Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం సురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్ఫురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ, తన్ను పరమేశ్వరుడని తలంచుచున్న యశోద యందు కృష్ణుడు వైష్ణవ మాయంబు నడించె. వాళ్ళ అమ్మ కళ్ళమీద చెయ్యేసే, కళ్ళమీద చెయ్యేస్తే ఆమె ఏమనుకుందంటే నా పిల్లవాడికి నా కళ్ళు-- తల్లి, తల్లి ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడికి మూడు ఇష్టం. వాళ్ళ అమ్మ మూతి ఇష్టం ఎందుకంటే రోజు వాడిని పొగుడుతూ ఉంటుంది, రోజు ఇయ్యాలు ఊపుతుంది, వాడి కోసం పాటలు పాడుతుంది, వాడికి కలిపి అన్నం పెడుతుంది గనుక మూతి అంటే ముందు ఇష్టం. తర్వాత చెవి కమ్మలు ఇష్టం దాంతో ఆడుకోవటానికి వాడికి ప్రథమ ఆట వస్తువు తల్లి చెవి కమ్మ. ఇక రెండవది తల్లి కళ్ళు, తల్లి కళ్ళు వాడు మూసుకుంటే వాడు తెరుస్తు-- అదేగా ఆట దాగుడుమూతలాట వీడు వెనక నుంచి, ముందు నుంచి పైన వాడికి ఇష్టం. కనుక రెండు కళ్ళు అలా మూశాడు. మూస్తే, జడను పడి ఎరుక సెడి అపడతుక ఎరుక పోయింది, స్పృహ పోయింది. సర్వాత్ముడనుచు పలుకగా అట నిన్ కొడుకని తొడపై ఇడుకొని కడు వేడుకతోడ మమత గాంచె నృపాలా! పరీక్షిత్ మహారాజా! చూశావా పరమేశ్వరుడు ఎలా కనిపించాడు? ఒక్క క్షణం కనిపించాడు కనిపించి ఆనందించి ఇది కలయో వైష్ణవ మాయో అనుకునేలోగా మాయలో నుంచి మళ్ళీ మామూలు యశోదను చేశాడు, వెళ్ళాడు ఒళ్ళో పడుకో-- పడుకున్నాడు పోయి. అని పాపలంతా కూడా మీగడ పెరుగు కూడంబోసి వీక నాకత్రాడు కవ్వంబున అలవరించే అప్పుడు శ్రీకృష్ణుణ్ణి యశోద పట్టుకునేటువంటి ఒక దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు. వర్ణనలో అక్కడంతా మనం పాలు చిలకటం అవన్నీ కూడా చెప్తే, బాలున్ని తండని భావిల్చు నందున పెద్దలు నేరరు క్రమంబు. కేవలం వీడు బాలుడే అందామంటే వీడి విధానం అంతా చూస్తే పెద్దవాడి దగ్గర లక్షణాలు లేవు. పెద్దవాళ్ళేమో పిల్లల్లా ఉన్నారు. Child like ఉండాలి గాని childish గా ఉండకూడదు. కదా. Child like ఉండాలి. పసితనాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన బాల్యం మనకు తెలియకుండా పోయింది గాని మనలో ఉన్నటువంటి పసిబాలుడి యొక్క తత్వాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? కానీ Child like ఉండాలి childish గా ఉండకూడదు. చాలా తేడా ఉంది. బాలుడిలా ప్రవర్తించకూడదు. వానిలో ఉన్న పవిత్రతను మాత్రం నిలబెట్టుకోవాలి. అలాగే [పాట] నెరపలంగుటనై నెరపించు నందున కలికి లేకొక్కడు గాని లేడు నెరపుతో నా బుద్ధి వినిపించు నందున తనుదానయై బుద్ధి తప్పకుండు. వీడికి ఏదన్నా బుద్ధి చెబుదాం గాని రేపు-- రేపొద్దున కృష్ణుడికి ఒక శుద్ధి చెబుదాం అని ఆవిడకి, అంటే Moral conduct ఇలా చేయకూడదురా, అలా చేయకూ-- ఏదన్నా చెబుదామంటే చెప్పేలోగా వాడికి అన్నీ తెలిసినట్టుగా కనిపిస్తుంది. ఏం చెప్పడానికి ఏం మిగలటం లేదు. [పాట] ఉండరుంగక ఇంట ఉండెడినందున చొచ్చి చూడని చోటు లేదు. పోనీ ఇంట్లోనే ఉన్నాడనుకున్నా వాడిని చూడని చోటు లేదు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. [పాట] తన్ను ఎవరైన తలపోయ పారెడి యొదలేదు భీతి ఒకటి ఎరుగడు ఎలని ఊరకుండెడు ఎకశక్కన్ను నాడు పట్టి శాస్తి చేయు భంగಿಯెట్లు. అసలు వీడిని పట్టుకొని వీడికి ఏదో చెప్పి వీడిని మామూలుగా అందరిల్లకి వెళ్ళకుండా ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఒకరోజున ఆవిడ ఆలోచన చేసింది. ఆలోచనలో [పాట] లాలన మున బహుదోషము లోలిన్ ప్రాపించు. గారం చేయాలి, pamper చేయకూడదు. అతి గారం వ్యర్థం, ప్రయోజనం లేదు దాంట్లో. గారం చేయాలి, correction కూడా చేయాలి. ఎంత మనం ప్రేమిస్తామో అంత జాగ్రత్తగా వాళ్ళని లాక్కుంటూ పెంచుకుంటూ రావాలి. [పాట] తాడనోపాయంబులం తాలగుణంబులం కలుగు బాలురకు తాన్ తాడనంబ పజ్జంబు అరయన్. వీడికి పజ్జెం ఏమిటి? అల్లరికి, గోలకంటే ఒకసారి వీడిని కొట్టాలి. తల్లి కొట్టి correct చేద్దామనుకుంది. దండనం కదా. అని నిశ్చయించి హేలనున్న కోల జలిపించి వాళ్ళ-వాళ్ళకున్నవన్నీ పశువులు ఆలమంద లేవో చర్నాకోలు తీసుకుని ఇలా జులిపించి [పాట] బాలా! నిలు నిలుమని బగ్గుబగ్గున అదల్చుచు తల్లి డగ్గరిన తెగ్గడిలిన చందంబున అడ్డలిక సెడి రోలు డిగ్గ నురికి. ఆవిడ అదలిస్తూ ఉన్నది, వీడు పరిగెత్తుతున్నాడు, పాకుతూ పాకుతూ వెళ్ళి రోలు దగ్గరికి వెళ్ళి ఉంచున్నాడు. అసలు సంహార ఖండకు కావలసిన అన్ని వస్తువులని ఆయన వ్రజభూమికి తెచ్చుకున్నాడు ముందే. రోలు, బండి, పూతన, కదా. ఆయన ఎక్కడా వెతుక్కుంటూ వెళ్ళలే. తర్వాత తర్వాత హస్తినాపురానికి పోయినాడు. ఉద్ధారణ చేయవలసిన వస్తువులన్నీ ముముక్షు భూమిలోనే ఉన్నాయి. కనుకనే ఆయన అతి త్వరగా చెరసాలలో నుంచి అక్కడికి చేరుకున్నాడు. [పాట] గజ్జెలు గల్లని మ్రోయగ నజ్జెలు తొక్కుటలు మాని యతిజవమున యోషి-- యోష్టి జనమును నగతల్లియు పజ్జంచను దేరెన తడుపరు విడ అధిపా. ఆయన వెంట వీళ్ళు, వీళ్ళ వెంట ఆయన పరిగెత్తుతున్నట్లుగా వెళుతూ...వెళుతున్నట్టు కు-- సమయంలో కృష్ణుడు ఎలా ఉన్నాడట అంటే "స్తంభాధికమును తనకు అడ్డంబైన ఇట్టిట్టునని పట్ట వీణి వాడు" స్తంభం ఆయనకు అడ్డమా? ఇంతకుముందేగా స్తంభం దిల్చుకొని వచ్చాడు. ఆయనకేం అడ్డం? ఒకటి "నీ తప్పు సైరింపు మింక దొంగిల పోవనేనని మునుగుట్ట ఏడ్చువాని" దండించదాం అనుకునే లోగానే ఇంకెప్పుడూ చేయనమ్మా అని ముందే ఏడుస్తున్నాడు వీడు. అసలు anticipatory bail తీసుకుంటాడు వీడు. దొరకడు, లోపలికి పోడు. అది. కాబట్టి ముందే preempt చేసేస్తాడు ప్రేమతో. "కాటు కనవయంగ కన్నులు నులుముచు వెడలు కన్నులతో క్రీగంట చూచువాడు" పాను పెట్టిన కాటుకనే అటూ ఇటూ కన్నీళ్లు తెచ్చినట్టు అభినయించి, నటించి, దానిలో నుంచి కన్నీళ్లు వచ్చినట్టు కాటుకనంతా చేర్పేసుకుని, ముంగురులు దాని మీద పడుతూ ఉంటే, ఇటువంటి పిల్లవాడిని నేను హింస పెట్టేది-- ఛీ, చేయకూడదని తల్లి చేత అనిపించేట్లుగా ఏడిచేవాణ్ణి "ఏకస వచ్చునో ఇదియని పలుమారు ఉరుకుచు క్రేగంట చూచువాని" ఎటు నుంచి వస్తుందో ఆయన తల్లి ఆయనకి తెలుసు. కానీ తల్లి వచ్చే దిక్కు కాక మిగతా అన్ని దిక్కులు చూస్తూ, అటు నుంచి వస్తుందా, ఇటు నుంచి వస్తుందా అని నా పిల్లవాడు అన్ని దిక్కులు దిక్కులు చూస్తూ భయపడుతున్నాడు. నేను ఇలా భయపెట్టకూడదని అనిపించి "కూడబారి పట్టుకొని నరకలంచుచు చిన్ని వెన్నదుంగ చిక్కననుచు అలిగి కొట్ట చేతులాడక పూబోడి కరుణ తోడ దాలు కట్టదలచి" వీణ్ణి కొట్టకూడదు, ఒక పని చేద్దాం, కట్టేద్దాం అనుకుంది. అది. కట్టేస్తే అటూ ఇటూ పోడు. పైగా ఏం దూరమేం లేదు. పశువులను కట్టే తాళ్లు చాలా ఉన్నాయి. పోయి పరిగెత్తి పరిగెత్తి నా అదృష్టం రోలు దగ్గరే ఉన్నాడు. ఏం చేద్దాం అంటే రోలుకే కట్టేద్దాం. ఇంకేముంది రోలు ఆమె మొగుడు ఏది తోసుకు రాలేదుగా. వీడే వెళ్ళాడు సులభంగా. ఇప్పుడు పోలీసుల పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే దొంగని, బాబు దొరక్కరా నాకు promotion వస్తుంది అన్నట్టు ఉంది. వాడు దొరుకుతాడా? పరమాత్మని కూడా అలా పట్టుకుందాం అన్నది యశోద. "వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా యన్నటును వెన్న కానరట కదా! చోరత్వంబించుక నేరట ధరిత్రి ఇట్టి నియతులు గలరే" కాస్త విచిత్రంగా, ఎవరు వీడు? వీరి పేరు కృష్ణుడు అయినా? వీడికి అసలు దొంగతనం ఏం తెలియదట. వెన్న ఇంతవరకు చూడలేదట. ఇంటికి వెళ్ళలేదట. వీడేనా? వీడి పేరేనా కృష్ణుడు? అంటే పట్టుకునే ప్రయత్నంలో అలా అంటూ అంటూ పసివాడిని దక్కించుకునేటువంటి ప్రయత్నంలో "పట్టిమ పట్టువడవని నిను పట్టదని ని చలనుకొనిన పట్టుట పెట్టే పట్టువడవంద్రు పట్టి" ఇదిగో, నాయనా నేను పరిగెత్తలేనురా, నీ వయస్సు నా వయస్సు చాలా తేడా ఉంది. దొరకరా అన్నది. పట్టి, నిన్ను పట్టుకోవాలి, పట్టుకుంటాను అన్నది. "పట్టుకొనన్నాకు గాక పరులకు వశమే" ఇంకెవరు పట్టుకుంటారు నేను నీ తల్లిని అంటే "ఎక్కడనైనను తిరిగెద ఒక్క యెడన్ గుణము కలిగి యుండవు నియమంబెక్కడిది నీకు మరచిన చక్కదబోయెదవు పెక్కు జాడల పుత్రా" ఆమె కూడా ఒక వైదాంతిక, తార్కిక, జ్ఞాన భూమికలో కృష్ణుడితో మాట్లాడుతున్నది. పట్టుకుందాము అంటే దొరికేవాడివే నువ్వు. పట్టుకోవద్దులే అంటే ఉండేవాడివే నువ్వు. ఏమరుపాటున ఉన్నానో తప్పించుకొని వెళ్ళిపోతావ్, ఎటు వెళ్ళిపోతావో. కాబట్టి నిన్ను అని నేను ఎక్కడ వెతకగలనురా? అంటూ ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తున్నది యశోద. యశోద హృదయం నవనీతం. దివ్య నవనీతం వైపు వెళుతున్నదాని. నెమ్మదిగా మనసు కరుగుతూ ఉన్నది. మామూలు నందാംగణ స్థాయి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తల్లి స్థాయికి ఎదుగుతున్నటువంటి వేళ. ఇది ఒక అధ్యాత్మ ప్రస్థానం. ప్రస్థానంలో "స్వయంబునివియని తొలగక తచ్చెదు తలచెదు కట్టెన తరల నెత్త మంటితో ఆటలు మానవు" మంటితో-- పద్యమంతా ఏంటంటే, మట్టితో ఆటలు మానవు. దున్నపోతులన్నింటినీ, వాటిని ఎద్దుల్ని, ఆవుల్ని, వాటిని వదిలిపెట్టవు. గోపగోపికలతో ఆటలు మానవు. అందరూ వచ్చి చెప్పినట్లే నువ్వు దొరికినట్లుగా ఉంటున్నావ్, దొరకనట్లుగా ఉంటున్నావ్ అని అంటూ మొత్తానికి పట్టుకున్నది. పట్టుకుంది. కృష్ణుణ్ణి పట్టుకుంది ఊరికే. పట్టుకున్న తర్వాత తన దగ్గర తాడు ఉంది కదా! కృష్ణుడు ఎంతటి వాడు? పారాడే పిల్లవాడు వాడు. చిన్న బూరెడో, ఆ, బారెడో, మూరెడో ఉంటే సరిపోతుంది. కడుతూ ఉన్నది. కడుతూ ఉన్నది ఎక్కడ ముడేయటానికి అంగుళాలు దొరకటం లేదు. లీలాసుకుడు ఆనందమంతా లీలాసుకుడు అనుభవించాడు. ఆయన చెప్తాడు. ఇట్లాగే, ఒరేయ్ దొరక్క దొరక్క ఇప్పుడు దొరికావు. పనంతా పాడైపోయింది నీ వల్ల ఈవేళ. అక్కడ ఏమైపోతున్నాయో తెలీదు. నిన్ను కట్టాలిరా, అసలు ఎలా కట్టాలి? తాడు చాలటం లేదేమిటి? నీ పొట్ట చిన్నది. ఇంత బారెడు తాడు తెచ్చాను. ఎక్కడ ముడి పెట్టడానికి వీలు లేదే అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు. కృష్ణుడు నా కొడుకు అన్నటువంటి అహంకారము, కృష్ణుడే నా కొడుకు అన్న అహంకారము, కృష్ణుడు నా కొడుకు అన్న మమకారం. రెండూ వదిలిపెడితే, అహంకారం, మమకారాలని రెండంగుళాలు గనక వదిలిపెట్టగలిగితే కృష్ణుడు నీవాడు అన్నాడు. అది. లీలాసుకుడికి నమస్కరించాలి క్షణం. ఎందుకంటే అదొక దివ్య భావన. అదొక దర్శనం. ఊరిక మామూలు కవి రాయలేడు. ఆయన దర్శనికుడు గనుక "ఆ లవణ కట్టెన్ రోలన్ నవనీత చౌర్య-చౌర్యలీలున్ ప్రియ వాగ్జాలు పరి విస్మిత గోపాలున్ ముక్తా-మమపాలున్ బాలున్ మొత్తానికి కట్టేసింది. అదే విన్న-విన్నది "సరేలే! నువ్వు మా అబ్బాయివి కాదులే, నువ్వు దేవుడివేలే, నేను నీకు తల్లిని కాదులేరా, అదే కదా నీ ఆట?" అన్నది. అన్నందుకైనా కట్టుబడిపోయినాడు ఆయన. ఊరికే, అది నిజంగా అనలే. అనకపోయినా దొరికిపోయాడట. రోలను కట్టబడియు అబ్బాలుడు విలసల్ల భక్తి పరతంత్రుడై. రోలు కట్టేసిన తర్వాత చిన్ముద్రలో అభయమిస్తూ కూర్చున్నాడట ఆయన. ఇది చిత్రం. విశిష్టంగా ఇది-- గొప్ప దృశ్యం. ఆలాసన్ నిబద్ధ విశాల మదేవేంద్ర కలభ్ సమరుచిన్ అధిపా పటియెల్ల బోటి పట్టి పడుంగని గట్టి తలపుతోడ కట్టెగాగ పట్టి కడుపు పెక్కు బ్రహ్మాండముల పట్టు పట్టుట ఎరిగెనే నిత్తల్లి ఏల కట్టు. మాయ కమ్మింది గనుక పిల్లవాడిని కట్టింది గానీ, అసలు విశ్వాత్మకుడు విష్ణువు అని గనుక నిశ్చితమైన అభిప్రాయం యశోదకే ఉండి ఉంటే పరమాత్మని తాళ్లతో కడుతుందా? పని చేయవలసింది రావణ, దుర్యోధనాదులు తప్ప యశోద కాదు. వాళ్ళు కూడా కట్టదామని ఆయన్ని, ప్రతి వాడు కట్టుకుందామని. "నా వాడు" అనుకోవద్దన్నారు స్వామి. కానీ ఎవరికి వాడు నా వాడని అనుకుంటాడు. అది అనన్య భక్తి. కానీ అనుకోవాల్సింది ఏంటంటే స్వామి మనందరి వారు. మనందరం ఆయనకి చెందిన వాళ్ళం. దాంట్లో హాయి ఉన్నది. "నా వాడు" అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే దాన్ని మోయటం కష్టం. అది. ఏదో అట్లా, అట్లా చూసి చూడనట్టు ఉండి ఉండనట్టు బండిని నడిపించుకుంటే ఆయన అనుగ్రహం కూడా అట్లా ఉంటుంది. చిక్కడు శిరిక ఊగిటిలో. కానీ యశోదకి దక్కాడు. లక్ష్మీదేవి ఎంత ప్రయత్నించినా ఇంకా దక్కలేదుటానికి. ఉరికే అక్కడ ఉంది అంతే. ఎక్కడ ఉంది? పాదాల దగ్గర ఉన్నది. అంతే. చిక్కడు శిరిక ఊగిటిలో చిక్కడు సనకాది యోగ చిత్తాజ్జములన్. యోగి హృదయాలలోనూ చిక్కడు. శ్రీదేవికి చిక్కడు. చిక్కడు శృతిలతికావళ్ళికి, వేద, వేదాంతాలకి ఈయన అందడు. ఉపనిషత్తులకి లొంగడు. నతులకు, నతులకు నేను అందనన్నారు స్వామి. మీరు నతించండి, నతించండి నేనేం మీకు దొరకనన్నారు. మరి ఎలా దొరుకుతారు స్వామి అంటే, అహంకారం, మమకారాలు వదిలిపెట్టండి, సమర్పణం చేయండి నేను నీవాడిని అన్నారు. అది చేయలేకపోతున్నారు. చేయగలిగితే, ఇదిగో కృష్ణుడే చెప్తున్నాడుగా ఇక్కడ కూడా. కానీ చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. రోటికీ చిక్కటానికి కూడా వెనక మళ్ళీ ఒక కథ ఉన్నది. కథ ఏమిటి అంటే, తజ్జనుని లోగిటంగల రజ్జు పరంపరల క్రమ్మరంచుతు గట్టం బొజ్జ తిరిగిరాదయ్య జగజ్జాలములున్న బొజ్జగట్టం వశమే. విచారణ చేశాం. సర్వ భువనాలు ఉన్నటువంటి చిన్న పొట్టని మామూలు తాళ్లు కట్టగలవా అని వేదవ్యాసులవారు కూడా అంటున్నారు. అప్పుడు ఆశ్చర్యపోయి, ఏమిటిది? ఇదొక విచిత్రంగా, మహిమ లాగా ఉన్నదని వడలచ మడలగయ ఉత్తరీయము జార వీడియున్న చురుము విరులు రాల కటరాని తన్ను కట్టడనుని చింత కట్టుకొనిన తల్లి కరుణ జూచి. తల్లి ఆంధ్రదేశంలో, తెలుగుదేశంలో ఒక విచిత్రమైనటువంటి దృశ్యం ఉంది. దృశ్యం ఏమిటంటే మగ పిల్లవాడు పుట్టాడా తల్లి వాడికి ఆడ వేషం వేస్తుంది. ఆడపిల్ల పుట్టిందా వాడికి జీన్ ప్యాంటు వేస్తుంది. కదా. వాడికి మగ పిల్లవాడిగా అలంకారం చేసి పిల్లలో చూసుకుంటుంది. పిల్ల పిల్లవాడు కావాలి, పిల్లవాడు పిల్లయిపోవాలి అప్పుడే తల్లికి ఆనందం. అలాగే కృష్ణుడికి కొప్పు చేసి దానికి మల్లెపూల చెండు చుట్టిందట. మరి రోలు కట్టేసి వీళ్ళంతా బయటికి వెళ్ళిపోతున్నారు. ఆయనకి చెమటలు, ఈనా పరిగెత్తాడుగా బాలుడు చిన్నవాడు. ఒంటిమీద పడినటువంటి స్వేద బిందువులన్నీ కూడా ముచ్చాలవలె మెరిసిపోతున్నాయట. ఆకాశంలో చుక్కల్లా ఉన్నాయట. ఎందుకంటే ఆయనది నీలమేఘచ్ఛాయ. దానిమీద తెల్లని స్వేద కణాలు ముచ్చాలు పొదిగినట్టుగా ఉందట. ఎంత అందమైన ఊహ చూడండి. అప్పుడు పైన ఉన్నటువంటి మల్లెపూలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా రాలి కింద పడిపోతున్నాయి. దాన్ని చూశారు వీళ్ళు. చూసి బంధ విమోచనుడు ఈషుడు బంధింప తనెంగు జనని పాటోర్చి శ్రుత్పుద్బంధుడు గాన జననీ బంధమున కట్టుబడ పాటించి. పరమేశ్వరుడు ఎవరికీ చెందని వాడైనా, ఇందాక వేదాలకు లొంగడు, ఉపనిషత్తులకు లొంగడు, యోగి హృదయాలలో ఉండడు, అసలు శ్రీదేవికే దొరకడు అని అనుకున్నామే, కానీ దొరికే చోట ఒకటి ఉన్నదట. తల్లి హృదయంలో మాత్రం నిలకడ చెందుతాడట పరమాత్మ. అక్కడ స్వామి కూడా అనేక సార్లు చెప్తారు. తల్లి హృదయం దాకా వెళ్లగలిగినటువంటి పిల్లవాడికి తల్లి ఉన్నా, దేహం వదిలిపెట్టినా ఆరక్షణై నిలుస్తుంది. అది శాస్త్ర ప్రమాణం అది. తల్లి ఎక్కడ ఉండనివ్వండి తన తనువును తెంచుకుని పుట్టాడు గనుక బిడ్డ యొక్క యోగక్షేమాన్ని మీనాక్షి వలె, అన్నపూర్ణ వలె, విశాలాక్షి వలె, కామాక్షి వలె, జగదక్షి వలె కాపాడుతుంది. కాబట్టి తల్లికి ప్రథమ వందనం చేయాలి. మాతృభిక్ష, భిక్షలో కూడా మొదటిది తల్లే. తల్లిదే అగ్రస్థానం అని చెప్తున్నాడు ఇక్కడ. సంగడి తినిగడి శంభుడు, శంకాశ్రయై నసిరియు, ఆత్మజుడై ఉప్పొంగెడి పద్మజుడు, గోపాంగనక్రియ కరుణావడయను, అఖిలేశ్వరుచే, జ్ఞానులచే, మౌనులచే, దానులచే, యోగసంవిధానులచేనిబద్ధుడగునే శ్రీనాథుడు భక్తి యుతుల చేతన్ పోలన్ అప్పుడు ఇంటి దగ్గర ఉన్న పండ్లన్నీ వెంట తిరిగిగా కృష్ణుడు వచ్చాడు నారద శాపం అవన్నీ కూడా కొన్ని కథలున్నాయి కథలన్నీ కూడా మనం రేపు చెప్పుకుంటూ రేపంటే మళ్ళీ కలిసినప్పుడు ఇక్కడ ఒక రెండు విషయాలు మనం చెప్పుకొని ముగిద్దాం. వాళ్ళందరూ కూడా గోప గోపికలంతా ఆయన చుట్టూ చేరారట ఇది అద్భుతం చూశారు బాలుడవే నీవు పరుడవు ఆలంబుడవు అధిక యోగి వాద్యుడవు తను స్థూలాకృతి యగు విశ్వము నీ లీలా రూపమండ్రు నిపుణులు కృష్ణా ఎల్ల భూతంబులకు ఇంద్రియాకృతి ప్రాణములకు అధిపతివ నీవు ఇంద్రియాలకి మనస్సుకి ప్రాణానికి నువ్వు అధిపతివే. చెట్టు కిందే చెప్పావు కదా నీకు అధిపతి నేను అని వీటికి నీవు అధిపతివే ప్రకృతియో ప్రకృతి సంభవ మహత్తువు నీవ వీటికన్నిటికి విభుడ నీవ ప్రకృతి ప్రకృతిలో ఏర్పడే మహత్తత్వం వీటన్నిటికీ మూలమైనటువంటి ప్రతి దానికి నీవే విభుడవు ప్రాకృత గుణ వికారముల కొందక పూర్వసిద్ధుండవగు నిన్ను చింత సేయ ఇప్పుడు బాలకుడిగా కనిపిస్తున్నావు గానీ నీవు పూర్వసిద్ధుడివి జ్ఞానులంతా పూర్వసిద్ధులే పూర్వ సిద్ధత్వం లేకపోతే వాడు క్షణంలో జ్ఞాని కాలేడు. జ్ఞానాధిక్యమైన మనీషాయత్తమైనది ఈయన రాముడు కాకపోతే కృష్ణుడు కాడు అంతకు ముందు వచ్చిన శ్రీ మత్స్య కూర్మ వరాహ వటు నరసింహాది చైతన్యాలు కాకపోతే ఆయన రాముడు కాడు రాముడు కాకపోతే కృష్ణుడు కాడు కృష్ణుడు కాకపోతే సాయి భగవానుడు కాడు అంటే ఇదంతా ఒక మహా చైతన్య ప్రవాహం ప్రవాహానికి పూర్వసిద్ధి ఏర్పడి ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నాడు కృష్ణుడు ఇన్ని మాటలు ఎలా చెప్తున్నాడు ఇన్ని ఆటలు ఎలా ఆడుతున్నాడు అతి చిన్న వయస్సులో పూతనని ఎలా చంపాడంటే పూర్వసిద్ధి. పూర్వసిద్ధి ఎలా ఏర్పడింది పూర్ణ శుద్ధితో సిద్ధి ఏర్పడింది సిద్ధి శుద్ధి రెండు ఉంటే వాడు యోగి యోగి అయినటువంటి వాడు మౌని మౌని అయినటువంటి వాడు జ్ఞాని జ్ఞాని అయినటువంటి వాడు ప్రేమమయుడు అటువంటి ప్రేమాధిక్యమైనటువంటి స్థాయిలో వాళ్ళందరూ కూడా మొదల యవ్వని అవతారములు శరీరములెందు సరిదొడ్డు లేని వీర్యముల తనువులగర జన్మినాచి వారల యందు చిక్క పట్టి పరమేశ ముఖదమయ్య నీకు నువ్వు అనేక అవతారాలు ఎత్తొచ్చావు నువ్వు కూడా అవతార పురుషుడివే అంటున్నారు బాలకృష్ణుణ్ణి ఎలా అనగలుగుతున్నారంటే యోగ మాయ చేత మళ్ళీ మా బాలకృష్ణుణ్ణి ఎలా ఆడుకుంటున్నారంటే అదే వైష్ణవ మాయ చేత మరపు తెరపులు రెండూ కూడా పరమేశ్వరుడు జీవుడి పట్ల ఉదారంగా ఉంచుతాడు మరపు లేకపోతే బాధ తీరదు బాధ ఏర్పడినవండి మరపే గాయాన్ని మానుస్తుంది మరపు కాలాధీనం కాలగమనంలో అనేకమైనటువంటి అనుభవాలన్నీ మరుగున పడిపోతాయి అనేక స్మృతులు అప్పుడప్పుడు ఒక్కసారి మెరిసిన ఒట్టి ఒక మిణుగురు పురుగు వలె ఒక్కసారి తాకి పాత అనుభవాన్ని మళ్ళీ వెనక్కి నెట్టేస్తాయి అదే గనక గుర్తు పెట్టుకొని ఉన్నట్లయితే జీవుడు నిన్న నుంచి బయటపడి నేడు లోకి ప్రవేశించలేడు నిన్న నిన్నాని మనం ఎలా వదిలిపెట్టగలుగుతున్నామంటే పరమేశ్వరానుగ్రహం అయినటువంటి యోగ మాయ చేత అలాగే మళ్ళీ రేపు ఉంటుందని ఒక భ్రాంతిని ఎలా పొందుతున్నామంటే వైష్ణవ మాయ చేత యోగ మాయ తెలుసు వైష్ణవ మాయ తెలుసు కానీ మాయా లోకంలోనే ఉంటాం అది విచిత్రం. లోకం మాయ చేస్తుందని లోకాన్ని మనము మాయ చేయొచ్చని జీవుడు ఉంటాడు అలా ఉండకూడదని చెప్తూ నీ పద్యవళులాలకించు చెవులున్ ఇది మనకు కావాల్సింది ఇవాళ్టికి చెవులిచ్చాడు కదా ఏం చేయాలి అంటే నీ పద్యవళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబని చే యుహస్త యుగముల్ ఇవాళ స్వామికి సర్వ జగత్తు ఏదో ఒక చోట కాదు సర్వ సృష్టిలో ఏం జరిగినా సాయి పేరు మీద జరుగుతున్నాయి కదా ఒక చెయ్యి ముందుకొచ్చి ఇంకో చెయ్యిని కలుపుతున్న సమయంలో సాయి రామానుగ్రహం వలన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి దాన్ని భాగవతంలో ఎంత అందంగా రిఫ్లెక్ట్ చేశారో చూడండి నీ పద్యవళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబని చే యుహస్త యుగముల్ నీ మూర్తిపై చూపులున్ ఎన్ని బొమ్మలున్నా ఇంటి నుండా వెయ్యి బొమ్మలున్నాయుండీ స్వామి బొమ్మ మీదే మనసుంటుంది మరి ఏమిటది అది బొమ్మేగా అది ఫోటోనేగా ఫోటోయే నీ పాదంబుల త్వంత ముక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ మాకు అంగాంగీభావంతో చెవులిచ్చావు కళ్ళిచ్చావు మనసిచ్చావు బుద్ధిచ్చావు జన్మిచ్చావు జీవితమిచ్చావు కానీ ఇవన్నీ కూడా నీ సేవ యందు నీ కథా శ్రవణము నందు నీ గుణ విశేషణ విచారణ యందు నిమగ్నమయ్యేట్టుగా అనుగ్రహమివ్వవయ్యా అని అడుగుతూ వాళ్ళందరినీ చూసి హరి ఒక మాట చెప్పాడు ఇవ్వవయ్యా అంటే ఎవరికి ఇస్తాడో చెప్తున్నాడు ఎవరంటే తమ తమ ధర్మము తప్పక ఎవరెవరు పని చేయాలో పని చేస్తూస్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః స్వధర్మం ఆచరించాలి మనం చేయవలసిన పని కాలంలో పని చేయాలో చేస్తూ సములై సమస్థితిలో ఉండి నన్ను నమ్మితిరుగ నన్ను నాయందు విశ్వాసం ఉండాలి సభ్యులకును బంధము నన్ను చూడ విరియును నన్ను చూస్తూ ఉండగానే బంధాలు అన్నీ తెగిపోతాయి ఏం భయం లేదు కమలాత్తుడు వడమరియు ఘనతమము క్రియన్ మీకు విష్ణువు ఘనతరమైనటువంటి ఒక క్రీడగా ఒక భావనగా ఒక చేష్టగా ఒక చర్యగా ఒక లీలగా ఒక మహిమగా ఒక అనుగ్రహంగా పరమేశ్వరుడు మీకు లభిస్తాడు ఎప్పుడు లభిస్తాడు అంటే మీ మీ ధర్మాన్ని మీరు చేయాలి చదువుకునేవాడు చదువే చదువుతూ ఉండాలి పాడుతూ ఉన్నటువంటి వాడు పాడుతూనే ఉండాలి ఆడుతూ ఉండేవాడు ఆడుతూనే ఉండాలి ప్రజ్ఞలన్నీ పరమేశ్వర కైంకర్యం కోసం వినియోగిస్తూ ఉండాలి ఎప్పటిదాకా అని అడుగుతారు మంత్రం ఎన్ని రోజులు చేయమంటారు కన్నుమూసే దాకా చేయాలి ఏమవుతుంది పని అయిపోయి తీర్చేసుకోవడానికి అది ఏవన్నా మంత్ర రక్ష కానే కాదే గురు మంత్రం హరి నామం సాయి నామం మన జన్మ ఉన్నంత వరకు అజామీలుడు చూడండి పొరపాటున నారాయణ అంటే విష్ణువును పట్టుకోపోయారు విష్ణు భక్తులు మనం పొరపాటున అనకూడదు అలవాటుగా అనాలి అలవాటు ఎప్పటినుంచి అంటే బాల్యం నుంచి రావాలి అనేక దశలు దిశలు జీవితంలో మారుతూ ఉంటాయి స్థితిగతులు కూడా మార్పు చెందుతూ ఉంటాయి దేనికి భయపడవలసిన పని లేదు జీవితమే అంత It is full of paradoxes and contradictions అనేకమైన వ్యతిరేక పవనాలు ఉంటాయి సానుకూల పవనాలు ఉంటాయి Co current, counter current thoughts ఉంటాయి అన్ని రకాలు మనం ఏం చేయదలచుకున్నామో అది చెప్పాలి ఏం చెప్పామో అది చేయాలి దానికి కావలసిన శక్తిని గురు నామస్మరణంతో చేసుకోవాలి గురు నామం ఎక్కడ చేయాలంటే దేహంతో చేయాలి మానసికంగా చేయాలి మరణం చేయాలి మరణాత్ రాయతే ఇతి మంత్రః రామా రామా అంటే అది మంత్రం అయిపోతుంది కాబట్టి సాయిరామ నామ స్మరణాంచితమైన దేహులుగా మనం గనక అన్నివేళలా ఉండగలిగినట్లయితే ఒక రోటికే చిక్కిన వాడు మనకు చిక్కడా చిక్కుతాను అని చెప్తున్నాడు ఆయన కానీ మన మన ధర్మాలు మనం నిర్వర్తించినప్పుడు సమాజ ధర్మం వ్యక్తి ధర్మం కుటుంబ ధర్మం వీటన్నింటిని సమూలై ఉండమన్నాడు నా యందు విశ్వాసంతో ఉండమన్నాడు విశ్వాసం లేకపోతే పరమేశ్వరుడు ఎదురుగా నుంచున్నా అవునో కాదో అనిపిస్తుంది విశ్వాసం ఉంటే బొమ్మే దేవుడని అనిపిస్తుంది చూశారా అది బొమ్మే మనం కట్టించుకొచ్చిన ఫ్రేమే Selection అంతా మనదే photo selection దగ్గర నుంచి పేపర్ దగ్గర నుంచి దాని దండ దగ్గర నుంచి Selection మనం చేశాం కానీ అది ఒట్టి photo అనుకుంటున్నామా లేదే అది ఒట్టి విగ్రహం అనుకోవటంలా దాని వెనుక ఉన్నటువంటి చైతన్యానికి నమస్కారం అదే మూర్తిమంతమై వచ్చింది గనక స్వరూపంగా వచ్చింది గనక దాని యందు శిరస్సు నమస్కరించేటువంటి ఒక మనస్సు గనక ఉండగలిగినట్లయితే వారికి నేను లొంగుతానంటున్నాడు యశోదది హంసానంది గోపగోపికలది హంసానంది శకటాసురుడిది హంసానంది శకటం అంటే సుఖం పోతే ముక్తి అని అర్థం చెప్పుకున్నాం అది వేళ మనం మనకు దొరికిన వెన్న ముద్ద అలాగే తృణావర్థం గాలికి పోయేటువంటి ఒక గడ్డిపరక లాగా కాకుండా మూలాన్వేషణ చేసే తాత్విక చింతన గనక మనకు ఉన్నట్లయితే భక్తి ఆవేశం నుంచి సముచితమైన సముదీర్ణమైన సమంచితమైన నిత్య సత్య భావనా సీమలోకి ఒక తత్వంగా ఒక నిర్మలంగా ఒక నిరామయంగా నికేతనంగా నిరంజనంగా చేరగలిగినటువంటి ఒక స్థాయి ఏర్పడుతుందని మనకు లభిస్తున్నది ఇది రెండవది పరమాత్ముడు భక్తసులభుడు అని అందరు రాసేస్తారు ఆయన చెప్పాడు నేను ఎంత సులభుడ్నో నేను అంత అలభుడ్ని నేను ఎంత అలభుడ్నో నేనంత సులభుడ్ని అందుకనే వేదం కూడా పరమాత్ముని గురించి ఒక్క మాట చెప్పింది చివరగా దూరాత్ దూరాత్ అంతికేచ దూరం దూరం అనుకున్నావా నేను నీ నీకంత దగ్గర నా అంత దగ్గర వాడు నీకు లేడు చాలా నాకు దగ్గర నాకు దగ్గర అనుకున్నావా నీ నుంచి ఎంత దూరంగా ఉన్నానో నీకే తెలియదు దగ్గర అనుకోవద్దు దూరము అనుకోవద్దు ఆయన ఉన్నచోట మనం ఆయనలో మనం ఆయనతో మనం ఆయన లేకుండా మనం లేమనేటువంటి తత్వమసి అనేటువంటి పూర్ణమైనటువంటి అధ్యాత్మ పూర్ణాద్వైత భావనలోకి గనక వెళ్లగలిగినట్లయితే భాగవతం మనకి అనేకమైనటువంటి తాత్విక చింతనలకు దోహదం చేస్తుంది కేవలం శ్రీకృష్ణుడి కథ పైకి రమణీయంగా హాయిగా బాగుంది చిన్నపిల్లవాడి చేష్టలుగా కనిపించినా ఏమనిపిస్తున్నది ప్రతి చేష్ట వెనుక ఒక లీల ప్రతి లీల వెనుక పరమేశ్వరుడి యొక్క విభూతి పరమేశ్వరుడి విభూతి వెనుక ఒక దివ్య అనుగ్రహం దివ్య అనుగ్రహం వెనుక ఒక అవతార పరమార్థం అవతార పరమార్థం వెనుక జగత్ కల్యాణం జగత్ కల్యాణం వెనుక జనోద్ధరణం కనుకనే ఆయన జనార్ధనుడు అయినాడు జనార్ధనుడు కాదు జనార్ధనుడు అయినాడు జన అర్ధనుడు అయినాడు దగ్గరగా వచ్చాడు సాలోక్య సామీప్య సాన్నిధ్యాలు ఇస్తూ సాయుజ్యం వైపు నడిపించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి సత్య సాయి భగవానుడికి మరొక్కసారి ప్రణమిల్లుతూ యశోదా హృదయ పరమైనటువంటి హంసానందితో సత్య సాయి భగవానుడికి కైంకర్యం చేయువాక సాయిరాం
SSSMC · audio

Bhagawata Navaneetham - 61

Home

Bhagawata Navaneetham - 61

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 30:05

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

    Now playing
  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67