిశ్చితమైనటువంటి మరణాన్ని తాను ఏడు రోజుల్లో అనుభవించబోతున్నాడు గనుక రకమైన దుఃఖం లేకుండా, విచారం లేకుండా, ప్రపంచం పట్ల అపేక్ష లేకుండా, లాలస లేకుండా, మోహ వ్యామోహ వ్యసనాలు లేకుండా పరీక్షిత్ మహారాజు సంస్థితుడయినాడు. సంస్థిత స్థితి చాలా ఉదాత్తమైనది. [పఠిస్తున్నాడు] భీకరతర సంసార వ్యాకుల చన్ విసిగి దేహ వర్జన గతి నలోకించు నాకు తక్షక కాకోదర విషము ముక్తి కారణమయ్యెన్. మంచి మాటలు వింటూ ఉంటూ ఉన్నాడు. ఎవరైనా సరే ఏమంటాం అంటే ఫలానా వాడేదో చేశాడని దోవన మాకిదయిందంటాం. ఎవ్వరూ ఎవ్వడికీ ఏం చేయరు జరగాల్సింది జరిగిపోతూ ఉంటాయి. కానీ ముక్తికి మాత్రం ఎవడో కారణం ఉండాలి. శరీరం పోవడానికి కూడా ఒక కారణం ఉండాలి. నింద లేకుండా పొద్దపోదు. ఏదో కారణం. ఎలా పోయినాడు అని లోకం కాసేపు మళ్ళీ మాట్లాడుకోవటానికి అలా పోయినాడట. పాపం అలా ఎందుకు పోయినాడు? పోయినవాడు అయిగా పోయాడు. ఉన్నవాళ్లంతా వాళ్ళని గురించి వాడుస్తున్నారు అది. అదే చెప్తూ మాట అంటున్నాడు ఆయన. తక్షకుడు అనేటువంటి వాడి విషం నా ముక్తికి కారణమైంది కదా అంటున్నాడు ఆయన. తక్షకుణ్ణి చంపండనో, చేయమనో, చేయమనో అనటంలేదు. [పాడుతున్నాడు] చుడుడు నా కళ్యాణము కాడుడు గోవిందు మీద పాటలు. పోతున్నప్పుడూ ఎంత హాయిగా రాస్తారో చూడండి. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి పరీక్షిత్ మహారాజు గారు పోతున్నారు పోతు-- అదే అనకండి, పోతా దాన్ని వదిలేయండి. మీరు చేయవలసిన మూడు పనులున్నాయి. [పాడుతున్నాడు] చుడుడు నా కళ్యాణము. కళ్యాణం అంటే ముక్తి. కాడుడు గోవిందు మీద పాటలు, దయతో వాడుడు హరిభక్తుల కథలు. ఎవరన్నా ఇక్కడ గనక డాన్స్ నేర్చిన వాళ్ళుంటే పరమేశ్వరుని గురించి హరికథా గానం చేయమన్నాడు. అహమూలలోన ముక్తికే గగైతటన్. ముక్తిధామానికి వెళ్ళే మార్గాలు మూడు ఉన్నాయి గనుక గోవింద నామం స్మరణ చేయండి. గోవిందుడి కథని ఆడండి, పాడండి. పరమేశ్వరుడి యొక్క భావంతో కూడండి. ప్రాపంచిక భావనలు వీడండి. ఇదే చెప్పాడాయన.అమ్మా నిను చూచిన నరువమ్మాయని నొప్పి కడకు పుచ్చువట కృపన్ లెమ్మా నీవు పనుతో రమణా నా కెదుని గంగ బ్రహ్మయ తరంగ దివిజ గంగని ఆకాశగంగని ప్రార్థిస్తానని చెప్పాడాయన కాబట్టి అమ్మా నీ దాకా నేను వెళ్లలేనేమో ఉన్న సమయం చాలా తక్కువున్నది ఏడు రోజులే ఉంది నువ్వే నా యందు ఉన్నటువంటి దయచేత నావైపు నువ్వు ప్రవాహ వేగంతో రా అంటే ఇక్కడ గంగ అంటే దివిజ గంగ అంటే ఆకాశగంగ అని మాత్రమే అర్థం కాదు గం అంటే మూలాధారం అంటే జ్ఞానం అది గంగ గంగ సున్నా మళ్ళీ దానికి అక్షరాలు తిప్పి చదువుదా ఏమవుతుందో గంగ అంటే మూలాధారంలో ఉన్నవాడు జ్ఞానం దాకా వెళ్ళాలి జ్ఞాన యోగంలోకి వెళ్ళాలి నేను జ్ఞాన యోగంలోకి వెళ్ళాను మా ఇంట్లో నేను ఉండను ఎక్కడికో వెళ్ళిపో అనకూడదట ఇక్కడ ఉండాలి ఎందుకని ఎవరెస్ట్ ఎక్కాం భారతీయ జెండా పాతాం అక్కడి దాకా న్యూస్ వచ్చింది అక్కడే ఉంటున్నామా? పాచిన వాళ్ళంతా అక్కడున్నారా దిగి రావాలిగా నువ్వు స్థాయికి వెళ్ళినా లోకరీతిలో నువ్విక్కడ జీవించాలి ఇక్కడ కర్మకా--కలాపాలన్నీ నువ్వు కొనసాగించాలి నీకు పరమేశ్వరుడు జీవితం ఇచ్చాడు గనుక దీనిని, దీనిని కర్మ అనుబంధే మనుష్య లోకే ఆశయా బద్ధతే లోకే కర్మణా బహు చింతయా అనేటువంటి అనేకమైనటువంటి ఆలోచనాధారతో పరమేశ్వరుడు మనకిచ్చిన కర్మలు మనం చేయాలి పరమేశ్వరుడితో కూడి ఉండి చేసేదానికి కర్మయోగం అని పేరు పెట్టుకున్నాం కాబట్టి పరీక్షిత్ మహారాజు కోరుతున్నది ఇవాళ అడుగుతున్నది కూడా గంగాదేవినిదే నీ దాకా రాలేనేమోనమ్మా నీవు నా వైపు రా అని అడుగుతున్నాడు [పేజీ మార్చే శబ్దం] సమయంలో ఋషులంతా కూడా మాటన్నారు వాళ్ళు కూడా ఏదో మాట్లాడాలి, చెప్పాలి కదా ఆయనకి క్షితినాథోత్తమ నీ చరిత్రము మహా విచిత్రంబు నీ తాతలు ఉగ్ర తపోధన్యులు విష్ణు పార్శ్వ పదవిన్ కాన్నించి రాజన్య శోభిత కోటీర మణి ప్రభాన్విత మహా పీఠంబు వర్జించురు ఉన్నతులై నీవు మహోన్నతుడులు కదా నారాయణాజ్జాయివై ఎంత అందమైనటువంటి ఋషుల వాక్కు చూడండి ఎట్లా ఉందో వాళ్ళ భాష ఎట్లా ఉన్నదో నువ్వు ఎవరివో తెలుసునా? నీ తాతలు ముత్తాతలంతా ఇదే యాగంలో ఉన్నారయ్యా ఇదే భాగవతంలో ఉన్నారు భాగవతులై జీవించారు భగవన్నామం తప్ప భగవత్ శక్తి తప్ప భగవత్ భావన తప్ప అన్యవరిదని వారి ఇంట పుట్టినటువంటి నీవు విష్ణుపా--విష్ణు పాదము యొక్క ఒక పార్శ్వాన్ని గ్రహించిన కారణంగా రాజన్య శోభిత కోటీర మణి ప్రభాన్విత మహాపీఠంబు అది బ్రహ్మ పదం బ్రహ్మ పదాన్ని కూడా ఇవాళ నీకోసం సిద్ధం చేసి ఉంచారయ్యా నువ్వేం భయపడకు నీవు మహోన్నతుడివి కదా ఎందుకని అంటే నారాయణాజ్జాయివై దేనినధ్యయనం చేశావంటే పరమేశ్వరుని గురించి నువ్వు అధ్యయనం చేశావు కనుక నువ్వు ముక్తుడివే ఇప్పటికే మళ్ళీ నువ్వు బ్రహ్మపదం కొత్తగా కనిపెట్టవలసింది లేదు నువ్వు పొందేది లేదు నీకంటే ముందు నీ తాత ముత్తాతలే ఇక్కడి నుంచి వెళ్లారు కాబట్టి కోటీర మణి ప్రభారాజితమైనటువంటి బ్రహ్మ పదంలో నీవు నిలకడ చెందువు గాక అన్నారు వసుధాధీశ్వర నీవు మత్స్య తరువున్ వర్జించి అంటే దేహాన్ని వదిలిపెట్టి నిశ్శోకమై వ్యసనచ్ఛేదకమై రజోరహితమై వర్తించు లోకంబు సర్వ సమత్వంబున చేరునంతకు భవద్వాక్యంబులన్ విన్చు దశకుంభోవక చూచుచుండెదము నీ దివ్య ప్రభావంబునన్ ఏం చేస్తావంటే నువ్వు శరీరం వదిలిపెడతావు చూడు వదిలిపెట్టిన తర్వాత నువ్వు తేజోమయమైనటువంటి శరీరంతో ఒకవైపు వెళ్తుంటావు చూడు నీవు ఎట్లా వెళ్తున్నావో మార్గాన్ని మేము అందరమూ కాచుకొని చూస్తూ ఉంటాం ఎందుకని అంటే నిశ్శోకమై ఉన్నది తేజస్సుకు శోకం లేదు దానికి బాధ లేదు భయం లేదు వ్యామోహం లేదు వ్యసనం లేదు వ్యసనచ్ఛేదకమై రంగ ఎక్కడైనా గనక ఒక అణువు ఉన్నా దానిని విచ్ఛేదనం చేసేటువంటి రజోరహితమై దానికి రజస్సు లేదు అంటుకున్నటువంటి రకమైన ధూళి లేదు అందుకనే అవధూతల గురించిన విచారణ వచ్చినప్పుడు అమదానంద విమల ధామమై వర్తమాన వర్తిత వ్యధాకారకమై ధూమ కామ రహిత ధ్యాన ధారణాతీత చారణమై తమోరహిత తపోతత్వ కారకమై నిలుచు నీ జగతి నిర్మల నిశ్చల సచ్చరిత అవధూత అట్ట నిలబడతాడట వాడికి తమస్సు లేదు తపస్సు తప్ప ధూళి లేదు రజస్సు లేదు తమస్సు లేదు ఉన్నదంతా పూర్-పూర్ణమైనటువంటి సత్వగుణం మాత్రమే ఉంటుంది గనుక బ్రహ్మలోకం నువ్వు చేరే వరకు కూడా భవద్వాక్యంబులన్ వింటు దశకుంభోవక మేం ఎక్కడికి పోకుండా ఒకే ఒక మార్గం నువ్వు వెళుతున్నావో మార్గం మీద మా మనస్సును నిలబెట్టుకొని నీ దివ్య ప్రభావంతో మేం ఉంటామనంటే పక్షపాత శూన్యంబులు మహరీయ మాధుర్య గాంభీర్య సౌజన్య ధిర్యంబులను వైన భాషణంబులాడించుచూ మూడు లోకంబులకు అవ్వరిదైన సత్య లోకంబును మూర్తిమంతంబులై నగలుచున్న నిగమంబులు వేదాలు తేజరిల్లుతున్న ఋషులను చూచి భూవరుండు అంటే పరీక్షిత్ మహారాజు నారాయణ కథా శ్రవణ కుతూహలుండనైనాను అన్నాడు నన్ను నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలుసు ఇక మనం చేయవలసింది ఏమిటంటే నారాయణ కథ ప్రవచనాన్ని మనం వినాలి శ్రవణక్రియంగా వినాలి లోపల ఉన్నటువంటి అనేకానేకమైన వాసనలు నశించేట్లుగా ఉండాలిమోహ విచ్ఛేదనం కావాలి వ్యసనం పరిత్యజించాలి దివ్యమైనటువంటి తేజఃపుంజమైనటువంటి కాంతితో అటువంటి దేహంతో నాదైనటువంటి నా స్వస్థానానికి నా వికుంభ ధామానికి నేను వెళ్ళాలి దాని పేరు బ్రహ్మపదం ఇక నారాయణ కథ విందామా అన్నాడు ఇప్పటికీ భాగవతం ఇప్పుడు పుట్టింది అది క్రైస్ట్ పుట్టిన కృష్ణ పుట్టిన మనం కృష్ణ అంటాం కదా foreigners కృష్ణ అంటారు కృష్ణ అయ్యే వాడు క్రీస్తు అయినాడు అన్నమాట కాబట్టి భాగవతం కూడా ఒక మహోత్కృష్టమైనటువంటి రోజున ఇవాళ ఇది ఏర్పడింది ఏడు దినముల ముక్తి కూడగ రీతి వచ్చు గురు సంసార క్రీడనము క్రియ ఎడల చూడుమా తండ్రులార శృతి వచనముడన్ మీరేం చెప్పినా శృతి వాక్యంగా ఉంటుంది గనుక సర్వ ప్రామాణికంగా ఉంటుంది గనుక సర్వజన మనోల్లాసంగా ఉంటుంది గనుక సర్వజన హితంగా ఉంటుంది గనుక అటువంటి నారాయణ కథా శ్రవణం నేను చేస్తూ ఉంటాను అన్నాడు ప్రాప్తానందులు చెప్తున్న వాళ్ళు ఎవరట అంటే ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళా పార్లీణులు ఆత్మ ప్రభాలుత్త జ్ఞానులు మీరలు వారియులు దయాళుస్వాభారాములు మనోగుప్తంబులు సకలార్థ జాలములు మీకున్ కానవచ్చుంగదా సప్తాహంబుల ముక్తికే గడుగతించెర్చించి భాషింపరే మీరేం మామూలు వాళ్ళా ఇక్కడ కూర్చున్న వారంతా ఎటువంటి వారు మీరు ఇప్పటికే ఆనందాన్ని పొందినవారు బ్రహ్మానందం మనుష్య మనీష గాంధర్వ మానవ గాంధర్వ దేవ గాంధర్వ పితృపితానంద ప్రజాపితానంద హిరణ్యగర్భానందం దాకా వెళ్ళిన వారే ఇక్కడ ఉన్నారు మీరు దిశలతో అంటున్నాడు కాబట్టి మీకు ఆనందం అంటే ఏమిటో తెలుసు ఏడు రోజులలో భాగవత శ్రవణం ఎలా చేయవచ్చునో తదనుగుణంగా మీరు భాషించండి అలాగే బ్రహ్మబోధన కళా పారీణులు బ్రహ్మవిద్యను చెప్పడం మీకు ఊరికే నల్లేరు మీద బండి నడక ఎందుకంటే మీరు అనుభవం పొంది ఉన్నారు అందుకనే స్వామి అంటారు there is no expression without experience experience లేకుండా express ఏం చేస్తాడు పద్యాలకు అర్థం చెప్పేసి వెళ్ళిపోతాడు అంతేగా అనుభవం గనక ఉన్నట్లయితే బ్రహ్మానంద తత్వాన్ని వాడు అనుభవించి ఉన్నట్లయితే ఆయన అన్నట్లుగా సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం త్వగత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువిభవు భావుకాః మామూలుగా అన్నాడా ఆయన ఆశీర్వచనమే ఎంత గొప్పదో చూడండి రసికులై భావుకులై భాగవత తత్వం యందు మనస్సు లగ్నమై పూర్ణమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారికి భాగవత శ్రవణం శ్రేయోదాయకమని చెప్తూ మీరలు ఆర్యులు ఆర్యులు అంటే పూజింపదగినవారు మూలపురుషులు అన్నిటికీ మూలమైనటువంటి వారు అన్ని విషయాలకి దయాళుత్వాభిరాముల్ దయాళువులు మీరు మీకేం పని ఉంది ఇక్కడికి వచ్చి చెప్పడానికి ఇవాళ నేను ఏడు రోజుల్లో పోతానని మీకు తెలుసు ఏమిస్తాను మీకు ఏడు రోజుల్లో రత్నము మాణిక్యం దానిని ఆశించి వచ్చినవారు కారే మనోగుప్తంబులు సకలార్థ జాలములు మీకున్ కానవచ్చుందటా మేమంతా తోలు కళ్ళతో చూస్తాం మీ మనోనేత్రంతో చూస్తారు ఆజ్ఞా చక్రంలో ఉన్న కరుడు అయి నుంచి చూస్తారు కనుక మేము లోకాన్ని చూసేటటువంటి దారి వేరు మీరు చూసేటటువంటి చూపు వేరు మావన్నీ చూపులు మీవన్నీ దర్శనాలు అంతే కదా ఊళ్ళోకి ఇద్దరు వచ్చారు friend Bombay నుంచి వచ్చాడు గురువుగారేమో Madras నుంచి వచ్చారు కారు బయటే తీసాం ఎక్కడికి వెళ్తున్నారు అంటే మా friend ని చూసి స్వామి వారి దర్శనం చేసుకొని వస్తా అదేంటి ఈయనను చూడటం ఏమిటి ఆయన దర్శనం చేయటం ఏమిటి తేడా ఉందా అంటే నా friend ని చూడటం చూపే మహాత్ముల్ని చూడటం మాత్రం దర్శనం అవన్నీ మీకు తెలుసు అంటున్నాడు పరీక్షిత్ మహారాజు సప్తాహంబుల ముక్తికే గడుగతించెర్చించి భాషింపరే ఏడు రోజులలో ముక్తిధామం చేరేటువంటి ఒక విధానం ఏదైతే ఉన్నదో దానిని హాయిగా మీరు చర్చించి విషయమంతా సాకల్యంగా విచారణ చేసి దాని యొక్క విషయాలన్నీ కూడా నాకు చెప్పండి అని అడిగాడు పరీక్షిత్ మహారాజు వచ్చాడాయన ఇక్కడ ఇవాళ అనేక పాత్రలు అనేక పాత్రలలో ప్రధానంగా భూదేవి పరమేశ్వరుడి యొక్క సంస్పర్శకు దూరమైనాను గనుక నా పరిస్థితి ఏమిటి అని భూదేవి ఏదో మిగిలిన ఒంటి కాలు మీదవు యెన్నా ఉన్నాను గదా అంటే కలిపురుషుడి చేత దెబ్బలు మానవులంతా కూడా అధర్మ ప్రవర్తన వైపు వెళ్తున్నారు అధ్యాత్మ అక్కరలేదు ఆత్మజ్ఞానం అక్కరలేదు పరమేశ్వరుని ఇవాళ మనం కలియుగం ప్రభావం చూడండి దేవాలయాలు కిటకిటలాడిపోతున్నాయి మీరు ఏడు ఊరికి ఒక చిన్న బొమ్మ పెట్టి తమలపాకులో చిన్న పశువు బొమ్మ పెట్టి దానికేదో పేరు పెట్టి మీరు వెనుక షామియానాలు వేస్తే పట్టరు జనం వస్తున్నారు కదా పరీక్షల సమయంలో అయితే అసలు యువకులు సినిమా హాలులు మానేసి దేవాలయాల చుట్టూ హనుమంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఆయనేదో పరీక్ష రాస్తాడన్నట్టుగా ఏం రాయడు ఆయన అంటే పరమేశ్వరుడ్ని మనం భక్తితో కాక భయంతో చేరుతున్నాం భయం ఎప్పుడైతే ఉన్నదో జీవ లక్షణం నశించలేదు అని అర్థం భక్తి ఎప్పుడైతే ఉన్నదో ఏది రాని ఏది పోని మా స్వామి చూసుకుంటారని మనం కాస్త కులాసాగా ఉంటాం చూడండి మా స్వామి కాచుకుంటారు మాకేం భయం అంటాం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నువ్వు అనుభవించావు గనుక నీకా అనుభవాలు ఉన్నాయి గనుక మా స్వామి చూసుకుంటారంటాం అనుభవం లేనివాడు ఏమో మా మీ స్వామి అంటున్నాం మాకు ఇంకా ఆంజనేయస్వామి దగ్గర ఉంటాం అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం ఇంకా ఈయనతో మాకు పరిచయం కాలేదంటాం జీవితం చెల్లిపోతుంది అలా కాకుండాఏది సర్వాధీనమై ఉన్నదో ఏది సర్వ జగత్తుకి కూడా ఒక రక్షణ వలయాన్ని ఇచ్చిందో అది గురు స్వరూపంగా ఉన్నదో సద్గురు స్వరూపంగా ఉన్నదో ఏది మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వ వివరణంగా ఉన్నదో ఏది పరమ చరమమైనటువంటి అవతార భూమికలో ఉన్నదో ఏది కదలకుండా సకల భూలాలని కదిలిస్తూ ఉన్నదో ఏది ఎవరితోనూ ప్రమేయం పెట్టకుండా అందరికీ తనతో ప్రమేయాన్ని కల్పించిందో అటువంటి సత్యకాయి భగవానుడు పూర్ణమైనటువంటి మహాపురుషుడై ఇక్కడ ఉన్నటువంటి వేళ మహాపురుషుడు అన్న పరమాత్మ అన్న ఒక్కటే పురుషుడు అంటే మహా మానవుడు మహాత్ముడు అని కాదు మహాపురుషుడు ఎవరు అంటే ఒక్క పరమాత్మే ఆయన పట్లనే వాడాలి అది ఉన్నటువంటి వేళ ఏడు రోజులు గనక భాగవతం వింటే ఏడు రోజులు ఎందుకు భాగవతం వినొచ్చు ఏడు గంటల్లో కూడా చెప్పుకోవచ్చు కానీ ధర్మ విచారణ కావాలి జరిగినటువంటి ద్వాపర యుగంలో జరిగిన కలియుగంలో తొలినాళ్లలో జరిగినటువంటి ధర్మ భంశం ఏదైతే ఉన్నదో తొలగిపోయిందో అది ఎట్లా తొలగిందో గనక మనం తెలుసుకున్నట్లయితే ఈనాటి దుస్థితికి కారణాలు ఎవరు అనేటువంటిది మనకు సమాధానం దొరుకుతుంది గనుక పరమేశ్వరాయత్తం చేయాలి పరమేశ్వరునితో కూడి ఉండాలి పరమేశ్వరుడి యొక్క శక్తి మనల్ని నడిపించాలి ఇది నిజమైనటువంటి ఒక భక్తి పారమ్యం భక్తి పారమ్యంలో ఉండవలసినవి మూడే షిరిడి మహాస్వామి చెప్పినట్లుగా సమర్పణ చేయండి శరణాగతి పొందండి వినయంగా ఉండండి మూడే మూడు గనక ఉంటే హి ఈస్ గ్రేటెస్ట్ డివోటీ సేవ చేయి ఇంకోటి చేయి ఇంకోటి చేయి నువ్వు ఎన్ని చేయి ఎన్ని చేసినా నిరహంకారంతో చేయి నిర్మోహంతో చేయి ఆనందంగా చేయి సహజంగా చేయి సజ్జస్ఫూర్తితో చేయి అందుకనే ఒక స్పందన ఎక్కడి నుంచి రావాలంటే ఆలోచించి తర్వాత వచ్చేది నిర్ణయం ఆలోచించకుండా చేసేది స్పందన స్పందన మన హృదయం లోతుల్లో నుంచి రావాలి రావటానికి తర్ఫీదు కావాలి ట్రైనింగ్ కావాలి యోగం కావాలి దానికి మహాత్ముల యొక్క సమాశ్రయం కావాలి ఇటువంటి సద్గోష్టి కావాలి అందుకనే పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు ఏడు రోజులలో ముక్తి ధామానికి ఎలా చేరాలో మీరంతా చర్చించి నాకు విషయం చెప్పండి అన్నాడు చర్చించి అంటే ఋషులైనటువంటి వాళ్ళు స్వాత్మానందాన్ని పొందినటువంటి వాళ్ళు బ్రహ్మపదం ఎక్కడో ఎరిగిన వారు తెలిసిన వారు దర్శించిన వారు మనసుతో ప్రపంచాన్ని చూసేటువంటి వారు అంటే శుద్ధ మనసుతోని శుద్ధ మనసు అంటే మళ్ళీ హృదయమే మనసుతో ప్రపంచాన్ని చూస్తే స్పర్ధ గందరగోళం హృదయంతో చూస్తే సర్వము కూడా పరమ ప్రశాంతం అది ప్రసన్నం అటువంటి స్థాయికి తీసుకు వెళ్ళమన్నాడు పరీక్షిత్ మహారాజు యొక్క ప్రమాణం ఏమిటంటే నాలుగు పాదాల మీద మళ్ళీ ధర్మాన్ని నడిపిస్తాను అని ఇవాళ మనందరం మాట అంటూ ఉంటాం లేదా వింటూ ఉంటాం సత్య యుగం రాబోతున్నది అని అది ఎలా వస్తుంది మనందరం సత్యవ్రతులమైతే చెప్పబడిన ధర్మాన్ని గనక మనం పాటిస్తే అది అనుగుణంగా మన జీవితాలను కొనసాగిస్తే దానికి వైదిక ధర్మానికి సంబంధించినటువంటి వేద ధర్మానికి ఆర్ష ధర్మానికి ఒక సంస్కృతికి లోబడిన జీవన విధానాన్ని మన పిల్లలకి గనక అప్పజెప్తే సత్య యుగం వస్తుంది సత్య యుగం రావటానికే స్వామి బాల వికాస్ పెట్టారు పద్యాలు పాటలు కంఠస్తం చేయటం బాల వికాస్ పని కాదు వాడికి పరమాత్మ యందు పిల్లవాడికి మనసును లగ్నం చేయగలగాలి పరమేశ్వరుడి యొక్క దివ్య శక్తిని దృఢంగా వాడి గుండెల్లో నాటాలి అలాగే పాపభీతి గురించి చెప్పాలి ప్రపంచానికి లోక కంటకులైనటువంటి రాజులంతా ఒక్క పరమేశ్వరుడి చేతిలో ఎట్లా నశించారో వాళ్ళ వల్ల ఎన్ని బాధలు కలిగినయో అటువంటి స్థితికి నువ్వు రాకూడదు అని మనం చెప్పగలగాలి అది దాని కోసమే స్వామి సత్య యుగం సృష్టించారు స్వామి ఏర్పరచటానికి మనకు యోగాన్ని ఇస్తారు అవకాశాన్ని ఇస్తారు మనం మాత్రం ఎంతవరకు చేయగలం అంటే సంస్కరింప నేల సంఘమంతటి నీవు సజ్జనుండవదు స్వార్థముడిగి ఒక్క నీచుడప్పుడు విలువు తగ్గును అందుకనే స్వామి ముక్తి ఎవల్యూషన్ అనే మాట పక్కనబెట్టి ముందు ట్రాన్స్ఫాం కండి అన్నారు పరిణామం చెందాలి పరిణామం నిన్నటి కంటే ఇవాళ నేను బెటర్ గా నాకు అనిపించాలి లోకానికి ఏం అనిపిస్తున్నదో నాకు సంబంధం లేదు నా వరకు నాకు అంతః సాక్షిగా నిన్నటికంటే బాగా బతికేనా లేదా ఇది ప్రతి వ్యక్తి తనకు తాను వేసుకోవాలి నిజమే నిన్నటికంటే ఇవాళ చాలా హాయిగా ఉన్నాను అంటే సుఖంగా అని కాదు ఆనందంగా ఉన్నాను ఆనందం ఎప్పుడైనా పడుతుంది కోరికలు లేకపోతే ఆనందం కలుగుతుంది కోరికలు లేకుండా మానవుడు జీవించగలడా అంటే తగు కోరికలతో జీవించాలి తగని కోరికలతో జీవించరాదు ఇంతే తగనివి అంటే మనం మొయ్యలేనివి మనకు అక్కరలేనివి మనకు పనికిరానివి మనకు ఆనందాన్ని కలిగించనివి మనం మొయ్యలేనివి మన స్థితికి అందనివి కోరుకున్నామనుకోండి దుఃఖం అక్కడే మొదలు మనకు ఎంతవరకు కావాలో అంతవరకు మనకు పరమాత్మ ఏం లోటు చేశాడు అనుకొని తృప్తిలో నుంచి ఒక ఆనందాన్ని ఆనందంలో నుంచి ఒక పరమానందాన్ని దానిలో నుంచి బ్రహ్మానందాన్ని ఎవరైతే పొందుతారో వారు ఇటువంటి నారాయణ కథా శ్రవణం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు నారాయణ కథా శ్రవణం అంటే ఏదో కేవలం కృష్ణుడి మహిమ కాసేపు విని వెళ్ళేది కాదు దాని వెనుక నవనీతం ఉన్నది తత్వార్థం ఉన్నది తత్వదీపిక ఉన్నది దానిని చిన్న వెలుగుని ఆధారం చేసుకొని మన రాబోయేటువంటి మిగిలిన జీవితకాలం అంతా కూడా పరమోత్కృష్టమైనటువంటి బ్రహ్మ పదాన్ని ఆయన చూడండిపరీక్షిన్మహారాజు ఏడు రోజుల్లో నువ్వు ఇంకా ఉండవు అనగానే ఆయన నారాయణుడి కథను చెప్పమని అడిగాడు. రాజ్యం ఏమైపోతుందో తక్షకుడు ఎక్కడ ఉన్నాడో వాడిని మంత్రం చేత, యజ్ఞం చేత ఏం చేయాలో ఇవన్నీ ఆయన అనుకోలే. చేయవలసినటువంటిది మిగతా మంత్రులను చేసింది పరీక్షిన్మహారాజు ప్రయత్నంలో లేడు. సినిమాల్లో చూపించినట్లుగా ఎందుకంటే వాటిని చదవకుండా తీస్తారు పరీక్షిన్మహారాజు అప్పటికే మనస్సుని, దేహం నుంచి, దేహాత్మ భావం నుంచి ఆయన విడిపోయినాడు. తక్షకాయ స్వాహా అనే సర్పయాగం అంతా మిగతా వాళ్ళు చేశారు. అది చేశారు కానీ ఇక్కడ ఒక చిన్న విషే-విశేషం చెప్పాలి. వరాహమిహిరుడు బృహత్సంహిత అనేటువంటి ఒక కావ్యం, ఒక గొప్ప గ్రంథం రాశాడు. గ్రంథంలో ఖగోళ శాస్త్రం, భూగర్భ శాస్త్రం అన్ని శాస్త్రాలు ఉన్నాయి అందులో astrology, astronomy అన్నీ కూడా ఉన్నాయి. astrology లో ఇది నమ్మవచ్చునా, నమ్మకూడదా అప్పటికీ ఇప్పటికీ చర్చ. రోజుల్లో కూడా చర్చ వచ్చినప్పుడు వరాహమిహిరుడు చోట ఉన్నాడు ఆయన. ఆయన జ్ఞాని. దేశపు రాజుకి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టగానే నిన్న ధర్మరాజు ఎట్లాగైతే మా పరీక్షిత్తు, మా విష్ణురాసుడి యొక్క జాతకం చెప్పమని అడిగాడో రాజు కూడా జాతకాలు తెలిసే వాళ్ళందరినీ పిలిచి చెప్పమన్నాడు. అందరూ ఏం నిర్ణయించారంటే, రాజు మెప్పు కోసం దీర్ఘాయువుగా ఉంటాడు అని చెప్పారు. చెప్పగానే ఉన్నోళ్లకు ఉన్నవి, ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చి వాళ్ళకి కానుకలు ఇచ్చి వాడు పంపాడు. ఎందుకంటే మా అబ్బాయి బాగుంటాడు అని చెప్పాడుగా, సంతోషం. కానీ ఎక్కడో వాడికి ఒక సందేహం ఉంది. సందేహం ఏమిటంటే అందులోనే ఒకడు ఒక పీల స్వరంతో వినబడి వినపడనట్లుగా "ఈ రాజు మెప్పు కోసం అసత్యం ఎందుకు చెప్తున్నారు? వాడు బతకడే" అన్నాడు. మాట కూడా వీడు విన్నాడు. కానీ రాజ్యంలో ఉన్నటువంటి జాతకం చెప్పేవాళ్ళంతా, జ్యోతిష్యులంతా ఖాళీ అయిపోయినారు ఎవ్వరూ లేరు. మరి ఇంకా పరిష్కారం ఎవరు చేయగలరు అంటే ఎవరో చెప్పారు వరాహమిహిరుడు అని ఉన్నాడు ఆయన్ని పిలవండి అన్నారు. వరాహమిహిరుడిని పిలిచాడు. పిలిచి, స్పష్టంగా, నిష్కర్షగా ఎంత కఠినమైన సత్యం చెప్పమన్నాడు. "నీ కొడుకు మరణం తధ్యం" అని చెప్పారు. సరే, వీడికి అహంకారం వచ్చింది, రాజుకి. "ఇలా అన్నావు కదా, నా కొడుకు మరణం లేదు అని నిరూపించి శాస్త్రం wrong అని నేను prove చేస్తాను" అన్నాడు. వరాహమిహిరుడు అన్నాడు "నువ్వేం చేయలేవు. ఇది నిర్ణయం అయిపోయింది. It is all predestined. You are going to lose your son" అన్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా రాజు గారు తలచుకుంటే ఏంది, పిల్లవాడు పడుకునేటువంటి ఉయ్యాల, గది అంతా sound proof చేశాడు. లోపలికి ఒక చీమ, పాచి రావటానికి కూడా వీలు లేకుండా tamper proof చేశాడు. ఎవ్వడూ వెళ్ళటానికి వీలు లేదు అన్నాడు. అసలు కన్నతల్లి కూడా లోపలికి వెళ్ళటానికి వీలు లేదు. నేను స్వయంగా వెంబడి ఉండి వాడికి కావలసినటువంటి పోషణ చేసి బయటికి వస్తా. కావలసిన ఉయ్యాల నేను ఊపుతానన్నాడు. ఇవన్నీ చేశాడు. అలా time, time ఉన్నంత వరకు ఇవన్నీ సాగినాయి. సరే, రాజుకి ఏమనిపించిందంటే జ్యోతిష్యం wrong. చెప్పిన వాళ్ళంతా తప్పు చెప్పారు. వాడెవడో పాపం తెలియక, గట్టిగా చెప్పలేక సన్నటి స్వరంతో చెప్పాడు. వాడు కాదు వరాహమిహిరుడేమో గొప్పవాడు అనుకుంటున్నాడు. వీడు కాదు. I can protect my son. వాడికి మరణం లేదు అనుకున్నాడు. అని ఉయ్యాల అలా ఊపాడు. బాగుందనుకున్నాడు. రోజు పని పూర్తి చేసి తలుపు తాళం పెట్టి వెళ్ళిపోయినాడు. రోజుల్లో మన ఇళ్ళల్లో కూడా మన పాతకాలం ఇళ్ళల్లో దుప్పటి కొమ్ములన్నీ కూడా గోడలకి అలంకారం చేసేవాళ్ళు. అదో అలంకారం. దుప్పటి తల, రెండు కొమ్ములు అది. ఉయ్యాల ఇట్లా ఊగుతున్నటువంటి ఒకానొక సమయంలో పైన గోడకు ఉన్నటువంటి దుప్పటి కొమ్ము loose అయిపోయింది. మేకు నుంచి వచ్చి ఉయ్యాలలో పడి పిల్లవాడిని చంపేసింది. సరే కాసేపైన తర్వాత రాజుగారు వచ్చారు. వచ్చి చూస్తే ఏముంది అంతా అయిపోయింది. అప్పుడు వరాహమిహిరుడిని అడిగాడు, పిలిపించాడు. "ఎలా చెప్పగలిగావు?" చెప్పమన్నాడు. సరే ఆయనేదో శాస్త్రం చెప్పాడు. అలాగే విధి అనుల్లంఘనీయం. జీ-జీవితం జీవించటానికి వచ్చి ఒక జన్మ ఎత్తిన వాడు, శరీరం ధరించిన వాడు, పరమాత్మ అయినా సరే శరీరాన్ని వదిలిపెట్టవలసిందే. కాకపోతే జ్ఞాని అయినటువంటి వాడు ప్రతి పౌర్ణమి నాడు పాము తన ఒంటిమీద ఉన్న కుబుసాన్ని పొదలలో ఎట్లా స్వచ్ఛందంగా వదిలిపెడుతుందో పౌర్ణమి రాగానే వదిలిపెడుతుంది. మళ్ళీ తన శరీరం మీద కొత్త చర్మాన్ని ఎట్లా ఆహ్వానిస్తుందో జ్ఞాని అలా శరీరాన్ని వదిలిపెడతాడు. జ్ఞాని కానివాడు అయ్యో కయ్యో అంటాడు. నేను చేయవలసినవన్నీ ten percent కూడా చేయలేదంటాడు. దుఃఖితుడవుతాడు. దుఃఖంతో మరణిస్తాడు. దుఃఖంతో మరణించడమే అజ్ఞానం. దుఃఖించిన వాడి కోసం విలపించడం అంతకంటే కూడా అజ్ఞానం కాబట్టి అజ్ఞాన భూమికలో నుంచి, ఒక విషాద వియోగ భూమికలో నుంచి, ఒక మరణ భావనలో నుంచి ఏడు రోజుల సమయంలో పరీక్షిన్మహారాజు అడుగుతున్నాడు నారాయణ కథా శ్రవణం ద్వారా నాకు బ్రహ్మపదం చేరుకునేటువంటి మార్గాన్ని ఉపదేశనం చెయ్యి అని. దానిని స్వామి యొక్క అనుగ్రహం చేత సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సత్యసాయి సుడి యొక్క దివ్యమైనటువంటి ఆదేశంతో, దివ్యానుగ్రహంతో మనం రేపటి నుంచి నారాయణ కథా శ్రవణంలోకి వెళ్దాం. కలి-కలియుగం అయిపోయింది. 2010 అయిపోయినట్టుగా. నిజానికి అయిపోయింది ఇంకేముంది? కలియుగం అయిపోయిన తర్వాత, అవబోయే ముందు నారాయణ కథని వాళ్ళంతా ఎలా చదివారో, ఎలా విన్నారో వాటన్నింటినీ కూడా చాలా తీవ్రమైనటువంటి విచారధారగా కొనసాగించేట్లుగా సత్యసాయి భగవానుడు మనకి పూర్ణ అనుగ్రహాన్ని వరదానం చేయాలని, దీనికంతకీ మూలమైనటువంటి ఇటువంటి గ్రంథాన్ని లోకోత్తరంగా పద్దెనిమిది వేల శ్లోకాలలో పరమ భాగవతోత్తముడైనటువంటి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వ్యాసులవారు మనకు అనుగ్రహించినందుకు వారికి, మనవోటి వారికి మన తెలుగున మన ఆంధ్రంలో చక్కగా సహజ కవి బమ్మెర పోతనామాత్యుడు అలతి అలతి లలిత పదాలతో కలిత కలితమైనటువంటి, సుందరమైనటువంటి వచో విన్నాణంతో, ఒక సమృద్ధమైనటువంటి భాషా సామగ్రితో, భావ గుంభనంతో, పరిపూర్ణమైనటువంటి తత్వ విచారంతో మనకు అందించినందుకు బమ్మెర పోతనామాత్యుడికి
SSSMC · audio

Bhagawata Navaneetham - 11

Home

Bhagawata Navaneetham - 11

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 37:04

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

    Now playing
  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67