No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం సురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ. అయితే ఈ కథలో భీముడు ఉన్నాడు అశ్వత్థామ ఉన్నాడు అశ్వత్థామని బంధించి తెచ్చిన అర్జునుడు ఉన్నాడు పుత్రశోకాన్ని అనుభవిస్తున్నటువంటి ద్రౌపది కూడా ఉన్నది. ఈ నాలుగు పాత్రలు ఎలా ప్రవర్తించినయి దాన్ని వేతనామాత్యుడు అంటే వేదవ్యాసుడు చాలా పరమాద్భుతంగా మానవీయమైనటువంటి ఒక కోణంలో ఒక ధర్మనిష్ఠతో కూడినటువంటి భావనతో ఈ ప్రపంచానికి ఒక ప్రబోధం చేస్తాడు. అందుకే స్వామి అంటారు చూడండి "నీకు ఎవరు అపకారం చేశారో వాణి గురించి మర్చిపో వాడు చేసిన అపకారం మర్చిపో నీకు ఎవడో చిన్న అపక-ఉపకారం చేశాడు దాన్ని మనస్సుకు గుర్తు పెట్టుకో" అన్నారు. ఇది సాధనలో చాలా ఉత్తమమైనటువంటిది ఎందుకంటే ఈ ప్రపంచం మనకు అపకారం చేసేవాళ్ళు ఉంటారు మనం కూడా ఎవరికో అపకారం చేస్తూనే ఉంటాం తెలుసో తెలియకో. కానీ మనం చేసిన అపకారం మనం గుర్తు పెట్టుకోవాలి మనకి ఎవరో చేసిన అపకారాన్ని మనం వదిలిపెట్టాలి. ఉపకారం ఎవరి నుంచో పొందాము దానిని అన్నివేళలా గుర్తు పెట్టుకోవాలి అన్నం ముద్ద పె-ఎత్తిన ప్రతివేళ వాళ్ళని స్మరించుకోవాలి. మనం ఎవరికన్నా ఉపకారం గనక చేస్తే దాన్ని ఆ క్షణమే వదిలిపెట్టాలి. ఎందుకని? "నేను ఉపకారం చేశాను, దానం చేశాను, యజ్ఞం చేశాను" అన్న బలి ఏమైపోయినాడు? బలి అయిపోయినాడు. అంతే కదా! మనం కూడా అహంకార బుద్ధితో గనక దానధర్మాలు చేసినా, కామ్యంతో త్యాగం చేసినా, ఇంకేదో ఒకటి యాగం చేసినా అవి మనకు ఏ మాత్రము కూడా అక్కరకు రావు. కాబట్టి ఈ పూర్ణమైనటువంటి సత్యాన్ని అశ్వత్థామ, పుత్రహాతి అయినటువంటి అశ్వత్థామని అవమానించటంలో అర్జునుడు అవమానించే ప్రయత్నం చేస్తాడు. దానిని విచారణ చేస్తూ తీసుకొస్తాడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు అశ్వత్థామ. ఎలా ప్రయోగిస్తాడు అంటే అర్జునుడి బాణాలకు తట్టుకోలేక వాడు ఆ బాణం వేస్తా-- బ్రహ్మాస్త్రం వేస్తాడు. అశ్వత్థామకి బ్రహ్మాస్త్రం వేయటం ఎట్లా తెలుసు గానీ ఉపసంహారం మాత్రం తెలియదు. ఉపసంహారం తెలియని విద్య ఒట్టి గుడ్డి విద్య, అర్ధ విద్య. అందుకే స్వామి మన నాలుక మీదే బ్రహ్మాస్త్రం ఉంది అని చెప్పారు. ఎట్లా అంటే నాలుక జారితే నాకం జారిపోతుంది లోకం దూరం అవుతుంది అన్నారు. నాలుక మీద ఏమున్నది? బ్రహ్మాస్త్రం ఉన్నది. పిచ్చుకల మీద, చిన్న వాళ్ళ మీద, మన కంటే బలహీనుల మీద, పాపం ప్రతిఘటించలేని వాళ్ళ మీద, సాధువులైన వాళ్ళ మీద మన నాలుక అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించకూడదు. పరుష వాక్య ప్రయోగం చేయకూడదు. పరుష వాక్యమే మన నాలుక మీద రాయబడినటువంటి బ్రహ్మాస్త్రం. అశ్వత్థామ ఇక దిక్కు దారి ఏమీ తెలియక తోచక బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఉపసంహారం తెలియదు. అల్లా కల్వాలం అయిపోతున్నది. ఆ ప్రయోగించే పద్ధతి తెలియదు. కాబట్టి సంగ్రామ రణమంతా కూడా తిరుగుతున్నది బ్రహ్మాస్త్రం. అర్జునుడి దరిద్రాపులకు వస్తున్నది విష్ణు మాయ, కృష్ణ మాయ చేత అది ఆయన్ని తాకకుండా తిరుగుతున్నది. అర్జునుడు కూడా భయభ్రాంతుడు అయినాడు. అయి "ఏమిటిది ఇన్నాళ్ళు లేనటువంటిది ఇవాళ ఏం జరిగింది" అంటే అప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్పాడు. అశ్వత్థామ అతిశయించినటువంటి విద్యాబలం చేత, అర్ధ విద్యాబలం చేత, అందుకనే చూడండి మహా పండితులతో మాట్లాడటం చాలా తేలిక. పరమ మూర్ఖుడితో మాట్లాడటం అంతే తేలిక. కానీ వాడు మూర్ఖుడు కాదు, పండితుడు కాదు మహా కష్టం. ఎందుకంటే వాడికి తోచదు. వాడు చెప్తే వినడు. మనం చెప్పుకున్న పెళ్ళికొడుకు లాగా. అదే మా వాడికి అసలు ఏమీ దుర్గుణం అనేది మీరు లిస్టు రాసి ఇవ్వండి, లక్ష రాయండి అని, "ఏం లేవు" అంటే ఆ పిల్లనిచ్చేటువంటి తండ్రి చాలా ఆనంద పడ్డాడట. ఇటువంటి అల్లుడు ఇంకా ఈ కలియుగంలో వస్తాడా అని. అయితే ఆ తండ్రి పాపం ఆపుకోలేక నెమ్మదిగా అవ్వబోయే వియ్యంకుడితో "ఒక్కమాట, మీరేం అనుకోవద్దు, ఇవన్నీ ఉన్నాయి కాదని అంటలే, ఒక్కటే చిన్న problem ఉంది మా వాడితో" "అయ్యా అదేంటో ముందు చెప్పండి" అన్నాడు. "ఏం లేదండి వాడికి తోచదు, మేం చెప్తే వినడు" అన్నాడు. "ఇంకేం కావాలి?" "ఆ ఉండి తోచవు, ఎవడన్నా చెప్పినా వినడు. వాడు ఉన్నా లేకపోయినా ఒకటే." అటువంటి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేశాడు. కాబట్టి విష్ణువు ఏం చేశాడంటే చక్రాయుధాన్ని, సుదర్శన చక్రాయుధాన్ని ప్రయోగం చేశాడు. అయితే ఆయుధమున్ ధరింప అన్నాడుగా, ఊ-ఊరక సాయము చేయువాడన, ఊరికే సాయం చేస్తానాడు. ఊరికే చేస్తాడా దేవుడు? మనకు ఊరికే చేస్తాడండి? మనం calling bell కొట్టగానే స్వామి వస్తారా? ఊరక చేయడు. మనం ఊరకుండా ఉండేట్టుగా ఏదో ఒకటి చేస్తాడు ఆయన. అది. ఆయన ఊరకుండేట్టుగా చేసి ఆ సుదర్శన చక్రంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని ప్రయోగించాడు. అదృశ్యంగా. అప్పుడు అర్జునుడిని తాకకుండా ఉన్నాయి అశ్వత్థామ బతికాడు. ప్రాణాలతో దొరికాడు. ఎవరికి దొరికాడు? అర్జునుడికి దొరికాడు. ఏడు వందల శ్లోకాల్లో భగవద్గీతను విన్నా ఇంకా అర్జునుడు మన బోటి జీవ లక్షణాలు ఉన్నటువంటి సామాన్యుడిగానే మిగిలిపోయినాడు ఇక్కడ కూడా. ఏమన్నాడో తెలుసునా? చక్రాయుధం ప్రయోగించిన కృష్ణుడు ఏం అనలే, అర్జునుడు అన్నాడు "అశ్వత్థామను పట్టుకున్నాను బావా" అన్నాడు. "పట్టుకురా" అన్నాడీయన.పట్టించిన వాడెవడో మర్చిపోయినాడు పట్టించిన వాడెవడు అంటే పరమాత్మ ఎలా పట్టుబడ్డాడు అంటే సుదర్శన చక్రం వలన అని ఆయనవి ఏం చెప్పలే పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి తీసుకొచ్చేసరికి ద్రౌపది సహజంగా ఉపపాండవ సంహారం జరిగిపోయింది వాడి తలలు నరికాడు తీసుకుపోయినాడు నిద్రపోతున్న వాళ్ళని భీముడు అన్నాడు ఐదు తలలు నరికి తీసుకొని వెళ్ళాడే ఈ అశ్వత్థామ యొక్క తల నరికి నీకు అప్పజెప్తాం దానిమీద హాయిగా నీకు వచ్చినటువంటి నాట్యం చేసుకో అన్నాడు భీముడు ద్రౌపదిని నిర్మలంగా నిశ్చయంగా నిబ్బరంగా నిలబడిపోయింది ద్రౌపది అర్జునుడు నువ్వు చెప్పు నీ కట్టెదుట నీ కొడుకుల కుత్తుకలు ఎట్లా ఉత్తరించాడో అట్లాగే అశ్వత్థామను నేను ఇప్పుడు అవమానిస్తాను అన్నాడు ద్రౌపది ఎంత గొప్ప స్త్రీమూర్తి అంటే క్షమా మాతృత్వం ఒక దివ్యత్వం ఒక గాంధర్వత్వం గాంధారీత్వం గాంధారిది గుడ్డితనం ఇది గాంధర్వత్వం అంటే ఐదుగురు గాంధర్వుల యొక్క శక్తిని తనయందు నిక్షిప్తం చేసుకున్నటువంటి ద్రుపద రాజ పుత్రిక ద్రౌపది అసలు పేరు కూడా కృష్ణ కృష్ణ అనబడే ద్రౌపది కృష్ణ ద్వైపాయనుడు అనబడే వ్యాసుడు యోగీశ్వరుడు అయినటువంటి కృష్ణుడు ఈ మూడు మూడు వంశాలుగా మూడు పాయలుగా వచ్చిన విష్ణువు యొక్క అవతారమే కనుక ద్రౌపది దేవి ఎవరు అంటే శ్రీకృష్ణుడి యొక్క ఒక అంశ విష్ణువు యొక్క ఒక అంశ కాబట్టి ఆమె ఏమన్నది అంటే చాలా మంచి పని చేశారు ఎంత గొప్ప పని చేశారంటే నా కొడుకులను చంపిన వాడిని ఇరవై నాలుగు గంటల్లో పట్టుకొచ్చి నా దగ్గర పడేశారు అంతకంటే ఏం కావాలి అని అంటుండగానే భీముడు గద ఎత్తి సంహారం చేయబోయినాడు ద్రౌపది అడ్డుపడింది అడ్డుపడి నాలుగైదు మాటలు మాట్లాడింది అందులో ఒక మాట అశ్వత్థామ నువ్వు ఎలా చంపావు పసిపిల్లలు వాళ్ళు బాణాలు వేయటం తెలియదు మేమంతా యుద్ధానికి వచ్చాము మా పతులంతా యుద్ధానికి వెళ్లారు మేము ఒంటరి వాళ్ళుగా తల్లులంగా ఇక్కడ ఉండి ఆ పిల్లల్ని కాపాడుకుంటున్నాం నీకు ఎట్లా దయ లేకుండా అయిపోయింది నువ్వు ఎవరి కొడుకువో నువ్వు ఏ వంశంలో ఏ కులంలో పుట్టావో తెలుసునా అయినా ఇప్పుడు ఈ భీముడో ఈ అర్జునుడో గనుక నిన్ను సంహరిస్తే మీ తల్లి ఇంకా బతికి ఉన్నది కదా ఆ తల్లికి గర్భశోకం కలుగుతుందనే స్పృహ నీకు లేదా అని అడిగింది నిన్ను చంపడం ఎంత సేపు కానీ నువ్వు చచ్చిపోతావు నీ పని అయిపోతుంది కానీ శోకం గర్భశోకం ఎవరికి మిగులుతుంది అంటే ఇంకా ఇప్పటికే ద్రోణుడిని పోగొట్టుకుని శిలా స్వరూపంగా ఉన్నటువంటి నీ తల్లికి గర్భశోకం ఇక నాగ పక్కనబెట్టి అయిపోయింది అలా చంపవచ్చునా ఎలా నీకు చేతులు వచ్చినయి అని అంటూ అర్జునుడికి ఉపదేశం చేసింది ఈ మాటలంటూ ఏదో ఎదురుగా నుంచొని మాట్లాడలే అవకాశం వచ్చింది కదా అని దెప్పిపడవలే అశ్వత్థామ కాళ్ళ మీద పడి ద్రౌపది మాట్లాడింది ఈ మాట ఎందుకని అంటే అశ్వత్థామ తండ్రి ద్రోణ ద్రోణాచార్యుడు మా వాళ్ళందరికీ గురువయ్యా అన్నది ఆ పద్యం తర్వాత రాస్తాడు స్వామికి చాలా ఇష్టమైనటువంటి పద్యం ఇది ఆ రోజుల్లో చాలా తరచుగా చెప్తూ ఉండేవారు ఆ ద్రౌపది అంటే ఆయనకు ఎంత ఇష్టం ఎందుకు ఇష్టం అంటే తన అంశ కాబట్టి అది తన వస్తువు తనకిష్టం కదా తానప్పుడు కృష్ణుడు గనుక ఆ ద్రౌపదిని గురించి ఎవరన్నా వీసమెత్తు తక్కువ మాట్లాడితే స్వామి లేచిపోయేవారు ఆ ద్రౌపది ఇంత గొప్పది అంత గొప్పది అని నిజం అగ్ని సంభూత ఆవిడ అగ్నిలో నుంచి పుట్టింది కనుకనే పంచభూతాలను కంట్రోల్ చేయగలిగినటువంటి స్థాయిలో ఆవిడ సంచారం చేయగలిగింది ఎవరిని చంపకూడదో చెప్తున్నది వెరచినవాని దైన్యమున వేదురునొందినవాని నిద్రమై మరచినవాని సౌఖ్యమున మధ్యము ద్రవినవాని భగ్నుడై పరచినవాని సాధుజడ భావము నావివి కావు మంచు వాస రచినవాని కామినుల సంపుట ధర్మము కాదు ఫల్గునా ఎవరు భయపడుతున్నారో అయ్యా నన్ను చంపద్దు అని ఎవరు నిన్ను అడుగుతున్నారో ఎవరు వ్యసనం చేత సురాపానం చేసి మత్తుగా నిద్రపోతున్నారో అసలు నిద్రలో మైమరచి ఉన్నారో సాధుజడ భావము లేని వాడిని కామినిని స్త్రీని చంపకూడదు అర్జునా అన్నది ధర్మ ప్రబోధం చేసింది అనగానే చాలా కోపం వచ్చింది ఎవరికి భీష్ముడు మన భీముడికి నువ్ ఇలాగే ధర్మం చెప్తూ చెప్తూ ధర్మరాజు చెప్పగా చెప్పగా విని మేమంతా నిర్వీర్యులమైపోయినాం వీడు చేతికి దొరికిన తర్వాత కూడా ఆ ఆ శౌర్యం ఆ శాస్త్ర రక్తంలో ఉన్నటువంటి ఒక రజోగుణం కనుకనే వాడు రాజు అవుతాడు ఆ రజోగుణంలో రజోగుణంలో ఉన్నవాడు సత్వగుణంలోకి వెళ్ళటానికి తేలిక నర నారాయణులుగా కీర్తింపబడిన శ్రీకృష్ణార్జునులు ఇద్దరూ కూడా సత్వగుణము ప్లస్ రజోగుణము సత్వగుణం పూర్ణ సత్వగుణం ఈ ప్రపంచాన్ని నడిపించలేదు దీనికి ఆధారం అవుతుంది పూర్ణమైనటువంటి రజోగుణం సత్వగుణం లేకుండా రాణించదు అందుకే స్వామి అన్న భగవంతుడు లేక భక్తుడు లేడు భక్తుడు లేక భగవంతుడు లేడన్న భావన అదన్నమాట పూర్ణమైనటువంటి స్వామి పూర్ణ సత్వగుణం శుద్ధ తత్వం అది అది ఒక్కటే ఈ ప్రపంచాన్ని నడిపించదు దాని బాధ్యత కాదు రజోగుణంతో ఉద్యమించగలిగిన ఉత్సాహం ఉన్న కార్యశూరులైన సద్భక్తులైన విశుద్ధ మానసులైనటువంటి వారందరినీ కూడా తన ప్రణాళికలో పెట్టుకుని తన కార్యరంగన్ని తాను కొనసాగిస్తాడు అట్లాగే ఈ కృష్ణార్జునులు ఇద్దరూ కూడా సత్వ రజస్సులతో కూడి ఉన్నారు గనుక.సత్వగుణంతో ఉన్నటువంటి హరి మిన్నకున్నాడు, రజోగుణంతో ఉన్నటువంటి వాడు కాస్త నెమ్మదిగా ఉద్వేగానికి లోనవుతున్నటువంటి వేళ ద్రౌపది చెప్పింది. పరాంముకుడైనటువంటి కృపి కొడుకును చూచి మొక్కి సుస్వభావ అయినటువంటి ద్రౌపది ఓ మాట చెప్పింది. ఎప్పుడైనా పామరుడు తప్పు చేస్తే లోకం క్షమిస్తుంది, ఏమి చదువులేని వాడు పొరపాటు చేస్తే ప్రపంచం క్షమిస్తుంది, అన్నీ తెలిసిన వాడు పొరపాటు చేస్తే ప్రపంచం మన్నించదు. ఎందుకంటే దాని-- అది సర్వలోకానికి అంతటి వాడే అది చేసినప్పుడు మేం చేస్తే ఏమిటి? అని అడుగుతుంది లోకం. కానీ ఒక పామరుడు గనక చేస్తే తెలియక చేశాడు అని క్షమాగుణంతో వదిలిపెడుతుంది. అక్కడనే అంటోంది, "పరగం మా మగవారలందరుం మున్ బాణ ప్రయోగోపసంహరణాద్యాయుధ విద్యలన్నియును ద్రోణాచార్యుచే అభ్యసించిరి. పుత్రాకృతి నున్న ద్రోణుడవు, నీ చిత్తంబులో లేశము కరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపగా పాడియే." నిజమేనా? మా మగవారులందరూ అంటే నా భర్తలని అనకుండా మా కురువంశంలో, పాండవ వంశంలో ఉన్నటువంటి వారంతా కూడా మీ తండ్రి ద్రోణాచార్యుడి దగ్గర బాణం ఎలా వేయాలో, ఉపసంహరణాది ఆయుధ విద్యలన్నీ నేర్చుకున్నారయా? నువ్వెలా ఉన్నావ్ నాకివేళ? పుత్రాకృతి ఉన్న ద్రోణుడివి. ద్రోణుడు పోయినా ఆత్మవై పుత్ర నామాసి. ఆత్మే పుత్రుడి యొక్క స్వరూపంగా జగత్తులో ఉంటుంది గనక శిష్యాకృతి ఒక పుత్రాకృతిగా ఉన్నటువంటి ఒక ద్రోణుడివి. నువ్వు ఇటువంటివి చేయవచ్చునా? వాళ్లందరినీ చంపవచ్చునా? న్యాయమేనా? అని అడిగింది. అడిగితే సరే అశ్వద్ధామకి అన్నాడు, "నీకు-- నువ్వు ఎట్లా అంటే అట్లా కానీ" అన్నాడు అశ్వద్ధామ. "నీకే-- నీ మనసుకు ఎట్లా అన్నాను, ఒకవేళ చంపినట్లయితే చంపని" అన్నాడు. చంపని అంటే చంపు అనటానికి ద్రౌపది ఉంటే ద్రౌపదిని గురించి ఎందుకు చెప్పుకుంటాం. కాబట్టి ద్రౌపది ఆ మళ్ళీ అశ్వద్ధామకు అడ్డం వచ్చి నెమ్మదిగా, "నాయనా! నీ తల్లి ఎదురుచూస్తూ ఉంటుంది. భర్తని పోగొట్టు ద్రోణాచార్యుడు మరణించాడు కదా యుద్ధరంగంలో. ఈ వేళకి నువ్వు చేసినటువంటి పాపమే నిన్ను దహిస్తుండగా బతికినంత కాలము నీ తల్లికి గర్భశోకం లేకుండా నీవు ఆ ఆయుష్షుతో జీవించమని ఆశీర్వదించి పంపింది." కాబట్టి అక్కడికి ఉపపాండవ కథ అయిపోయింది. పాండవ కథ అయిపోయింది. మిగిలిన వాళ్ళు ఎవరు? పంచపాండవులు, కుంతి, ద్రౌపది. అయితే గాంధారి, ధృతరాష్ట్రులు ఇక వాళ్ళు సతీ సహగమనం చేశారు ఆ రోజుల్లో. ధృతరాష్ట్రుడు ఆయన వెనక గాంధారి కూడా మరణించింది. ఇక శ్రీకృష్ణుడి తన కార్యక్రమం అయిపోయింది, అవతార పరిసమాప్తి దగ్గర పడింది, ఆయన వెళ్లిపోవాలి. ఈ శరీరం చాలించాలి, మళ్ళీ కొత్త అవతారం ఎత్తాలి గనుక ఆయన నెమ్మదిగా వెనక్కి ప్రయాణం అయ్యేటువంటి వేళ రథం ఎక్కబోతూ ఉన్నాడు. ఆ ఎక్కబోతున్నటువంటి వేళ ఉత్తర వచ్చింది ఆయన దగ్గరికి. చాలా అందమైన సన్నివేశం ఇది. ఉత్తర ఎవరు అంటే అభిమన్యుడి భార్య, సుభద్ర కోడలు. సుభద్ర ఎవరు అంటే కృష్ణుడి యొక్క చెల్లెలు. ఇది కథ తెలియని వాళ్ళ కోసం. కాబట్టి ఉత్తరాదేవి గర్భం దాల్చి ఉన్నది గనుక ఇంకా ఎవరున్నారు అందరికీ ఈనే కదా అని అనుకున్న వేళ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి చెప్పింది, "వాసుదేవుడు వ్యాసప్రముఖ భూసుర పూజితుండై యుద్ధశాశ్చకులు-- ఉద్భవ శాశ్చకులు కొలువ ద్వారకా గమన ప్రయత్నంబునం పాండవుల వీడ్కొని రథారోహణంబు సేయి సమయంబున తత్తరపడుతూ" పాపం భయపడుతూ "ఉత్తర చనుదెంచి కళ్యాణ గుణోత్తరుడైన హరితో ఈ మాట-మాట నవత. ఏమనంటే, 'నా గర్భంలో ఉన్నటువంటి నా బిడ్డనన్నా కాపాడు' అని." ఎందుకనంటే అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం, మనం హీరోషిమా, నాగసాకి ఆ బాంబు ప్రయోగం జరిగినప్పుడు కొన్ని తరాలు Genetic Disorders తో పుట్టారు. భోపాల్ విషవాయువుల్లో కూడా అలాగే పుట్టారు పాపం. అది డబ్బుతో ఆ ఆ ముగించే విషయం కాదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ గర్భస్తమైనటువంటి శిశువుల దాకా కూడా అది చేరకుండా నెమ్మదిగా ఇక్కడికి చేరుతుందేమోనని వస్తే, "చెల్లెలి కోడలని మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యెన్ సంపుల్లారవింద లోచనా! బల్లాగ్ని నడంచి శిశువు బ్రతికింపగదవే." నా లోపలున్న గర్భస్థ శిశువుని బతికించవా? నేను ఎవరినో నీకు తెలుసో తెలియదో అంటూ అడిగింది. అంటే నువ్వు పరమాత్మవి, నీకు వాడు లేదు వీడు లేదు. కానీ నువ్వు ఇక్కడ కృష్ణుడిగా ఉన్నావు. నేను ఎవరినంటే నీ చెల్లెలికి కోడల్ని అన్నది. భగవంతుణ్ణి బుట్టలో వేసుకుని. అట్లా అంటే తప్ప ఆయన కూడా చేయడు కదా. "నీ చెల్లెలికి కోడల్ని గర్భవతిగా ఉన్నానన్నాను" అన్న-అన్నది. అనగానే ఆయన అన్నాడు, "ద్రోణనందనుడు లోకం మొత్తానికి వేసినటువంటి బ్రహ్మాస్త్రం ఉన్నది. తన సేవారతి చింత గాని పరచింతా లేశమున్ లేని సజ్జనులన్, పాండు తనూజులన్, మనుజు వాత్సల్యంబుతో ద్రోణసందను బ్రహ్మాస్త్రము నడ్డబెట్టతని జెన్ దైత్యారి సర్వారి పాదన నిర్వక్రము రక్షితాఖిల సుదాంధశ్చక్రమున్ చక్రమున్ఉత్తరా గర్భంలో ఉన్నటువంటి దానికి ఆ గర్భస్థ శిశువుకి శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని అడ్డం వేశాడు. సుదర్శన చక్రాన్ని అడ్డం వేసేస్తే ఇక అశ్వద్ధామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ఆమెని ఏమి చేయ చాలదు. కాబట్టి అది అయిపోగానే ఉత్తర సంతోషించింది, ఆనంద పడ్డది. నా కడుపులో ఉన్న బిడ్డ భద్రంగా ఉన్నాడు. ఎందుకంటే పాండవుల యొక్క వంశం ఇక నిలబడుతుంది. ఈ పాండవులు పోతారు ఎందుకని వాళ్ళు పెద్ద వాళ్ళు అయిపోయినారు. మహాభారత సంగ్రామం చేసేప్పటికీ అర్జునుడి వయస్సు ఈ కాల ప్రమాణం ప్రకారం డెభై తొమ్మిదేళ్ళు. యుద్ధం చేయించిన కృష్ణుడి వయస్సు ఎనభై ఏడేళ్ళు. సాయి కృష్ణుడు కూడా ఎనభై ఏడు. అది. కాబట్టి ఆ ఎనభై ఏడవ ఏటే మహాభారత సంగ్రామం జయించాడు ఆయన. ఎలా ఉన్నాడు? మమ్మధ స్వరూపంగా ఉన్నాడు. తేజోమయంగా ఉన్నాడు. ఇంతలో రసార్ద్రమైన, కరుణ నిష్ఠ అయినటువంటి ఒక సన్నివేశం మిగిలింది ఒక వృద్ధ ఆమె కుంతి. "కష్టాలివ్వవయ్యా కృష్ణా" అని అడిగిన కుంతి కాస్త మాట మార్చింది. ఇక ఏమడగాలో అడుగుతున్నది. ఏమడుగుతున్నది అంటే [చప్పట్లు] "తనయులచే యే దశమానంబగు చతుగ్ృహంబున యెందు చావకుండ" లక్క ఇంట్లో నా పిల్లల్ని కాపాడు. చతుర్ గృహం అంటే లక్షా-లక్షా గృహం. "గురురాజు కురురాజు పెట్టించు ఘోర విషంబున మారుత పుత్రుండు మడియకుండ, ధార్తరాష్ట్రుడు సముద్గతి చీలలులు వంగ ద్రౌపది మానంబు తలగకుండ, గాంగేయ కుంభజ్-కుంభజ కర్ణాది గనులచే నా బిడ్డలు అనిలోన నలగకుండ, విరటు పుత్రిక కడుపులో వెలయు చూలు ద్రోణంద్వను శరవన్హి త్రుంగకుండ మరియు రక్షించితివి" మరియు రక్షించితివి అసలు నువ్వు రక్ష చేయటమే అలవాటు. అయిపోయింది అనుకోకు మరియు అంటే కొసరు. ఆ మిగిలినటువంటి గర్భస్థ శిశువును కూడా నువ్వు కాపాడవయ్యా. "తక్కు మార్గములను నిన్ను ఏమని వన్నెంటు నీరజాక్ష" కుంతీస్తవం అంటారు దీన్ని భాగవతంలో. చదివినట్లయితే కుంతీస్తవం పరమాత్మకి ఎప్పుడూ కూడా ఆయనకేదో పాలు, పలహారం, నైవేద్యం పెట్టేసి, "ఇవాళ నా ఉద్యోగం బాగుండాలి, ఆస్తులు బాగుండాలి, చల్లగా చూడయ్యా, మా పనులన్నీ అయ్యేట్టు చూడయ్యా" అని ఆయన్ని పనిలో పెట్టి మన పనులు ముగించుకొని వచ్చి మన తెలివితేటలతోనే ఎన్ని పనులు చేసేసాం అని హాయిగా నిద్రపోయి. అది పద్ధతి కాదని చెప్తున్నది భాగవతం. ఏం చెప్తున్నది అంటే పరమాత్ముని నువ్వొక సాయం అడిగావు. ఆయన నీకా సాయం చేశాడు. నువ్వేం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి. కుంతి చేస్తున్న పని అదే. ఆ కృతజ్ఞతా భూత అయినటువంటి కుంతి రెండు మాటలు అడిగింది. "యాదవులందు పాండవులందు అధీశ్వరా" ఎప్పటికైనా మనం కూడా అలా మారాలి. యాదవులని అంటే నీ వారిని, పాండవులని నా వారిని, నా కులం వారు నీ కులం వారిని. "నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్యా ఘనో సింధువు చేరడి గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై అవిశంభు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో కదియునట్లుగ చేయగదయ్య ఈశ్వరా" గంగానది ఎట్లాగైతే సాగర సంగమం చేయవలసి ఉన్నదో, ఏనాటికైనా, అలాగే మిగిలిన కాలమంతా ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు. ఈ ఉన్న కాలమంతా కూడా నీ పాదపద్మముల యందు మాత్రమే నా మనస్సు నిలబడి హిరణ్యగర్భుడవైనటువంటి పరమాత్మ అనబడేటువంటి ఈ సాగరంలోకి జీవాత్మగా ఉన్నటువంటి నేను చేరేట్లుగా, నా మనస్సు నిలకడ చెందేట్లుగా అనుగ్రహించవయ్యా అన్నది. అనుగ్రహించవయ్యా అని అడుగుతుంది కదా! అడిగితే చేస్తాడా? ఆయన కూడా కాస్త పొగడాలి. కీర్తించాలి. ఆ కీర్తించటం అంటే మన సంస్కారం. ఆయనే కీర్త-- స్వామి చెప్పారు "నుతులకి, నతులకు పొంగడి సాయి" అన్నారు. నువ్వు స్తుతించు, బాగా పొగుడు, ఏవీ నాకంటూ పొమ్మన్నారాయన. స్తుతించు అస్సలు అక్కర్లేదన్నారు. మరి ఏం కావాలయ్యా? "నీ హృదయార్పణంచే నేను నీవాడిని అవుతాను" అన్నారు. నేను ఎంత సులభుడినో అంత అలభుడ్ని కూడా. అని స్వామి ఎలా చెప్పారో కృష్ణుడి యొక్క తత్వం తెలిసిన కుంతి అదే అడుగుతున్నది చివరికి. "శ్రీ కృష్ణాయదు భూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దహన లోకేశ్వరా దేవతానిక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మ్రొక్కిడ తుంచవే భవలతుల్ నిత్యానుకంపానిధీ నిత్య అనుకంపానిధీ" నీ కరుణ ఆరోజు ఉండి రేపు లేకుండా లేదయ్యా. నిత్య సత్య శాశ్వతమైనటువంటి నీ అనుగ్రహం నాయందుండి భవలతలు తెగిపోయేట్లుగా, తీగలు పాకేట్టుగా తాగేట్టుగా కాకుండా, అడుగో ఉత్తరా గర్భంలో వాడున్నాడు. ఆ జరిగేదేదో కాలగమనంలో జరుగుతుంటాయి. ఇది వృద్ధులైన వారు నేర్వవలసినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రార్థనా గీతిక. వృద్ధుడు ఏమంటాడంటే అరవై ఏళ్ళు వచ్చే వరకు నా చిన్నప్పుడు మా పిల్లలతో ఆడుకోలేదు కాబట్టి నేను అరవై ఏళ్ళు వచ్చాక పని ఏవీ లేదు కాబట్టి మా పిల్లలకు పుట్టిన పిల్లలతో ఆడుకుంటానంటాడు. ఇంతకంటే ఆశాపాశం.మరొకటున్నదా? అందుకనే రిటైర్ అవ్వగానే ఏం చేస్తావంటే ఇదివరకు ఏదో ఆశ్రమానికి పోయి మహాత్ముల సమాశ్రయం చేసి ఉంటాం అంటే "ఏముందండి హాయిగా బేబీ సిట్టింగ్ కి వెళ్తాం" అంటున్నారు. మరి మన ఏం గోరేమో అది పరమాత్మ ఇచ్చాడు. ఏది మనం కోరుకుంటే అది ఆయన ఇస్తాడు. ఏది సంకల్పిస్తామో దానినే అనుగ్రహిస్తాడు గనుక ఈమె ఆ ప్రమాదంలో పడదలచుకోలే. ఉత్తర ఎట్లా ఉంటుంది? ఉత్తర పుట్టే, ఉత్తరకు పుట్టే కొడుకు పుడితే ఓ ముని మనవడు వస్తే వాడికి ఒక వెండి ఇగ బంగారపు గిన్నె చేయిస్తే, వాడికి నా చేత్తో పాలు పోయిస్తే తర్వాత పోతే అంటే, నువ్వు పోయినట్టు తెలీదు ఉన్నట్టు తెలీదు వాడికి. నీ ముని మనవడికి అయినా తెలుసా? మళ్ళీ వాడు పెద్దవాడై చెప్పాక వాడు ఏమంటాడంటే "ఓహో" అంటాడంట. ఓట జరిగిందా అంటాడు. కాబట్టి ఈ ప్రపంచం అంతా ఒక అలా, నిజానికి ఒక కల. ఈ అలా కల అయినటువంటి దాంట్లో ఇలా తలంలో మనం ఉన్నాం గనుక పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే రెండు మార్గాలున్నాయి. కర్మలన్నీ చేయాలి, భక్తితో చేయాలి. జ్ఞానయోగ స్థాయిని అందుకోవాలి. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలని మూడింటినీ కూడా త్రిపుటీకరణం చేయాలి. ఇందులో ఏది గొప్పది అని డిబేట్ ఎప్పుడూ పెట్టకూడదు. కర్మలేని భక్తి, కర్మ భక్తులు లేని జ్ఞానం, జ్ఞానము లేని మిగతా రెండు భక్తులు కూడా అసంపూర్ణము, అసంబద్ధము, అసమగ్రము, అస్పష్టము, అవాంఛనీయము. కనుక మనం కోరవలసింది ఒకటే, పరమేశ్వరా! కన్నుమూసే దాకా కాళ్ళు చేయ్యాడేట్టుగా చూడు. ఈ కర్మలన్నింటినీ కూడా నీతో యోగించి, నీ శక్తితో కూడి జీవించేట్లుగా మాకు అనుగ్రహ వరదానం చెయ్. ఆ కర్మలు చేయటానికి కావలసిన తలపులన్నీ నువ్వే ఇవ్వు. ఆ తలపులు చేయగలిగిన సంస్కారాన్నివ్వు. సంస్కారాన్ని పొందగలిగినటువంటి జన్మ నివ్వు. ఆ జన్మలో నుంచి కర్మలు పునరావృత్తి సహితంగా వీటన్నింటినీ ఇస్తూ అన్నివేళలా నీ పాదపద్మముల యందు మా మనస్సు లగ్నమయ్యేట్టుగా భక్తి యోగాన్ని వరదానం చెయ్. ఈ రెండింటి వలన ఒక్క విషయం తెలుసుకుంటాను. త్వమేవాహం న సంశయః. నీకూ నాకూ తేడా లేదయ్యా! నీవే నేనుగా, నేనే నీవుగా. ఈ ప్రపంచంలో మనమిద్దరం వెలిగిపోతున్నాం. నేనే పుష్పము, నీవే సౌరభము తండ్రీ! లోక లోకాంతర ప్రాణముల్ పలు స్త్రీదళములై విరియగా రంగత్సుధా భక్తి ఈ నీ నానడుమ యుగాంతరస్థిర మహానిర్మాణ సూత్రముగా నీవే నేనై వెలిగిపోయెదము తంత్రీ నాద రమ్యాకృతిన్. నేను పుష్పమైతే కనపడని పరిమళానివి నువ్వు. నేను కనిపిస్తున్న వీణనైతే ఆ వీణల వెనక, ఆ నాడుల వెనక, తంత్రి వెనక దాగినటువంటి నాదానివి నువ్వు. నాదం లేకపోతే వీణ ఒట్టి బొమ్మ. నాదానికి వీణ లేకపోతే ఆవిష్కృతమయ్యే అవకాశం లేదు. కాబట్టి భక్త భగవంతుల యొక్క పూర్ణయోగమైనటువంటి స్థితే పరమ భాగవతం కాబట్టి శ్రీమద్భాగవతంలో అశ్వత్థామ అవమానంతో ఉత్తరా గర్భస్థమైనటువంటి ఒక పిండాన్ని, చక్రాయుధాన్ని ప్రయోగించి శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మాన్ని పాటించిన, పాలించిన, ఆచరించినటువంటి పాండవ వంశానికి పెద్ద దిక్కై కట్టక మరియు అన్నదామె. చూశారా, ఇంకా మిగిలినదేదున్నదో రాబోయే తరాలకు కూడా మాకిచ్చావన్నారు. అలాగే స్వామి ఈవేళ ఆధునిక ప్రపంచంలో మనందరితో ఒక మాట చెప్పారు. ఎవరు సత్య సాయి భగవానుడి ఆవరణంలోకి వస్తారో, ఎవరు సత్య సాయి భగవానుడి యొక్క దివ్య కథను వింటారో, ఎవరు జగద్గురువుగా భావించి ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా ఆచరణ యోగ్యం చేసుకొని జీవితాన్ని నడుపుతారో, ఎవరు సర్వ సమర్పణం చేసుకొని ఉంటారో వారందరి రాబోయే ఇరవై ఒక్క తరాలను నేను కాచుకుంటాను అన్నారు స్వామి. ఆ ఇరవై ఒక్క తరాలు నాడు కృష్ణుడు ఎట్లాగైతే ఉత్తరా గర్భం నుంచి మొదలుపెట్టి తర్వాత సాగినటువంటి అనేకానేకమైనటువంటి గాథలన్నింటిలో శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లాగైతే ఒక జయకేతనంగా నిలిచాడో, ఇవాళ సత్య సాయి భగవానుడు కూడా ఆధునిక మానవులమైన మనము ఋషిసత్తములమే. ఏదో మహా యోగం చేశాం, పుణ్యం చేశాం, యాగం చేశాం, ఎంతమంది మహాత్ములను దర్శనం చేశామో, ఏమో ఈ స్వామిని పూర్వావతారాలలో ఎన్నిసార్లు దర్శనం చేశామో, మళ్ళీ పునః ఈ ప్రపంచంలో మరొక అవతారం ఎత్తి వచ్చినవేళ మనం కూడా వచ్చి మళ్ళీ ఆయన కథని నైమిశారణ్యంలో సత్రయాగంగా ఒక సూతుడు, శౌనకుడు అనబడేటువంటి ఇద్దరు మహాపురుషులు మాట్లాడుకుంటున్న ఒక చక్కని విచార ధారణే శ్రీమద్భాగవతం అవనీతంగా చేసుకోవటానికి అనుగ్రహించినటువంటి పరమాత్మ సాయి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ స్వామి మన యొక్క ఈ యోగాన్ని, ఈ అనుభవాన్ని పరిపూర్ణమైన విభూతి స్థాయికి, పరమ చర్మ స్థాయికి చేర్చు గాక అని స్వామిని మరొక్కసారి ప్రార్థిస్తూ సాయిరాం.
SSSMC · audio
Bhagawata Navaneetham - 06
Bhagawata Navaneetham - 06
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 29:13
More in this series