No transcript for this section.
గురువుల్ని శిష్యులు దూషిస్తారన్నారు చూస్తున్నాం మనం. హరి చూడ నరుడేగినాడు. పాపం మనస్సు అర్జునుడి మీదికి వెళ్ళింది. ఇవి ఇవన్నీ చూస్తూ మా అర్జునుడు ఏమైపోయాడో. సుమారు ఏడు నెలలు అయిపోయింది కృష్ణుణ్ణి చూసి వస్తానని బయల్దేరాడు ఏడు నెలలు. నెలలేడయ్యెంత నారాడు. కాలరులే వారును యాదవులు. సమగలోల స్వాంతులి వీళ. సంస్థితులై ఉండుదురా. యాదవులంతా అసలు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, ఎట్లా ఉన్నారో. మురారి సుఖియై. హేమంబుతో ఉందునా. మురారి సుఖియై. క్షేమంబుతో ఉందునా. శ్రీకృష్ణ పరమాత్మ సుఖుడుగా చక్కగా క్షేమంగా ఉండే ఉండాలి ఉండే ఉంటాడా? ఎరవైయున్నది చిత్తము. ఈశ్వర కృతం ఎట్లోకడే మారుతి. ఏమో ఈ ప్రాణం లోపల గిలగిలా కొట్టుకుంటుంది కృష్ణుడు ఎలా ఉన్నాడో ఏమైపోయినాడో, నిజంగా క్షేమంగా ఉన్నాడా లేడా అని. ఇది తీసేద్దాం. మరియు మహోంతాపంబులు బెకుబెట్టుచున్నవి. మురాంతకుని వృత్తాంతంబు వినరాదని కుంతీ సుత అగ్రజుండు. భీముణ్ణి పిలిచి అడిగాడు, ఏమైందో నువ్వు కనుక్కో అర్జునుడు ఏడు నెలలు అయిపోయింది. అన్న ఇంట్లో అన్న తమ్ముడు ఒక చిన్న కథ చెప్తాను ఇక్కడ స్వామి సంగతి. చాలా అందమైన మనం కనుక్కోకపోవడం ఎట్లా ఉంటుందో, ఎందుకు కనుక్కోవాలో స్వామి బోధించారు. బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో స్వామి ఆ రోజులు ఎప్పుడైనా ఆ రోజులే ఈ రోజులు ఏం లేదు. ఆ రోజుల్లో ప్రతిరోజూ సాయంకాలం వచ్చి పిల్లల చేత చక్కగా భజన చేయించేవారు. ఆ భజనలో ఓ బెంగాలీ కుర్రవాడు చాలా గొప్ప గాయకుడు గొప్ప బ్రహ్మాండమైన గాయకుడు మామూలు వాడు కాదు. స్వామి వాడిని మెచ్చుకో మెచ్చుకునేవారు direct గా "ఎంత బాగా పాడావురా" అనేవారు. ఎప్పుడైతే స్వామి కూడా "ఎంత బాగా పాడావురా" అని అన్నారో, ఆ రోజు సాయంకాలం వాడికి ఏమనిపించిందంటే వాడి friends అంతా "స్వామి భలే మెచ్చుకుంటున్నారే ప్రతిరోజూ నిన్ను ఎంత అదృష్టం నీది" అన్నారు. అంటుంటే ఆ rehearsal వేసుకునే time లో ఒక మాట అన్నాడు, "కదా! రేపు చూపిస్తా, ఈ స్వామికి తెలియని ఒక రాగంలో పాట పాడతా" అన్నాడు. స్వామి student ఏ అంటే భలే బాగుంది స్వామికి తెలియంది పాడాల్సిందే నిజమే. అప్పుడు వీళ్ళ ఉద్దేశం పాపం ఏంటంటే ఎక్కడిది ఈ పాట అని ఆయన అడుగుతారని మీకు తెలియదులే స్వామి అక్కడ ఉందని చెప్దామని వీడికి. వీడు ఏంటంటే స్వామికి తెలియని రాగం పాడాను కదా అని ఒక అతిశయం సాత్వికాహంకారం అనండి, రాజసాహంకారం అనండి అహంకారం. సరే మరనాడు prepare అయ్యి వెళ్లారు స్వామి as usual అసలేం తెలియనట్టు వచ్చారు. వీళ్ళు పాట మొదలు పెట్టారు. చాలా విచిత్రంగా, చాలా కుదురుగా, ఏమీ interfere కాకుండా మంచి బుద్ధిమంతుడైన బాలుడిగా వినే స్వామి ఆ రోజు వాడు పాడుతున్నంత సేపు interfere అవుతున్నారు. వాడి పాట సాగదు ఈయన ఆగరు. అయింది, అయింది, అయింది అయిపోయిన తర్వాత వీడే స్వామికి ఒక చిన్న చీటీ రాసి పంపుకున్నాడు. స్వామి పాట అయిపోయిన తర్వాత భజన అయిపోయేదాకా నేను వచ్చి కలుస్తాను అని. స్వామి అయినా సరే interfere అవుతూనే ఉన్నారు. పాట సాగనివ్వలేదు. వాడికి పాట ఎందుకు ఇవాళ స్వామి ఇలా నా వైపు నా మీద నన్ను వేటాడుతున్నారు అన్నాడు వాడు. అయిపోయింది భజన అయిపోయింది ఆ రోజు సాయంకాలం Swami had a guest in త్రయీ బృందావన్. పిల్లలు వడ్డన చేయాలి. ఈ పిల్లవాడికి కూర వడ్డించే bucket చేతికి ఇచ్చారు. వీడి duty అది. guest కి దగ్గరగా స్వామి కూర్చుని ఉన్నారు. వీడి చెవి ఉణుకుతోంది. ఆ వడ్డించేటప్పుడు రెండు ముక్కలు నేల మీద పడ్డాయి. ఇంకేం కావాలి అక్కడ స్వామి చూశారు. చూసి కోపం నటించారు. ఇవాళ ఏమైంది అసలు స్వామికి నన్ను పట్టుకున్నారు ఏంటి? ఎవడూ లేనట్టు పాట పాడనివ్వరు, ఇక్కడ వడ్డన చేయనివ్వరు ఇదేమి గోల అని బాధపడ్డాడు వాడు. నెమ్మదిగా అక్కడ bucket పెట్టేసి ఎవరికీ చెప్పలేదు. చెప్పకుండా తన room లోకి వెళ్ళిపోయి గడి చేసుకొని వాడు ఏడుస్తూ కూర్చున్నాడు, పోయినాడు. సరే అంతా guest లు వెళ్ళటం అంతా అయిపోయిన తర్వాత స్వామి పిల్లలతో కాసేపు అట్లా అట్లా ఉండి ఏమడిగారంటే, "ఎరా! మీ friend భోంచేశాడా?" అని అడిగారు. ఎవరు ఎవరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. స్వామి అన్నారు, "సరే నేను పరమానందనే అనుకో మీరు శిష్యులేనా, మీ friend ఎవడో అన్నం తినకపోతే మీకు బాధ అనిపించలేదా? అన్నం తినలేదు కదా వాడు పలానా" అన్నారు. "అవును స్వామి అవును స్వామి" సరే అని ఎవరో plate తీసి తీసుకోబోతుంటే స్వామి స్వయంగా ఓ plate తీసుకుని దానిలో వాడికి కావలసినవన్నీ పెట్టించుకుని ఆ plate స్వయంగా వాడి room దగ్గరికి తానే మోసుకుని వెళ్ళి టక టక కొడితే వాడు తీయలే friend ఎవడో వచ్చాడనుకొని. తీయకపోతే ఈయన కూడా నేను వచ్చానని అనొచ్చుగా. స్వామి పిలిచినానే రానన్నాడు. స్వామే వచ్చారు తలుపు తీయన్నారీయన. అనగానే ఆ voice విని వాడు తలుపు తీశాడు. స్వామి లోపలికి వెళ్లి ముందు అన్నం తినమన్నారు. చేతులు కడుక్కురా, మొహం కడుక్కురా ఎందుకు ఏడుస్తున్నావ్ అన్నారు. ఏం చెప్పలే. అయిపోయిన తర్వాత ముందు అన్నం పెట్టిన తర్వాత అన్నం తన దగ్గరే ఉండి వాడితో తినిపిస్తూ "ఎందుకు ఏడుస్తున్నావు?" అన్నారు. "స్వామి! నా పాట బాగా లేకపోతే, నేను పాడే రాగంలో దోషం ఉంటే ఇట్లాగే నన్ను ఒంటరిగా పిలిచి తిడితే ఎంత బాగుండేది. అందరిలో పట్టుకొని.నాకు నన్ను పాడనివ్వకుండా అందరిలో పట్టుకొని నన్ను వడ్డన చేయనివ్వకుండా ఎందుకిలా చేశారు? అని అడిగాడు. ఏమిరా నీకెంత బాధ కలిగింది నిన్న రాత్రి మీ friends అందరూ కూర్చొని స్వామికి తెలియని రాగం పాడుతానంటే నాకెంత బాధ కలిగింది [నవ్వు] ఆ బాధ నీ ఒక్కడిదేనా నాది కూడా కాదా ఆ అయినా ఏడుపులో నుంచి బాగా పాట పాడాల్రా అని స్వామి జగదభిరాముడు శ్రీరాముడే ఆ పాట అలా పాడగలిగితే భగవంతుని గురించి అంత వేదనతో పాడగలిగితే భగవంతుడు దిగి వస్తాడురా నీకు లోపల స్వామి పట్ల ఉన్న భక్తి ప్రేమ అపేక్ష నాకు తెలియంది కాదు కాస్తే కాస్త తోక వచ్చింది అది కత్తిరిద్దామని వచ్చా అన్నాడు. అంటే సాత్వికాహంకారం రాకూడదు పరమేశ్వరుడు మనకిచ్చిన యోగాన్ని మనం చక్కగా అనుభవించాలి చాలా మర్యాదగా అనుభవించాలి నిబ్బరంగా అనుభవించాలి దానికి ఉద్వేగాలు అక్కర్లేదు తాదాత్మ్యాలు అక్కర్లేదు నా అంతటి వాళ్ళు లేరని అనుకోనక్కర్లేదు మరొకడు ఉండకూడదని కోరుకోకూడదు అందరమూ స్వామి కోసం ఉన్నామనే భావన ఉండాలి అదే విదుర మహాదేవుడు చక్కగా ఆ బోధ చేశాడు. చేసి ఇది స్వామి స్వామి ప్రేమతత్వంలో ఆయన చెప్పేది అదే unconditional గా it doesn't cost even one naya paisa to love the other person when you are loving the other person you are loving భగవాన్. భగవాన్ అంటే ప్రత్యేకంగా ఏం లేరు ఊరికే మనకు కాసేపు అలా కనపడాలి గనుక అలా ఉన్నారు గాని మనందరిలో ఇప్పుడు ఈ అంటున్నదంతా భగవంతుడే వింటున్నది భగవంతుడే మరి ఎవరయ్యా అంటే అనటానికి ఒకడు ఉండాలి వినటానికి నలుగురు ఉండాలి సన్నివేశం ఏర్పరుస్తారు కాబట్టి ఇక్కడ మన ప్రమేయాలేవి ఉండవు ఆ అకర్తృత్వం ఉండాలి. సరే మహోత్పాతాలు చాలా జరుగుతున్నాయి జాగ్రత్తగా గమనించవయ్యా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు మరి అసలు కృష్ణుడు ఎలా ఉన్నాడో కృష్ణుడిని చూస్తాను అని వెళ్ళిన మన అర్జునుడు ఏమైపోయినాడో ముందు కనుక్కో అన్నాడు మారుతి అంటే ఆంజనేయస్వామి అని కాదు వాయునందనుడు అయినటువంటి భీముడు అని అర్థం మారుతి శబ్దం ఆయనకు కూడా ఉంది భీముడిని కూడా మారుతి అంటారు. వీళ్ళు ఇలా అనుకుంటున్నారో లేదో అర్జునుడు అప్పుడే enter అయినాడు. ఒక్కోసారి అలాగే అనిపిస్తుంది ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం వచ్చారే అంటామే అట్లా వాడు వచ్చాడు. రాగానే అన్న ఫల్గున భక్తవత్సలుడు చూడండా ధర్మరాజు మనసు ఎలా ఉందో ఎవరినీ అడగలే ఆయన భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడు ఆపన్నానీక శరణ్యుడు ఈశండు జగద్గ్రా బ్రహ్మానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజ సత్రనేత్రుడు సుధర్మా మధ్యపీఠంబునందు ఉన్నాడా బలభద్రు కూడి సుఖియై ఉత్సాహియై ద్వారకన్ ద్వారకా నగరంలో మనతో ఉన్నట్లే ఉత్సాహంగా ఉన్నాడా ఉండడేమో అని ఈయనకి మనం లేం కదా ఆయనకు కూడా ఉత్సాహం ఎక్కడిది ఉత్సాహంగా ఉన్నాడా బలరాముడితో కూడి ఉన్నాడా ఆనందంగా ఉన్నాడా మన కృష్ణుడు ఎలా ఉన్నాడు జగత్తును రక్షిస్తున్నాడా అని అడుగుతూ ఆ రామ కేశవులకు సారా మల భక్తిని ఉసలుపుదువు గదా గా రాములు చేయుదురా పో రాముల బంధులెల్ల పొద్దుచితారి. నీ కృష్ణుడితో చనువు ఎక్కువ కదా [కాష్] ఆ కారణంగా బలరాముడితో కూడా చనువు ఎక్కువ కదా ఆ చనువుతో మీ మధ్య జరిగిన సన్నివేశాలు ఏవైనా చెప్పు అని ఇప్పుడు స్వామి చెప్పుకున్నట్లే ధర్మరాజు అడుగుతున్నాడు. ఏముంది కృష్ణుడు బాగున్నాడు అంతా బానే ఉంది అంటే చాలు. కానీ ఆయనకు దుశ్శకునాలు గోచరించినయి కాలం మారుతోంది కదా మనల్నేమన్నా పరమాత్మ మర్చిపోయినాడా మనమేం మర్చిపోయినట్టుగా ఏం లేదే ఆయనకు ఇంకా మనం గుర్తున్నామా బలరామకృష్ణులు ఇద్దరూ మన గురించి ఏమన్నా మాట్లాడుకుంటున్నారా నీకు చనువు ఆ proximity ఉంది కాబట్టి చెప్పవయ్యా అని అడుగుతున్నాడు. కానీ దిగులుగా ఉన్నాడు ఎవడు అర్జునుడు దిగులుగా ఉన్న అర్జునుడికి కారణాలు అన్నగారి వెనుక వెతుకుతాడు. పిల్లలు కూడా ఏదేదో జరుగుతుంది school లో ఇంటికి వచ్చి direct గా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పరు మనమే వాళ్ళని వాళ్ళతో కూర్చోవాలి మాట్లాడాలి ఎందుకిలా ఉన్నావ్ ఏమైంది నిన్న నేను నిన్న గురించిన pen పోయిందా డబ్బులు పోయినాయా ఎవరన్నా నిన్నేమన్నా అన్నారా ఇవన్నీ local లో ఉండేది అలాగే అడుగుతున్నాడు. పోడితివో శత్రువులకు ఆడితివో సదుదూషణాలాపములు కూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్. అర్జునుడికి జరగటానికి వీలులేని నాలుగు కారణాలు అంటే అసలు దుఃఖమే వాడికని వాడు దుఃఖిస్తున్నాడు అంటే వాడు ఏం చేయలేదు అవన్నీ అన్న జరిగినయ్యా వాడి పట్ల అని ఎవరి చేతిలో ఉన్నా ఓడిపోయావా ద్వారకకు వెళ్ళి నలుగురు మంచి వాళ్ళ మధ్యలో నీ మర్యాద పోగొట్టుకున్నావా ఎవరినన్నా ఒక పెద్ద వారి పట్ల ఒక దురుసుగా ప్రవర్తించావా ఎందుకని నువ్వు దుఃఖంగా ఉన్నావు నువ్వెళ్ళింది కృష్ణ దర్శనానికి కదా అన్నాడు. అంతే కాదు ఈడేం మాట్లాడటంలే అర్జునుడు తల వంచు కూర్చున్నాడట. తప్పితివో ఇచ్చటనని చెప్పితివో కపట సాక్షి చేసిన మేలున్ తప్పితివో శరణార్థులరుప్పితివో ద్విజుల పసుల రోగుల సతులన్. ఎవరినన్నా ఈ రకంగా నువ్వు బాధించావా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినావా అయ్యో ఈ మాట అన్నానే చేయలేకపోయినానే అని అనుకుంటున్నావా కారణం చెప్పవయ్యా అన్నాడు.అప్పుడు కన్నీరు కరతలంబునెన్ తుడుచుకొని గద్గద స్వరంబున మహానిధిన్ కోరుపోయిన వేదచందమున నిటూర్పు నిగడించుచు అర్జునుండు అన్నకు ఇట్లనియన్ మన సారథి మన సచివుడు మన వీర్యము మన సకుండు మన బాంధవుడున్ మన విభుడు మన గురుడు మన దేవర మనలను తిగనాడి చనియే మనుజాధీశ మన స్నేహితుడు మన గురువు మన వియంకుడు వియ్యమందినవాడు మెయ్యమందినవాడు అసలు అన్నీ మనకైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ లేడు అన్నా అన్నాడు దిగి చనియడు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు గురుభీష్మాదుల కూడిపన్నిన కురుక్షోణీశ చక్రంబులో అర్జునుడికి దృశ్యాలు గుర్తొస్తున్నాయి ఎందుకు గురువయినాడు ఎందుకు సఖుడయినాడు ఆ పద్యాలన్నీ ఉన్నాయి అవన్నీ మనకు తెలుసు ఏ క్షణాన వియ్యం, వియ్యమందాడు ఏ క్షణాన ఆ ఖాండవ దహనన్నాడు ఎలా ఉన్నాడు అవన్నీ వర్ణిస్తూ మహాభారతం లేటెస్ట్ గా జరిగినది చెప్తున్నాడు అన్నగారికి ఆ స్మృతి జ్ఞాపకం గురుభీష్మాదులు ద్రోణాచార్యుడు భీష్ముడు మొదలైన వాళ్ళు కూడిపన్నిన కురుక్షోణీశ చక్రంబులో గురుశక్తిన్ హృదయాంతయై నొగలపై కూర్చుండి అందరూ నా మీద బాణాలు వేస్తుంటే అటు గురువు ఇటు తాతగారు భీష్ముడు ఆయనతో పాటు అధిరథ మహారథులంగా కూడా వేస్తూ ఉంటే పగ్గం పట్టుకొని సారథియై నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు నేను నిల్చుని ఉన్నా ఆయన కూర్చుని ఉన్నాడు ఎక్కడ కూర్చున్నాడు సుమారుగా నా మోకాళ్ళ దగ్గరకు వచ్చేట్టుగా కూర్చున్నాడు కూర్చొని నొగలపై కూర్చుండి ఆ మేటి నాసరము ఆరక మున్నారల బలత్సాహాయుర్జోగతత్పరల్ చూక్కుల సంహరించు అమితోత్సాహంబు నాకిచ్చుచున్ ఆ బాణం వచ్చేలోగానే కృష్ణ పరమాత్మ దాన్ని చూసేవాడట అర్జునుడి వైపు ఏ బాణం ఎవరు వేసినా శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని చూసేవాడు చూసి దానిలో ఉన్న శక్తి అంతా తనలో తీసుకునేవాడట ఇక్కడ వచ్చి తగిలేది ఏమిటంటే ఆ పుల్ల తగిలేది పుల్ల తగిలితే అర్జునుడు పడిపోడుగా అస్త్రమో శస్త్రమో తగలాలి అప్పుడు వాడు పడేది శక్తి అంతా కృష్ణ పరమాత్మ తీసేసుకునేవాడు వచ్చి బాణం తగిలేది కాబట్టి ఈయనకు ఏం అయ్యేది కాదు అటువంటి ఆ ఉత్సాహం నాకు ఇచ్చాడయ్యా అంతేకాదు మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి అన్నగారు అంటూ చలికాడ రమ్మని చీరు నన్నొకవేళ స్నేహితుడా రావోయ్ నాతో అలా బయటికి వెళ్దాం అనేవాడు ఒక్కొక్కప్పుడు మన్నించు నొకవేళ మరదియనుచు చెల్లెల్ని ఇచ్చాడుగా ఇచ్చిన పుణ్యానికి ఆయన తలొగ్గాలిగా చెల్లెల్ని ఇచ్చాడంటే మరి బావమరిది అయినాడు కృష్ణుడికి బావమరిది అర్జునుడు కాబట్టి మరది అని మన్నించేవాడట మళ్ళీ కుటుంబపరంగా బంధు బాంధవమున పాటించు నొకవేళ దాతయి ఒకవేళ ధనములిచ్చు మంత్రియై ఒకవేళ మంత్రమాదేశించు బోధియై ఒకవేళ బుద్ధి చెప్పు సారథ్యము నరించు చలవిచ్చి ఒకవేళ క్రీడించు ఒకవేళ గెలిసేయు అంటాడట యుద్ధం నేను చేస్తాలే కాసేపు నువ్వు రథం నడుపుతావా అని ఆ యుద్ధరంగంలో చమత్కారం ఆడేవాడట రథం నడపటం ఈయనకు వస్తేగా అర్జునుడికి రథం నడపటం రాదు అందుకే ఈయన ఎత్తుకున్నాడు మానవేగరుడు గాని ఒక శయ్యాసనంబున ఉండు కనతండ్రికై వడి చేసిన తప్పు కాచు హస్తములు బట్టి పొత్తును ఆరగించు మనుజ వల్లభా నా మాధవు మరపురాడు మాధవుణ్ణి నేను మరచలేక, మరి-మరచిపోలేకపోతున్నాను ఇన్ని విషయాలుగా ఇంత దగ్గర తీశాడే ఎలా పిలిచేవాడంటే అర్జునా అనేవాడు కాదట విజయ ధనంజయ హనుమధ్వజ భర్గుణ పార్థ పాండుతనయ వర మహేంద్రజ మిత్రార్జునా యంచు భుజములు తలకడ పరాక ఓకల చీరున్ ఇన్ని విధాలుగా పిలిచేవాడు నన్ను ఇన్ని విధాలుగా నన్ను పిలిచి దగ్గర తీసుకొని మళ్ళీ నన్ను ఎవరు పిలుస్తారట్లా యదువీరుల్ మునినాథు శాపమున కలాధీనులై అందరున్ మదిరాపాన వివర్ధమాన మదసంమర్ద్రోగ్ర రోషాంధులై కదనంబుల్ తమలోన ముష్టిహతులన్ కావించి నీరైరి అష్టదశన్ నష్టదశం జిక్కిరి నల్గురేవుర చటన్ సర్వం సహా వల్లభా యదుకులవంతా నాశనమైపోయింది కలి ప్రభావమో కృష్ణుడు లేని కారణమో తెలియదు గాని స్వేచ్ఛగా విశృంఖలంగా మదిరాపానం చేస్తున్నారు వాళ్ళల్లో వాళ్ళే ముష్టిఘాతాలు చేసుకుంటూ యుద్ధం చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ జీవయాత్ర సాగిస్తున్నారు అక్కడంతా కూడా సర్వం నష్టమైపోయింది ద్వారకలో ఏం లేదు అని నెమ్మదిగా ధర్మరాజుకి చెప్పాడు చెప్తే యదువుల నాశము మాధవు పదవియు విని కుంతి విమల భక్తిన్ భగవత్పద చింతాత్పరై ముదమున సంసార మార్గమున కున్ బాపెన్ కృష్ణుడు ఇక లేడు అన్న మాట విన్న మరుక్షణమే కుంతిదేవి శరీరాన్ని వదిలిపెట్టింది ఇంకా ఆవిడకి ఏం లేదు అప్పటిదాకా హాయిగా ఉంది కృష్ణుడు లేడు అని అర్జునుడు చెప్పగా విన్-విన్నది వినపడ్డది అంతే ఆమెకిమొట్టమొదట మహాప్రస్థానంలో భగవంతుడే ముందు ముక్తి మార్గానికి ఆయన తోవ చూపించాడు. మహాభారతం నిండా శరీరం వదిలిపెట్టవలసి వస్తే మొట్టమొదట వదిలిపెట్టిన వాడు ఎవడంటే కృష్ణ పరమాత్మ. ఆయన లేడు అన్నటువంటి వార్త విన్నటువంటి కుంతి వదిలిపెట్టింది వెంటనే. ఇక గాంధారి, ధృతరాష్ట్రులు వాళ్ళు పోవడం ఇదంతా లౌకికం. ఆ ధర్మంలో కూడా ధర్మాన్ని నడిపించినటువంటి పరమాత్మ ఒక యుగావతారి తన శరీరాన్ని ముందు తాను వదిలిపెట్టేసాడు. వదిలిపెట్టిన తర్వాత ఆయన లేని నేను లేను అనుకున్నటువంటి కుంతీదేవి తన శరీరాన్ని వదిలిపెట్టింది. ఇక మిగిలిన వారు ఎవరు? ఇదిగో పంచపాండవులు ఒక కుంతి ఆ ద్రౌపది వీళ్ళే మిగిలారు. [జలుబు] ఇంకా ఎప్పుడైతే కృష్ణుడు లేడు అన్నాడో ధర్మరాజు ఎప్పుడో అనుకున్నాడు కృష్ణుడు యొక్క విలువైన సలహా మాకు దొరుకుతుంది, ఆయన ఎట్లా నడిపిస్తే ఈ రాజ్యాన్ని అట్లా నడిపించగలమని పాపం ఆశ కొద్దీ సింహాసనం ఎక్కాడు ఆయన. కృష్ణుడే లేడన్న తర్వాత తల్లి కూడా మరణించిన తర్వాత మరుక్షణంలో ఆయనకి వైరాగ్యం కలిగింది. వైరాగ్యం ఓ నాలుగేళ్ళ తర్వాత కలిగేది వైరాగ్యం కాదు. కలిగితే వెను-వెనువెంటనే జరగాలి. ఆ వైరాగ్యం ఆయనకి వెంటనే కలగటం ఆ కలిగిన కారణంగా పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేయవలసి వచ్చింది. యౌవరాజ్య పట్టాభిషేకం. ఎందుకంటే వంశాంకురం పాండవ వంశాంకురం ఉన్నది కాబట్టి ఆయనని పిలిచాడు. పిలిచి నాయనా కలి వర్తనంబున క్రౌర్య హింసా సత్య దంభ క్రౌటి కౌతుర్యాజ్య ధర్మచయము పురముల గుహముల భూముల కమలోన కలుగుట తలపోసి. పురంలో, భవనంలో, భూనంలో లోపల అంటే ఒంట్లో, ఇంట్లో అన్నిచోట్లా కూడా అధర్మం రాబోతున్నది. ఇది కలి ప్రవేశించాడు కృష్ణుడు లేకపోవడం అంటేనే కలి విజృంభణ. ఆ కలి విజృంభణ వల్లనే ఎదుకులవంతా నశించి పోతున్నది. కాబట్టి ఇక మనం మిగిలిని ఉండి మాత్రం ఏమున్నది? ఐదుగురమే కదా! పట్టుమని ఐదుగురం కూడా లేవని అనుకొని తలపోసి కలిపురం అయిన హస్తినాపురంలో మనుమని రాజైవై మనుమని దిగవించి సింధుతోయ కణాభిషిక్తు చేసి సింధూ నది నుంచి అది ఆ సింధుయే అది హిందూ నది అయింది. ఆ హిందూ నది అంటే భారతీయ ఆధ్యాత్మికీ మూలమూ ఆలంభనమైనటువంటి ఆ పంచాబ్ అది పంజాబ్. ఆ నీళ్లు ఆ ఐదు నదుల్లో నుంచి నీళ్లు తెచ్చి మూర్ధాభిషిక్తుడ్ని చేశాడు. అవే పుణ్య జలాలు. దాని నుంచి అనిరుద్ధనందనుడైన వజ్రుని తెచ్చి మధుర పట్టను గట్టి మమత వాసి కరుల హరుల భటుల కంకణాదికముల మంత్రిజనుల గుధుల మానవతుల అఖిలమైన ధనము అభిమన్యుసుతునకు అప్పగించి బుద్ధిని ఆశ్రయించి. ధర్మరాజు చేసిన పని అది. పట్టాభిషేకం చేసిన మరుక్షణమే తన ఒంటిమీద రాజరాంచనాలుగా ఉన్నటువంటి ఆభరణాలన్నీ మూటగట్టి అక్కడ పెట్టాడు. తాను ధరించిన కిరీటాన్ని నేలమీద పెట్టాడు. తన ఒంటిమీద రాచరికపు ఏ చిహ్నమూ లేకుండా విరాగి అయినాడు. వస్తువుల యందు మనస్సును నెలబెట్టుకున్న ధర్మరాజు ఆ క్షణం వరకు యౌవరాజ్య పట్టాభిషేక మరుక్షణమే తన మనస్సును చిత్తాన్ని మనీషాయత్తం చేశాడు. అంటే బుద్ధితో కూర్చి ఉంచాడు. జ్ఞానాధిక్యమైనటువంటి స్థితిలో ఆ మనస్సుని అనుసంధానం చేశాడు. ఎప్పుడైతే మన మనస్సు వస్తువు నుంచి, ప్రపంచం నుంచి, లోక భోగాల నుంచి మరలి పరమాత్మ యొక్క సన్నిధానం వైపు, పరమాత్మ భావన వైపు ఒక్కసారిగా ఒత్తిగిల్లుతుందో ఆ క్షణాన మనలో ఉన్నటువంటి షడూర్మములు, షడ్వికారములు, షడ్వర్గములతో కూడినటువంటి ఈ పాంచభౌతిక దేహము తేజోమయమై విరాజిల్లుతుంది. ఏది అక్కరలేదో మనక్కూడా చూడండి. ఇది నాకు ఫలానాది అక్కరలేదు అని మనస్సు స్థి-స్థిమిత పడ్డ తర్వాత మనం వెలిగిపోతూ ఉంటాం. కదా. ఆ వస్తువు ఇది కావాలి అనుకున్న మరుక్షణం వెలుగు తగ్గటం మొదలుపెట్టి పొందేదాకా అది నెమ్మది నెమ్మదిగా క్షీణించి పొందేదాకా ఉండి, పొందిన మరుక్షణం అది నశించి చివరికి ఆ వస్తువు మనం దూరమయ్యే దాకా దుఃఖాక్రాంతులమై ఉంటాం. ఇది లోకరీతి. అలాగే ధర్మరాజు మహాభారత సంగ్రామంలో చక్కగా జయించిన వాడై, రాజై అయినా లోక ధర్మాన్ని పాటించి తన గురువు, తన సచివుడు, తన బంధువు, పూర్ణుడైనటువంటి కృష్ణ పరమాత్మ, తనువునిచ్చినటువంటి తల్లి కుంతి మరణించగానే పౌత్రుడైనటువంటి పరీక్షున్ మహారాజుకి పట్టాభిషేకం చేసి బుద్ధికుశలతతో తనతో తాను కూడి ఉన్నాడు. ఇక ఆయన జ్ఞాన యోగం ప్రారంభమైంది. కర్మ అయిపోయింది. భక్తి అయింది. ఈ రెండు యోగాలు పూర్ణం కాగా మిగిలింది జ్ఞాన యోగం కాబట్టి ఆ జ్ఞాన యోగంలో చెప్పాడు. పక్కన ఉన్న భటులందర్నీ వాడికపై రాజు వాణ్ని సేవించండి అన్నాడు. అలాగే అంతఃపుర కాంతలందరికీ కూడా చెప్పాడు మీకు రక్షాయుతమూర్తి వాడు నేను కాదు ఇంకా. మీకేం కావాలన్నా రాజు అయిన వాణ్ని అడగండి నావైపు రాకండి అన్నాడు. అటువంటి రాజులు ప్రపంచానికి కావాలి. ప్రపంచం ఎప్పుడు ధర్మవర్తనంలో ఉంటుందంటే రాజు ధర్మం గనక పాటిస్తే ప్రజ ధర్మాన్ని పాటిస్తుంది. అందుకే అది యధా రాజా తథా ప్రజా. అంటే రాజు వినిర్మరుడైనట్లయితే, ధర్మబద్ధుడైనట్లయితే వాడే అట్లా ఉన్నాడే మనం ఇట్లా ఉంటే ఎట్లా అని ఒక సిగ్గురితణం చేతనైనా వీడిలో ఉన్నటువంటి లోపాలు దిద్దుకొని వాడు రాజుని అనుసరిస్తాడు. రాజే దుర్మార్గుడు, రాజే నీతిబాహ్యుడు, రాజే అధర్మవర్తనుడు గనక అయినట్లయితే రాజే అలా ఉండగలిగితే మనదేం పోయింది మనల్ని పట్టుకునేవాడే లేడుగా! వాడు గజ దొంగ మనం చిల్లర దొంగలం అనుకొని బతుకుతారు. అంతే జరిగేది.
SSSMC · audio
Bhagawata Navaneetham - 13
Bhagawata Navaneetham - 13
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 24:32
More in this series