Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం [బెల్ శబ్దం] మందస్మిత ముఖరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబే నర్హీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్ఫురతాం. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ వేదవ్యాస ప్రోక్తమై పోతనామాత్య కృతమైన శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో కృష్ణలీలా వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిగమకల్పతరోర్గణితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. పరమాత్మ యందు అనురక్తి ఉన్నటువంటి వారు పరమాత్మ ప్రియంభావుకులైనటువంటి వారు అంటే కావాలి అని ఆయనని ప్రేమించినటువంటి వారు అందరూ భాగవత ఫలాన్ని వేద కల్పవృక్షం నుంచి జారినటువంటి పండుని శుకదేవుడు అనుభవించినటువంటి పండుని శుకావధూతే స్వయంగా పరీక్షిత్ మహారాజుకి చెప్పిన కథని ఇవాళ మనం కూడా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య శ్రీ చరణాల చెంత ఉపనిషన్ మూర్తులమై అంటే ఉప అంటే దగ్గరగా నిషత్ అంటే కూర్చొని మూర్తులమై అంటే బొమ్మలమై సగుణంగా స్వభావంగా పరమాత్మని ఉపాసన చేసేటువంటి దివ్య భావన ప్రస్థానంలో ఇవాళ గోవర్ధనోద్ధరణం చాలా ప్రధానమైన ఘట్టం. ఇంద్రుడు యజ్ఞభాగం తీసుకోవటం అలవాటు పడినటువంటి ఇంద్రుడు ఒకరోజున కినుక వహించాడు కోపించాడు. ఎందుకు కోపం కలిగింది అంటే నిన్న జరిగిన కాళీయ మర్దనము ఇంతకు ముందే జరిగిన పూతన వధ శకటాసుర సంహారం అఘాసుర వృత్తాంతం వీటన్నింటితో నంద కులానికి అంటే నంద బృందానికంతా కూడా అర్థమైన ఒక సత్యం ఏమిటంటే ఆరు సంవత్సరాలు నిన్నటి వరకు కాళీయ మర్దనం చేసినప్పుడు ఆయన వయస్సు ఐదేళ్ళు. వేదవ్యాసులవారు నిర్ణయం చేసి చెప్పారు. గోవర్ధనోద్ధరణం ఎత్తినప్పుడు ఆయన వయస్సు ఏడు సంవత్సరాలు మధ్యలో రెండు సంవత్సరాల వయస్సు గడిచిపోయింది అందులో ఒక సంవత్సరం మాయ చేశాడు పరమాత్మ. అన్ని గోప బాలుకులుగా, గోవులుగా నిన్న విచారణ చేశాం. కాబట్టి కాలానికి, దేశానికి అతీతమైనటువంటి పరమాత్మ-- పరమాత్మే మామూలు బాలుడు కాదు అని ఒక భావనలో నిలకడ చెందినటువంటి వేళ ఊళ్లో పెద్దలంతా సత్యసాయి భగవానుడి చిన్ననాట ఊళ్లో ఉన్న పెద్దలంతా ఆయన్ని రోజుల్లోనే సలహాలు అడిగేవారట. పధ్నాలుగు ఏళ్ళు రాకముందే నేనింకా సాయిబాబాను అని ప్రకటించక ముందే స్వామిని దివ్య పురుషుడుగా, దివ్యావతారిగా, దివ్య బాలుడుగా ఊళ్లో సుమారుగా ఎనభై పర్సెంట్ ప్రజలు అంగీకరించారు. ఆయన్ని ప్రత్యేకంగా చూడటం ఆనాడే మొదలైంది. అదే విధానంలో ద్వాపర యుగంలో కూడా శ్రీ కృష్ణ పరమాత్మని భావనతోనే చూశారు. అందువలననే నందాదులంతా కూడా నందుడు ఆదిగా కలిగిన వారంతా తమ ఇంట వెలిగిన దీపం పరమాత్మ దగ్గరికి వెళ్లారు శ్రీ కృష్ణ పరమాత్మ దగ్గరికి. పరమాత్మ లేదా కృష్ణ మన ఊళ్లో పర్వతం ఉంది ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడికి మనం ప్రతి-- ప్రతి సంవత్సరం కూడా కొన్ని పూజలు చేస్తాం. చేసినట్లయితే మంచి వర్షాలు పడతాయి, పశువులకు మేత ఉంటుంది, మనకి సమృద్ధంగా గాదెలు నిండుతాయి. కాబట్టి ఇంద్రాది దేవతలకు ఒక పూజ చేసే అలవాటు మనకున్నది అని అన్నారు. అక్కడ ప్రారంభమవుతుంది శ్రీకృష్ణుడి దివ్యత్వం. ఎంత rational గా గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన సన్నివేశంలో కృష్ణుణ్ణి మించిన హేతువాది మనకు కనిపించడు. అంటే నెమ్మదిగా rituals నుంచి spirituality వైపు నడిపించిన పరమోత్కృష్ట సన్నివేశం. అప్పుడు ఆయన వయస్సు కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే. ఏడు సంవత్సరాల యదునందనుడు, గోపాల బాలుడు, గోప కిశోరం నిన్న అన్నాడిగా యదుసింహం ఒక్కసారిగా వీళ్లంతా వెళ్లి అడిగారు, అడిగితే నందుడు తన తండ్రితో మాట అడిగాడు. కృష్ణుడు ఎలా అడుగుతున్నాడో చూడండి. యగంబు సేయక అర్థించి వచ్చితిరి యాగమున ఫలమేమి కలుగు? యాగం చేస్తే ఫలితం ఏమిటి? ఎవ్వాడు దీనికి ఈశ్వరుండు? అధికారి ఎవ్వడు? సాధనము ఎంతవలయు? శాస్త్రీయమో? జనాచారమో కార్యంబు? ఇదేమన్నా వేదశాస్త్రాలు చెప్తే చేస్తున్నారా లేదు ఆరవాతి ప్రకారం మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం ప్రతి ఏడాది ఒక్కసారన్నా చేసుకోకపోతే తలలు బద్దలవుతాయి అని చెప్పారు గనుక చేసుకుంటున్నామా? జనాచారమా? అంటున్నాడు. వైరులకు-వైరులకు ఎరిగింపవలదు గాని ఎరిగెడి మిత్రులకు ఎరిగింపదగుం చేరి ఎరిగిచేసిన కోర్కులెల్ల కలుగు. పని చేసినా అర్థం ఎరిగి చేయాలి. అర్థం తెలియకుండా చేసే పనైనా జీవితంలో వ్యర్థమే. కాబట్టి మీరంతా మీరు తలపెట్టిన యాగం అంతా అర్థం ఎరిగే చేస్తున్నారా?జనాచారం ప్రకారం చేస్తున్నారా? సాంప్రదాయం ప్రకారం చేస్తున్నారా? కర్మకాండములలోని విహిత కర్మ చేయవలసి వచ్చి చేస్తున్నారా? దీనికి ఈశ్వరుడు ఎవడు? అధికారి ఎవడు? యజ్ఞభోక్త ఎవడు? ఎవరు? అని అడుగుతున్నాడు ఏడేళ్ల వాడు. అడగగలడా? అంటే ప్రశ్నలలోనే ఆయన దివ్యత్వం బయటకు వస్తున్నది. పగయు చెలిమి లేక పరగిన మిము బోటి మంచి వారికేల మంతనంబు. అసలు మీకు శత్రువులు లేరు ఉన్నవాళ్లంతా మిత్రులే. మళ్లీ నన్నడగటం ఎందుకు? మీకు తోచిన పని మీరు చేయొచ్చు కదా. తలపులల్ల మాకు తగ ఎరిగింపవే తాత. తండ్రి, తాత అంటే తండ్రి అని కూడా. తండ్రీ! మీ తలపులు మీ ఆలోచనలన్నీ కాస్త స్పష్టంగా నాకర్థమయ్యే రీతిలో చెప్పినట్లయితే వాక్సుధా ప్రదాతవగుచు వాక్సుధా ప్రదాతవగుచు ఏం చెప్పినా సౌందర్యవంతంగా, అర్థవంతంగా, దానియందు అమృతము నింపినట్టుగా అమృతము లేకుండా, అసత్యం లేకుండా సత్యవాక్కు ఏమిటో చెప్పు తండ్రీ! అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు చేస్తూ వచ్చారో నన్నుడు చెప్తున్నాడు. పర్జన్యుడు, అధికుండు, భగవంతుడు, అమరేంద్రుడు అతనికి ప్రియమూర్తులగుచున్న మేఘ బృందంబులు మేదిని వలయంబుపై అతని పంపున భూత హర్షణముగ జలములు కురియు. ఇంద్రుడికి వెనుక యజ్ఞం చేసినట్లయితే ఆయన స్నేహితుడైన వరుణుడు మేఘాలను సృష్టించి భూతలం మీదికి వర్షాన్ని కురిపిస్తాడు. తజ్జల పూరముల తోగి పండు సస్యములు, దానివలన పంటలు పండుతాయి. పంట తమకు ధర్మార్థ కామ ప్రదాయకంబుగ లోకులల్ల బ్రతుకు దురింత యడిగి మేఘ విభుడైన ఇంద్రుడు మెచ్చు కొరకు ఇంద్ర యాగము సేయుదురు ఎల్లరుపులు. కామ, లోభ, భయ, ద్వేష కలితులగుచు చేయకుండిన అశుభంబు చెందు. పుత్రా! నాయనా! ఇంద్రుడికి పరంగా పేరు మీట్చేసే యజ్ఞం గనుక చేయకపోతే వరుణ దేవుడు వర్షించడు, పంటలు పండవు. పంటలు లేకపోతే ధర్మార్థ కామాలు మూడు ప్రపంచంలో నడవవు. ఇది గనుక అలవాటు ప్రకారంగా వస్తున్న పని చేయకపోయినట్లయితే అంతా వినాశనం జరుగుతుంది. మనకి దక్కవలసినటువంటి లాభం మనకి దక్కదు అని చెప్తూ మఖము సేయ వజ్రి మతి సంతసిoచు. మఖం అంటే యజ్ఞం. చేస్తే ఇంద్రుడికి మనసులో ఒక ఆనందం కలుగుతుంది. వజ్రి సంతసిoప వాన కురియు. వజ్రాయుధం కలిగిన ఇంద్రుడికి సంతోషం కలిగితే ఏమవుతుంది? వాన కురుస్తుంది. వాన కురియ కసవు వసుమతి పెరుగును. కసవు అంటే గడ్డి. వర్షం పడింది అంటే గడ్డి పెరుగుతుంది. పెరిగితే కసవు మేసి దేనుగణము బ్రతుకు. ఆవుల మందలన్నీ గడ్డి తిని బతుకుతాయి నాయనా. యజ్ఞం వల్ల ఫలితం ఇది. యజ్ఞాలు దండగ, యాగాలు దండగ, నీయంతా కాలుస్తున్నారు అన్న వాడికి సమాధానం ఇది. స్వామి ఎన్నో సార్లు సమాధానం ఇచ్చారు. ప్రతి సారి యజ్ఞం చేసినప్పుడల్లా ఇదే మాట చెప్తూ వచ్చారు. సుమారు యాభై ఏళ్ళు చెప్పారు. దేనువులు బ్రతికెనేని మానదు ఘనమైన పాడి మందల కలుగున్. మానుగను పాడి గలిగిన మానవులు సురలు తనిసి మనుదురు పుత్రా! ఆవులుంటే, ఆవుల పాలుంటే, పాలు మన పాలైతే, మన పాలైన మనందరం కూడా ఆనందంగా ఉండగలుగుతాం కదా. అని చెప్పగానే శ్రీకృష్ణుడి యొక్క జ్ఞానబోధ తోటి ఆత్మ విచార మార్గం లేకుండా పురాణ శ్రవణం కేవల కాలక్షేపమే. భాగవతంలో కేవలం కథ లేదు. ఆత్మ విద్య విలాసం ఉన్నది. ఏడేళ్ల పిల్లవాడు తన తండ్రికి చెప్తున్నాడు. యాగ-యాగం చేద్దాం అంటే ఇమీడియట్ గా చేసేద్దాం పది మంది మన ఇంటికి వస్తారు అనుకుంటారు. కృష్ణుడు అడుగుతున్నాడు. కర్మమున పుట్టు జంతువు కర్మమునన్ వృద్ధి పొందు కర్మమునంచడున్. కర్మము వల్ల జన్మ వస్తుంది. జన్మము వల్ల వృద్ధి పొందుతాడు. వృద్ధి పొందటం అంటే రెండు అర్థాలున్నాయి. నశించటం కూడా వృద్ధి పొందటమే. పెరగటము వృద్ధి పొందటమే. ఏది పుట్టిందో అది పెరగాలి. ఏది పెరుగుతుందో అది ఒకనాడు వరగాలి. ఇది జీవన సత్యం. కర్మమే జనులకు దేవత కర్మమే సుఖదుఃఖములకున్ కారణమధిపా. దేవుడు ఎక్కడున్నాడయ్యా కర్మలే దేవుళ్ళు అంటున్నాడు కృష్ణుడు. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అన్నారు భగవాన్ రమణ మహర్షి. కర్మలన్నీ ఏమన్నా దేవతా స్వరూపాలా? అంటూ కర్మలు దేవతా స్వరూపాలే, చేస్తున్న వాళ్ళు మాత్రం కాదు. అదే శ్రీకృష్ణుడు అంటున్నాడు. కర్మలకు తగు ఫలములు కర్మలకు విడంగ రాజుగాని సదా నిష్కర్ముడగు ఈశ్వరుండు కర్మ విహీనునికి రాజు గాడు మహాత్మ. మనం గనక ఇవన్నీ చేస్తూ ఉన్నట్లయితే కర్మలు చేస్తూ మనం చేయవలసిన పనులు చేస్తే అవే దేవతా కార్యాలు కావా? స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వధర్మాన్ని మనం గనక వదిలిపెట్టినట్లయితే, ఏమిటి స్వధర్మం? గృహస్తుకి సంసార నిర్వహణ స్వధర్మం. సన్యాసికి జ్ఞానబోధ స్వధర్మం. జ్ఞానికి ఆత్మానంద బ్రహ్మానంద స్థితిలో నిలకడ చెందటం స్వధర్మం. ఆత్మవిద్యా వేదికి తాను అన్యం కాదని తాను ఆత్మను అన్న ఒకే ఒక్క స్పృహలో నిలకడ చెంది ఉండటం అది అత్యుత్తమమైనటువంటి స్థాయి. ఇది కదా పొందవలసినది అంటూ...కోపింపన్ పని లేదు శత్రునికి మీరెందుకు వాడికేదో కోపం వస్తుందని యాగ-యాగం ఎందుకు చేస్తారు? చేద్దాం యాగం చేద్దాం కానీ వాడికి కోపం వస్తుందని చేయకండి. వాడికి కోపం రావటం ఏమిటి? వాడిని శాంతింప చేయటం ఏమిటి? వాడు శాంతిస్తే వర్ణుడు బయలుదేరి రావడం ఏమిటి? మేఘాలు పుట్టటం ఏమిటి? ఈయన, ఈయన కాకపోతే భగవద్గీత ఎవడు చెప్పగలడు. ఇక్కడే మొదలు పెట్టాడు ఆయన. కోపింపన్ పని లేదు శత్రునికి తా కోపించు కాకేమి సంక్షేపం బయ్యెడిదేమి. వాడికి కోపం వస్తే మనకేంటి నష్టం? పట్టడముల్ దేహముల్ దేశముల్ వ్యాపారంబులు మీకు పోయెడివే. వాడికి గనక శాంతి కలగకపోతే మీ వ్యాపారాలు, మీ ఇల్లు వినిపోతాయా? శైలారణ్య భాగంబులన్ గోపత్వంబున ఉండుచున్ మనకు సంకోచింపగా ఎటికిన్. ఉన్నవన్నీ సర్వ ప్రకృతి పరమేశ్వర స్వరూపం అయినప్పుడు దీనికి అతీతమైన ఇంకేదైనా ఉన్నదని భావించే కంటే ఉన్నదానినే పూజించుకుంటే మంచిది కదా అన్నాడు. పశులకు కొండకు బ్రహ్మణోత్తములకు మఖము కావించుట మంచి బుద్ధి. మార్గోపదేశనం చేస్తున్నాడు అవతార పరమాత్మ. ఏం చేస్తున్నాడు? ఇంతవరకు వాళ్ళు చేస్తున్న కర్మలకు భిన్నమైన కార్యకలాపం చేస్తున్నాడు. ఇంద్రయాగంబుకు ఏమేమి తెప్పింతురు అవి యెల్ల తెప్పింతుడు అరసి మీరు. మీ దగ్గర లిస్టు ఉంది కదా, అన్ని పట్టుకోండి. యాగం చేయాలో నేను చెప్తా. పాయసంబులు, ఇక్కడ స్వామి గుర్తు రాకుండా ఉండారు. పుట్టపర్తిలో గాని మన శివంలో గాని శివంలో వచ్చిన నాళ్ళు వంట చేసే ప్రదేశానికి స్వామి వెళ్ళకుండా ఎప్పుడూ ఉపన్యాసం ఇవ్వలా. ఇదే ముత్తలకు పెట్టేది. ఇట్లాగే చేసేది. ఏమో పా రెండు కూరలు పెట్టలేమా? అది ఇవ్వలేమా? ఇది ఇవ్వలే-- ఇవ్వటమే స్వామికి ఆనందం. ఆయనకి పుచ్చుకునే అలవాటు లేదు అసలు, అవసరమూ లేదు. స్వామే declare చేశారు. ఆయన a giver never a taker. కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు చూడండి. పాయసంబులు అపూపములు సైదపు పిండివంటలు పప్పు మువ్వలయు నట్టి ఫలశాఖములు వండపంపుడు హోమంబు సేయుడు దేను దక్షిణలిచ్చి బహురసాన్నంబు పెట్టుడు బ్రాహ్మణులకు అచలులై పూజల నరంపుడు అచలమునకు. దానికి దీనికి ఇంద్రుడు ఎవడు? మన-మన వాకిట్లో కొండ కనబడుతుందే, అచల బోధాకృతే సత్యసాయి భగవానుడు. పూర్ణాద్వైత బోధాకృతే సత్యసాయి భగవానుడు. అచల బోధ అంటే దేనికి అదరక బెదరక చెదరక కదలక నిలిచేటువంటి మనస్సుని ఎవరు పొందగలరో పొందటానికి మార్గోపదేశం ఏమిటో బోధించేవాడే అచలుడు. చలించకూడదు, కదలకూడదు, బెదరకూడదు అదే చెప్తున్నాడు. అచలానికి చేయండి అన్నాడు. మన ఊర్లో కొండ ఉంది దానికి చేయండి. అధమ చండాల శునక సంహతికి తగిన భక్షముల నిండు కసవులు పసుల కిండు. మన దగ్గర ఉన్న గడ్డి ఏదో అయిపోతుందని ఉన్నదంతా పశువులకివ్వండి వేళ. అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. స్వామి చమత్కరిస్తూ ఒకాయన దర్శనానికి వచ్చి వరండాలో కూర్చొని తలుపు తీసుకొని వచ్చినప్పటి నుంచి అందరికీ దర్శనం ఇచ్చి మళ్ళీ వచ్చేదాకా నోరాడిస్తూనే ఉన్నాడు. నా-- నోరాడిస్తున్నది ఈయన గమనించారు, ఈయనకు అంట పడ్డది. హతాశుడైపోయిన స్వామి వచ్చారు. "ఏం తింటున్నావ్?" అన్నారు. "ఆ ఏం లే స్వామి" "ఏం తింటున్నావ్ ఇందాకటి నుంచి? నేను అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను, వచ్చాను. తిరిగి వచ్చేదాకా తింటూనే ఉన్నావే." అంటూ, "అవునులే ప్రపంచంలో మూడు ఉన్నాయి ఎప్పుడూ తడుపుతుండాలి వాటిని" అన్నారు. ఒకటి తమలపాకు బుట్ట. వాడు వ్యాపారి దగ్గర వాడు ఎప్పుడూ దాన్ని త-తడుపుతూ ఉంటాడు. పొగాకు కట్ట రెండోది. బ్రాహ్మణుడి పొట్ట అన్నారు. [నవ్వు] అది. మూడు అద్భుతం చమత్-- పరమేశ్వరుడి యొక్క దివ్యలీలలో చమత్కారం ఒక భాగం. స్వామి ఎక్కడ పొగాకు కట్టలు ఎప్పుడు చూశారు? మనకు అనిపిస్తుంది. పొగాకు కట్టలు అంటే బజారు వెళ్ళి ఉండాలిగా. వెళ్లారా? వెళ్ళలేదు. మరి పొగాకు కట్ట ఎక్కడ దొరికింది ఈయనకి అని. పొగాకు కట్ట, తమలపాకు తట్ట, బ్రాహ్మణుడి పొట్ట ఎప్పుడూ తడుపుతూనే ఉండాలి అదే చెబుతున్నాడు. బ్రాహ్మణులకి హాయిగా అన్నం పెట్టండి అన్నాడు. అధమ చండాల శునక సంహతికి తగిన భక్షములు తెండు. ఏ-ఏ జాతివారు ఏమి తింటారో అవన్నీ వాళ్ళకి పెట్టండి. శునకాదులు ప-- శునకం, శునకం కుక్క. దానికి కూడా పెట్టండి అన్నాడు. ఎందుకో తెలుసా? షిరిడి బాబా కానీ సత్యసాయి భగవానుడు కానీ కుక్కని ఎందుకు-- కుక్కను ప్రేమించేవాళ్ళు భగవంతుణ్ణి ప్రేమించే వాళ్ళ కిందే లెక్క. A love for a dog is a love for god. ఎందుకనంటే ప్రపంచంలో ఒక మనిషి ఇంకొక మనిషిని నమ్మి పక్కన పడుకోలేడు. కానీ కుక్క మనం పెట్టిన ముద్ద, ఒక్క పిడికెడు అన్నానికి జీవితాంతం తన ప్రాణం ఎదురిచ్చి యాజక నిలబడుతుంది. అందుకే ఇక్కడ గోవులకివ్వాల, మిగతా ఇవి కానీ మిగతా పశువులన్నింటికీ కూడా కసవులు నిండు అన్నాడు. ఉన్నదంతా ఇవ్వండి. గంధాలంకరణాంబరావళులచే కైసేసి ఇష్టాన్నముల్ బంధుశ్రేణియు మీరలం కుడిచి నాభశారతిన్ వేడుకల్ సందిల్లన్ గిరిగోత్విజానల నమస్కారంబు కావింపుడో జన్ ధర్మంబని తోచనేని జనకా జన్మంబు ధన్యంబగున్. మన వాకిట్లో ఉన్న వర్ధన పర్వతాన్ని గోవర్ధన పర్వతం తర్వాత దాని పేరు వచ్చింది. కొండకి నమస్కారం చేయండి. చేసుకొని నా మాటలన్నీ గుర్తుపెట్టుకొని వాటికి నమస్కారం చేసి మీ యజ్ఞం ప్రారంభించండి. ఇదొక విచిత్ర యజ్ఞంగా భావన చేస్తున్నారు నంద-- నందాదులు ఎంతా కూడా అనిఆయన చెప్పినట్టుగా ఇచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు "సకలాభీ--సకలాభీరులు వీడే కృష్ణుడన నైజంబైన రూపంబుతో అకలంకస్థితిన్డి శైలమిదే మీరు అర్చింపన్ రెండంచు తానొక శిలాకృతి దాల్చి గోపకులతో వన్డుండ పూజించి గోపక దత్తాన్నములు ఆహరించే విభుడు ప్రత్యక్ష శైలాకృతిన్" పద్యం చెప్తారు భాగవతంలో విచిత్రం ఏమిటంటే మనకున్నటువంటి కొండకి నమస్కారం చేయమన్న శ్రీకృష్ణ పరమాత్మ ఇదిగో నేనే మీకు బంగారు కొండని నన్ను పూజించుకోండి అని ఒక కొండ వలె కనిపించాడట శ్రీకృష్ణ పరమాత్మ. వచ్చి ఇక్కడికి మీరందరూ నాకు పూజలు చేసుకోండి అన్నాడు శ్రీకృష్ణ అవతారంలో నాకు చేసేవన్నీ చేసేవి మాత్రమే భగవంతుడికి చెందుతాయి నేనే భగవంతుడిని అని చెప్పిన అవతారం కృష్ణుడు నేను భగవంతుడిని కాదు అని చెప్పిన అవతారం రామావతారం. two aspects ని మనం గమనించినట్లయితే "వినుడి శైలము కామరూపి ఖలులన్ వేధించు ఆజ్ఞానముల్ మన ముప్పించిన ఆహరించే మనలన్ మన్నించే చిత్తంబులో అనుకంపాతిశయంబు సేసే మనపై నల్చున్ సగోపాలుడై వనజాజాక్షుడు నమస్కరించె గిరికిన్ వందారు మందారుడై" అది వందారు జనమందారం ఇక్కడ ఉందన్నమాట మనకు తెలియదు. వందారు జనమందారం ఇక్కడ ఇరుక్కుంది వేదవ్యాసులవారు వాడారు మాట అది. సరే ఇహ గోపకులు హరి సమేతులై అంటే కృష్ణుడితో కూడి ఆయన పూజోపహారాలన్నీ ఇచ్చారు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ప్రదక్షిణ చేశారు మాధవ సమేతులై మందకుంసనిడి అంత మహేంద్రుడు వాళ్ళకి తెలిసింది. ఏమిటి ఈరోజు ప్రతి ఏడాది యజ్ఞం చేసేవాడు ఈసారి చేయలేదు మన యజ్ఞభాగం మనకు రాలేదేమిటి ఇంద్రుడి పని అదే ఎప్పుడూ వాడు revenue లో ఉంటాడు మన--మన కోశాగారానికి రాలేదేమిటి? రెండు ఉంటాయి మనం ఎప్పుడూ వాడికి ఇస్తుండాలి అంటే వాడు భోగ గురు లోకగురువు వాడు శోక గురువు. రెండు మనం ఎప్పుడూ ఇస్తుండాలి వాడు ఎప్పుడూ ఎవరికీ ఇవ్వడు ఇది రెండు. మూడవది ఎప్పుడూ వాడికి ఏది చెందాలో సమయానికి అందిస్తూ ఉండాలి. ఇది అందలేదు కాబట్టి వాడికి మేఘాలన్నింటి దగ్గరికి వెళ్లి పిలిచి, ఏమంటున్నాడో చూడండి కృష్ణ పరమాత్మని "పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువినాభీరుల్ మదాభీరులహి గిరిసంఘాత కఠోర పత్రదళన క్రీడాసమారంభ దుర్భర దంభోలిధరున్ పురందరు ననున్ పాటించి పూజింపక అగ్గిరికిన్ పూజలు చేసి పోయిరిదపో కృష్ణుండు ప్రేరింపగన్" పాపం వాళ్ళ మాయకుడే కృష్ణుడే చెడ్డవాడు. కృష్ణుడు ఈవేళ ఒక కొత్త మాట చెప్పాడు నాకు వీళ్ళు పూజ చేయలేదు యాగం చేయలేదు యజ్ఞం చేయలేదు అన్నీ నా కొండకి చేశారే అని అనుకుంటూ. "జంభవై ఇది సంరంభంబున ఎడతెగక వీరధారంబులన్ కురియుచు" వీళ్ళు వర్షం కావాలని కదా చేశారు వర్షం రా-- కురవటం వేరు వరద రావటం వేరు కదా. గాలి వీచటం వేరు పెనుగాలులు వీచటం వేరు. ప్రళయం రావటం వేరు వెలుగు రావటం వేరు పిడుగులు మీద పడటం వేరు. ఇంద్రుడికి కోపం వచ్చింది వాడి చేతిలో కొన్ని powers ఉన్నాయి జలధారలు కురవమన్నాడు మేఘాలని విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి వర్షం కురుస్తూ ఉన్నది. అప్పుడు గోపవృద్ధులంతా దుర్జన శిక్షకుండు సజ్జన రక్షకుండునైన పుండరీకాక్షునకు శ్రీకృష్ణ పరమాత్మ ఏడేళ్ళ వాడు వాడికి నమస్కరించారు అందరూ తొంభై ఏళ్ళ వాడు కూడా నమస్కారం చేసి ఇదేమిటి మేము చెప్పలేదా మొదటినాడే మామూలుగా ఇంద్ర పూజ గనక చేసి ఉంటే గందరగోళం అయ్యేది కాదు నువ్వు వద్దన్నావు కొత్తగా ఏదో సనూతనమైన భావం చెప్పావు అది మానేసి ఇది చేశావు దీని ప్రతాపం ఇట్లా ఉన్నదని "అకట వానతోగి వ్రజము ఆకులమయ్యె గదయ్యే కృష్ణా! నీవెక్కడ ఉంటివి? ఇంత తడవేల సహించితి? పదాబ్జముల్ దిక్కుగనున్న గోపకులు దీనతనొంద భయాపహారివై తక్కున గావక ఇట్లు నికి కారుణికోత్తమ! నీకు పాడియే" ఇవాళ మనం మనం కూడా అంతే స్వామి! నీకు పాడియేనా నీకు ధర్మమేనా ఇన్నేళ్ళు ఇన్ని రోజులు నువ్వు కనపడ్డావో కనపడలేదో కాదు అసలు ఇది ఏమిటి గందరగోళం ఇది నీకు ధర్మమేనా నువ్వు ఎక్కడ దాక్కున్నావు నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎలా ఉన్నావు మన మన హృదయాలన్నీ పరితప్తమై పోతున్నటువంటి వేళ అక్కడే పెద్దవాళ్ళంతా అంటున్నారు గోపబాలురందరికీ కూడా నువ్వున్నావు ఇంతమందిని ఎన్నిసార్లు రక్షించావని తెలిసి కూడా ఇవాళ నువ్వెక్కడున్నావు వర్షం పడుతున్నది మునిగి పోతున్నది ఇదంతా కొట్టుకుపోయేట్లుంది. "ఈ ఉరుములు మెరుపులు యశనుల ఘోషలు జలధారల్ నీ యాల తొల్లి ఎరుగము" ఇంత ప్రళయం మాత్రమే ఇంతకుముందు ఎరగము. "కుయ్యాలింపగదయ్య గుణరత్ననిధీ" మా ఆవేదన ఏమిటో కాసేపు వినవయ్యా కుయ్యాలింపమంటున్నాడు. "వారి బరువయ్య మందల వారికి ఇదే పరులు లేరు వారింపంగా వారిద పడగ భయంబును వారిరుహ దళాక్ష నేడు వారింపగదే" ఇది జరుగుతున్నదాన్ని ఒక్కసారి ఆపవయ్యా అన్నీ నీ చేతుల్లో ఉన్నాయి అని అంటే సర్వజ్ఞుడైన కృష్ణుడు అంతయు ఎరింగి నిన్నెందుకని ఆయన విశ్వవిదుడు నిత్య నర్తకుడు ఆయన గురించి వేదవ్యాసులవారు పూతనామాచ్చుడు వాడైన గుణగణాలు చూడండి. నిత్య నర్తకుడు ఆయన ఏదో కాళీయ పడగల మీద మాత్రమే నాట్యం చేసినవాడు కాదు కాలం అనేటువంటి దానిమీద నిత్య నర్తనం చేస్తాడు. మూడు కాలాలలో మూడు అవస్థలలో మూడు శరీరాలలో అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలలో మహాకారణ శరీరంలో కూడా ఆయనే సంచారం చేస్తాడు ఎరిగాడు. ఏమడిగాడు? ఇది ఇంద్రుడు చేసినటువంటి కపటోపాయమని ఎరిగాడు. "తన్నొక ఇంత గైకొనరు తప్పిరి ఆరవు జేసి రంచుతా మినున నుండి గోపకులమీద శిలల్ కులియించుచున్నవాడు ఉన్నత నిర్జరేంద్ర విభవోద్ధత గర్వల గాధిరూఢుడై కన్నుల గానక ఇంద్రుడిటు గర్వపరుండు వరు కాణ నేర్చునే" గర్వాతిశయంతో ఉన్నటువంటి ఇంద్రుడు తప్ప వీడు మరొకడు ఇంత పని చేయలేడు.
SSSMC · audio

Bhagawata Navaneetham - 66

Home

Bhagawata Navaneetham - 66

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 25:27

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

    Now playing
  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67