No transcript for this section.
హరి పాదంబులు సోకడి సిరికతమున అఖిలభువన సేవ్యత్వంబుతో స్థిరనైతి ఇన్ని దినములు హరి నా గర్వంబు మాంచి అరిగె మహాత్మ ఇంతకాలం నేను స్థిమితంగా ఉన్నాను స్థిరంగా ఉన్నాను అని కాస్త అహంకరించా భుదేవి చెప్తున్నది. ఈ స్థిమితంగా ఉండటానికి ఆయన దివ్య పాదస్పర్శే తప్ప నా శక్తి కాదని తేలింది. నాకు ఏర్పడిన కించిత్ గర్వాన్ని కూడా దూరం చేసి పరమాత్మ వైదొలగి వెళ్లిపోయినాడా శ్రీ కృష్ణ పరమాత్మ. ఆ మధురోక్తులు ఇది ఖచ్చితంగా ఆనాటి పుటపట్టికి సంబంధించిన పద్యంగా అనిపిస్తుంది చదువుతూ ఉంటే. ఆ మధురోక్తులు ఆ నయనములు ఆ దరహాసములు ఆ దయారసంబు ఆ మురిపింపులు ఆ తడవులు ఆగమన క్రియలు మనోహర ప్రేమాకరావలోకనము ప్రీతి కనుంగనగలేని మాధవున్ కామినులేల నిర్దళిత కర్ణులు యోగులు పాయ నేర్తురే. తపస్సు లేనటువంటి వారు అధ్యయనం లేనటువంటి వారు ఆ మధురోక్తులు మళ్ళీ వినగలరా? చతురోక్తులు వినగలరా? ఆ రకమైనటువంటి ఆనందాన్ని మళ్ళీ మనం పొందగలవా? అని మెల్లన నాపై యాదవ వల్లభుడడుగిడగ ఆ ఆయన ఈ మెల్లని నడక అవతార పురుషుడు యొక్క లక్షణం. ఆ అవతార తత్వానికి చేరని వాడు గబగబా నడుస్తుంటాడు హడావుడి పడుతుంటాడు. పరమాత్మ నెమ్మదిగా ఉంటాడు హాయిగా ఉంటాడు ఆయన. ఎందుకు? అదే చెప్తున్నది ఇక్కడ. మెల్లన నాపై యాదవ వల్లభుడడుగిడగ ఏమైంది? ఆయన నడుస్తుంటే అట మోహవేశనై మోహం ఏర్పడింది. నేరంజిల్లగ రోమాంచనుక్రియ ఒంటిమీద ఉన్నటువంటి ఆ రోమాలన్నీ కూడా నిక్కబొడుచుకున్నాయి ఆ పరమాత్మ యొక్క పాద సంస్పర్శ చేత. ముల్లములై ములచు శస్యములు మార్గమునన్ నేను బాగా పండాను నేను బాగా శస్యాలు ఇచ్చాను ధాన్యం పండింది పూలు పూచినయి కాయలు కాచినయి అంటే ఆ పరమాత్మ యొక్క దివ్య పాద సంస్పర్శన చేత నా హృదయం రాగరంజితమైంది. పులకలు మొలకలై తేలినయి ఆ మొలకలన్నీ మొలకెత్తినయి ఆ మొలకెత్తి సమృద్ధమైనటువంటి ఒక సంపదగా ఎత్తబడింది. అని చెప్పుకుంటూ ఉంటే కలిపురుషుడు అక్కడే ఉన్నాడు. ధర్మదేవత ఈ పాత్రలు చూడండి ఒకటి ధర్మదేవత, భూదేవత భూదేవి అమ్మవారు. పరీక్షిత్ మహారాజు అనుభవించటానికి చూట్టానికి ధర్మం పాలించిన రాజు. మూడు. ఈ ముగ్గురినీ యాతన పెట్టడానికి ఒక్క కలిపురుషుడు. వాడు ఉన్నాడు అక్కడ. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజ ముంగాల క్రోధుడు దండహస్తుడు రూపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు జంఘాలుడు అంటే మహావేగంతో పరిగెత్తేవాడు. వాడు నడకే పరిగెత్తిన వాడు జంఘాలుడు అంటారు. అందుకనే జంఘాల శాస్త్రి క్ష్మాలోక యాత్ర అని ఒక పుస్తకం ఉంది చిన్నప్పుడు చదివాం. ఆ జంఘాల శాస్త్రి అంటే ఆకాశంలో మేఘాలు ఎలా పరిగెత్తుతాయో మన మనస్సు ఎలా పరిగెత్తుతుందో వాడు క్ష్మాలోక యాత్ర. వాడు భూలోకానికి వచ్చాడట. ఏమైంది కథ? అది. జంఘాల జంఘాలుండొక్కడు శూద్రుడు ఆ సురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకూనగతన్నే పంచితిలకా నిర్ఘాత పాదాహతిన్ ఆ ధర్మదేవత అసలే కుంటిది ఒక్క పాదం మీద ఏడుస్తూ ఆ ఎద్దు రూపంలో ఉంటే కలిపురుషుడు వచ్చి కాళ్ళతో దాన్ని తన్నాడు. తన్నగానే పప్పు నేలమీద పడిపోయింది. ఆ పడినప్పుడు చూశాడు ఈయన. చూడగానే రాజముద్ర లక్షణాలు ఉన్నటువంటి వాడుగా వీడు కనిపిస్తున్నాడు. కానీ వీడు ఎందుకని ఆ ఎద్దును ఎందుకు తన్నుతున్నాడు ఈయనకు అర్థం కాలా పరీక్షిత్ మహారాజుకి. నిన్నన్ కొమ్ముల చిమ్మెనో ఎందుకురా కొట్టావ్? నిన్నేమన్నా కుమ్మిందా కొమ్ములతో? కదీసెనో నీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా? నిర్భీతి వై గోవులన్ తన్నన్ కారణమేమి మద్భుత భుజ సనాధ క్షోణిని ఏవేళలందున్నెరముల్ సేరాదు ఎరుగవా దుర్తత్త్వమున్ భూమి భృత్ సన్నాహము వణచ్చెదవు వడవునిన్ శాసించెదన్ దుర్మతి. నీకు తెలియదా? ఈ రాజ్యాన్ని పరీక్షిత్ మహారాజు పాలిస్తున్నాడని ఇక్కడ ధర్మం నాలుగు పాదాలా నడవాలని నడిపించేటువంటి ప్రయత్నం చేసే రాజకుడున్నాడని ఎరుగవా? ఇటువంటి మూగజీవుల మీద నీ దాష్టీకం ఏమిటి? నువ్వు గనక ఈ అలవాటు మానుకోకపోయినట్లయితే బాణాహుతితో నిన్ను సంహారం చేస్తాను అన్నాడు. బాణం వేసి నిన్ను చంపుతాను అన్నాడు. గాండీవియు ఈ పరీక్షిత్ మహారాజు ఎవడో అనుకోకు. గాండీవియు చక్రియు భూమండలి విడవాసి చ మిన మదమత్తుడవై దండింప తగనివారల దండించెద నీవ తగుదు దండమనం. అర్జునుడు కృష్ణుడు లేరు వాళ్ళిద్దరూ కృష్ణార్జునులు వెళ్ళిపోయారు అవతారం చాలించి మనం ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నావా? ఇంకా మేము ఉన్నాం అన్నాడు పరీక్షిత్ మహారాజు. అర్జునుడిని అప్పుడే యుద్ధం అయింది గనక అర్జునుడు అంటే చెడ్డ పనులు చేసే వాళ్ళందరి పట్ల ఆయన అరివీర భయంకరుడు. ఆయన చేత ఎవరిమీద ఎప్పుడు ఏ బాణం వేయించాలో ఆయన చేయటానికి కృష్ణుడు ఎట్లాగూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ లేరని మాత్రం అనుకోక అంటూ...జాలిపడనేల నా శరజాలముల పాలుబోసి చంపెదవీ నిన్ భూలోకంబున ఇప్పుడే నాలుగు పాదముల నిన్ను నడిపించెదన్ సుమీ" ధర్మదేవతకి రాజుగా ఒక అభయం ఇచ్చాడు. రాజు ఐశ్వర్యం ఇవ్వక్కర్లా, రాజు మన కష్టాలు తీర్చక్కర్లా. మన కష్టం వినాలి. విని నేనున్నాను అని ఒక అభయం ఇవ్వాలి. స్వామి చేసింది ఏమిటి? Why fear when I am here అది అభయం. ఈ Why fear when I am here అందరిలోని నాని నాని బాగా ఎక్కువైపోయిందని ఒకాయన ఇట్లాగే రాసుకొని వెళ్ళాడు. Why fear when I am here అని స్వామి రాశారు, దాని కింద మీరు సంతకం పెట్టండి అని అడిగాడు. అడిగితే స్వామి చాలా ఆయన విజయం చెరుడి వన్నెలాడు ఆయన. ఈ చూసి చూసి Why fear when I am here అన్నది చాలా పాత మాటే Why fear when I am near అన్నారు స్వామి అది. ఆ హెచ్చు పెట్టేశారు near రాసేశారు అది. అలాగే ఈయన కూడా ఒక అభయం ఇచ్చాడు. ఎలా గాని గోరూప అయినటువంటి భూదేవితో ఇంకో మాటన్నాడు. అగణిత వైభవుండగు మురాంతకుడక్కడ పోయెనల్చు ఎవ్వగల కృశించి నేత్రముల వారి కణంబులు తేకుమమ్మా ఏడవద్దుమ్మా అన్నాడు. అందుకనే ఎంత దుఃఖం రానివ్వండి కన్నీరు కార్చకూడదు. సైకాలజిస్ట్ అంటాడు కన్నీరు కార్చనివ్వండి హాయిగా దుఃఖం తీరుతుందంట. వాడిదేం పోయింది? విశ్వనాథం వారు ఉన్నట్టు, ఆయన ఆసుపత్రిలో పడుకున్నారట. పడుకుంటే ఆ చివరి దశ ఆయనకి. డాక్టర్లు వస్తున్నారు, పోతున్నారు, మందులు ఇస్తున్నారు. ఇలాగే మన బోటి వాడు కూడా ఒకడు వెళ్ళి ఆ మహాకవిని ఆయన్ని దర్శనం చేసుకుందామని వెళ్ళి, ఏం భయం లేదంటున్నారు మీరేం భయపడకండి అన్నాడట. ఆ ఏమన్నావ్ అన్నాడట. ఏం భయపడద్దు అంటున్నారండి. ఎవరన్నారు అన్నాడట. డాక్టర్ అంటున్నారండి ఇప్పుడే. వాడిదేం పోయిందే ప్రాణం నాది, వాడు అదే చెబుతాడన్నట్ట. భయపడద్దేంటి నా ప్రాణం పోతుంటే, పడద్దు పడద్దు అంట ఉంటుందా? పోతే పోయింది నువ్వెందుకు వచ్చావ్ అన్నాడట. మిమ్మల్ని దర్శనం చేయిందిగా ఇది చాలు అన్నాడు. [నవ్వు] ఇది వెళ్ళిపో అన్నాడు. అట్లా ఉంటాయి ఇవి. కాబట్టి ఏడవకూడదు. లోకడడకుమమ్మ మద్విశిఖ బృందములన్ వృషలున్ వధించు నా మగటిమి చుడగొమ్మ వెరమానవగగమ్మ శుభప్రదాయిని. అందుకే గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తః సుఖినో భవంతు. ఇక్కడ గో అంటే గోవు. రెండో అర్థం అసలర్థం ఏంటంటే ఆవు అని కాదు జ్ఞానము అని అర్థం. బ్రాహ్మణుడు అంటే కులం చేత బ్రాహ్మణుడు కాదు. ఎవరు నిరంతరము బ్రహ్మము నందు తమ హృదయాన్ని స్థిమితం చేసుకొని బ్రహ్మణ్య భూతుడై చలిస్తూ ఉంటాడో వాడు బ్రాహ్మణ్యుడు-- బ్రాహ్మణుడు అవుతాడు. కాబట్టి గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం జ్ఞానము ఉండాలి, జ్ఞానమును ఆధారం చేసుకుని జీవించే బ్రాహ్మణుడు ఉండాలి. అంతేగాని వృత్తిని ఆధారం చేసుకునే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు. అది. కాబట్టి చూడమ్మా నేను నిన్ను కాపాడుకుంటాను అన్నాడు. ధర్మమూర్తివై ధర్మజ్ఞ వృషరూప పరమధర్మమీవు పలుకుత్రోవ పాపకర్మ చేయు పాపంబు సూచింప పాపకర్ముడేగు పదము వచ్చు. అప్పుడు పరీక్షిత్ మహారాజుకి అర్థమైంది. భూదేవి, గోవు, వీళ్ళందరూ ఎవరి వలననో యాతన పడుతున్నారు. వీడు కలిపురుషుడు. మా తాతలు, ముత్తాతలంతా కూడా చెప్పి వెళ్లారు. ప్ర-ప్రధానంగా ధర్మరాజు కలి ప్రవేశం జరిగింది జాగ్రత్త అని ఉపాయం అని చెప్పి వెళ్ళాడు. గనుక కలిపురుషుడే వచ్చాడు, తెలుస్తున్నాయి అనుకున్నాడు. అనుకొని ఎప్పుడైతే బలాహూతితో నిన్ను చంపుతానని అన్నాడో కలి ఒడికిపోయినాడు. ఒడికిపోయి కలి పరీక్షిత్ మహారాజు దగ్గరకు వచ్చి కంపించ దేహమెల్ల చంపకుమో రాజతిలకా శరణాగతు రక్షింపుమని తనకు మొక్కిన చంపక కలిరాజు చూచి, నన్ను చంపద్దు, నన్ను కాపాడు, శరణాగతి పొందుతున్నాను శరణు శరణు అన్నాడు కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుకి. అప్పుడన్నాడీయన అర్జున కీర్తి సమేతుండు అర్జున పౌత్రుండు భయరసావృతజనులన్ మెజ్జుతుల చంపనొల్లడు దుర్జన భావంబు విడిచి తొలగుదురాత్మా. అర్జునుడి మనవడిగా ఉన్నటువంటి నేను శరణాగతి చెందిన వాడిని మేము రక్షిస్తాం తప్ప శిక్షించం. కానీ నువ్విక్కడి నుంచి వైదొలుగు అన్నాడు. అంటే ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నాడు. కలిపురుషుడు వాడి ప్రదేశమే ఇది, వాడు ఉండవలసిన యుగమే ఇది. వాడిని నువ్వెళ్ళిపో అంటే దొంగ మన వాకిట్లోకి వచ్చాడనుకోండి, ఏమనుకోకు దొంగతనం చేయకు అలా చేస్తే పాపం నువ్వెళ్ళిపో అంటే వాడు వెళ్తాడా? వెళ్ళడు కదా. అలాగే పరీక్షిత్ మహారాజు వైదొలుగు వైదొలుగు అన్నాడు. వాడికి ప్రాణభయం చేత కలి ఏమడిగాడో తెలుసునా? వెళ్ళమంటున్నావు గానీ తప్పకుండా వెళ్తా. కానీ నేను కూడా ఉండే చోటేదన్నా చూపించు. ఎక్కడన్నా ఉండాలిగా. ఇక్కడి నుంచి వెళ్తా. ఎక్కడ ఉండాలో నువ్వు నాలుగు ప్రదేశాలు, ఐదు ప్రదేశాలు చెప్తే నేను అక్కడికి పోయి ఉంటానన్నాడు. అద్భుతమైనటువంటి విచారణ ఇది. అనగానే పరీక్షిత్ మహారాజు చెప్పాడు. ప్రాణివధ స్త్రీ జూత పానంబు అనడు నాలుగు స్థానములిచ్చి నీవుండుమనియే. ఈ నాలుగింటి చోట్ల ఉండరా అన్నాడు. అంటే ఉండకూడనివి ఏంటంటే ప్రాణిని వధించకూడదు. అది number one. రెండవది స్త్రీలౌల్యం ఉండకూడదు. ధర్మబద్ధమైన సంసారం చేయాలి జీవుడు. అందుకే సంసారం ఏర్పడింది. ఇక రెండవది జూదం ఆడకూడదు. మూడవది. నాలుగవది సురాపానం చేయకూడదు. ఈ నాలుగింట్లలో స్వామి ఈ నాలుగూ చెప్పారు. నాలుగులో ప్రధానంగామద్య మాంసాలు వదిలిపెట్టమని అరవయ్యవ బర్త్ డే నాడు అరవయ్యవ బర్త్ డే లో ఆయన చాలా చెప్పారు. వెస్ట్రన్స్ అంతా కూడా వదిలిపెట్టేశారు. సాంగ్ లేం పోయింది ఇలాగే చెబుతూ ఉంటారు మనకెందుకని అలవాటు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ. కానీ అనేక కంట్రీస్ లో ఆ దాన్ని స్వామి చెప్పిన ఆ మాటను పాటించిన వారే ఎక్కువ మంది ఉన్నారు. నాలుగు చోట్ల నేనా అన్నాడు. కలి మాడ వాడికి యుగం లేదు. ఈ నాలుగు చోట్ల ఉంటే సరిపోతుందా ఇంకా ఉండు ఉండు అన్నాడు ఈయన. గుర్తు తెచ్చుకున్నాడు. మరియు అడిగిన మళ్ళీ వీడు అడిగాడు అడిగితే సువర్ణము నంబగు అసత్యము, మదము, కామ, హింసా, వైరంబులని యడి పంచ ప్రదేశములిచ్చి ఇది ఐదు ప్లస్ నాలుగు కలిపితే తొమ్మిది. దేవుడికి కూడా లెక్క సరిపోయింది. అంటే ఈ తొమ్మిది చోట్ల అహింస హింస చోట ఉండు. హింస ఎక్కడ జరుగుతున్నది అంటే కలి ఎక్కడ ఉన్నాడని అర్థం. అలాగే మద కీర్తి చేత, పాండిత్యం చేత, సంపద చేత, జనబలం చేత, శరీరంలో ఉన్న అంగబలం చేత మదం ఏర్పడుతుంది. మదాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే దమం ఏర్పరచుకో అన్నారు స్వామి. మదము మద అని రాయగానే దాన్ని తిప్పి చదువుకో అన్నారు. దమ అయిపోయింది. ఎక్కడ ఉంది నీ దగ్గరే ఉన్నది అని. కాబట్టి ఆ దమము ఇంద్రియ నిగ్రహం నేర్చుకోవాలి. తర్వాత అహింస హింస అనే చోట నువ్వు ఉండు. అక్కడ అహింసగా నెరపడానికి మేము వస్తాం. వైరం ఎక్కడ ఉన్నదో అక్కడ కలి ఉన్నట్టు లెక్క. కాబట్టి ఐదు ఆ నాలుగు కలిపితే తొమ్మిది చోట్ల నువ్వు ఉండమని కలిని నిగ్రహించి వాడిని అక్కడ పెట్టి స్థాపన చేసి ఇగ రత్నగర్భకు నిర్భరమైన సంతోషం కలిగించాడు. ఇంకేముంది తొమ్మిది చోట్ల కలి వెళ్ళిపోయినాడు కదా అని భూదేవి శాంతించిందట. నిజానికి పాపం యజ్ఞవరాహ మూర్తి వచ్చేదాకా భూదేవి సుఖంగా ఉంది. కదా. ఆవిడ ఎక్కడో సముద్రం అడుగున ఉండేది. ఏం ఉండేదో ఎట్లా ఉండేదో. మన బోటి వారందరి కోసం ఆయన వచ్చి అవతార ఎత్తి పైకి తెచ్చి ఆ తీసుకొచ్చి అప్పజెప్పి దాని మీద నీళ్లు ఉండేట్టుగా చేశాడు. కనుక మళ్ళీ పరీక్షిత్ మహారాజు సమయంలో ధర్మాన్ని నాలుగు పాదాల నడిపిస్తానని తదనుగుణంగానే కలి-కలి అనేటువంటి వారిని నిగ్రహించాడని కలి నిగ్రహింపబడి ఉన్నటువంటి సమయం ఇది. ఆ సమయంలో హరి వార్తలెరుగు వానికి హరి పదముల తలచు వారికి అనవరతంబున్ హరి కథలు వినడు వారికి అముగురు మరణాగత మోహ సంభ్రమము లేదు అనగా ఎవరు హరి కథ వింటారో హరికి సంబంధించిన చరిత్ర హరికి సంబంధించినటువంటి విశేషణాలు వింటారో ఎవరు అంటారో ఎవరు నిత్యము హరి వార్తలు వింటూ ఉంటారో వాళ్ళకి మరణ సమయంలో ఏ రకమైనటువంటి యాతన వాళ్ళకి ఉండదు. భాగవతం ప్రధానంగా అనుగ్రహించేది అదే. ప్రాణం వదిలిపెట్టేటప్పుడు చాలా హాయిగా వదిలిపెట్టాలి. యాతన పడుతూ వదిలిపెట్టకూడదు గనుక భాగవత శ్రవణం ఇది గొప్పది. ఇక్కడ వ్యాసులవారు ఒక ప్రమాణం చేశారు. కలియుగ మానవులకు ఒక అభయం ఇచ్చారు ఆయన. ఏమిటా అభయం అంటే, చేసిన గాని పాపములు చెందవు కలియుగంలోట. నువ్వు పాపం చేస్తేనే గాని ఆ పాపం యొక్క ఫలితం నీకు రాదు. అంటే పాపం చేయకపోతే చెందదు. తలచినంతటన్ చేసెద అన్న మాత్రమున చెందెదుగదా కలివేళ పుణ్యము ఏదైనా సరే పాపమైనా పుణ్యమైనా చేస్తే వస్తుంది. కేవలం ఒక చెడు తలపు వస్తే పాపం రాదన్నాడు. ఆ చెడు చేస్తేనే వస్తుందన్నాడు. చెడు పాపము కూడా చెడు పాపము ఈ కర్మల వలన జీవుడికి పాపం ఎంతగా వస్తుందో మంచి కర్మలు మంచి తలపుల వలన పుణ్యం కూడా అట్లాగే వస్తుంది. మోసము లేదటంచు రూపముక్షుడు గా నెకలిన్ మరణంద ముల్లాసముతోడ గ్రోలి విరులంతెగ చూడని తేటికైతికిన్ ఇంకా పువ్వు లోపల ఉన్నటువంటి తేనెని అనుభవించనటువంటి ఒక తుమ్మెద వలె ఈ కలియుగ మానవులు ఇంకా వాళ్ళ జీవిత యాత్ర ప్రారంభించాలి. పాపం తెలియదు పుణ్యం తెలియదు అవన్నీ మోయటానికి త్రేతాయుగంలో రాముడున్నాడు కలియుగంలో కృష్ణుడున్నాడు కలియుగ మానవులకి ఇంకెవరూ రాలేదు అని చెప్తూ ఈ భాగవతాక్షమైనటువంటి ఈ వేదం మనకు చెప్తూ ఉన్నది. పాపపుణ్యాలు రెండూ లేవన్నారు రమణ మహర్షి. స్వామి కూడా అదే చెప్పారు. పాపం పుణ్యం నీ మనసున్నంత కాలం ఉంటుంది. నీ మనస్సుని పరమేశ్వరుడికి అప్పజెప్పిన తర్వాత ఉన్నది ఒకటే దాని పేరు పుణ్యం. చెడు లేదు. ఎప్పుడూ పరమాత్మకి అప్పగిస్తేనే అప్పగించకపోతే నీ మనసు నీ దగ్గరే ఉంది. నీ ఆలోచనలు నీవి, నీ కర్మలు నీవి. దాని వలన కలిగేటువంటి అనర్థాలని నీవే అనుభవించవలసి ఉన్నది గనుక మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే మన మనస్సుని పరమాత్మకి అప్పజెప్పటం. జగత్తుతో లీనం చేసేకంటే జగదీశ్వరుడితో లీనం చేయటం మంచిది. ఇక రాజుగారు కదా ప్రతిరోజూ ఊళ్లోకి వచ్చి ఏం జరుగుతున్నాయో అవన్నీ తెలుస్తున్నాయి. అడవులు కూడా వాళ్ళ కిందున్నాయి. అడవుల్లో ఎవరున్నారు అని తపస్సులున్నారు సాధకులున్నారు. అసలు వాళ్ళ యజ్ఞయాగాలు వాళ్ళ కర్మకాండాలు ఇవన్నీ ఏమన్నా సాగుతున్నాయా లేదా? అవి ఎలా ఉన్నాయి? వాటిని చూడాలి అని ఆయనకి అనిపించింది. అనిపించే రోజు వేటకు వెళ్ళాడు. వేటకు వెళితే వేటకు వెళితే మంచి దృశ్యాలు ఏముంటాయి? ఆయన కంటే కూడా ఒక దృశ్యం కలిగింది. ఎక్కడ అంటే ఒక తపోవనానికి వెళ్ళాడాయన. తపోవనానికి వెళితే అక్కడ ఒకాయన చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. తపస్సు చేసుకుంటున్నాడాయన. ఇది కీలకమైనటువంటి సన్నివేశం భాగవతంలో. పరీక్షిత్ మహారాజు జీవితంలో కూడా ఆయన జన్మ ఎత్తి వచ్చినందుకువేటాడటానికి వెళ్ళిన వాడికి తపస్వి ఒక మహాముని కనిపించాడు కనిపించి ఎట్లా ఉన్నాడంటే ఆయన మెలకుట చాలించి మీమ నేత్రుడై శాంతుడై కూర్చుండి జడత లేక ప్రాణ మనో బుద్ధి పంచేంద్రియముల బహిరంగ నీదుల పారనీక జాగరణాదిక అవస్థానత్రయముదాటి పరమమైవుండెడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్తి ప్రకృయుడై యతిదీర్ఘ జటలు తన్ను ఆవరించి అలఘు ఉరుచర్మధారియై అలరుచున్న తపసి పొడగని శోషిత తాలుడగుచు వెండి తడి లేక కుత్తుక వెలుగు బింద మంద భాషయై యిట్లను మనుజ విభుడు తన పంచేంద్రియాలని అంటే మనో బుద్ధి చిత్ అహంకారాలని దశేంద్రియాలని సర్వాన్ని కూడా అధిభూతం చేసి బ్రహ్మపదం వైపు అనుసంధానం చేసి ఎక్కడా కదలిక వదలిక లేకుండా అర్ధ నిమీలిత నేత్రుడై యోగనిద్రా ముద్రాంకితుడై అమనస్క ముద్రతో ఉన్నటువంటి ఒక మహాపురుషుడు అయినటువంటి పరమపదం తెలిసిన అటువంటి వాడు అవస్థాత్రేయాతీతః అని చదువుతాం. ఆ అవస్థాత్రేయాతీతం ఏమున్నదంటే ఉన్నది పరబ్రహ్మమే ఆ పరబ్రహ్మాన్ని తాను దర్శనం చేస్తూ ఉన్నటువంటి వేళ నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి అటువంటి వాణ్ణి చూశాడు ఆ వేటకెళ్ళిన వేళ పరీక్షిత్తు ధర్మరాజు అంశ గనుక ఆ పాయలో వచ్చినవాడు గనుక ఆ తాను ముక్క గనుక ఎవరు ఈయన? ఈయనతో ఒక్కసారి మాట్లాడుదాం అని అనిపించింది. అని వెళ్ళాడు. వెళ్లి, ఆయన పేరు శమీక మహాముని. ఆ శమీక మహామునితో మాట్లాడే ప్రయత్నం చేస్తే విస్తృతమైనటువంటి బయట చర్యలు ఏవీ లేకుండా ఎవడు వచ్చాడు ఎవడు పోయినాడు అన్న ఆలోచన లేకుండా హరి చింతా పరుడై ఉండుట చేత అంటే కేవలము పరమాత్మను గురించిన విచారణలో ఉన్నటువంటి కారణంగా ఆయన ఏం చేసాడంటే కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతో ఏడుతూ ఉన్నవాడు పరీక్షిత్ ఆలోచనలు ఎలా వచ్చాయో చూడండి. ఎంత జ్ఞాని అయినా అహంకారం వదిలిపెట్టుకోకపోతే ఆ జ్ఞానం వృధా. ఎన్ని విషయాలు తెలిసినా తొట్రుపాటు పడితే ఆ తెలిసిన తనంలో నుంచి ఉత్తమోత్తమమైన స్థితి రాదు. అనుకున్నాడు కన్నులు మూసుకుని కూర్చున్న ఈ బ్రాహ్మణుడు ఏం మాట్లాడ్డేమి? నా అంతటి వాడు వస్తే అని అనుకున్నాడు పరీక్షిత్ మహారాజు. చేసన్నలనైన రమ్మనడు మాట్లాడకపోతే మాట్లాడకపోయాడు రా అని అనొచ్చుగా అది అనడు సరజలంబుల తెచ్చిపోయడు ఏమన్ననలైన సేయడు సమగ్ర ఫలంబులు వెట్టడు ఇంత సంపన్నత వందనే తన తపశ్చరణ ప్రతిమ ప్రభావముల్. ఇంత తపస్సు చేసే శక్తి ఉన్నటువంటి వాడా? ఓ పండు ఇవ్వడు, ఓ ఫలమివ్వడు, ఓ మంచి నీళ్ళివ్వడు, రారమ్మనడు, దగ్గరకు రాడు, పో మాట్లాడకపోతే మాట్లాడకపోయినాడు చూడడు, సన్న చేయడు, సౌజన్యం చేయడు, ఏమనుకుంటున్నాడు ఈయన? అన్నాడు. చూశారా అహంకారం కలి ప్రభావం అప్పుడైతే అప్పుడేగా కలితో మాట్లాడి వచ్చాడు కాబట్టి ఈయనని కూడా ఆవరించింది పరీక్షిత్ మహారాజుని. అని కోపం వస్తుంది చూడండి అహంకారి నా మాట వినలేదు అనగానే మాట అన్నవాడికి అహం ఒళ్లంతా నిలబడిపోతుంది. ఎందుకు వినలేదో అని వీడు అనుకోడు నేను అన్నాను నువ్వు వినాలంటాడు అదే పరీక్షిత్ మహారాజు. అని మనుజేశ్వరుండు మృగయా పరికేద నితాంత దాహ సంజనిత దురంతరోషమున సంయమి తన్ను తిరస్కరించి పూజనములు సేయడంచు మృత సర్పమునొక్కటి వింటి కొప్పునందని పడి తెచ్చి వైచెనటు బ్రహ్మము నీంద్రుని హంస వేదికన్. చేయవలసిన మహా ఘోరం చేశాడు. నాకు సత్కారం చేయడు, నాతో మాట్లాడడు, నాకు గౌరవం ఇవ్వడు, ఏమి ఏమి తపస్సు చేస్తున్నాడు వీడు? అంటూ తన చేత ఉన్నటువంటి ధనుస్సు ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఆ కొమ్ము పెట్టి పడిపోయినటువంటి చనిపోయి ఉన్నటువంటి ఒక పామును తెచ్చి ఆయన మెడలో పూమాలగా వేశాడు మాలగా వేశాడు మెడలో. హంస వేదిక ఆయన విశుద్ధ చక్రం ఇక్కడ ఉన్నాడు ఆజ్ఞా చక్రంలో దర్శనం చేస్తున్నాడు సహస్రారంలో నిలకడ చెందాడు మామూలు వాడా? ఇది ఎప్పుడైతే వేశాడో ఆయనకు అసలు ఏం తెలియలే ఒట్టి శిలా సదృశ్యంగా ఉన్నాడు శమీక మహాముని. అప్పుడు ఏం చేశారు శమీకుడికి కూడా ఒక కొడుకు ఉన్నాడు. వాడు అక్కడికక్కడికి వెళ్లి ఆ సమిధలన్నీ ఏరుకొని అరణ్యంలో నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చేప్పటికి తన తండ్రి మెడలో చచ్చిపోయినటువంటి ఒక పాము కనిపించింది. సహజంగా తన తండ్రిని ఎవడో వచ్చి అవమానం మాత్రం చేశాడు అని ఆయనకి చాలా కోపం వచ్చింది. ఎవరికైనా వస్తుంది. వాళ్ళ నాన్న కదా! కోపం వచ్చేప్పటికి ఏం చేశాడంటే ఒక్కటే మాట అన్నాడు. ఎవరు ఏం. ఏం శాపం ఇచ్చాడంటే పాపంబు నీచేత ప్రాపించ మనకింకరాజు నశించిన రాజ్యమందు బలవంతుడగు వాడు బలహీను పశుదార హయ స్వర్ణాదుల అపహరించు జార చోరాదులు సంచరింతురు ప్రజకు అన్యోన్య కలహంబులతిశయిల్లు వైదికంబయున్న వర్ణాశ్రమాచార ధర్మము ఇంచుక లేక తప్పిపోవు అంతమీద లోకులు అర్ధకామంబుల తగిలి సంచరింప ధరణినెల్ల వర్ణసంకరములు వచ్చును మర్కట సారమేయ కులము మేరఅన్నాడు. correct గా ఈరోజు నుంచి నా తండ్రి మెడలో ఎవరు పాము వేశారో ఏడు రోజులు అయ్యేలోగా పాము కాటుతో వాడు మరణిస్తాడు అని శాపం ఇచ్చేశాడు. అంటే పరీక్షిత్ మహారాజుకి ఈ శాపం ఇవ్వబడిన మరుక్షణమే ఆయనకు మిగిలిన ఆయుష్షు ఎంతంటే కేవలం ఏడు రోజులు. శాపం వచ్చేసింది. శాపం ఎవరిచ్చారు? శమీక మహాముని యొక్క కొడుకు ఇచ్చాడు. ఆ పుత్రుడు ఇచ్చాడు. వాడి పేరు శృంగి. శృంగి అంటే కొమ్ములు కలవాడు అని ఒక అర్థం శిఖరం చూసిన వాడు అని రెండో అర్థం. శృంగం అంటే కొమ్ము. అందుకనే శివుడ్ని శృంగాంతర ప్రదేశం నుంచి చూడాలి నంది ద్వారా. నందికి రెండు కొమ్ములు ఉంటాయి కదా, దాని మధ్యలో నుంచి నిరాకార నిర-- పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉన్నదో ఆ నిర్గుణాన్ని చూడాలంటే శృంగాంతర మధ్య ప్రదేశంలో నుంచి చూడాలి. కనుక ఈ శృంగి ఎప్పుడైతే ఇలా అన్నాడో పరీక్షిత్ మహారాజు అక్కడే ఆయనకు అర్థమైపోయింది ఎలా పొరపాటు పడ్డారని. కోపం ఎవరికి రావాలి? ఎప్పుడైతే కొడుకు మాట వినిపించిందో, ఇక్కడ ఏదో జరుగుతున్నదే అనిపించిందో వెనువెంటనే ఆయన శమీక మహాముని కళ్ళు తెరిచాడు. వారించాడు ఆయన. అలా కోప్పడకూడదు, ఆయన ఎవరనుకున్నావ్? మెడలో వేస్తే వేశాడు ఏముందో చిన్న పని. అంటే ఆయన జ్ఞాని. కనుక దాన్ని పట్టించుకోలే. "భరత వంశమున్ పరమ భాగవతున్ హయమేధయాజి ఆచార పరున్ మహానయ విశారదు రాజకులైక భూషణున్ నీరము గోరి నేడు మన మేలకు వచ్చిన యద్ధి భక్తి సత్కారము చేసి పంప చాలు గాక శపింపగ నీకు ధర్మమే" అటువంటి కురువంశంలో పుట్టాడు. అశ్వమేధయాగం చేసిన వంశంలో నుంచి వచ్చాడు. మామూలు వాడు కాదు. ఏదో మన అరణ్యానికి వేటకు వచ్చాడు. ఆ వేటకు వచ్చిన వాడికి ఏదో కావలసిన సత్కారం చేసి పంపాలి గాని శాపం చేసి పంపిస్తే ఎట్లా? ఎట్లా శాపం ఇవ్వచ్చు నాయనా? అని "భూపతికి నిరపరాధమ శాపము తానిచ్చే బుద్ధి చాపలనున మా పాపడు వీడ నరించిన పాపము తొలగించు కృష్ణా పరమేశా హరి" నా కొడుకు చేసిన ఈ పొరపాటును మన్నించి ఓ పరమాత్మ! ఈ రాజును నువ్వు రక్షించవయ్యా అన్నాడు శమీక మహాముని. అంటే శమీక మహాముని యొక్క ఔదార్యం చూడండి. తన మెడలో ఎవడో వచ్చి పా-- ఓ పాము చచ్చిపోయిన పామును వేసి వెళ్ళినా ఆయన దానిని పెద్ద పట్టించుకోలేదు. పొడిచిన, తెట్టిన, కొట్టిన, పడుచుందురు గాని పరమ భాగవతులు. పరమ భాగవతునికి లక్షణాలు మూడు ఉంటాయి. పొడిచిన, వాడెవరైనా వచ్చి పొడిచిన, తెట్టిన, కొట్టిన పడుచుందురు గాని పరమ భాగవతులు తారు ఒడబడరు. వాడి మీద తిరగబడరు. సేవక కొడుకా మారు సేవక విభుడు ఎగ్గు సేయ కోరడు నీకున్. పరమ భాగవతోత్తముడైనటువంటి పరీక్షిత్ మహారాజు నీకు నువ్వు శాపం ఇచ్చినా సరే, అంటే శాపం అంటే తిట్టు. అన్నప్పటికీ కూడా నీ వైపు ఆయన రాజేం రాడయ్యా అని అంటూ "చలగరు కలగరు సాధులు మిళితము లైన నరుల వలన మేలున్ కీడున్ నెలకొనినైన ఆత్మకు వలయవు సుఖదుఃఖ చయము యుగ్మము లగుచున్" ఏమున్నది స్వామి అన్నట్లుగా? నమస్కారం అందదు, పురస్కారం లేదు, తిరస్కారం లేదు. ఈ మూడు నాకందేవి కాదు. నువ్వు తిరస్కరించావా? నాకేం చెందదు. నేను accept చేస్తేగా. నమస్కరించావా? నేను అందుకుంటే కదా. పురస్కరించావా? నన్నేమన్నా ఊరేగింపులు చేశావా? ఏమీ దీనికి నేను లొంగను అన్నారు స్వామి. కానీ మనం ఏం చేస్తున్నాం? పురస్కరిస్తున్నాం, తిరస్కరిస్తున్నాం, నమస్కరిస్తున్నాం. ఈ మూడు చేస్తూనే ఉన్నాం. ఆయన నాకవి చెందవు అని చెప్తున్నారు ఆయన. అయినా చెందుతాయి స్వామి నీకు. నిన్ను ఊరేగించకపోతే మాకు birthday celebration పూర్తి కాదు. నిన్ను ఎప్పుడెప్పుడన్నా ఇంకా మాకు స-- పని చేయలేదు అని తిట్టకపోతే మా నోరు ఊరుకోదు. కాబట్టి జీవ లక్షణం ఇదంతా కూడా. అప్పుడు ఆ శమీక మహాముని కొడుకును చేసిన పాయ-- ఈ పాపానికి సంతాపం చెంది ఒక ముని కుమారుడ్ని పిలిచి వృత్తాంతం అంతా కూడా పరీక్షిత్ మహారాజుకి, ఆయన విన్నాడో లేదో, ఎందుకంటే ఆయన వెళ్లిపోయినాడు అప్పటికే. కాబట్టి నువ్వెళ్లి ఇక మా కొడుకు శాపం ఇచ్చాడు ఇంకా ఏడు రోజులే. దాన్నేం తిప్పలేడు. కాబట్టి ఆ ఉన్న సమయమే జాగ్రత్త పెట్టుకో అని పంపించాడట. పంపిస్తే అక్కడ ఏమైంది? విప్రశాపం తెలిసింది. మనకు తెలియనంతవరకు దుఃఖం లేదు కదా. ఏదైనా విషయం తెలిస్తేనే దుఃఖం. తెలియకపోతే ఉంది హాయి, సుఖం. ఆలోచించాడు, అందర్నీ పిలిచాడు. మరి ఇంకా ఏడు రోజులే ఏం చేద్దాం? ఏడు రోజులు గనక ఎవరికైనా రాజ్యం అప్పజెప్తే వాళ్ళు ఏం చేయగలరో మనకు చేసి చూపిస్తారు ఇప్పుడు, కదా. ఏడు రోజులు కాదు ఏడు గంటలు. పరీక్షిత్ మహారాజు రాజ్యం ఏలడాన్ని గురించి విచారం పొందలే. అయ్యో నా ఆయుష్షు ఉన్నది తగ్గిపోయిందే. ఇంకా హరినామ సంకీర్తనం ఎప్పుడు చేసుకుంటాను? ఆ పరమ పురుషుడి యొక్క దివ్య విశేషాలను ఎప్పుడు తెలుసుకుంటాను? నా జీవితం ఇలాగే తెల్లవారిపోతుందా? అని ఒక విచారానికి లోనైనాడు.
SSSMC · audio
Bhagawata Navaneetham - 16
Bhagawata Navaneetham - 16
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 30:07
More in this series