Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం, మందస్మిత మనోహరం, వందారు జన మందారం, వందే సాయి మహేశ్వరం. త్రియాతీత పదస్థితాంశ కరుణం, జ్ఞానాగ్ని శీల స్థితాం, మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం, సద్గురుం సత్యసాయి ఈశ్వరం. ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం, నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం. పరమ మహేశ్వర స్వరూపుడు, సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ శ్రీ వేదవ్యాస ప్రోక్తమై, బ్రహ్మర పోతనామాత్య కృతమైనటువంటి శ్రీమద్భాగవతంలో వామనావతార ఘట్టాన్ని మనం కాస్త మిగుల్చుకున్నాం కానీ పూర్ణం చేసుకున్నట్టు లేదు. వామనుడు త్రివిక్రముడై త్రివిక్రముడు మళ్ళీ బలిని పాశబద్ధుణ్ణి చేసి మరికొన్ని చిన్న చిన్న పరీక్షలకు గురి చేసి అందునా ఉత్తీర్ణుణ్ణి చేసి భగవంతుడు పరీక్ష పెట్టాడని బాధపడకూడదు. మనల్ని పాస్ చేయటానికే పరీక్షలు పెడతాడు. పాస్ అయ్యేట్టుగా మనం శ్రమ పడాలి. దాని పేరు సాధన. కాబట్టి బలిని ఎట్లా అనుగ్రహించాడు? దయావీరము, దానవీరము కలబోసుకున్నటువంటి ఒక దివ్యమైనటువంటి స్కంధమే ఇదిగో అష్టమ స్కంధం. దానిలో ప్రధానంగా వామనావతార ఘట్టం, వామన చరిత్ర, వామనుడు ఎలా వచ్చాడు అదంతా కూడా పరిపూర్ణ విచారణ మనం చేసుకుందాం. అయితే ఇంత గొప్పవాడు కదా వీణ్ణెందుకు మహావిష్ణువు ఇలా పరీక్షల పాలు చేశాడు అని పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. అంతా మంచే చెప్తున్నారు వామనుడి గురించి, మన బలిని గురించి. కానీ మహావిష్ణువు పోయి పోయి వాడు హాయిగా యజ్ఞం చేసుకుంటుంటే, యజ్ఞ వాటికలో తనంతట తానుగా ప్రవేశించి గౌరవాన్ని పొంది చివరికి మూడు అడుగుల నేల ఇస్తే చాలు అని ఒక మాట అని మూడు అడుగుల నేల తీసుకోకపోగా రెండడుగులతో సర్వ భువనాలు ఆక్రమించి మూడోది ఎక్కడ చూపించు, భూమి ఎక్కడ ఉన్నది, ఆకాశం ఎక్కడ ఉన్నది, ఇంకో లోకం ఉన్నదా అని ఒక జిజ్ఞాస రేకెత్తించి, "అయ్యా నా దగ్గర ఏం లేదు" ఇదిగో మనం కూడా అంటాం చూడండి ప్రపంచంలో, ఎక్కడ పెట్టమంటారు అంటే నా తల మీద పెట్టు అంటా. బలి కూడా అట్లాగే అన్నాడు, "ఇదిగో మిగిలింది నా తల, దాని మీద నీ కాళ్ళు పెట్టుకో, నీ ఇష్టం" అన్నాడు. అంటే ఏం లేదంటూనే కావాలిడు అని అడుగుతున్నాడు పరమాత్మ, తెలియనివాడా అని. పరమాత్మకి అసలు విషయం మనకు తోచింది కూడా ఆయనకు తెలియలేదా అంటే బలిని ఇంకా సానబడుతున్నాడు ఆయన. పైగా శ్రీహరి దర్శనం కోసం ప్రహ్లాదుడు వచ్చేశాడు అప్పటికే. అప్పటికే బలి భార్య పతి భిక్షణ అడిగింది. పరమేశ్వరుడిని "అయ్యా నా భర్తని కాపాడమని" అడిగింది. ఇన్ని విషయాలు అడుగుతూనే "నీ ఇష్టం" అన్నది మళ్ళీ, చూశారా. నాకిష్టమైంది ఇవ్వమని ముందు అడిగింది కానీ అయితే నీ ఇష్టమేనన్నది. ఇన్ని పరస్పర విరుద్ధమైనటువంటి భావాల మధ్య పరమేశ్వరుడు దాన్ని ఎంత సునిశితంగా, ఎంత సల్లక్షణంగా దానిని విచారణ చేశాడో, పరిష్కారం చేశాడో చూసినప్పుడు ఇది పరమాత్మకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభవం. ఇక్కడ భాగవత కల్పతరువు ఏదైతే ఉన్నదో దానిలో నుంచి పండి, మగ్గి, పూర్ణ రస ఫలమైనటువంటి ఫలాన్ని ఆస్వాదించమంటున్నాడు వేదవ్యాసుడు మనల్ని కూడా. నిగమ కల్పతరోర్గణితం ఫలం శుకముఖాదమృతద్రవసంయుతం, పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. భావుకత్వం కావాలి అంటే మృదుత్వమైన మనసు కావాలి. మృదువైన మనసు కావాలి అంటే రజస్తమో గుణాలు రెండు వదిలిపెట్టాలి. లేకపోయినట్లయితే "ఆ ఏముంది కథలో" అంటుంది తమస్సు. "ఇది ఎప్పుడో తెలుసుకున్నానులే" అంటుంది రజస్సు. "ఇది తెలుసుకోవడానికి ఏముంది, ఎన్నేళ్ళు ఎంతమంది చెప్పలేదు" అంటుంది అహంకారం. సత్వగుణ ప్రధానుడైనటువంటి సాత్వికుడైన సాధకుడు ఏమంటాడంటే "నేను ఎరగవలసినవి ఇంకా ఉన్నాయేమో, ఇంకా తెలిసింది మాత్రమే కాదు, తెలియవలసింది ఉన్నదేమో, ఎరుకలోకి వెళ్దాం" అనేటువంటి సాధనలోకి వెళతాడు గనుక. నిన్న ఒక ప్రశ్న దగ్గరే ఆగిపోయినాం. అడిగింది మూడు పాదాలు. మూడు పాదాలలో రెండు పాదాల నేలో, భూమో లేకపోతే ఆకాశమో ఆయనకి అందింది. పరమేశ్వరుడికి తెలియదా బలి దగ్గర మూడో పాదం లేదు అని, ఇవ్వలేడు అని ఆయనకు తెలియదా? వాడు ఇవ్వలేడని ఈయన అడిగాడా? అంటే నిన్న ఒక ప్రశ్న ఏమిటంటే మూడు గుణాలు ఆయనకి ఇచ్చేసేయటమే కదా అని ఒక ప్రశ్న. అది కాదు. మూడు గుణాలు గనక మనం ఇచ్చేసినట్లయితే ఇక్కడ మనకు అసలు కార్యకలాపాలు లేవు. రజస్సుని వదుల్చుకోవాలి, తమస్సుని వదుల్చుకోవాలి, సత్వాన్ని పెంచుకోవాలి, నిలబెట్టుకోవాలి. మామూలుగా అధ్యాత్మలో మనస్సుని పోగొట్టుకుండగా హాయిగా ఉంటారు అంటాడు. క్షణం అనుకుందాం మనందరికీ మనస్సు లేకుండా చేశాడు, మాయం చేసేశాడు మనస్సుని. ఏం చేస్తాం?మాయమైన మనసుతో ఉన్న మనం కార్యకలాపం చేయలేం ఇక్కడ. కించిత్ మనస్సు ఉండాలి అన్నది వేదం. కించిత్ మనస్సు. కానీ కించిత్ మనస్సులో కూడా మూడు గుణాలతో పుట్టినటువంటి జీవుడు చివరి రెండు వదిలిపెట్టి అంటే రజస్తమో గుణాలు వదిలిపెట్టి దానిని కూడా పూర్ణమయమైనటువంటి సత్వగుణ ప్రధాన సంపన్నుడు కాగలిగితే వాడు పూర్ణ మానవుడు అవుతాడు అప్పుడే వాడు అధ్యాత్మ లోకి వచ్చే హక్కు ఏర్పడుతుంది. ఎట్లా అంటే పరమాత్మ అయినా సరే అవతార పురుషుడు అయినా సరే మహాత్ముడు అయినా సరే పాంచభౌతిక దేహాన్ని గనక ధరించి వచ్చినట్లయితే మూడు గుణాలతో వాడు రావలసిందే. వాడు దేవుడైనా సరే. దేవుడైనా సరే వస్తే మరి ఆయన ఎలా పోగొట్టుకుంటాడు అంటే త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువు కథను ఒకసారి మనం అనుకోవాలి. ఆయన కూడా సత్వ రజస్తమో గుణాలతో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కౌసల్య గర్భంలో ఉన్నాడు గనక పాయస ప్రవేశం చేసిన విష్ణు శక్తి అంతా పాయసంలో ఉన్నప్పటికీ అది ప్రభావం అయినప్పటికీ భౌతికంగా కౌసల్య గర్భంలో తొమ్మిది నెలలు నిజానికి పదకొండు నెలలు ఉన్నాడట రాముడు. అది. ఎందుకని ఉన్నాడు అంటే జీవుడు ఏకాదశ పుర విహారి. ఏకాదశ పురాలు, పురాలు ఉన్నాయి మన శరీరంలో. దానిలో విహారి ఎవడయ్యా అంటే ఆత్మ. పదకొండు పురాలలోనూ ఆయన ఉన్నాడు. కనుక రామచంద్రుడు పదకొండు సంవత్సర-- పదకొండు నెలలు తన తల్లి గర్భంలో ఉన్నాడు. ఇది ఒకటి. పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం పాలించాడు. ఇది రెండవది. ఏకాదశ శబ్దం రామ శబ్దానికి చాలా సన్నిహితమైనటువంటి ఒక శబ్దం. సరే, అది అట్లా ఉంచగా సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఆయనకెందుకు ఏర్పడినాయి అంటే భౌతికంగా చూస్తున్నంత సేపు ఆయన రఘురాముడు, దశరథ నందనుడు, కౌసల్యా నందనుడు, ఇక్ష్వాకు రాజు, దశరథ మహారాజు జ్యేష్ఠ కుమారుడు ఇవన్నీ ఆయనకి చరిత్ర చెప్పేవి. అందుకనే మనో వైక్లభ్యం కలిగినప్పుడు దేశాటనం చేయవలసి వచ్చినప్పుడు ఆరేడు సంవత్సరాల వయస్సున్నటువంటి రామచంద్రుడు నగర పర్యటన చేశాడు. వెనక్కి వచ్చాడు. వచ్చి విషణ హృదయంతో కూర్చున్నాడు అంతఃపురంలో. మామూలుగా యధావిధి వచ్చారు వశిష్టుల వారు. ఇదేమిటి నారాయణమూర్తి సాక్షాత్తు రామచంద్రుడై వచ్చి జగత్తును ఉద్ధరిస్తాడు అంటే ఈనే దిగులుగా కూర్చున్నాడేమి అని అనుకొని, "ఏం నాయనా ఎందుకిట్లా ఉన్నావ్?" అన్నాడు. "గురువర్యా! ప్రపంచం అంతా దుఃఖారామం అనిపిస్తున్నది. ఇక్కడ నా పాత్ర ఏం లేదని అనిపిస్తున్నది." అన్నాడు. దూరదృష్టితో ఆలోచించాడు. అంటే దివ్యదృష్టితో. వశిష్టులవారు. నారాయణుడి యొక్క అవతారం నిర్వీర్యం ఇప్పుడే అయిపోతే ధర్మసంస్థాపన జరిగేదెప్పుడు? ధర్మాచరణ జరిగేదెప్పుడు? కనుక నారాయణ స్మృతిని, వైరాగ్య భావాన్ని, వైక్లభ్యాన్ని, నిర్వీర్యమైనటువంటి మానసిక స్థితిని తొలగించాలి అని ఆయనతో కాస్త మాటామాటా కలిపాడు. వాళ్ళిద్దరూ మాటామాటా కలిపితే ముప్పై ఆరు వేల శ్లోకాలైన ఇది యోగవాశిష్టం అయింది. అది. యోగవాశిష్టం పూర్తయిందో లేదో రామభద్రుడు అన్నాడు. "ఓహో ఇదా! గురువర్యా! మనస్సు అంటే. ఓహో! నేను మనసుకు లోబడినందువలన దుఃఖాన్ని అనుభవించాను." అన్నమాట. మనసు యొక్క మర్మం నాకు ఎరుకలోకి వచ్చింది గనుక ఇక నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను అన్నాడు. వశిష్టుల వారికి కావలసింది అదే. అయితే వశిష్టుల వారు హితగురువు, పురోహిత గురువు, రాజగురువు. అంతఃపురంలోనే ఉండాలి. ఇంకా రాజు దశరథ మహారాజే. ఆయనకి నిత్య నైమిత్తికమైనటువంటి అంటే డే టు డే వ్యవహారాలలో సలహా ఇస్తూ ఉండాలి. యజ్ఞయాగాదులలో ఆయనకి ఒక ఉత్సాహం కలిగించాలి. కాబట్టి ఇక వశిష్టుల వారు చేయగలిగినటువంటిది ప్రత్యేకంగా ఏమీ లేదు. సమయంలోనే బోధ గురువైనటువంటి వశిష్టుడు అక్కడ ఉండగానే లోక గురువైనటువంటి విశ్వామిత్రుడు ప్రవేశించాడు. ప్రవేశించి ఏమడిగాడంటే, "ఇదిగో యాగం చేస్తున్నాం, యజ్ఞం చేస్తున్నాం, రావణ సంతతి అంతా యాతన పెడుతున్నది" అని అంటే, "అదేముంది నేను పది రథాలు తోలుకొని ఇప్పుడే బయలుదేరుతాను రండి." అన్నాడు. "నువ్వు నాకు వద్దు." అన్నాడు ఈయన. "మరి ఎవరు, ఎవరు కావాలో వాళ్ళందరినీ ససైన్యంగా మీరు వెళ్ళిపోండి." అన్నాడు విశ్వామిత్రుణ్ణి. "వీళ్ళెవ్వరూ వద్దు నాకు, మీ అబ్బాయి రాముడు కావాలి." అన్నాడు. "ఆ ఒక్కటి తప్ప నువ్వేమైనా పట్టుకెళ్ళమంటావు." అంటాడు దశరథుడు. "నువ్వేమిచ్చినా నాకక్కర్లేదు నీతో సహా, నాకు కావలసింది రాముడే." ఎందుకన్నాడు? తర్వాతగానీ తెలియదు. అరణ్యంలోకి వెళ్ళాడు. [గొంతు సవరించిన శబ్దం] వెళ్ళి బల అతిబల విద్యలు రెండూ కూడా ఉపదేశనం చేసిన తర్వాత ఇక దుష్ట సంహార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. చూడండి, Life is always full of paradoxes and contradictions. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతే అదేం జీవితం? మనం అనుకున్నది కాకుండా జరిగితే అది జీవితం. దాన్ని నిభాయించుకోవాలి. అది. దానికి సాధన కావాలి. అనుకున్నట్లే అయిపోయినాయి అనుకోండి అన్నీ, ఏందెందుకు మనకి? అంతేగా? Time waste. అట్లా అవ్వటం లేదు గనుకనే మేము ఏవో చాలా అనుకుంటున్నాం. కాస్త కాయవయ్యా, కాస్-- చూసుకోవయ్యా అని రోజూ ఆయన్ని అడగటం అన్నమాట. అది. సరే మొట్టమొదట బాణం వేయవలసి వచ్చింది. ఎవరి మీద? తాటకని చంపమన్నాడు. రాముడు అన్నాడు, "క్షత్రియ వంశంలో పుట్టాను నేను. ఇక్ష్వాకు వంశం మాది. దశరథ మహారాజు మా తండ్రి. వచ్చి వచ్చి నేర్చుకున్న బాణ విద్యలన్నీ స్త్రీమూర్తిని చంపటంలోనా?" అని ఒక ప్రశ్నించాడు. "గురువు చెప్పింది చేయటమే నీ పని. నువ్వు నా అధీనం ఇప్పుడు. బాణం వేయి." అన్నాడు. తాటక సంహారం అయిపోయింది. నేలమీద పడిపోయింది తాటక. అప్పుడు విశ్వామిత్రుడు దీర్ఘనిశ్వాస తీసి, "రామచంద్రా! తాటక సంహారంతో నీలో తామస సంహారం అయిపోయింది."నీలో తామస గుణం పూర్ణంగా నశించిపోయింది. తామసం అంటే అవిద్య, అత్యాచారం, అనాచారం, అస్పష్టత. ఇవన్నీ కూడా తామస గుణానికి సంబంధించినవి. యర్థమైనటువంటి ప్రశ్నలు, ఇదంతా తామసమే. కాబట్టి తామసం ఎలా ఉన్నది అంటే తాటక రూపంలో ఉన్నది గనుక, తాటక మరణించింది అంటే రాముడిలో ఉన్న తామస గుణం పోయింది. పోగా ఇంకేం మిగిలింది? రాజస గుణం మిగిలింది. సత్వం ఎలాగో ఉన్నది కాస్తూ కూస్తూ. కరెక్ట్ ఆయనకి మరీ ఎక్కువుంది మనకంటే, కనుక దేవుడయినాడు ఆయన. ఇది అయింది కాస్త ముందుకు తీసుకెళ్లాడు. వాడ్ని, శుభాహుడ్ని కాల్చేశాడు. మారీచుడికి దెబ్బ కొట్టాడు, గాయపరిచాడు కానీ ప్రాణంతో వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడు అంటే మళ్లీ వాడు మాయలేడిగా వేషం వేసుకుని రావాలి. మళ్లీ బంగారు లేడిని చూపించాలి. ఒక భ్రమ కల్పించాలి. తర్వాత వాడు ఆశ్రమాన్ని స్థాపించాలి, మునీంద్రుడు కావాలి. అందుకని మారీచాశ్రమం వచ్చేటటువంటి పరిణామం, transformation రావటానికి ఒకడ్ని మిగిల్చాడు పరమాత్మ. సరే, దాన్ని పక్కనబెడితే, కాస్త ముందుకు వెళ్తున్నారు. అనేక రాళ్లు పడి ఉన్నాయ్ ధూళిధూసరమయంగా. అందులో శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పాదము ప్రాంతం అవుతున్నటువంటి సమయంలో, దానిలో నుంచి ఒక స్త్రీమూర్తి వచ్చింది. ఆమె అహల్య, మనకు తెలుసు. విశ్వామిత్రుడు రాముడి వెనక నించున్నాడు అప్పుడు. తాటక సంహారంలో రాముడు ముందు నడిచాడు. తామసం నశించిన రామభద్రుడి వెనక నించున్నాడు విశ్వామిత్రుడు. అహల్య శాపవిమోచనం కాగానే రాములవారితో విశ్వామిత్రుడు అన్న మాట ఒక్కటే, "రామా! అహల్య శాప విమోచనంతో నీలో ఉన్న రాజస గుణం కూడా నశించిందయ్యా. ఇక మిగిలింది ఏమిటి? సత్వం ఒక్కటే. మరి సత్వం పూర్ణం కావాలి. చాలా భాగం పోయినాయి, రెండు భాగాలు పోయినాయి. ఇది ఎలా పూర్తి కావాలి?" అంటే, అని అనుకుంటుండగానే మిధిలా నగరం నుంచి వార్త వచ్చింది. ఏమనంటే సీతా స్వయంవరం ప్రకటించాడు జనకుడు. కనుక అందరం ఇటునుంచి ఇటే మిధిల వెళ్దాం అని. మిధిలా నగరంలో శివ ధనుర్భంగంతో విష్ణు ధను-- ధనుస్సుని పరశురాముడి నుంచి గ్రహించటంతో, సీతా పరిణయంతో శ్రీరామచంద్రుడు పూర్ణమైనటువంటి సత్వగుణ ప్రధానమైన దైవతా స్వరూపమైనాడు రాముడు. అప్పటివరకు తామస, అందువల్లనే ప్రపంచం దుఃఖారామ అన్నాడు. దేవుడనేం అనవలసిన మాటేనా? మన బోటి వాడంటే చెల్లుతుంది గాని, "ఈ ప్రపంచం అంతా చెడిపోయింది, నేను బాగు చేయలేను, నా అవతారం waste అయిపోయింది" అని అవతారమైనా అంటుందా? అనదు. అనదు కానీ చూస్తూ ఉంటుంది. దాన్ని ఎలా మరమ్మత్తు చేయాలో చేసుకుంటూ వెళుతుంది. రాజస గుణ ప్రధానమైనటువంటిది నేనే చేస్తున్నానన్న భావన ఉండదు. సత్వగుణంలోకి వెళ్ళేప్పటికీ సర్వమూ ఈశ్వర ప్రీతి కోసం జరుగుతాయి గనుక, మూడు గుణాలు పోగొట్టుకోవటం అనేది అవతారమూర్తులకే తప్ప అది దానం ఇవ్వబడేది కాదు, దానం తీసుకునేవాడు లేడు. ఇది దాని పరిష్కారం. సరే, ఇక విచారణ కాస్త పక్కన పెట్టినట్లయితే, మన బలి కథలోకి వద్దాం. బలి కథలో బలి అక్కడ నించున్నాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. గురువుగారున్నారు. ఆయన తరఫున భార్య వచ్చి అడగదలచి వచ్చింది. ప్రహ్లాదుడి తాతగారు వచ్చి మా వాడ్ని కాపాడమన్నారు. అంటూనే ఆయన ఏమన్నాడంటే, "ఇంద్రాది పదవులన్నీ కూడా వీడికి ఒకసారి ఇచ్చింది నువ్వే, మళ్ళీ ఇవాళ వీడి నుంచి transfer చేసి ఇంద్రుడికి ఇస్తున్నది నువ్వే." కాబట్టి దీంట్లో జీవుడు నిస్సహాయుడు, నిమిత్త మాత్రుడు. వీడికి కార్యకలాపాలంటూ ఏమీ లేవు, కర్మకాండలు నిజానికి లేవు. కర్మానుభవం ఒక్కటే తప్ప, కర్మని దాటగలిగిన వాడు కాదు, కర్మని వదుల్చుకోగలిగిన వాడు కాదు, కర్మను వదిలి జగత్తులో జీవించగలిగిన వాడు కాదు. జన్మ ఎత్తి వచ్చాడు గనుక సాధకుడు తన కార్యకలాపాలలో మనస్సును నిమగ్నం చేయాలి. అయితే అనేక కార్యకలాపాల వలన ఏర్పడినటువంటి అనుభవం కానివ్వండి, అది పరమాత్మకు సమర్పించే వెళ్ళాలి. మనం ఇక్కడికి వస్తాం, ఏడు గంటలకు వస్తాం. ఎనిమిదన్నర దాకా ఆయన గురించి కాసేపు మాట్లాడుకొని విచారణ చేసి మనందరం కలిసి మాట్లాడుకుంటాం. అది సత్రయాగం అంటే. మాట్లాడుకున్న తర్వాత గది వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం అంటే, "ఎన్ని మాటలు మాట్లాడావయ్యా" అని ఒకడు. "ఎన్ని మాటలు విన్నానయ్యా" అని మరొకడు. "ఇవన్నీ నీవే కదా" అంటూ ఇక్కడ వదిలిపెట్టి మళ్ళీ మనం ఖాళీగా వెళ్తాం. అంటే ఖాళీగా వస్తాం, మళ్ళీ ఖాళీగా వెళ్తాం. మధ్యలో ఎప్పుడన్నా పొరపాటున, ఇవాళ ఎంత బాగున్నదని మనసుకి అనిపించింది అనుకోండి. కాస్త మనం grade పడిపోయినట్టు లెక్క. ఎప్పుడూ ఒక్కటే అనుకోవాలి. వాక్కు పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు, పరబ్రహ్మంలో కూడా అగ్ని స్వరూపమైనప్పుడు, మూలాధారం అనేటువంటి, గం అనేటువంటి బీజంలో ప్రారంభమై, సత్చక్రాలన్నీ దాటి, గా అనేటువంటి జ్ఞానం ఎక్కడ సప్తజ్ఞాన భూమికలు దాటి సహస్రారంలో నిలకడ చెందుతుందో, గం మూలాధారం వెళ్ళి గాని కలవాలి. కలిస్తే ఏమవుతుంది? గంగ అవుతుంది. అది. గంగా స్వరూపమైనటువంటి, సరస్వతీ ప్రవాహాన్ని పరమేశ్వరుడికి సమర్పించుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అర్థం. కాబట్టి ఇందులో కర్త్రుత్వం ఉన్నదా అంటే ఏమీ లేదు. మరి, మాట్లాడింది మీరే కదా, విన్నది మేమే కదా అంటే, అన్నవాడు వాడే, విన్నవాడు వాడే. కాబట్టి దాంట్లో ఉన్నటువంటివన్నీ పరమాత్మవే గనుక సంపూర్ణ భావన వైపు నడిపిస్తున్నాడు బలి చక్రవర్తిని. అంతరార్థంలోకి చివరగా నవనీత భావనలోకి వెళ్లే ముందుగా కథా కథనాన్ని మనం పూర్ణం చేద్దాం. [గొంతు సవరించిన శబ్దం] బద్ధుండై గురుశాప తప్తుడై, తా బంధువ్రజచ్ఛత్తుడై, సిద్ధైశ్వర్యము కోల్పోయి, విభవక్షీణుండునై, పేదయై బలి. అన్నీ పోగొట్టుకున్నాడు పాపం.శుద్ధత్వంబును సత్యం కరుణయుం సొంపేమియున్ తప్పడు ఉద్భుతుండై యజయాక్షమాయ గెలిచెన్ పుణ్యండు ఇతండు అల్పుడే అన్ని పోగొట్టుకున్నా ఆఖరికి జరుగుతున్న యజ్ఞం కూడా ఆగిపోయింది యజ్ఞం పూర్ణమైందా అంటే యజ్ఞం మధ్యలో వచ్చాడు వామనుడు వామనుడు రాగానే attention అంతా ఆయన మీదకి పోయింది యజ్ఞం గురించి పట్టించుకునేవాళ్ళు లేరు అక్కడేవో చదువుతున్నారు మంత్రాలు అదేం పూర్ణం కావట్లే యజ్ఞం చేసే యాజి లేడక్కడ యాజి భార్య వచ్చి వామనుడి యొక్క పాదాలు కడుగుతున్నది సోమయాజి ఎక్కడున్నాడు సోమి దేవుడు మా పక్కనున్నది నా భర్తను కాపాడమంటున్నది యజ్ఞ హవిస్సులు యజ్ఞభాగాన్ని అందుకున్నటువంటి పరమాత్మ త్రివిక్రమ స్వరూపంగా అక్కడ ఉన్నాడు మళ్ళీ వామనుడయినాడు ఎందుకంటే వామనుడు త్రివిక్రముడై త్రివిక్రముడు గానే ఉండటానికి వీలు లేదు అరవిందుల వారు ఒక మాటంటారు ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా స్థితిలో కూడా ఒక సాధకుడు మహోన్నతమైనటువంటి శిఖర స్థాయికి చేరినా మళ్ళీ మామూలు ప్రపంచంలోకి దిగి రావాలి ఎందుకు రావాలి అంటే తాను అక్కడిదాకా వెళ్ళేదాకా ఏం పొందాడు వెళ్లి ఏమి సాధించాడో విధంగా సాధించవచ్చును అని చెప్పటానికి మళ్ళీ రావాలి అది అంతేగాని నేను ఒక్కడినే సాధించాను అని చెప్పటానికి కాదు ఇలా గనక వెళితే ఇది సాధించవచ్చు ఇదిగో నేను ఇప్పుడే అందుకొని వచ్చాను అని చెప్పటానికి రావాలి కాబట్టి స్థాయిలో ఉన్నటువంటి త్రివిక్రముడు వామనుడయినాడు మళ్ళీ వామన రూపంలో ఉన్నటువంటి వాడికి ప్రహ్లాదుడు చెప్తూ ఉంటే అన్ని పోగొట్టుకొని ఇంత స్థితప్రజ్ఞగా ఉన్నాడేవయ్యా నాకు ఇది కావాలి అది కావాలి రేపటి నుంచి ఏం చేయాలి అని అడగటం లేదే అని అంటున్నాడు [కొట్టు] సవర్ణిమనువు వేళను దేవేంద్రుడగు ఇతండు సవర్ణము అనేటువంటి ఒక కల్పం వస్తుంది అది వచ్చ-- అంటే కాలం వస్తుంది కల్పాంతం వరకు వీడు ఒకచోట ఉండాలి ఎక్కడుండాలో చెప్తా అది అయిన తర్వాత వీడు ఏమవుతాడో తెలుసునా బలి ఇంద్రుడు కాబోతున్నాడు అయి తీరుతాడు ఇతడు దేవేంద్రుండగు ఇతండు దేవతలకు దుర్భావితమగు చోటికి రావించెద అంతమీద రక్షింతు దయన్ ఇంద్రుడయ్యే దాకా నేను కాపాడుకుంటా ఎవరిని బలిని కల్పాంతం వరకు స్వామి చూడండి స్వామి మాటలు మనకు మామూలుగా మహిమలు ఇక కాసేపు వదిలిపెట్టిన ట్లయితే నోట్లో నుంచి వచ్చేది పరమాత్మ మీరు రండి నా దగ్గరికి ఇరవై ఒక్క తరాలు నేను చూసుకుంటానన్నారు స్వామి ఇది కూడా అదే ఏం తేడా లేదు భావం వేరు భాష వేరు కానీ విషయం మాత్రం ఒకటే వ్యాధులు దప్పులు ఒప్పులు బాధలు చెడి విశ్వకర్మ భావి దనుజారాధిత సుతలాలయమున సుతల లోకంలో విశ్వకర్మ సృష్టించినటువంటి సుతల లోకంలోకి వీడు వెళ్తాడు బలి వెళ్ళి ఆదివ్యాధులు ఉండవ్ అంటే జన్మ మళ్ళీ పుట్టటాలు పెరగటాలు నశించటాలు ఉత్పత్తులు విస్తృతాలు ఇవేవీ ఉండవ్ ఉన్నవాడు ఉన్నట్టుగా ఉంటాడు ఎప్పటిదాకా అంటే కల్పం వచ్చేదాకా వచ్చాక ఏమవుతాడయ్యా ఇంద్రుడు అవుతాడు ఎవరికి అవుతాడు దేవతలకు అవుతాడు అయ్యే దాకా ఎవరు చూస్తారో నేను చూసుకుంటా చూసారా అది అనుగ్రహం అంటే వేధిత విభవమున ఉండు ఇతడు అందాకన్ ప్రహ్లాదుడికి చెప్తున్నాడు తాతగారు ఎవరైనా మనవడు పతనమైపోయాడంటే తాతగారికి దుఃఖం ఎక్కువ మనవడికి పెద్ద తెలీదు ఎందుకని అంటే తన వంశాంకురం తన వంశ విస్తరణలో వాడు ఒక భాగం తాను ఎంత సద్భక్తుడో హరిభక్తుడో అలాగే తన మనవడు కూడా ఉండాలి అని కోరుకుంటాడు ప్రహ్లాదుడి మనసంతా దానిమీద ఉన్నది హరిని ఆయన ఎప్పుడూ సిరిని అడిగిన వాడు కాదు హరిని స్థిరమైన కదలని సిరిని అడిగాడు కదలని సిరి ఏంటి అంటే కైవల్యం మోక్షం ఆనందం బ్రహ్మపదం బ్రహ్మానందం పరమ చరమానందం దాన్ని కోరాడు అదే మా వాడికి కూడా నా మనవడికి కూడా ఇవ్వవయ్యా అని అడుగుతున్నాడు హరిని అని బలికి బలిని చూచి అప్పుడు మాటలన్నీ ప్రహ్లాదుడికి చెప్ చెప్పి బలిని చూసి direct గా చెప్తున్నాడు ఏమనంటే శ్రమంబు నీకు ఇంద్రసేన మహారాజా నీ పేరు బలి కాదు అసలు ఇంద్రసేన మహారాజా ఇది పుటపరిచర్యలో ఒక అనుభవం అవుతూ ఉంటుంది ఎట్లా అంటే స్వామి ఒక్కొక్కసారి మన పేరంటే ప్రపంచం మొత్తానికి తెలుసు మనం అనుకుంటున్నాం స్వామికి కూడా అదే తెలుసని పేరుతో కాక ఇంకో పేరుతో పిలుస్తుంటారు ఇలా ఒకసారి జరిగినప్పుడు ఒకాయన అన్నాడు స్వామి మీకు ఫలానా తెలుసు కదా ఆయన పేరు అది కాదని అంటే నీకు ఇప్పటి పేరు తెలుసు నాకు అప్పటి పేరు కూడా తెలుసు నాకు అదే గుర్తు వస్తున్నది అన్నారు అది అట్లా కాబట్టి ఇంద్రసేన మహారాజా అని సంబోధించాడు సర్వవ్యాపకత్వం beyond time and space అంటాం చూడండి అదన్నమాట శ్రమంబు నీకు ఇంద్రసేన మహారాజ వెరవకు భయపడకు మేలు నీ వితరణంబు నువ్వు చేసిన దానం చాలు నీకు మేలు చేస్తుంది వేలుపులందుండి వేడుక పడుదురు లోక ఇంద్రాది దేవతలంతా నువ్విచ్చిన దానం వల్ల వాళ్ళు ఆనందంలో కాసేపు ఉంటారు ఉండని అన్నాడు దుఃఖంబులు ఇడుములు దుర్మరణములు ఆతురతలు ఒప్పులందు ఉండు వారికి నొందవు నీ దగ్గర సుతల లోకంలో నువ్వు ఉన్నప్పుడు దుఃఖం గాని ఆతురత గాని తాపత్రయం గాని ఈషణత్రయాలు గాని ప్రాపంచికమైన అనుభవాలు గాని ఏమీ ఉండవయ్యాసుతలమందుండు నీవు నీ పంపు సేయని నిర్జరారాత్రుల నా చక్రము ఏతెంచి నరకుచుండు చూడండి ఎలాగో వైకుంఠానికి నేను వెళ్తాను నాకు చక్రంతో ఏం పని లేదు అంటే ఇంకోది అయ్యే దాకా ఆయనకు తెలుసు ఎప్పుడు తీయాలో అంతవరకు సుతల లోకంలో ఉన్నటువంటి నిన్ను నా చక్రమే ఆరక్షణమై నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఎవడు అక్కడికి వచ్చినా నరకుచుండు అన్నాడు అంటే ఎప్పుడూ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆరక్షణ చక్రం చాలా పరమాద్భుతమైనటువంటి అభయం ఆయన ఇస్తున్నాడు. ఇంకో మాట చెప్పాడు తర్వాత లోకపాలకులకు లోలుగా వక్కడ అన్యులెంత వారు అతట నిన్ను ఎల్లపొద్దు వచ్చి ఏను రక్షించెద కరుణతోడ నీకు కానవత్తు అది అందుకని ఓణం చేయాలి. ప్రతిరోజూ నేను నిన్ను చూట్టానికి వస్తా నీ దగ్గరికి వస్తా భగవంతుడు ఎవరికైనా ఇటువంటి అభయం ఇచ్చాడండి. దానవీరం వలన కడిగిపోయినాడు ఆయన కడిగిపోయి సుదర్శన చక్రం సుతల లోకంలో పెడతా, నీ జోలికి ఎవడన్నా వచ్చాడా సుదర్శన చక్రం నరికివేస్తుంది అంతేకాదు నేను ప్రతిరోజూ క-- రక్షిస్తూ ఉంటా ఏమో రక్షిస్తానని అంటావు గానీ అంటావేమో కనబడుతూ నిన్ను రక్షిస్తా నీకు దర్శనమిస్తా సుదర్శనమిస్తా రక్షిస్తా ఎంత అభయం దివ్యానుభవం. దానవ దైత్యుల సంగతి పోమిననీ అసుర భావమును తోడ్తో మధ్యాహ్నమున తలగిపోవును మానుగ సుతలమున ఉండుమా మాయాజ్ఞన్. అయితే ఏం జరుగుతుంది మళ్లీ ఇంద్ర పదవి వచ్చేదాకా నీకు అక్కడ ఏం పని శత్రువులు రారు అంటే యుద్ధం లేదు ఆకలి దప్పులు లేవు వ్యాధులు లేవు ఆశలు లేవు దుఃఖాలు లేవు అసలు లేవు లేవు లేవు మరి ఏం చేస్తావ్ నువ్వు ఏం చేయాలి అక్కడ అంటే మళ్ళీ ఇంద్రుడు అయ్యే దాకా కేవలం నా నామస్మరణ చేసుకుంటూ ఉండు చేసుకుంటూ ఉంటే జన్మలో చేసిన అన్ని పాపాలు కరిగిపోతాయి అది. నాస్తే నాస్తే కలౌ నాస్తే హరినామ వినా గతిహి కలియుగంలో యజ్ఞం చేయలేం యాగం చేయలేం ఇగో ఇటువంటివి రోజు చదవలేం రోజూ అర్థం చేసుకోలేం మళ్ళీ ఇది వినాలంటే మనకు convenient time ఉండాలి ప్రపంచం అడ్డుపడుతుంటుంది అప్పుడప్పుడు భాగవతం అడ్డం వస్తుంది. వస్తుంది కదా రావటం లేదా వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి కాబట్టి స్థిరితంగా ఏమీ చేయక్కర్లేదు హరినామ సంకీర్తనం చేసుకో స్మరణ చేసుకుంటూ ఉండు చేస్తే పాపపు కొండలన్నీ కూడా కరిగిపోతాయి తరగిపోతాయి పరమేశ్వరుడు సాక్షాత్తు దర్శనం ఇస్తాన్నాడు కాపాడుతాన్నాడు సుదర్శనాన్ని ఇచ్చాడు సుతల లోకాన్ని ఇచ్చాడు సుతల లోకం కూడా ఎటువంటిది అంటే విశ్వకర్మ తయారు చేసినటువంటిది లోకంలో ఉండమన్నాడు భద్రమైనటువంటి ఒక స్థానాన్ని ఇచ్చాడు ఆయన.
SSSMC · audio

Bhagawata Navaneetham - 45

Home

Bhagawata Navaneetham - 45

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 27:22

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

    Now playing
  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67