Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంవేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్ఫురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ వేద ప్రోక్తమై బ్రహ్మర పోతనామాత్య కృతమైనటువంటి శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో కృష్ణలీలా తరంగిణిలో విహరిస్తున్నాం మనం. కృష్ణుడు అంటే కర్షతి ఇతి కృష్ణః ఆకర్షణకి పేరు కృష్ణుడు కృష్ణ నామం వినగానే సౌందర్యం చిలిపితనం లావణ్యం లాలిత్యం మార్ధవం అవ్యాజమైనటువంటి ప్రేమ చివరగా పరిపూర్ణ జ్ఞానం మనకి అనుభవంలోకి వస్తుంది అది కర్షతి ఇతి కృష్ణః అందుకనే ఆబాలరామం అనే మాట లేదు ఆబాలగోపాలం అన్నారు పసిపిల్లవాడి దగ్గర నుంచి వృద్ధాప్యం నూరు సంవత్సరాలు ముట్టిన వాడి దగ్గరికి వాడి వరకు కూడా శ్రీకృష్ణుడి యొక్క లీలలు శ్రీకృష్ణుడి యొక్క శక్తి అవతారం వైభవం పరమానందాన్ని కలిగిస్తుంది గనుక అది ఆబాలగోపాలం అని ఒక అర్థం బాలుడిగా ఉండి యోగీశ్వర కృష్ణుడు అయ్యే దాకా క్షణము కూడా ఆయనది విరామం ఎరుగని పరిపూర్ణ అవతార విధానం అది అంతేకాదు కృషతి ఇతి కృష్ణః ఒక్క క్షణం ఊరుకోని వాడు ఎవడన్నా అవతారమూర్తి ఉంటే ఆయన పేరు కృష్ణుడు అది. ఊరుకున్న క్షణాలు లేవు ఆయనకి. ఊరక ఉండే ప్రయత్నం చేసిన వాడు రాముడు అసలు ఊరక ఉండ-ఉండటానికి ప్రయత్నించిన వాడు కృష్ణుడు అది. Two aspects. ఒకే చైతన్యానికి అది బొమ్మ ఇది పురుషు ఉండాలి చైతన్యం మానవుడు చైతన్యానికి సంకేతం మనమందరం కూడా ప్రతి క్షణాన్ని జీవించాలి ప్రతిక్షణం కాసేపు గడిపేసి కాసేపు నడిపేసి నడిచినప్పుడు గడవనప్పుడు యాతన పడి నడవనప్పుడు భయపడి ఉండేకంటే జీవితాన్ని మనం పరిపూర్ణంగా జీవించటానికే ఇక్కడికి వచ్చాం కృష్ణుడి లాగా అంటే ఒక ఇరుకతో ఒక స్పృహతో ఒక ఆనందంతో ఒక శాంతితో అని అర్థం కర్షతి ఇతి కృష్ణః కృషతి ఇతి కృష్ణః కుషితి ఇతి కృష్ణః కుషి అదే ఉర్దూలో ఖుషి అయింది అంటే శ్రీకృష్ణుడు ఆనంద స్వరూపుడు ఆయనకి ఒక వైరాగ్యం రాముడి లాగా అప్పుడప్పుడు స్మృతి పాత జ్ఞాపకాలు రావటం బాధపడటం అయ్యో ప్రపంచం ఇట్లా అయిపోతున్నది అని అనుకోవటం లేదు ప్రపంచం ఇంతే దీనిలో ఉన్న మంచి వాళ్ళని రక్షించటం కోసం నేను వచ్చాను చెడ్డవాడు ఎవడన్నా ఉంటే వాడిని తప్పకుండా శిక్షిస్తాను అసలు నా అవతార పరమార్థమే ఇదే అని సర్వ జగత్తుకి ప్రకటించినటువంటి వాడు గనుక పరమేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యలీలా గాథా తరంగిణి భాగవతం అయితే అనేకమంది భక్తులు అనేకమంది భాగవతులు వాళ్ళంతా మనకి దశమ స్కంధంలో తర్వాత తర్వాత ప్రవేశిస్తారు ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా బాల్యక్రీడలు అసలు బాల్యక్రీడలు మనోభిరామంగా ఉంటాయి హృదయంగమంగా ఉంటాయి గుండెను తాకుతూ ఉంటాయి ఎప్పుడైనా మన ఇంట గనుక ఒక పిల్లవాడు మగ పిల్లవాడు గనుక పుడితే వాడు మన కృష్ణుడి లాగా ఉంటే బాగుండు అనిపిస్తుంది పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు మా పిల్ల కృష్ణుడే రాముడైతే బాగుండు అనిపిస్తుంది అంటే రెండు రామకృష్ణ అవతారాలు అభేద అద్వితీయ అద్వైత మనోజ్ఞమైనటువంటి పూర్ణావతారాలు కాబట్టి రెండింటికీ నమస్కరిస్తూ ఇవాళ చాలా అతి పవిత్రమైన అతి విశేషమైనటువంటి రోజు భాగవతంలోకి వెళ్ళటానికి ముందు కొన్ని విషయాలు మనం అనుకోవాలి కలియుగం అంతా కూడా దత్తాధీనం పన్నెండు పౌర్ణములు వస్తాయి ఒక సంవత్సరానికి వికృతి నామ సంవత్సరం నుంచి కర నామ సంవత్సరం వరకు వచ్చిన నెలల్లో ఫలానా ఈసారి ఇది ఫాల్గుణ మాసం ఫాల్గుణ మాసానికి ఒక దత్త స్వరూపం అధిదేవత అధిదైవం ఆయన పేరు జ్ఞానసాగరు అది దత్తుడికి అనేకమైన పేర్లున్నాయి సిద్ధ యోగి అని విశ్వాంబరావధూత అని విశ్వంభరావధూత అని అనేక పేర్లు ఉన్నాయి కానీ నెలకి సంబంధించినటువంటి దత్త స్వరూపానికి పౌర్ణమి నాడు దత్తుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ లభిస్తుంది గనుక నెల ఉన్నటువంటి దత్తుడి పేరు జ్ఞానగుణసాగరుడు జ్ఞానగుణసాగరుడు అంటేనే అర్థమైపోతుంది అంతా ఉన్నదంతా జ్ఞానమే మనం విచారణ అంతా చేస్తున్నాం ఏదో కృష్ణుడి కథ చెప్పి కాలం చెల్లగొట్టుకోవటానికే కాదు కదా వెన్న తీసుకోవాలి ఆనందాన్ని అనుభవించాలి లోలోతులకు వెళ్ళాలి స్పృశించుకోవాలి స్పర్శించుకోవాలి విమర్శించుకోవాలి తడుముకోవాలి అనుభవాన్ని పొందాలి అనుభూతిని చందించుకోవాలి విభూతి అయినటువంటి పరమ చరమ స్థాయికి చేరాలి ఇది మానవ జీవితానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం అది రామ పరమా కృష్ణ పరమా సాయి పరమా పరమైతే పరమై ఉండాలి అంతే పరమై ఉన్నటువంటి వేళ దానికే పరవశం అన్నారు పరవశం అంటే అధిక ఆనందాన్ని ప్రదర్శించటం కాదు పరా ఈశ్వరుడికి వశమై ఉండాలి పరవశమైనటువంటి వేళ మన మనస్సులు పల్లవిస్తాయి మనకి అనేకమైనటువంటి అమృత భావనలు కలుగుతాయి అమృత భావనలు కలిగేటువంటి దివ్య క్షణాలు ఏవి అంటే ఇదిగో ఫాల్గుణ మాసపు పౌర్ణిమఅయితే ఫాల్గుణ మాసపు పౌర్ణిమ వైజ్ఞానిక పరంగా చూసినట్లయితే ఏదో ఉత్పాతాలు జరుగుతాయని జపాన్ లో జరిగేదానికి ఇవాళ చంద్రుడికి సంబంధం ఉందని అనుకుంటున్నారు కానీ దీనికి దానికి సంబంధం లేదు. అది భౌగోళికంగా ఏర్పడినటువంటి ఒక ఉత్పాతం అది ఒక సహజ క్రీడ ఎందుకంటే స్వామి అంటారు హాయిగా చేస్తారు తీరిగ్గా అనుభవిస్తారు మంచైనా చెడైనా కాబట్టి గత చరిత్ర వాటన్నింటిని చరిత్రకారులు చూసినట్లయితే ఇవాళ ఉన్నటువంటి వారు జాతి అనుభవించవలసిన దానిని అనుభవిస్తున్నారు అంతే. అలాగే మనమైనా అంతే పుణ్యం చేశాం మంచి ఆలోచనలు చేశాం మంచి వాళ్ళతో ఉన్నాం ఇలాగే అన్ని వేళలా అన్ని సాయంకాలాలు స్వామి పరం చేసుకున్నాం మనకు దుఃఖం ఎక్కడుంది లేదు. లేదు అప్పుడప్పుడు స్వామిని మర్చిపోయినాం దేవుడు లేడనుకున్నాం వీడేం నాకు అక్కర్లా రాలేదనుకుంటున్నాం మనం అనుకున్నట్లుగా జీవితం నడవనప్పుడల్లా పటాలు తిప్పేశాం ఆయన తిప్పి మొహం తిప్పుకొని ఆయన వెళ్ళిపోతాడు మనం ఆయన్ని చూస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు ఇది పరస్పరమైన అటువంటి పరస్పర ఆశ్రయమైనటువంటిది అందుకే స్వామి చాలా నిర్ద్వందంగా ఒక మాట చెప్పారు "భక్తులు లేక భగవంతుడు లేడు" రోజూ కీర్తించాలి ఆయన విశేషాలు చెప్పుకోవాలి పునః పునః చెప్పుకుంటే భగవంతుడి తత్వము నందు మన యొక్క హృదయం ప్రవేశించి మనకు ఆనందాన్ని కలిగిస్తుంది గనుక దేవుడున్నాడు దేవుడున్నాడు దేవుడున్నాడు అనుకోమన్నారు. స్వామి పంచాక్షరి చెప్పండి అని అడిగితే పంచాక్షరి అంటే ఓం నమశ్శివాయ అని చెప్తారని అందరు అనుకున్నారు ఏం లేదు బంగారు దేవుడున్నాడు అనుకో అదే పంచాక్షరి అని. అవి నిజానికి ఐదు అక్షరాలే దేవుడున్నాడు అంతే దేవుడు ఎవరు రాముడా కృష్ణుడా నీ ఇష్టం నువ్వు పేరన్నా పెట్టుకో నాకేమీ అభ్యంతరం లేదని కూడా అన్నారు స్వామి. కాబట్టి ఈరోజు పూర్ణిమా మాలికలో ఫాల్గుణ మాసం పండిన ఎండిన ఆకులన్నీ నెమ్మదిగా రాలిపోయే సమయం ఇది మళ్లీ చిగురాకులు మోసులెత్తే సమయం రాబోతున్నది వసంత కాలం ఆగమించబోతున్నది వసంత కాలంలో సర్వ ప్రకృతి కూడా పురుషోత్తముడికి కంకణ్యం చేయబోతున్నది తనను తాను అలంకరించుకోబోతున్నది మోడువారిన చెట్లన్నీ చిగురిస్తున్నాయి కోయిలలన్నీ కంఠాలు సవరించుకుంటున్నాయి ఎక్కడెక్కడో చిగురాకుల వెనక దాగి చిగుళ్ళు తిని తమ కంఠానికి ఒక మాధుర్యాన్ని మెత్తదనాన్ని అందించుకుంటూ పరమ ప్రకృతిని పరమ ఆవేశంతో పరమానందంతో ఉద్వేగంతో ఉత్సాహంతో ఆహ్వానం పలుకుతున్నది గనుక రాబోయేటువంటి ఉగాది సందర్భంగా మీ అందరికీ ఇవాళే శుభాకాంక్షలు మంగళ శాసనం చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో దూరం లేదు అది లేపా ఎల్లుండా అంటే వసంత కాలానికి మనం అటు అభిముఖంగా వెళుతూ ఉన్నాం వెళుతూ వెళుతూ ఫాల్గుణ మాసంలో ఉన్నటువంటి జ్ఞాన సాగరుడు అయిన దత్తాత్రేయుడి యొక్క దివ్య అనుభవం అనుగ్రహం మనందరికీ కూడా పూర్ణంగా కలుగుగాక. ఎవడు దత్తాత్రేయుడు? సత్య సాయి భగవానుడే దత్తాత్రేయుడు ఎందుకని అంటే అసలు స్వామే దత్త స్వరూపం అది దత్త స్వరూపం అంటే దత్తుడు అంటే మహాస్వామి చెప్పారు కంచి పరమాచార్య. జగత్తుని దత్తత తీసుకున్న వాడు దత్తుడు అది ఒక అర్థం ఒక భాగం అది జగత్తుకి అంకితమైన వాడు దత్తుడు స్వామి అందుకనే జగత్తుని దత్తత తీసుకున్నారు తన అవతారాన్ని జగత్తుతో అనుసంధానం చేశారు కనుక దత్త అవతారాలలో ప్రప్రథమ పూర్ణావతారం ఏది అంటే షిరిడి బాబా ఎలా చెప్పుకోవాలో రెండవ మహా పరిపూర్ణావతారం ఏది అన్నప్పుడు చక్కగా హాయిగా సత్య సాయి భగవానుడే ఎందుకనంటే కలియుగంలో పాప శాప తాపాలతో ఉన్నటువంటిది గనుక అనేక ఉద్వేగాలకి లోనయ్యేది గనుక అనేక విభ్రమాలకి ఆశ్చర్యాలకి లోనయ్యేది గనుక అన్నీ ఉన్నా అశాంతిని ఆశ్రయించే కాలం గనుక కలికాలం గనుక ఇక్కడ పరమ పురుషుడు అయినటువంటి జ్ఞాన సాగరుడు అయినటువంటి స్వామి యొక్క దివ్య అనుగ్రహం గనుక ప్రతి వాడికి లభించినట్లయితే ప్రతి హృదయము కూడా శ్రీ దత్తమయం అవుతుంది కాబట్టి సర్వ ప్రకృతి సర్వ సృష్టి పద్నాలుగు భవనాలు కూడా సత్య సాయి ఈశ్వర నామ స్మరణంతో పులకించి పోవు గాక ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన అవతారాలన్నీ కొన్ని కొన్ని ప్రాంతాలకు పరిమితమైన అవతారాలు మన కళ్ళ ముందే నిన్న మొన్న 87 ఏళ్ల క్రితం స్వామి రాకముందు అనుకుందాం షిరిడి మహాస్వామి వచ్చినా ఆయన అవతారం కూడా నిజానికి ఒక ప్రాంతానికి కొంతకాలం పరిమితమైంది కానీ సత్య సాయి భగవానుడు తదనంతర కాలంలో నేను సాయిబాబాను అని ప్రకటించిన తర్వాత కొన్నాళ్లకు కొన్నేళ్లకు షిరిడి బాబా యొక్క జన్మ రహస్యాన్ని బయట బయటపెట్టి షిరిడి నా పూర్వ శరీరమని షిరిడి సాయిగా ఉన్నది నాదేనని దాని కొనసాగింపే నేనుగా ఇవాళ వచ్చానని ప్రకటించిన తర్వాత చరిత్ర జాగ్రత్తగా గమనిస్తే ఆంధ్రదేశంలో మూడు చోట్ల చిన్న దేవాలయాలు ఉండేవి చిన్న అంటే ఎనిమిది అంగుళాల విగ్రహాలే ఉండేవి షిరిడి బాబా ఒకటి చీరాల మొట్టమొదటిది రెండవది గుంటూరు రెండు నిజానికి గుంటూరు మూడు తెనాలి అంటే ప్రాంతానికే పరిమితమైనవి అయితే షిరిడి బాబా ముస్లిం దైవమని గుళ్ళోకి వెళ్ళొస్తే పంపు కింద స్నానం చేస్తే తప్ప లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు మన పెద్దవాళ్ళు మన రాముడు మన కృష్ణుడు ఉండంగా సాయిబాబా ఏమిటి అని అంటే ఒకనాడు ఆంధ్రదేశంలో రామాలయం లేని గ్రామం లేదు ఇవాళ సాయి రామాలయం లేని గ్రామం లేదు ఎందుకని అంటే ఇది పరిణామ దశ కాలానికి జాతికి యుగానికి దత్తమైనటువంటి పూర్ణమైన శక్తి స్వరూపం ఏంది అంటేసాయి అవతారం అందుకనే షిరిడి సాయి కేవల శివ స్వరూపం సత్య సాయి శివ శక్తి స్వరూపం ప్రేమ సాయి కేవల శక్తి స్వరూపం మన అదృష్టం చూడండి శివ స్వరూపం నాడు ఉండే ఉంటాం లేకపోతే శివ శక్తి నాడు వచ్చేవాళ్ళం కాదు శివ శక్తి నాడు ఉన్నాం గనుక శక్తి రూపంలోనూ ఉంటాం మన వరకైతే దిగులు లేదు మనకి ఇంకొక జన్మ ఉంది వద్దని అనుకోవద్దు ఎందుకని చూద్దాం ప్రేమ సాయిని కూడా ఆయనే చేస్తారు. ఇన్నాళ్ళు ఆయన చేసినవన్నీ చూశాం గా ఆయన ఏమంటున్నారంటే నాకు చిన్న ముచ్చట ఉంది ఎంత సేపు నేను చేయటం మీరు చూడటమేనా మీరు చేయండి నేను చూస్తాను అంటున్నాడు సంసిద్ధం అవుదాం భాగవతం కూడా మనకు నేర్పేది అదే భాగవతం అంటే పరమేశ్వరుడితో అనుసంధానమై ఉండటం మన మనస్సుని అన్నివేళలా దాని యందు నిమగ్నం చేసి ఉన్నట్లయితే ప్రాపంచికమైనటువంటి యాతనలు దూది పింజల వలే తేలిపోతాయి అనేకమైన అననుకూలాలు ఏర్పడినప్పుడు అవే పరిచ్ఛిన్నం అయిపోతాయి అలాగే ఆనందాలు వచ్చినా దానిని జాగ్రత్తగా అనుభవించేటువంటి ఒక నిబ్బరమైన స్థితి మనసుకు ఏర్పడుతుంది ఒక నైర్మల్య సిద్ధి ఏర్పడుతుంది ఒక నైష్ఠిక సిద్ధి ఏర్పడుతుంది పని చేసిన జాగ్రత్తగా perfect గా చేసేటువంటి స్థాయికి మనసు ప్రయాణం చేస్తుంది అలా జరగాలి పని చేసిన perfection కి aim చేయాలి అక్కడి దాకా వెళ్ళాలి ఏదో చేశానులే ఏదో అన్నానులే ఏదో విన్నానులే కాదు ఏది అన్నమో perfect గా అనాలి ఏం విన్నామో perfect గా వినాలి ఎందుకంటే శ్రవణం చూడండి అన్నింట్లోకి ఉత్తమోత్తమమైన సాధన ఏది అంటే శ్రవణమే దివ్యసాధనం శ్రవణంలో ఏమవుతున్నది అన్నీ మరిచిపోతున్నాం వినటం మీద మాత్రమే యోగ స్థితిని నెలబెట్టుకున్నాం గనుక జ్ఞాన సాగరుడు అయినటువంటి దత్తాత్రేయుడు సత్య సాయి భగవానుడు మనందరికీ కూడా పూర్ణమైనటువంటి తద్బుద్ధిని ఒక వికాసాన్ని ఒక విస్తృతమైనటువంటి స్థితిని పూర్ణత్వాన్ని అట్లాగే శూన్యత్వాన్ని అన్నింటినీ కూడా సమంగా అనుగ్రహించు గాక అని అనుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఇదిగో ఉయ్యాలలో నుంచి కాస్త నెమ్మదిగా దిగి దిగి దిగుతూనే అసలు ఉయ్యాలలో ఉంటేనే ఎలా ఉండేదో మరి దిగాలిగా అనుకున్నాం గా ఎప్పుడూ ఉయ్యాలలోనే ఉంటామా? ఆయన ఉండడు మనము ఉండము దిగాలి నేలమీద పడాలి పడాలి అనగానే పడ్డ తర్వాత ఇక్కడ ప్రపంచంతో ఒక బాంధవ్యం పెంచుకోవాలి మనం కాదనుకున్నా అవన్నీ మన చుట్టూ ఏర్పడతాయి స్వామి చెప్పారు ఒక్కటిగా వస్తావు రెండు కాళ్ళతో వస్తావు ఇరవై ఏళ్ళు వచ్చేప్పటికి పెళ్లి చేసుకుంటావు రెండు కాళ్ళు రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు అవుతాయి ఇద్దరు బిడ్డల్ని కంటావు నాలుగు నాలుగు octopus అవుతావు అన్నారు స్వామి అది expansion అంటే స్వామి అలా చమత్కారంగా చెప్తారు octopus అయిపోతాం అనంగానే అమ్మో జాగ్రత్తగా ఉండాలి అన్ని కాళ్ళు నావే కదా నాలో నుంచి వచ్చినవే కదా అసలు నా ఒక్క దానిలో నుంచి ఇన్ని కాళ్ళు పుడితే సహస్ర శీర్షా పురుషః సహస్ర పాత్ సహస్ర అంటే అనేక అనేకానేక్ అని అర్థం వెయ్యి అని మాత్రం అర్థం కాదు కాబట్టి సహస్ర శీర్షములతో సహస్ర పాత్ తో ఉన్నటువంటి పురుషుడు సర్వ జగత్తుని సర్వాధీనం చేసుకొని నడిపించు గాక అని మంగళాశాసనం చేస్తూ పూతన సంహార కాండతో నిన్న మనం పూర్ణం చేసుకున్నాం పూతన మరణించిందని పూతన వధ అని రాయకూడదు మనం ఎందుకంటే పూతన వధింపబడలేదు పూతన ఉద్ధరింపబడింది పూతన మోక్షాన్ని పొందింది ఎలా పొందింది బలి చక్రవర్తి కాలంలో శ్రీమన్నారాయణుని తన తల్లిదండ్రులు వటువుగా ఉండగా హేమ పాత్రలు కాళ్ళు కడుగుతున్నటువంటి వేళ రత్నమాల పేరుతో ఉన్నటువంటి ఆమె చూసింది చూసి ఇటువంటి బిడ్డ ఉంటే వాడికి పాలిచ్చి పోషించుకోవాలి అని ఒక చిన్న కోరిక భగవంతుడు అలాగే అన్నాడు ఆయన అన్నింటికీ అలాగే స్వామి చెప్పారు అవునన్నవారికి yes yes yes అది కాదన్నవారికి no no no వద్దంటే తథాస్తు కావాలి అంటే తథాస్తు ఆయనది ఒకటే తథాస్తు అట్లే అవు గాక అని అర్థం దాని అర్థం అయితే ఎప్పుడైతే తన తండ్రిని పాతాళంలోకి త్రివిక్రముడై తొక్కేశాడో అదే రత్నమాల అంటే అదే బలి కూతురు ఒక మాట అన్నది ఎవరినైతే నేను కని పెంచి పాలించి పోషించాలని అనుకున్నానో అటువంటి వాడికే పాలిచ్చి సంహారం చేస్తాడు నా తండ్రి వాదించాడు అన్నది ఆయన తథాస్తు అలాగే కానీ అన్నాడాయన చంపగలడా? పరమాత్మను ఎవరు చంపగలరు ఎందుకంటే ఆత్మకు చావు లేదు ఆత్మకి పుట్టుక లేదు ఆత్మకి ఎదుగుదల లేదు ఒరుగుదల లేదు ఏదీ లేదు కాబట్టి ఏమీ లేని దానిని ఏమీ చేయలేము ఆత్మ పరిస్థితే ఇదైతే ఇహ పరమాత్మ పరిస్థితి ఏమిటి అని ప్రశ్న అందుకే నిన్న వేదవ్యాసులవారు మన పూతనామాత్యుడు ఒక మాట అన్నారు విషమిచ్చిన పూతనకే ఇంత దివ్యధామం దొరికితే అమృతతుల్యమైనటువంటి ప్రేమతో రంగరించినటువంటి స్తన్యమిచ్చిన యశోద పరిస్థితి ఏమిటి అసలు ఆమెకు ఏం దొరుకుతుంది అని ఏం దొరకాలో దొరికింది దొరకటం దొరకటమే పరమాత్మ దొరికాడు ఇంకేం కావాలి పరమాత్మని సాకింది పెద్దవాడిని చేసింది మరి సాకిన తల్లి తల్లులందరికీ కూడా ఉదాహరణ తప్పదు తధ్యం అందుకనే స్వామి కూడా అవతారంలో చూడండి కరుణంసుబ్బమ్మ మీద అధి కాధికమైన ప్రేమ చూపించేవారు స్వామి ఆమెకున్న దానం ఆమెకున్నటువంటి ఓర్పు సహనం ఆమెకున్నటువంటి ఔదార్యం స్వామి పట్ల అనన్య భక్తి జ్ఞానాధికమైన భక్తి ఆమె ఎన్నడూ స్వామిని ఒక పిల్లవాడిగా మానవుడిగా ఆవిడ చూడలే అసలు చూట్టమే దైవమే ఇలా వచ్చింది చాలా ఆశ్చర్యం అంటే స్వామి కరుణంసుబ్బమ్మగా తెచ్చుకున్నారు ఆయన.ఒక తల్లి ఉండాలి ప్రపంచంలో కనటానికి ఒకరు కనుగొనటానికి మరొకరు. కనుగొన్న తల్లి ఈశ్వరమ్మ అలాగే కనుగొన్న తల్లి ఎవరంటే యశోద. కన్నది ఎవరంటే దేవకి. మురిపాలు, ముద్దులు, ఆనందాలు కాస్త ఆ-ఆ ఎదుగుదలలో ఉన్నటువంటి మాధుర్యాలు అనుభవించింది ఎవరు అంటే యశోదే. యశోదకు కూడా ఆవిడ జన్మ కూడా చాలా గొప్ప జన్మ. అది కూడా వరంతో కూడినటువంటి జన్మ కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మగా అక్కడకు చేరి ఆమెకు ఉద్ధారణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. బాల్య క్రీడా వర్ణనలోకి వెళ్లే ముందు ఆయన ఇంకో రెండు పనులు చేశాడు. నవనీతం అంతరార్థం కోసం రెండు స్థూలంగా చెప్పుకుందాం. ఒకటి శకటాసుర వధ. శకటాసుర వధ ఎలా జరిగింది అంటే యశోద పిల్లవాడితో ఆడుకుంటూ ఉన్నది. యశోద, రోహిణి ఇద్దరూ కూడా పక్క పక్కన కూర్చొని ఏవో కబుర్లు ఆడుతూ పిల్లవాళ్ళు ఇద్దరు మన కళ్ళ ముందు చక్కగా పెరుగుతున్నారు, ఎంత హాయిగా ఉన్నారని అనుకుంటూ ఉన్నటువంటి వేళ బాలకృష్ణుడు కాస్త దొర్లుకుంటూ అట్లా వెళ్ళాడు. దొర్లుకుంటూ వెళ్తే అక్కడ ఒక బండి ఉన్నది. బండికి ఆయన బొటనవేలు తాకింది. తాకగానే ఒక్కసారి రెండు ముక్కలైపోయింది. బండి ముక్కలైపోయింది, దానిలో నుంచి ఒక శకట అసురుడు బయటకు వచ్చాడు. రాక్షస సంహారం జరిగింది అక్కడ కూడా. అది రెండవది. అయితే అది కథ. ఓ-ఓ రాక్షసుడు వచ్చాడు బాలకృష్ణుడి చేతిలో వాడు పోయినాడు. అది మనందరికీ తెలిసిందే. అసలు శకటము అంటే ఏమిటంటే అంటే సుఖం, కటము అంటే కట్ అయిపోవడం, నశించిపోవడం. సుఖం నశిస్తే తప్ప ముక్తి దొరకదు. ముక్తి అంటే ఏమిటి? సుఖము, సంతోషము, ఆనందము మూడు మాటలున్నాయి. సుఖము అనేటువంటిది మంచి AC లో మంచి ఎండవేళ హాయిగా అది వేసుకుని పరుపు మీద పడుకుని ఎవడు మనల్ని disturb చేయకుండా ఉంటే దాని పేరు సుఖం. సంతోషం ఏమిటి? మనకు కావలసింది తృప్తిగా కడుపునిండా తిని ఇక చాలు అనేదాకా తిని కాస్త ప్రయాసపడి ఆయాసాన్ని తెచ్చుకుని దానిలో కూడా ఆనందాన్ని అనుభవిస్తే దాని పేరు కాస్త సంతోషం. సుఖము, సంతోషం రెండు వస్తువులకు సంబంధించినవి. ఇక ఆనందం ఉన్నదే అది తలచుకొని, తలచుకొని పొందేది ఆనందం. స్వామిని ఒకసారి చూశాం ఎప్పుడో యాభై ఏళ్ళ నాడు చూశాం అనుకుందాం. తలచుకుని, తలచుకుని ఆయన్ని మొదటిసారి ఎలా చూశామో ఇవాళ్టికి కూడా అనుకుంటాం. మధ్యలో కొన్ని వేల సార్లు చూసి ఉండొచ్చు. మొదటిసారి చూసిన ఆ-ఆ చూపు ఉన్నది చూడండి. నిన్న చూచి, తలచి, పులకించి, అబ్బురపడి ఎంత అందమైన మాటలవి. స్థాయిలన్నీ అనుభవిస్తూ వచ్చాం కానీ ఏం చేశామంటే మొదట్లో చూశాం. చూసినప్పుడు ఆనందానుభూతి కలిగిందో అది కేవలం మనుష్య ఆనందం. మనుష్య ఆనందం నుంచి మనీషానందానికి వెళ్ళాలి. మనీషానందం అంటే ఆనందాన్ని ఇంకొక వ్యక్తితోనైనా పంచుకునే ఆనందం పేరు మనీషానందం. మనీషానందంలో నుంచి ఒక గాంధర్వ ఆనందంలోకి వెళ్ళాలి. ఎందుకంటే మనందరం కూడా ఒక గాంధర్వ స్థితిలో వచ్చాం. ఎందుకు? ప్రతి వారికి ఒక ప్రజ్ఞ ఉంది. ఏదో ఒక ప్రజ్ఞ. ప్రజ్ఞ లేకుండా జీవుడు లేడు. దానికి గాంధర్వ విద్య అని పేరు పెట్టారు గనుక అది గాంధర్వ ఆనందం. బాగా బొమ్మ వేసేవాడున్నాడు, బాగా పాడేవాడున్నాడు, బాగా ఆడేవాడున్నాడు. వీళ్ళందరికీ కొన్ని ఆనందాలు ఉన్నాయి. ఆనందం గాంధర్వ ఆనందం అది. గాంధర్వ ఆనందంలో నుంచి మానవ గాంధర్వ ఆనందంలోకి వెళ్తాడు వాడు. మానవ గాంధర్వ ఆనందం అంటే మా-నవ. నేను కొత్త కాదు, నేను చాలా పాతవాడిని. ఆనందమంతా నేను ఎక్కడినుంచో తెచ్చుకున్నాను అన్నటువంటి మానవ గాంధర్వ ఆనందంలో చుట్టూ ఉన్నవారికి కొంత ఆనందం కలిగిస్తాడు. మానవ గాంధర్వ ఆనందంలో నుంచి ఒక ఉదాత్త స్థాయికి వెళ్తున్నప్పుడు దేవ గాంధర్వ ఆనందము అని మరొక స్థాయిని అందుకుంటాడు వాడు. దేవ గాంధర్వ ఆనందంలో దివ్యమైనటువంటి తన ఆత్మ యొక్క కదలికలాగా కేనోపనిషత్తు చెప్పినట్టుగా ఇంద్రియాల యొక్క చలనాలు, స్పందనలు, దేనికి ఎక్కడి నుంచి అంటే ఆత్మ యొక్క సంచలనాలేవన్నీ. ఆత్మ అటూ ఇటూ ఒక చిన్న command ఇచ్చిన కారణంగా పుదుపట్టి వెళ్దాం, షిరిడీ వెళ్దాం, తిరుపతి వెళ్దాం అని అంటున్నది ఎవరు? అనిపిస్తున్నది ఎవరు అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ. సంచలనం కారణంగా అనేకమైనవి జరుగుతాయి గనుక అది గా-మానవ గాంధర్వ ఆనందాన్ని దాటి దేవ గాంధర్వ ఆనందము అన్నారు. దేవ గాంధర్వ ఆనందం తర్వాత ప్రజాపిత ఆనందము అని ఇంకొక ఆనంద రేఖ ఉంది. ప్రజాపిత ఆనందం అంటే ప్రజాపిత అంటే బ్రహ్మ. బ్రహ్మమే సృష్టిగా, సర్వ జగత్తుగా ఉన్నది గనుక మన కదలిక చేత, మన మెదలిక చేత, మన ప్రవర్తన చేత, మన ఉనికి చేత, మన అస్తిత్వం చేత, మన వ్యక్తిత్వం చేత, మన జీవన విధానం చేత సర్వ జగత్తుకి ఆనందం గనుక కలిగించినట్లయితే దాని పేరు ప్రజాపిత ఆనందం అది. ప్రజాపిత ఆనందంలో కూడా ఎక్కువ కాలం ఉండటానికి వీల్లేదు. పితృపిత ఆనందానికి వెళ్ళాలి. ప్రజాపితకు పితృడు ఒకడున్నాడు. పితృడు ఎవరంటే సకల మూలమైనటువంటి సదాశివుడున్నాడు. సదాశివ శబ్దము మహోన్నతమైనటువంటి శబ్దం. మనందరికీ మూడు మూర్తులు అలవాటు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తులంటాం. త్రిమూర్తులు మాత్రమే కాదు పంచమూర్తులు వాళ్ళు. పంచమూర్తులు ఎవరు అంటే ఇదిగో బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, ఈశ్వర, సదాశివ. సదాశివ స్థాయికి వెళ్ళినటువంటి వాడు పూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు గనుక అది పితృపిత ఆనంద రేఖ అన్నారు. ఆనంద స్థాయికి వెళ్ళినటువంటి వాడు పరమ చరమమైనటువంటి హిరణ్యగర్భ ఆనందానికి వెళ్ళాలి.హిరణ్యగర్భానందానికి ఉదాహరణ ఏమిటి? సత్య సాయి భగవానుడే హిరణ్యగర్భానందానికి సంకేతం. ఆయన్ని చూడండి లక్ష మంది రానివ్వండి ఒకే ఆనందం, ఎవ్వడూ లేడనుకోండి ఒకే ఆనందం. అంటే స్థితిలో మార్పు లేదు, ధృతిలో మార్పు లేదు, ధృతిలో మార్పు లేదు, గతిలో మార్పు లేదు. మార్పు లేదో, దేనికి చలించటం లేదో, కానీ అన్నింటినీ చలింపజేయగలుగుతున్నారో, దేనివలన ఆనందాన్ని పొందటం లేదో, అన్నింటికీ తాను ఎట్లా ఆనందాన్ని ఇస్తున్నాడో, ఇదంతా హిరణ్యగర్భ ఆనందానికి సంకేతం. ఆయన్ని చూడగానే మనకు ఆనందం కలగటం ఏమిటి? మరి మిగతావన్నీ అన్నీ చూస్తున్నాం కదా కొన్ని వేల లక్షల దృశ్యాలు చూస్తున్నాం ఆనందం కలగటం లేదే. అది హిరణ్యగర్భ ఆనందం అంటే అది absolute purity. శుద్ధ చైతన్యాన్ని సాకారంగా దర్శనం చేస్తున్నాం కనుక మనకు కూడా దానిలో నుంచి వచ్చిన ఆతాను ముక్కలమే గనుక మనకి దానితో అనుసంధానం అయినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది అని అర్థం. కాబట్టి హిరణ్యగర్భ ఆనందం కొని తెచ్చుకునేది కాదు ఉన్నదే, మరిచిపోయాం. మరి మరిచిపోయిన దాన్ని ఎలా పట్టుకోవాలి అని, గురువు వచ్చి గుర్తు చేస్తాడు. గురువు పని అంతే, గురువు ఏమీ చేయడు. వచ్చి, "ఇదిగో నాయనా! నువ్వు హిరణ్యగర్భ ఆనందాన్ని పొందు" అని చెప్తాడు. శ్రీకృష్ణుడి యొక్క బాల్య క్రీడ అంతా కూడా హిరణ్యగర్భ ఆనందానికి సంబంధించిందే. మాటలు లేవు గాని చేతలన్నీ లీలలన్నీ కూడా పరమాత్మని కైవసం చేసుకునేటువంటి దివ్య జీవనమైనటువంటి భక్తి మార్గంగా ఒక ఉపాయనంగా వేదవ్యాసులవారు, పోతనామాత్యులు మనకు ఆవిష్కరిస్తారు. కాబట్టి శకటము అంటే సుఖం నశిస్తే తప్ప, సుఖం పట్ల అపేక్ష నశిస్తే తప్ప, సంతోషాల పట్ల ఒక నియంత్రణ లభిస్తే తప్ప, హిరణ్యగర్భ ఆనందాన్ని అందుకుంటే తప్ప ముక్తి లేదు అని అర్థం. ముక్తి, దేని నుంచి ముక్తి కోరుతున్నాం? మనకు అన్ని కావాలి కానీ ముక్తి అడుగుతున్నాం. అన్నింటితో పాటు జరిగేది ముక్తే? అన్నీ వదులుకోగలిగితే మిగిలేది ముక్తి. దేన్ని వదిలిపెట్టాం? దేన్నీ వదిలిపెట్టలేం. కదా. అన్నీ మన దగ్గర మూటలు పెట్టుకున్నాయి. మూట మూట మూట. మూటల మధ్యలో కూర్చుని నా ముక్తి కావాలి అంటున్నా. మూటలన్నీ విప్పు, మూటలన్నీ కాదనుకో, అప్పుడు అదే విముక్తం. భగవాన్ రమణ మహర్షి కూడా చాలా అందంగా ఆయన జ్ఞానైక స్థాయిలో మాట అన్నారు. దేని నుంచి ముక్తి? దేహముగా కనబడుతున్నటువంటి నేను పట్ల ఉన్న అహంకారం వదులుకోగలిగితే అది నిత్య ముక్తి అన్నారు. దేహాత్మ భావన విడనాడాలి. మనందరం దేహమే నేనుగా, నేనే నేనుగా భావన చేస్తూ జీవితం కొనసాగిస్తూ ఉంటాం. నేనుని నడిపిస్తున్న ఒక నేను ఉన్నదన్న స్పృహ అది అమదానందాన్ని అమలినమైన ఆనంద స్థాయిని మనకి అందింపజేస్తుంది గనుక అక్కడ శకటాన్ని భంగం చేశాడు ఆయన. భంగం చేసి ఎలా పడుకున్నాడంటే విరిగిపోయినటువంటి చక్రాల మధ్య పడుకొని ఉన్నాడు. ఇరుక్కుపోయినట్టుగా పడుకొని, ఇరుక్కుపోయిన వాడు ఏడవాలి కదా, ఆనందిస్తున్నాడు అట. హాయిగా కాళ్ళు ఊపుతూ ఆనందిస్తున్నాడు. అది చూసింది యశోద. చూసి, మళ్ళీ పిల్లవాడికి మళ్ళీ మాయలో పడిపోయింది. వాడికి ఏదో దృష్టి దెలింది, ఏదో గ్రహాలు ఆవరించినయ్, పిశాచాలు వీడి చుట్టూ తిరుగుతున్నాయి అనుకున్నదే తప్ప, వీడి బొటనవేలు తాకటం ఏమిటి? బండి విరిగి కింద పడిపోవటం ఏమిటి? దాంట్లో నుంచి రాక్షసుడు రావటం ఏమిటి? ఆమె ఊహకి అందనిటువంటి స్థితి అది. స్థాయికి వెళ్ళటానికి తల్లి పట్ల కూడా పరమాత్మ అనేకమైన సన్నివేశాలు సృష్టించాడు. అయితే మాయావరణ ప్రభావం చేత, యోగమాయ ప్రభావం చేత అంతకంటే తెలుసుకునే అవసరం యశోదకి లేదు గనుక పరమాత్మ స్మృతి విస్మృతి రెండు కలిగిస్తూ, అంటే మనం తెలుగులో మరపు తరపు అంటాం. వీడు నా బిడ్డ కాదేమో, దేవుడేనేమో అని ఒక్క క్షణం. అమ్మో దేవుడైతే నాకు వద్దు, నాకు నాకు బిడ్డగా ఉంటే చాలు అని రెండు. అది మరపు తరపు. దేవుడిగా ఉంటే పూజ చేయాలి, బిడ్డగా ఉంటే ఆడుకోవచ్చు హాయిగా. ఆమె కోరుకున్నది ఏమిటంటే బిడ్డతో సహజ వాత్సల్యాన్ని కోరుకున్నది. అందుకనే వాత్సల్య భక్తిలో యశోద పరిపూర్ణమైనటువంటి స్త్రీమూర్తి. పరమాత్మ స్వయంగా తన బిడ్డ అయినప్పటికీ కూడా పరమాత్మ భావన నాకు అక్కర్లేదు, నాకు మా బాలకృష్ణుడే కావాలని కోరుకున్నది గనుక అదే ఇచ్చాడాయన. ఇందాక అన్నాం కదా, మనం ఏం కావాలంటే తధాస్తు. స్వామికి దండం పెట్టుకు వెళ్లాను, పరీక్ష బాగా రాశాను అంటాడు. దండం పెట్టినప్పుడు ఆయన తధాస్తు అన్నాడు అందుకే నువ్వు బాగా రాశావు అని అర్థం. అది, రాసింది నువ్వే కానీ రాయించిన వాడు ఒకడు ఉన్నాడు. వాడిని గమనిస్తూ ఉన్నట్లయితే శకటాసుర సుఖాన్ని వదులుకోవాలి ముక్తిని పొందాలి.
SSSMC · audio

Bhagawata Navaneetham - 59

Home

Bhagawata Navaneetham - 59

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 29:00

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

    Now playing
  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67