No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్య పాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ మోక్షము అనేటువంటి దాంట్లో ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మనందరికీ తెలుసు ఈ శరీరం ఇక్కడ వదిలిపెట్టే వెళ్ళాలి ఇది ఎక్కడికి ఎవరు తీసుకెళ్లడానికి వీలు లేదు ఇది మన కళ్ళ ముందే బూడిద అవుతుంది ఇది సత్యం మరి ఎక్కడికి ఎవరు వెళ్తున్నారయా ఏ స్వర్గానికి నరకానికి ఎవరు వెళ్తున్నాడు అంటే అసలు రెండూ లేవు ఎక్కడికి వెళ్ళటం లేదు మరి ఎక్కడికి వెళ్ళాలి ఇది అసలు ఎక్కడికి వెళ్తున్నది మనం అంటాం నన్ను స్వస్థానానికి చేర్చు నా మూల ప్రదేశం ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి చేర్చవయ్యా అంటే విశ్వంభరుడు విశ్వాంతరాత్మ అయినటువంటి పరమాత్మలో నుంచి వచ్చిన నీవు మళ్ళీ విశ్వాత్మలోకే చేరుతావు గనుక నీకు స్వర్గ నరకాలంటూ రెండు లేవని చెబుతున్నాడు కపిలుడు నువ్వు వచ్చావు కదా మొన్న హరి దగ్గరికి మాట్లాడావు కదా పరమాత్మతో నాకు నీవంటి కొడుకు కావాలి అని అప్పుడు నీకు అక్కడ ఉండాలని అనిపించలేదు కదమ్మా ఎందుకు అనిపించలేదు అంటే అది నీ స్వస్థానం కాదు మనకు ఎక్కడ ఉండాలని అనిపిస్తుంది అంటే మన స్వస్థానంలో మనకు హాయి ఉంటుంది మన ఇంటికి మనం వెళితేనే సుఖం ఉంటుంది కాబట్టి ఆ మన ఇంట్లో మనం సుఖం ఉన్నదా అంటే భద్రత ఉంది ఎందుకు మన ఇంట్లో మనం ఉన్నాం మనతో మనం కూడి ఉన్నాం మన ఆలోచనలతో మనం ఉన్నాం పరాయి ఆలోచన గాని వ్యర్థమైన ఆలోచన గాని అక్కరలేని ఆలోచన గాని దాని వలన కలిగేటువంటి మోహం కానీ లేదా కోరిక గాని కోరిక బలీయమైనప్పుడు కలిగే మోహం కానీ మోహం మరింత బలపడినప్పుడు కలిగే వ్యామోహం కానీ వ్యామోహము దృఢతరమై గాఢమై నిశ్చలమై నిశ్చితమై ఏర్పడినటువంటి వ్యసనం కానీ లేవు గనుక ఆ కోరిక స్థాయిలోనే జీవుణ్ణి దాన్ని వదులుచుకోమంటున్నారు స్వామి కాబట్టి మోహ క్షయమే మోక్షం ఎన్నెన్ని ఆలోచనలు పుట్టని కావలసిన వాటిని నాలుగింటిని దగ్గర పెట్టుకోవాలి జీవితం గడపాలి కదా సంసారాన్నే నడపాలి కదా ప్రపంచంలో ఉండాలి కదా ఉండాలి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి చూడండి ఇంతకు ముందు లేదు గాని ఈ మధ్యనే బిపి వచ్చిందని డాక్టర్ గారు చెప్పాడు అంటాడు ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇంతకుముందు నువ్వు పరిమితమైన కోరికలతో జీవించడానికి అలవాటు పడ్డ వాడివి సడన్ గా కోరికలు పెంచుకున్నావ్ అవి తీరుతాయో తెలియదు తీరవో తెలియదు తీరినా పనికొస్తాయో లేదో తెలియదు మనతో ఉన్న సంతోషాన్ని దుఃఖాన్ని ఇస్తాయో తెలియవు కాబట్టి మనకు అక్కరలేని ఆలోచనల వలన మనకి ఆ blood pressure వస్తుంది కావలసినవే రెండో మూడో రోజు పెట్టుకున్నాం రెండు మూడు ఆలోచనలతో ఇరవై నాలుగు గంటలు గడపగలిగితే వాడికి బిపి లేదు రెండు లక్షల ఆలోచనలతో రెండు నిమిషాలు చేశాడు అనుకోండి వాడు బిపి రాకేమవుతుంది రాకపోవడం ఆశ్చర్యం ఏం లేదు కాబట్టి ఆలోచనలని సాధకుడు అయినవాడు అధ్యాత్మ భూమికలో ఉన్నటువంటి వాడు barriers వేసుకోవాలి ఓ కోరిక ఒక ఆలోచన కలగగానే ఆలోచన కోరికగా రూపాంతరీకరణం చెందకూడదు ఇది మనకు కావాలా వద్దా కావాలి ఎంతవరకు కావాలి అసలు ఎందుకు కావాలి ఎవరికోసం కావాలి అథవా అది మనకు ఏర్పడ్డ దాని వల్ల మనకు సంతోషం ఉన్నదా లేదా ఇంత నిలకడగా ఆలోచిస్తాడు అంటే ఆలోచించడు కోరిక ఎక్కిందే గుర్రం పరిగెత్తేదే నడక అన్నట్లుగా ఇలా కలిగింది అలా పొందాలి అనుకుంటాం మనం కూడా అంతే పుట్టపర్తి ప్రయాణం చేస్తాం మనం వెళ్ళాం కనుక ఆయన రావాలి అనుకుంటాం అది మనం వెళ్ళాం కనుక ఆయన రారు ఆయన వస్తే మనం చూడగలం అంతే తేడా ఆయన ఎప్పుడొస్తే అప్పుడు చూ-చుట్టానికి సిద్ధంగా ఉంటే బిపి ఉండదు మళ్ళీ రాత్రికే వెళ్ళాలి ఈరోజు వస్తారో రారో పొద్దున రావటం లేదు రాత్రి సాయంత్రం వచ్చినా గంట కంటే ఉండటం లేదట అవన్నీ ఆయనకు సంబంధం మనకేంటి సంబంధం ఆయన గంట ఉంటారో అరగంట ఉంటారో కదా కానీ వ్యర్థమైన ఆలోచనల వలన మనకున్నటువంటి ఎనర్జీ అంతా కూడా drain అయిపోతుంది అందువలన నిజమైన ఆనందాన్ని అనుభవించడానికి కూడా మన దగ్గర శక్తి ఉండదు గనుక దానిని వదులుచుకోమంటున్నారు ఇది కూడా ఒక మోహమే స్వామి అన్నారు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు ఏడుస్తూనే ఉన్నారు ఎప్పుడైనా భగవంతుని కోసం ఏడ్చారా ఒకే ఒక్క ప్రశ్న భగవంతుడు నాకు కావాలి భగవంతుణ్ణి నేను చేరుకోవాలి ఆయన తత్వాన్ని నేను అనుభవించాలని ఎప్పుడైనా ఏడ్చినారా అని అడిగారు లేదు అని మన జవాబు ఒక లక్ష కంఠాలతో చెప్పాం లేదు స్వామి అనగానే అందుకే నేను ఇంకా ఉన్నాను కాబట్టి దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన కోరికల్లో నుంచి మోహ వ్యామోహాలు నశించాలి నశించాలని చెప్పటం ఎంత తేలికో నశింపజేద్దాం అని అనుకోవటం ఎంత తేలికో నశింప చేసుకోవటం అంత కష్టం అయినా సాధన చేయాలి నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఏడాది ఏడాది పెరుగుతూ వస్తున్నప్పుడు మనం కూడా వయస్సును acquire చేస్తూ ఉంటాం ఆ సంపాదించుకున్నటువంటి వయస్సుతో జీవితానుభవాన్ని రంగరింపజేసుకోవాలి balance sheet వేసుకోవాలి జీవితం మనకు ఏమిచ్చింది మనం జీవితానికి ఏమిచ్చాం జీవితం అప్పుడప్పుడూ ఆనందాన్ని ఇచ్చింది ఎక్కువ దుఃఖాన్ని ఇచ్చింది లేదా అది ఇచ్చినప్పుడు ఆనందం అనుకున్నాం అది ఇవ్వనప్పుడు దుఃఖం అనుకున్నాం ఇది మరీ చాలా simplified balance sheet ఇది మనకు కావలసింది కావలసినట్టుగా దొరకటం మాత్రం జీవితం దానికి అర్థం కాదు మనకు ఏది ప్రాప్తి ఉన్నదో అది మాత్రమే దొరికితే దానిలో నుంచి ఆనందాన్ని we must make the best out of our life we can't make our lifeYou can't design a life. వస్తున్న దాంట్లో నుంచి as it comes అది ఎలా వస్తే దాంట్లో నుంచి ఆనందాన్ని అనుభవించాలి గనుక కపిలుడు తల్లికి చెప్తున్నాడు. అమ్మా మోహక్షయం అంటే ఇదే కదా! ఇక్కడ ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే ఆలోచనలన్నీ కూడా తగ్గించుకుని పూర్ణమైనటువంటి ఆనంద స్థితిలో జీవితం సాగించాలి. పూర్ణమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే కోరికలు తగ్గినప్పుడు మాత్రమే కాదు, తృప్తి నిలకడగా ఉన్నప్పుడు. ఎవడు కోటీశ్వరుడు అంటే కోరికలు లేని వాడు కాదు. కోరికలు లేని వాడికి కోరికలు లేవు అంతే. కోటీశ్వరుడు ఎవడు అంటే పరమ తృప్తితో ఉండేవాడు. నాకసలు ఏ లోటు చేశారు స్వామి? నాకన్నీ కావలసినవన్నీ ఇచ్చారు. ఏం కావాలంటే, ఎప్పుడు ఏం కావాలంటే అది ఇస్తూనే ఉన్నారు. నేను అడిగినప్పుడు కొన్ని, అసలు నేను అడక్కుండా కొన్ని, నేను ఊహించినవి కొన్ని, ఊహించనివి కొన్ని, అన్నీ ఇస్తూనే ఉన్నాడే పరమాత్మ అనుకున్నాడనుకోండి, వాడికి దుఃఖం లేదు. వాడు, వాడసలు ఆయన ఎదురుగ్గా నుంచున్నా నాకిది కావాలని అడగడు. ఎందుకని? ఆయనే ఇస్తాడు. మురుగనార్ అని అరుణాచలంలో భగవాన్ రమణుల దగ్గర మనందరికీ అంటే సాధకులందరికీ ఒక చిన్న ఎవరికన్నా advice ఇద్దామని ఉంటుంది. ఏమిటా advice అంటే, మీరు ఆయనకి చాలా దగ్గర కదా హాయిగా అడిగేసేయండి అని. అట్లాగే మురుగనార్ ని కూడా అడిగారు. మీరు రోజూ భగవాన్ దగ్గరే కూర్చునుంటారు కదా, ఏదన్నా అడగండి, ఏదన్నా ఆయన నుంచి పొందండి అని అడిగితే ఆయన అన్నారు, "నాకేది మంచిదో, నాకేది చెడుపో నాకంటే బాగుగా నా స్వామికి ఎరుక. అతని చేరిన వారికి అతడాయే తల్లిదండ్రి. అతని బిడ్డను నేను. ఇతరము నాకేలా? నాకేది మంచో, ఏది చెడో ఆయనకు తెలిసినట్టుగా నాకు తెలియదు. కాబట్టి ఆయన ఇస్తారా, ఇవ్వరా, ఇచ్చారా, ఇవ్వలేదా, నాకే ఇవ్వలేదా ఏమీ నాకు సంబంధం లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళంతా వచ్చి ఆయన్ని దర్శనం చేసుకొని ఈయన భగవంతుడే అని నమ్మి నువ్వా తల్లి, తండ్రి, గురువు అన్నారు కానీ, నేనా? అసలు ఆయన బిడ్డను నేను. నాకివ్వకపోతే ఎవరికిస్తారు? కానీ నాకేమిస్తారంటే, ఏమిస్తే నేను బాగుపడతానో అది నాకిస్తారు. కాబట్టి ఆయనకు తెలుసు. దాని గురించి నేను ఆలోచించనన్నాడు. ఇది మోక్షం." అంతేగాని రమణ మహర్షితో రోజూ మాట్లాడొచ్చు కదా, ప్రతిరోజూ ఆయన్ని అలాగ దగ్గరికి తీసుకుని మాట్లాడుతూ ఉంటారు. స్వామి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. ఇంత proximity ఉన్నందుకు నాకు మాత్రం నువ్వు మోక్షం ఇచ్చి తీరాలి అని అడిగాం అనుకోండి, ఆయన ఎంత తుంటరిగా ఉంటాడంటే వీణ్ణొక్కడినే వినాయించి అందరికీ ఇస్తాడు. అది భగవంతుడి యొక్క తత్వం. అడిగావా? ఇవ్వడు. అడక్కపోయినావా? ఏది కావాలో అది ఆయన సమకూరుస్తారు. ఇది నిశ్చితమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైన అనుభవం. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే కపిలుడు చెప్తున్నాడు. సరే ఆత్మ అంటే ఏమిటో అడిగింది, భక్తి అంటే ఏమిటో అడిగింది, మోక్షం అంటే ఏమిటో అడిగింది. చివరగా ఒక గొప్ప ప్రశ్న వేసింది. నాయనా కాలం అంటే ఏమిట్రా అని అడిగింది. వేదాంతిని అడగండి, కాలం పరబ్రహ్మ స్వరూపం అని ఒక statement ఇస్తాడు. ఓ జ్యోతిశ్శాస్త్రవేత్తనో, astronomy తెలిసిన వాడినో అడిగితే కాలం అంటే మొత్తం ఒక quantum తీసుకుని దానిలో నుంచి volumes అన్నీ derivations calculate చేసి లిప్త, నిమిషము, ఆ సెకను, ఆ నిమిషము, గంటలు, విఘడియలు, ఘడియలు ఇట్లా లెక్కపెట్టుకుంటూ వెళ్తాడు. కాలము అంటే అనంత ప్రవాహం అమ్మా అన్నాడు. ఇది ఒక అనంత ప్రవాహం. ఈ అనంత ప్రవాహంలో సహయాత్రికులుగా జీవులు కలుస్తుంటారు, విడిపోతూ ఉంటారు. అయ్యో ఇంతకాలం ఉన్నవాడు మన నుంచి వెంటనే ఇప్పుడు, ఇప్పుడిదాకా ఉన్నాడు, ఇప్పుడే పోయినాడే అంటాం. కాలం తీరింది. కాలం చెల్లింది. అందుకనే వెళ్ళినవాడు, ఇక్కడి నుంచి వెళ్ళినవాడు విముక్తుడయినాడు. సంతోషించాలి. ఎందుకనంటే ఇక్కడ ఉండి తాను చేయగలిగిన పని పూర్ణం చేసేశాడు. ఇక ఈ శరీరంతో, ఈ జన్మలో చేయటానికి ఇక్కడేమీ లేదు. మరి ఏమవుతాడాయన అని? ఇప్పుడు చేసిన కర్మలను బట్టి మళ్ళీ మరొక్క జన్మ ఎత్తి ఎత్తుతూ ఉంటాడు. ఎన్ని ఎత్తుతాడు? అడుగుతున్నది దేవహూతి. ఎన్ని జన్మలు అని అడిగితే మోక్షం సిద్ధించేదాకా జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. ఎప్పటికి సిద్ధించేను అంటే, ఎప్పటికి సిద్ధిస్తుంది? మన సాధన తీవ్రమై, పరిపూర్ణమై, పటిష్టమై, భగవంతుని యందు భక్తి, ఆత్మతత్త్వము నందు రక్తి ఎవరికైతే ఉన్నదో వాడు మోహక్షయాన్ని పొంది పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. అప్పుడు ఆ మోక్-మో-మోక్షం అనేటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు ఇక ఆత్మను ఎరగాలన్న స్థాయికి వెళతాడు. మోక్షం రాగానే, మోహక్షయం కాగానే జన్మ ఆగిపోదు. మళ్ళీ జన్మ ఎత్తుతాడు. ఎందుకు ఎత్తుతాడు అంటే ఆత్మను ఎరిగేదాకా జన్మ ఎత్తుతాడు. ఆత్మను ఎరిగిన వాడికి జన్మ ఉన్నదా? రమణ మహర్షికి జన్మ ఉన్నదా? మరి ఎందుకు వచ్చాడాయన? ఆయన క్రితం జన్మ ఏమిటి? అట్లాగే అరవిందుల వారు, అలాగే శంకర భగవత్పాదులు వారందరూ కూడా కాల, కార్య, కారణ, కర్తవ్య నిమిత్తమై వస్తారు. ఆ మహాత్ములంతా కూడా, స్వామి వంటివారు, అవతార పురుషులు. వాళ్ళెందుకు వస్తారంటే ఆత్మను ఎరగటానికి రారు. ఆత్మను గురించి బోధించటానికి వస్తారు. ఆ ఆత్మతత్త్వమే నిజతత్వం అని ఈ జగత్తుకి చెప్పాలి గనుక అటువంటి స్థాయిలో వాళ్ళు రావాలి. ఎందుకని? వాళ్ళకి మోహం లేదు. వాళ్ళకి భక్తి లేదు. స్వామి ఎవరినన్నా పూజిస్తారా? అంటే లేదు. ఎందుకు లేదు? లేదు అంత. అందు సర్వ జగత్తు, సర్వ సృష్టి ఆయనను పూజించాలే తప్ప ఆయనకు పూజింప-బట్టానికి మనకు వస్తువు లేదు. ఎందుకు? అధికాధికమైనటువంటి స్థాయిలో పరమాత్మ అవతారమూర్తియై వచ్చాడు గనుక పూజను అందుకోవలసిన వాడే తప్ప...సేవలు అందుకోవలసిన వాడే తప్ప సేవలు చేయటానికి వచ్చినవాడు కాదు మరి సేవ అందుకోవటానికి అంటే ఎన్నాళ్ళు అందుకుంటారు అంటే సేవలు చేయించటానికి వచ్చిన వాడు అని అర్థం. ఆ సేవలు చేయించాలి ఆత్మబోధ చెప్పాలి అంటే చెప్పించాలి పాటలు పాడాలి అంటే పాడించాలి ఈ పాడుతున్న ఆడుతున్న కూడుతున్న వీడుతున్న సమస్తమైనటువంటి సృష్టి దాని యందున్న సృష్టి జాలము కూడా పరమాత్మ యొక్క తత్వమే అన్నప్పుడు ఆమె ఒక్కసారి సంభ్రమానికి లోనైంది లోనై ఇవన్నీ ఎరిగి చెప్పటానికి ఎంత వయస్సు కావాలి అని అడిగింది కాలమే వయస్సు మనకి ఒక measurement ఉంది యాభై ఐదు వచ్చినాయి అన్నాం యాభై ఐదు వచ్చినాయి సంతోషమే జ్ఞాని యాభై నాలుగు పోయాయి అంటాడు కదా యాభై నాలుగు పోతే కదా యాభై ఐదు వచ్చింది యాభై ఐదు sudden గా వచ్చింది అలాలే యాభై నాలుగు పోయినాయి పోయి బాల్య కౌమార యవ్వన మధ్య స్థితులు దాటి వృద్ధాప్యం వైపు వడివడిగా అడుగులు వేసి వృద్ధాప్యంలో మనస్సుని శరీరాన్ని ఇంద్రియాలని బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని అన్నింటినీ సమసింపజేసుకుని ఒక నిశ్చితమైనటువంటి స్థాయిలో ఉండగలిగితే అది ఉత్తమోత్తమమైనటువంటి వానప్రస్థంగా మనం భావన చేయాలి వానప్రస్థం అంటే అరవై డెబ్భై తర్వాత రామాయణం తీద్దాం అనుకోకూడదు అరవై డెబ్భై తర్వాత రామాయణం తీసినా ఒకటే తీయకపోయినా ఒకటే అది పెద్ద effect ఏం ఉండదు. ఏముంటుందంటే ఒకటే దుఃఖం మిగులుతుంది ఇంత గొప్ప విషయాలు మేము డెబ్భై ఏడు వచ్చేదాకా ఎందుకు చదవలేదు అని. దానికంటే best ఏంటంటే చదవకపోవడం హాయిగా విని వెళ్ళిపోవడం మంచిది. కానీ సాధకుడు అయినటువంటి వాడు ఒక చిన్న వయస్సులో ఈ కపిలుడు ధ్రువుడు వీళ్ళ వయస్సులో నాలుగైదేళ్ళ వయస్సులో ఓ గురువుకి గురువు దగ్గర గనుక చేరగలిగినట్లయితే ఆ మాటలు అర్థమైనాయా కాదా కాదు విని, విని, విని వాడి మనస్సు దాని యందు ఒక అనురక్తి ఏర్పడుతుంది. ఆ అనురక్తిలో నుంచి పూర్ణమైనటువంటి ముక్తికి తాను వెళ్ళవలసిన బాట తాను నడవవలసినటువంటి మార్గాన్ని తానే ఎంచుకుంటాడు గనుక అటువంటి పూర్ణమైన స్థితిలోకి వెళ్ళాలి. అందుకనే స్వామి బాల వికాస్ పెట్టారు. మళ్ళీ marks లు present లు తర్వాత momento లు వాటి కోసమైన పెట్టలా భాగవతులు తయారు కావాలి లేకపోతే అధ్యాత్మ విద్య ఎవరికి బోధించాలి ఎప్పుడు బోధించాలి కనుక ఈ కపిలుడు బాల వికాసులో ఉన్న student అనుకుందాం ఆ బాల వికాసులో ఉన్నటువంటి వాడు తన తల్లికి ఎంత గొప్ప ఆత్మబోధ చేశాడో చూడండి. ఈ దివ్యమైనటువంటి నాలుగు విషయాల్లో కాలం కాలాన్ని గురించి నాలుగు విషయాలు చెప్పాడు కపిలుడు మారదు ఆగదు అది ఎవరినీ ఆపదు చూశారా అది ఆగదు అది ఆపదు ఎవరినైనా ఇముడ్చుకోగలదు ఎవరినైనా తుంచుకో గలదు ఎప్పుడైనా తుంచుకో గలదు చాలా నిర్దయగా ఉంటుందది మనకి నిర్దయా అనిపిస్తుంది దాని సహజ గుణం అది అలాగే మూడవది కాలము నందే ప్రకృతి యొక్క ఆత్మ సంస్థితమై ఉన్నది కాలం కారణంగానే నలభై ఎనిమిది గంటల క్రితం మనం ఇట్లా కూర్చోలే స్వెట్టర్లు, రగ్గులు, క్విల్ట్లు ఊళ్లో ఉన్నవన్నీ గొనుక్కొచ్చినా ఏం తగ్గలే sudden గా ఒక రాత్రికి రాత్రే అసలు ఇవి ఏవీ అవసరమే లేని ఒక, ఒక స్థాయి ఏర్పడిపోయింది ఒక్క క్షణంలో ఎవరు monitor చేశారు పరమాత్మ. ఆ పరమాత్మ ఏ రూపంలో monitor చేశాడు కాలం అనేటువంటి రూపంలో. నిన్నటి వరకు దక్షిణాయణం అన్నాం మకర సంక్రాంతి వచ్చిందో లేదో ఉత్తరాయణ పుణ్యకాలం అన్నాం దక్షిణాయన పుణ్యకాలం అనలేదుగా ఉత్తరాయణ పుణ్యకాలం అది ఇది పుణ్యం ఎందుకైంది అది పుణ్యం కానిది ఎందుకైంది అంటే కాలాన్ని మనం అట్లా అర్థం చేసుకోవాలి తప్ప కాలానికి పాపపుణ్యాలు రెండూ లేవు అది ప్రవహిస్తూ ఉంటుంది అది నడిపిస్తూ ఉంటుంది అది ఎవరిని ఎప్పుడు ఇక్కడికి రప్పించాలో రప్పిస్తుంది ఎవరిని తప్పించాలో తప్పిస్తుంది. అందుకే స్వామి కాలక్షేపం చేస్తున్నాను ఏదో కాలక్షేపం చేస్తున్నాను అని అంటే స్వామి చెప్తారు జాగ్రత్తగా ఉండు బంగారు కాలమే నిన్ను నడిపిస్తున్నదేమో కాలమే నిన్ను జరిపిస్తున్నదేమో కాలమే నిన్ను ముంచెత్తబోతున్నదేమో కాలాన్ని నువ్వేం చేయగలవు అని అడిగారు స్వామి. ఆ కాలంలోనే ఒక గరీబు ఒక అమీర్ అవుతాడు ఒక అమీర్ ఒక గరీబ్ అవుతాడు కాలనేమి అనేటువంటి నేమి అంటే మన బండి చక్రానికి ఉన్నటువంటి outer ring ఆ ఇనప ఆ పట్ట ఏదైతే ఉన్నదో దానికి నేమి అని పేరు కాలనేమి ఆ కాలం కూడా ఒక చక్రం దానిలో పన్నెండు ఆకులు పన్నెండు నెలలు లేదా ఆరు ఆకులు ఆరు ఋతువులు లేదా మూడు, మూడు పొద్దులు లేదా రెండు దివా రాత్రులు కాబట్టి కాలము అనేటువంటి ఆ ఇరుసు మధ్యలో పరమాత్మ అనేటువంటి ఒక చోదక శక్తి ఉంటే దాని నుంచి ఆ ఆకులన్నీ కూడా విభా-విభాగీకరింపబడి వాటిని మనం radial diversion అంటాం radial గా వెళుతూ ఉన్నాయి central point నుంచి శక్తిని తీసుకుని ఎలాగైతే వెళుతున్నాయో కానీ కాలనేమి అది అరగదు విరగదు కరగదు దానిని అంటిపెట్టుకునే ఉంటుందది కొన్ని ఏళ్ళ తర్వాత ఆ కాలనేమి దీని నుంచి మళ్ళీ విడిపోతుంది. మళ్ళీ లోపల వడ్రంగి వాడు కొత్త చక్రం తయారు చేస్తాడు మళ్ళీ చక్రం బిగిస్తాడు మళ్ళీ కొత్త చక్రం తయారైంది అంటున్నాం కాబట్టి ఈ కాలం దయాహీనత ఉన్నటువంటిది ఎవరి యందు దయ చూపదు దానికి ఎవరి యందు పక్షపాతం లేదు శ్రీరామచంద్ర ప్రభువు అయినా సరే పాంచభౌతిక దేహాన్ని గనక ధరించి ఇక్కడికి వస్తే.పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం చేయనివ్వండి ఆయన ఏదో ఒకరోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టవలసిందే పరమాత్మకే ఇది తప్పదు జీవుడికి అసలు ఊహకే అందదు కాబట్టి సహజ పరిణామం ఏమిటంటే భగవాన్ రమణ మహర్షిని అడిగారు మరణం అంటే ఏమిటి అని మార్పే మరణం బంగారు అన్నారాయన ఏది మార్పు ఇక మార్పు చెందటానికి వీలులేని స్థితికి అది వచ్చిందో దాని పేరు మరణం అంతే తప్ప మరణం అంటే దుఃఖించ దగినటువంటి విషయం మాత్రం కాదు దానికి అటువంటి స్థాయికి వెళ్ళటానికి అధ్యాత్మ సాధన చేయమన్నాడు కపిలుడు కాబట్టి కాలముకు దయ లేదు కాలానికి అంతం లేదు ఎక్కడ ఆగుతుంది ఎన్నేళ్లు మనం ఏదో చెబుతాం 2012 కి ఏదో అయిపోతుంది 2020 కి అంతా సత్యలోకం ఏం జరగదు అవేం జరిగేవి కాదు ఎందుకని అంటే అనంత కాల ప్రవాహంలో ఒక చిన్న మలుపు రావచ్చు గాక ఆ మలుపులో నుంచి ఒక చిన్న పరిణామం జరగవచ్చు గాక ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళవచ్చు గాక ఈ పరిణామం అనేటువంటిది దుర్భోచనం అవుతుందే తప్ప అపరిణామమైనటువంటి ఆత్మ అపరిణామమైన కాలము రెండు they are synonyms with each other అది ఇది ఆత్మ అన్న కాలం అన్న ఒకటే తర్వాత ఆత్మకు మారుపేరు నేను ఎట్లాగో కాలము యొక్క అధీనత ఎవరి యందున్నది అంటే కాలుడి యందున్నది కాలుడు అంటే యమధర్మరాజు యమ ధర్మ రాజు ఎంత గొప్ప పేరో చూడండి అది ఆయన ధర్మానికి రాజు యమ ధర్మానికి రాజు అంటే ఇక చెప్పబడటానికి ఆచరింపబడటానికి వీలు లేనటువంటి అధికాధికమైనటువంటి ధర్మానికి ఆయన రాజు కనుకనే రాముడైనా కృష్ణుడైనా షిరిడి సాయి అయినా ఎవరైనా సరే అవతార పరిసమాప్తి చేయవలసిందే దానిలో దుఃఖించటానికి అయ్యో ఆయన దేవుడు కదా ఇలా ఎందుకైంది అంటే దేవుడు అయినప్పటికీ పంచభౌతిక దేహాన్ని తీసుకుని వచ్చాడు గనుక పంచభౌతిక దేహాన్ని ఇక్కడే వదిలి పెట్టాలి గనుక ఆ వదిలి పెట్టడానికి ఒక కారణాన్ని తానే వెతుక్కుంటాడు గనుక కాలాన్ని తానే నిర్ణయించుకుంటాడు గనుక జ్ఞాని అయినటువంటి వాడికి ఏ క్షణాన ఈ శరీరం వదిలిపెట్టబోతున్నదీ ముందే తెలుస్తుంది జ్ఞాని కాని వాడికి ముందే తెలిసినా ఆ పంచా ఈ పంచా జేరి వాడిని వీడిని పట్టుకొని ఏదో ఇంకో నాలుగేళ్ళు extend చేయమని అడుగుతూ జీవితాన్ని గడుపుతాడు అది అజ్ఞాన భూమిక ఇది జ్ఞాన భూమిక కపిలుడు ఉత్తమోత్తమమైనటువంటి బోధ చేశాడు కపిల బోధ దత్త బోధ కపిలుడు తర్వాత వచ్చిన అవతారమే దత్తాత్రేయ అవతారం దత్తాత్రేయ అవతారం కూడా అనేకమైనటువంటి కళలతో పదహారు కళలతో వచ్చాడు ఆయన ఇరవై నాలుగు గురువులతో వచ్చాడు మూడు వేల ఆరు వందల మంది యతి స్వరూపులతో వచ్చాడు ముప్పై ఆరు వేల మంది మహాగురువు స్వరూపాలుగా వచ్చాడు ఏకకాలంలో కాబట్టి ఆ దత్త ప్రభువు యొక్క మూలం ఎక్కడి నుంచి అంటే ఇదిగో తల్లికి బోధ చేసినటువంటి కపిలుడి స్థాయి నుంచి సాంఖ్యాన్ని బోధించి ఆత్మవిద్య విశారదత్వాన్ని పరిచయం చేశాడు గనుక ఆయన చాలా మనమందరం కూడా మనందరికీ యాభై ఏళ్ళో అరవై ఏళ్ళో డెభై ఏళ్ళో వరకు వచ్చాయి అనుకుందాం ఎప్పట్నుంచి లెక్క పెడతాం మనం భూమి మీద పడ్డప్పటి నుంచి ఆ ముహూర్తం నుంచి ఆ నక్షత్రం నుంచి ఆ రోజు నుంచి ఫలానా రోజు నా birthday అని చెప్తాం అది English calendar ఆ తెలుగు calendar ఆ పక్కనబెట్టి కానీ వీడు అంతకు ముందే సుమారు పది నెలలు జీవించాడు జీవుడిగా తల్లి గర్భంలో ఆ ఒకటి మనం ఎప్పుడూ add చేయాలి దాన్ని లెక్క పెట్టం మనం ఆ ఒకటి మనం లెక్క పెట్టాలి అసలు మనం బతికిందే అక్కడ బతక్కూడదు అని అనుకున్నది కూడా అక్కడే ఆ గర్భస్థ శిశువు జీవుడు తన పూర్వ స్మృతులన్నీ ఇప్పుడు ఎవరో ఒకాయన పోయారు పెద్దాయన పోయారు అనుకుందాం ఆ పెద్దాయన పోయి ఏదో ఇంకో గర్భాన్ని అది మళ్ళీ వచ్చి అక్కడే పుట్టాడు ఆయన ఇంకో గర్భాన్ని ఆశ్రయిస్తాడు ఆ గర్భాన్ని ఆశ్రయించినప్పుడు ఇప్పుడు ఏది అనుభవించాడో అన్నీ ఆయనకు గుర్తుంటాయి ఎప్పటిదాకా తల్లి గర్భంలో ఏడవ నెల వచ్చేదాకా స్మృతులు ఉంటాయి ఏడవ నెల తర్వాత స్మృతులు నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి తల్లి నుంచి విడిపడిన మరుక్షణం umbilical cord అంటామే బొడ్డు కోసారంటారే ఆ క్షణం నుంచి పూర్వ స్మృతులు నశిస్తాయి పూర్తిగా దాని మీద iron curtain పడిపోతుంది పడిపోగానే వాడు పడ్డందుకు ఏడుస్తాడు పుట్టి బతికినందుకు మనం నవ్వుతాం అది వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఆ స్మృతులతో అక్కడ జరిగిపోయినవన్నీ గుర్తు చేసుకుంటూ అయ్యో నేను మళ్ళీ ఇటువంటి ప్రపంచంలోకి వెళ్లాలా మళ్ళీ పుట్టాలా అని జీవుడు గర్భస్థ వేదన పడతాడు అది ఒక జీవుని వేదన కాబట్టి ఆ వేదన మనకు దుఃఖంగా ఒక నిరాశగా మనకు కనిపిస్తుంది కానీ అది పరమేశ్వరుడికి జీవుడు తల్లి గర్భంలో ఉండి చేసేటువంటి నివేదన అది ఆ నివేదనా పూర్వకమైనటువంటి విషయాన్ని వ్యాసులవారు పరమాద్భుతంగా చిత్రీకరించారు దాన్ని నిజానికి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి అని గనక అన్నట్లయితే ఈ విషయాలన్నీ తెలుసుకోమంటున్నాడు పరీక్షిత్ మహారాజుకి ఎందుకని అంటే పరీక్షిత్ మహారాజుకి ఉన్న సమయం ఏడు రోజులే ఆ ఏడు రోజుల్లోనే ఇవన్నీ తెలుసుకొని ముక్తి పొందాలి ఆయన ముక్తి పొందాలి గనుక మార్గం ఎంత చెప్పాడు నా కృష్ణుడు అంటే ఇష్టం ఆయనంటే భక్తి అయినా నీకు ముక్తి రాదు నువ్వు ఆత్మని ఎరగాలి నువ్వు జ్ఞానివి కావాలి నువ్వు కాలాన్ని గురించి తెలుసుకోవాలి కాలము యొక్క దయారహిత స్థితిని తెలుసుకోవాలి కాలం నీకు కన్నీరు తెప్పిస్తుంది కన్నీరు తప్పిస్తుంది ఆ కాలము యొక్క మరొక్క పేరే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మము యొక్క తత్వంలోకి నువ్వు వెళ్ళాలి కేవలం నామ రూపాలతోనే గనక నువ్వు ఆగిపోయినట్లయితే నువ్వు పూర్ణ సాధకుడివి కావటానికి వీలు లేదు గనుక ఆ పూర్ణమైన తత్వంలోకి వెళ్ళాలి నవనీతాన్ని పట్టుకోవాలిఇంత ఉన్నది భాగవత నవనీతం అంటే ఇన్ని విషయాలు మనం చక్కగా అర్థం చేసుకొని ఆ పూర్ణమైన అటువంటి అద్వైత స్థితిలోకి వెళ్ళాలి. ఆ వెళ్ళటానికి గర్భస్థ జీవుడు ఏమడుగుతున్నాడు? కపిలుడు వ్యాస భాషలో లేదా మన పోతనామాత్యుడు యొక్క భాషలో ఏం చెప్పాడు అంటే, అడిగింది ఆమె, "నాయనా! నాకిది చెప్పు, అది చెప్పు" అని అడిగింది. ఇందాక చెప్పినవన్నీ అవే. విమలం బై పరిశుద్ధమై తగు మనోవిజ్ఞాన తత్వత్ ప్రబోధ మతిన్ నిల్పి తదీయ మూర్తి విభవ ధ్యానంబు గావించి చిత్తము సర్వాంగ విమర్శన క్రియలకున్ తా కొల్పి ప్రత్యంగమున్ సుమహా ధ్యానము చేయగా వలయుబో శుద్ధాంతరంగంబు నన్". ఇది చేస్తే చాలట. ఏం చేయాలంటే మనస్సుని శుద్ధమైన అంతరంగం చేసుకోవాలి. శుద్ధత్వంలోకి వెళ్ళాలి. శుద్ధత్వంలోకి వెళ్ళాలి అంటే ధ్యానంగా ఉండాలి. ధ్యానిగా ఉండాలి. ధ్యానిగా ఉండాలి అంటే ఇతరేతరమైన ఆలోచనలు వదిలిపెట్టి తనదైనటువంటి జీవైకమైనటువంటి ఒక భావనతో నిలకడ చెందాలి. బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాతా పరమానందదాయిని. ఆ ధ్యాన శబ్దం ఏదైతే ఉన్నదో ఎవరి మీద ఆధారపడని స్థితి ఒకటి. ఆత్మ వృత్తులతో మాత్రమే ఉండగలిగేటువంటి రెండవ స్థితి. అహం బ్రహ్మాస్మి అని అనుకోగలిగినటువంటి ఒక సాధారణ స్థితిలోకి గనుక వెళ్లినట్లయితే మనసుకు ఒక శుద్ధత్వం ఏర్పడుతుంది. ఆ శుద్ధత్వంలో కూడా మళ్ళీ ధ్యానిగా ఉండాలి. అందుకనే రాముడు ధ్యానంలో ఉన్నాడు. కృష్ణుడు ధ్యానం చేశాడు. కృష్ణ ధ్యానం అంతా కూడా జ్ఞానమయమైనటువంటి మార్గం. శ్రీరామచంద్ర ధ్యానం అంతా నారాయణ పద పద్మాధీన చైతస్కమైనటువంటివి. కనుక మనీషాయత్తము, ఇందాక చెప్పిన జ్ఞానాధిక్యము ఏదైతే ఉన్నదో, అంటే జ్ఞానానికి అతీతమైన స్థాయి ఏదైతే ఉన్నదో ఆ పురుషోత్తముడి యొక్క దివ్య నామ రూప భావ తత్వముల యందు మనస్సును లగ్నం చేయమంటున్నాడు ఆయన. ఎలా చేయాలి విమల భావంతో చేయాలట. ఏదో ధ్యానం చేస్తాను, నాకు ఆరోగ్యం రావాలి, ధ్యానం చేస్తాను, అప్పులు తీరాలి, ధ్యానం చేస్తాను, ఆయుష్షు పెరగాలి. ఏమీ జరగవు. దానికి దీనికి సంబంధం లేదు. ధ్యానము వలన మనస్సు ఏకాగ్రత వైపు అడుగు వేస్తుంది ఒకటి. రెండవది ధ్యానము వలన మనసులో కలిగేటువంటి విపరీత భావాలు, ఆలోచనలు నశించి పరిపూర్ణమైన, సహజమైన, సత్వమైన ఆలోచనలన్నీ కూడా మనకు ఏర్పడతాయి. ఈ ఆలోచనలు ఏర్పడటానికి ధ్యానము యందు మనస్సు నిలకడ చెందటానికి చక్కగా సాత్వికమైన శాకాహారం గనుక తీసుకున్నట్లయితే ఆలోచనలు తదనుగుణంగా సాగుతాయి. మంచి ఆలోచనలు, ఆ మంచి ఆలోచనలు కూడా మలగిపోయే స్థాయి వస్తుంది గనుక అమ్మ శుద్ధాంతరంగమైన స్థితిలో అంతరంగం శుద్ధిగా ఉండాలి. బయట ఎంత బాగుంటే ఏం లాభం? లోపల స్వామి అన్నట్లు ఎక్స్టర్నల్ కామ్నెస్సు, ఇంటర్నల్ కమోషన్. ఇవాళ భక్తుడి స్థితి అది అన్నారు. ఇంటర్నల్ గా వాడికి కమోషన్. అది అద్--అత్యద్భుతమైనటువంటి భావన. సముద్రం మధ్యలో ఏమున్నది అంటే సుడిగుండం. సుడిగుండం మధ్యలో ఏమున్నది అంటే ఏం లేదు అక్కడ. అటువంటి స్థాయిలో మనస్సును తీసుకుని వెళ్ళాలి. అందుకనే మనస్సును తీసుకుని హృదయ స్థానంలో చేర్చుకోగలగటమే మోక్షం అన్నారు రమణ మహర్షి. మామూలు రమణ మహర్షిని వినహాయిస్తే మిగతా వారంతా ఏం చెప్పారంటే మనస్సుని, ఆలోచనను తీసుకెళ్ళి త్రికూటనాం నిస్థితే అంతరంగే అంటారు శంకర భగవత్పాదులు. ఆజ్ఞాచక్రం దగ్గర గనుక లయం చేసినట్లయితే, ఆ శూన్యంలో కలిపినట్లయితే సహస్రారం వలన ఏర్పడేటువంటి మలయ పవనాల యొక్క అనుభూతి నీకు కలుగుతుంది అంటారు. అది యోగశాస్త్రం. ఇక్కడ భగవాన్ రమణులు ఒక్కటే చెప్పారు. మీ మనస్సును తీసుకెళ్ళి దాని పుట్టిల్లు అయినటువంటి హృదయ స్థానంలో పెట్టండి. అది మోక్ష స్థితి. అది ఆనంద తారక స్థితి. మనస్సు అడగి మనసు నెమ్మదిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఒక స్త్రీ తన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందాన్ని, ఎంత స్వేచ్ఛని, ఎంత భారాన్ని వదులుచుకున్నట్లుగా ఉండగలుగుతుందో ఈ మనస్సు కూడా హృదయ స్థానానికి చేరినప్పుడు అంతే సంతోషంగా ఉంటుంది అని చెప్తారు. ఒక స్త్రీని అడిగితే మీకు భద్రమైన స్థానం ఏది అంటే మీరు ఎంత చేయండి, ఎన్ని పెట్టండి మా పుట్టిల్లు బెస్ట్ అండి అంటది. పూరి పాక అయినా సరే ఆ చూరు కింద పడుకుంటా, నాకక్కడ హాయిగా నిద్ర పడుతుంది అంటుంది. ఇటువంటి ప్రశ్న స్వామి ఎదుర్కొన్నారు. స్వామి, స్వామి మీకు భద్రమైన స్థానం ఏది? మీరు మీకు ఆనందంగా మీ అంతట మీ ఒక్కరే ఉండాలి అనుకుంటే ఎక్కడ ఉంటారు అని అడిగితే భక్తుల హృదయమే నాకు ఆనందం కలిగించే స్థాయి అని చెప్పారు స్వామి. అంటే పరమాత్మకి భక్తుల హృదయంలో ఉండాలని ఉంటుంది. ఆయనను పిలుచుకోగలిగిన స్థాయికి మనం రావాలి. దానికి ఆ శుద్ధాంతరం గవంటే అది. ఆయన రావటానికి సిద్ధమే, మనం సిద్ధంగా కూడా ఉండాలి.
SSSMC · audio
Bhagawata Navaneetham - 22
Bhagawata Navaneetham - 22
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 30:02
More in this series