No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శీల స్థితాం మజ్జన్మాంతర పుణ్య పాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబెన విహీనం యో మాపం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్వరూపాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ వేద వ్యాస ప్రోక్త బమ్మెర పోతనామాత్య కృత మహాభాగవతంలో భాగవతం అభనీతంగా భాగవతాన్ని మనం స్పృశిస్తూ ఉన్నాం. కథ వేరు, అర్థం వేరు, అంతరార్థం వేరు కావు. పాలలో దాగిన వెన్నలా, వెన్నని కాస్తే వచ్చే నెయ్యిలా ఈ మూడు కూడా భావం, రూపం, తత్వం, అర్థం కలిసి ఉంటాయి. సాధకుడు అయినటువంటి వాడు కథా గానంతో, కథా గమనంతో, కథా కథనంతో ద్వైతాద్వైత మార్గంలో ఆగిపోకుండా అంటే దైవమా! నువ్వు వేరు, నేను వేరు అన్న భావన లేకుండా నీవే నేను, నేనే నీవు ఇంతకాలం ఎరగక జీవించాం. నిన్ను వేరుగా భావన చేశాం. నువ్వు ఎక్కడో ఉన్నావ్ అనుకున్నాం. అంతా దేవుడి దయ అంటూ ఆకాశం లోకి చేయి చూపిస్తాం. ఆయన అక్కడ లేడు. అక్కడా ఉన్నాడు, ఇక్కడా ఉన్నాడు. కాబట్టి ఈ పూర్ణమైన అద్వైత స్థితిలోకి జీవుడు వెళ్ళాలి కనుక, ఈ పూర్ణాద్వైత స్థితిలో మానవుడు పరమ ఆనందాన్ని అనుభవించాలి గనుక, ఆ ఆనందమే మానవుడి సహజ స్వభావం కనుక, ప్రాపంచికంగా ఎన్నెన్ని అననుకూలాలు ఏర్పడినా, ఎన్నెన్ని ఇబ్బందులు ఉన్నా, మనీషాయత్తమైనటువంటి చిత్తం, జ్ఞానాధిక్యమైనటువంటి మనస్సు, జ్ఞాన స్థితిని కూడా దాటినటువంటి మనస్సు గనక ఉన్నట్లయితే అది ఆనందానికి దారితీస్తుందని, ఆ ఆనంద పరమావధి భక్తి అని, ఆ భక్తి యొక్క ప్రా-పారవ్యమే ప్రేమ అని, ఆ ప్రేమ యొక్క నిరవధికమైనటువంటి అవధులు లేనటువంటి స్థితి దాని పేరు జ్ఞానం అని, ఆ జ్ఞానం యొక్క స్థితే ముక్తి అని, ఆ ముక్తే మోహ క్షయం అని పరీక్షిత్ మహారాజుకి శుకదేవుడు చెప్తున్నాడు. సామాన్యుడా శుకుడు? వేద సారాన్ని ఎరిగిన వాడు, అవధూత స్థాయిలో ఉన్నవాడు. తన దేహం తనకు ఒకటి ఉన్నదని, దేహిగా సంచారం చేస్తున్నానన్న భావనే లేనటువంటి పూర్ణ పురుషుడు ఆయన. పురుషులలో పురుషుడు, స్త్రీలలో స్త్రీ, బాలులలో బాలుడు, వృద్ధులలో వృద్ధుడు. జ్ఞాన వృద్ధుడు ఆయన. కాబట్టి శుక మహాదేవుడి నుంచి శుకము అంటే చిలుక. చిలుక పలుకుల వలె వేదోక్తులు, ఉపనిషన్మూర్తి మంతమైనటువంటి భావాలు అన్నీ కూడా తనకు ఇవ్వబడినటువంటి ఏడు రోజుల సమయంలోనే ముక్తికి మార్గం అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజు. ముక్తికి మార్గం చెప్పటానికి గురువులు ఉన్నారు. కానీ ముక్తి పొందేది ఎవరు అని, ఎలా పొందాలి అని. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం. ఎవడి ఆత్మని, ఎవడి జీవితాన్ని, ఎవడి బతుకుని, ఎవడి సాధనని, ఎవడి అంతరంగ శోధనని వాడే నిర్ణయించుకోవాలి, సాధన చేయాలి, శోధన చేయాలి, సాధనాంతంలో సానందంగా జీవితాన్ని పరిసమాప్తం చేసుకోవాలి. పరిసమాప్తం అంటే కథ ముగించటం కాదు, కథని పరమేశ్వరుడితో కలుపుకోవటం. ఇంతకాలంగా మన కథ వేరు, ఆయన కథ వేరు అనుకొని ఆయన పుస్తకాన్ని పారాయణం చేసి ముక్తి వచ్చేస్తుంది అనుకుంటాం. మన జీవితాన్ని కూడా పారాయణం చేయాలి. ఎందుకంటే ఇది మామూలు జన్మ ఏం కాదుగా. మరి పరీక్షిత్ మహారాజు ఎటువంటి వంశంలో పుట్టాడు. నువ్వు ఇంకా ఏడు రోజుల్లో పోతావు అని చెప్తే, పోతే పోతాను గాని ముక్తికి మార్గం ఏమిటో చెప్పండి అని అడిగాడే. ఎంత ధీశాలి. అహల్య కూడా శాపవిమోచనం అడగలేదు ఆమె. నువ్వు రాయివి కా అంటే గౌతమ మహర్షిని ఆమె అడిగింది, రాయిని అవుతా కానీ మోహం పోతుందా? రాయిని అయినా మోహం పోదా పోతుందా అని అడిగింది. అది ఉత్తమోత్తమమైన ప్రశ్న, ధార్మికమైన ప్రశ్న. ధర్మశాస్త్రం ఎరిగిన గౌతముడు అన్నాడు, రాయివైనా మోహం పోదు, రామచంద్రుడు వచ్చి తాకితే మోహం పోతుంది అన్నాడు. మరి జగన్మోహన మంగళ స్వరూపుడైన రామచంద్ర ప్రభువు రావటం ఏమిటి? ఒక స్త్రీమూర్తిని తాకటం ఏమిటి? తాకిన మరుక్షణం ఆమెకి మోహ నిర్మూలనం కావటం ఏమిటంటే, పర పురుష స్పర్శ కాదు కావలసింది, పరమ పురుష స్పర్శ కావాలి. అందుకనే భగవంతుణ్ణి తాకాలి. దర్శన, స్పర్శన, సంభాషణ అని ఎందుకన్నారంటే అసలు ముందు పరమేశ్వరుణ్ణి చూడాలి. సాకారంగానో, సగుణంగానో, నిరాకారంగానో, నిర్గుణ పరబ్రహ్మ తత్వంగానో ముందు చూడాలి. చూసి చాలు అనుకోవటానికి వీల్లేదు. ఎప్పుడైనా ఆయన్ని తాకే ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయాలి అంటే పరమేశ్వరుడు పంచభౌతిక దేహాన్ని తీసుకుని వచ్చినా, ప్రత్యణువులలోనూ పరమాత్మ శక్తిని నిబిడీకృతం చేసుకొని ఉన్నాడు గనుక, ఆ స్పర్శానుభవంలో ఎవరెవరికి ఏం కావాలో దొరుకుతుంది గనుక, నిన్న చెప్పుకున్నట్లుగా ఆ స్పర్శ అంటే అదొక దేహం. పద్నాలుగుల దేహం అది. అది పద్నాలుగుల లోకం. కింపురుష లోకం అని దానికి పేరు. ఆ కింపురుష స్పర్శ ఎప్పుడైతే మహాత్ముణ్ణి మనం తాకుతామో మనకు ఏర్పడినటువంటి జన్మాది అపాయాలన్నీ నశిస్తాయి. కార్మికమైనటువంటి దుష్ట పరిణామాలు ఏదన్నా గనక ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. దుఃఖంతో మగ్నమైనటువంటి మనస్సు ఉన్నట్లయితే పరమాత్మ యందు అదే మనస్సు నిమగ్నమవుతుంది. ఇక్కడ మగ్నమవుతుంది, అక్కడ నిమగ్నమవుతుంది. కాబట్టి సంభాషణ కూడా కోరుకోవాలి. ఎప్పుడన్నా ఒక్క పలకరింపుకు నోచుకోవాలి. ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే మహాత్ముడి యొక్క వాక్కు శుద్ధవాక్కు.శుద్ధ వాక్యే కాదు రష్య వాక్యం అన్నది అవుతుంది. ఏమంటే అవుతుంది అని ఆయన ఏమంటే అది అవుతుంది. మనకి ఏం కావాలో అడిగితే అది అవుతుంది అంతకంటే ఏం కావాలి. కాబట్టి దర్శన స్పర్శన సంభాషణాది స్థితులన్నీ కూడా ఈ వైరాగ్య భూమిక లో నిన్న దేవహుతి తన తల్లికి కపిలుడు బోధ చేశాడు. ఆత్మ అంటే ఏమిటి ఒక పార్శ్వం, కాలం అంటే ఏమిటి రెండో పార్శ్వం, మోక్షం అంటే ఏమిటి మూడో పార్శ్వం, భక్తి అంటే ఏమిటి నాలుగో పార్శ్వం. అనేక విధాల తల్లికి ఉపదేశం చేశాడు. అయితే ఇవాళ పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, అయ్యా హరినామ సంకీర్తనంతో హరినామ గాథా శ్రవణంతో మనస్సు ఆనంద రంజిత అవుతున్నది. అయితే పరమశివుడి సంగతులు ఏమన్నా ఉన్నాయా? భాగవతం అంటే కృష్ణుడి కథే అనుకుంటాం. ద్వైతంలో కృష్ణుడి కథే, అద్వైతంలో అది శివకేశవ కథ. ఆ శివకేశవ కథలో శివుడు భిన్నం కాదు, కేశవుడు భిన్నం కాదు. వీరిద్దరికంటే నిజానికి బ్రహ్మ కూడా భిన్నం కాదు. బ్రహ్మ ఆలోచన, శివుడు ఆచరణ, విష్ణువు ఆదరణ. ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకోవాలి. మనకివ్వబడినటువంటి జీవితం ఇక్కడ ఎన్నాళ్లున్నా, ఎన్నేళ్లున్నా ఇవ్వబడినటువంటి జీవితం అంతా విష్ణుమయం కావాలి. ప్రాణం నిర్గమించేటువంటి ఆ మహత్తరమైనటువంటి వేళ, మనం ప్రాణం వదిలిపెట్టేటువంటి వేళ అది దివ్యమైనటువంటి క్షణంగా భావన చేస్తే అక్కడ సదాశివుడి యొక్క రూపాన్ని, నామాన్ని, భావాన్ని, తత్వాన్ని అన్నింటినీ కూడా మరణం చేస్తూ ఉండాలి ఆ క్షణాన. ఇక బ్రహ్మ నిత్య సంకల్పుడు ఆయన ఆలోచన లేనిదెక్కడ? మానవ మేధలో మేధ కంటే మనకున్నటువంటి brain cells లో నిజానికి ఒక second కి ఆరువేల ఆలోచనలు పుట్ట-పుట్టించగలిగిన శక్తివంతమైన సాధనం మన brain. దాన్లో మనం వాడుతున్నది పాయింట్ జీరో జీరో ఫైవ్ percent. పాయింట్ జీరో జీరో ఫైవ్ percent గనక వాడితే వాడికి భారతరత్న ఇస్తున్నాం. అంటే భారతరత్న వచ్చిన వాడి మేధ ఎంత వాడబడింది అంటే పాయింట్ జీరో జీరో ఫైవ్. మరి మిగతాంతా ఏం చేద్దాం? ఇదంతా ప్రాపంచికమైనటువంటి ఉపయోగం, వినియోగం. మిగతాదంతా పరమేశ్వరుని యందు సంస్థితమై, నిశ్చలమై, నిర్మలమై, నిర్వామయమై, నికేతనమై, నిరంజనమై, నిష్ఠమై ఉండాలి కనుక ఆ పరమోత్కృష్ట సాధనా మార్గమే అధ్యాత్మ యోగ మార్గం. అధ్యాత్మ మార్గాన్ని అంటే అధ్యాత్మ విద్యని, యోగ మార్గాన్ని సమన్వయం చేశాడు కపిల దేవుడు. కపిల మహాముని, కపిల ఋషి. ఆయన మహాముని, మహర్షి, దైవాంశ సంభూతుడు. సాక్షాత్తు శ్రీహరే కపిలుడిగా పుట్టాడు గనుక ఆ శ్రీహరే కపిలుడై, ఆ కపిలుడే దత్తాత్రేయుడై, ఆ దత్తాత్రేయుడే శ్రీ వేంకటేశ్వర స్వామి అయి ఈ కలియుగానికి ఒక పోషక కర్తగా నిలబడిపోయినాడు గనుక అటువంటి ప్రాతఃస్మరణీయమైనటువంటి దేవీదేవతా స్వరూపాలని, శక్తివంతమైనటువంటి వా-వారి యొక్క భావనా స్థితిని అన్నివేళలా మనం చక్కగా అనుష్ఠానం చేస్తూ, అనుభవిస్తూ, అనుభవిస్తున్న దాని వలన ఆనందాన్ని పొందుతూ, ఆ ఆనందం వలన శాంతిని పొందుతూ, ఆ శాంతి వలన పరమ శాంతిని పొందుతూ జీవితాన్ని గడపాలి. అయితే ఇవాళ ఒక different dynamics లో తీసుకెళ్తున్నాడు శుకుడు. ఆ different dynamics ఏమంటే పరీక్షిత్ మహారాజుకి ఇప్పుడు ఆత్మ ఎరిగి, ముక్తి ఎరిగి, మోక్షం ఎరిగి, కాలం ఎరిగి, జ్ఞానం ఎరిగి, భక్తి ఎరిగిన వాడికి ఇంకా ఏం కావాలి అని. అప్పుడు అడిగాడు ఆయన శివుడిని గురించిన కథ ఏదైనా, శివశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అర్ధనారీశ్వర తత్వంలో జరిగిన ఒక అద్భుతమైన గాథ ఏదన్నా ఉంటే చెప్పవయ్యా. హరినామ సంకీర్తనంతో మనస్సు చల్లబడింది గానీ పరమశివుడు ఏం చేశాడు ఈ జగత్తులో అంటే ఆయనకి ఒక ఆనందం కలిగింది శుకదేవుడికి. ఆయనకి శివుడైనా ఒకటే, విష్ణువు అయినా ఒకటే. కనుక ఆయన ఏమన్నాడంటే, ఇవాళ నీకు వీరభద్ర విజయం చెప్తానన్నాడు. వీరభద్ర విజయం ఎందుకు చెప్పాడు? పరీక్షిత్ మహారాజుకు అప్పుడు ఏం ఉపయోగం వీరభద్ర విజయం? ఊరికి అస్సరభః శరభః అని ఎగిరాడా? గంటులేసాడా? తాండవ నృత్యం చేశాడా? అంటే లౌకికమైనటువంటి జీవితం గడిపేటువంటి సాధకుడికి వీరభద్ర విజయంలో కొన్ని సూచనలున్నాయి. ప్రధానంగా స్త్రీమూర్తులకి. అందునా ప్రధానంగా పెళ్లి చేసుకున్నటువంటి పిల్లలకి, పెద్దలకి. నిన్న అనుకున్నాం, ఎప్పుడూ అనుకుంటాం భగవంతుడి యొక్క భద్రమైన స్థానం భక్తుడి యొక్క హృదయమేనని. స్త్రీకి పరమానందం కలిగించేది తన పుట్టిల్లు అని. ఎంత తనకి సొంత అష్టైశ్వర్యాలున్నా, ఎంత హాయిగా జీవితం చల్లగా గడిచిపోతున్నా తన పుట్టింట, అది పూరిపాక అయినా సరే, నిన్ననే చెప్పుకున్నాం, అక్కడ హాయిగా ఉంటుంది అంటుంది. మరి ఏమి హాయి ఉన్నది, ఎందుకున్నది అంటే అక్కడ సంపూర్ణమైనటువంటి మలినము లేనటువంటి ప్రేమ దొరుకుతుంది గనుక. ఈ మాలిన్యం లేని ప్రేమ కేవలం స్త్రీకే కాదు పురుషుడికి కూడా కావాలి. పురుషుడు ఎక్కడ పొందుతాడు అంటే సహధర్మచారిణి యొక్క ధర్మ వర్తనంలో నుంచి ఆనందాన్ని పొందుతాడు. తాను చేస్తున్నటువంటి సాధనలో తనకు ఆ భర్త సహకరించినా, సహకరించకపోయినా భార్య అడ్డు రాకుండా ఉంటే చాలు. స్వామి అంటారు, ఏం పని చేశాం కాదు, ఎంత చేశాం కాదు, చేస్తున్న వాడికి అడ్డం వెళ్ళకపోతే అసలు అన్ని సేవల కంటే ఉత్తమమైన సేవ అన్నారు స్వామి. అది ఎందుకంటే ఓ మంచి పని చేద్దామంటే అడ్డం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, జరగకుండా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, అదే పనిలో ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇది లోకం. లోకాన్ని వీడి రసం లేదు. లోక లోకాతీతమైనటువంటి ఒక భావన ఆంతరంగిక స్థితే గాని, అది వాస్తవికమైన absolute reality ఏది అంటే ఇదిగో మనం గడుపుతున్నటువంటి జీవితం.దీన్ని మించి మరొకటి లేదు మిగతావన్నీ ఊహలే మిగతావన్నీ ఆలోచనలే అట్లా ఉండవచ్చు ఇట్లా ఉండవచ్చు అనుకోవటమే నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఉన్న వాస్తవం ఏంటంటే నువ్వు తెల్లవారి నిద్రలేచినప్పటి నుంచి రాత్రి వరకు పడుకొని జీవించేటువంటి ఆ జీవితమే వాస్తవం గనుక ఇక్కడ అమ్మవారు అంటే పార్వతీదేవి ఓ రోజున హాయిగా పరమేశ్వర లాస్యంలో అప్పటిదాకా చక్కగా ఇద్దరూ కలిసి ప్రదోష వేళ అంటే సాయం సంధ్య వేళ మనం హంసానంది పాడుకునేటువంటి వేళ అన్నమాట ఇకపై ఆ హంసానంది పాడుతున్నప్పుడు ఈ రెండు పరమహంసలు కలిసి ఆనందిస్తూ లాస్యం చేసినయ్ తాండవం శివుడు ప్రళయ కాలంలోనే చేస్తాడు లాస్యం మాత్రం ప్రతిరోజూ పొద్దున సాయంత్రం చేస్తాడు లాస్యం చేసేది అమ్మవారిని తన నుంచి బయటకు తీసి తనలో నుంచి విడివడినటువంటి అమ్మవారితో అడుగులో అడుగు వేస్తూ లాస్యం చేస్తాడు లలితంగా అలతి అలతి పదాలతో నెమ్మదిగా గంభీరంగా చేస్తాడు అప్పుడు సృష్టి ఆరంభ వేళ అప్పుడే సూర్యుడు ఉదయించేటువంటి వేళ జ్ఞాన భాస్కరుడు ఈ జగత్తుని ఆవేశించేటువంటి వేళ అది ప్రప్రథమ ప్రదోష వేళ అది పొద్దున పూట ఉంటుంది సాయంత్రం జరిగేది సంధ్యా సమయంలో కూడా శివుడు లాస్యం చేస్తాడు ఇలాగే మళ్ళీ అమ్మవారితో చేస్తాడు అక్కడ ఈ గడిచినటువంటి జాగ్రద అవస్థ అంతా అయి ఇక నిద్రావస్థలోకి రెండవ అవస్థలోకి వెళ్లే సంధ్యా సమయం అది ఒక junction కాబట్టి అక్కడ శివుడు అమ్మవారితో మళ్ళీ లాస్యంగా చేస్తాడు ఆ లాస్యంలో కైలాసంలో ఉన్నటువంటి అమ్మవారు అయ్యవారు కైలాసం నంది చంద్రుడు భృంగి వీళ్ళందరూ కూడా తెల్లగా ప్రమథ గణాలు మొత్తం కూడా తెల్లటి రంగులో వికాసమానం చెంది ఉంటారు ఆ తెల్లటి రంగు శుద్ధ చైతన్యానికి గుర్తు ఆ శుద్ధ చైతన్యంలో ఏర్పడేటువంటి కదలికలు మెదలికల వలన పరమ ప్రకృతి కూడా సంధ్యోపాసన చేసుకుంటుంది మనకు తెలియకుండా మనమంటే ఎరిగి చేస్తాం చెట్లున్నాయ్ పుట్టలున్నాయ్ పాములున్నాయ్ అడవంతా అనేకమైనటువంటి వస్తు జాలాలున్నాయ్ వాటికే ఉపాసన లేదా అంటే పరమ ప్రకృతితో తాదాత్మ్యం చెందింది ఆ పరిపూర్ణ ఆనంద వైభోగ స్థితిలో అవి సంచారం చేస్తూ ఉంటాయి గనుక ఆ పరిపూర్ణమైన ఆనంద తారక స్థితిని అనుభవించటానికి జీవుడిని సమాయత్తం చేస్తాయ్ అది రెండవ ప్రదోష పూజ కంచి వారు గాని శృంగేరి భారతీ స్వామి వారు గాని పొద్దున సాయంత్రం చేసేటువంటి ఆ ప్రదోష పూజ అంటే ఇదే అంటే అక్కడ అమ్మవారిని లలితంగాను అయ్యవారిని సౌమ్యమూర్తి గాను రుద్రమూర్తి గా కాక లాస్య మూర్తిగా ఉపాసన చేసేటువంటి దివ్యమైనటువంటి మధుర క్షణాలు గనుక ఆ మధుర దివ్య క్షణాలలో పరమేశ్వరుడు లాస్యమూర్తిగా ఉన్నాడు అటువంటి వేళ అంటే ఆ ప్రదోష వేళ అయ్యవారితో కలిసి లాస్యం పూర్తి చేసింది చేసి హాయిగా కూర్చుంది ఇష్టమితంగా మరి శివుడు ఏం చేసాడయ్యా లాస్యం ఒక బహిరంగ ప్రదర్శన అందుకనే అరుణాచలంలో రమణ మహర్షిని చిదంబరం నుంచి వచ్చి చాలామంది భక్తులు ఆయన్ని ఒక్కసారి మా చిదంబరానికి రమ్మనమని ఆహ్వానం చేశారు పిలిచారు భగవాన్ మేమంతా వస్తున్నాం మీరు కూడా ఒక్కసారి మా చిదంబరం రండి నటరాజాలయానికి అన్నారు ఆయన అరుణాచల మణిమాలలో ఓ మాట చెప్తారు అచలుడయ్యు అంటే చలించటానికి వీలు లేని వాడైన అప్పటికి కూడా చిదంబరంలో శివ కామసుందరితో అడుగు తడబడుతూ వేస్తున్నాడయ్యా ఇక్కడ అరుణాచలంలో అమ్మవారు అయ్యవారు ఒకటే అది అరుణాచలమై అచలమై స్థిమితమై ఉన్నదయ్యా స్థిమితమై ఉన్నటువంటి పరమాత్మ తత్వంలో హృదయాన్ని నిలకడ చెందించుకోవాలి గాని లాస్యంతో మనకేం పని అన్నారాయన అంటే జ్ఞానికి మనస్సు అచలం కావాలి అరుణం కావాలి ఋణం ఏ రకమైన బంధనాలు లేని స్థితికి జీవుడు వెళ్ళాలి కనుకనే న ఋణాన చలా ఋణాచలా ఋణం లేదు అక్కడికి వెళితే అలాగే స్మరణం చేస్తేనే పరముక్తి లభిస్తుంది అరుణాచల క్షేత్రంలో అందుకనే కాశ్ కాశీలో మరణించటం కన్నా తిరువయ్యూరులో జన్మ ఎత్తటం కన్నా చిదంబరంలో నటరాజ దర్శనం కన్నా స్మరణాత్ ఒక్కసారి అరుణాచల శివ అన్నట్లయితే పరముక్తి లభిస్తుంది స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా అరుణామృత కరుణామృత జలధి అరుణాచలమిది అన్నారు రమణ మహర్షి కావ్య కంటలు ఆశ్చర్యపోయినారు ఇంత అందమైన తెలుగు ఎప్పుడు రాయగలిగారు భగవాన్ ఎక్కడ నేర్చుకున్నారు అని ఏమోనప్ప ఎవరో రాయించారని నేను రాశానన్నారాయన అంటే కరుణా సముద్రమే అరుణాచలమైంది అని మన మనస్సులు కూడా భాగవత శ్రవణ పానం తర్వాత ఈ శ్రవణం వినోదం కాకూడదు శ్రవణం అమృత పానం చేసినట్లుగా చేయాలి ఎందుకంటే అన్ని యోగాలలోనూ శ్రవణ యోగం కూడా చాలా గొప్పది ఇది ధ్యానం కంటే వెయ్యి రెట్లు గొప్పది నీలో నీవుండి నీ ఆలోచనను నీవు తెంపుకుంటూ దానితో మనో వ్యాపారం చేస్తూ కొన్ని గంటలు గడిపే కంటే ఉన్న కొద్ది క్షణాలలో పరమాత్మ యొక్క దివ్యతత్వాన్ని గనుక నీవు చక్కగా అర్థం చేసుకోగలిగినట్లయితే అది పూర్ణమైనటువంటి ముక్తికి దారితీస్తుంది అందుకనే స్మరణ మాత్రమునని నువ్వు స్మరిస్తూ ఉండగానే పరముక్తి లభిస్తుంది ముక్తి వేరు మళ్ళీ పరముక్తి వేరు ముక్తి అంటే నిన్న కపీనుడు చెప్పాడు ముక్తి అంటే మోక్షం అంటే స్వామి ఏం చెప్పారు మోహ క్షయమే మోక్షమని అట్లా ఎవరు ఏం చెప్పినా పరముక్తి అంటే ఇక పునరావృత్తి రహితమైనటువంటి ఒక దివ్య జీవనం కలుగుతుంది మళ్ళీ జన్మ ఎత్తటం అంటూ ఉండదు దానిని మించినటువంటిది మరొకటి లేదు గనుక ముక్తి వచ్చేదాకా జీవుడు జన్మ ఎత్తుతాడని అనుకున్నాం ఎన్ని జన్మలు ఎత్తుతాడంటే ముక్తి వచ్చేదాకా ముక్తి ఎప్పుడొస్తుందయ్యా నువ్వు ఎత్తిన ప్రతి జన్మని కూడా పరమాత్మ యందు మగ్నం చేసినిమగ్నం చేసి లగ్నం చేసి పరమాత్మ యొక్క దివ్య కాంతుల్ని నీ శరీర మనో బుద్ధి కాంతుడుగా గనుక మార్చుకున్నట్లయితే నీవు తేజోమయుడుగా గనుక విరాజిల్లినట్లయితే ఈ ప్రపంచంలో మూడు అవస్థలున్నాయి ఒకటి జాగ్రదవస్థ ప్రపంచంతో ఉంటాం ఈ విశ్వంతో కూడి ఉంటాం అప్పుడు మనకివ్వబడిన పేరు విష్ణుడు సాయంత్రం ఈ జాగ్రదవస్థ అలసి జగత్ వ్యాపారం నుంచి విముక్తమై పడుకుంటాం పడుకున్నప్పుడు సూక్ష్మ శరీరం పనిచేస్తూ ఉంటుంది అది నిద్రావస్థ అన్నాం ఆ నిద్రావస్థలో మన పేరు తేజస్సుడు విష్ణుడు తేజస్సుడు కాబట్టి మూడవదైనటువంటి సుషుప్తిలో ప్రాజ్ఞత్వం ఉంటుంది ప్రజ్ఞ ఉంటుంది స్థిమితత్వం ఉంటుంది ఈ మూడు మనకివ్వబడినటువంటి అవస్థలకు సంబంధించిన పేర్లు ఇలాగే ఈ అవస్థలన్నీ దాటినటువంటి అమ్మవారు గౌరవర్ణంలో ఉన్న గౌరీదేవి గౌరవర్ణం తెలుపుని వీట్ కలర్ అంటామే గోధుమ వర్ణాన్ని కలిగి ఉంటుంది ఆ అమ్మవారు అయ్యవారి దగ్గర కూర్చుని ఉంది లాస్య నుంచి అమ్మవారు విడిపోయిన తర్వాత తాను విడిగా ఒక దేహంగా ఉన్నప్పుడు అంటే మనం అనుకుంటాం ఎంత పై ఎత్తుకు వెళ్ళినా ఎంత లోలోతులకు వెళ్ళినా మళ్ళీ ప్రపంచంలోకి రావాలి అనుకున్నప్పుడు వినేటప్పుడు ఆ స్థితి వేరు మళ్ళీ ప్రపంచం ఉందిగా అది కాదని అనటానికి లేదు మళ్ళీ ప్రపంచం ఉంది మళ్ళీ ఉద్యోగం ఉంది మళ్ళీ డబ్బుంది మళ్ళీ జబ్బుంది అన్నీ ఉన్నాయి కాబట్టి దీంట్లోకి రావలసిందే ఈ అమ్మవారు కూడా లాస్య నుంచి బయటపడ్డప్పుడు అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే సంధ్యాకాలమైంది సంధ్యా సమయంలో అయ్యవారు తనతో తాను కూడి ఉన్నారు ధ్యాన ముద్రాంకితమైన స్థితిలో పరమశివుడు ఉన్నాడు తనతో తాను కూడి ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నదో ఆయనకు లక్ష్యం లేదు అక్కరలేదు ఏది జరగని ఏది పోనీ ఆయనకి దాని ప్రమేయం లేదు జాగ్రదవస్థలోనూ లేదు కాకపోతే కొంత స్పృహ ఉన్నది నిద్రావస్థలో అస్సలు లేదు కానీ నిద్రకి జాగ్రదవస్థకి మధ్యలో ఉన్నటువంటి ఈ సంధ్యోపాసనా సమయంలో అయ్యవారు హాయిగా కూర్చుని ఉన్నారు ధ్యానంలో ఉన్నారు ధ్యానం నుంచి ఆయన బయటకు రావాలి ఎందుకు రావాలి అమ్మవారు ఏదో ఒక దృశ్యాన్ని చూస్తున్నది ఆకాశంలో మామూలుగా కంటే ఆ రోజున ఆకాశం వెలిగిపోతున్నది ఆకాశంలో ఏదో ఒక కలకలం బయలుదేరింది కలవరం బయలుదేరింది ఆ కలవరము కలకట అంతా కూడా ఆనందంతో కూడిన కలకటగా ఉంది ఏదో ఒక గొప్ప దృశ్యాన్ని చూడటానికి వెళ్ళబోతున్నట్లుగా గొప్ప అనుభవం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆ వెళుతున్న వారంతా కైలాసాన్ని దాటి వెళుతూ ఉన్నారు వాళ్ళందరినీ చూస్తున్నది అమ్మవారు ఎలా వెళుతున్నారంటే దంపతులుగా వెళుతున్నారు ఒకళ్ళకొకళ్ళతో మాట్లాడుకుంటూ వెళుతున్నారు ఏం మాట్లాడుకుంటున్నారంటే దక్షుడు అనేటువంటి వాడు భూలోకంలో ఒక యజ్ఞం చేస్తున్నాడట ఆ యజ్ఞం నిజానికి అది సత్రయాగం ఆ సత్రయాగం వాజపేయ యజ్ఞం అని చేస్తున్నాడు వాజపేయ యజ్ఞంలో అప్పటికే వాడు మదాంధుడై ఉన్నాడు వాడి కథంతా మనకు తెలుసు ఒకసారి వాడు ఆ యజ్ఞానికి వెళితే బ్రహ్మ విష్ణువుతో సహా అందరూ లేచి వాడికి సాదరంగా స్వాగతం పలికారు పలకరించారు అంతా నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అన్నారు ఇగో ఇట్లాగే ఈయనకి నిమిషానికి ఒకసారి ధ్యానంలో ఉండిపోయే శివుడు పరాకు పడ్డాడు వాడు వచ్చినట్టేనా గుర్తించలే నా అంతటి వాడు వస్తే గుర్తించవా అని శివుడికి శాపం పెట్టాడు నీకు అసలు యాగ భాగమే అందకుండు గాక అన్నాడు కాబట్టి శాపగ్రస్తుడైనటువంటి అంటే అందింది అందలేదు యజ్ఞ భాగం పక్కన పెడితే శివుడు అట్లాగే ఉన్నాడు ఈ యాగంతో సంబంధం లేదు ఎందుకు లేదు అంటే యజ్ఞంలో భాగానికి అర్హత లేని వాడు కనుక దక్షుడు కూడా ఆయన్ని యజ్ఞానికి పిలవలే పిలవలేదు గనుక శివుడు వెళ్ళలే మరి బ్రహ్మ విష్ణువులు వెళ్లారా వెళ్లారు భృగుమహర్షి వెళ్ళాడు మిగతా కొంతమంది మహర్షులంతా వెళ్లారు ఈ వెళ్ళిన మహర్షులంతా ఎవరయ్యా అంటే శివుడికి అవమానం జరిగినటువంటి రోజున దానిలో ఉన్నటువంటి వారు ఇందులో రెండున్నాయి ప్రపంచంలో చెడు పని చెయ్యనే కూడదు అది ప్రాథమికం చెడు పని జరుగుతూ ఉన్నప్పుడు దానిని ఆపకుండా ఉండకూడదు అది రెండవది ఏదోలే ప్రపంచంలో ఇలాంటివి చాలా జరుగుతాయి మనకెందుకని వెళ్లిపోనూ కూడదు ఇంటర్ఫియర్ కాకూడదు ఇంటర్ఫియర్ కాకూడదు గాని ఇన్వాల్వ్ కాకూడదు గాని ఎక్కడో ఒక చోట ఇంటరాక్ట్ కావాలి అది అవసరం వాడికి చెప్పాలి ఇది జరుగుతున్న విధానం మంచిది కాదు అని చెప్పాలి అంతే ఆ బాధ్యత అయిపోతుంది అయితే శివుడు ఇక్కడ నిమిత్త మాత్రంగా ఉన్నాడు వాళ్ళెవరూ లేరు ఆయన సరేలే నువ్వు చేసే యజ్ఞంలో ఒక భాగం ఎంత ఎన్ని కోటానుకోట్ల యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి నీవు ఒక్కడి నుంచే కదా నా త్రాండ అనుకున్నాడో పైగా ఆయనకక్కర్లేదో అద్వైత మూర్తి గనుక ఆయన పట్టించుకోలే కానీ అమ్మవారు కదా వెళుతూ ఉన్నది అక్కడ ఒక సహజమైనటువంటి సామాన్య భూలోక స్త్రీ వలె ఈ కథలో వర్ణ వర్ణన జరుగుతుంది కానీ అక్కడ అమ్మవారైనా సరే అయ్యవారైనా సరే ఇప్పుడే చెప్పుకున్నట్లుగా పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ధరించి వచ్చిన అవతార మూర్తి కూడా కోపం లేకపోయినా కోపం నటించాలి ఇష్టం ఉందో లేదో ఇష్టం ఉన్నట్లు చూపించాలి అప్పుడప్పుడు నువ్వంటే నాకిష్టం లేదన్నట్లు ఉండాలి ఇదంతా కూడా అనుభవం కాదు ఇదంతా అభినయం ఈ అభినయం ఒక పరమాత్మ అందులో సత్పురుషుడు గనుక ఆయన ధ్యానంలో ఉన్నాడు అమ్మవారి చెవిన పడుతున్నది దక్ష ప్రజాపతి ప్రజాపతి అంటే మామూలు వాడు కాదు వాడు మహాయజ్ఞాలు చేశాడు దేవీదేవతల యొక్క దర్శనాన్ని పొందాడు ఏ మహర్షులు సాధించలేనిది సాధించాడు కానీ మదించాడు యమ నియమాలు లేనటువంటి స్థితిలో ఇంద్రియాలకు లోబడి ఉన్నాడు గనుక ఈ దక్షత కలిగిన వాడు గనుక దక్షుడయ్యాడు.సరే దక్ష ప్రజాపతి నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు నేను వెళ్ళాలి అనుకున్నది. ఈయన ధ్యానంలో నుంచి బయట పడ్డు. ఏదన్నా కన్ను తెరిచి తన వైపు చూస్తే మా ఇంటికి వెళ్లి వస్తాను అని చెప్పొచ్చు. ఆయన చాలా indifferent గా స్వాత్మ ఆనంద స్థితిలో తనలో తాను కూరుకుపోయి ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు ఆయన. సరే దేనికైనా సమయం రావాలి, యోగం కలవాలి. ఆ క్షణం వచ్చింది. ఆ కాలిక క్షణం వచ్చినప్పుడు, అంటే కాలంతో కూడిన క్షణం రావాలి. అన్ని క్షణాలు మనవి కావు, అన్ని క్షణాలు మనవి కాకుండానూ కావు. కానీ మనకు యోగించేవి, మనకు లాభించేవి, మనల్ని ఒక అనుభవానికి గురి చేసేటువంటివే దానిని అది చాలా చెడ్డ రోజు అంటాం. ఏం చెడ్డ రోజు లేదు, మంచి రోజు లేదు, అదొక రోజు. ఆ రోజులో ఆ యోగాన్ని మనం అనుభవించాలి అనుభవించేశాం. దాన్ని అద్వైత స్థితిలో పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయిలో విచారణ చేయాలి. అప్పుడు ఆయన ఎప్పుడైతే కళ్ళు తెరిచి అమ్మవారు ఎక్కడ ఉన్నదని చూసుకుంటే ఆమె చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఉన్నది అంటే ఎదురు చూస్తూ ఉన్నది. ఈయన ఎప్పుడు కన్ను తెరుస్తాడా ఓ మాట అడుగుదాము అని. తెరిచాడు. కన్ను తెరవగానే ఇంక ఆలస్యం చేయలేదు ఆమె. మళ్ళి ఎప్పుడు కన్నుమూసుకున్నా మళ్ళీ ఒక గంట పోతుంది. కాబట్టి వెంటనే ఏమన్నా ఏమన్నది అంటే, ఇదిగో చూస్తున్నారు కదా అంది. ఏముంది ఆయన అప్పటి దాకా ఏం చూడటం లే, ఏమి ఏం జరుగుతున్నది అన్నాడు. అదిగో అందరూ వెళ్తున్నారు. వాళ్ళ కాలి అందీల యొక్క మోత ఆకాశంలో నుంచి మేఘ గర్జన లాగా వినిపించటం లేదా? అనేకమైనటువంటి మాటలన్నీ కూడా శుద్ధ చైతన్యంలో నుంచి రావటం లేదా? నిర్-నిర్మమమైనటువంటి ఆకాశమంతా ఈ వ్యక్తులతో, సమూహాలతో నిండి పోలేదా? పరమేశ్వరా ఒక్కసారి గమనించు అన్నది. నువ్వు గమనించావు కదా ఏమి ఏం జరుగుతున్నది అన్నాడు. దక్ష ప్రజాపతి నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు వాజపేయ యజ్ఞం, అది చూసి రావాలి అన్నది. అనగానే ఆయన ఒక్కసారి వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే జరగబోయేది ఆయనకు తెలుసు, జరిగినది ఆయనకు తెలుసు. దక్ష శాపంలో ఉన్నాడు ఆయన. శపింపబడ్డాడు శివుడు. ఒక నిమిషం అయిన తర్వాత, వాళ్ళు ఇద్దరిద్దరుగా వెళ్తున్నారు కదా వాళ్ళని వెళ్ళనియ్ అన్నాడు ఆయన. అందుకే మీరు కూడా నాతో రండి అని. పైగా ఎక్కడికి వెళ్తున్నాం? మా వాళ్ళ ఇంటికే. మా వాళ్ళ ఇంటికి అంటే మీ మామ గారి ఇంటికి అన్నది. చాలా తెలివిగా. మీ మామ గారి ఇంటికి వెళ్తాం అంటే మామగారు ఒకడు ఉన్నట్టు, వాడి దగ్గరికి వాడి-వాడి మీద ఎల్లుడికి ప్రేమ ఉన్నట్లు, వాడికి ఏదో ఒక కాస్త ఆధిక్యం ఇచ్చింది. మా ఇంటికే వెళ్తాను అంటే, నీ ఇంటికి నువ్వు పో అంటాడు. అట్లా కాకుండా సామరస్యంగా అడిగితే ఆయన అన్నాడు ఇలా ఇలా జరిగింది కదా, ఆ యజ్ఞంలో నాకు శాపం ఇవ్వబడింది కదా, యజ్ఞభాగ్యం లేదు కదా అని అన్నప్పుడు ఆ తరువాత కథంతా మనం చక్కగా పోతనామాత్యుడి మాటల్లో మనం విందాం. మనం చతుర్థ స్కంధంలోకి ప్రవేశిస్తూ ముగ్గురు అమ్మలని కూడా మనం రోజూ ఉపాసన చేస్తూనే ఉన్నాం. శారదాదేవి గాన స్వరూపిణి సంగీతం, సాహిత్యం సమానంగా, సమంగా అలంకరించుకున్నటువంటి వాఙ్మయి ఆమె. అలాగే లక్ష్మీదేవి, అలాగే దుర్గ, ఈ ముగ్గురూ కలిపి పోతనామాత్యుడు ఉపాసన చేసుకున్నాడు. ఆ పద్యం "అమ్మల గన్న యమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ" కాబట్టి ఈ ముగ్గురమ్మలలో ఈవేళ అమ్మవారైనటువంటి పార్వతీదేవి యొక్క కథనే ఆయన పార్వతి విషాదం అని గాని, సతీ ఆహ్ దగ్ధ యోగం అని గాని, శివ పరాక్రమం అని కాకుండా శివుడి యొక్క ఒక్క అంశం వస్తేనే ఎట్లా ఉంటుందో, వాడు విజయాన్ని ఎలా సాధిస్తాడో, శివ పరమైనటువంటి భావాలని బొమ్మెర పోతనామాత్యుడు సహజమైనటువంటి వాసనతో రామచంద్ర దర్శనం అయినప్పటికీ కూడా విశ్వనాథ వారు అన్నట్టు జీవుని వేదన, జీవుడి యొక్క సంస్కారం, జీవుడి యొక్క trait and tendency ఆ రెండూ ఉంటాయి. ఆ రెండింటినీ కూడా సమన్వయం చేసుకొని శైవ సాంప్రదాయంలో శైవ భావనతో, శివ పూర్వకమైనటువంటి ఒకానొక మనసుతో, ఒక తత్త హృదయంతో దానికి ఆయన పేరు పెట్టాడు వీరభద్ర విజయం అన్నాడు.
SSSMC · audio
Bhagawata Navaneetham - 30
Bhagawata Navaneetham - 30
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 29:02
More in this series