Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం ప్రియాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాత్ పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ తన ఇంట గల సర్వ ధనమును ఐదు భాగములుగా విభజించి మన దగ్గర వంద రూపాయలు అంటే దాన్ని ఐదు భాగాలు చేయమన్నాడు. చూడండి ఎంత చక్కని ధర్మశాస్త్రం చెప్తున్నాడు. ఐదు భాగాలలో కామమునకు అంటే ప్రపంచంలో ఏదో వస్తువు కొనుక్కోవాలిగా కూర్చు-కూర్చోటానికి కుర్చీ కావాలి, నిల్చోటానికి వాకిలి కావాలి, ఏదో కావాలి. దానికి ఒక భాగం ఖర్చు పెట్టు. అర్థమునకు ధర్మయశమునకు ధర్మం కోసం చెయ్, కీర్తి కోసం చెయ్. ఆశ్రిత బృందములకు నిన్ను ఆశ్రయించిన వాడి కోసం ఖర్చు పెట్టు. సమత బెట్టునట్టి పురుషుడు ఇందు అందు పూర్ణుడై మోదించు తన్ను మాని చేత తగవు కాదు. తనను మారిన ధర్మం అది చేటవుతుంది గనుక నీకు ఉన్న దాంట్లో ఐదు భాగాలు చేసుకో. ఒక భాగాన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఒక భాగాన్ని లోక రీతికి ఖర్చు పెట్టు, ఒక రీతిని యజ్ఞయాగాదులకు ఖర్చు పెట్టు, కాస్త నీకు ఎక్కడైనా కీర్తి వస్తుంది అంటే దానికో అంటే ఒక మంచి పని చేస్తే మన కీర్తికి కావాల్సినా అక్కర్లేకపోయినా ప్రపంచం గుర్తిస్తుంది, కీర్తిస్తుంది. కాబట్టి కార్యకలాపాలలో పెట్టు అన్నాడు. అని నీకు ఇంకొక మాట చెప్తానయ్యా వినమన్నాడు. నీ మనసులో ఒకటి ఉంది ఇచ్చేద్దామని నీ మనసుకి అనిపించింది కదా! అనుకున్న మనసుతో ఇక ఇవ్వలేనని ఎలా అనుకోగలను అనుకుంటావేమో! వారిజాక్షులందు వైవాహికము లందు ప్రాణవిత్తమాన భంగమందు చక్-చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నగము అధిపా దాని వలన అహము వందడు. ఎప్పుడంటే స్త్రీల విషయంలో గాని వివాహ విషయంలో గాని అంటే ఒక అబద్ధం చెప్పైనా ఒక పెళ్లి, వెయ్యి పెళ్లి, వంద పెళ్లిళ్లు చేయమని అంటే ఏం చెప్తున్నారంటే వంద అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేస్తున్నారు. వాడు అన్నది ఏంటంటే ఒకటి చెప్పి ఎక్కడన్నా వాడి దగ్గర పది ఎకరాలు ఉంది అనుకోండి, పన్నెండు ఎకరాలు ఉందని అబద్ధం చెప్తే వాడికి అవుతుంది వాడి సంతృప్తి. వాడి దగ్గర ఏమీ లేదు. వాడి దగ్గర ను కనిపించే వెయ్యి ఎకరాలు విడువేయనండి అంటాడు వాడు. పాపం వెయ్యి ఎకరాలు విడువేయనని వాడు పెళ్లి చేస్తాడు. అట్లా ఎక్కడ బొంకవచ్చును, ఎక్కడ అబద్ధం చెప్పవచ్చు అంటే అసలు అబద్ధం చెప్పనే కూడదు. కానీ సన్నివేశాలలో గనక చేయవలసి వస్తే ఒక ఆడపిల్ల పెళ్లి విషయంలో గాని లేకపోతే ప్రాణ విత్త మాన భంగమందు ప్రాణం పోయే సమయంలో గాని మన డబ్బు పోయే సమయంలో గాని మన మానం పోయే సమయంలో గాని ఒక చిన్న అబద్ధం ఆడవచ్చుట. అప్పుడు దాని వల్ల ఏం కాదయా అని చెప్తున్నాడు. కులమును రాజ్యమున్ తేజమున్ నిలుపుమీ ఇంకా ఆదేశి, వాడు ఏం విన్నట్టు లేడు. పురోహితుడి వాడు అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాడు శుక్రుడు. చెప్తున్నాడు కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుమీ కుబ్జుండు విశ్వంభరుండు అలతింబోడు తేలిగ్గా పోయేవాడు కాదు వీడు అసలు విశ్వంభరుడు వీడు. త్రివిక్రమ స్పురణ వాడై నిండు బ్రహ్మాండమున్ తలడే మాంపవకొండు నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనమున్ పనుపుమా అర్థిన్ వదాం యోత్తమా ఏం లేదు ఏమి వదలచుకున్నావో ఆయన చేతిలో పెట్టు, దయచేయి అని చెప్పు. మన బలం పోతుంది, దానం పోతుంది, కులం పోతుంది, గుణం పోతుంది, తేజస్సు పోతుంది. మామూలు వాడు అనుకుంటున్నాడా? వీడు త్రివిక్రమావతారుడయ్యా అలా ఇచ్చావంటే చిన్న పురుగుడుసులో గనక ఉంటే తల పెట్టుకోవటానికో, పర్వాలేదు పెట్టుకో అంటే అది నెమ్మదిగా ఆక్రమించి గుడిసెను పడగొట్టిందట మరునాడు పొద్దున. అదిగో అట్లా. అలా చేయొద్దు అంటే వాడు అన్నాడు. బలి అంటే మనీషాయత్తం అనేదానికి ఉదాహరణ. నిజమే! గురువుగారు చెప్పినవన్నీ, పురోహితుడు చెప్తున్నవన్నీ కరెక్టే. నిజమానతిచ్చితివి నీవు మహాత్మకా మహిని గృహస్త ధర్మంబు ఇదియా లోకంలో గృహస్తుడికి ధర్మం ఉంది. గురువుగారు వినండి. అర్థంబు కామంబు యశము వృత్తియు యెయ్యది ప్రార్తింప ఇత్తుననియో అర్థలోభంబున అర్ధిని పొమ్మనుటెట్లు ఆయనేం అడిగాడా? ఇవన్నీ ఇచ్చేసేయ్ మట్టుకు ఏమన్నాడు? అడిగింది మూడడుగులు. ఇవన్నీ ఉన్నాయి, నీకేం కావాలంటే అది తీసుకో అన్నది నేను. కాబట్టి ఆయనకు తెలియకుండానే ఏవివ్వగలను చెప్పాను గనుక పలికి లేదను కంటే పాపమెద్ది అన్నవాడిని నేను. మళ్ళీ ఇవ్వను అన-అన్నా ఎట్టి దుష్కర్మునినే భరించెదగాని సత్యహీనుని మోపజాలననుచు ఎవరన్నదట? భూదేవి అన్నదట. ఎంత పరమ దుర్మార్గుడినైనా నేను నా మీద, నా దగ్గర ఉండటానికి ఒప్పుకుంటా. సత్యహీనుడైన వాడిని మాత్రం నేను ఒక్క నిమిషం నా దగ్గర ఉంచుకోను. వాడిని, వాడికిక్కడ స్థానమే లేదన్నదట భూదేవి. పలుకదే తల్లీ! భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగక చచ్చుకంటే అసలు యుద్ధం ప్రారంభం కాకుండానే నా వల్ల కాదు మీతో కలిసి పోతానన్నట్టు ఉంటుంది.మీరు యుద్ధం చేస్తుంటే యశస్సు అది నేను కూడా పొందుతానన్నట్లు ఉంది అంటే నిర్వీర్యమైనటువంటి ఒక వ్యక్తి యొక్క హీన సంస్కారం అది. యుద్ధంలోకి వెళ్ళాడంటే విజయమో వీరస్వర్గమో. యశస్వినా ఉండాలి మరణమన్నా ఉండాలి. యుద్ధరంగంలో మరణించిన వారికి పుణ్యలోకాలు ఏర్పడతాయి. బలికి పొం-బొంక నిజమున పలుగు కంటే మానధనులకు మద్భద్రంబు మరియు గలదే దాత్రి నిహాలికునకు సుక్షేత్రము బీజములు ఒకట చేకురు బెంగిన్. నాలుంది రైతున్నాడు అది సుక్షేత్రం. క్షేత్రం బానే ఉంది విత్తనాలే బాగలేవు. విత్తనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఉన్న భూమా బీడుభూమి. క్షేత్రము విత్తనము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో బీజం గనక అంటే విత్తనం బాగుండి క్షేత్రం కూడా బాగుంటే పంట బాగా వస్తుంది. ఒట్టి విత్తనాలు వాళ్ళ మీద విసిరితే అన్నా మొలుస్తాయా? మొలవు. కాదు గొప్ప క్షేత్రం ఉంది విత్తనాలు మొలిచే విత్తనాలు కావు అప్పటికే మరణించి ఉన్నాయి దానివలన ప్రయోజనం లేదు. కాబట్టి దాత అనబడేటువంటి వాడికి ఉత్తముడైనటువంటి దాన గ్రహీత దొరకాలి. పాత్రుడు దొరకాలి, ఉదాత్తుడు దొరకాలి. అటువంటి వాడు దొరకటం నా జీవితంలో ఇది గొప్ప ఘట్టం అంటున్నాడు. అని ఇదేదైనా కొత్తగా చెప్తున్నది కాదు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులు ప్రీతిన్ యశఃకాయులై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. భార్గవ వంశంలో పుట్టిన శుకాచార్య గురుదేవా ఎటువంటి వాళ్ళు ఎంతమంది రాజులు పుట్టలేదు ఎంతమంది పోలేదు ఒక్కడి పేరేవడన్నా తలుచుకున్నాడా? ఇగో శిబి ప్రముఖులు దధీచి, శిబి, కర్ణుడు ఇలా ఎటువంటి వాళ్ళున్నారు. వాళ్ళ పేర్లు యశఃకాయులై శరీరాలు పోయినాయి గాని కీర్తి కాయులై ఉన్నారు ఇప్పటికీ అనుకుంటామే. ఇందులో ఒక్కడన్నా ఇక్కడి నుంచి పట్టి కట్టినవాడు ఎవడన్నా ఉన్నాడా? అని ఉడుబెని క్రతువుల వ్రతముల పొడజన జెననట్టి పొడవు పొడవునకు రచై అడిగెనట ననుబోటికి ఇడరాదే మహానుభావ ఇష్టార్థముల్. సరే నువ్వు చెప్పినట్టు వీడు త్రివిక్రముడు, విశ్వంభరుడు, శ్రీమహావిష్ణువు అంటున్నావు కదా ఇక్కడొక చిన్నమాట చెప్తా. నిజంగా వాడు విష్ణువే అనుకుందాం పోనీ వచ్చాడు మా నా వాకిట్లోకి "ఇవ్వు" అని ఇట్లా చేయి చాపాడు. అసలు చెయ్యి ఎటువంటి చెయ్యే నీకు తెలుసా? శుక్రాచార్య గురువుగారు నా పాఠం చెప్పారు గాని ఆయన గురించి ఇంకా తెలుసుకోలేదే. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పారెండ్రపై నూత్రమర్యాదన్ చెందు కరంబు కిందై మీదనాదుంటన్ మెల్గాదే రాజ్యముగిజ్జనున్ సతతమే కాయంబు నాపాయమే. శరీరానికి ఇది అపాయం లేని శరీరమా? అపాయం ఉన్నది గనుక ఇది శరీరం. ఇది ఉండదు. పరమాత్మే అటువంటివాడు శ్రీమహాలక్ష్మితో ఉన్నటువంటి వాడు వచ్చిన ముందు నాకు మూడడుగుల నేల ఇవ్వని చేయి చాపినప్పుడు చేయి మీద ఇవ్వటానికి నా చేయి అయినప్పుడు ఇంతకంటే నాకు ఏం కావాలి అన్నాడు. ఇవ్వాలన్న స్పురణ ఉంది, దానం పట్ల భక్తి ఉన్నది కానీ విష్ణువు చెయ్యి కింద అవుతున్నదన్న సాత్వికాహంకారం కూడా ఉన్నది. అది బలి కథ మనకు నేర్పేది. అతిశయం ఉన్నది ఇంకా, ఇంకా నశించలా అటువంటి విష్ణువే వస్తే ఇంకేం కావాలి ఇచ్చేస్తానంటున్నాడు. నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన, అసలు వీడి రిసాల్వ్ చూడండి. బలి చెప్తున్నాడు "నువ్వొక ఏదో కులం పోతుంది అది పోతుంది అంటున్నావు కదా విను" నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రా నిమ్ము కానిమ్ము కోహరుడైనన్ హరియైన నీరజభవుండు అభ్యాగతుండైన ఔదిరుగన్నేరదు నాదు జిహ్వ విను మాధీవరీయ వేటికిన్. నువ్వేయి చెప్పు గాక నా నాలుక వెనక్కి తిరగదు, నేను మడమ తిప్పను, నా కులం పోనీ నాకు దుర్మరణం సంభవించనీ ఏవి అన్నప్పటికీ కూడా నేను ఇస్తానన్నది మాత్రం ఇచ్చి తీరుతాను. అంతే కాదు నేను ఏదో లోకం పోతే పోయిందంటున్నానని అనుకోకు. మేరువు తలకిందైనను, మేరు పర్వతమే ఒక్కసారి తిరిగి కింద పడ్డప్పటికీ కూడా పారావారెంబులు ఇంకా బారిన సముద్రాలు ఎండిపోయినా, లోలోధారు నిరజమైపోయినా, భూమండలమంతా కూడా పిడికెడు బూడిదైపోయినా దారాధ్వము బద్ధమైన తపక యిత్తున్. దారాధ్వం అంటే దానము అనేటువంటి యజ్ఞం. అధ్వం అంటే యజ్ఞం. నేను దీన్ని యజ్ఞంగా భావించా. అది కావాలి ఇది కావాలని కాదు నేను, ఆయన అడిగాడు నేను ఇస్తానన్నాను ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఎన్నడున్ పరువేడబోడట. చెప్తున్నాడు గురువుగారికి. ఇందాక నుంచి వింటున్నాను ఆయన చెప్పేది ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్లి నాకిది కావాలని అడగలేదట ఆయన. ఏకన్-ఏకలుండట, ఒక్కడేనట. కన్నవారు అన్నదమ్ములైన లేరట. అన్ని విద్యల మూలబోష్ఠిన్నెరింగిన ప్రోడగుజ్జట. అన్ని విద్యలు తెలిసినవాడట, ఒంటివాడట, ఎవ్వరూ లేని వారట, నీకూ నాకూ ఉన్నట్టు అన్నదమ్ములు లేని వారట. చెప్తున్నాడు కదాచేతులొక్కి వసింప చిన్ని పాపని తోసి పుచ్చగా చిత్తముల్లదు సత్తమా! ఇంత చిన్న పిల్లవాడు నా దగ్గరికి వస్తే తోసి నీకేమివ్వను రా వెళ్లిపో అని నేను ఎలా అనగలను? పసివాడు ఏదన్నా అడిగితే మన పిల్లకాకపోయినా పిల్ల వచ్చి పక్క వాళ్ళ అమ్మ అడిగిందని ఇస్తాం మనం. మనకది ఆనందం కలుగుతుంది. అలాగే చిన్నవాడు వీడు వాడు ఎంత చక్కగా చెప్పాడు పాపం ఎవ్వరూ లేని వాడట అని అంటే బ్రతుకవచ్చు గాక బహు బంధనములైన వచ్చు గాక లేమి వచ్చు గాక జీవధనములైన చెడు గాక పడు గాక మాట తిరుగలేరు మానధనులు. మాట తిరగలేరయ్యా అంటున్నాడు. సంవాదం ఇంకా కొనసాగుతుంది. ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే పోతనామాత్యుడు లోకరీతిని మనకు బోధించాడు. దీనిని భయప-- వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్నారు, వాళ్ళు ఇచ్చేశారంటే కథ అయిపోతుంది. కానీ దానిలో ఎంత అందం, ఎంత హృదయం. చూడండి ఇంత దానవరాజైనటువంటి బలి దానం ఇవ్వటం ఒకటి, త్రిజగన శాసనకర్త అయినటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తన వాకిట వచ్చినటువంటి వేళ ఒక స్థాయిలో చెప్తే, రెండో స్థాయిలో అతి చిన్న పిల్లవాడు వచ్చి ఎవ్వరూ లేరు నాకు అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు, నాకు నివాసం లేదు, మూడు అడుగులు ఇస్తే చాలు అంటున్నాడే. వాణ్ని కూడా నేనేమి ఇవ్వనని పంపించేసైనా నా మనసు ఒప్పటం లేదయ్యా అన్నాడు. మానధను-- మానవ ధనాన్ని పోగొట్టుకుని బతకటం ఎందుకు ఇంకా? ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్తూ వామనుడు ఒక గొప్ప దాతను పొందినటువంటి సన్నివేశం ఇది. నవనీతంలో ప్రధానంగా ఇవాళ నిజానికి ఇది ఇంకో గంట చెప్పుకోవలసినటువంటిది. మరి రేపు ఉందిగా, రేపు చెప్పి పూర్ణం చేసుకుందాం. అది త్రివిక్రమావ-అవతారము [ఎవరో కాస్త శబ్దం] గంగావతరణం కంటే, క్షీరసాగర మథనం కంటే, శివధనుర్భంగం కంటే పరమోదాత్తమైనటువంటి ఒక స్థితి అది. కాబట్టి ఇవాళ మథనంలో నుంచి మనకు తెలిసింది ఒకటే, దానం ఇచ్చేవాడు హృదయంతో ఇవ్వాలి. సేవ చేసేవాడు అహంకార మమకారాలు వదిలిపెట్టి చేయాలి. ఎవడు రూపంలో వచ్చి మనల్ని ఎప్పుడు ఏమడుగుతాడో మనకు తెలియదు. వచ్చిన వాడు పరమాత్మే అన్నటువంటి భావనతో గనక చేసినట్లయితే అన్నింటికంటే వాకిట్లోకి వచ్చిన వాడికి ఒక ముద్ద అన్నం గనక పెట్టగలిగినట్లయితే అది ఒక గొప్ప విషయం. మళ్ళీ పునః ఒక మహాత్ముడు మన ఇంట గనక ఒక ముద్ద తిన్నట్లయితే ఒక లక్ష మంది విష్ణువులు ఏకకాలంలో విస్తరి వేసుకుని భోంచేసినంత ఫలితం మనకి, ఆనందం వాళ్ళకి కలుగుతుంది గనుక అన్ని దానాలలో అన్నదానం చాలా గొప్పది. చాలు అనబడేటువంటి దానం అది. చాలు అనబడేటువంటిది మనసుతో రకమైనటువంటి తడబాటు లేకుండా ఆకలి అయిన వాడికి అన్నం, దాహం వచ్చిన వాడికి కాస్త నీళ్ళు, కాస్త ఎప్పుడైనా ప్రపంచంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక చిన్న సహాయం చేయగలిగితే మనకు తోచింది మనం చేయగలిగింది హృదయంతో గనక చేయగలిగినట్లయితే మూడు లోకాలు పోగొట్టుకున్నాడేమో బలిచక్రవర్తి కానీ సర్వలోకాధ్యుడైనటువంటి పరమాత్మను వాడు ఒక్కడు పొందగలిగాడు, ఒక్క దానంతో. దాన వ్రతం అనేటువంటిది దానాన్ని యజ్ఞంగా భావించాడు. మనం కూడా మన అహంకారానికి, మమకారానికి, కీర్తికి కారణం మనం చేసే దానం కాకూడదు. మనం చేసే సేవ మన అహంకార మమకారాలు పెంచేదిగా ఉండకూడదు, తుంచేదిగా ఉండాలి. పరమాత్మ సాన్నిధ్యంలోకి మనం చక్కగా రంగప్రవేశం చేసేటట్లుగా ఉండాలి. భాగవతం పెద్ద చెరుకుగడ ఇది, ఎక్కడ విరిచి తినండి. అంతా తీయనే, అంతా తెలిపేదే, అంతా మాధుర్యమే, అంతా రసస్వరూపమే కాబట్టి ఇక్కడ ఇవాళ నిజానికి హంసానంది ఎవరు పొందారు అని విచారణ. హంసానంది ఇవాళ ఇంకా ఎవరూ పొందలే. శుక్రుడు గాని శుక్రాచార్యుడు గాని వామనుడా ఆయన ఎప్పుడూ నిత్య హంసానంద్. ఆయనకి ఆనందం లేదు, సానందం లేదు, దుఃఖం లేదు. సర్వ రసాలకి అతీతమైనటువంటి పరమాత్మ ఆయన అక్కడ ఉన్నాడు. బలిచక్రవర్తి తనలో ఉన్నటువంటి దానవత్వము, మానవత్వము, దివ్యత్వము ముప్పేటగా కొనసాగింది చివరి పద్యం. కులం చేత వాడు దానవుడు, దానవత్వం. గుణం చేత మానవత్వం. పరమేశ్వరుడి యొక్క స్పర్శ చేత దివ్యత్వం. దీనత్వం ఎవరి దగ్గర ఇవాళ ఉన్నదయ్యా అంటే పరమాత్మ దీనత్వాన్ని ప్రకటించాడు. దీనత్వ, దానవత్వ, మానవత్వ, దివ్యత్వాల యొక్క సమ్మేళనమే ఇవాళ మనం సాధించినటువంటి నవనీతం. నవనీతాన్ని చక్కగా ఆఘ్రాణిస్తూ బలిచక్రవర్తి యొక్క హృదయంలో ఏర్పడినటువంటి చిచ్చడ గ్రంథిలో ఉన్నటువంటి హంసానందిని సత్య సాయి రామనామ సంకీర్తనింగ మనం కొనసాగిద్దాం. సాయిరాం.
SSSMC · audio

Bhagawata Navaneetham - 41

Home

Bhagawata Navaneetham - 41

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 17:24

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

    Now playing
  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67