Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం ప్రియాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాత్ పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ భరణీసురులకు తపము విద్యయు రెండు ముక్తి సేయుచుండు ముదముతోడ దుర్వినీతి దుర్వినీతులగుచు విద్యలోగు వారికి ఇదియ కీడు చేయక ఎల ఉండు తపస్సు విద్య రెండు ముక్తిని ఇస్తాయి అంటే ఇక్కడ చెప్తున్నాడు నువ్వు తపస్సు చేశావు తపస్సు వలన కొంత విద్యను సంపాదించావు విద్యను ఎటువంటి విద్యను సంపాదించావు నాకు అన్ని తెలుసు అనే విద్యను సంపాదించావు నాకు అన్ని తెలుసు అన్న విద్య అహంకారమే దాంట్లో నుంచి క్రోధం పుట్టింది క్రోధంలో నుంచి తామసం పుట్టింది తామసం లో నుంచి రాజసం పుట్టింది కనుక దుర్వాసుడు అయినాడు ఆయన దుర్వాసుడు అయినాడు ఆయన నా తేజము సాధులలో ఆకతమై యుండు వారి వలన Su జనులకున్ నా శక్తి నా తేజస్సు అంతా నా భక్తులలో ఉంటుంది వాళ్లతో కూడి ఉన్నవారందరికీ నా శక్తి ప్రవాహ వేగం చేర్చి వాళ్లలో జరబడుతుంది అదేపో బ్రాహ్మణ చూడండి విష్ణువు ఎలా పరిష్కారం చేశాడో సరేలే నువ్వు గొప్ప వాడివి పొరపాటు చిన్నది చేశావు చక్రమా ఆగు అనలా చెప్తున్నాడు ఆయన అదేపో బ్రాహ్మణ సదయుడు నా భాగసుతుడు జన వినుత గుణాస్పదుడు ఇచ్చు అభయము ఆతని మది సంతట పరచి వేడు మా శరణమున్ ఒక పని చెయ్ ఇక్కడికి ఇలా వచ్చావు కదా మళ్ళీ వెంటనే అంబరీషుడి దగ్గరికే వెళ్ళు వాడు నా శక్తితో కూడి ఉన్నటువంటి వాడు నా వాడు ముందు వాడి హృదయానికి ఉల్లాసం కలిగించు సంతోషం కలిగించు శరణార్థివై శరణు వేడు వాడు నిన్ను కాచుకుంటాడు అన్నాడు ఎందుకని అన్నాడంటే అలా గనక ప్రతి వాడు వైకుంఠానికి పరిగెత్తుకు వెళితే ఎట్లా రమణాశ్రమంలో ఒకసారి రమణ నామంతో ఉన్నటువంటి ఒక పిల్లవాడు పాము కాటుతో మరణించాడు తల్లి ఏడేళ్ల పిల్లవాడు పోయినాడేమి రమణా రమణా అని అరుస్తూ ఉన్నది రమణ మహర్షి పై నుంచి పరిగెత్తుకొని కిందకు వచ్చారు ఆమె అన్నది నిన్ను నేను పిలవలేదు భగవాన్ నా పిల్లవాడి పేరు రమణుడు వాడిని పాము కరిచింది పోయాడు అంటే ఆయన ఏమి పట్టించుకోకుండా పిల్లవాడి వైపే చూస్తూ ఉండిపోయారు ఒక ఐదు నిమిషాల్లో వాడు కళ్ళు తెరిచి లేచాడు లేవగానే ఆయన అడిగిన ప్రశ్న ఇంత సేపు ఏం చేశావు రా అని అడిగారు భగవాన్ ఇంత సేపు మిమ్మల్నే లోపల చూస్తున్నా ఇప్పటికి ఇక్కడికి వచ్చారా అన్నాడు వాడు చూశారా అంటే వాడు బతికాడు బతకగానే జయ జయ ధ్వానాలు మినుముంటున్నాయి పోయినాడు అన్న వాడు బతికాడుగా భగవాన్ తనకు ఏమి సంకల్పం లేనట్టే ఏమి జరగనట్టే వెళ్ళిపోతుంటే ఇద్దరు ముగ్గురు భక్తులు ఆయన వెంబడి పడి లేదా వెంట ఉన్నవారు ఉన్నారు భగవాన్ ఇట్లా మీరు అందరినీ రక్షించవచ్చు కదా అని ఒక మాట అడిగితే ఆయన అన్నారు మనది ఆశ్రమం కదా అప్పా ఇలా పోయిన ప్రతి వాడిని గనక బతికిస్తే దీన్ని మార్చురీ చేస్తారు ఏం చేద్దాం ఏదో పుట్టాడు పోయినాడు మళ్ళీ ఏదో శక్తి వాడిని బతికించింది వాడి దారిన వాడిని మన దారిన మనం ఉండనివ్వండి అన్నాడు కాబట్టి అనుగ్రహం అందరి యందు ఎందుకు ఉండదు అనే ప్రశ్న భగ భగవంతుడి అనుగ్రహం వాడి అవసరం ఉండాలి విభూతి ప్రదర్శన ఆయన చేయాలి అని శ్రీ వల్లభుడు ఆనతిచ్చిన మహోజ్జ్వల చక్ర కీలావళి జనితాయాసుడు నిర్వికాసుడు ఉదిత శ్వాసుడు దుర్వాసుడు అల్లన ఏతెనోచి సభక్తి గ్రాంచే భక్తితో చూశాడు అంబరీషుడిని భక్తి ఎక్కడి నుంచి పుట్టింది భయంలో నుంచి పుట్టింది వాడికి అంతకు ముందు లేదే ఇది ప్రాణ భయంలో నుంచి సద్భక్తి పుట్టింది వాడికి చూసి కరుణా లావణ్య వేషున్ విదేషు నయోధార మనీషు మంజు మితభాషున్ అంబరీషున్ వేషన్ చూస్తూ అలా ఉండిపోయి దుఃఖితుడై పాదం మీద పడ్డాడు కాళ్ళ మీద పడ్డాడు పడగానే పాపా ఆయన అంబరీషుడు ఆయన మనస్సు ఎంత ఎక్కడో హరి మీద నిలబడింది ఆయన మనస్సు అంబరీషుడు రావటం కాపాడమని అడగటం ఏమి జరగల ఎప్పుడైతే హరి చింతన యందు ఆయన మనస్సు లగ్నమై ఉన్నదో అప్పుడు హరి చక్రాన్ని స్తుతించాడు ఎవరు స్తుతించారు అంబరీషుడు అది అంబరీషుడు హరిని చక్రాన్ని నువ్వు ఆగు అని అనాలంటే స్తుతించాలి ఏమనాలి అంటే నీవ పాపకుడవు నీవ సూర్యుండవు నీవ చంద్రుండవు నీవ జలము నీవ నేలయు నీవ వేలయు నింగి నీవ సమీరంపు నీవ భూతేంద్రియ నికర నీవ నీవ బ్రహ్మంబు నీవ సత్యంబు నీవ యజ్ఞంబు నీవ ఫలము నీవ లోకేశులు నీవ సర్వాత్మయు నీవ కాలంబు నీవ జీవంబు నీవ బహు యజ్ఞ భోజివి నీవ నిత్యమూల తేజంబు నీకు నే మొకువాడ నిరజాక్షుండు చాలమన్నించునట్టి శస్త్ర ముఖ్యమా కావవే చాలు చాలు మునిని ఇంకా చాలు శస్త్ర ముఖ్యాన్ని విరుగు అంటే ఆయనకున్న శస్త్రాలలో చాలా important సుదర్శన చక్రం.కాబట్టి ఇక ఆవిడని పెట్టిన యాతన చాలు, నువ్వు అసలు నీలోనే అగ్ని, నీలో సూర్యుడు, నీలో చంద్రుడు, నీలో జలం, నీలో నింగి, నీలో మట్టి అన్నీ నీలో ఉన్నాయి. నీవే సర్వము, నీవే హరివి అన్నాడు. అని ఆగమన్నాడు. అయ్ అనగానే ఆగిపోయినాడు. నమస్కరితు ఇంద్రశాస్త్ర వధూ మకేతువునకు, ధర్మ సేతువునకు, విమర రూపమునకు, విశ్వదీపమునకు, చక్రమునకు, గుప్త చక్రమునకు. చక్రానికి నమస్కరించాడు. అందుకనే వెంకటేశ్వర స్వామిని గాని, కృష్ణావతారంలో దర్శనం చేసేటప్పుడు కేవలం ఆయన పాదం, ఆయన ముఖం మాత్రమే కాదు. చతుర్భుజులలో ఉన్నటువంటి శంఖ, చక్ర, గద, పుష్పం. నాలుగింటికి నమస్కారం చేయాలి. నాలుగింటికి నమస్కారం చేయటం అంటే పరమేశ్వరుడిని నాలుగు విధాల ఏకకాలంలో అర్చన చేసిన ఫలితం కలుగుతుంది అని. విహిత ధర్మమందు విహరింతు నేనియు, ఇష్టమైన ద్రవ్యమిత్తు నేని, భరణీసురుడు మాకు దైవతంబగు నేని, విప్రునకు శుభంబు వెలయుగాక. నాలుగో దోషం లేకపోతే, నాలుగో అల్పత్వం లేకపోతే, నేను హరినామ సంకీర్తనంలో ప్రీతి-- ప్రియుడిని అయినట్లయితే, చక్రమా! దుర్వాస మహామునికి శాంతినివ్వు అని అడిగాడు. నరనాథోత్తమ! అయిపోయింది చక్రం. ఎప్పుడైతే అంబరీషుడు ప్రార్థించాడో, వీడు శరణాగతి పొందాడో, అహం నశించిందో, అహంకారం అణిగిపోయిందో, కనులు తెరుచుకున్నాయో, లోకనులు వెలుగును చూట్ట మొదలు పెట్టినయో, జ్ఞానం పుటమరించిందో దుర్వాసుడు స్వస్థితి చెందాడు. ఎప్పుడైతే అంబరీషుడి కాళ్ళ మీద పడ్డాడో అప్పటికే అహంకారం నశించినట్లే లెక్క. సమయంలో అంబరీషుడ్ని అంటున్నాడు. నరనాథోత్తమ! మేలు చేసితివి గదా! నా తప్పు మన్నించి శ్రీహరి పాదాబ్జములు ఇంత మొట్ట కొలిచే. నాకాయన చెప్పాడు వెళ్ళినప్పుడు వాడు నా అంతటి వాడు అని. నీ పాదాన్నే ముట్టుకుంటున్నాను అంటే హరి పాదం ముట్ట ఎలాగు నాకు దొరకదు కనుక నీ పాదం ముట్టుకుంటున్నాను అన్నాడు. వీడు రాజస్థానంలో రాజై ఉన్నప్పటికీ కూడా. ఆశ్చర్యము ఎన్నుచో నవ-- నరుతండ్రే నిను బోటి సాధకునకు తానై ఇచ్చుటల్ కాచుటల్ శ్రేధిన్నైజగునంబునై సరసవచున్ కాదే మిత్రాకృతిన్. మిత్రమా! అన్నాడు. మిత్రాకృతి అంటే నీవంటి భక్తుడు. Tyagaraja స్వామి కూడా అదే అన్నాడు. ఏమన్నాడంటే, రామా! నీ భక్తి సామ్రాజ్యంలోకి నాకు అర్హత ప్రవేశించు. ప్రవేశించే ఒక అర్హత నివ్వు. నీ వైకుంఠంలోకి నేను ఎలాగూ రాలేను, ఏమో రాగలనో లేదో తెలియదు. కానీ, నీ భక్తుల యొక్క సామ్రాజ్యంలోకి సద్భక్తుడైనటువంటి ఒక్కడి ఇంటికి నేను వెళ్లగలిగేట్టుగా చేస్తే అది నాకు వైకుంఠం అన్నాడు. కనుక పరమాత్మకి సద్భక్తుడికి ఏం భేదం లేదు. భ్రమర కీటక న్యాయ విశేషం చేత పరమాత్మని కొలిచి కొలిచి, తలచి తలచి జీవుడు దేవుడైపోతాడు. తాను స్వామి యొక్క స్థాయికి వెళ్తాడు. ఎలా వెళ్ళాడు? ఏం చేసి వెళ్ళాడంటే, వేషం వేసుకుని కాదు. మానుష వేషాన్ని నిర్మూలనం చేశాడు. ఏమీ అక్కరలేనటువంటి ఒక ఉదాత్త వైఖరి స్థాయిలో పరాశ్వర రూపుడైనటువంటి ఈశ్వర స్థానానికి వాడు చెందుతూ ఉన్నాడు. కనుక అక్కడికి, నీవు నాకు ఈరోజు మిత్రుడువైనావు. ఎప్పుడైనా దుర్వాసుడికి మిత్రులు ఉన్నారా? లేరు. విశ్వామిత్రుడికి మిత్రులు ఉన్నారా? ఆయన పేరే విశ్వామిత్రుడు. కానీ, విశ్వామిత్రుడు ఎలా అయినాడంటే శ్రీరామచంద్ర ప్రభు సాంగత్యంలో అయినాడు. ఆయనని అస్త్రశస్త్ర ప్రయోగశీలుని చేసి కళ్యాణం జరిపించే వరకు గాయత్రీ మంత్ర ద్రష్ట అయ్యేవరకు బ్రహ్మర్షి అయిన కారణంగా ఆయన పూర్ణ పురుషుడయినాడు. పరమాత్మ రామచంద్రుడు వచ్చేదాకా ఆయన కేవల బ్రహ్మర్షి మాత్రమే. రామచంద్రుడి కళ్యాణకారకమైనటువంటి ఒక దివ్యమైనటువంటి సేవ చేసుకున్నాడు గనుక ఆయన ఉత్తమ లోక ప్రాప్తిని పొందాడు విశ్వామిత్రుడు. అలాగే ఈయన కూడా. ఒక మాట ఎవ్వని పేరు కర్ణమునలో వెయ్యారమై సోకినన్ సకలాఘంబులు, అంటే సకల పాపాలు, పల్లటిల్లి తొలగున్ సంభ్రాంతితో అట్టి సత్సుఖురన్ మంగళ తీర్థపాదు హరివిష్ణును దేవదేవేషు నిన్ను అకలంక స్థితి వెల్చు భక్తులకు లేదు అడ్డంబు రాజాగ్రణి. నీవంటి వాడికి భగవంతుడికి మధ్య ఒక అడ్డం ఉన్నదా? లేనే లేదు. అంతేకాదు, అనేకమైనటువంటి తపస్సులు చేశావ్. ఎవరి నామము ఒక్కసారి చెవిలో పడగానే సర్వాంగములు పులకించి పోతున్నాయో అటువంటి దివ్య స్థితిలో నువ్వున్నావ్ అంటూ చక్కగా చెప్తూ మాటన్నాడు. తప్పులోగని చక్ర పావక దాహముందగ దాపి. నా తప్పుని కాచి, చక్రాన్ని ఆపి. చక్రం ఎలా ఉన్నది? మండుతూ వస్తున్నది. అనేక లోకాలకు వెళ్ళింది వీడి వల్ల. మళ్ళీ బ్రహ్మ లోకానికి వెళ్ళింది, కైలాసానికి వెళ్ళింది, విష్ణు లోకానికి వెళ్ళింది. సర్వాణి ప్రదేశాలన్నీ చరి ప్రవేశించి లోపల ఉన్నటువంటి అగ్నిని కేవలం ఒక భక్తుడు మాత్రమే ఆర్పగలిగాడు. విష్ణువు వల్ల కూడా కాదు, నా వల్ల కాదన్నాడాయన. నా భక్తుని ఇంటికి వెళ్ళి అక్కడ తీరుతుంది అన్నాడు. సకలాఘంబులు బల్లటిల్లి తొలగున్ సంభ్రాంతితో ఒప్పు ఒప్పు భవ భవ దయారసమో నరేశ్వర ప్రాణము ఇసప మున్మునుపోయి క్రమ్మరజేరె. ఏమైందో చెప్పనా? చక్రం నా వెనక పరిగెత్తినప్పుడే నా ప్రాణాలు హరి అన్నాయి. కానీ, మళ్ళీ నీ దయచేత ప్రాణాలు మళ్ళీ నా లోపలికి ఇప్పుడు ప్రవేశించినాయి.ధన్యుడనైతి నీకెప్పుడున్ శుభమేను కోరెద ఇంక పోయెద భూవరా మరి ఇంకా నేను వెళ్ళేస్తాను అన్నాడు వ్రతభంగం చేయబోయి గర్వభంగం పొందాడు ఎవడు? దుర్వాసుడు. వ్రతభంగం ఆయనకి కాలే, పారణం జరిగిందిగా, నీళ్ళు తాగాడుగా, సరళ భక్షణం చేశాడు. ఏకాద-- ఏక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ద్వాదశి వ్రతాన్ని పట్టమహిషితో కూర్చొని చేసి హరినామ సంకీర్తనం తప్ప అన్యమెరుగని అటువంటి వడు భక్తుణ్ణి కూడా కాచాడు. అటువంటి స్థాయికి వెళ్ళాడు అంబరీషుడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే మునివల్లభు పాదములకు మొక్కి కడుమన్నం చేసి, నాయనా రోజున ఏదో కోపంలో అన్నం పెట్టేలోగా నా చక్రం నిన్ను వెంబడించింది, ఇవ్వేళన్నా కాస్త అన్నం తినవయ్యా అని మంచి అన్నం పెట్టి భోజనం పెట్టి మనువుగ పెట్టిన్ చెత్రుప్తుడయ్యే అతడున్ చూడక్క ఆయన తృప్తి పొందాడట కంటిన్ నేటికి నిన్ను నీ వచనముల్ కర్ణద్వయం ప్రీతిగా వింటిన్ అన్నముగంటిని గృహమునన్ వేట్కన్ ఫలంబు బద్వే నే మంటిన్ పోయెద. మంటిన్ అంటే ఆకాశం. అనేక ఊర్ధ్వలోకాలకు వెళ్తున్నాను అంబరీషా! నీ ఇంట్లోకి వచ్చాను, హరినామ సంకీర్తనం విన్నాను, మంచి భోజనం చేశాను, మంచి మర్యాద పొందాను, శాంతిని పొందాను, ఆనందాన్ని పొందాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే దివ్యలోకం వైపు నా ప్రయాణం సాగుతున్నది. ఎందుకు అంటే, నీ చరిత్ర అమరుల్ మచ్చుల్ సుఖాసీనులై మింటన్ మేదిని సన్నుతింప గలరు మీదన్ నరేంద్రాగ్రణి. లోకంలో నువ్వు అంబరీషుడువని అందరికీ తెలుసు. ఇంత గొప్ప వాడివని ఆకాశంలో ఉన్న అందరు దేవతలకి నేను చెప్పబోతున్నా. లోకంలో వారు కీర్తిస్తున్నట్లే లోకేశ్వరుడు లోకాలలో ఉన్న అందరూ కూడా ప్రతిరోజూ ఇంతటి వాడు లేడు అనేట్టుగా నీ కథ నేను చెప్తానన్నాడు దుర్వాసుడు. అంబరీషుని దీవించి మింటి తెరువున బ్రహ్మ లోకమునకు చనిగి ఆయన వెళ్ళిపోయినాడు. మునీశ్వరుడు వచ్చి మగుడం జరువేళకు ఒక్క సంవత్సరంబు నిండి వ్రతంబు పరిపూర్ణంబైన ఈయనకు కూడా మరి చక్రం ఎన్నాళ్ళు వెంబడించిందో తెలుసునా? ద్వాదశి వ్రతానికి అంబరీషుడు వాడుకున్న సమయం ఒక ఏడాది. చక్రం ఆయన్ని వెంబడించింది మూడు వందల అరవై నాలుగు రోజులు. అన్ని రోజులు పరిగెత్తించింది అది. అంటే ఒక ఏడాది, ఒక ఏడాది అన్నం లేకుండా ఒట్టి నీళ్లతో ఉన్నాడు. ఇంట్లో నుంచి చక్రం పోయింది చక్రం వచ్చేదాకా అంబరీషుడు తినడు. అంటే రెండో ఏడాది తినలేదు. రెండో ఏడాది మళ్ళీ ద్వాదశి వ్రతం. మళ్ళీ పారణం చేసేలోగా వీడు ఎట్ల నుంచి వస్తాడో తెలీదు. కనుక పారణం ఇప్పుడు పూర్తయింది. రెండేళ్ళు వ్రతం చేశాడు అని ద్వాదశి వ్రతం. అయితే అక్కడే ఉన్న చిన్న కిటుకు. హవనిసురుడు కుడువ అతి పవిత్రంబైన వంటకంబు భూమి వరుడు కుడిచె ఉచ్చిష్టము అంటారు. అంటే ఒక మహాత్ముడు గనుక మన ఇంట్లో భోజనం చేసి, ఆయన విస్తరిలో వదిలిపెట్టినటువంటి భోజనాన్ని గనుక దాన్ని ప్రసాదంగా స్వీకరించగలిగినట్లయితే రకమైనటువంటి ఏష్యన్ లేకుండా, ఎంగిలి అన్న భావన లేకుండా ఇది పరమాత్మ మనకు వదిలిపెట్టిన ప్రసాదం అని గనుక తినగలిగితే ద్వాదశి వ్రతం రెండు సంవత్సరాలు చేసిన ఫలితం దక్కు. అది. కాకపోతే ఆయన్ని వదిలిపెట్టాలిగా. మనం బాగా రుచిగా చేశామనుకోండి, ఆయన మాత్రం ఎందుకు వదిలిపెడతాడు? మనకు కూడా మిగల్చకుండా తిని వెళ్తాడు వాడు లోభి. కానీ వదిలిపెట్టాలి. దాన్ని ఉచ్చిష్టము అంటారు. ఉచ్చిష్టము గణపతి క్షిప్రప్రసాది గనుక, క్షిప్రప్రసాది అంటే కోరగానే ఇచ్చేవాడు అని. ఇది కూడా తినగానే ఫలితం వస్తుంది గనుక ఉచ్చిష్ట స్వీకారం చేయాలి. మహాత్ములు మన ఇంటికి వచ్చింది విస్తరి మడిచి రోడ్డు మీద పడేయకూడదు. దానిలో ఉన్నది జాగ్రత్త పక్కన పెట్టుకోవాలి. ఒక మెతుకు అన్న నోట్లో వేసుకోవాలి. అది. దానికి మనసు కావాలి. అదంత తేలిగ్గా జరిగే పని కాదు. హరిగల్చుచుండు వారికి పరమేష్టి పదంబు మొదలు పదభోగంబు నరక సమములను తలపున ధరణీ రాజ్యంబు తోడి తగులుము మానెన్ తనకు సదృశులైన తనయుల రావించి ధరణి భరం వారితల్ప పంచి అంబరీషుడు తర్వాత ఏం చేశాడు అని. తన సములైనటువంటి వాళ్ళందరినీ కొడుకుల్ని పిలిచాడు, రాజ్యం అంతా భాగం చేశాడు. వాళ్ళ-- వారికి వారికి అప్పజెప్పాడు. చెప్పి, ఖాననంబు సొచ్చె వానప్రస్థానికి వెళ్ళాలి జీవుడు. ఇవాళ అడవులే లేవు. నగరాలే అరణ్యాలైపోయినయి. జనారణ్యాలైపోయినయి. అందుకనే సూతఖండంలో బ్రహ్మచారీ గృహస్తశ్చ వానప్రస్తశ్చ భిక్షుకః అతివర్ణాశ్రమీచ్చే ఇతి క్రమాత్ శ్రేష్ఠా విచక్షణ అని ఒకటి ఉంది. అంటే బ్రహ్మచారి గొప్పవాడే. బ్రహ్మచారి కంటే గృహస్తు కంటే గొప్పవాడు బ్రహ్మచారి. బ్రహ్మచారి కంటే గొప్పవాడు గృహస్తు. గృహస్తు కంటే వానప్రస్తుడు. వానప్రస్తుడి కంటే గొప్పవాడు అతివర్ణాశ్రమి. వానప్రస్తుడు అంటే ఒకానొక సమయంలో సంసారాన్ని, ప్రపంచాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళి భార్యా సమేతంగా ధ్యాన తపముల యందు మనస్సును లగ్నం చేసి పరమేశ్వర నామ సంకీర్తనంతో మౌనభూమికలోకి వెళితే అది వానప్రస్థం. వనప్రస్థం అనమాట. వనం అంటే తోట, తోట అంటే అరణ్యం. రోజు అలా వెళ్ళేవాళ్ళు. వీళ్ళందరికంటే అతివర్ణాశ్రమి. నాలుగు వర్ణాలు అంటే నాలుగు భాగాలున్నాయి. మనం చెప్పే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవి కాదు. నాలుగేమిటంటే బ్రహ్మచారీ గృహస్తశ్చవాన ప్రశస్త భిక్షుకః నలుగురు నలుగురు కాక ఇంకొకడున్నాడు వాడి పేరు అతివర్ణాశ్రమి వాడు నాలుగింట్లో ఉంటాడు నాలుగింటికి చెందడు అటువంటి వాడు ఉన్నాడా ప్రపంచంలోని భగవాన్ రమణ మహర్షి అతివర్ణాశ్రమిగా సర్వ ప్రపంచం అంగీకరించింది ఎట్లా అంటే ఆయన బ్రహ్మచారి బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోలేదు లౌకిక అర్థంలో కానీ యస్య బ్రహ్మణి నివతే చిత్తం నందతి నందతి నందత్యేవ అన్నటువంటి పూర్ణమైనటువంటి బ్రహ్మంలో పరమాత్మలో తన-- లీనమైయున్నాడు నిమగ్నమైయున్నాడు గనుక ఆయన బ్రహ్మచారి. ఆయన గృహస్తు కూడా మన బోటి వాళ్ళకి ఇద్దరో ముగ్గురో కుటుంబ సభ్యులు ఉంటే విశ్వ సంసారాన్ని చాలా అలవోకగా మోశాడు ఆయన. ఆయన ఎక్కడుంటే అక్కడ సంసారం ఏర్పడింది కానీ ఆయన గృహస్తు మన బోటి వాళ్ళు వెళితే ప్రసాదం పెట్టారు విస్తళ్ళు వేశారు అన్నం పెట్టారు జ్ఞానబోధ చేశారు జ్ఞానాన్నం ఇచ్చాడు జ్ఞాన వరదానం చేశాడు కనుక ఆయన గృహస్తు అలాగే భిక్షకుడు తాను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమై ఉండి కూడా తిరువణ్ణామలై వీధులలో తిరిపి విత్తాడాయన భిక్షం ఇత్తాడు మూడు ముద్దలు శరీరం నిలబడాలి గనుక వానప్రస్తుడు అరుణాచలానికి పదహారేళ్ళకే చేరుకున్నాడు అందరూ అరవై ఒక్క ఏళ్ళకి చేరుకుంటే దాన్ని తిప్పి పదహారో ఏడు వస్తుండగానే అరుణాచలం చేరుకున్నాడు చేరుకున్నా ఆయన అతివర్ణాశ్రమి కుక్కని కోతిని పాముని నెమలిని ఆవుని దూడని మనిషిని అజ్ఞానిని జ్ఞానిని పామరుడిని అందరినీ సమభావంతో సర్వాత్మభావంతో ఆయన గమనించారు వారితో అలాగే ఉన్నారు అటువంటి స్థితి ఎవరిదంటే ఈయనకు ఉన్నది అతివర్ణాశ్రమీచే ఇతి క్రమాత్ శ్రేష్ఠ విచక్షణ by discretion by a critical analysis అతివర్ణాశ్రమి గొప్పవాడు అట్లా వెళుతున్నాడు మన అంబరీషుడు. కాననంబు సచ్చె కామాది విజయుడై ధరణి భారము ఆరి తల్ప పంచి నరవిభుందు హరి సనాథుడగుచు ఎలా వెళ్ళాడంటే విష్ణువుతో కూడి వెళుతున్నట్టుగా వెళ్ళాడాయన విష్ణువుని వదిలిపెట్టలా ఇక్కడ ఇక్కడ అయిపోయింది చక్రం మంది దుర్వాసుడు కాలి మీద పడ్డాడు ఇంకెవరిని జయించేది అట్లా ఏం లేదు కామాదులన్నీ జయించాడు హరిశ్చంద్ర గారు జయించాడు హరి పదాన్ని పొందాడు భ్రమర కీటక న్యాయంతో ఒక చిన్న పురుగు సుమ్మద జంకారంతో ఎట్లాగైతే అయిపోయిందో అలాగే అంబరీషుడు కూడా జీవితము అశాంతము కూడా హరినామ సంకీర్తనం చేత హరి సమానుడయినాడు విష్ణువుతో సమానుడై అరణ్యానికి వెళ్ళాడు. అంబరీషు చరితము తియంబున విన్న సదువ ధీసంపన్నుడయ్యుండు భోగపరుండయ్యుండు నరుడు పుణ్యుండయ్యుండు కృపా కృపా పరిక్షిత్ మహారాజ ఇటువంటిది అంబరీషుడి కథ గనక విన్నట్లయితే ఏం వస్తుంది అంటే ధీశక్తి వస్తుంది రెండు సంవత్సరాలు రెండు చుక్కల నీళ్ళతో బ్రతికాడాయన ద్వాదశి వ్రతం పేరు మీద. పారణం చేయటానికి వచ్చి పారణం చేసిన దుర్వాసుడు ఆగ్రహానికి గురైనాడు గనుక మళ్ళీ వ్రత దీక్ష ఒక్క ఏడాది చేశాడు రెండు సంవత్సరాలు తన శరీరాన్ని ప్రాణాయామం చేత నిలబెట్టుకున్నాడు ప్రాణాయామంలో స్మరణం చాలా ప్రధానమైంది స్మరణం వలన ఆయన జీవన్ముక్తుడయినాడు జీవించి ఉన్నాడు కానీ ఎప్పుడో ముక్తుడైపోయినాడు ముక్తుడు కావటానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము పరమేశ్వరుని యందు ఆసక్తి పరమేశ్వరుని యందు ఒక నిష్టతో కూడినటువంటి భక్తి ఉన్న కారణంగా అంబరీషుడు పూర్ణ మానసుడయినాడు హరి సమానుడయినాడు అటువంటి అంబరీషుడి కథతో నవమ స్కంధం పూర్తయింది. ఇందులో ఎంతమంది ఎన్ని విధాల హంసానందిని అనుభవించారు బ్రహ్మ చెప్పాడు విష్ణువు చెప్పాడు రుద్రుడు చెప్పాడు అంబరీషుడు చెప్పాడు అలాగే దుర్వాసుడు చెప్పాడు చక్రానికి కూడా పూజ చేశాడు చక్రాన్ని చక్ర స్తుతి చేశాడు సుదర్శన చక్రాన్ని ఎందుకనంటే పరమేశ్వరుడితో కూడి ఉన్నవన్నీ పరమేశ్వరమయంతోనే ఉంటాయి అది పరమేశ్వరుడు ఆయనతో కూడి ఉన్న భక్తుడు భిన్నం కాదు రెండూ ఒకటే ఆయనే చెప్పాడు ఇందాక అసలు నా హృదయమంతా కూడా భక్త హృదయమే నా హృదయం స్వామి ఇవాళ పుటపర్తిలో కూర్చొని ఆయన రెండే మాటలు అంటున్నారు మీ ఆనందమే నాకు ఆహారం మీరు ఆనందంగా ముందు ఉండండి నాకు వచ్చి మీరు పళ్ళు అవన్నీ నాకేం అక్కర్లే ఇక్కడ తీసుకునేవాడే లేడు కా మీరు ఆనందంగా ఉంటే నాకు అది ఆహారం చూశారా? ఏది ఆనందం అంటే అన్ని ఆనందాలకి మూలం ఒక్కటే ఉన్నది అది తృప్తి తృప్తి పొందామా ఏమి కోరికా మనల్ని తాకదు మనల్ని యాతన పెట్టదు తృప్తి లేకపోయినట్లయితే మాత్రం అది నిత్య దరిద్రంగా భావించాలి తృప్తి పడాలి ఎక్కడో ఒకడ చాలు పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని ఇంత భద్రంగా ఇంత హాయిగా చక్కగా గడిపాను చక్కగా సేవ చేసుకున్నాను హరినామ సంకీర్తనంతో గడుపుతున్నాను ఏదో లోకంలోకి వచ్చినందుకు అటు లోకాన్ని లోకల్లోనూ ఓడిపోలేదు కానీ ఆంతరంగికంగా కూడా నేను ఓడిపోకూడదనేటువంటి దివ్య భావనలోకి తీసుకొని వెళ్ళాలి హంసానంది చిజ్జడ గ్రంథిలో ఉన్నటువంటి దివ్య భావన నాదామృతాన్ని అందుకనే శంకర భగవత్పాదులు యోగతారావళిలో శ్లోకం చెప్తారు సదాశివోక్తాని సపాద లక్ష లయావధానాని వసన్తి లోకే నాదానుసంధాన సమాధిమేకం మన్యామహే మాన్యతనం లయానాం అంటారు నాదానుసంధానం చేయాలి ఇప్పుడు ఇన్నేళ్లుగా ఇన్నాళ్లుగా ఇక్కడ పాడబడుతున్నటువంటి హంసానంది నాదానుసంధానానికి దారి తీయాలి అది ప్రజ్ఞ కాదు అది పెద్ద స్కిల్ కాదు అదేదో పాండిత్యము కాదు ఏమున్నదయ్యా అంటే జీవుడి యొక్క ఆత్మ నాదం అది ఆత్మ గానం.ఆ ఆత్మ జ్ఞానం ఎక్కడ నుంచి అంటే నాభి లో నుంచి మూలాధారం లో నుంచి నిజానికి పుట్టాలి అది. మూలాధారం నుంచి నాభి, నాభి నుంచి హృదయం, హృదయం నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి విశుద్ధ, విశుద్ధ నుంచి సహస్రారానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అది మ్లాన గీతము కాకుండా అమ్లాన గీతం కావాలి. దోషం లేని, స్వర భేదం లేనటువంటి రాగ, భావ, తాళ, లయాత్మకమైనటువంటి దివ్యన్-గానంగా రూపొందిన్-పడాలి. కనుకనే భగవత్పాదులు అదే యోగ తారావళిలో ఇంకో శ్లోకం చెప్తారు. నాదానుసంధానం జరుగుతుందట యోగికి ఇలా చేయగా, చేయగా. అంబరీషుడు హరి కాలే, అయినాడా లేదా? భరతుడు రాముడు కాలే పట్టాభిషేకం సమయానికి. రామనామ స్మరణాంచితమయ దేహం గనుక రాముడు కంటే భరతుడు వెలిగిపోయినాడు. మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఆయన అంటాడు, "నాదానుసంధానానమోస్తు తుభ్యం త్వాం సాధనం తత్వపదస్య జానే భవత్ప్రసాదాత్పవనేన సాకం విలీయతే విష్ణుపదే మనో మే" అది. నాదానుసంధానమా! నీకు నమస్కరిస్తున్నా. ఎందుకనంటే "త్వాం సాధనం తత్వపదస్య జానే" బ్రహ్మపదానికి వెళ్ళటానికి ఇదిగో నాదానుసంధానం జరగకపోతే ఎట్లా? అయితే జరిగింది గనుక "భవత్ప్రసాదాత్పవనేన సాకం" నీవు అనుగ్రహించినటువంటి వాయు శక్తితో ఇప్పుడు పాడేవారికి శక్తి ఏమిటంటే గుండె కాదు, చెవి కాదు గాలి. వాయు స్తంభన చేయాలి, వాయువుని సరళీకృతం చేయాలి, నాదానుసంధానం చేయాలి, నాడీ శుద్ధి జరగాలి. ప్రక్షాళన జరిగిన తర్వాతనే చిజ్జడ గ్రంథి భేదనం జరిగి హంసానంది రాగం పరమానందంగా కలిగిస్తుంది. కనుక చక్రము, దుర్వాసుడు, అంబరీషుడు, బ్రహ్మ, రుద్రుడు, విష్ణువు, సర్వ లోకాలు, అంబరీషుడి భార్య, యజ్ఞంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా కలిగినటువంటి హంసానందితో మనం స్వామి కూడా ఇవాళ కైంకర్యం చేద్దాం. సాయిరాం!
SSSMC · audio

Bhagawata Navaneetham - 50

Home

Bhagawata Navaneetham - 50

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 26:39

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

    Now playing
  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67