No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలి స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పురతాం ని పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ శ్రీమద్భాగవతం అవరీతంలో రెండవ రోజు ప్రవేశించాం ఇది అనంత కథా సుధా సారం అనంత కథ ఎందుకంటే పరమాత్మ అనంతుడు గనుక నిన్న చెప్పుకొని రేపు ఆపేది కాదు పునః పునః కన్నుమూసే దాకా భాగవత కథ వింటూనే ఉండాలి ఎన్నెన్ని పురాణాలు చదివినా రాసినా ఎన్నెన్ని శాస్త్రాలు అధ్యయనం చేసిన చతుర్వేదాలు పుక్కిట పట్టినా ఉపనిషత్తులని అవుపోసనం చేసిన వ్యాసులంతటి వారికి చిత్తశాంతి కలగలే తృప్తి కలగలే నారదుల వంటి వారిని అడిగాడు నాకు తృప్తి ఎలా కలుగుతుంది అని మనకి తృప్తి ఎలా కలుగుతుంది జీవుడికి అంటే మానవ శరీరం తాల్చిన జీవుడికి తిన్నది పుష్టి పశువు దానికి కూడా తిన్నది పుష్టి అయినప్పటికీ కూడా పశుత్వంలో నుంచి పామరత్వంలో నుంచి పరమేశ్వర తత్వంలోకి వెళుతున్నటువంటి జీవుడు తిన్నది పుష్టి నుంచి ఉన్నది పుష్టి కి వచ్చాడు ఏదన్నా వస్తువు ఉంటే చాలు కడుపు నిండి నట్టుగా ఉన్నది అంటాడు పశువుకి ఉంటే చాలదు గడ్డిమాను పక్కన కట్టేసినా దాని నోట్లోకి పరక వెళితేనే దానికి లెక్క ఒకేసారి తినదు నెమరు వేసుకుంటుంది నెమరుగా అన్నివేళలా అలాగే భాగవత రసా కథా శ్రవణం కూడా మనలో కలిగేటువంటి అనేక మనోవికారాలకి మనోభావాలకి మనలో కలిగేటువంటి అలజడులకి ఆందోళనకి అసంతృప్తికి అన్నింటికీ ఇది దివ్య ఔషధం ఇది భాగవత కథ అనగానే భాగవతులైన భక్తుల కథలన్నీ గుదిగించినటువంటి ఒక కథా మాలికగా మనం అనుకుంటాం నిజానికి భగవంతుడు లేక భక్తుడు లేడు భక్తుడు లేక భగవంతుడు కూడా లేడు ఈ మాట అన్నది సాక్షాత్తు పరబ్రహ్మ తత్వమైనటువంటి స్వామి మీరు లేకుండా నేను లేను అలాగే నేను లేకపోతే మీరు కూడా లేరు అన్నారు ఇది నిజం ఎందుకంటే పరమాత్మ సాయికి మనకి ఎట్లాగైతే ఒక అభిన్న అద్వైత అద్వితీయ అద్వయ రమణీయ మనోజ్ఞమైనటువంటి ఒక హృదయ బంధం ఎట్లాగైతే ఉన్నదో అలాగే భాగవతంలో ఉన్నటువంటి అందరూ పరమ భాగవతోత్తములందరూ కూడా పరమాత్మ యందు మనస్సును లగ్నం చేసుకొని ఉన్నారు అందువలన వాళ్ళు భాగవతులైనారు ముక్తి మార్గంలోకి వెళ్ళటానికి ఉపాసనా మార్గాన్ని ఎన్నుకొని ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా పరమేశ్వరుడు మానవ దేహాన్ని ధరించి అవనీ సంచారం చేసి జాతికి ప్రబోధం చేసి సన్మార్గంలో ముముక్షు మార్గంలో ప్రవేశపెట్టి అందునా ప్రధానంగా కర్మలు చేస్తూనే భక్తితో కూడిన కర్మలు చేయటానికి ఉపాయనంగా ఈ భాగవతాన్ని మనకి ఒక రసాయనంగా ఇచ్చాడు పరమాత్మ నిన్నే చెప్పుకున్నాం వేద విఘడితమైనటువంటిది ఇది వేదము అనేటువంటి ఒక మహా కల్పవృక్షము యొక్క చిట్టచివరి కొమ్మ ఉపనిషత్ అయినట్లయితే ఆ ఉపనిషత్తు చివర పండినటువంటి ఒక పండు శుకుడు అనబడేటువంటి ఒక చిలుక వచ్చి కొరకగా ఆ నేల రాలినటువంటి ఆ పండు యొక్క పిబత భాగవతం రసమాలయం అన్నాడు పిబత అది రోజునే తాగుతూనే ఉంటారు ఎంత తాగినా ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఏమిటి అంటే కృష్ణ గాథ విష్ణు గాథ ఆయనతో కూడిన భాగవతుల గాథ కాబట్టి భగవంతుని గురించి విచారణ చేస్తూ ఉన్నప్పుడు భక్తుడి విచారణ కూడా జరుగుతుంది ఆ భక్తులలో మనం కావచ్చు మనం ఎదుర్కొన్న ఒక సమస్య కావచ్చు మనం తీర్చుకోలేని దాటలేని అవధులు లేని ఒక మహా దుఃఖం కావచ్చు దానిని అనుభవించినటువంటి వేళ లేదా అనుభవిస్తున్నటువంటి వేళ లేదా అనుభవించటానికి శక్తి చాలనటువంటి వేళ పరమాత్మ ఒక రూపాన్ని ధరించి పరమ దయాళువై కృపాళువై కరుణాసాగర మూర్తియై జగత్తు లోకి వచ్చి ఆ భక్తుడిని ఎలా రక్షించాడు అన్నదే భక్తి రసాయనమైనటువంటి భాగవతం ఈ భాగవతాన్ని వ్యాసుడు పద్దెనిమిది వేల శ్లోకాలలో జయ అనబడేటువంటి పేరుగా భారతానికి కూడా ఇదే ఉన్నది ఇది నిన్న రాని వారి కోసం చెప్తున్నా ఈ పద్దెనిమిది వేల శ్లోకాలను కూడా ఆంద్రీకరించాలి అని అన్నప్పుడు ఎవరు చేయాలి ఏమో ఎవరో ఉంటారు ఎవరు చెప్పాలి అంటే పరమేశ్వరుడు ఎవరు నిర్ణయిస్తే ఎవరికి ఆ యోగం ఇస్తే ఎవరికి ఆ శక్తిని ఇస్తే వాడి చేత తన వాణి పలికిస్తాడు గనుక కవిత్రయమైనటువంటి నన్నయ తిక్కన ఎర్రాప్రగడ వీళ్ళ ముగ్గురినీ దాటి పోతనామాత్యుడు బమ్మెరలో వచ్చే దాకా భాగవతం తెలుగువారి కోసం అట్లా కాచుకొని ఉన్నది ఆయన వచ్చిన తర్వాత భోగిని విలాసం అనేటువంటి భోగిని దండకం అనేటువంటి ఒక కావ్యాన్ని రాసి మన వ్యాసుల వారి వలనే ఇంతేనాఈ ప్రపంచాన్ని తెలిసి తెలుసుకొని ఏమి ప్రయోజనం? ప్రపంచాతీతమైనటువంటి పరమాత్మని ఎరుకలోకి అనుభవంలోకి తెచ్చుకోలేక పోయినట్లయితే మానవ జన్మ వృధా కదా అన్నటువంటి ఒక భావన కలిగినప్పుడు ధ్యాన ముద్రాంకితమైనటువంటి మనసుతో నిన్నటి వేళ అంటే ఇంకా పౌర్ణమి ఛాయలు ఉంటాయి తొలి మూడు రోజులు ఉంటాయి ఆ పౌర్ణమి ఛాయలలోనే మార్గ శీర్ష పౌర్ణమి నాడు కృష్ణ గాధని తలకెత్తుకున్నాడు ఎత్తుకున్నాడా? తట్టపై నెత్తిన పెట్టిన వాడు పరమాత్మ రామచంద్ర ప్రభువు. శైవోపాసన చేసి శైవ దర్శనం కోసం అంటే శివ దర్శనం కోసం ఒకానొక ఎదురు చూపు చూస్తున్నటువంటి వేళ శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా దర్శనమిచ్చి చక్కగా కృష్ణుడి గాధ రాయ్ అని చెప్పాడు. ఈ శ్రీకృష్ణ గాధ శ్రీరాముడి ఆదేశానుసారం సాగింది గనుక మొట్టమొదటే ఆరంభ వేళే పోతనామాత్యుడు సమర్పణతో శరణాగతితో ఒకానొక వినమ్రమైనటువంటి స్థాయిలో పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద నే రొండు గాధ పలుకగనేల అది ఇది చెప్పేకంటే ఆ రాముడి కథే ఆయన చెప్పినట్లు ఆ కృష్ణుడి కథే చక్కగా గనుక చెప్పినట్లయితే ఎంత బాగుండును అని విశేషం ఏమంటే జరిగిపోయినటువంటి త్రేతాయుగ రాముడి యొక్క కథని పోతనామాత్యుడు భాగవతంలో శ్రీ రామ చరిత్ర రాశాడు. ఆ ఆనందాన్ని, అతిశయాన్ని, రామదర్శనాన్ని ప్రజలకు అందించాలని తాను ఏ రీతిలో దానిని అనుభవించాడో చెప్పటానికని అమరేంద్రాశకు పూర్ణచంద్రుడు దితుండైనట్లు నారాయణాంశమున పుట్టే మదాంధ రావణ శిరః సంఘాత సంచేదన క్రమణోద్దాముడు రాముడా దరితకున్ కౌసల్యకున్ అంటూ ప్రారంభిస్తాడు శ్రీ రామ చరిత్ర అంటే ఆయన రాముని గురించి రాసిన ఒక ధ్రువోపాఖ్యానం చెప్పిన పోను పోను అంబరీషోపాఖ్యానం చెప్పిన మనకు బాగా పరిచయమైన రుక్మిణీ కల్యాణం గజేంద్రమోక్షం అవన్నీ వస్తాయి అవన్నీ స్కంధము అంటే శాఖ అని ఇది వేద వృక్షం భాగవతం కాబట్టి ఇది తొలి అధ్యాయంలో తొలి కాండలో తొలి స్కంధం మీద ఉన్నాం ఇంకా ఎక్కలే ఉరికే వృక్ష ఛాయల్లోకి వెళ్ళాం ఆ వృక్ష ఛాయే ఇంత అందంగా ఉంటే అసలు కొసకి ఎగబాకినట్లయితే లోలోతులకు వెళ్ల-వెళ్లగలిగినట్లయితే భాగవత రసమాలయాన్ని గనుక మన రసనాగ్రం మీద అంటే నాలుక మీద ఆడించుకోగలిగితే కర్ణామృతంగా కర్ణాటక సంగీతం కాదు అంటే అదేదో బెంగళూరు వాళ్ళది అని కర్ణాట సంగీతం కర్ణ చెవికి అట ఆనందం ఇచ్చేటువంటి సంగీతం కాబట్టి అది కర్ణాట సంగీతం కానీ మనం ఏం చేశామంటే కర్ణాటిక్ కర్ణాటక అని దానికేదో మనకు కావలసిన పేరు మనం పెట్టుకున్నాం కర్ణాట సంగీతం అది సంగీతం నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న హెచ్చరిక సరే పోతనామాత్యుడు ఏ రకంగానైతే చక్కగా ప్రతిరోజూ ఉపాసన చేసి అమ్మలయ్యన్నగమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ [మొబైల్ రింగ్ టోన్] ఆ మీకు వచ్చినా అయ్యే నేను నాకు వచ్చు [నవ్వు] ఆ సురారులమ్మ కడుపు అరడి పుచ్చెడియమ్మ తను లోనమ్మిన మనమ్ముల ఉండడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ కవిత్వ పటుత్వ అంటే మా యందు గౌరీ మా యందు లక్ష్మి మా యందు సరస్వతి ముగ్గురూ ఈ ముగ్గురికీ మూలమైనటువంటి గౌరీ దేవి అయిన ఓ పార్వతి మా యందు ఉన్నట్లయితే నిన్ను తలచుకున్నట్లయితే నీ కథా గానం చేయటానికి కావలసిన మూడు శక్తులు కూడా మాకు కైవసం అవు గాక అని చక్కగా చెప్తూ నిగమ కల్పతరోర్గళిత ఫలం శుకముఖాత్ అమృతద్రవసం యుతం పిగపిబభాగవత రసమాలయం ముహురహో రసికా భువి భావుకా రసికులైనవారు అంటే పరమాత్మ అనేటువంటి ఒక సద్వస్తువు యందు ఒక రాసిక్యము ఏర్పరచుకున్నవారు అలాగే మనస్సు వలన సంస్కారం వలన ఒక భావుక స్థితికి వెళ్ళినటువంటి వారు నిత్య నైమిత్తికమైనటువంటి జీవితాన్ని పరమ రమణీయంగా భాగవతోత్తమంగా జీవించటానికి ప్రయత్నించేవారు ప్రయత్నిస్తున్నవారు ప్రయత్నిద్దామని అనుకున్నవారు ప్రయత్నించి ఇంకా ఫలం పొందని వారు వీరందరి కోసమై శ్రీకృష్ణుడి యొక్క దివ్య అనుగ్రహం అంటే సత్య సాయి భగవానుడు అనబడేటువంటి సాయి కృష్ణుని యొక్క దివ్య అనుగ్రహం మనందరి యందు అనుగ్రహంగా ఒక వరదల ఒక వృష్టిల కురియు గాక అని ముందే మనం నిత్య ప్రార్థన స్వామికి చేసుకుంటూ వ్యాసుల వారి యొక్క స్థితిని మనం విచారణ చేద్దాం వాళ్ళకి కొన్ని విశేషాలున్నాయి ఎందుకని అంటే భాగవతాన్ని మనం మనమంతా కాస్త జీవితంలో పైకి వచ్చిన వాళ్ళం అంటే వయసురీత్యా అనుకుందాం మిగతావన్నీ పైకి వచ్చామో లేదో తెలీదు కనీసం వయసురీత్యా కనీసం వయసురీత్యా వచ్చాం కాబట్టి పట్టికన్నా తెలుసుకోకపోతే ఎట్లా అని ఏదో భగ కృష్ణుడు పుట్టాడు పరిగెత్తాడు వాళ్ళ అమ్మ కట్టేసింది విని విని చాలా ఏళ్ళు విన్నాం కదా అసలు ఆ తత్వంలోకి ఆ నవనీతాన్ని పట్టుకోవాలి చిలకాళి మధించాలి మధనం చేయాలి నిరంతరమైనటువంటి తత్వానుసంధానం చేయాలి తత్వానుసంధానంలో నుంచి మనస్సుని పరీపాకం చేసుకోవాలి దానిలో నుంచి కైవల్య నవనీతాన్ని మనం కొల్లగొట్టాలి మన కైవసం చేసుకోవాలి ఆ నవనీతాన్ని మనం చేత పట్టుకున్నప్పుడు శ్రీకృష్ణుడు వెన్న తిన్నాడు వెన్న తిన్నాడు అంటే వెన్న అరచేతి ఏం పట్టుకున్నాడు ఏమిటా వెన్నవేదమే వెన్న. ఆ వేదం ఎక్కడి నుంచి తెచ్చాడయ్యా అంటే, జీవనానుభవాలలో నుంచి, వ్రజ కాంతలలో నుంచి, గోప గోపికా కాంతలలో నుంచి, వాళ్ళ యొక్క జీవన సరళిలో నుంచి జరిగిపోయినటువంటి అనేక జన్మలు. నిన్న వ్యాసులవారే చెప్పారు. అసలు పోతనామాత్యుడు ఓ మాటన్నాడు. "అసలు ఈ భాగవతం ముట్టుకోవటానికి అర్హత ఎన్ని వేల జన్మలు ఎత్తాక నాకు కలిగిందో కదా" అన్నాడాయన. మనది కూడా అంతే. అయితే ఒక్కోసారి అనిపిస్తుంది మనం పెద్దగా అన్ని జన్మలు ఏం ఎత్తినట్లు అనిపించదు. ఎందుకంటే, త్యాగరాజ స్వామి చెప్పుకున్నాం. కొన్ని వందల కోట్ల రామ జపం చేస్తే ఒక లిప్త కాలంలో లక్షోవంతు ఆయనకి రామదర్శనం అయింది. అలాగే పోతనామాత్యుడికి కనిపించాడు, ఈయన ఏదో అడగబోయినాడు, ఆయన చెప్పవలసింది చెప్పి వెళ్లిపోయినాడు అనుకున్నాం. మరి మన సంగతి అట్లా కాదు. ఈ శరీరంలో ఉండగానే, ఈ యాభై ఏళ్ళు, అరవై ఏళ్ళు ఒంటిమీద పడగానే, పడకముందే సాక్షాత్తు నిఖిల దేవతల యొక్క నిక్కమైనటువంటి స్వరూపమైనటువంటి సత్య సాయి భగవానుని కొన్ని వందల సార్లు చూశాం మనం. అలాగే స్వామిని మనం తాకాం. స్వామితో మాట్లాడాం. స్వామి యొక్క దివ్య లీలలన్నీ కూడా అనుభవా అమృతంగా మనం కైవసం చేసుకున్నాం. మనం పరవశించిందాం కాబట్టి మన మనస్సు ఆయత్తమైనది, సిద్ధమైనది, శుద్ధమైనది, సంసిద్ధమైనది, పరిపూర్ణమైనది గనుక మనకి ఆ రామకథని, కృష్ణ కథని అందుకోవటంలో పెద్ద ప్రయత్నం చేయవలసిన పని లేదు. కాబట్టి, నిన్న చెప్పాడాయన, "అయ్యా అసలు భాగవతం అనేటువంటిది ఎలా పుట్టింది? భాగవత పురాణం ఎలా పుట్టిందో చెప్పు" అన్నాడు. భాగవత కావ్యం అనలేదు, భాగవత వేదం అనలేదు, భాగవత పురాణం అనేటువంటి మాట వాడాడు. పురాణము అంటే, పురా అంటే పాతది. ఎంత పాతది? చాలా పాతది. అమ్మలాగన్న అయ్యమ్మ ఎంత పెద్దది? చాలా పెద్దమ్మ. అట్లాగే పురాణమైనటువంటిది. జరిగిపోయిన కల్ప కల్పాంతములలో దాగినటువంటి అనేకమైనటువంటి జీవన రహస్యాలని, స్వారస్యాలని ఒక సాహితీ స్వరూపంగా, ఒక కవితా స్వరూపంగా, ఒక అక్షర స్వరూపంగా, ఒక వాఙ్మయ స్వరూపంగా, ఒక వాచక స్వరూపంగా చెప్పబడితే దాని పేరు పురాణం. అంతేగాని కాలక్షేపానికి పురాణానికి వెళ్ళానంటాం మన వాళ్ళు. కాలక్షేపానికి పురాణానికి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే కాలం ఎప్పుడూ నిక్షేపమే. కాలం మన యందు నిర్దయగా ఉంటుంది ఒక్కోసారి. ఆనందం ఇస్తుంది, దుఃఖం ఇస్తుంది. అది ఎట్లా ప్రవహిస్తే, ఎట్లా నడిపిస్తే, ఎట్లా పరిగెత్తిస్తే జీవుడు అట్లా పరిగెత్తి ఈ ఆనందాన్ని, దుఃఖాన్ని తన మనసు ద్వారా అనుభవిస్తాడు. భాగవత కథా శ్రవణం చేత, పఠణం చేత, గానం చేత, విచారణ చేత, రూప భావ తత్వ అర్థ స్థితుల యొక్క అనుగ్రహం చేత పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారాన్ని జీవుడు అంతరంగంలో తాను అనుభవించాలి. భాగవతం అంతా మనం చెప్పుకున్న తర్వాత ఏం కలగాలి అనంటే, భాగవతం బాగా చెప్పుకున్నామని కాదు, శ్రీ కృష్ణుడు మన కళ్ళల్లో, మన గుండెల్లో, మన హృదయంలో మర్యాద పురుషోత్తముడై మనకి తేజోమయంగా దర్శనం ఇవ్వాలి. అట్లా అయితేనే భాగవత తత్వ సుధ, ఈ నవనీతాన్ని మనం పొందినట్లుగా లెక్క. భాగవత పురాణం ఎలా ప్రారంభమైంది అంటే, ఎలా ప్రారంభమైంది వ్యాసుడు రాశాడు అయిపోయింది తర్వాత కథ అండి అనటానికి లేదట. శౌనకాది మునులు, నైమిశారణ్యం అని ఒకటుంది. ఈ పురాణానికి మూలం. అసలు అక్కడ పుట్టింది ఆలోచన. నైమిశారణ్యం అంటే, నేమి అంటే కాలచక్రం. కాలచక్రం అంటే ఏం లేదు, బండి చక్రం. బండి చక్రం అంటే, రెండెడ్ల బండ్లు తెలిసిన వాళ్ళు గనక ఉన్నట్లయితే, లేదా గుర్ర బండి తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్రతి బండి చక్రానికి కూడా బయట ఒక ఐరన్ రింగ్ ఉంటుంది. ఎందుకని? లోపల ఉన్నటువంటి చెక్కతో చేసిన ఏ వస్తువు ఇరుసు, హబ్బు విరగకుండా ఆ చుట్టూ ఉన్నటువంటి దాని పేరు నేమి అని అన్నారు. ఆ నేమి ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంటుంది. మనకేమనిపిస్తుంది అంటే, ఈ చక్రంలో ఉన్న ఆకులున్నయి, ఇవన్నీ తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది. నేమి తిరగకపోతే లోపల ఆకు కదలదు. ఈ కాలనేమి అనబడేటువంటి పరమాత్మ గనక నడిపించకపోతే జీవుడు నడవలేడు. కాబట్టి నైమిశారణ్యం అనే చోట ఇటువంటి మహాఋషులంతా కూడా వేవేల సంవత్సరాల తపస్సు చేశారు. ఎవరి గురించి? పరమాత్మను గురించి. ఏం చేసి ఉంటారు? ఇలాగే కూర్చొని పరమాత్మను గురించి విచారణ చేశారు. ఆ విచారణ ఎట్లా చేశారంటే, శ్రౌతయాగంగా చేయలే, సత్రయాగంగా చేశారు. శ్రౌతయాగము అంటే శాస్త్ర పరమైనటువంటి, వేద పరమైనటువంటి, వేదాలలో మాత్రమే చెప్పబడినటువంటి ఒకానొక యాగం పేరు శ్రౌతయాగం. సత్రయాగము అంటే పరమాత్మను గురించి గానంగా, కథగా, పురాణంగా, హరికథగా, బుర్రకథగా, ఏదో ఒక తత్వ విచారణగా, ఒక spiritual exposition గా మనం చేస్తున్న పనే అది. ఇదంతా కూడా సత్రయాగం. ఎలా చేస్తున్నాం? మన ఇంట్లో కూడా వ్యాసపీఠం పెట్టుకొని హాయిగా లైట్ ఏసుకొని మనంతట మనం చదువుకున్నా ముక్తి వస్తుంది. కానీ మానవ జీవితంలో వ్యక్తి ముక్తుడు కావటం ప్రధానం కాదు. సామూహికంగా మనందరం కూడా evolve కావాలి. అందరమూ సత్రయాగం అంటే, ఈవేళ ఈ వాకిటికి కట్టినటువంటి తోరణం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అణువు కూడా భాగవతమయం అయిపోతుంది. మనమంతా వింటున్నాం, మనమే వింటున్నాం అనుకుంటాం. చీమలు, దోమలు ఇక్కడ ఉన్నటువంటి జడ, అజడ చైతన్య రహితమైనటువంటి అన్ని వస్తువులు కూడా శ్రీ కృష్ణకృష్ణ చైతన్యాన్ని పొదివి పుచ్చుకొని పరిపూర్ణమైనటువంటి భాగవత రసమాలయాన్ని ఆనందంగా అనుభవిస్తున్నటువంటి దివ్యమైనటువంటి ఒక మంగళ సన్నివేశం ఇది. ఈ సన్నివేశంలో కథ ప్రారంభానికి మూలంగా ఈ సూతుడు శుకుడు శుకుడు అంటే ఎవరో వ్యాసుడు. వ్యాసుడి యొక్క కొడుకు శుకుడు. ఆ శుకుడు ప్రపంచంలో అనుభవించినటువంటి దానిని అక్కడి నుంచి ప్రారంభమై పరమ భాగవతోత్తముడు ఎవడు అంటే తర్వాత తర్వాత అంబరీష్డు వీళ్ళంతా వస్తారు. మొట్టమొదటి వాడు శుకుడు. ఆ శుకుడు వ్యాసులవారికి కొడుకు గనుక ఆయనకు కూడా భాగవత కథ తెలుసు. లేదా భాగవతం అంటే ఈ కథని కాదు భగవంతుని యొక్క కథ కానీ తత్వం తెలియదు. జ్ఞాన యోగంలోకి వెళ్ళటానికి ఆయన జనకుడి రాజభవనానికి వెళ్ళి జనకుడి దగ్గర కూర్చొని యోగానుష్టానం చేసి అక్కడ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని విచారణ చేసుకున్నాడు. ఆ శుకుడే వ్యాసులవారిని ఓ మాట అడిగాడు "తండ్రీ! మీ కంటే మించిన జ్ఞాని ఉన్నాడా? లోకమంతా మిమ్మల్ని జ్ఞానైక స్వరూపం అంటుంటే నాకు మీరు పాఠం చెప్పకుండా ఇంకెవరి దగ్గరకు వెళ్ళమంటున్నారేమి?" అన్నాడు. అంటే ఆయన అన్నాడు "నాయనా! నేను భాగవతమో పరమాత్ముని గురించో చెప్పటానికి ఉన్నవాడిని నేను. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపా అని అందరూ అంటారు అన్నీ నిజమే. కానీ నాకు లౌకిక ప్రపంచం తెలియదు. రాజ్యం చేయటం తెలియదు. ప్రపంచంలో ఉండే బాధలేమిటో నాకు తెలియవు. వీటన్నింటినీ వహిస్తూ కూడా వీటిని అంటించుకోకుండా దేనికి అందకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె రాజ్యపాలన చేస్తున్నటువంటి జనక మహారాజు దగ్గరకు వెళ్ళినట్లయితే నీకు నిజమైనటువంటి యోగం నీకు సిద్ధిస్తుంది." అని అచ్చమైనటువంటి ఈ నవనీతాన్ని అందుకోవటానికి శుకుణ్ణి వ్యాసులంతటి వారు జనకుడి దగ్గరకు పంపారు. ఆ శుకుడి కథ కూడా ఇక్కడ ఉన్నది. ఉన్నప్పుడు నైమిశారణ్యంలో ఈ శౌనకాది మహా మునులంతా కూడా ఆ సూతుడు అనబడేటువంటి వాణ్ణి చూసి ఒక మాట అడిగారు. "మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్" నిన్నే ఎందుకు అడుగుతున్నాం అంటే నాలుగు కారణాలు ఉన్నాయి సూతుడా! ఒకటి మన్నాడవు చిరకాలం ఎప్పటినుంచో ఉన్నావు నువ్వు. మేమంతా ఏదో వయసు వల్ల పెద్దవాళ్ళం అయినాం గానీ నువ్వు కాలాజమచ్ఛిన్నమైనటువంటి ఆత్మ స్వరూపుడిగా ఉన్నావు అని అర్థం. కన్నాడవు పెక్కులైన గ్రంథార్థములు ఇటువంటివి ఎన్ని చదివావో. రెండు విన్నాడవు వినదగినవి. మనం కూడా చాలా వింటాం. వినతగనివి వినతగినవి రెండు. వినతగినవి అక్కరకు వస్తాయి వినతగనివి అక్కరకు రావు. కదా. ఉన్నాడవు పెద్దలొద్ద ఇంకోటి మంచి వాళ్ళ దగ్గర పెద్దలు అంటే జ్ఞానులు అని అర్థం. వాళ్ళ దగ్గర ఉన్నావ్ అంటే ఊరికే వెళ్లి ఒక పెద్దాయన దగ్గరికి వెళ్లి కూర్చున్నాడా అంటే ఉత్తమ గోష్ఠిన్. పరమోత్కృష్టమైనటువంటి గోష్ఠి జరుగుతున్నటువంటి వేళ నువ్వు కూడా ఉన్నావు గనుక విన్నావు కన్నావు తెలుసుకున్నావు పెద్దల దగ్గర ఉన్నావు వీటన్నింటి వలన నీకు దివ్యమైనటువంటి జ్ఞానము అలవడింది గనుక నీ భావంలో నీ అనుభవంతో నీ సంస్కారంతో నీ తపో బలిమితో కలివితో పరమేశ్వరుడితో నీకున్న చెలిమితో భాగవతార్థమేమో మాకు చెప్పమని అడిగారు నైమిశారణ్యంలో. అంటూ మనం ఒక్కొక్కసారి అడగాలి. ఎట్లా అడుగుతాం అంటే "స్వామి గురించి కాసేపు చెప్పండి" అని అడుగుతాడు. కొత్తవాడు ఏమంటే "సాయిబాబా గురించి కాసేపు చెప్పండి" అంటాడు. మనం అనం మనకి ఆయన ఎప్పుడో పాతమాట అది. సాయిబాబా అంటే ఎవరో అనుకుంటాం. స్వామి అనంగానే మనకన్నీ రూప భావ తత్వాలన్నీ కనబడిపోతాయి. అలాగే అడిగేవాడు కూడా భాగవతం అంటే మళ్ళీ ఇంకెవరి కథో చెప్తాడని వీళ్ళే ఒక క్లూ ఇచ్చారు. ఆ క్లూ పోతనామాత్యుడు ఎంత అందంగా ఈ భాగవతం అంతా పోతన చూస్తూ రాశాడు. దేంతో చూస్తూ రాశాడు? హృదయంతో చూస్తూ. మనం రామాయణ కల్పవృక్షాన్ని విశ్వనాథవారు ఎట్లా దర్శనం చేసి మనకు కరతలామలకం చేశారో అలాగే ఈ భాగవతాక్ష కల్పతరువుని కూడా పోతనామాత్యుడు అట్లాగే రాశాడు. ఉదాత్త వైఖరిలో రాశాడు. "యవని అవతారమెల భూతములకు సుఖమును వృద్ధియు సొరది చేయు యవని శుభ నామమే పొద్దునుడు వెంగ సంసార బంధంబు సమసిపోవు యవని చరితంబు హృదయంబు చేర్పంగ భయమంది మృత్యువు పరుగులెట్టు యవని పదనదియే పారుజలముల సేవింప నైమల్య సిద్ధి కలుగు" ఇవన్నీ జరుగుతాయో ఎవరై ఉన్నారో ఎవరి వలన ఇవన్నీ కలుగుతూ ఉన్నాయో "తపస్సులు యవని పాదంబు తగిలి శాంతి దరువుగాంచిరి వసుదేవ దేవకులకు ఎవ్వడు దయించె తత్కథలల్ల వినగ ఇచ్చ పుట్టెడు ఎరిగింపుము యుద్ధచరిта" అటు ఇటు ఇంకా ఎందుకులే ఆయన ఈయన గురించని దేవకీ వసుదేవులకు పుట్టిన కృష్ణుడు అని ఒకడు విన్నాం. వాడి కథ ఇంకా మాకు పూర్తిగా తెలియలే. వాడి కథ అంటే వాడి కథ ఏముంది అసలు ఏం లేదు. స్వామి కథ ఏముంది నేను అనుకున్నట్టు అంతా కలిపితే ఇరవై పేజీలు. అంతేనా?వంద పేజీలు వేల పేజీలు ఎట్లా వచ్చినాయి అంటే మన కథలన్నీ దాంతో కూడినాయి గనుక భాగవతం ఏర్పడింది లేకపోతే అసలు ఆయనకి భాగవతమే లేదు మనవన్నీ కలుపుకొని వాల్యూమ్స్ అయినాయి ఆయనకి ఇవన్నీ కావాలనా అంటే ఏం అక్కర్లేదు అలాగే ఆ కృష్ణుడిది నీకు కాస్త తెలిసినా ఆయనతో కూడి ఉన్న వారందరి యొక్క కథని మాకు గనక చెప్పినట్లయితే ఏ మహా తపస్సులంతా కూడా ఏ దివ్య పాదాలను స్పృశించి ఆ దివ్య పాదాలను సేవించి పాదాలను అభిషేకించి దివ్యమైనటువంటి ఆనంద తారక స్థితిలో నెలకొంది చెందారో అటువంటి వారి ఆ కృష్ణుడి కథ చెప్పమని డైరెక్ట్ గా అడిగారు. హరి నామ కథన దవానల జ్వాలచే కాలవే ఘోరాఘ కాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబులచే తొలగవే భవదుఃఖ తోయదములు కమలనాభ జ్యానో కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడర్గోత్తి మిరతసులు నలిన నయన భక్తి నావచే గాక సంసార జలధి దాటి సనగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూత ధీసమీత సూత ధీసమీత ఇంటలెక్ట్ తో కూడి ఉన్నటు ధీ అంటే ఇంటలెక్ట్ ఇంటలెక్ట్ తో కూడి ఉన్నటువంటి వాడైనటువంటి ఓ సూతా ఇదిగోనయ్యా ఎవరి కథ వలన ఈ ఆనందం చేత గాని దుఃఖం చేత గాని అశ్రువులు వస్తే తొలగిపోతాయో ఎవరెవరి నామం చేత సంసార తాపాలు సమసిపోతాయో ఏ పరమేశ్వరుడి యొక్క నామం చేత ఈ సంసార జలధిలో ఒక నావ ఎక్కి అవతల గట్టుకు చేరటానికి వీలున్నదో ఆయన యొక్క దివ్య కథలన్నీ చెప్పండి అని సూతుల వారిని అడిగినప్పుడు ఇక సూతుడికి కావలసింది ఏముంది ఎప్పుడైనా శంకర భగవత్పాదులు ఓ మాట చెప్తారు ఏమంటారంటే నువ్వు ఒక తపో భూమికలో ఉన్నప్పుడు ఒక యోగ భూమికలో ఉన్నప్పుడు ఒక ఆధ్యాత్మిక భూమికలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికము యోగము కలిపిన సాంఖ్యంలో ఉన్నప్పుడు దీనిని కపిలుడు చెప్పాడు కాబట్టి ఆధ్యాత్మిక ప్లస్ యోగ ప్లస్ తత్వ ఇవన్నీ కూడా సమన్వయం చేసుకొని ఒకానొక భూమికలో నీవు ఒక తేజో దర్శనాన్ని పొంది దా-- ఆ అనుభవాన్ని నువ్వు ఒక అనుభూతిగా మార్చుకున్నప్పుడు ఆ అనుభూతిని నీ దగ్గర పెట్టుకొని ఉంచుకోవటానికి వీలు లేదు దానిని మళ్ళీ నువ్వు ఈ ప్రపంచానికి ఇవ్వాలి స్వామి ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారే అంటే నీ కోసం ఇవ్వలే అక్కడ ఏం జరిగిందో చెప్పటానికి కొన్ని లక్షల మందికి చేర్చటానికి ఆ చిన్న ఇంటర్వ్యూ నీకు ఇచ్చారు అలా అనుకున్నామా అలా అనుకోలే మనకే ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే మనం చాలా గొప్ప వాళ్ళం అని ఇచ్చారు అనుకున్నాం అది పొరపాటు అక్కడ అలా కాకుండా ఈ అనుభూతిని ఈ అనుభవాన్ని జగత్తుకు అందించేటువంటి బాధ్యత వీడి మీద ఉన్నది గనుక ఆ బాధ్యతని సూతుడు నారాయణ కథా శ్రవణంతో ఇవాళ ఆనందం పొందుతూ ఉన్నాడు వాడు వాడికి అర్థమైపోతున్నది స్వామి గురించి చెప్పండి అంటే మనకెంత ఆనందం చెప్పండి అసలు మన గురించి ఎవడన్నా అడిగాడనుకో ఏముందని చెప్పటానికి అంటాం ఉందో లేదో అసలు నిజానికి ఏం ఉండదు వాడేదో అడిగాడు గనుక ఉన్నట్టు అనిపిస్తుంది కానీ స్వామిని గురించి చెప్పండి అంటే తప్పకుండా అంటాం ఎందుకని అసలు ఆ చెప్పటంలోనే ముందు మనకు ఆనందం ఉంది చెప్పడంలో మనకు ఆనందం లేకపోతే ఈ ఆనందాన్ని బయటకు బహిర్గతం చేసేది ఎట్లా క-కనుక ఈ జరుగుతున్నదంతా కూడా ఈ నవనీతాన్ని పట్టుకుంటున్నటువంటి ఈ వేళ ఈ ఏడు రోజులు రాబోయే అన్ని రోజులు కూడా మనం చేస్తున్నది సత్రయాగం గుర్తుపెట్టుకోవాలి సరే దాని లోపలికి వెళ్లే ముందు ఓ చిన్నమాట చిన్న విషయం చెప్పి నారాయణ కథా శ్రవణంలోకి వెళ్దాం పరమాత్మ మొట్ట మొదటి రోజు అంటే నిన్న ఇరవై ఒక్క అవతారాలు ఎత్తాడని ఇరవై రెండోది ఇంకా రావాలని అంటే కల్కి అవతారం ఇంకా రావాలి అని మనం అనుకున్నాం మన దృష్టిలో అవతారాలు అంటే పదే దశావతారాలు అంతవరకు లెక్క ప్రచారంలో ఉన్నవి అవి కానీ నిజానికి ఇరవై ఒక్క అవతారాలు ఏమిటి అంటే ఈ వ్యాసుడు ఇరవై ఒక్క అవతారాలని సర్వసక్కగా మనకి ముందే వర్ణిస్తాడు ఎందుకంటే అవి ముందు తెలుసుకున్నట్లయితే దాని నుంచి మనం నిత్య నూతనమైనటువంటి స్థితిలోకి వెళ్లగలుగుతాం కౌమార అనేటువంటిది మొట్టమొదటి అవతారం కౌమార అంటే కుమార అని కాదు కౌమార అంటే అనుప్రవేశ అవతారం అని దానికి పేరు అవతారాలు దశావతారాల్లో అనుప్రవేశ అవతారం అంటే పరమేశ్వరుని యందు ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులను కూడా ఒక వ్యక్తి యందు ఒక స్వరూపంలో నిక్షిప్తం చేయటం దాని పేరు అను ప్రవేశం దాన్నే స్వామి ప్రభవము అన్నారు అనుప్రవేశం అన్నా ప్రభవం అన్నా నిజానికి ఒకటే అయితే ఈ అనుప్రవేశ అవతారం అయితే ఏదైతే ఉన్నదో ఆ అవతారం కాలాజ్యవచ్ఛిన్నంగా ఉంటుంది పరమాత్మకి ప్రతినిధిగా ఉంటుంది రెండవ అవతారం యజ్ఞవరాహ అవతారం యజ్ఞవరాహ అవతారం ఎందుకు వచ్చింది అంటే భూమి సముద్రం లోపలికి వెళ్లిపోయినప్పుడు ఒట్టి సముద్రమే గనుక ఉన్నట్లయితే ప్రకృతిలో మనకు కావలసిన ఔషధులు గాని ధన ధాన్యాలు గాని ఏవీ అందవు కనుక పరమేశ్వరుడు యజ్ఞవరాహ అవతారం ఎత్తిభూమిని సముద్రం అడుగు నుంచి పైకి తేర్చి మళ్ళీ మనకి వసుంధరను ఇచ్చాడు. అందుకనే భూమి నాది నాది అని కొట్టుకునేటువంటి వాడు అకాల మరణం చెందుతాడు. అయోగ్యమైన మరణాన్ని పొందుతాడు. భూమి మీద ఆశ ఉన్నవాడికి భూమిలోనే మరణం సంభవిస్తుంది. ఎందుకనంటే వేదవాక్యం ప్రామాణికంగా ఒక మాట ఏం ఉన్నదంటే వసుంధరా బ్రహ్మదత్త అని ఉంది. వసుంధరా బ్రహ్మదత్త అంటే ఒకడికి ఇరవై ఎకరాలు ఉండొచ్చు, ఒకడికి వంద ఎకరాలు ఉండొచ్చు, ఒకడికి ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఆరు బై మూడు అందరికీ ఇవ్వబడ్డాయి. కదా! ఆరడుగులు బై మూడడుగులు. ఈ రాజుగారు కూడా చివరికి ఆ తొర్రలోకి వెళ్లి కూర్చోవలసిందే. వాడు ఎన్నేళ్ళు పాలించని, ఎంత గొప్ప రాజు గాని వాడు కూడా అక్కడ చేరించవలసిందే గనుక పరమేశ్వరుడు భూమి ఎవరికీ ఇవ్వలేదా అంటే అందరికీ భూమి ఇచ్చాడు. జీవించటానికి భూమిని ఇచ్చాడు, పవళించటానికి మరుభూమిని ఇచ్చాడు అన్నారు. మరుభూమి అంటే మరులు గొల్పే భూమి. జీవుడు ఇక్కడ యాతన పడతాడు. కానీ ప్రాణం వదిలిపెట్టి శరీరాన్ని వదిలిపెట్టి ఒకానొక మార్పుకి లోనై మరణావస్థకు లోనై తన శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మరులు గొల్పు జీవిగా జీవిస్తాడు వాడు. అంటే నో జీవితం నో మరణం విచిత్రం అంటారు భగవత్పాదులు. మరణించిన తర్వాత మానవుడు జీవించాలి. మానవుడు జీవించి ఉండగా మరణ భావనకు దూరంగా జీవించాలి. ఇది ఉత్తమోత్తమమైన జీవితం. ఎంత బాగా బ్రతికామని కాదు, ఎంత భోగ యోగంలో ఉన్నామని కాదు, ఎంత యోగ భూమికలో సంచారం చేశామని, ఎక్కడ మనం మహా పరితృప్తంగా ఉన్నామని, నిష్ఠగా ఉన్నామని, నియతిగా ఉన్నామని మన మనసుకు మనకు ఒక స్థిమితం కలుగుతుందో అది ఉత్తమోత్తమమైన జీవితంగా మనం భావన చేయాలి. అటువంటి దానిని ఇవ్వటానికి వచ్చినటువంటి అవతారమే యజ్ఞవరాహ అవతారం. ఆ యజ్ఞవరాహ అవతారం తర్వాత మూడవ అవతారం నారదుడు. నారదుడు కూడా విష్ణు స్వరూపమే. ఆయన పేరు నారదుడు అని ఎందుకన్నారంటే నారము అంటే జ్ఞానము, ద అంటే ఇచ్చేవాడు. జ్ఞానాన్ని ఇచ్చేవాడు. మనకు పురాణాలలో, హరికథలలో, జానపదులలో [గొంతు సవరించిన శబ్దం] సరే సినిమాలలో నారదుడు అంటే కలహప్రియుడుగా వాళ్ళేం సృష్టించలే పురాణాల్లో ఎలా ఉందో ఆ పాత్రను అలా చెప్పారు. ఆయన కలహాలన్నీ, ఆయన లౌకిక వ్యవహారాలన్నీ జగత్ కల్యాణానికి దారితీసేవిగా ఉంటాయి. దాని వలన ఒక నీతి జాతికి ప్రబోధం అవుతుంది కనుక నారదుడు మూడవ అవతారం. ఆ తర్వాత నరనారాయణ మునులు నాలుగవ అవతారం. నరనారాయణులు అనంగానే మనకి కృష్ణార్జునులు గుర్తొస్తారు. వాళ్ళిద్దరూ కాదు. నరనారాయణ మునులు ఇద్దరున్నారు. ఆ మునులిద్దరే స్వామి ఈ అవతారంలో మీకెక్కడైనా దొరికితే ఇప్పుడున్నదో లేదో తెలియదు నరనారాయణ గుహ ఆశ్రమానికి స్వామి కొంతమందిని పంపారు. స్వయంగా ఒక అక్షయపాత్రను ఇచ్చి అక్కడికి వెళ్ళి దానిని చక్కగా తెలుసుకొని అధ్యయనం చేయండి ఎప్పుడైనా. చేసినట్లయితే సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచానికి వేదకాలంనాటి విషయాలన్నింటినీ కూడా ఎంత చేరువ చేశారో మనకు అర్థమవుతుంది. ఏదో కేవలం ఆయన దర్శనానికి కోసం వెళ్ళటమో, ఏదో స్వామిని మేము చూశామని వెనక్కి రావటమో కాక స్వామి ఈ తత్వార్థ విచారణలో జీవుడికి ఇవ్వవలసినంత అనుగ్రహ వరదానం చేశారు. దీనిని అనుభవించడానికైనా మనం జీవించి ఉండాలి. తెలుసుకోవటానికైనా తత్వ విచారణ చేయాలి. కాబట్టి నరనారాయణులు అనబడేటువంటి ఇద్దరులూ ఇద్దరూ కలిసి జగత్తుకి ప్రతి అవతారం ఏదో ఒకటి చేయాలి. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారయ్యా అంటే యజ్ఞవరాహుడు భూమిని ఎట్లాగైతే తెచ్చాడో, నారదుడు జ్ఞానం ఎట్లాగైతే ఇచ్చాడో, ఈ అవతారమైనటువంటి నరనారాయణ అవతారం మాత్రం నారాయణ మంత్రాన్ని జగత్తుకి ఇచ్చాడు. ఈ నారాయణ శబ్దం జగత్తుకి నరనారాయణ మునులు ఇచ్చినా దేవకీ వసుదేవులకు కృష్ణుడు చెరసాలలో ప్రభవించినప్పుడు, యోగ మాయ చేత ప్రభవించినప్పుడు ఆయన ఒక మాటన్నాడు. తొలినాళ్ళలో కృష్ణి సుతాపుడు అనబడేటువంటి దంపతులకి మొట్టమొదటి సారిగా నేను వచ్చాను. ఈ అవతారంగా. ఆ చైతన్యంలో వచ్చినప్పుడు నా పేరు నారాయణుడు. అలాగే కశ్యపుడు అదితికి వామనుడిగా వచ్చినటువంటి వేళ నా పేరు మాధవుడు. మా అంటే భూమి. ధవుడు అంటే భరించేవాడు. కనుకనే మదోన్మత్తుడైనటువంటి బలి అహంకార గుణం చేత దానం చేసిన కారణంగా ఇంద్రుడి దగ్గర నుంచి తీసుకున్నటువంటి సర్వ భూమండలాన్ని తన కైవసం చేసుకొని దానిని దానమిస్తున్నటువంటి కారణంగా శ్రీ మహావిష్ణువు వచ్చి అడిగాడు మూడవ నేల ఎక్కడ? ఆ భూమి ఎక్కడ అని అడిగాడు. ఎక్కడ అంటే ఏ పాతాళం ఉన్నదో అక్కడికి ఆయన్ని నెట్టాడు. రెండు అనుగ్రహాలు ఇచ్చాడు. ఇంద్రుడికి భోగాన్ని ఇచ్చాడు. ఈ భూములన్నీ వెనక్కిచ్చి. బలికి యోగాన్ని ఇచ్చాడు.
SSSMC · audio
Bhagawata Navaneetham - 04
Bhagawata Navaneetham - 04
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 35:46
More in this series