No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం, మందస్మిత మనోహరం, మందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. సురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం, మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం. ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం, నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్ఫురతాం. పరమ మహేశ్వర స్వరూపుడు, సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ శ్రీమద్భాగవత నవనీతంలో మరొక్కరోజు. నిన్న సాయంకాలం వరకు శ్రీకృష్ణుణ్ణి కుంతి ప్రార్థించింది. "ఎన్నాళ్ళు ఈ శరీరం? ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలి? నాకు ఉద్ధారణ ఇవ్వవయ్యా! భవబంధాలు అన్నీ కూడా తెగిపోయేట్లుగా ఏదైనా మార్గం చూపించు." అన్నది. కృష్ణుడు సహజంగా-- రాముడికి కృష్ణుడికి తేడా ఏమిటంటే, రాముడు నవ్వి మాట్లాడతాడు, కృష్ణుడు మాట్లాడిన తర్వాత నవ్వుతాడు అంతే. మనందరి చేత మాట్లాడించి అప్పుడు ఆయన హాయిగా నవ్వుకుంటాడు. రాముడు అట్లా కాదు, పరిచయం ఉండని ఉండకపోని వారు కొత్తవారు గాని హాయిగా పలకరిస్తాడు. స్మిత పూర్వక సంభాషి రాముడు. ముందు నవ్వు ఆ తర్వాత మాట. అంటే అది పూర్ణమైనటువంటి సత్వగుణ ప్రధానానికి, గుణానికి అది ప్రధానమైన సంకేతం. ఎవరి ముఖాన నవ్వు లేదో, ఎవరు నవ్వటానికి కాస్త మొహమాట పడతారో, వాళ్ళ మనస్సు వికసించలేదు అని అర్థం. హాయిగా ఎవరు చక్కగా నవ్వగలరో, ఎప్పుడు చూసినా నవ్వినట్లే ఉండగలరో, వాళ్ళు శుద్ధమైన మనస్సు గల వాళ్ళు అని అర్థం. కాబట్టి నవ్వటం అలవాటు లేకపోతే, ఇవాళ్టి నుంచి హాయిగా నవ్వటం మొదలుపెట్టాలి అది. భాగవతం అనేకం కొన్ని ప్రచ్ఛన్నంగా చెబుతుంది, కొన్ని direct గా చెబుతుంది. సరే, యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత సహజంగా గెలిచిన వాడికి ఆనందం కలగాలి, చాలా ఆనందం కలగాలి. కానీ ధర్మరాజుకి చాలా దుఃఖం కలిగింది. ఎంత విచారం కలిగింది అంటే, "నేను ఒక్కడిని రాజ్యం ఏలటానికి ఇంతమంది మరణించాలా?" ఎంత గొప్ప ప్రశ్న అది, ధర్మం అది. కానీ తప్పదు. యుద్ధంలో ఎవరూ మరణించకుండా యుద్ధాలు ఎలా గెలుస్తారు? ఎవరో ఒకడు గెలవాలి రెండో వాడు ఓడాలి. ఓడిన వాడికి సమస్య లేదు. పరీక్ష fail అయిపోయిన వాడికి మళ్ళీ ఇదే చదువుకోవడానికి ఒక year time ఉంటుంది కదా! మళ్ళీ కొత్తగా చదివేది ఏముంది? అవే పుస్తకాలు అవే. గెలిచి pass అయిన వాడికి తర్వాత ఏమిటని ప్రశ్న. అలాగే ధర్మరాజు గెలిచిన తర్వాత ఒక విచారానికి లోనైనాడు. నరకాలంటూ ఉన్నాయి, ఇందరి మరణానికి కారణమైనటువంటి నేను ఎన్ని నరకాలు చూడవలసి ఉన్నదో కదా అని అనుకున్నాడు. ఆ అనుకున్న సమయంలో అప్పటికి ఇంకా పెద్ద దిక్కు భీష్మాచార్యులవారు బతికే ఉన్నారు. అంపశయ్య మీద ఉన్నాడు ఆయన. ఆయనకు అనిపించింది-- చూడండి మనక్కూడా మనస్సు ఎక్కడైనా ఆందోళన పడ్డా, మనకి సమస్యకు పరిష్కారం దొరకకపోయినా ఎవరైనా పెద్దవాళ్ళని వెళ్లి కలుద్దాం అని అనిపిస్తుంది. అలాగే ధర్మరాజుకి తమ తాత అయినటువంటి భీష్ముల వారిని దర్శనం చేయాలి అని ఆయనకు అనిపించింది. ఒక్కడు వెళ్ళటానికి ఏం లేదు, అక్కడ ఉన్నదే ఈ ఐదుగురు ఆ ద్రౌపది, కుంతి పక్కన శ్రీకృష్ణ పరమాత్మ. ధర్మం పక్షాన ఆయన ఉన్నాడు గనుక ఆయనతో సహా భీష్మ దర్శనానికి వెళ్ళాడు. భీష్మ దర్శనానికి వెళ్ళేసరికి భీష్ముడు అంపశయ్య మీద హాయిగా పడుకొని ఉన్నాడు. అంపశయ్య మీద హాయిగా పడుకున్నాడా అని-- పడుకున్నాడు. ఎందుకనంటే, కొన్నేళ్లుగా తాను కౌరవుల యొక్క ఉప్పు తిన్న కారణంగా శరీరంలో ఉన్న రక్తమంతా కలుషితం అయిపోయింది. ఆ కలుషితమైన రక్తం శరీరం నుంచి ద్రవించి, స్రవించి బయటకు వెళితే తప్ప ఇచ్ఛామరణాన్ని పొందలేడు. ఎందుకంటే, ఆయన మందాకినీ నందనుడు అన్నారు. అంటే గంగానదికి పుట్టినవాడు గనుక, ఎంత గంగ పవిత్రమైనటువంటిదో తన తల్లి వలె తాను కూడా తన శరీరాన్ని పవిత్రీకరణం చేసుకోవాలి గనుక ఆ అంపశయ్య మీద హాయిగా ఆయన ఆ క్షణం కోసం, ఆ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంత తాత్వికుడైనా, ఎంత జ్ఞాని అయినా, ఎంత ధర్మబద్ధమైన జీవితం గడిపినా ఈ ప్రపంచంలో వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ప్రతి జీవుడు కూడా తాను ఏ పొరపాట్లు చేశాడో, తాను ఏం మంచి చేశాడో, ఏది చేయాలని చేయకుండా ఆగిపోయినాడో, ఏవి చేయరానివి చేయవలసి వచ్చినయో మనస్సు ఎప్పుడూ కూడా ఒక సింహావలోకనం చేస్తుంటుంది. Recapitulation అంటాం. భీష్ముడు ఖాళీగా ఒక్కడే పడుకున్నాడు మహా సంగ్రామ రంగం మధ్యలో. పడుకొని ఉంటే ఆయన మనస్సు తలుపులన్నీ కూడా ఇలా ఇలా జరిగింది కదా! పాండునందనుడు పాపం అకాల మృత్యువుకి గురైన కారణంగా, ధృతరాష్ట్రుడు పెద్దవాడు అనేటువంటి కారణంగా రాజ్యాన్ని అప్పజెప్పి సర్వస్వాన్ని త్యాగం చేసి నిత్య బ్రహ్మచారి నై నిలబడ్డప్పటికీ కూడా వంశాన్ని నిలబెట్టుకోలేకపోయినానే, నా వంశం నా కళ్ళ ముందే నాశనమైపోయింది అని ఒక నిర్వేదానికి, కౌరవ పాండవుల మధ్య జరిగినటువంటి సంగ్రామం కారణంగా, అనేకమంది బలి అయిపోయిన కారణంగా, వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటున్నది మనస్సు. జీవుడు ఎప్పుడూ కూడాఎవరైనా పోవలసిందే. ఆ పోయేటువంటి వేళ, దానికంటే ముందు కొన్ని క్షణాల ముందైనా తను జీవించిన జీవితాన్ని ఒక్కసారి గమనించుకోవాలి. అది అప్పుడే కాదు, నిజానికి ఇప్పుడు మనం కూడా మనం ఈ వయస్సులో కూడా ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు దైవ ప్రార్థన ఒక పక్కన, దైవ ప్రార్థన కంటే ముందు సూర్యోదయానికి ముందో, సూర్యోదయం సమయంలోనో మనం లేచాం. మళ్ళీ ఇగో ఈ జాగ్రదవస్థలో సుమారు పదహారు గంటలు గడిపాం. ఇందులో ఎంతవరకు మనం హాయిగా గడిపాం? శాంతిగా గడిపాం? మర్యాదగా గడిపాం? ఇవన్నీ కాస్త బేరీజు వేసుకోవాలి. దైనందినమైనటువంటి జీవితంలో లౌకికమైనటువంటి అనేక కార్యకలాపాలు సాగుతున్నప్పుడు తెలిసి కొన్ని, తెలియక కొన్ని, అహంకారం చేత కొన్ని, అవిధ్యాశయం చేత కొన్ని, అవిధ్య చేత కొన్ని, అనాచారం చేత కొన్ని కర్మలు చేస్తాం. ఈ కర్మలు కొన్ని మన చెయ్యి దాటి వెళ్ళిపోతాయి, జరిగిపోతాయి అట్లా. మన ప్రమేయం ఉండొచ్చు, మన ప్రమేయం లేకపోవచ్చు కూడా. ఇలా ఎందుకు జరిగింది? మళ్ళీ ఇలా జరక్కుండా చూసుకోవాలని ఆ రోజు రాత్రి మనం బ్యాలెన్స్-- ఆ షీట్ వేసుకోవాలి ప్రతిరోజూ. ఆడిటర్లు ఏడాదికి రెండు సార్లు వేస్తారు, మనం రోజూ వేసుకోవాలి. అది. ఈ ఆడిట్ చేసుకోవటానికి మనం ఎవరికీ ఏం ఫీజు కట్టక్కర్లే, ఫ్రీ. ఎందుకంటే మన మనస్సు మనది, మన అంతస్సాక్షి మనది. కాబట్టి [దగ్గిన శబ్దం] వేదకల్పవృక్షమైనటువంటి భాగవతం చిట్టచివర కొమ్మ ఉపనిషత్ అయితే దాని చివర ఉన్నటువంటి, ఈ రసమాలయమైనటువంటి ఈ ఫలం వేద విఘటితమైందన్నాడు పోతనామాత్యుడు. నిగమకల్పోత్తరమైనటువంటిదన్నాడు వ్యాసులవారు. దాన్నుంచి గళితమైందంటే పడ్డది అని. దానిని నేను తీసుకుంటాను. చుకుడు అనబడేటువంటి చిలుక దానిని తాకిన ముక్కుతో కొరికిన కారణంగా లేదా అనుభవించిన కారణంగా అమృతద్రవ సంయుతంగా ఉన్నది. అమృతం ప్రవహిస్తూ కూడి ఉన్నది. అమృతంతోనే ఆ ఫలం కూడి ఉన్నది. యబత భాగవతం రసమాలయం. ఆ రస స్వరూపమైనటువంటి, వేద స్వరూపమైనటువంటి, ఉపనిషద్ భాష్యమైనటువంటి, నిశ్యందమైనటువంటి, పూర్ణమైనటువంటి, అక్షమైనటువంటి అధ్యాత్మ విద్యా విలాసాన్ని నేను ఇక్కడ అనుభవిస్తున్నాను అంటున్నాడు. ముహురహో రసికా భువి భావుకాః రసికులైనవారు, పరమాత్మ యందు రాసిక్యం ఉన్నవారు, పరమాత్మ యొక్క దివ్యశక్తుల యందు అపారమైన నమ్మకం ఉన్నటువంటివారు, పరమేశ్వరుడి యొక్క దివ్య లీలా తరంగిణిలో మూడు మూడు మునకలన్నా వేద్దామనేటువంటి ఆయత్తమైనటువంటి మనస్సు ఉన్నటువంటివారు, మీరందరూ కూడా ఈ భాగవతాన్ని అనుభవించండి. అంతేకాదు, భువి భావుకాః ఇవి ఏ విషయాలు మీకు తెలియకపోయినా దీన్ని ఒక చల్లని చక్కని కథగా, పరమేశ్వరుడి యొక్క లీలా వైభవంగా మీకైనటువంటి, మీదైనటువంటి రీతిలో, మీ స్థాయిలో దీనిని చక్కగా అర్థం చేసుకుంటూ రసానందాన్ని అనుభవించండి అంటున్నాడు వ్యాసులవారు. పోతనామాత్యుడు కూడా మళ్ళీ అమ్మవారిని రోజూ తలుచుకున్నట్లే "అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ" అంటూ చక్కగా స్తుతిస్తూ మనల్ని మనల్ని ధర్మరాజాదులతో పాటుగా భీష్ముడి దగ్గరికి తీసుకెళుతున్నారు. తన దేహంబునకై అనేక మృగ సంతానంబు చంపించు దుర్జను భంగిన్ గురు బాలక ద్విజ తనూజ భ్రాతృ సంగంబు ఇట్లని చంపించిన పాపకర్మమునకు రాజ్య కాంక్షకిన్ నాకు హాయవలాక్షావధినైన ఘోరవర కన్యా సంగముల్ మానుని. రాజ్యకాంక్షతో యుద్ధం చేసి పశుపాలురని, అమాయకులని, వేదం చదువుకున్న వాళ్ళని, యుద్ధరీతి తెలిసిన వాళ్ళని కేవలం స్వార్థబుద్ధితో చంపించానే, నాకు సుమారుగా ఒక లక్ష నరకాలు ఎదురుచూస్తూ ఉండి ఉంటాయి అనుకున్నాడు ధర్మరాజు. కానీ ఎప్పుడైతే ఒక నిరాహార భావంలో ఉన్నాడు. నిరాహారం అంటే ఇవాళ నిరాహారం కాదు. ప్రాణాహార ప్రత్యా-ప్రత్యాహారాలు, ఆ-ఆ యోగ స్థితిలో ఉన్నాడు ధర్మరాజు. ఆ మనసుతో ఉండి వెళుతున్నాడు. ఎక్కడికెళ్ళాడు? భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. మాయాంగీకృత దేహుడై అఖిలేశ్వరుడు మనుజుడైనాడని ప్రజ్ఞాయత్త చిత్తమున గాంగేయుడు పూజనముజేసె కృష్ణున్ విష్ణున్. అసలు ఆయనకి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వమైనటువంటి విష్ణువు ఒక మాయావేషం వేసుకొని కృష్ణుడిగా వచ్చాడయ్యా. అసలు ఆయనకి దేహం ఎక్కడున్నది? మాయాంగీకృత దేహుడై ఉన్నాడాయన. అఖిలేశ్వరుడు సర్వ జగత్తుకి, పద్నాలుగు భువనాలకి ఎవరు పరమాత్మై ఉన్నాడో ఆయన ఈ రూపం తీసుకొని వచ్చాడు. కనుక వీళ్ళందరూ వస్తున్నారే ఆ క్షణాన కృష్ణుడు వస్తున్నాడు. భీష్ముడు చూశాడు దూరం నుంచి. ఆ కృష్ణుడి యందు మనస్సు లగ్నమైపోయింది. వెంటనే పరమాత్మ యందు మనస్సు లగ్నమైంది మన భీష్ముడికి. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా మన వాళ్ళు, కుంతి అందరూ దగ్గరకు వచ్చారో, వాయువశంబులై యగసి వారిధరంబులు మింటకూడుచున్ పాయుచు నుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమైపాయుచు కూడుచుండు ఒక భంగి చరింపదు కాలమని యుంచేయుచు ఉండు కాలము విచిత్రము దుస్తరము ఎటి వారికిన్ మనస్సు వేదాంత భూమికలోకి ఈ కాలం ఎంత విచిత్రమైనది అంటే ఎందుకు ఆనందాన్ని తెచ్చి ఉళ్ళో వేస్తుందో తెలియదు ఎందుకు దుఃఖాన్ని నెత్తిమీద కురిపిస్తుందో తెలియదు వాడు ఎంత గొప్పవాడు కానివ్వండి కాల వశుడు కావలసిందే కాల పాశ బద్ధుడు అయినటువంటి జీవుడికి ఎందుకు ఇలా ఏర్పడింది ఎందుకు విచారణ చేస్తున్నాడు అంటే ఆ నడిచి వస్తున్నటువంటి మనుమలు సామాన్యులు కారు వాళ్ళు కానీ వీళ్ళని కూడా కాలం ఇలా పాశం వేసి బంధించింది కదా అని భీష్మాచార్యుల వారి మనస్సు కుంభతూ ఉన్నది బాధగా రాదట ధర్మజుండు మరి రాజ్యం వచ్చేసింది రాజు అయిపోయినాడు అంతకుముందు ఒట్టి ధర్మరాజే ఇప్పుడు ధర్మరాజు రాజైన ధర్మరాజు రాదట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి అర్జునుడు ఇంద్రుడి కొడుకు కదా శస్త్రవోద్వేజకమైన గాండీవము విల్లట సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాజికి తోడువచ్చునట ఆపద గల్గుట ఇదేమి చిత్రమో ఎంత అద్భుతం చూడండి మనం అనుకుంటాం నలభై ఏళ్లుగా స్వామి డివోటీని అండి కష్టం తప్పలేదు అంటాం దానికి దీనికి సంబంధం లేదు అసలు నువ్వు ఉన్నావ్ ఇంకా మంచిది అట్లా ఉన్నావ్ గనక ఇంకా ఉన్నావ్ అనుకో భీష్మాచార్యుల వారు కూడా అదే ఆ వస్తున్న ధర్మరాజ రాజు అర్జునుడా ఇంద్రుడి కొడుకు వాడి చేతిలో ఉన్న గాండీవం మామూలు గాండీవం కాదు అది అలాగే ఏ యుద్ధానికైనా గద తీసుకొని రావటానికి భీమసేనుడు సిద్ధంగా ఉన్నాడు వీటన్నింటికంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడే పక్కన ఉన్నాడు చక్రి అయినా వీళ్ళకి ఇంత దుఃఖం ఎందుకు కలిగింది అని అనుకుంటున్నాడు ఈశ్వరుండు విష్ణుండు ఎవ్వనికి ఏమి చేయు పురుషుడు ఏమి ఎరుగడు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అడగి మెలకుచుందురు అంధులగుచు వీడు అనుకుంటాడు నేను ఆయన మీద యాభై పుస్తకాలు రాశాను నాకు ముక్తి వస్తుంది కాదు పుస్తకాలు అమ్ముడుపోతాయి అంతే లేకపోతే నేను ఏదో చాలా గొప్ప పనులు చేశాను ఏం కాదు నువ్వు ఎలా కాలానికి బద్ధుడివి కావాలి రామాయణం అంతా చూడండి విధి నడిపించినట్టు రాముడే నడిచాడు ఇవాళ కృష్ణుడు నడిపించినట్టుగా విధి నడిచింది కాలగమనానికి కాలం యొక్క శక్తికి కృష్ణుడు ఎలా లొంగిపోతాడో తర్వాత చూస్తాం కృష్ణ మహాపరినిర్వాణంలో సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి ఆయన ఆయన జోలికి ఎవరు రాగలరు కానీ ఆయన కాల పాశ బద్ధుడే ఎందుకని కాల కార్య కారణ కర్తవ్య ఈ నాలుగు జీవుడు ఎలా తెచ్చుకున్నాడో పంచభౌతిక దేహాన్ని ధరించిన పరమాత్మ కూడా వాటికి లోబడే ఉండాలి ఆయనకి కూడా ఒక కాలం ఉంది ఆయనకి కూడా ఇక్కడికి వచ్చినందుకు ఒక పని ఉంది కార్యం ఉంది ఆ పని చేయటానికి ఒక కారణం ఉంది చేయవలసి ఉన్నది గనుక కర్తవ్యం ఉన్నది ఈ నాలుగు దాటి అటు జీవుడు గాని ఇటు దేవుడు గాని లేడు అని భీష్ముడు అనుకుంటూ అతి భక్తి యవ్వని యందు చిత్తము చేర్చి యవ్వని నామము ఊహించి పొగడి కాయంబు విడుచుచు కామ కర్మాది నిర్మూల నుండై యోగి ముక్తినొందు అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తంసుడు ఎవ్వేళ ప్రాణంబులు ఏలు విడుచు అందాక ఇదే మహా హర్షుడై వికసిత వదనారవిందుడై వచ్చెనేడు ఆ అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్ముల వారికి నెమ్మదిగా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర అయినాడు కళ్ళకి ఏ మహాత్ములు మహా యోగులంతా కూడా ఎవరిని గురించి తపించి తపస్సు చేసి హృదయ స్థానంలో అటువంటి పరమాత్మను నిలుపుకొని కాయము విడిచేటువంటి వేళ క్షణమాత్ర దర్శనం కోసం ఎదురు చూస్తారో అటువంటి వాడే నా ఎదురుగా వచ్చి నిల్చున్నాడు కదా అని ఆనంద పడుతున్నాడు ఎట్లా కనిపించాడంటే అప్పుడు మామూలు మనకి తెలిసిన కృష్ణుడిలా కనిపించలేదు నాలుగు భుజములు కమలాధనయన యుగము ఒప్పకనుల ముందట ఉన్నవాడు మానవేశ్వర నా భాగ్య మహిమ చూడుము ఏమి చేతితిలో పుణ్యము ఇతని గూర్చి అసలు నేను ఈ కృష్ణుడి దర్శనానికి ఈ సమయంలో పొందటానికి ఏం చేశానో నాకు తెలియదు గాని చతుర్భాహుడైనటువంటి పుండరీక నయనమైనటువంటి పరమాత్మ నా దగ్గరకు వచ్చి నన్ను లాలించడానికి వచ్చాడయ్యా అని మనస్సు ఆనందతాండవం చేస్తున్నది అప్పుడు ఇంకా ఒకే మాట అనుకున్నాడు ఇంకా ఎంత సేపు ఆలోచిస్తాడు ఏదో రోజున మనస్సు ఆగాలి మనస్సు ఆగాలి ఒకరోజున మనస్సు ఆగాలి ఈ ఆగాలి ఆగాలి మధ్య మనస్సు ప్రపంచంలో ఊగుతుంది కనుక అది ఊగాలి ప్రాణం పోయేటటువంటి వేళ కూడా ఇంకా మనస్సు ఇంకా కృష్ణుడు ఇంకా నాలుగు భుజాల వాడు కుదరదు అన్నాడు భీష్ముడు అంటే స్వరూపం నుంచి సగుణంలో నుంచి నిర్గుణ పరబ్రహ్మ తత్వంలోకి వెళ్ళాలి అందుకనే ఆలాపంబులు మాని మనస్సు మాటే మాట్లాడ మాటలన్నీ మానేసి చిత్తంబు మనీషాయత్త ముంజేమనిషా అంటే దృఢమైన అటువంటి నిశ్చయం ఒక అర్థం రెండవది జ్ఞానానికి అతీతమైనది మనీషా అదే శంకర భగవత్పాదులు మనీషా పంచకం అని చెప్పారు మనీషా అంటే ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే జ్ఞానం అది ప్రజ్ఞానం ప్రజ్ఞానాన్ని దాటిన భూమిక ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళేటువంటి స్థాయిలో ముందు ఏం చేయాలంటే మాటలు ఆగాలి మౌనం వెలగాలి ఆ వెలిగినప్పుడు మనీషాయత్తము చేసి దృగ్జాలమున్ హరిమోముపై బరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీ భూతశర యధానిచయుడై మోదించి భీష్ముండు సంశీలం బప్పను తించే కల్మష గజ శ్రేణి హరిన్ శ్రీహరిన్ అదిగ మాట మాటలాడటం ఆపేశాడు మనస్సుని పరమాత్మ యందు మనీషాయత్తం చేశాడు అలాగే ఆయన కారుణ్య దృష్టితో తన లౌకిక జీవ దృష్టిని అనుసంధానం చేశాడు ఎందుకంటే జీవుడి యొక్క దృష్టి ప్రశ్నిస్తున్నట్లుగా దేన్నో వెతుకుతున్నట్లుగా దేనినో పొందినట్లుగా దేనినో పొందవలసినట్లుగా ఏదో కావలసినట్లుగా ఏమున్నదో తెలుసుకునేట్లుగా ఇట్లా ఉంటాయి జీవుడి చూపులు పరమాత్మది ఒక్కటే చూపు కారుణ్యంతో కూడిన చూపు కాబట్టి ఇన్ని చూపులు ఉన్న జీవుడు కారుణ్యంతో కూడి ఉన్నటువంటి పరమాత్మని గనక చూసినట్లయితే ఈ ఆలోచనలన్నీ అణిగిపోయి కరుణా ప్రవాహాన్ని వెలుగుగా లోపలికి తీసుకోగలడు గనక అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని లోలోపల అనుభవిస్తున్నాడు భీష్ముడు అప్పుడు ఇంకా ఏముంది పరమాత్మని ఎప్పుడైతే మాటలతో చెప్పాలంటే పద్యాలు పాటలు కావాలి గాని మనసుతో చెప్పాలంటే మాటలు ఎందుకు కావలసింది కావలసింది ఒక్కటే చిత్తము మనీషాయత్తం కావాలి ఆ మనీషాయత్త చిత్తంతో దృఢమైన అటువంటి నిశ్చిత బుద్ధితో ఏమిటి నిశ్చిత బుద్ధి అంటే ఒక్కటే నా కట్టెదుట ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఎందుకని దర్శనం చతుర్భుజాలతో ఇచ్చాడు ఆయన రెండవది ప్రాణ నిర్గమన వేళ పరమాత్మ వచ్చినటువంటి సమయంలో కూడా కృష్ణుడిని ఇలాగే చూస్తూ ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటే బాగుండు అని అనుకోవద్దు అన్నాడు భీష్ముడు అసలు ఈ సమయంలో ఆయన రావటమే గొప్ప ఆ వచ్చాడంటే ఆయన చూస్తుండగా మనం ప్రాణం వదిలిపెట్టాలి అనుకున్నాడు ఆ భీష్ముడి యొక్క మనసు చూడండి ముందేదో ధర్మరాజు పాపం పిల్లలు అన్ అంతా అయిపోయింది విచారణ అయింది అయిన తర్వాత లోకం వీడింది లోకేశ్వరుడు కనపడ్డాడు లోకేశ్వరుడు కనపడగానే మౌనభూమికలోకి వెళ్ళాడు మౌనంగా హృదయము లోపల నుంచి అనేకమైనటువంటి ఆలోచనలు వెలుగుతుంటే మనస్సు ఆయనకి మానసిక పూజ చేసింది శ్రీకృష్ణ పరమాత్మకి మనం చేసే బయట చేసేటువంటి శారీరక పూజ బాహ్య పూజ కంటే కూడా మానసిక పూజ చాలా ఉత్తమమైనటువంటి పూజ అందులో ఎవరుంటారంటే మనం ఉంటాం పరమాత్మ ఉంటాడు కానీ బయట చేసే బాహ్య పూజలో మనం ఉంటాం పరమాత్మ ఉంటాడు కానీ ఎలా అంటే రమణులు చెప్పినట్లుగా భగవాన్ రమణ మహర్షి ఈ విగ్రహం ఆ విగ్రహాన్ని పూజిస్తోంది అంతే అన్నారాయన అది విగ్రహమే ఇది విగ్రహమేనన్నారు అలా కాదు లోపల ఎప్పుడైతే మనీషాయత్త చిత్తం మనకొకటి ఏర్పడిందో ఆ పరమాత్మ యొక్క దివ్య భావనలో మన మనసు లగ్నమైపోతుంది ఎప్పుడైతే మన మనసు ఆయన యందు లగ్నమైపోయిందో మనకు మనస్సు అంటూ ఏముండదు ఈ మనసు పోగొట్టుకోవడానికి ధ్యానం చెయ్ యోగం చెయ్ అది చెయ్ ఇది చెయ్ ఎన్నో ఉన్నాయి ఇదేం అక్కర్లేదన్నాడు భీష్ముడు పరమేశ్వరుడి యొక్క దివ్య దర్శనాన్ని చూస్తున్నటువంటి వేళ ఇంకా నీ మనసు గనక కోరికలతో ప్రాపంచిక కామనలతో వ్యధతో అనేక విధాలుగా గనక ఉన్నట్లయితే ఆ దర్శనం నిరర్థకం పరమాత్మను దర్శిస్తున్నటువంటి వేళ మనకి పరమాత్మకి ఉన్నటువంటి ఆ ఏకాత్మ భావన దృఢపడాలి ఆ ఆనంద వారాశిలో మనం మునుకలు దేలుతూ ఉండాలి గనుక భీష్ముడి యొక్క మనసు ఎంత ఆనందతాండవం చేస్తున్నదంటే త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్ధి మీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిం రంజిల్ నీలాల కౌరజ సంయుక్త ముఖారవిందము అతి సేవ్యంబై విజృంభింప మా విజయుండు చేరెడు వన్నెలాడు మది నావేశించు ఎల్లప్పుడున్ కృష్ణుణ్ణి ఉత్తరాది వాళ్ళంతా నటవరుడు అంటారు కాస్త పరమాత్మతో చనువు సఖ్యము ఉన్నటువంటి భక్తుడు ఏమంటాడంటే పరమాత్మ కాస్త తుంటరి అంటాడు తుంటరి అంటే మన ఊహకి అతీతంగా చేసే పని పిల్లవాడు మనం వాడేదో పాలు తాగాడు చాప మీద పడుకున్నాడు అనుకుంటాం వాడు ఏం చేస్తాడంటే మన కన్ను బెప్ప తుంటరి పని చేస్తాడు పరమాత్మ కూడా మాయకమ్మి తుంటరి పని చేస్తాడు గనుక అది నిందాస్తుతి కాదు స్తుతి కాదు పరమాత్మని మానసికంగా భావించేది ఎట్లా ఉన్నాడంటే శ్రీకృష్ణ పరమాత్మ త్రిజగన్మోహన నీలకాంతి మూడు లోకాలలో ఉన్నటువంటి నీలమైనటువంటి అట్టమైనటువంటి కాంతి ప్రకాశిస్తూ ఉండగా ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయం రంజిల్ తెలవారుతుండగా వెలు వికసించినటువంటి పుష్పము యొక్క రంగుతో కూడినటువంటి ఒక వల్లె వాటి దానిని ఉత్తరీయం అంటాం ఆ ఉత్తరీయం వేసుకున్నట్లుగా నీలాల కౌరజ సంయుక్త ముఖారవిందము అతి సేవ్యంబై విజృంభింప మా విజయున్ చేరడివన్నెలాడు ఆ శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరకు ఎట్లా వెళ్తాడు అంటే ఇంత happy గా వెళ్తాడట ఇంత ఆనందంగా వెళ్తాడట ఎలా వెళ్తాడో ఈయన ఎలా చూసాడయ్యా అంటే ఎదురుగా కూర్చున్నాడుగా రధం మీద ఈ కృష్ణుడు అర్జునుడు ఎలా ఉంటారో ఆయన దృశ్యం అదే చూస్తున్నాడు యుద్ధం పై పైన చేస్తున్నాడు కానీ ఎప్పుడైతే ఆ వన్నెలాడైనటువంటి కృష్ణుడు లీలా మానుష విగ్రహ స్వరూపుడైనటువంటి కృష్ణుడు మా విజయున్ని చేరేటువంటి కృష్ణుడు నా వైపు వస్తున్నాడు అంటే రెండు అర్థాలున్నాయి విజయుడు అంటే అక్కడ అర్జునుడి దాకా వెళ్ళినటువంటి కృష్ణుడని ఒక అర్థమైతే నాకు ఉద్ధారణ ఇవ్వటానికి నాకు విజయాన్ని సిద్ధింపజేయటానికి వస్తున్నటువంటి కృష్ణుడు అనేటువంటి వన్నెలాడు నా దగ్గరకు వస్తున్నాడన్నాడు ఉద్ధారణ ఇవ్వటానికే వస్తున్నాడన్నాడు ఇంకా వేరే మార్గం లేదు [పాట] నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్య మధ్యమక్షోణిలో పరులీక్షింప భీష్ముడికి దృశ్యాలు గుర్తొస్తున్నాయి ఎట్లా చూశాడట మొట్టమొదటిసారి యుద్ధంలో కృష్ణుణ్ణి అంటే నరుమాటల్ విని అర్జునుడు ఏదో అడుగుతున్నాడు ఈయన నవ్వుతున్నాడు ఆయన అడుగుతున్నాడు ఈయన నవ్వుతున్నాడు ఆ అడగటంలో నవ్వటంలోనే భగవద్గీత పుట్టింది పుట్టిందంతా మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్లల్లో సూక్ష్మ శరీరధారి అయినటువంటి కృష్ణుడు చక్కగా ఏడు వందల శ్లోకాలలో ఉన్న భగవద్గీతని బోధన చేసేశాడు ఈ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో దూరంగా ఉన్న వాళ్ళకెవరికీ తెలియదు గానీ దృశ్యం మాత్రం ఏదో కనిపిస్తున్నది [పాట] ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింప రధంబు నిల్పి పరభూపాలావళెం చూపుచున్ పరభూపాయువులు ఎల్లచూపులన శుంభక్కేలి వంచినంచు ఈ పరమేശുండు వెలుంగుచుండెను హృత్ పద్మాసనాసీనుడై. ఆ మహాభారత సంగ్రామం మధ్యలో అర్జునుడు ఏదో అడుగుతుండగా కృష్ణుడు ఏదో చెప్తుండగా ఆ దివ్య లీలా విలాసాన్ని అనుభవిస్తున్నటువంటి నా హృదయంలో ఉన్నాడు ఆ కృష్ణుడు ఎలా ఉన్నాడు అప్పటి కృష్ణుడిలా ఉన్నాడు ఏం చేసాడయ్యా ఏం చూపించాడంటే పరసైన్యం అంతా ఇది దీన్ని దీన్ని వాణ్ని దీన్ని సంహారం చేయమన్నాడు వాళ్ళ వాళ్ళ ఆయువులన్నీ నేను ముందే తీర్చేశానని చెప్తున్నాడు ఈ చెప్తున్నటువంటి లీలానటవరుడైనటువంటి శ్రీకృష్ణుడే నా హృదయ పద్మస్థానంలో కూర్చొని ఉన్నాడు అన్నాడు హృత్ పద్మ ఆసనాసీనుడై అంటే హృదయ పద్మంలో ఎవడున్నాడు అంటే ప్రతి జీవుడి యందు పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మ అక్కడా ఇక్కడా లేడు స్వామి చెప్పారే ఎతట నున్నవాడు సాయి అని ఎన్ని విధంబుల వెదకి చూచినన్ పత్రిని లేను పత్తని లేను సర్వ హృదయంబుల నిండి ఉంటే నను సత్యము తెలుపగా వచ్చెను సాయియై సత్య సాయియై అది అట్లా వచ్చాను ఇట్లా కూడా వచ్చాను కానీ నేను ఎక్కడ ఉంటాను అంటే మాత్రం సర్వ హృదయాలలోనూ ఉన్నానన్నాడు సర్వ హృదయాంతరస్థుడైనటువంటి పరమాత్మని భీష్ముడు దర్శనం చేసుకున్నాడు [పాట] తనవారి చంపజాలక వెనుకకు పోయిచ్చగింపు విజయుని శంఖన్ ఘనయోగ విద్య బాపిన మునివంజుని పాద భక్తి మొనయన్నాకున్. నా వాళ్ళన్ వాళ్ళన్ చంపు వీళ్ళన్ చంపు అని మా వాళ్ళను చూపిస్తుంటే మమ్మల్నందరినీ చూపిస్తే మా వాళ్ళని నేనెలా చంపగలనని వెళ్లి వెనక్కి వెనుదిరిగి వెళ్తున్నటువంటి వాణ్ని ఆపి ఘనయోగ విద్య అదే భగవద్గీత ఘనయోగ విద్యను బోధించినటువంటి మునివంజుడైనటువంటి అందరి మునుల చేత నమస్కరింపబడినటువంటి పరమాత్మ స్వరూపమైన కృష్ణుణ్ణి నేనిప్పుడు ధ్యానిస్తున్నానన్నాడు ముందు అర్జునుడికి బోధ చేసినటువంటి వాణ్ని అర్జునుణ్ణి వారించినటువంటి వాణ్ని అర్జునుణ్ణి ఉత్సాహపరిచినటువంటి వాణ్ని ఆ దృశ్యాలన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి అప్పుడన్నాడు సరే ఇదంతా జరిగింది ఆయనక్కూడా ఒక encounter వచ్చింది ఎవరికి భీష్ముడికి ఆరోజు రేపు యుద్ధం జరుగుతుందనంగా దుర్యోధనుడు శిబిరంలో తాత పాదరవారిన పట్టుకున్నాడు భీష్ముణ్ణి ఏం తాతా మేము పోవాలి పాండవులు గెలవాలన్నట్టు యుద్ధం చేస్తున్నావే అలా నువ్వు గనక చేస్తే ఎట్లా మరి పాండవులే గనక గెలిచినట్లయితే మా పరిస్థితి ఏమిటి అన్నాడు అని ఏమైనా నువ్వు కాస్త పాండవ పక్షపాతివిలే అన్నాడు ఆ మాటంటే చాలు పౌరుషాగ్ని రగలటానికి ఒక కారణం కలగటానికి ఆరోజున భీష్ముడు ఒకటే మాట చెప్పాడు అర్జునుణ్ణి చంపి నాకప్ప చెప్పమని అడిగాడు దుర్యోధనుడు భీష్ముడు చెలరేగాడు యుద్ధంలో కురువృద్ధుడు చాలా పెద్దవాడు ఆ బాణ పరంపరకి అర్జునుడు ఊగిపోతున్నాడు ఇంకో రెండు నిమిషాలు మూడు నిమిషాలు గనక అయితే అర్జునుడు ఏమవుతాడో తెలియని పరిస్థితి ఏర్పడినప్పుడు కృష్ణ పరమాత్మకి తన అర్జునుణ్ణి కాపాడుకోవాలని మాత్రం అనిపించింది అనిపించి ఏం చేశాడు ఆయనకొక ఉద్రేకం నటించవలసి వచ్చింది మరి ఆయుధం పట్టను ఆ పని చేయను ఈ పని చేయను అని అన్నాడు కదా కానీ చక్రం పట్టవలసి వచ్చింది దేనిని సుదర్శన చక్రాన్ని కాదు ఆ సంగ్రామ రంగం మధ్యలో ఏదో ఒక విరిగిపోయిన రధానికి ఉన్నటువంటి ఒక చక్రాన్ని చూపుడు వేలు మీద ఎత్తాడాయన ఎత్తి ఎటువైపు పరిగెత్తుతున్నాడంటే కృష్ణుడు రధం దిగాడు గుర్రాలు లేవు పగ్గాలు లేవు భీష్ముడి వైపు వస్తున్నాడు [పాట] కుప్పించి ఎగసిన కుండలంబుల కాగగన భాగం వెళ్ళ కప్పికొనగా ఉరికిన బోర్లక ఉదరంబు లోపలి జగముల వేగున జగము కదల చక్రంబు చేపట్టి పై దంచు సనువున పైనున్న పచ్చని పటము జార చక్రం పట్టుకొని ఇలా దిగుతున్నాడట శ్రీకృష్ణుడు చెవులకి కర్ణకుండలాలకు పెట్టుకున్నటువంటి ధగధగాయమానమైనటువంటి ఒక వెలుగు ఏదైతే ఉన్నదో ఆకాశాన్ని కమ్మేసింది అట అది ఆకాశాన్ని వెలిగిస్తూ ఉన్నది అట అలాగే ఎంత ఆవేగ వేగాలతో ఆయన కిందకు దూకాడో పద్నాలుగు భువనాలని లోపల పెట్టుకున్నటువంటి పురుషోత్తముడే పరిగెత్తుతున్నప్పుడు అందులో తాను ఉన్నటువంటి అంటే భీష్ముడు కృష్ణుడు అర్జునుడు ఉన్నటువంటి ఈ లోకం కూడా కదిలిపోయింది అట అంతే కాదు పైనున్నటువంటి పచ్చని పటము జార ఆ ఉత్తరీయం జారిపోయిందట కింద ఎప్పుడో చక్రంబు చేయబట్టి చనుదెంచు రయమున పైన ఉన్న పచ్చని పటము జార అప్పుడు ఈయన కింద దిగి ఈ చక్రం పట్టుకొని పరిగెత్తుతూ వెళుతూ ఉంటే వెనక నుంచి అర్జునుడు దిగాడట పరిగెత్తుతున్నాడు ఈయన వెనక ఏమన్నాడు నమ్మితి నాలావు నగు బాటు సేయక మన్నించుమని క్రీడి మరల దిగువ ఏమయ్యా నువ్వు లేకుండా నేను ఒక్కడినే యుద్ధం నడుపుతానని ప్రమాణం చేసి చెప్పొచ్చాను చివరకు గనక ఈ భీష్ముడికి ఏదన్నా అయితే అర్జునుడివి చేతకాదని అనుకోదా ఈ లోకం కాబట్టి నమ్మితి నాలావు మన్నించమన్నాడు చక్కగా నువ్వు వెనక్కి రమ్మన్నాడు అప్పుడు మద్విషిక వృష్టి మరలి తనుదంచు దేవుండు దిక్కు నాకు నేను ఇప్పుడు ఒక్కసారి ఈ భీష్ముడిని చంపి అర్జునుడిని కాపాడుతానని ప్రతిజన-ప్రతిన చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దృశ్యమే నా హృదయంలో కలుగుతున్నది అన్నాడు
SSSMC · audio
Bhagawata Navaneetham - 07
Bhagawata Navaneetham - 07
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 32:30
More in this series