No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం ప్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాత్ పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ నారాయణు పరమేశ్వరు ఏరీతి తలంతు తలుచుకోండి ఎలా తలవాలో చెప్పవయ్యా ఆయన-ఆయన గురించి నాకేం తెలియదే మంత్రం దయ్యది విహితాచారంబులు ఏ ప్రకారంబులు ఆరాధనా కాలమెట్టిది ఆనతి ఏవే ప్రభు మంత్రం చెప్పవయ్యా తంత్రం చెప్పు ఎలా చేయాలి ఆచారం ఎలా చేయాలో చెప్పు ఏ సమయంలో చేయాలో చెప్పు ఏదో నారాయణ మూర్తిను అనుకో అని అంటే ఎలా అనుకోను ఎట్లా అనుకోను ఎప్పుడు అనుకోను ఏం అనుకోను చెప్పమని అడిగింది తెలియకనా మన బొట్టు వాళ్ళ కోసం అడిగింది ఈమె అడిగింది గనుక ఆయన చెప్పాలి చెప్తున్నాడు కశ్యప ప్రజాపతి పయోభక్షణము అనేటటువంటి ఒక వ్రతం అది వ్రతం రెండు నిమిషాల్లో చెప్పుకోవచ్చు అది పయోభక్షణం అనేటటువంటి ఒక వ్రతం ఉన్నది పయోప్రాశనం అన్నారు దాన్ని ఏ పేరు పెట్టినా ఆ అమ్మవారిని గనుక ఓం నమో భగవతే వాసుదేవాయ అనబడేటువంటి ద్వాదశాక్షరి మంత్రాన్ని గనుక నువ్వు జపిస్తూ జపిస్తూ ఉన్నట్లయితే ఏదో ఫలానా రోజు సోమవారం ఆ రోజుల్లో వ్రతం చెప్పాడు ఆకు మీద అది పెట్టు దాన్ని నెయ్యితో గుడిన అన్నంతో ఉండు అంటే వేళ ఘీ రైస్ జీరా రైస్ ఆ మెంతి రైస్ ఆ నీమ్ రైస్ వింటున్నాం కదా అట్లా అలాంటిది ఒకటి చేసి ఆయనకి చక్కగా మీరు నైవేద్యం పెట్టమని చెప్పాడు సరే కశ్యప ప్రజాపతి చెప్తుండగా అదితికి చెప్పబడితే ఆమె చేయదా ఇక బ్రహ్మాండమైన నిష్టతో చేసింది చూడండి ఈ అంత కోరికలను నాకిది కావాలి అని అడగలే ఆమె వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఏం చేయమంటారు అని అడిగింది అలా కోరాలి నాకిది కావాలి అని కోరితే ఏముందది నా ఒక్కడికి ఇస్తాడు అయిపోతుంది అక్కడికి నా ఒక్కడికి అక్కర్లా అందరికీ కావాలి ఆ అందరికీ కావాలనే ప్రార్థనే సర్వజనహితాయ మనం చేయాలి ఆ సర్వజనహితాని మనం కోరాలి వాళ్ళ ఆనందమే మన ఆనందంగా స్వీకరించాలి అటువంటి స్థితిని అప్పుడు ఆయన ప్రత్యక్షమైనాడు ఏదో రోజున చూపుల శ్రీపతి రూపము నాతోవక త్రావి త్రావి హర్షోద్గతయై వాపుచ్చి మంద మధురారావంబులాల పొగడే అదితి లక్ష్మీనాథున్ శ్రీహరి ప్రత్యక్షమైతే ఆయన్ని చూడగానే తడబాటు వచ్చి గాద్గద్యం వహించి అనేక విధాల కీర్తించిందట ఎంతగా అంటే కంఠం వృద్ధం అయిపోయింది కనిపించాడాయన యజ్ఞేశ విశ్వంభరాచ్యుత శ్రవణ మంగళ నామధేయ లోక స్వరూప ఆపన్న భక్తజనార్తి విభాండన దీనలోకాధార తీర్థపాద తీర్థపాదుడు ఆయన అందుకనే గురువు యొక్క పాదాలకు ఉన్నటువంటి రెండు బొటనవేళ్ళలో నుంచి గంగ పుడుతుంది ఎలా అది జ్ఞానగంగ పుడుతుంది అక్కడ గురువు యొక్క సుషుమ్న ప్రకాశమానమై ఉంటుంది అందుకనే నేను కాశీకి వెళ్లి వస్తాను అని అన్నప్పుడు షిరిడి బాబా తన చేతిలో ఉన్న సక్కాతో నేల మీద కొట్టారు కొట్టగానే ఆయన కుడి పాదము యొక్క బొటనవేలు నుంచి కాశీలో ప్రవహిస్తున్న గంగ అప్పటికప్పుడు పుట్టుకొచ్చిందది మన యోగులంతా దీన్ని ప్రదర్శన చేసి చూపించారు కాబట్టి గురువు యొక్క అటువంటి తీర్థపాదం ఆయువు దేహంబు అనుపమ లక్ష్మియు వసుహయు దివము త్రివర్గములకు వైదిక జ్ఞాన యుక్తియు వైరిజయము నిన్ను కొలువని నరులకు అరయగలదే విమత మందార గుణహార వేదసార ప్రణవ తత్సల పద్మాక్ష పరమ పురుష ప్రార్థించింది అయ్యా నిన్ను గనక అడిగితే కావాల్సినవన్నీ దొరకవా ఎవరెవరికీ ఏం కావాలో అవి ఇవ్వటానికే కదా నువ్వు వచ్చావు అని అంటూ అసలు విషయాన్ని నెమ్మదిగా చెప్పింది అసురవరులు సురలను అదరించి బెదరించి నాక మేలుతున్న నాటనుండి రాక్షసులంతా బెదిరించి ఇంద్రలోకాన్ని ఏలుతున్న ఆ రోజు నుంచి కన్నకడుపు గాన కంటకూరుకురాదు కడుపు పొక్కు మాన్పి కనవయ్యా ఇది జరుగుతున్నప్పటి నుంచి నా కంటికి కునుకు లేదు కడుపునిండా అన్నము లేదు కాబట్టి నాకు కడుపు పొక్కు ఏర్పడింది అంటే నా కడుపులో ఒక బాధ ఏర్పడింది దానిని నువ్వు తీర్చవయ్యా కన్నతల్లిగా నేను అడుగుతున్నాను ఎందుకని అంటే దేవతల యొక్క తల్లి అదితి గనుక నా కడుపులో ఏర్పడినటువంటి ఈ బాధని తొలగించమని అడిగింది అప్పుడు ఈ అడిగినప్పుడు ఈ పరమాత్మ మనం ఎంత కష్టం చెప్తాం కదా వినేవాడు నవ్వుతాడు వాడు ఎందుకు నవ్వుతాడో మనకు అర్థం కాదు మనతో పాటు వాడు యాతన పడాలి కదా అయ్యో అట్లా జరిగిందా అని మన కష్టమంతా వాడు అనుభవించాలి అభినయించాలి అనుకుంటే వాడు ఏం అభినయించడు శ్రీరామచంద్రుడు కల్పవృక్షంలో చూసాం మనం ఎక్కడా ఆయన విషాదాన్ని ప్రదర్శించిన చోటే లేదు ఎంత కష్టం వస్తే ముందు నవ్వుతూ మాట్లాడేవాడు వాడు ఇక్కడ కూడా ఆయన విష్ణుమూర్తి హాయిగా ఒక నవ్వు నవ్వాడు నవ్వినీ కోడెండ్రును నీ కుమారవరులున్ నీ నాథుడున్ నీవు సంశ్లోకించన్ శత్రులింపతుల్ మిగుల సంమోదింప నీ కొడుకులు నీ కోడళ్ళు నీ భర్త నువ్వు నీ పరివారం నీ బంధుజనం నీ స్నేహితులు అందరూ ఆనందించేట్లుగా రాత్రించలు శోకింపన్ నిశాచరులైనటువంటి రాక్షసులంతా శోకించేట్లుగా భవనీయ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించెదన్ ఒక తేజోమూర్తిగా మీ శరీరంలో నేను ప్రవేశిస్తా జన్మిస్తా నాకున్ వేడుక పుట్టు నాక్కూడా కాసేపు వేడుకగా ఉంది ఇలా రావటం నీ నీ గర్భస్థుడనై ఉంటా ఉండి నీ సుతుడనై నర్తించి వర్తింపగా నీ సుతుడనై నర్తించి అంటే నటించి అని చూసారా పరమేశ్వరుడి తల్లికి కూడా పరమేశ్వరుడు ఉండటం ఆ పరమేశ్వరుడి యొక్క ఆట అది అది ఒక నటన ఆ నటన లోనుంచి బయటికి రావాలి అని బలిమిందైచుల చంపరాదు మన దగ్గర బలముంది కదా అని శత్రువును చంపకూడదు వినయోపాయంబులం గాని చంపరాదు యుక్తితో వాణ్ని సంహారం చేయాలి సంచలనంబుందకు ఏను దుఃఖపడకు నేను నీ నియతికిన్ సద్భక్తికిన్ మెచ్చితిన్ బలి విద్వేషియు నానిలింపగణమున్ పడునోమియున్ మెచ్చదైచుల రాజ్యంబు హరింతు ఇంద్రునికి ఇత్తున్ దుఃఖమింకేటికిన్ నీ కడుపున పుడతా రాక్షస సంహారం చేస్తా ఇంద్రుడికి ఇంద్రుడి రాజ్యాన్నిస్తాను నీకు ఆనందాన్ని కురుస్తా ఇంకెందుకు దుఃఖం హాయిగా ఉండు ఇంకా దుఃఖిస్తున్నావేమి నేను వచ్చాను కదా ఏలుంతు దినము సురలను పాలెంతు మహేంద్ర యువతి భాగ్యశ్రీలన్ తూలింతు దానవుల నిర్మూలంతు రిపు ప్రియాంగముల భూషణముల్ రాక్షస సంహారం చేస్తానన్నాడు అని చెప్పి అదితి గర్భంలోకి ఈయన ప్రవేశించాడు మనం కల్పవృక్షం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక విషయం ఒక సుస్పష్టమైన విషయం ఏంటంటే పరమాత్మది ఎప్పుడూ ప్రసవం కాదు అది ఎవడైనా కానీ అది ఏ రూపం అన్నా కానీ అది ప్రభావమే శ్రీరామచంద్రుడు పాయసం లో ప్రవేశించి కౌసల్య గర్భంలో ప్రభవించాడు అలాగే యోగ మాయలో నుంచి దేవకి గర్భాన ప్రభవించాడు ఈ ప్రభవం అవుతూనే ఉన్నది ప్రసవం ఎక్కడా కాలే ప్రసవం జీవుడికి ప్రభవం దేవుడికి కనుక ఈయన కూడా ఏం చేసాడంటే నీ కడుపున పుడతాను అన్నాడు కదా అలాగే ప్రవేశించాడు ఎలా ప్రవేశించాడంటే చలచలనై పిదపిదనై కరడుగట్టి కళానాళముతో తల ఏర్పడి గర్భంబై నెలమసలం చిర చిక్కె నెలతకు అధిపా ఆవిడకి తెలిసిందట నా శరీరంలో ఏదో మార్పు వచ్చింది నేను గర్భాన్ని ధరించాను అని చలచలనై పిదపిదనై ఆ కంఠ స్థానాలన్నీ ఏర్పడుతున్నాయి గళ స్థానం ఏర్పడిందట ముందు శంఖం వచ్చింది చక్రం వచ్చింది అంటే శ్రీ మహావిష్ణువుతో ఉన్నటువంటి ఆచార గణాలన్నీ కూడా అదితి గర్భ ప్రవేశం చేసినయి అందుకనే గర్భవతులైనటువంటి స్త్రీమూర్తులు పరమేశ్వరుడి గాథలు వినాలి విన్నట్లయితేనే అటువంటి బిడ్డలు పుడతారు బహుశా తొమ్మిది నెలలు టీవీ తీసి బయట పారేయడం బెస్ట్ ఏమో లేకపోతే దాంట్లో నుంచి దానవులు పుట్టుకొస్తే వాళ్ళని మనం సంహరించలేం వాళ్ళతో పాటు మనం పోతాం పుడుతున్నది వాళ్ళే ఏదో ఆశలు గాని మనం తింటున్న తిండేమి మన ఆలోచనలేమి మన సాంగత్యాలేమి మనం చూస్తున్న దృశ్యాలేమి మనం జీవిస్తున్న సమాజం ఏమి ఎంత దుర్బల స్థితి చూడండి కనీసం ఈ గర్భస్థ గర్భాన్ని ధరించినటువంటి స్త్రీమూర్తులు పిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా గాని వాళ్ళంతా వీటికి కాస్త దూరంగా ఉన్నట్లయితే మళ్ళీ ఒక భద్రజాతి పుడుతుంది తప్ప ఒక జాతిని నిర్మాణం చేయటం కష్టం జాతి పుట్టుకకు కారణంగా అవటం మాత్రం అది మన చేతిలో ఉంది అంతవరకు చేయొచ్చు సరే గర్భం ప్రభవ-- ప్రవేశించాడు కొన్నాళ్ళు అయింది తొమ్మిది నెలలో పది నెలలో ఈ దేవీదేవతలంతా పది నెలలు నిండాలి తొమ్మిది నెలలకు కాదు ఇవాళ ఆరు నెలలకి ఏడు నెలలకి ఇంక్యుబేటర్ లో పెడుతున్నారు వీళ్ళని కదా తల్లి గర్భం ఒక మొదటి గర్భం అది రెండో గర్భం డాక్టర్ గారు పెట్టిన పెట్టె పెట్టెలో వాడిని పెడతారు వాడు ఏం పీలుస్తాడు ఆస్పత్రి మందులు తప్ప సరే వాడు ఎలాగో పుడతాడు బట్టకడతాడు బతుకుతాడు అన్నీ అవుతాయి కానీ ఏం ఉండదు చైతన్యం ఉండదు ఆ నిర్ణయం చూడండి వామనుడు ఎటువంటి వేళ పుట్టాడంటే రవి మధ్యాహ్నమునం చరింప ఆకాశంలో సూర్యుడు మధ్యాహ్నం మార్తాండుడై ఉన్నాడు మధ్యాహ్న కాలానికి వచ్చాడు అంటే పన్నెండు గంటల వేళ ఇవాళ మన లెక్క గ్రహతారా చంద్ర భద్ర స్థితిన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణాభిజిత్ సజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే భగవానుడు పుట్టే వామనుడు పుట్టే అనటం లేదు ఆయన భువనాధీశుడు పుట్టే అసలు వస్తూనే ఈయన ఎందుకు వస్తున్నాడు అంటే భువనాలు మూడు పట్టుకోవటానికి వస్తున్నాడు గనుక ఆ వస్తున్న అవతారాన్ని ఇక్కడే సూచి ప్రాయంగా చెప్పాడు వామన గతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజదీశ్వరుమాతకున్ పరమపాతివ్రత్యవిఖ్యాతకున్ అదితికిన్ అదితి గర్భంలో నుంచి ఈ శ్రావణ ద్వాదశి నాడుఅభిజిత్ లగ్నంలో పన్నెండు గంటల zero one minute అది అభిజిత్ లగ్నం. దానికి దోషం లేని లగ్నాలలో అది ఉత్తమోత్తమమైనటువంటి లగ్నం. దానికి రాహుకాలాలు లేవు, దుర్ముహూర్తాలు లేవు, వర్జ్యాలు లేవు, వారాలు లేవు. ఏ పనైనా ఆ time లో చేయొచ్చు. రెండోది ఒకటుంది, గోధూళి లగ్నం అని ఒకటుంది. [గాలి] సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమించటానికి పన్నెండు నిమిషాల ముందున్నటువంటి కాలమంతా కూడా గోధూళి లగ్నం అన్నారు. కులం లేదు, మతం లేదు. అప్పుడు పెళ్లిళ్ల శుభలేఖలు కూడా అప్పుడు రాసుకోవచ్చు, లగ్న పత్రికలు రాసుకోవచ్చు. time రావుండదు, పంతులుగారు చెప్పడు, వేధిస్తుంటాడు, తిప్పుతుంటాడు. ఏం చేయాలంటే గోధూళి లగ్నంలో ఆయగా రాసేసుకోవటం best. మంచి వ్రతం ప్రారంభించాలి, అపరాహ్నం వేళ చేయకూడదు. పన్నెండు గంటల కాలంలో పన్నెండు గంటల ఒక్క నిమిషం అభిజిత్ లగ్నము, గో-గోధూళి లగ్నం ఆ రెండు గనక గుర్తుపెట్టుకుంటే మన-మనకి అక్కరకు వస్తాయి. ఎలా వచ్చాడంటే నాలుగు భుజాలతో వచ్చాడట ఆయన. వామనుడు అలా మామూలుగా రాలే, నాలుగు భుజాలతో వచ్చాడు. శంఖం, చక్రం, గద ఇవన్నీ కూడా ధరించాడు. పిశంగ వర్ణ వస్త్రుడు, మకర కుండల మండిత గండ భావుండు, శ్రీవత్స వక్షుండు, నలిన చక్షుండు, నిరంతర శ్రీ విరాజిత రోలంబ కదంబారంభిక వనమాలికా పరిష్కృతుడును, మణికణ కాంచిత కాంచీ వలయాం గదాకిరీట హార నూపుర అలంకృతుండును, కమనీయ కంట కౌస్తుభాభరణంబును, నిఖిలజన మనోహరుండునై అవతరించిన సమయంబున అలా వచ్చాడట ఆయన. శ్రీవత్సమైనటువంటి ఆ పుట్టుమచ్చతో వచ్చాడు. రావలసిన దివ్యమైనటువంటి మహావిష్ణు లక్షణాలు అన్నీ వనగూడి ఉండగా ఆయన వచ్చాడు. ఆ పుట్టినప్పుడు చూసిన దర్శనమే నిజ దర్శనం. తర్వాత అన్నీ మనం చేయించిన వస్తువులే ఉంటాయి. మనం చేయించిన కిరీటం, మనం చేయించిన పాదుకలు ఆయన అవన్నీ తొడుక్కొని వచ్చినప్పుడు చూశారే, అది అసలు అదృష్టం. ఆ సమయంలో ఏమైంది అని. [గాలి] చింతంబాసిరి యక్షతాగ్య సుమనః సిద్ధోరగాధీశ్వరుల్. సిద్ధులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు చింత వదిలిపెట్టారట. పరమాత్మ ఈ ప్రపంచంలోకి రాగానే కలిగేది ఒకటి. భూమికి ఏర్పడిన చింత ముందు నశిస్తుంది. అది మొదటిది. చింత పోతే సంతోషం కాదు. చింత పోయింది. కష్టం పోతే సుఖం అంటే సుఖం వస్తే సుఖం. కష్టం పోవడం ఒక state. రెండవది, సంతోషించిరి సాధ్యచారణ మునీశ బ్రహ్మ విద్యాధరుల్. కాంతిన్ చందిరి భానుచంద్రములు. సూర్యుడు చంద్రుడు కూడా తమ సహజమైన కాంతి కంటే ఇంకా ఎక్కువ కాంతితో వెలిగారట. రంగద్గీత వాద్యంబులన్ కంతుల్ వైచిరి మింట కింపురుషులు, గంధర్వులు, కిన్నరుల్. వీళ్లంతా కూడా ఆకాశంలో ఎక్కడో నాట్యం చేశారట. దిక్కులకు ఆవిరి వాసను నె-ఎక్కువ నిర్మలత నొందనేడు పయోధూ. సముద్రాలన్నీ కూడా చాలా ఆనందంగా కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయట. నిక్కమే నిల్చె ధరణಿಯು చుక్కల త్రోవయు విప్రసుర సేవ్యములై. బ్రహ్మవిదులు, బ్రహ్మవరిష్టులు, బ్రహ్మనిష్టులు, బ్రహ్మర్షులు అయినటువంటి వారు ఒకపక్కన దేవీదేవతలైన అసురగణం కాక సురీ-సురగణమంతా కూడా ఆ వెన్నెల కాంతిని, ఆ వెన్నెల ద్వారాన్ని, ఆ మార్గాన్ని కూడా మరింత వెలుగుగా మారుస్తూ వీళ్లంతా కూడా వెళ్లారట. ఆ వెళుతున్నటువంటి ఆనంద సమయంలో ఆ బాలుడు కా-పెద్దవాడవుతాడు కదా, ఆయనకు ఒడుగు చేయాలి. ఒడుగు చేస్తారు, ఎనిమిదేళ్ళకే చెయ్యాలి. ఎనిమిదేళ్ళకు ఒడుగు చేసేవారు, ఎనిమిదేళ్ళకు పెళ్లి చేసేవారు. అష్టవర్షా భవేత్ కన్యా, అది ఆనాటి కాలం అది. ఇప్పుడు చేయకూడదు. కుదరదు. రెండో పాయింట్. [గాలి] చేసినా ఏలుకునేవాళ్ళు లేరు. ఏలుకునేవాడే లేనప్పుడు చేసి ప్రయోజనం ఏముంది? కాబట్టి ఆ ఏలుకునేవాడు దొరికినప్పుడు చేయటం మంచిది. కాబట్టి ఆ time వచ్చేదాకా చూద్దాం అని మనం. సరే. ఒడుగు ఎందుకు చేయాలి అంటే వారికి ద్విజత్వం ఇవ్వాలి, రెండో జన్మ ఇవ్వాలి. రెండో జన్మ దేనికి అంటే అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేయటానికి కావలసిన అర్హతను ఇవ్వటానికి. ఆ అర్హత మంత్ర పూరితంగా ఇవ్వాలి, గురుముఖంగా ఇవ్వాలి. దీనికి అనేక శాస్త్ర ప్రమాణాలున్నాయి. వాటి జోలికి మనం ఎక్కువ వెళ్ళొద్దు. కానీ ఆయనకు కూడా ఒడుగైంది. ఎవరికి? వామనుడికి. ఈ వామనుడికి ఒడుగైతే మనమేం చేస్తాం? రూపాయి బిళ్ళ, అర్ధరూపాయి బిళ్ళ అట్లా వేస్తాం కదా, భిక్ష వేస్తాం. ఎవరికి తోచింది వాళ్ళు వేస్తాం. ఆయనకి ఏమిచ్చారో చదువుదాం అసలు ఉరికే, రెండు నిమిషాలు కూడా పట్టదు. అబ్బాలునకు సంతోషంబున, ఆ ఇచ్చేది సంతోషంతో ఇచ్చారట. [గొంతు సవరించిన శబ్దం] అంటే అట్లా ఇవ్వాలి అని. ఆ సంతోషంతో కశ్యప ప్రజాపతిన్ పురస్కరించుకొని సముచిత ఉపనయన కర్మ కలాపంబులు సేయించిరి. సవిత సావిత్రినుపదేశించె. సవితాదేవి స్వయంగా వచ్చి సావిత్రి మంత్రాన్ని ఉపదేశించింది ఆయనకి. ఆయన బ్రహ్మే, ఆయన విష్ణువే, మాహేశ్వరుడే, త్రిమూర్త్యాత్మకమైనటువంటి నారాయణ స్వరూపమే. అయినా పంచభూతిక దేహాన్ని తీసుకొని వచ్చాడుగా. కాబట్టి సవితాదేవి వచ్చి సావిత్రి మంత్రాన్ని ఇచ్చింది. సావిత్రి మంత్రం అంటే కొత్తగా మళ్ళా ఆయనకు, అదే గాయత్రి. ఇచ్చింది. బృహస్పతి యజ్ఞోపవీతంబును, దండంబు వనస్పతియు సోముండును, గగనాధిష్టాన దేవత ఛత్రంబును, కమండునివు బ్రహ్మయు, సరస్వతి అక్షమాలికయు, సప్తఋషులు కుశవిత్రంబును ఇచ్చిరి. మరియున్, ఇవి కాక దర్భలు ఇచ్చిన వాడు ఒకడు, కమండలం ఇచ్చిన వాడు ఒకడు, యజ్ఞోపవీతం ఇచ్చిన వాడు ఒకడు, ఈ సరస్వతీదేవి వచ్చి అక్షమాలిక ఇచ్చింది.భిక్షాపాత్ర నిచ్చెను అసలు అది ఆ భిక్షాపాత్ర ఎవరు? యక్షేశుడు వామనునకు అక్షయమనుచున్ అక్షయమైన భిక్షాపాత్ర ఇచ్చాడు. సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణభిక్ష నరేంద్ర పార్వతీదేవి స్వయంగా వచ్చి పూర్ణభిక్ష భవాని స్వరూపంగా ఆయనకి వేసిందట. ఆ ఎటువంటి వాళ్ళు వచ్చారో రామానుడికి చూడండి. శుద్ధబ్రహ్మర్షి సమారాధ్యుండై విహితమంత్రరాజి చదువుచున్ ప్రొద్ధంబగు అనలంబున వృద్ధాచారము వటుడు వేల్చెన్ కడగన్ ఆరోజు ఉపనయనం అయినటువంటి తొలిరోజు గనుక చేయవలసినటువంటి విహిత కర్మలన్నీ కూడా ఆయన చక్కగా చేశాడు. ఆ యజ్ఞోపవీతం ధరించినందుకు పరిపూర్ణమైనటువంటి బ్రహ్మచర్యంలోకి అడుగు పెట్టబోతున్నందుకు మనస్సుని ఆయత్తం చేసుకొని ఆరోజు తాను చేయవలసినటువంటి యజ్ఞ కార్యక్రమాలన్నీ పూర్తి చేశాడు. ఇది కథ. కథలో ఇవాళ నవనీతం మనం ముందు చాలా ఎక్కువే చెప్పుకున్నాం. ఆ నవనీతంలో ప్రధానమైనది ఏది అంటే అడిగిన వాడికి ఆకలి అయిన వాడికి అన్నం పెట్టాలి, నీళ్లన్నా ఇవ్వాలి, మజ్జిగన్నా పొయ్యాలి. కాబట్టి మూడు ఏం చేయాలి? మన కోసం కాకుండా ఒకడి కోసమైనా కాసింత మజ్జిగ చేసి పెట్టుకోవాలి. ఎవడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. మనం చేస్తేనేగా మనకు అలవాటేగా శిరిడిబాబా వస్తాడని గాలిలో ఉండుతాం. ఆయన వస్తాడు కుక్క వచ్చిందని పడుతాం. ఆయనే నేను వచ్చానని పెట్టలేదు ఏంటి అని ఆయన మళ్ళీ రాత్రి కలలో కనపడతాడు. నువ్వు రాలేదు ఇంతలో కుక్క ముట్టా వచ్చింది నేనే అని అంటాడు తెలుసుకోలేదు. ఇది మాయ. ఈ మాయలో నుంచి బయట పడమంటున్నాడు. ఆ మాయావరణంలో నుంచి బయట పడకపోతే జీవుడికి ఇవన్నీ కథలుగా మిగిలిపోతాయి. పరమేశ్వరుడి వంటి బిడ్డను కనాలి అంటే పరమేశ్వరుడిని పొందగలిగిన స్థాయికి మన సాధన పూర్ణం చేసుకోవాలి. అంత స్థాయి పొందాలి అంటే చెప్పబడిన కొన్ని ధర్మాలన్నీ మనం ఆచరించాలి. ఈ అన్ని ఆచారాలు, యజ్ఞాలు యొక్క స్వరూపాన్ని స్వామి మన యందు ఉన్నటువంటి దయచేత రెండు మాటలుగా మార్చేశారు. సేవ చేసుకో, ప్రేమగా జీవించు, ప్రేమతో జీవించు. ఇవాళ చెప్పిన ఈ యజ్ఞాలు, యాగాలు ఇప్పుడు ఆ ప్రేమ, సేవ రెండూ మనం చేయగలిగితే మనక్కూడా సరస్వతీదేవి అక్షమాలలు ఇస్తుంది. తీసుకుందామా లేదా? భవానిదేవి వచ్చి భిక్ష ఇస్తుంది పొందుదామా వద్దా? ఏం చేయకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలో తెలియనప్పుడు ప్రేమగా జీవించాలి, సేవిస్తూ జీవించాలి. నేను ఏం చేయగలను ఇవాళ జన్మ ఎత్తినందుకు ఇరవై నాలుగు గంటలు అయిపోయింది పుట్టాను, మళ్ళీ రాత్రి పడుకోబోతున్నాను పదహారు గంటల్లో ఇదిగో పన్నెండు గంటలు అయ్యే పోయింది. మళ్ళీ మెలకువ వస్తే రేపు ఉంటాను, మెలకువ రాకపోతే రేపు ఉండను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకున్నటువంటి వాడికి సేవా యోగమే గొప్ప యోగం. దానిలోనే కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు మూడు కలిసి ఉన్నాయి. అలాగే అహంకారం, మమకారాలు పోగొట్టుకోవటానికి నాలుగొందలేళ్ళు తపస్సు చేయక్కర్లేదు. సేవ కూడా మనం వెతుక్కుంటూ వెళ్లి చేయనవసరం లేదు. నీ ఆ వాకిట్లోకి ఎవడైనా వచ్చి నాకు కాస్త ఈ సేవ చేసి పెట్టండి అని అడిగితే, ఏ రకమైన అపేక్ష లేకుండా గనుక నువ్వు చేయగలిగితే అది సేవ. ప్రపంచానికి నాకిది చెయ్యి, నువ్వు చేసిపెట్టు నేను చేస్తాను అని గనుక ఒప్పుకొని ఒడంబడిక ప్రకారం డబ్బు తీసుకున్నట్లయితే అక్కడికి కూలి డబ్బులు ముడతాయి. మరి పరమేశ్వర అనుగ్రహం కావాలంటే నువ్వు ఏమీ అడగొద్దు. సేవ చేస్తూ వెళ్ళు. బానే చెప్తున్నారండి, కాస్త వాస్తవ ప్రపంచంలోకి రండి మీరు కూడా ఇన్ని తెలిసింది చెప్పే మీరు కూడా ఎవడినైనా అడక్కపోతే ఎవడు ఇస్తాడని, అడిగితే ఏమిస్తాడు వాడు? వాడికి తోచింది ఇస్తాడు. మనం ఏమీ అడక్కపోతే మనకు ఏం కావాలో ఆయన ఇస్తాడు. ఈ ఒక్క నిర్ణయం తీసుకోగలిగితే జీవితం ఉత్తమోత్తమం. మనకు ఆశా లేదు, ఆశాభంగం లేదు, చెయ్యి చాపటం లేదు, మన చెయ్యి కింద అవ్వటం, మీద అవ్వటం ఆ పద్యాలు లేవు, ఏం లేవు. ఏం ఉన్నదయ్యా అంటే స్వామి చెప్పినటువంటి సేవ ఈ యుగానికి యోగం, అత్యద్భుత యోగం. చేయగలిగిన స్థాయిలో చేసుకుంటూ వెళ్ళటమే. స్థాయి ఎరిగి చేయాలి, స్థాయి లేకుండా చేయకూడదు. మన దగ్గర డబ్బు లేదు, డబ్బు ఇవ్వకూడదు. అప్పు తెచ్చి సేవ చేయకూడదు. మన దగ్గర ఉన్న దాంట్లో చేయాలి. అందులో కూడా స్వామి కొన్ని నిర్ణయాలు చెప్పారు. నీ దగ్గర వంద రూపాయలు ఉన్నట్లయితే దానిలో ఐదు రూపాయలే సేవకు పెట్టు, తొంభై ఐదు సేవకు పెట్టి బాబా నాకివ్వలేదు, నా దగ్గరేముంది, నాకే ఉద్యోగం లేదు అంటున్నాడు ఆయన. అది. ఉద్యోగం చేసిన మీకు నేను తెలివితేటలు చెప్తున్నా, ఐదు రూపాయలు ఖర్చు పెట్టు మిగతా తొంభై ఐదు నీ ఇష్టం. ఐదు రూపాయలు ఇంకొకడికి ఖర్చు పెట్టాలి అంటే మనం నూట ఐదు సంపాదించాలి. నూట ఐదు సంపాదిస్తే పది ఖర్చు పెడతాం, ఐదు ఖర్చు పెడతాం. కానీ సంపాదన చేయాలి, కర్మ యోగాన్ని దాటకూడదు. పరమేశ్వరుడే ఇస్తున్నాడు, నేను చేస్తున్నాను అని అనుకోకూడదు, భక్తి యోగం. జ్ఞాన యోగంలో ఆయన ఎవడో ఇస్తున్నాడు, వీడెవడో పట్టుకుపోతున్నాడు నేను కూడా చూస్తున్నాను ఆయన లాగానే అనుకోగలిగితే జ్ఞాన యోగం. ఈ మూడింటిని జీవితంలో అనుభవించగలిగితే అది నిజమైనటువంటి సేవా యోగం. ఎట్టి పరిస్థితులలో సాయి భక్తులమైన మన నోటి నుంచి మేము పుటపర్తి సేవకు వెళుతున్నాం అనే మాట రానివ్వకండి. ఎందుకో కొన్ని మాటలు అలా అలవాటైపోతాయి. పుటపర్తి సేవకు మనం వెళ్ళటం-వెళ్ళటం లేదు. మనల్ని మనం సేవించుకోవటానికి అక్కడికి వెళుతున్నాం. అక్కడ ఎవరిని సేవిస్తున్నాం అంటే సాయి స్వరూపాన్ని సేవ చేస్తున్నాం. సాయి స్వరూపులుగా ఉన్న కొన్ని వేల మందికి మనకు తోచిన రీతిలో మనం చేయగలిగినటువంటి సేవ చేయటానికి వెళుతున్నాం. ఆ సేవని స్వామి ప్రేమతో చేయమన్నాడు. విసుక్కుంటూ ఎందుకొచ్చిన కర్మా హాయిగా ఇంత ఎండలో పెట్టారేంటి అని ఒకడు, ఆ స్వామి వచ్చే వాకిలి దగ్గర డ్యూటీ వేయలేదని రెండో వాడు, పోయి పోయి అక్కడెక్కడో వేశారు అసలు స్వామిని చూడకుండా వచ్చాం అని మూడో వాడు. ఇది సేవ అనిపించుకోదు. ఎందుకంటే సేవలో మనం అనేక విషయాలను గమనించుకోవాలి ఇన్ హౌస్ కాబట్టి. నేను సేవకు వెళుతున్నాను అంటే ఆయన ఏం మెచ్చడు. స్వామి చెప్పారు.సేవకు వచ్చాను అన్నందుకు నాకేమి సంతోషం లేదు బంగారు అన్నింటికంటే నా దర్శనం కోసం వచ్చానన్నా నాకు సంతోషం లేదు మీరు మీరు మీ ఉన్నటువంటి స్థానాలలో ఉండి మీరు చేయగలిగినటువంటి సేవని మీ క్షేత్రాలలో చేయండి అది ఉత్తమోత్తమమైన సేవ కానీ మనకి ఎట్లా ఉంటుందంటే పుటపర్తి వెళ్లి ఆ లోపలికి వెళ్లి చేస్తేనే సేవ లేకపోతే వాడు సేవకు రాలేదు కదా బయట పెట్టండి అంటాడు ఇక్కడ కూడా చే-- ఇక్కడ ఎంత చేస్తే చేసి ఆ తండ్రికి అది కృతజ్ఞత సమర్పించుకొని ఆయన్ను దర్శనం చేసుకొని మళ్ళీ సేవాభాగ్యంలో మనసు నిలబడేట్టుగా ఉంచమని అడుగుతూ మీరు అనుగ్రహించినటువంటి స్థాయిలో మేము సంచారం చేస్తామని చెప్తూ పునః పునః స్వామికి మనస్సుని మనం చేసిన కర్మలని పూర్ణాహుత్యాంతంగా సమర్పించుకొని రావటం కాబట్టి వామనుడు బలి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే రేపు ఉంటుంది చాలా పరమాద్భుతం అసలు ఆయన ఆ వెళ్ళిన విధానం గాని అడిగిన తీరుతెన్నులు గాని అట్లా అడిగితే అట్లా అడగాలి ఇస్తే అట్లా ఇవ్వాలి అడిగేవాడు ఎంత గొప్పవాడు ఇచ్చినవాడు ఎంత గొప్పవాడు ఆ ఇద్దరూ గనుక యోగించిన ట్లయితే ఈ జాతికి ఎటువంటి ఉపదేశం దొరుకుతుంది ఎటువంటి మార్గం దొరుకుతుంది మనమిస్తాం వినాయకచవితికి దసరాలకి ఏమిస్తాం చందాలు ఇస్తాం గురువు గారికి దక్షిణ ఇస్తాం లేకపోతే ఇంకోటి ఎవరికో ఇంకోటి ఇస్తాం కానీ ఇవ్వవలసింది ఒకటే మనస్సుని హృదయాన్ని పరమాత్మకి ఇవ్వాలి మనస్సుని హృదయాన్ని ప్రేమపూరితం చేసుకొని సేవాభావంలోకి వెళుతూ ఇక్కడ ఉండగానే జాగ్రదవస్థలో ఉండగానే ఏదో మరణించే సమయంలో ఒక ఆనందం పొందటము ముక్తిని పొందటము అది లక్ష్యంగా కాక అసలు ప్రతిరోజూ నిత్యముక్తుడిగా ఉండాలి ఆ ఉండాలి అంటే చిజ్జడ గ్రంథి భేదనం జరగాలి చిత్తు జడము దేహము జడం మన శరీరాలన్నీ ఒట్టి కట్టెలు దానిలో చైతన్యం ఉన్నది ఆ చైతన్యమే చిత్తు ఈ చిత్తు జడము ఆత్మ దేహము అనేటువంటి రెండు ఇలా ముడిపడి ఉన్నాయి ఆ ముడిలో సన్నటి సందు ఉన్నది ఆ సందు ఎంతంతే సన్నని సన్న అతి సన్నమైనటువంటి ఒక సూది ఆ బెజ్జంలోకి వెళ్లేంతగా ఉన్నది అక్కడ ఆ విడి ముడి పడిపోయినట్లయితే గ్రంథి భేదనం జరిగినట్లయితే జీవుడే దేవుడు దేవుడే జీవుడు రెండుగా ఉన్నవి ఒకటే దాని పేరే చిజ్జడ గ్రంథి ఆ చిజ్జడ గ్రంథిలోకి వెళుతున్నప్పుడు ఎప్పుడైతే ఒక వస్తువు గాలి నెమ్మదిగా ఒక రంధ్రంలో నుంచి వెళుతూ ఉంటుందో ఒక రాగం పుడుతుంది ఒక నాదం పుడుతుంది ఆ రాగం పేరే హంసానంది ఆ హంసానంది చిత్తుతో జడంగా ఉన్నటువంటి మనమే ఈ దేహంలో ఉండగానే పుట్టినటువంటి హంసానందితో స్వామికి మనం స్వరార్చన చేద్దాం అంటే ఇవాళ వామనావతార ఘట్టంలో వామనుడు ప్రభవించాడు ఇవాళ పరమోత్కృష్టమైనటువంటి సన్నివేశం ఇది ఆ సన్నివేశంలో హంసానంది రాగంలో సత్యసాయి భగవానుడిని మనం చక్కగా కీర్తిద్దాం.
SSSMC · audio
Bhagawata Navaneetham - 38
Bhagawata Navaneetham - 38
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 27:24
More in this series