No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. త్రియాతీత పదస్థితాంశ కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్త్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం. ఆలంబెన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పురతాం. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ అప్పుడిక కావ్యకరణ దక్షుండై అంటే ఇక నేను రాయబోతున్నాను ఈ శక్తులని అటువంటి వాడు అమ్మవారిని పిలిస్తే అమ్మవారి శక్తి వస్తుంది. మనం స్వామిని పిలిస్తే స్వామి రావట్లా వచ్చారుగా కొన్ని వందల సార్లు వచ్చారు వస్తూనే ఉంటారు ఆయన. కాబట్టి మనం పిలిచే పిలుపును బట్టి వారి రాక ఉంటుంది అంతే తేడా. ఇక వచ్చేసింది అనుకున్నాడు ఈ పుస్తకాన్ని రాస్తే ఏమవుతుంది ఏం చేద్దాం అనుకున్నాడు ముందే నిర్ణయం చేసుకోవాలి చేశాక ఏ రాజు గారి దగ్గరికి వెళ్దాం మా బావ శ్రీనాథుడు ఇస్తే వాడి చేతిలో పల్లకిలో పెడదామా లేకపోతే మనమే ఓ ఆవునో ఎద్దునో పట్టుకొని తీసుకెళ్దామా అనుకోలే ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాపి కాలు చేత మెటపోతలం పడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. ఏదో రాజు గారికి ఇచ్చి వాడు ఇచ్చే సొమ్ములు గ్రామాలు ఏవో అవి వస్తువులు తీసుకొని చివరి చిట్టచివరికి ఎముడి చేతిలో పడిపోయి వాడు సమ్మెట పోట్లు పెడుతుంటే ఏరా నువ్వు దుర్గమ్మ దుర్గాదేవిని సరస్వతిని లక్ష్మిని ఉపాసన చేసి ఓ కావ్యం రాసి తీసుకెళ్లి పుస్తకాలు అమ్ముకున్నావా అందుకని నరకంలో ఇక్కడ ఉండని వాడి చే దెబ్బలు పడే కంటే సమ్మతి దృఢమైనటువంటి నిశ్చయంతో అది నిశ్చితం అంటే మనీషా అంటాం ఆ నిశ్చితమైనటువంటి భావంతో శ్రీహరికి ఇచ్చి స్త్రీలను ఉపాసన చేశాను గనుక శ్రీహరికి ఇచ్చేస్తాను అన్నాడు. ఈ బమ్మెర పోతరాజు ఒకడు ఎంతమంది పుట్టారో అందులో వీడొకడు అన్నట్లుగా చూశారా అద్వైత భావన వచ్చేసింది ఆయనకి హృదయం రాగరంజితం అందుకనే ఇది భాగవత నవనీతం అయింది. ఆ నవనీతం వెన్నను కొయ్యటం తేలిక కట్టవా? చాలా తేలిక కొయ్యటం అంటూ ఉంటుందా అసలు కత్తి కంటే తేలిక చిన్న చాకు గనుక వెన్న మీద అట్లా పెడితే frozen కాదు frozen అయితే కొయ్యాలి frozen కానిది హాయిగా కత్తి నెమ్మదిగా దిగెట్లా వస్తుందో అట్లా వస్తుంది అప్పుడు చెప్తూ ఉన్నాడు కానీ ఒక మాట చెప్పాడు ఇది సార్వకాలికమైన విశ్వజనీనమైనటువంటి మాట. ప్రతి తల్లి భారతదేశంలో తల్లిదనాన్ని పొందిన తల్లి తల్లి కావలసిన తల్లి. జీవుడుగా పుట్టి సాధకుడై భాగవతోత్తముడై భక్తుడై పరమాత్మను చేరుకోవాలనే భావన కలిగిన వాడికి గొప్ప ఉపదేశం చాలా అచ్చ తెలుగు మాటల్లో చతులా రంగ శివుని పూజింపడేని నోరు నొంగ హరి కీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని. ఈ మూడు చేయకపోతే కలుగనేటికి తల్లుల కడుపు చేటు. కాబట్టి శివపూజ చెయ్ అంటే ఈశ్వర పూజ చెయ్ పరమాత్మను పూజించు చేతులు నొప్పి పుట్టేదాకా నోరు నొప్పి పుట్టేదాకా పరమేశ్వరుడి యొక్క గుణగానాన్ని సంకీర్తనం చెయ్ అలాగే దయయు సత్యంబు లోనుగా తలపడేని లోపల లోలోతులుగా తలచుకొని నీవు ఆ దయను ప్రకటించు తప్ప జాలితోనో సానుభూతితోనో ఇంకొకడికి సహాయం చేయకు. స్పందన ఇమ్మీడియేట్ గా ఉండాలి ఎవరన్నా మనల్ని ఏదన్నా అడిగారు మనం చేయగలిగింది ఉంటే వెంటనే చేసివేయాలి చేయలేనిది ఉంటే టైం తీసుకునైనా చేయగలిగితే చేయాలి మళ్ళా ఆ టైం వస్తే. అలా గనుక కాకపోయినట్లయితే కలుగనేటికి పుట్టి ఏం ప్రయోజనం తల్లుల కడుపు చేటు ఆ తల్లుల కడుపు ఆ భారం చేయటానికి తప్ప వీడు ఎందుకు పుట్టాడు అంటే ఇది చేయొద్దు ఇలా చేయండి అని చెప్తూ మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపః ఫలంబున కొన్ని వేల జన్మలు ఎత్తానన్నాడు బమ్మెర పోతరాజు ఇది ఇప్పటికిప్పుడు డైరెక్ట్ గా రాలేదన్నాడు శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలుండనై ఒక్క రాకానుశా కాలంబున సోమోపరాగంబు రాక కని సజ్జానుమతంబున అందరితో మంచివాళ్ళని చెప్పేసి ఇలా రాయబోతున్నానని అభ్రం కశ శుభ్ర సముత్తుంగ భంగయగు గంగకుంజని కృంకులిడి వెడలి మహనీయ మంజుల పునిలతల మండప మధ్యంబున మహేశ్వర ధ్యానంబు చేయుచు ఇందాక చెప్పిన-చెప్పామే మహేశ్వర ధ్యానం ఎప్పుడు చేశాడు ఇటువంటి వేళ ఇటువంటి రోజున ఆయన మహేశ్వర ధ్యానంలో ఉంటే రాముడు వచ్చాడు అని చెప్పుకున్నాం ఆ రాముడు ఎలా వచ్చాడో చాలా అందంగా చెప్తున్నాడు భాగవతంలో అవతారిక పద్యాలలో పూర్ణమైనటువంటి భక్తి యోగాన్ని ప్రతిపాదన చేస్తాడు భక్తి యోగంలో నుంచి జీవుడు ఎలా ముక్తుడు కావచ్చో చెప్తాడు. రాముడు మనకి వచ్చిన వాడు రాముడని తెలిసిపోయింది ఆయనకి ఇంకా తెలీదు ఎవరికి రాసిన పోతనకి. మెరుగు చెంగట నున్న మేఘంబు కైవడి ఉవిడ చెంగట నుండ నుప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలసువాడు వల్లీయుత తమాల సుమతీజము భంగి బలువిల్లు మూపున వరహువాసన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు కుందరీకము బోలు కన్నుల వాడు ఎడదగురము వాడు విపుల భద్రమూర్తి వాడు రాజముక్షుడు ఒకరుండు నా కనుగవకు ఎదుర కానబడియే నా కళ్ళెదుట చక్కగా కనిపించాడు ఎలా ఉన్నాడు ఎవరో మెరుపు మేఘం కూడి ఉన్నట్టుగా ఆ మెరుపు మేఘం ఎవరయ్యా అంటే అమ్మవారు తాను అలాగే ఆ ధనుర్ధారి అయి నుంచున్నాడు భద్రమూర్తి అయి ఉన్నాడు అభయమిస్తున్నట్లుగా ఉన్నాడు పక్కన అమ్మవారితో ఉన్నాడు కనిపించాడు కనిపించిన వాడు ఏమనుకున్నాడంటే ఆ రాజశేఖరుడు అనుకున్నాడు ఓ రాజుగారి అబ్బాయి అనుకున్నాడు దేవుడు అనుకోలా రాముడు అనుకోలా ప్రయత్నం చేశాడట భాషింప ఎత్తిరింప ఏమయ్యా ఇప్పుడెందుకు వచ్చావ్ అందరికీ దానాలు ధర్మాలు ఇచ్చి ఖాళీ అయిపోయి ఇక్కడికి వచ్చానే నేనేదో మా శివుని గురించి ఆలోచిస్తే నువ్వెందుకు వచ్చావ్ అనేదో అనబోయినాడు భాషింప యత్నంబు సేయునెడ అతండు ఈవిడు ప్రయత్నం చేస్తున్నాడో లేదో అవతల వాడున్నాడంట తాను రామభద్రుండ నే రాముణ్ణి అన్నాడు వచ్చినవాడు చెప్పుకున్నాడు మన్ నామాంకితంబుగా నాకు అంకితమయ్యేట్లుగా శ్రీమహాభాగవతంబు తెలుసు చేయుము శ్రీమహాభాగవతం వ్యాసులవారు రాసే ఉన్నారు దాన్ని నువ్వు రాయి రాసి ఏం చేస్తావంటే నా మన్ నామాంకితంగా నా పరం గా చక్కగా రాయి నీకు భవబంధములు తెగును అన్నాడు అప్పుడు నీకు భవబంధాలు పోతాయి అని అభ్యర్థించలే ఆనతిచ్చాడు హి ఆర్డర్డ్ ఇలా రాయి ఇలా చేయి అన్నాడు అని తిరోహితుండయ్యే ఏ రాముడు వచ్చాక గంట మాట్లాడతాడా వచ్చాడు కనపడ్డాడు ఇదేనేదో మాట్లాడిపోయినాడు ఆయన చెప్పవలసింది చెప్పి వెళ్లిపోయినాడు అంట అంతే జరిగింది ఎందుకంటే తొమ్మిది కోట్ల రామనామ జపం చేసుకున్న త్యాగరాజస్వామి వారికి శ్రీరామచంద్రుడు కనిపించింది ఒక సెకనులో లక్షోగంతు అది అంతే అంత జపం చేస్తే ఇంత కనిపించాడు ఆయన కనిపించి రామా వచ్చావా అనేలోపే ఆయన వెళ్ళిపోయాడు అయితే ఎట్లా వచ్చాడంటే సకుటుంబ సపరివార సమేతంగా రమ్మని మన వస్తాయి invitations కదా ఇప్పుడు ఎవరూ వెయ్యటంలే భయపడి మీరు ఒక్కళ్ళు రండి అసలు వస్తున్నదో లేదో ముందు చెప్పండి అంటున్నారు ఆయన మాత్రం మొత్తం ఆంజనేయస్వామితో సహా వెళ్లి దర్శనం ఇచ్చాడు ఆయన చేసుకున్న తపస్సు జపం అటువంటిది అప్పుడు సముమ్మీలితనయనుండనై వెరవు పడి ఆశ్చర్యపోయట చిత్తంబున మనసులో అనుకున్నాడు పలికడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాధ పలుకగనేల ఇంకోటి ఇంకోటి ఎందుకు ఆ రాముడే వచ్చి చక్కగా శ్రీమహాభాగవతం రాయి అని చెప్పిన తర్వాత అది చేసినట్లయితే నాకు భవహరం అవుతుందని కూడా చెప్పాడుగా భవబంధాలు పోతాయి అన్నాడుగా అందుకనేగా శ్రీ కైవల్యపదంబు ఈ కావ్యం రాయాలని అనుకున్నాడు అని భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు మీరేదో పొరపాటు నాకు అన్నీ తెలుసు అని అనుకోకండి తెలిసి భాగవతం చెప్పటం అసలు చిత్రం చాలా కష్టం చిత్రం అంటే విచిత్రం కష్టం శూలికైన తమ్మి శూలికైన విభుతజనుల వలన విన్నంత కన్నంత చాలా బుధులు పండితులంతా వాళ్ళు వాళ్ళు చెప్పుకోగా అక్కడక్కడ ఈ రామకథ కృష్ణుడి కథ విన్నాను కదా వారి వలన విన్నంత నేను కూడా కొంత దర్శించినంత తెలియవచ్చినంత చెప్పరుతు నాకెంతవరకు వచ్చో నేను ఎంతవరకు అనుభవించానో నేను ఏమి దర్శనం చేశానో నేను ఎంతవరకు ఎట్లా చెప్పగలనో అంతవరకు మాత్రం చెప్తాను ఎందుకంటే శ్రీమహాభాగవతాన్ని ఉన్నదున్నట్టుగా భగవంతుని గురించి చెప్పగలిగిన వాడు వ్రాయగలిగిన వాడు లేడు అన్నాడు పోతన అది ఇంత కావ్యం రాసిన వాడే ఆ మాట ముందు అన్నాడు సరే అని ఏమిటీ భాగవతం ఇందాక మనం ఒక సంస్కృత శ్లోకం చెప్పుకున్నాం నిగమకల్పవృక్షమని అంటే వేదకల్పవృక్షమని దాని చిటారు కొమ్మన పండున్నదని ఆ పండు నిండా రసం ఉన్నది రసమాలయం అన్నాడాయన అద్భుతమైన మాట అది అలాగే శుకుడు అనబడేటువంటి అన్ అంటే అంతటి అద్వైతమూర్తి నిర్లజ్జా స్వభావుడైనటువంటి శుకుడు జ్ఞానమూర్తి శుకదేవుడాయన శుకమౌని శుకదేవుడు కూడా ఆయన ఆయన అంతటి వాడు దానిని చిలక కొట్టినట్టుగా కొట్టి మనబోటి వారికి అందించినటువంటి ఈ రసామ్నాయాన్ని రసస్వరూపమైనటువంటి ఆమ్నాయాన్ని వేదాన్ని ఇట్లా నేను శివత భాగవతం అన్నాడుగా ఆ భాగవతాన్ని నేను తాగుతున్నాను అన్నాడు పండు తినటం వింటాం పండు తాగటం వింటామా advertisement లో తప్ప advertisement లో వాడు వేస్తాడు పండు తినొద్దు తాగండి అంటాడు కదా ఇదన్నమాట ఆ పండుని తాగమంటున్నాడు ఇంకా నువ్వు ఒలుచుకోవటం లేకపోతే ఏదో ఇంకోదాంట్లో దాన్ని అంతా ఉన్నదే రసం అయ్యా దాన్ని మొత్తం కూడా ప్రతి బిందువునీ ఆస్వాదించమంటూ లలితస్కంధము స్కంధము అంటే శాఖ కొమ్మ అని అర్థం భాగవతం యొక్క కొమ్మలు ఎలా ఉన్నాయట అంటే చిలక వాలే కొమ్మలే గద్దలు వాలే కొమ్మలు కావు అవి చాలా లలితంగా ఉంటాయి లలితస్కంధము కృష్ణమూలము దాని వేరు ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ శుకాలాపాభిరామంబు శుక చిలుకలు ఆలాపన చేసేటువంటి చిలక పాటలతో కూడి ఉంటాయి చిలక పలుకులతో కూడి ఉంటాయి చిలక పలుకులు అంటే వేదము చిలికిన చిలుకు పలుకులే చిలుకలు అన్నమాట అవి మంజులతాసువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల బలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై కాబట్టి స్వామి అనుగ్రహం ఎంత గొప్పదంటే త్రేతాయుగం నాటి రామాయణ కల్పవృక్షం పూర్ణ-పూర్ణమైన తర్వాత ద్వాపరలో ఉన్న భాగవత కల్పవృక్షాన్ని చెప్పుకోండి అన్నారు. ఇంతకంటే ఇది పోతనా మాట ఇది. భాగవతం అనే పేరు మీద ఉన్న కల్పవృక్షాన్ని ప్రపంచానికి తీసుకువస్తున్నాను, అప్పజెప్పబోతున్నాను అని అన్నాడు. ఇక శశ్యంచాల అని ఉన్నాయి. శ్రీరామచంద్రుని సన్నిధానంబు కల్పించుకొని, ఎక్కడ కల్పించుకొని మనం ఇప్పుడు ఉన్నాం ఇక్కడ ఈ గదిలో? ఇక్కడ స్వామి ఉన్నారు అని మన మనస్సు కల్పించుకున్నది, సంకల్పించుకున్నది. ఎలా సంకల్పించుకున్నది అనేది నమ్మకం వలన, ధ్యేయం వలన, ఒక లక్ష్యం వలన, ఆ గమ్యాన్ని చేరుకోవాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి తపస్సు వలన. కనుక రెండు పద్యాలలో చాలా అందంగా చెప్తాడు. అందులో ప్రధానంగా ఒక పద్యం. క్షణ్తకు కాళಿಯోరగ విశాల ఫణావళినర్తన క్రియారంఠకు ఉల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీహంతకు ఇంద్రనందన నియంతకు సర్వచరాచరావళీ మంతకు నిర్జితేన్ద్రియ సమాచిత భక్తజనానుగంతకున్ అటువంటి ఆ కృష్ణుణ్ణి, కృష్ణ కథగా భాగవతాన్ని నేను చక్కగా చేయబోతున్నాను. ఆంధ్రంలో చేయబోతున్నాను. ఇది మహాభాగవత పురాణము యొక్క కథా ప్రారంభం ఏమిటి అని అవతారికని పూర్ణం చేశాడు. అంటే అవతారికలో కవి యొక్క సంస్కారము, కవి యొక్క తపస్సు, ఆయన చేసుకున్నటువంటి శైవోపాసన, వాటితో పాటుగా ఏర్పడినటువంటి అనేక సంస్కారాలు, దాని వలన కలిగినటువంటి శ్రీరామ దర్శనం, శ్రీరామ దర్శనంతో పాటు శ్రీరాముడి యొక్క ఆజ్ఞ మహాభాగవతాన్ని తెలుగున ఆంద్రీకరించు, జగద్ధితంగా జగత్తు కళ్యాణం కలిగించేలాగా, కళ్యాణం కలగటం అంటే శ్రీ కైవల్యం పోతరాజుకే కాదు మనక్కూడా శ్రీ కైవల్యం కావాలి. భాగవతం ఏ ఇంట వినబడుతుందో, ఎక్కడ చదవబడుతుందో, ఎక్కడ ఈ భాగవతాన్ని గురించిన విచారణ చేయబడుతుందో, ఎవరు భాగవతోత్సవముగా సంచారం చేస్తారో, ఎవరు భగవంతుణ్ణి తన హృదయము నందు సంకల్పించుకొని స్థిమితంగా ఉంటారో అక్కడ పరమేశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. పరమేశ్వరుడే ఉన్న తర్వాత హరి లేకుండా శ్రీ ఉంటుందా అని. ఏమో! శ్రీ లేకుండా హరి ఉంటాడా అని. ఉంటాడు. ఉంటాడు. ఉంటాడు. హరి లేకుండా శ్రీ, శ్రీ లేకుండా హరి. ఇది చాలా విచిత్రమైన సన్నివేశం గనుక మనకు హరి కావాలి, శ్రీ కావాలి, గిరి అయిన గౌరి కావాలి. కదా! హరి, శ్రీ, గౌరి ఈ ముగ్గురు కూడా మన యందుండి దుర్గ అనబడేటువంటి, దుర్గ అంటే కోట అని అర్థం. దాటలేని, అవధులు లేని, గంభీరమైన మనం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి. కారేసుకుని అట్లా వెళ్ళేసి చేస్తామా? ముందు మనం ఎవరో చెప్పాలి. మనం అసలు ఆయన్ని ఎందుకు కలుస్తున్నామో చెప్పాలి. కలిసిన తర్వాత ఎన్ని నిమిషాలు మనకు కావాలో చెప్పాలి. అసలు విషయం చెప్పాలి. మా-ఆయన్ని పిలవగలిగిన శక్తి మన దగ్గర ఉండాలి. ఇన్ని ఉంటే ఆ కోట లోపలికి మొదటి వాడు అంటాడు. ఇన్ని ఉన్నా వాడు ఏమంటాడంటే, అన్నీ ఉన్నాయా అంటాడు. అన్నీ చూపించిన తర్వాత లోపలికి పోనివ్వడు. ఈ దుర్గ, దుర్గాదేవి కూడా అంత తేలికైనటువంటి వ్యక్తి, శక్తి కాదు. ఆమెను అందుకోవటం చాలా కష్టం. అందుకనే ముందు గణపతి ఉండాలి, సరస్వతి ఉండాలి, అలాగే లక్ష్మీదేవి ఉండాలి. లక్ష్మీదేవి ఎందుకు ఉండాలంటే టికెట్టు కొనుక్కోవటానికి డబ్బు కావాలిగా! కారు ఉంది, పెట్రోల్ లేదు, గవర్నర్ గారు పిలిచారు, ఎట్లాగా? డబ్బుండాలి. ఏయ్! గవర్నర్ గారు ఒక దానికి ఒకటి ప్రశ్న వేస్తాడు, జవాబు చెప్పాలి, సరస్వతీదేవి ఉండాలి. రెండు, ఆయనని పిలవగలిగిన శక్తి కావాలి. ఈ మూడు ఎవరి దగ్గర ఉన్నాయి అంటే పరమాత్మ యందు ఉన్నాయి. పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే సత్యసాయి భగవానుడై ఉన్నాడు. కాబట్టి మనకి స్వామి ఉన్నట్లయితే ఈ గిరి, గౌరి, హరి, శ్రీ అందరూ కూడా మనకు ఎట్లా కావాలంటే అట్లా, ఏం కావాలంటే అట్లా, ఎప్పుడు ఎంత కావాలో అట్లా వాళ్ళందరూ వచ్చి మనకి చక్కగా కూడా అనుగ్రహాన్ని వరదానం చేస్తారు కాబట్టి ఈ భాగవత తత్త్వం ఒక నవనీతంగా, ఒక చల్లని చక్కని ప్రతిరోజూ ఫ్రెష్ గా వెన్న-వెన్న తీసుకున్నట్లే. అందునా వెన్నెల రోజులు కాబట్టి మరొక్కసారి స్వామి ఇటువంటి ఈ ముహూర్తాన్ని నిర్ణయించటంలోనే స్వామి అనుగ్రహం ఉంది. అలాగే మనం కూర్చున్నటువంటి ఈ ఒడ్డే గోదావరి. ఇవాళ కాస్త బయటకు వెళ్లగలిగితే వెన్నెల ఉంది, లేకుండా లేదు. పైగా మార్గశిర పౌర్ణమి. కాళాగ్ని శమన దత్తుడు ప్రాదుర్భవించినటువంటిది అని చెప్పాను. అంటే- పొందగ్రహం కూడా ఉంది కదా. అది మనక్కాదు. అక్కా కాదు. గ్రహించలేని వారికి గ్రహణం. [laughing] పొందగలిగిన వాడికి అనుగ్రహం. కాబట్టి అది మనకు లేదు. మనకు కనపడదు కూడా, మనకు సంబంధం లేదు. చంద్రోదయం చక్కగా అయింది. ఇద్దరు దంపతులు, ముని దంపతులు దత్తాత్రేయ స్వామిని దర్శనం చేశారు. దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసినప్పుడు ఈ మార్గశిర పౌర్ణమి నాడే ఆయన ఏం చేశాడంటే, ఆహ్ వెళ్ళినప్పుడు, చూడండి ఒక్కోసారి స్వామి దగ్గర దాకా వెళ్లినా అడగవలసింది అడిగేట్టుగా అడగాలి, పోగొట్టుకున్నట్టుగా అడగకూడదు. వాళ్ళు ఏమడిగారంటే, ఆయన పప్పు అడిగాడు, "ఏమొచ్చారు? ఎందుకొచ్చారు?" అని అడిగాడు దత్తాత్రేయుడు.నీవంటి కొడుకు కావాలి అని అడిగారు అంటే పెద్ద దురాశ ఏం లేదు ఆశ నీవంటి కొడుకు అని ఆయన ఏమన్నాడంటే నావంటి వాడు ఇంకొకడు లేడు కాబట్టి నేనే నీ కొడుకుగా పుడతాను అన్నాడు అనగానే ఈ పుట్టేది లేదు పోయేది అయ్యేది లేదు ఏదో చెప్పాలని చెప్పాడు గనుక ఎందుకంటే దేవుడు మన కడుపున ఎలా పుడతాడు అని చెప్పినా అనుకున్నారు వచ్చారు కానీ ఈ మార్గశిర పౌర్ణమి ఈ రోజున ఆ దంపతులలో ఉన్నటువంటి పురుషుడు ముని యొక్క కళ్ళల్లో నుంచి ప్రళయాగ్ని ఏదైతే ఉన్నదో మహోదృతమైనటువంటి వేగంతో అతి వేడి కిరణాలు వచ్చి తన భార్య యొక్క గర్భాన్ని ప్రవేశించినాయి. ప్రసన్నము, ప్రశాంతము, శీతలము, ధవళము, పూర్ణము, స్వచ్ఛము, అర్చము అయినటువంటి ఆ కిరణాలన్నీ కూడా ఆమె గర్భాలయంలో ప్రవేశించినయి. ఆ ప్రవేశించాడు గనుక కాల అగ్నిశమనుడు అయినాడు. కాలానికి దత్తుడు అయినటువంటి ఆయన దత్తావతారాలలో ఇది చాలా పూర్ణమైనటువంటి ఒక దత్తావతారం. అటువంటి ఆయన పుట్టాడు గనుక ఇది కాలాగ్ని శమన దత్త పౌర్ణమిగా దీనికి పేరు. రెండు రోజులు ఆగినట్లయితే ఈ మార్గశిర మాసం పౌర్ణమి అయిపోయింది పాడ్యమి, విదియ, తదియ వచ్చేప్పటికీ ఇదే నెలలో రెండవ దత్తుడు కూడా వచ్చాడు. ఆయన పేరు యోగిరాజ వరదుడు. ఆ యోగిరాజు అంటే ఈ దత్తతత్వంలో నుంచి కాలాగ్ని శమనుడు అయినటువంటి వాడు ఆ యోగానికి రాజుని చేయటానికి ప్రపంచానికి యోగాన్ని బోధించటానికి వచ్చాడు గనుక యోగిరాజ వరదుడుగా ఆయన కూడా వచ్చాడు. ఈ మాసం చాలా ప్రధానమైన మాసం ఇది కృష్ణ మాసం అన్ని మాసాలలోనూ నేనే కృష్ణుడిని ఆ మాసం నేనేనన్నాడు ఆయన. అంటే ఈ జరుగుతున్నటువంటి రోజులన్నీ కూడా గొప్పవి. అందునా మనకి ప్రధానంగా చక్కగా ఈ ఏడు రోజుల భాగవత సప్తాహం భాగవతం ఎప్పుడూ కూడా ఏడు రోజులు చెప్పుకోవాలి. ఒకరోజు, రెండు రోజులు చెప్పుకునేవి కాదు ఏడు రోజులు ఎంత జరిగితే అంత కానీ ఆరో రోజు, నాలుగో రోజు దాన్ని మానకూడదు. ఏడు రోజులు చక్కగా చెప్పుకొని ప్రతిరోజు నిదానవతి ఉపాసన మార్గంలో చక్కగా ఆ వెన్నని సంపాదించుకొని దానిని మన దగ్గర పెట్టుకొని ఆ నవనీతాన్ని దాని నుంచి కాచుకొని కాచుకొని జ్ఞానాగ్నిలో మన కర్మలన్నీ కూడా దగ్ధం చేసుకొని పూర్ణమైనటువంటి స్త్రీ కైవల్యం వైపు అడుగు వేయాలి గనుక వ్యాసుడు సంస్కృతంలో రాసిన పద్దెనిమిది వేల శ్లోకాలని ఆంద్రీకరణం చేశాడు. ఎవరు? మన బొమ్మెర పోతన. లలిత స్కంధంగా, కృష్ణమూలంగా, శుకాలతాభిరామంగా అంటే చిలక పలుకుల్లాగా సరళమైన, మంజులమైన, మనోజ్ఞమైన, ఆనందకారకమైనటువంటి స్థితిగా మనకి భాగవతాన్ని ఇచ్చాడు గనుక ఆ భాగవతాన్ని స్వామి కూడా భాగవత వాహినిగా దాన్ని వర్ణించారు. అయితే భాగవత వాహిని స్వామి మళ్ళీ మన బోటి వారి కోసం కథగా చెప్పారు. భాగవత తత్వసుధగా చెప్పలేదు. కథ వేరు, కవితాసుధ వేరు, తత్వసుధ వేరు. తత్వం తెలియకపోతే తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళలేడు. కాబట్టి ప్రపంచంలో ఎన్ని ఉన్నా ఆంధ్రదేశంలో పుట్టినందుకు విశ్వనాథ వారి రామాయణం, పోతనామాత్యుని భాగవతం చెప్పుకునే అదృష్టాన్ని కల్పించినటువంటి సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ రేపు అశ్వత్థామ అవమానం ఏమిటి? అక్కడ అనేక పాత్రలున్నాయి. ఆ పాత్రలన్నీ కూడా ఎట్లా ఎట్లా సంచారం చేసినయి. ఎందుకంటే పరీక్షిత్తు పుట్టేదాకా చెప్పుకోవాలి ఈ భాగవతం. ఆ పరీక్షిత్తు వచ్చిన తర్వాత సప్తాహం ఎందుకు అనంటే పరీక్షిత్తుకి ఒక మరణ శాపం ఏర్పడినప్పుడు ఈ భాగవత సప్తాహం భాగవతాన్ని విన్నందువలన వాడు ముక్తుడయినాడు పరీక్షిత్ మహారాజు. కాబట్టి దీనికి కైవల్యం ఇచ్చేటువంటి శక్తి, మరణ అంతంలో కలిగేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి శక్తి భాగవతం వింటూ, భాగవతం అంటూ, భాగవత దర్శనాన్ని చేస్తూ అంటే కంటూ ఎవరైతే నిత్య జాగరూకులై ఉంటారో వారి యందు సర్వ దేవతలు స్థిమితంగా ఉంటారు అనేటువంటి ఒకానొక భావనను చక్కగా మనసులో పదిలపరుచుకొని, స్థిమిత పరుచుకొని ఈ భాగవత నవనీతాన్ని అన్నివేళలా గ్రోలేటువంటి ఒక మహానుభవాన్ని స్వామి మనందరికీ అనుగ్రహించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
SSSMC · audio
Bhagawata Navaneetham - 03
Bhagawata Navaneetham - 03
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 22:58
More in this series