Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం, సౌందర్య సార సర్వస్వం, మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం, ప్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం, మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం, ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాత్, పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ, [పాట] రెమ్మా! మానవ కోత్తమ లెమ్మా! లేవయ్యా వామన! మానవ కోత్తమ అంటే బ్రహ్మచారి ఒట్టువాలి. [పాట] నీ వాంఛితార్థము లేదనక ఇత్తం తెమ్మా అడుగులనిటు. పాదాలు ఎక్కడ కాదు ఇక్కడ పెట్టు, ఇదిగో పళ్ళెం తీసుకొచ్చాం దీంట్లో పెట్టవయ్యా. [పాట] రా నిమ్మా! నా వైపు రా నిం, కడుగంగ వలయు నేటికి తడయన్. ఇదిగో నీ పాదాలని మేము కడుక్కోవాలి హాయిగా, పాదపూజ చేసుకోవాలి, పళ్ళెంలో పెట్టమని అడిగాడు. అని నా విని అప్పుడు ఏం చేసాడో తెలుసునా? మరి వచ్చినవాడు ఎవడు? ఏదో తెచ్చి టపీమని రెండు కాళ్ళు తీసుకెళ్లి పళ్ళెంలో పడేశాడా? [పాట] బలిదై చేంద్ర కరద్వై కృతజల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగిస్సు మనః సంప్రాప్తిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరి కాశాదమున్ నడి నామోదను రత్ననూపురిత నానావేదమున్ పాదమున్. ఆయన పాదాలకు ఉన్న అందెలన్నీ కూడా నానా వేదాలట. మనకు తెలిసిన నాలుగు వేదాలు. ఈయన విభజన చేశాడు గనుక నాలుగు అయినాయి. కాని అవి నానా వేదాలు. నానా వేదాలన్నీ కూడా ఆయన పాదం చుట్టూ ఒక ఆక్రమించి ఉన్నాయి. ఆ-ఆ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిన్, నీళ్లతో కడగటం కోసమై అటువంటి దివ్య పాదాలని, ఎటువంటి పాదాలు? ఎప్పుడూ నీళ్లలో ఉండేవి, ఎప్పుడూ అమ్మవారి చేత తుడవబడుతూ ఉండేవి. అంతే కాదు, అమ్మవారి యొక్క లలాట ఫాల భాగం మీద ఆవిడ గ్రంథం రాసుకుని ఉంటే, అమ్మవారు ఎలా నమస్కరించేదట? కపోలం ఉన్నది చూశారా? అంటే ఫాల భాగం అయ్యవారి పాదాలు అడుగున పడేట్టుగా చూసుకునేదే. ఎందుకని అంటే, విధి లిపి నాశయంతి అంటాడు. గురువు యొక్క పాదాలు బ్రహ్మ, ఇక్కడ ఫాల భాగం నుదుటి రాత అంటాం చూడండి, నుదుటి రాత పోవాలి అంటే గురువు యొక్క పాదాల అడుగున ఉన్నటువంటి అగస్త్య రేఖలను గనుక తాకగలిగినట్లయితే కర్మ పరిపాకం చెందుతుంది. రోజూ అమ్మవారు అదే కోరుకునేదట. కోరుకున్నది గనుక రోజూ ఆయన పాదములలో ఆనించేవాడు. శ్రీదమున్ బురద బురదగా ఉన్నది కదా మొహం అంతా, ఏమి బురద అంటే, ఇదిగో కస్తూరి మద పరిమళంతో మదంతో దాంతో అంత అలంకారం చేసుకునేది అమ్మవారు కదా! సౌభాగ్యవతాం. [పాట] సురలోక సముద్ధరణము నిరత శ్రీకరణము అఖిల నిగామాంత అలంకరణము భవ సంహరణము హరి చరణము నీట కడిగే అసురోత్తముడున్. కడిగాడు. పాద జలాలన్నీ చక్కగా నెత్తిన పోసుకొని తన భార్య నెత్తిన చల్లి, దేశకాలాది పరిగణన చేసి, అంటే right action at right time చేయాలి. అప్పుడే ఫలిస్తుంది. విత్తనం మొలకెత్తే చోట రైతు క్షేత్రంలో వేస్తే పంట పండుతుంది. మొలకెత్తని రోజుల్లో వేస్తే అవి నాల్లో కలిసిపోతాయి. యోగం సంభవించినప్పుడే దానం చేసుకోవాలి. అవకాశం వచ్చినప్పుడే సేవ చేయాలి. అవకాశం వచ్చింది రేపు చేద్దాం అనుకుంటే రేపుకు రూపం లేదు. మనం ఉంటామో ఉండమో ఎవరికి తెలుసు? ఇవాళ ఉన్నాం గనుక ఇవన్నీ జరుగుతున్నాయి. రేపు పొద్దున ఏమో తెల్లవారు లేస్తే మనం ఉన్నట్టు లేకపోతే లేనట్టు. జీవితం దాని యొక్క పరిమితి అంటే దాని యొక్క యదార్థమైనటువంటి వాస్తవిక స్థితి అంతే. అయితే జాగ్రణావస్థలో మాత్రం పరిపూర్ణ వైభోగంలో దాన్ని చేసుకోవాలి. చేసి దేశ కాల ప్రదేశ పరిగణన చేసి వాడు కూడా అసురోత్తముడు ఏం చేసాడో తెలుసా, ఎలా దానం ఇచ్చాడంటే [పాట] విప్రాయ ప్రకటౌ వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాన్య విధే త్రిపాద ధరణిన్ దాస్యామి. దాసుడనై నీకిస్తున్నాను, అధికారుడనై ఇవ్వటంలే, రాజునై ఇవ్వటంలే, అసలు నీకు ఇవ్వటం వలన నేను దాసుడినైపోయా. క్షణాన ఇస్తున్నప్పుడే దాసామి. [పాట] అంచు క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచే దాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారపోసి భువనంబు ఆశ్చర్యంబు పొందగన్. ధారపో-పోసాడట. సర్వ భువనాలు ఒక ఆశ్చర్యానికి లోనైపోయినాయి. అయితే బ్రహ్మ ప్రీతం అని ధారపోసి, అది దానంలో నాకు లాభం కలుగు గాక అని కాకుండా. అలాగే భూదేవి కూడా అట. మనం లోకంలోకి వచ్చేటప్పుడు మనకు కావలసిన, ఎప్పుడూ అనుకునే Six by three మనకు కావాల్సింది. అంతేగా? ఆరడుగులు by three feet, eighteen square feet కావాలి మనకి. ఉన్నా అంతే చాలు, పోయినా అంతే చాలు. ఆవిడ ఏమంటుందట తెలుసునా? వసుంధరా బ్రహ్మ దత్త అంటుందట. వసుంధరా అంటే అమ్మవారు, భూదేవి. బ్రహ్మ నీకిస్తున్నాడురా అన్నదట. అది బ్రహ్మదత్త. మరి బలివంటి దానవీరుడు, దయావీరుడైనటువంటి పరమాత్మతో ఏమన్నాడంటే...ఈ దానము బ్రహ్మకు ఆనందము కలుగుగాక బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు సర్వ సృష్టికి సర్వం ఖల్విదం బ్రహ్మ అనబడేటువంటి బ్రహ్మ అంటూ ఒకడు ఉంటే వాడికి ఆనందం కలుగుగాక ఉన్నాడు ఎలా ఉన్నాడు వామన రూపంలో ఉన్నదో బ్రహ్మ నీకు తృప్తి కలుగుగాక నీకు ఆనందం కలుగుగాక మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు నీకు క్షేమం జరుగు గాక నీకు ఆనందం కలుగుగాక నాకు ఆనందం కలుగు గాక కాదు అట్లా గనుక దానం ఇవ్వగలిగినట్లయితే అది పూర్ణమైన దవా-దవా-దానంగా భావన చేయాలి సమయంలో చూడండి మంచి పని ఎప్పుడన్నా జీవితంలో చేయటమే కష్టం చేద్దామని సద్బుద్ధి కలిగితే అడ్డుపడే వాళ్ళు అరవై మంది అన్నారు అందులో యాభై తొమ్మిది మంది తప్పించుకున్నా ఒకడు మాత్రం ఉండడు వాడు ఉన్నాడు ఇక్కడ నిరధార బడనీక అడ్డంబుగా కలశ రంధ్రమాపగాను తెలిసి శుక్రుడు ఏం చేశాడు రంధ్రం నీళ్ళ దానగార పోయాలిగా నీళ్ళు కింద పడకుండా అక్కడికి వెళ్ళి అలా రెండు కళ్ళు అడ్డం పెట్టి కూర్చున్నాడు వాడు ఎవరికీ తెలియదు సర్వాంతర్యామి అయిన పరమాత్మకి తెలియదా కర్మ సాక్షి ఆయన కర్మ సాక్షి అయినటువంటి పరమాత్మ తెలిసి ఆయన ఎరిగి వెంటనే హరియు కావ్య నేత్రమనెట కుశాగ్రంబున నడువ ఏక నేత్రుడయ్యేనతడు ఏమిటి నీళ్ళు రావట్లేదని బలి పాపం అలా కంగారు పడేలోగా ఏం లేదని దర్భ పెట్టి పొడిచాడు. పొడవగానే ఏందంటే శుక్రాచార్యుడిలో కంట్లోకి దర్భ దిగింది వాడు ఏక నేత్రుడయినాడు అంటే ఏకాకి అయినటువంటి పరమాత్మకి అడ్డు పడనం-పడినందువలన లోకంలో ఉన్నటువంటి శుక్రాచార్య స్థానంలో గురువు కాకి వైనాడు ఆయన ఏకాకి ఈయన కాకి కాకికి రెండు కళ్ళు ఉన్నా రెండు కళ్ళు మనలాగా ఎటు టైం చూడలేదు అది ఎటు తిరిగితే అటు ఒక్కన్నే పని చేస్తుంది లెఫ్ట్ కి తిరిగితే రైట్ కి పనిచేయదు రైట్ కి తిరిగితే లెఫ్ట్ కి పనిచేయదు కాబట్టి వాడు ఒక కాకి కర్ణ అయిపోయాడు అది అమరారాతి రక్షతోన్నిత పవిత్రాంభకరి శ్రేణికిన్ కమలాధీశ్వరుడుడ్డే ఖండిత దివౌక స్వామి జన్మస్తమున్ కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతా కుచోపాస్తమున్ విమల శ్రీ కుచ శాత చూచు కటటి విన్యస్తమున్ హస్తమున్ ముని జననియ మాధారను జనితాసుర యువతి నేత్ర జలగణ ధారన్ దవదేంద్ర నిరాధారను వనజాక్షుడు దనియే బలి వివర్జిత ధారన్ ధార పడుతున్నప్పుడు దినం శ్రీ సతి కొప్పుపై ఉన్నటువంటి హస్తమే ధారాజలం కింద చేయి పెట్టిందట పెట్టాడట పరమాత్మ ఎంతో మనోహర దృశ్యం చూడండి పరమాత్మ రావటం ఏమిటి నాకిది కావాలని అడగటం ఏమిటి ఇవ్వాలన్న మనసు వాడికి కలగటం ఏమిటి నేను తీసుకుంటున్నాను అన్నటువంటిది పరిపూర్ణమైనటువంటి మనసుతో పరమాత్మ అంగీకరించటం ఏమిటి చాలా విచిత్రమైనటువంటి వినూత్నమైనటువంటి సన్నివేశం ఇది కమలమాభు మెరిగి కాలంబు దేశంబు మెరిగి శుక్ర మాటలు ఎరిగి నాశమెరిగి దానం ఎలా ఇచ్చాడో అటు చూడండి వచ్చినవాడు విష్ణువు అని తెలుసు అయినా ఇచ్చాడు కాల దేశాల పరిస్థితులు తెలుసు అయినా ఇచ్చాడు శుక్రుడు మాట ఎరిగి అయినా ఇచ్చాడు నాశమెరిగి నేను నాశనమై పోతానని తెలుసు కూడా ఇచ్చాడు పాత్రమనుచు ఇచ్చే దానము బలి మహిమ దాన్యుడరుడు మరియు కలడే బలితో సమానమైనటువంటి ఇంత గొప్పవాడు నాకేమీ ఇంకా మిగలదేమో అన్న భయం లేకుండా ఇచ్చాడు చూడండి వాడు పరమాత్మతో సమానం బలి అందుకనే ఇవాళ ఓణం సత్యసాయి భగవానుడు ఓణము నాడు విష్ణు పూజ కాదు బలి పూజ చేయమంటారు స్వామి ఎందుకంటే దాన వీరం ప్రపంచానికి తెలియాలి దానం చేయటంలో కూడా ఒక వీరత్వం గంభీరత్వం శూరత్వం దివ్యత్వం అన్నీ ఉండాలి మహితత్వం ఉండాలి పుట్టి నేర్చుకొనెను పుట్టుక నేర్చెను చిట్టి బుద్ధునిట్టి పొట్టి వడుగు బొట్ట నున్నదల్లా గుమెలున వినవ్వి ఎలమి ధరణి దానమిచ్చనప్పుడు ధరణీ దానం కూడా చేశాడట ధరణీ దానం ముందు ఇవ్వలేదా అంటే మూడు ఎరువుల్లో పాపం బలి అనుకున్నాడు నేనున్నా ఈయన ఏం ఉంచుతాడు అని అనుకున్నాడు మరి భూదానం ఎక్కడ అన్నాడు గోదానం అశ్రణ్య దానం అన్నీ అయిపోయినయి అది కూడా ఇచ్చే నాకు కావాలి అన్నాడు దానికి కారణం తర్వాత చెప్తాడు భాగవతం చాలా పరమాద్భుతమైనటువంటి ఒక మహా రహస్య పేటిక ఇది కూడా నిజానికి శ్రీ మంజూషిక మంజూషిక అంటే పెట్టె. ఏమిటున్నాయి అంటే పరిసత్యాలు అన్నీ ఉన్నాయి ఎరుకోగలగాలి అందుకో గలగాలి అనుష్ఠానం చేయగలగాలి అనుభూతిని పొందగలగాలి విభూతి స్థాయికి ఎదగగలగాలి అందుకే భాగవతాన్ని చదవమన్నారు [కొట్టు] గ్రహముని ఇంద్ర సిద్ధ గంధర్వ కిన్నర యక్ష పక్షి దేవతాధిపతులు ఒగడి రథమి పంపు పుష్ప వర్షంబులు కురిసే దేవ తూర్య కోటి మొరసే దేవతారావాలు అన్నీ కూడా అనేక లోకాల నుంచి జయ జయ ధ్వానాలు మిన్ను ముట్టినయి మిన్ను మన్ను కలిసినయి అనేకమైనటువంటి జయ ధ్వానాలు అన్నీ కూడా ఆక్రమించినయి వామనుడు తర్వాత ఏం చేయబోతున్నాడు అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ముక్కోటి దేవతలు కూడా అంతే కాదు గంధర్వులు కిన్నరులు కింపురుషులు విద్యాధరులు అదృశ్య రూపులైన ముముక్షులు వీళ్లంతా ఎదురుచూస్తూ ఉన్నారు అప్పుడు ధారా పరిగ్రహంబు చేసి వాడి దగ్గర ఏం లేదు మిగిలింది తీసుకోవటానికి ఏం లేదు.ఇంతింతై వటుడింతయై మరియు తానింతై, చేతులు జాగ్రత్త మన బాహువులు ఆగవు కదా! తానింతై నభోవీధి పైనంతై సూర్యమండలాగ్రంబు వల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. సమస్త భువనాలని ఆక్రమించేశాడు. ధ్రువ తారకా మండలాలు దాటాడు, ఖగోళాలు దాటాడు, సూర్యమండలాలు దాటాడు, సత్యపదం దాకా వెళ్ళాడు. ఎందుకని అంటే ఆయన త్రియాతీత పదస్థిత, అది ఆయన స్థానం. ఆయన స్థానం పుడపర్తి శ్రీనుడి తరఫుది కాదు. త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం. జ్ఞానాగ్ని శిఖలన్నీ, అగ్ని అక్కడ ఉన్నది గనుక అక్కడ ఉన్నాడు. ఉంటే అక్కడ సూర్యగోళం దాటుతున్నప్పుడు సూర్యుడు ఏమైపోయాడంట చూడండి. వామనుడు, వామనుడు త్రివిక్రముడై పోతున్నటువంటి వేళ "రవిబింబంబు పమింప పాత్రమగు ఛత్రంబై" ముందు గొడుగు అయిందట. "శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై చవిమత్ కంకణమై కటిస్థలి నుదుంగంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచూన్" అటువంటి సూర్యమండలం అంతా చిట్టచివరికి ఆయన దివ్య పాదాలకు ఏర్పడినటువంటి చిన్న ఒక కంట అయిపోయిందట. ఇంత అయిపోయిందట ఆయనకి. ఆయన ఎంతవాడో కాకపోతే అది ఇంతది అయింది అని అది. "ఒక పాదంబున భూమికప్పి దివి వేరెంటనిరోధించి ఒందొకటన్ మిది జగంబునెల్లతడి ఒందెంతున్ విలంఘించి సట్టక బ్రహ్మాండ కటాహమున్ పగిలి వెండ్రంబై పరులు కానరాక ఒకడై వాగ్దుగలభ్యుడై హరి విభుండు వపారె విశ్వాకృతిన్" విరాట్ మూర్తిగా దర్శనం అయిపోయాడట. ఈయనని ఒక్కడుగా చూద్దాం ఇదిగో ఇట్లా ఐదు అడుగుల మూడు అంగుళాలుగా కనబడుతున్నాడు అంటే, ఏం లేదు. చూస్తే గోరు కనబడొచ్చు, కేశపాశం కనబడొచ్చు, ఎక్కడన్నా ఇంకేదన్నా శరీరంలో ఒక భాగం కనపొచ్చు నేను గానీ సర్వాంగీనమైనటువంటి ఒక సంకుచిత ఒక దేహాకృతి మాత్రం దాటిపోయి విశ్వంతరాత్ముడు అయినాడు, విశ్వంభరుడు అయినాడు, విశ్వాంబరుడు అయినాడు. విశ్వంభరుడు విశ్వాంబరుడు సర్వ ప్రపంచాన్ని అంబరం గా చేసుకున్నవాడు దానినే తన వస్త్రంగా తీసుకున్నటువంటి వాడు శ్రీ దత్త మహాప్రభువు అయినాడు అన్నమాట. "ఒక పదంబు కింద ఉరువి పద్మము నెట్టి కొన్ని సంకలనములు కొమరు దాల్చి ఒకటి మీద తమ్మి కొదిన తేటినా వెలసె మిన్ను" ఎలా ఉన్నదట అంటే ఒక పద్మంలో ఒక పాదం పెట్టుంటే ఈయన ఆకాశం దాకా వెళ్ళిపోయి ఉంటే అక్కడ ఆయన కొప్పు ఎక్కడైనా కనబడితే అక్కడ తేనెటీగ పద్మంలోకి ఎలా వెళ్లాలా అంటే బ్రహ్మ రంధ్రంలోకి ఎలా తొచ్చుకొని వెళ్లాలా అన్నట్లుగా ఒక ఆధ్యాత్మిక స్థితిలో పరమాత్మ త్రివిక్రముడు అయిపోయాడట. "జగము నెల్ల దాటి చనిన త్రివిక్రము చరణ నఖర చంద్ర చంద్రికలను కొనుగు పడియ సత్యమున బ్రహ్మతేజంబు జీవక నిరుచుల దివ్యవోలె" బ్రహ్మ తేజమే ఆయన, ఆయన విరాట్ మూర్తి శరీరం నుంచి వచ్చే తేజస్సు ముందు వెలవెల పోయిందట. అందుకే స్వామి అంటారే, పరమాత్మ ముందు దీపం ఎవడు ముట్టించగలడు అన్నారు. పరమాత్మే ముట్టిస్తాడు గనుక ఆయనకు ఒక దీపం ఎవడు ముట్టించగలడు. ఇదిగో ఆయన పరమాత్మ, ఇదిగో ఆయన కన్ను, ఇదిగో ఆయన ముక్కు అని ఎవడు చూపించగలడు, చూపించగలడా అంటారు. అంటే భౌతిక అవస్థలో ఇది ఇట్లా, ఇది ఇట్లా అని గుడిలో చూపించవచ్చునేమో కానీ అది పరిమితమైనటువంటి విగ్రహ స్వరూపాన్ని చూపించడమే. అది భౌతిక అవస్థ మాత్రమే. ఇట్లా త్రివిక్రమావతారం ఎత్తినటువంటి, పూర్ణమైనటువంటి, బ్రహ్మజ్ఞాని అయినటువంటి పరమాత్మ, పరమాత్మ చూడండి. అవతారం అంతా కూడా శక్తిమయం కాదు యుక్తిమయం ఇది. ఆయనన్నాడు, చాలా మంచి వాడిని జయించాలి అంటే మంత్రము, శక్తి, గాయము చేయకూడదు అన్నాడు పరమాత్మ బయలుదేరే వేళ వామనుడు కాకముందు. యుక్తితో వాడిని వంగదీసుకుని, "నీ రాజ్యం మీకిస్తాను మీరు వెళ్ళి కాసేపు అక్కడ వెయిట్ చేయండి" అన్నాడు. యుక్తి అంతా కూడా వామనుడు ప్రదర్శన చేస్తూ వచ్చాడు. అప్పుడు "తన పుట్టిల్లిద పొమ్మటంచు అజుడున్ కన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబు జూచి తత్పాద సేవనంబు చేసే కమండల ఉదకంబులు చల్లిల్చి తత్ తోయములు వినువీధిన్ ప్రవహించే దేవనదినా" దేవుని నదిలాగా "విశ్వాత్ము కీర్తిప్రధన్" నేను ఎక్కడ పుట్టాను అని బ్రహ్మ ఒక్కసారి భయపడ్డాడట. నా పుట్టు, మా పుట్టిల్లు ఎక్కడ అని. మనం కూడా చాలా రోజులకు వెళ్ళాం అనుకోండి, మా ఇల్లు ఎక్కడ అని మనమే వెతుక్కుంటాం. ఉండదు కాబట్టి. మా పూర్వీకులు ఇక్కడ ఉండేవాళ్ళే అన్నట్లు. ఎప్పుడైతే ఈయన విరాట్ మూర్తి అయిపోయినాడో మరి నాభిసంభవుడు కదా, కమల సంభవుడు, పద్మ సంభవుడు. నాభి మూలం ఎక్కడున్నది బొమ్మలో అని వెతుక్కున్నాడట. కానీ పట్టుకున్నాడు. పట్టుకుని ఆయనకిచక్కగా పూజాదికం చేశారు "యోగ మార్గంబు లోహించి బహువిధ పుష్పదామంబుల పూజ చేసి దివ్య గ్రంథంబును తెచ్చి సమర్పించి ధూపదీపములతో సేవ నిచ్చి భూరి లాజాక్షతంబును చల్లి" లాజలు అంటే మన తేలాలు. "ఫలములు కామి కలిచి రాగముల పొగడి శంఖాది రవములు జయ ఘోషములు చేసి కరుణాంబు నిధి త్రివిక్రమాయటంచు బ్రహ్మ మొదలు లోకపాలురు కొనియాడిరి ఎల్ల దిశల వనచరేశ్వరుండు జాంబవంతుడరిగి సాట వీరి ధ్వని వెలయజేసి విష్ణు విజయా విష్ణు విజయా యటంచు" విష్ణువు గెలిచాడు విష్ణువు గెలిచాడు అంటూ జాంబవంతుడు జయ జయ ధ్వానం చేసి సర్వలోకాలకి కూడా జాంబవంతుడే ఎందుకు వెళ్ళాడంటే వాడు కూడా వాయుపుత్రుడు గనుక వాయువుకి అందించినట్లయితే అన్ని చోట్లకి అది మోసుకొని వెళ్ళిపోతుంది. తరంగాలు. అందువలన ఆయన్ని ప్రయోగించారు. సరే తర్వాత వృక్షస్వరూప వ్రతం అంతా చేస్తాడు. వీళ్ళందరూ వస్తారు అప్పుడు బలి, బలి హృదయంలో పరివర్తన చూడండి. అన్నీ పోగొట్టుకున్నాడు కదా! కత్తులు చూస్తున్నారు సైనికులంతా. ఎవరి మీద? విరాట్ మూర్తి అయినటువంటి వటువు మీద, త్రివిక్రముడి మీద. "రాక్షసోత్తములార రెండు పోరాటక కాలంబు కాదిది కలహమునకు సర్వభూతములకు సంపదాపదలకు ప్రభువైన దైవంబు పరిభవింప మనము ఓపుదుమి" మన ఆపదకి మన సంతోషానికి మూలమైన పరమాత్మని పరాభవం చేయగలమా? మనం గెలవగలమా? కత్తి దూయగలమా? "తొల్లి మనకు రాజ్యంబునకు సురలకు ఆశంబు సురిది నిచ్చి విపరీతముగ జేయు వెల్పు నే మందము మన పాలి భాగ్యంబు మహిమ గాక" వాళ్ళ ఆస్తి అంతా మనకిచ్చాడు. అప్పుడు వాళ్ళని నిర్వీర్యుల్ని చేశాడు. ఇప్పుడు మన ఆస్తి అంతా తీసుకెళ్లి వాడికివ్వబోతున్నాడు. ఏమో ఆయన లీలలు ఇలా ఉన్నాయి కానివ్వండయ్యా ఎందుకు ఆయన మీదికి వెళ్ళటం? అన్నాడు. అని అసురవల్లభుని వారుణ పాశాలలో తీసుకుని వస్తే "గాలులు పదములు గట్టిన శ్రీహరి కృప గాక ఏమి సేయుదునని సందేహింపక బలి నిలిచెన్ హహారవమనగ దశదిగంతములన్ సంపద సెడియు ధైర్యము కంపంబు లేక తొంటి కంటెను పెంపున్ తెంపును ఎరుకయు ధైర్యము కంపని సుర ధైరి చూచి" ఇన్ని పోగొట్టుకున్నా ఎక్కడా తొడుకు లేదు వెనుకు లేదు అసలు ఏమీ నిశ్చలంగా ఉన్నాడట బలి.
SSSMC · audio

Bhagawata Navaneetham - 43

Home

Bhagawata Navaneetham - 43

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 21:20

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

    Now playing
  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67