Skip to content
Transcript తెలుగు
చిత్తంబున బ్రహ్మమును ఆవృత్తముగా విల్చుకొనుచు విజ్ఞాన ధనాయత్తులు తొల్ల వెలింగడి ఉత్తర దిశకేగ నిర్మలోద్యోగమునన్ ఉత్తరాభిముఖుడై వెళ్ళాలి అందరం కూడా ఉత్తరాభిముఖంగానే వెళ్ళాలి సాధారణంగా అది వాస్తు శాస్త్రం కాదు గాని మూడు స్థితులున్నాయి మనకి మామూలు ప్రాపంచిక స్థితి ఒకటి భౌతిక స్థితి విజ్ఞానం చేత వికసించినటువంటి ఒక ఆదిభౌతిక స్థితి విచారణ వల్ల through discrimination అంటాం విచక్షణ వలన ఇక మూడవది ఆధ్యాత్మికమైనది ఆధ్యాత్మిక లోకమైన వాడికి తూర్పు అయినా ఒకటే దక్షిణం అయినా ఒకటే ఏం తేడా లేదు కానీ అక్కడి దాకా వెళ్ళని వాడికి తూర్పు తూర్పే ఉత్తరం ఉత్తరమే ఏం చేయాలి అంటే మనకి మామూలుగా ఏం చెప్తారంటే తూర్పు వైపు అన్నీ తూర్పు శుభం number one అని చెప్తారు కానీ నిజం అది కాదు నిజం ఏమిటంటే ఉత్తర ముఖమే ఉత్తమోత్తమమైన ముఖం ఉత్తర ముఖంగా కూర్చొని గనక పరమాత్మకి దండం పెట్టుకున్న ట్లయితే అక్కడ ఉన్నాడు అనుకొని కాసేపు లగ్నం చేయాలిగా తూర్పున ఉన్న పట్టణం ఉత్తరం వైపు ఉందనుకోండి అక్కడ నుంచి ఆయన్ని గనక చూసినట్లయితే ఆయన దక్షిణాన్ని గనక చూస్తూ ఉన్నట్లయితే అది ఉత్తమోత్తమమైనటువంటి స్థితి ప్రపంచంలో ఎన్ని మందిరాలు ఎలా అయినా ఉండనివ్వండి శివం మందిరంలో స్వామి దక్షిణాభిముఖులై ఉంటారు అది జ్ఞాన కేంద్రం నిజానికి అలా ఉండవలసినటువంటి స్థితి దానిది ఎందుకనంటే మనం ఉత్తర ముఖులుగా స్వామిని చూస్తాం స్వామి మనల్ని దక్షిణ ముఖంగా స్వామి మనల్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఉత్తరాభిముఖుడు ఎందుకైనాడంటే ఉత్తరం దక్షిణం కంటే చాలా ఉత్తమమైనది భారతీయ స్థితిలో దక్షిణం చిట్టచివర ఏమున్నదంటే మహా సముద్రం ఉంది సముద్రం దాని లోతంతా ఎవరికీ తెలియదు కానీ ఉత్తరాన ఏమున్నదంటే హిమాలయ పర్వతాలు ఉన్నాయి హిమాలయ పర్వతాలు ఉత్తుంగ శృంగాలంటారు ఆకాశాన్ని మనుచరిత్రలో మన అలసాని పెద్దన అటధనికాంచ భూమిసురుడంబర చుంబి శిరఃసరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దహంగ తరంగ మృదంగ నిస్వరస్పుట నటునానుకూల పరిపుల్ల కళాపకలాపి జాలము కటకచరత్కరేణు కరకంపిత శాలము శీతశైలమున్ అంటాడు అటువంటి మహోత్తుంగమైనటువంటి ఉత్తరాభిముఖంగా వెళ్ళినట్లయితే అక్కడ నుంచి వచ్చేటువంటి మలయ పవనాలు చల్లని గాలులన్నీ కూడా అధ్యాత్మ భావనలను మోసుకొని వస్తాయి ఎందుకని అక్కడ మూడు వందల ఏళ్ళు ఐదు వందల ఏళ్ళు వెయ్యేళ్ళు ఉన్నటువంటి తపస్సులంతా కూడా ఇంకా సూక్ష్మ శరీరంలోనే ఉన్నారు కనుక ఇది సత్యం కాబట్టి ఉత్తరాభిముఖులై వెళ్ళాలి కాబట్టి ఇంట్లో కూడా ఉత్తర ముఖం చాలా ఉత్తమ ముఖం జ్ఞానం కావాలి అన్న వాడికి అది కుబేర స్థానం కూడా అంటే పటం ఇప్పుడు మారుస్తాం కదా అదే జ్ఞానం వస్తుంది అంటే వద్దులెండి తూర్పు బానే ఉంది బానే నడుస్తోంది ఒట్టి జ్ఞానం ఎవరికీ కావాలి కాదు డబ్బులు కూడా కావాలంటే అది కూడా వస్తుంది అంటే ఉత్తరం ఉత్తరాన్ని మించింది లేదు కాబట్టి అందరూ ఉత్తర ముఖానికి వెళ్ళాలి మనం కూడా అంత నిర్మలోద్యోగంగా వెళ్ళాట్ట నిర్మలమైన ఉద్యోగం ఏమిటంటే ప్రస్థానం ప్రయాణం అధ్యాత్మ ప్రయాణం అంటే మరణించడం కాదు మన లోపలికి మనం ప్రయాణం చేయటం ప్రస్థానం అది దాని అర్థం ధర్మరాజు కూడా ఇవన్నీ ఎప్పుడైతే రాజ్యభారం వదిలిపోయిందో ఎవరూ లేరో ఉన్నారు ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు వీడు తల్లి తప్ప ఎవరు లేరో ఆయనకు మనసు ఆయిగా ఉంది కట్ట దింపాడు ఆయన దింపి నడుస్తూ వెళ్తున్నాడు ఆయనతో పాటు ఆతని తమ్ములు అనిల పుత్రాదులు కలిరాక చే పాపకర్మలగుచు చరియించు ప్రజల సంచారంబు నిక్షించి అఖిల ధర్మంబున నాచరించి వైకుంఠ చరణాబ్జ వర్తిత హృదయులై తద్భక్తి నిర్వలత్వము జెంది విషయ యుక్తులకు ప్రవేశింప గారాక నిర్ధూత కల్మష నిపుణ మతులు బహుళ విజ్ఞాన దావాగ్ని భసిత కర్ములైన ఏకాంతులకు లక్ష్యమై వెలుగు ముఖ్య నారాయణ స్థానమునకు చనిరి నరనారాయణ గుహలు అని అన్నామే అవి అక్కడ ఉన్నాయి దాని నారాయణాక్షంగా ఉన్నటువంటి ఒక గుహ వైపు ధర్మరాజు తర్వాత అర్జునుడు భీముడు నకుల సహదేవులు కూడా కలియుగ ప్రభావం చేత ఇక మన మాట చెల్లేది లేదు మనం ఇక్కడ చేసే పని లేదు కృష్ణుడు లేడు కుంతి లేదు మన అన్నగారు కూడా బయలుదేరారు మనం కూడా బయలుదేరుదామని అందరూ కూడా ఒకరి వెంట ఒకరు బయలుదేరారు పాండవ కృష్ణుల యానము పాండురమతి ఎవ్వడైన పలికిన విన్నన్ ఖండిత భవుడై హరిదాసుండై కైవల్యము సచ్చు నరేంద్ర నరేంద్రుడు ఎవరంటే నిజాన్ని పరీక్షిత్తుకి చెప్తున్న కథ మొట్ట మొదటి రోజే చెప్పాం ఇక్కడిదాకా జరిగిందంతా అచ్చ ఇంగ్లీషులో flashback అన్నాం కదా పరీక్షిత్ మహారాజుకి కథ చెప్పబడుతున్నది గనుక చెప్తున్న వాడు అంటున్నాడు పాండవులు కృష్ణుడు ఎట్లా ప్రపంచం నుంచి బయటకు వెళ్లారో ఇప్పటిదాకా జరిగినటువంటి కథ అన్నవారికి విన్నవారికి ఏం జరుగుతుంది అంటే ఖండిత భవుడై జన్మల వల్ల ఏర్పడినటువంటి లేదా జన్మల వలన ఏర్పడినటువంటి ప్రారబ్ధాలు మూడున్నాయి ఆగామి సంచిత ప్రారబ్ధ మూడు కర్మలు ఆగామి సంచిత ప్రారబ్ధంబులధిగమింప బోధించ నిగమాగమనుతుండు నిత్య నిరంజనుండు సాయి ప్రగల్భములు లేని సత్య జీవనము గడుపనిత్యానుగ్రహం అనుగ్రహింప వచ్చినాడు ప్రేమమూర్తి శ్రీ సత్య సాయి అన్నారు. అంటే ప్రగల్భం లేని జీవితం గడపాలి దానికి వెళ్లారు. కథ విన్నటువంటి వాళ్ళకి జన్మ రాహిత్యం కలుగుతుంది, కైవల్య పదం కూడా కచ్చితంగా దొరుకుతుంది నరేంద్ర అని చెప్తున్నాడు. అంటే కలి ప్రభావం చేత చూడండి నాలుగు గోడలు దాటి మెట్లు దిగి అట్లా బయటకు వెళ్లగానే ప్రపంచం ఎలా ఉందో మనకు తెలుసు కదా. ప్రపంచం అంతా వదిలిపెట్టి ఒక్క గంట సేపు నాలుగు మెట్లు ఎక్కి ఇక్కడికి వస్తే ఇది పరమ భావతోత్తమైనటువంటి వాతావరణంలో స్వామి సర్వాధ్యక్షులుగా ఉండగా స్వామి సన్నిధానంలో ఆయనకు తెలిసిన విషయాలనే మనకు తెలిసినట్లుగా మనం చెప్పుకుంటున్నాం. ఇది ఉత్తమోత్తమైనటువంటి యోగ సాధన. కాబట్టి జీవుడు ఏం కోరుకోవాలి అంటే ప్రపంచంలో ఉండి గెలవాలి, ప్రపంచాన్ని గెలవాలి, ప్రపంచ విజేత కావాలి అని కాదు. మనలో ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం జయించాలి, నిజ ప్రపంచాన్ని మనం కైవసం చేసుకోవాలి. నిజ ప్రపంచం ఏమిటంటే హృదయ స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క దర్శనాన్ని తేజోస్వరూపంగా చూడాలి. తేజోస్వరూపం కాకుండా దర్శనాలు ఏర్పడతాయి, కనపడతారు. కనపడ్డటువంటివన్నీ కూడా మళ్ళీ కూడా తెల్లవారగానే ఎట్లాగైతే మంచు సూర్యుడు రాగానే కరిగిపోతుందో, నెమ్మది నెమ్మదిగా ప్రాకృతంగా ఎండ ఎగబాకుతున్నటువంటి వేళ స్వప్నాలన్నీ కూడా ఎలా కరిగిపోతాయో అలాగే పోతాయి. కానీ నిజమైనటువంటి హృదయ స్థానంలో ఒక ఆత్మను గనక దర్శనం చేసుకోగలిగితే, యదృశ్యం తన్నశ్యం. ఏది దృశ్యంగా ఉన్నదో అది నశిస్తూ ఉన్నది, ఏది నశింపబడవలసి ఉన్నదో అది దృశ్యంగా కనిపిస్తున్నది. రెండింటిని చక్కగా అవగాహన చేసుకున్నట్లయితే ఇది అధ్యాత్మన వినీతం. ఎందుకని? ప్రాపంచికంగా మనమందరం అందరం కూడా different angles లో ఇక్కడికి వచ్చాం. మన backgrounds different, మన సంస్కారాలు different, మన జన్మలు different, మనం సాగించిన జన్మలలో మనం చేసుకున్నటువంటి తపోధికాలన్నీ కూడా different. అన్నీ భిన్న భిన్నమైనటువంటివి. కానీ అన్నింటినీ కూడా ఒక సమన్వయమైనటువంటి స్థాయికి తీసుకొని రావాలి అంటే ఇటువంటి విచారధార అవసరం గనుకనే విచారధార ధర్మరాజుకి విదురుడు అవసరమైన వేళ వచ్చి బోధించాడు. అది గొప్ప విషయం. విదురుడు ఇటువంటి జ్ఞానాన్ని కౌరవులందరూ ఉండగా బోధించలే, ఒరికే చెప్పాడు వాళ్ళని జాగ్రత్త పెట్టుకో, వాళ్ళు అల్లరి చేయకుండా చూడు, అందరినీ హింసిస్తున్నారు కాస్త బుద్ధి చెప్పు, అవి చెప్పాడు తప్ప ఉత్తరాభిముఖుడుగా వెళ్ళు, హిమాలయ పర్వతానికి వెళ్ళు ఇవి చెప్పలే. ధృ ధృతరాష్ట్రుడికి, గాంధారికి ఏది సమయాన అక్కరకు వస్తుందో అక్కర మాట చెప్పాడు గనుక అక్కరకు వచ్చే మాట చెప్పేవాడే ఆత్మ గురువు. ఆత్మ గురువు పేరే కారణ గురువు. గురువులు అనేక రకాలుగా ఉన్నారు మనకు తెలుసు. బోధ గురువులని, లోక గురువులని, శోక గురువులని, వాచక గురువులని, నిషిద్ధ గురువులని, మోచక గురువులని అనేక రకాలు. అందులో కారణ గురువు ఉత్తమోత్తముడైనటువంటి వాడు. నువ్వు ఎందుకు వచ్చావో చెప్పి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పి, అక్కడికి ఎలా చేరుకోవాలో చెప్పి, చేరటానికి తాను ఎంత సాయపడబోతున్నాడో చెప్పి మానవుణ్ణి మానసికంగా సన్నద్ధం చేసేటువంటి వాడు పరమాత్మ సమానుడు గనుక ఈశ్వరో గురురాత్మేతి మూర్తుత్రయ విభాగినే. ఈశ్వరుడే గురువు. ఈశ్వరుడు, గురువు అంటే ఆత్మ. ఆత్మ, ఈశ్వరుడు, గురువు మూడు స్థితులు తప్ప ముగ్గురు కారు. ఒక ఈశ్వరుడు ఒక పార్శ్వం, ఆత్మ ఒక పార్శ్వం రెండూ కలబోసుకున్నట్లయితే గురు స్వరూపంగా వస్తాడు గనుక ప్రపంచంలో గురో గురువును మించినటువంటి అధికుడు మరొకడు లేడని, గురువు చెప్పిన మాట కంటే మరొక గొప్ప వేదం లేదని, గురువు నడిచినటువంటి బాట కంటే అత్యుత్తమమైన ఆధ్యాత్మిక మార్గము లేదని, అసలు గురువు కంటే గొప్పదైన, పెద్దదైన, అన్యమైన, అక్షమైన, స్వచ్ఛమైన, నిత్యమైన, సత్యమైన వస్తువు లేదని సప్రమాణికంగా భాగవతం మనకి ఇక్కడ బోధిస్తున్నది. అటువంటి గురు స్వరూపంగా విదురుడు వచ్చి తన కంటే పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుడికి మార్గ నిర్దేశనం చేశాడు. అలాగే ప్రపంచం యొక్క లోకరీతులు చెప్పాడు ధర్మరాజుకి. నువ్వు రాజువైనప్పటికీ నీ రాజ్యం అంతా ఇలా సాగబోతున్నది, ఇటువంటి వారిని నువ్వు పాలించబోతున్నావు, రాబోతున్నది కలియుగమే అని సూచిప్రాయంగా చెప్పాడు. ఎప్పుడైతే ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క యోగం నుంచి వియోగాన్ని పొందాడో, దూరమైనాడో ఎంత మనం ధర్మాన్ని ప్రతిపాదిద్దామన్నా, ఎంత ధర్మాన్ని మనం ఆచరిద్దామన్నా పరమాత్మ గురువు గనక లేకపోయినట్లయితే జీవుడు తన శక్తితో, స్వయం శక్తితో అధ్యాత్మ సా సాధన చేసుకోలేడు గనుక గురువు నిత్య జీవితంలో ప్రధానంగా ముఖేముఖి, గురువు స్వయంగా మనతో ఉండాలి. అందుకనే దత్త గురువులు దత్త గురువులంతా కూడా ఉండి సారోక్య, సామీప్య, సాన్నిధ్యాలు ఇస్తారు. సాహిత్యానికి మార్గం చెప్తారు, సాహిత్యం వాళ్ళు ఇవ్వరు. ఇవ్వగలిగినా వాళ్ళు ఇవ్వరు. ఎవరు తెచ్చుకోవాలి అంటే మనమే తెచ్చుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం. ఇదిగో నువ్వు మార్గంలో వెళ్ళు, నీకీ లాభం కలుగుతుంది. మార్గంలో వెళ్ళు వైకుంఠపురం అనే మోక్ష సామ్రాజ్యంలోకి నువ్వు వెళ్ళగలుగుతావు. మోక్ష సామ్రాజ్యం పైనా లేదు, కిందా లేదు, అటుపక్కలా ఇటుపక్కలా లేదు ఉన్నదంతా లోపలే ఉన్నది. లోపల ఉన్నదనేటువంటి ఒక ఆత్మవిద్యా బీజాన్ని విదుర మహాదేవుడు లోపల నిక్షిప్తం చేసిన కారణంగా, అనేకమైనటువంటి తపస్సుల కారణంగా, వాళ్ళు ఇచ్చిన పని కూడా అయిపోయిన కారణంగా ధర్మరాజు వెంటనే పరిక్షిత్ మహారాజుకి పట్టాభిషేకం చేశాడు. సరే ఇక్కడ విచారణనవనీత విచారణ ఏమిటి అంటే ఇది కథ. కథలో మనలోనే ధర్మరాజు, మనలోనే అర్జునుడు, మనలోనే విదురుడు, మనలోనే కృష్ణుడు ఉన్నాడు కదా! లేకుండా లేడు. ఉండి ఉండకపోతే ఇది మనకు అర్థం అయ్యేది కాదు. వీళ్ళు ఒక్కొక్కళ్ళే ఉన్నారంటే ఏమో! అందరూ ఉన్నారేమో! కాబట్టి అందరూ ఉన్నారు అనుకున్నట్లయితే మనం కూడా పరీక్షిన్మహారాజు-- చిన్న పిల్లలున్నారు పరీక్షిన్మహారాజు తల్లి గర్భంలో దర్శనాన్ని తాను పొందాడో, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక మళ్ళీ అటువంటి దర్శనం దొరుకుతుందా అని ఎదురు చూశాడు. ఎంత గొప్ప విషయం! ఏదో ఒకసారి చూశానులే పుటపట్టి చాలామంది కలుస్తుంటారు. స్వామి దగ్గరికి-- స్వామిని చూసి ఎన్నాళ్ళయ్యింది అని ఊరికే అడగండి. Nearly twenty years అయిందండీ. Twenty years ఆ? ఆశ్చర్యపోతాం మనం. అసలు చూడకుండా ఇరవై ఏళ్ళు వీడు ఎలా బతకగలిగాడు అని. కానీ వాడికి ప్రాప్తి అంతే. ఇరవై ఏళ్ళు పట్టిందన్నమాట మళ్ళీ వాడికి, మళ్ళీ చూట్టానికి. కానీ పరీక్షిన్మహారాజు వెలువెంటనే వెతుక్కున్నాడు. మళ్ళీ దర్శనం అయితే బాగుండును అని. దొరకలే. ఒక్కసారే దొరుకుతుంది అది. దొరికినా ఒక్కసారి పట్టుకోగలగాలి. పట్టుకునేటువంటి శక్తిని ఇవ్వమని పరమాత్ముణ్ణి అడగాలి. రెండవది, బాల్య అవస్థని దాటి కౌమార యవ్వనాలు శరీరంలో ప్రవేశించినప్పుడు నిజానికి ఇటువంటి గాథలు వినాలి. ఇది డెభై ఐదో ఏటో, ఎనభైయో ఏటో వింటే ప్రయోజనం లేదని కాదు. కాస్త స్వల్ప ప్రయోజనం ఉంటుంది, కాస్త ఉంటుంది. చిన్నతనంలోనే గనక ఇవన్నీ తెలుసుకున్నట్లయితే వయస్సు మనకు ఎనభై ఏళ్ళు వచ్చేసరికి జీవితం స్పష్టంగా తెరమీద బొమ్మలాగా కనిపిస్తుంది. రెండోది, జీవితం మనకు ఏమిస్తుంది, ఇంకా ఏమివ్వబోవటం లేదు తెలిసిపోతుంది. మనకి past గాని future లేదు అని తెలిసిపోతుంది. అంతే కదా. వంద చీటీలు రాసిచ్చాడు అనుకుందాం, అందులో ఉన్నవన్నీ అంటే ఏమో! అసలు ఇంకెంతో తెలియదు గాని చూస్తున్న దాన్ని బట్టి చాలా వరకు అయ్యే పోయింది అనిపిస్తుంది. అయిపోయింది ఎక్కువ, మిగిలింది తక్కువ. ఏం చేద్దాం ఇప్పుడు అని. అయిపోయింది వెనక్కి తేలేం. కాలగర్భంలో చెల్లిపోయింది. ఇవాళ, ఈరోజో, సాయంకాలమే మనం మెట్లు ఎక్కేటప్పుడే అది కాలగర్భంలో కలిసే పోయింది. మనకేం సంబంధం ఉంది? ఏం లేదు. మళ్ళీ అది తిరిగి రాదు. కాబట్టి గతించిన కాలాన్ని అన్నివేళలా మనిషి జాగ్రత్తగా గమనించుకుంటూ ఒక పూర్ణమైనటువంటి స్థితిలో నిశ్చలంగా ఉండాలి. దానికి అధ్యాత్మలో పాత్రలు బాల భారతం, బా-బాల భాగవతం అవి చదవటానికి వీల్లేదు. ఇంట్లో పెద్దవాళ్ళుంటారు. ఒక తెలుగు వాడికి, ఆంధ్రుడికి ఒక అదృష్టం ఏంటంటే ప్రపంచ వాఙ్మయంలో లేనటువంటి పద్యం ఇవ్వబడింది. ఇది ఎక్కడా లేదు, భాషలోనూ లేదు. ప్రపంచం మొత్తం మీద ఒక్క తెలుగువాడికే ఉంది. పోనివ్వండి వాడికి హాయిగా ప్రోస్ ఉంది కదా అంటే కుదరదు. ప్రోస్ చదువుకున్నంత సేపు బానే ఉంటుంది. పోయమ్ చదువుకున్నప్పుడు దానిని ధారణ చేసినప్పుడు అంటే బట్టీ పట్టుకుని దగ్గర పెట్టుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటి తంత్రులన్నీ కూడా ఎప్పుడూ activate అయి ఉంటాయి. ధారణాశక్తి వలన ముసలితనం తగ్గుతుంది. వయస్సు ఉంటుంది. వయస్సు వేరు, ముసలితనం వేరు. తొంబై ఏళ్ళవాడు కూడా నవ యవ్వనుడల్లే నడిచి వెళ్తూ ఉండొచ్చు. నవ యవ్వనము అంటే ఉత్సాహి అని. కాబట్టి ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధారణాశక్తి వల్ల వస్తుంది. ధారణాశక్తి ఎ-ఎక్కడి నుంచి వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి ఉన్న training వల్ల. అతనికి కూడా జీవితంలో మనకు ఏర్పడినట్టే కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు, సంయోగాలు, వియోగాలు అన్నీ ఏర్పడి ఉంటాయి. కానీ అతను దానిని ఎదుర్కొనేటువంటి తీరు వేరు, background లేని వాడు ఎదుర్కొనే తీరు వేరు. background లేని వాడు ఏం చేస్తాడంటే కంగారు పడిపోతాడు, ఆందోళన పడిపోతాడు, మనస్తత్వ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్తాడు అంటే psychiatrist. ఏంటో మొన్నటిదాకా బానే ఉన్నానండి అంటే అప్పుడు అసలు వాడు ప్రశ్నలు వేస్తాడు. ఏం పోగొట్టుకున్నామో తెలుసుకుని దాన్ని బట్టి వైద్యం చేస్తాడు. ఏం పోగొట్టుకున్నామో వాడి దగ్గరికి వెళ్ళకుండా తెలుసుకోవాలంటే భాగవతం చదువుకోవాలి. భాగవతంలో ప్రధానంగా ఒక పద్యం మనం భాగవతం అయ్యేలోగా చిట్టచివరి రోజు, అది ఎప్పుడొచ్చినా సరే కనీసం ప్రతి వ్యక్తి తొమ్మిది పద్యాలు ధారణ చేసి చెప్పగలగాలి. వారి వారి ఇష్టం. ఎవరికి ఇష్టమైతే అది. అందులో అవధాని గారికి first prize. [నవ్వు] తొమ్మిది ఇప్పుడే చదువుతాడు ఆయన. [నవ్వు] అది కాదు. ధారణ ఏంటంటే ఒకటి కర్మ, భక్తి, జ్ఞాన అలాగే జీవన విధానం, లోకరీతి స్వామి చెప్పిన మూడు ఉన్నాయి. సంఘ నీతి ఉండాలి, పాపభీతి ఉండాలి, దైవ ప్రీతి ఉండాలి. మూడు గనక మనం చక్కగా పాటించగలిగితే మనకంటే సుఖి మరొకడు లేడు ప్రపంచంలో. మనకి రాత్రిపూట ఎందుకు నిద్ర పట్టలేదంటే మూడింట్లలో ఎక్కడో పొరపాటు చేశామన్నమాట. సంఘం పట్లన్నా పొరపాటు చేశాం లేదా ఏదో పాపమన్నా చేశాం. పాపం అంటే పొరపాటు. తెలిసో, తెలియకో. దైవాన్ని ఎక్కడో విస్మరించాం. కాసేపు మనకన్నీ తెలుసు అని అనుకున్నామనుకోండి, నిద్ర పడుతుందా? ఆయనకన్నీ తెలుసు అనుకుంటే ముందు మనం హాయిగా నిద్రపోతాం. కాబట్టి ఇవన్నీ కూడా నైతిక విద్యలో ఉన్నటువంటి భాగాలు కాబట్టి తత్వాన్ని, నవనీతాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఇందాకటి నుంచి చెప్పుకున్నదంతా కథ. కథనమంతా ఎవరిదో, పాత్రలు ఎవరెవరో కానీ వారందరూ మనలో ఏదో జీవితంలో ఏదో క్షణంలో తొంగిచూస్తూనే ఉంటారు. తొంగిచూస్తున్నటువంటి వేళ మనల్ని మనం గనక జాగ్రత్తగా ఇవన్నీ నెమరువేసుకుంటూ విచారణ చేసుకొని పరమాత్మ యొక్క భావనలో గనక నిలకడ చెందగలిగి ఉన్నట్లయితే అది నిజమైనటువంటి spirituality. spirituality నిత్య జీవితానికి అంటే భిన్నమైనది కాదు. అధ్యాత్మ అంటే మరణానంతర సుఖం కాదు. మరణించాక ఏముంది ఇక్కడ? ఏం లేదు.ఇక్కడ అసలు ఏమీ ఉండదు దాని గురించి మనం పెద్దగా పట్టించుకోనక్కర్ల అసలు ఏది ఉన్నా ఇదిగో జాగ్రదవస్థలో బ్రతికున్నప్పుడే ఉన్నది గనుక పరమాత్మని, పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ యొక్క గుణాన్ని, పరమాత్మ విశేషణాలని, పరమాత్మ యొక్క గాథలని, కథలని, ఆయన యొక్క దివ్య మహిమలని అన్నింటినీ కూడా పునః పునః ప్రతిరోజూ అనుకుంటూ ఉన్నట్లయితే మన లోపల ఉండేటువంటి అనేకానేకమైనటువంటి మాలిన్యాలు ప్రధానంగా కలియుగ ప్రభావం చేత మనల్ని ఎంతకూ విడనాడనటువంటి కామ క్రోధాదులన్నీ కూడా నెమ్మదిగా నెమ్మదిస్తాయి అంత తొందరగా పోవు అవి. నెమ్మదిస్తాయి ముందు తర్వాత నియంత్రించబడతాయి control అవుతాయి తర్వాత అందుకే స్వామి చెప్పారే. స్వామి mind ని జయించటం ఎట్లా? అని అడిగితే mind ని mild చెయ్ ముందు mild చేసినటువంటి mind ని mend చెయ్ mend చేసిన mind ని bend చెయ్ bend చేసిన mind ని end చెయ్ అన్నారు. ఎంత బాగా చెప్పారో! స్వామి seventh class మనం board లో చదువుకున్నాం కానీ ఏం మనకు తెలియవు అది. ఇట్టివి ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ ఏంటి శుద్ధ చైతన్యంలో నుంచి మాటలు వస్తాయి. పరమాత్మ మాట్లాడితే అట్లా ఉంటుంది. పరమాత్మ బోధ కూడా అట్లాగే ఉంటుంది ఎక్కువ చెప్పరు ఎక్కువ వివరాలు ఉండవు. అంశం ఒక్కటే మనం పట్టుకోగలిగినటువంటి నేర్పరితనం ఉండాలి. ఆహా మా స్వామి ఎంత బాగా చెప్పారు అని చప్పట్లు కొట్టటం కంటే ఏం చెప్పారు చక్కగా ధ్యాన ముద్రాంకితమై మనస్సుని ఆయత్తం చేసి చెప్పాడుగా. మనీష్ ఆయత్తం చేయమన్నాడు. జ్ఞానాధిక్యమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే అక్కడ మనకు అనేక భావాలు మనకు సంస్కారాలు ఉన్నాయి మనకేం లేకుండా రాలే. సంస్కారాలున్నాయి, జీవ సంస్కారాలున్నాయి, జన్మగతమున్నాయి కాళిదాసు అన్నట్లుగా "జననాంతర సుహృద" అని అంటాడు. అసలు మాత్రం ఒక గంట సేపు కూర్చున్నామంటే ఎప్పుడో జన్మలోనో కాస్త పుణ్యం చేసుకున్నామన్నమాట అంటాడాయన. లేకపోతే ఎవరు కూర్చుంటారు ఎవరికి కావాలి దీని వల్ల ఏం రూపాయి రాదు. వస్తుందా? ఏం రాదు. రూపాయి రాదు గాని అది దానికంటే కొన్ని కోట్ల రెట్లు అయినటువంటి ఒక జ్ఞానం మాత్రం మనకు లభిస్తుంది. దానివలన మనస్సు ఒక ప్రశాంతతని, ఒక ప్రసన్నతని, మనకి పరస్పరం ఉండేటువంటి relations అన్నీ కూడా ఒక మర్యాదపూర్వకమైనటువంటి ఒక respect తో కూడినటువంటి ఒక గాంభీర్యంతో ఒక ప్రేమతో కూడినటువంటి ఒక బాంధవ్యం మనకు ఏర్పడుతుంది గనుక సత్సాంగత్యం వలన అనేకమైనటువంటి లాభాలున్నాయి. పాత్రలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేదాకా ఇంకా పరీక్షిత్ మహారాజు ఎలా అడుగుతాడో పరతత్వాన్ని గురించి మనం విచారణ చేస్తాం. కాబట్టి భాగవత నవనీతంలో ఇవాళ మనం మోసుకు వెళ్ళవలసినటువంటి ఒక వెన్న ఏది అంటే బాలుడు అతి చిన్నప్పుడే పరమాత్మ యందు మనస్సును లగ్నం చేయాలి. స్వామి ఊరికే బాల వికాస్ పెట్టారా? బాల వికాస్ ఊరికే దానికి కాలక్షేపానికి పెట్టారా? పెట్టలే. బాల వికాస్ ఎందుకు పెట్టారంటే బాలుడుగా వాడు వికసించినట్లయితే ఒక ఎనిమిదేళ్ళ పిల్లవాడు గనుక మార్గంలోకి వస్తే వాడికి ఎనభైయో ఏడు రావటం అంటే డెబ్బై రెండు సంవత్సరాల సుదీర్ఘమైన అధ్యాత్మ స్థాయి వాడికి ఏర్పడుతుంది. ఇది ఒకటి. ఇక రెండవది మానసికమైనటువంటి ఒక పరిణితి ఏర్పడుతుంది. ఇక మూడవది బుద్ధి కుశలత ఏర్పడుతుంది. నాలుగవది జ్ఞానాధిక్యం ఏర్పడుతుంది. ఐదవది వ్యర్థమైనటువంటి ప్రసంగాలతో, వ్యర్థ వాదాలతో, అక్కరలేని ఆలోచనలతో ఉన్న చిన్న మనస్సుని కూడా అతలాకుతలం చేసుకునే కంటే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి కించిత్ మనస్సుని పూర్ణమయమైనటువంటి పరమేశ్వర భావనామయం గనుక చేసుకున్నట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు అన్నివేళలా లభిస్తుంది. అది అందుకునేది కాదు, అది ఆయన ఇచ్చేది కాదు. భగవాన్ రమణ మహర్షిని మాట అడిగారు. భగవాన్ మీ అనుగ్రహం కావాలి అని. అది ఎవన్నా లడ్డూనా ఇవ్వటానికి అన్నారు. అది ఎప్పుడూ అక్కడే ఉంది అర్హత సంపాదించుకుంటే తీసుకుని వెళ్ళవచ్చును అన్నారు. స్వామి ఇదే context లో సత్య సాయి ఈశ్వరుడిని కూడా ఇదే మాట అడిగారు. We want your grace అని అడిగితే ఆయన అన్నారు "Deserve first, desire next" అన్నారు. simple two words deserve first అర్హత సంపాదించుకోవాలి. అర్హతకి పూర్వరంగమే విచారణ కాబట్టి మధ్య వయస్సులో సంసారం న-నట్టేట ఉన్నటువంటి నావ అది. గట్టును దాటి వచ్చింది మధ్యలో ఉంది. మొదటి గట్ట ఎంత దూరమో అంతే దూరంలో మలి గట్టు కూడా ఉంది. ఇక్కడ ఘర్షణలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గడచిపోయింది కనిపిస్తున్నది తీరం దాటవలసి ఉన్నది గాని దాటగలమో లేదో భయమేస్తుంది. చిన్నప్పుడు నీళ్ళల్లో ఈత గొట్టు అంటే భయం లేకుండా దూకేవాళ్ళం. ఇప్పుడు కాస్త ఈత గొట్టండి అంటే అమ్మో ముని-మునిగిపోతే ఇప్పుడేమవుతుంది అప్పుడు నష్టం గాని ఇప్పుడు నష్టం లేదు. అయినా ఇప్పుడే మనకు భయం కలుగుతుంది. భయము, బాధ, భీతి, ఒకారకమైన లాలస ఇవన్నీ కూడా వయస్సు ఇచ్చేటువంటి లక్షణాలు గనుక అధ్యాత్మ వయస్సు పరిపాకం చెందేటువంటి అంటే మధ్య వయస్సు అంటే సుమారు నలభై ఏళ్ళు అనుకుందాం. నలభై ఏడవ ఏటైనా అధ్యాత్మలో గనుక వాడు వస్తే మనకి ఎంత సేపు ఇంకా నలభై ఉంది అనుకోవాలి ఉందో లేదో తెలీదు. కనీసం మిగిలింది మిగిలినదన్నా మనం చక్కగా వాడుకోవటానికి అధ్యాత్మ ఉపకరిస్తుంది గనుక ధర్మరాజాదులంత వాళ్ళ అదృష్టం ఎన్ని కష్టాలున్నా ధర్మాన్ని ఆశ్రయించారు. ధర్మం చాటునే నిలబడ్డారు. పరమేశ్వరుడు ఉన్నంత కాలం అది ఆయన బలమనుకున్నారు, నమ్మారు. కనుకనే జయం పొందిన విర్రవీగలేదు. నిజానికి ధర్మరాజు మహాభారత సంగ్రామంలో గెలిచిన తర్వాత రాజ్యమేలేటువంటి వేళ కృష్ణున్ని అడిగాడు. ఏం చేస్తే నూరు నరకాలకు వెళ్ళేటువంటి పాపం నశిస్తుందో చెప్పమన్నాడు.కృష్ణుడు విలాసంగా నిన్న ఆయన పోతనామాత్యుడు అన్నాడే! విజయంచేరడి వెన్నెలవాడు అన్నాడు. వెన్నెలవాడు ఏమన్నాడంటే, మూడు అశ్వమేధ యాగాలు చేస్తే పోతుంది అన్నాడు. అసలే డబ్బు లేదు. ఏం చేయాలో చెప్పవా అని ఈయన్ని అడిగితే, మూడు అశ్వమేధాలు యా-- చేయమన్నాడు ఆయన. అంటే ఆయన మళ్ళీ రెండవ ప్రశ్న వేశాడు. "నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ డబ్బు ఎక్కడిది?" అన్నాడు. అంటే, "ఏమంటున్నావ్? మాత్రం తెలియదా? నీ చేతుల్లో ఎంతమంది రాజులు ఓడిపోయినారు మహాభారతం చేసి, యుద్ధంలో. వాళ్ళందరూ పోయినారు గానీ వాళ్ళ ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. సంపదలన్నీ భూమ్మీద వదిలిపెట్టారు అవి నీకో. నీ పరం అయిపోయినయి. నువ్వు దానికి కూడా రాజువే. కనుక సామ్రాజ్యంలో అక్కడ అక్కడ ఉన్నటువంటి సంపద అంతా తీసుకొచ్చి ప్రజా సంక్షేమం కోసం, విశ్వ కళ్యాణం కోసం, నీవు చక్కగా మూడు అశ్వమేధాలు చెయ్యి." అని చెప్పాడు. మూడు అశ్వమేధాలు చేసిన కారణంగానే పరీక్షిత్ మహారాజు ధర్మరాజ పరిపాలన చేశాడు. రామరాజ్య పరిపాలన రాముడు చేయలే, కుశుడు చేశాడు. రామాయణ కల్పవృక్షంలో విచారణ చేశాం మనం. రామ రావణ యుద్ధం అయిపోయిన తర్వాత అయోధ్యా నగరానికి వచ్చినటువంటి రాముడు సుమారు పదకొండు వేల సంవత్సరాలు పాలించాడు అని ఒక చరిత్ర. అది fiction కాదు, it's a history. కానీ పదకొండు వేల ఏళ్ళు ఎలా అంటే ధర్మం నడిపించింది. రాముడిలో ఉన్నటువంటి ధర్మం నడిపించింది. రాముడు రాజ్యాన్ని కుషుడికి అప్పజెప్పిన తర్వాత కుషుడు ఇక్ష్వాకు కులంలో ఉన్నటువంటి అప్పటిదాకా వచ్చిన అందరు రాజులు రాముడితో సహా కూడి ఉన్నటువంటి పూర్ణ ధర్మంగా నడిపించిన వాడు కుషుడు. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ మూడు అశ్వమేధ యాగాలు ధర్మరాజు చేత ఎందుకు చేయించాడు? అదే ధర్మరాజు కొద్ది రోజుల్లో హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోబోతున్నాడని ఆయనకి తెలియదా? వాడు రాజ్యం ఇంకా ఎక్కువ కాలం చేయడం తెలియదా? తెలిసి ఎందుకు చేశాడంటే, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. రాజ్యం బాగా లేదు అంటే రాజుదే దోషం తప్ప ప్రజది దోషం కాదు. ప్రజ ఎప్పుడూ కూడా ఒక నీతిని, ఒక చట్టాన్ని, ఒక ధర్మాన్ని ఎట్లా దీన్ని పాలిద్దామనే ప్రయత్నం చేస్తుంది. రాజు అన్నివేళలా ధర్మాన్ని ఎలా అతిక్రమించాలని మాత్రమే వాడి మనసు ఉంటుంది గనుక ధర్మాతిక్రమణం కాకుండా కొంత పుణ్యాన్ని మూడు అశ్వమేధయాగాల ద్వారా ధర్మరాజు ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పీ చెప్పక, మరీ వివరించక, గుహ్యంగా, గోప్యంగా ఉంచుతూ పరీక్షిత్ మహారాజుకి రాజ్యాన్ని అప్పజెప్పాడు. కనుకనే పరీక్షిత్ మహారాజు పుట్టినప్పుడు జాతకం వేసినప్పుడు అన్నారు, "పరమ భాగవతోత్తముడు వలె ఉంటాడు. ఇక్ష్వాకు వంశపు శ్రీరామచంద్రుడు వలె ఉంటాడు." అని ఇవన్నీ చెప్పారు వాళ్ళు. కనుకనే పరీక్షిత్ మహారాజు భాగవతోత్తముడు అయినాడు. భాగవత కథ, ఇదంతా అసలు ఎలా జరిగిందో చెప్పు, చెప్పు అని అడిగాడు గనుక నలభై ఏళ్ళు దాటుతున్నప్పుడైనా ఇవి విన్నట్లయితే జీవితాన్ని ఎక్కడికక్కడ మనం tune చేసుకోవటానికి, సరి చేసుకోవటానికి, తప్పు దారిన వెళ్ళకుండా ఉండటానికి ఉన్నత మార్గాన్ని, ఆర్ష మార్గాన్ని, భారతీయ ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని రకమైనటువంటి అలజడి లేకుండా, నిత్య జీవితంతో సంక్షోభం లేకుండా, సంఘర్షణ లేకుండా ఎందుకంటే ఆధునిక మానవుడికి అంతా ఘర్షణే. అన్ని ఘర్షణల కంటే తనతో తనకు ఘర్షణ ఎక్కువ. Kramer versus Kramer అని ఎప్పుడన్నా దొరికితే నవల చదవండి. చాలా గొప్ప నవల అది. తర్వాత సినిమా తీశారు. వీలైతే చూడండి, తప్పేం లేదు. అద్భుతమైనటువంటి చిన్న English సినిమా అది. అంటే మనతో మనం పడేటువంటి ఘర్షణ. ఎందుకు ఘర్షణ పడతామో, దాని వల్ల ప్రయోజనం ఏమిటో ఏమీ తెలియదు. ఒకటి, మరణము నిశ్చితం. అది రెండు సార్లు జరగదు. ఒక్కసారే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది మనకెందుకు? ఎప్పుడో జరుగుతుంది. జరిగినప్పుడు మనం ఆపగలమా? లేదు. పోనీ మనమందరం కలిసి ఆపగలరా? అసలు ఆపలేరు. అసలు ఎవ్వడూ ఆపేవాడు లేడు. జరిగేది ఒక్కసారి. దానిని గురించి చింతాక్రాంతుడు అయ్యేకంటే కన్నుమూసే లోగా అలవాటు ఉన్నా లేకపోయినా అలవాటు చేసుకొని పరమ భాగవతోత్తములుగా గనుక జీవించగలిగినట్లయితే అది మనకి అందించేటువంటి భాగవత తత్వ నవనీతం అది. అలాగే మహా వృద్ధుడైన వాడు ఉంటే ఆయనకి భాగవతం ఎలా ఉపయోగిస్తుందంటే, భీష్మ పరినిర్వాణం చూశాం. ధర్మరాజాదులది చూశాం. కుంతిది చూశాం. శ్రీకృష్ణుడు లేడు అన్న వార్త వినగానే కుంతి వెంటనే మరణించింది. ఒక్క second కూడా తేడా లేదట. నిజమేనా? భాగవతంలో వ్యాసులవారు కాస్త అతిశయోక్తిగా రాశారా? దానిని యధాతథంగా పోతనామాత్యుడు అలాగే చెప్పారా? అంటే, ఆంధ్రదేశంలో ఒక మహానుభావుడు స్వామి మొట్టమొదట వేదవిద్ధాన్ మహాసభ పెట్టినప్పుడు చర్ల గణపతి శాస్త్రి గారు అక్కడికి వచ్చారు. ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉంటే ఆయనకొక వార్త వచ్చింది. కొడుకు పోయినవాడు అని. సరే విమానం ఎక్కాడు. ఊళ్ళోనా ఎక్కడో దిగాడు. అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే fiction కాదు అని చెప్పటం కోసం చెప్తున్నా. భార్యకి చెప్పలే, ఆమె కూడా ఆయన లాగానే వృద్ధ. చెప్పలేదు, ఇద్దరూ కలిసి వచ్చారు. ఆయన మహా వేదపండితుడు, దార్శనికుడు, మామూలు వాడు కాదు. స్వామి చేత వేదపండు అనిపించుకున్న వాళ్ళలో ఆయన కూడా ఒకడు. ఒక గండికోట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు మాత్రమే కాదు, చర్ల వారిని కూడా స్వామి అలాగే అన్నారు. వెళ్లారు. వెళ్ళేప్పటికి ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉందో అలాగే దుఃఖ భూవిష్టంగా ఉంది. ఆయన వచ్చారు గంభీరంగా. పక్కనే భార్య ఉన్నది. చూసింది. కొడుకు పోయినాడు అని ఆవిడకి అర్థమైంది. మరుక్షణమే ఆమె మరణించింది. ఒక్క second కూడా పట్టలే. ఏకకాలంలో తన భార్యకి, తన కొడుక్కి దహనకాండ at a time నిర్వర్తించినటువంటి వాడు రకమైనటువంటి విషాదం లేకుండా, రకమైన వైరాగ్యం లేకుండా, నిర్మలమైనటువంటి ఒకానొక ధృడ చిత్తంతో, అందుకనే "చిత్తం మనీషా యత్తం" చెప్-- చేయండి అని చెప్పటం వేరు, సన్నివేశం ఏర్పడినప్పుడు అలా జీవించగలగటం వేరు. అలా జీవించగలిగిన వారు ఉన్నారా అంటే, ఇవాళ మరి స్వామి ప్రాతఃస్మరణీయుడు అయినటువంటి గణపతి శాస్త్రి గారిని గుర్తు చేశారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నారు. వైరాగ్యం ఒక అపజయంలో నుంచి వచ్చే వైరాగ్యం, వైరాగ్యం కాదు. మళ్ళీ కాస్త జయం కలగ్గానే వైరాగ్యం వైభోగం అయిపోతుంది. అలా కాకుండా, దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూఢి యున్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్ బలెనీ పదాబ్జములన్ శ్రీ కళహస్తీశ్వరా! ధూర్జటి విశ్వజనీనమైన మహా పరిసత్యాన్ని జగత్తుకి ఆవిష్కరించినట్లుగా అటు పోతన, అంతేకాదు స్వామి అనేక ఉపన్యాసాలలో, మళ్ళీ పునః చెప్తున్నాను. స్వామి అరవయ్యవ భర్తుడే వచ్చే వరకు ఉన్న సనాతన సారథులు చదవండి, చదవండి, చదవండి. ఎందుకంటే స్వామి చేసినటువంటి పూర్ణ బోధ అంతా అప్పుడున్నది. తర్వాత మనకోసం మనం, మనం ఎలా మర్యాదగా బతకాలో, ఎలా హాయిగా ఉండొచ్చో, ఎట్లా చక్కగా సౌఖ్యంగా ఉండొచ్చో అవి నేర్పారు మిగిలిన ఇరవై ఐదేళ్ళు. కానీ తన అరవయ్యవ ఏట వరకు కూడా ఇదిగో శ్రీకృష్ణ పరమాత్మ వలె, వేదవ్యాసుడు వలె, సర్వదేవతా అతీత స్వరూపం వలె తత్వాన్ని మాత్రమే స్వామి బోధించారు గనుక అటువంటి పరమాచార్యుడు సర్వదేవతా అతీత స్వరూపుడైనటువంటి పరమాత్మ సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు, వ్యాసదేవులకి, సహజ కవి పోతనామాత్యుడికి ప్రణామ సహస్రం సమర్పిస్తూ సాయిరాం.
SSSMC · audio

Bhagawata Navaneetham - 14

Home

Bhagawata Navaneetham - 14

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 32:15

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

    Now playing
  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67