Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాత్ పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ దేవో భూత్వా దేవం యజేత్ అన్నది వేదం నువ్వు దేవుడు కావటం అంటూ లేదు నువ్వు దేవుడివే నీలో ఉన్న దివ్యత్వాన్ని నువ్వు స్పృశించుకో తడుముకో తాకు అనుభవించు అనుభూతిని చెందు ఆనందాన్ని పొందు బ్రహ్మానందంలో నిలకడ చెందు ఇంతే ఇది దివ్యమైనది ఇది పైకి చెప్పుకోవటానికి తేలికగా steps అనిపించినా సాధన గనక చేయకపోయినట్లయితే భాగవతం ఏడాది విన్నా ముక్తి రాదు ఇందులో ఏదైనా ఒక్కటైనా మనలో ఒక దుర్గుణం definitely గా ఉంటుంది లేకుండా ఉండదు ఏదో ఒకటి ఉంటుంది కోపం అనుకోండి మళ్ళీ ఏడాది నాటికైనా మనకు కోపం అనేది పోగలిగిన స్థాయికి వెళ్లగలిగితే గొప్ప advance గొప్ప transformation అయినట్టుగా మనం అనుకోవాలి అలాగే comparison is the worst trait. ఒక్కొక్క entity ఒక దివ్య భూమికలోకి వచ్చారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పరమాత్మలో నుంచి వచ్చిన వాళ్ళే ఇందులో ఒకరికంటే మరొకరు అధికుడు కావటానికి వీలు లేదు ఒకవేళ అట్లా అనుకున్నట్లయితే ప్రజ్ఞ కూడా మాయగా ఆవేశించినప్పుడు అనుకునే భావం తప్ప మాయని గనక దాటగలిగినట్లయితే ఇవన్నీ ప్రజ్ఞా భూమికలే ఒక్కొక్కరికి ఒక్కో ప్రజ్ఞ ఒకరికి ఉన్నది రెండో వాడికి లేదు రెండో వాడి దగ్గర ఉన్నది రెండో వాడి దగ్గర లేదు కాబట్టి ఒక్కొక్కణ్ణి ఒక్కొక్క entity గా సృష్టించాడు పరమాత్మ ఇదంతా కూడా బోధ చేయటానికై బలి చక్రవర్తి సమయంలో శుక్రాచార్యుడు వచ్చాడు శుక్రాచార్యుడి వైపు చూశాడు పరమాత్మ మాట్లాడాలి కదా ఎవన్నాడో తెలుసునా యజ్ఞం పూర్తిగా కా-కాంచేసేయ్ ఇదిగో నేను వచ్చాను యజ్ఞం ఆగిపోయింది యజ్ఞం ప్రారంభించి దాన్ని మన ఇష్టం వచ్చినట్లుగా ఆపకూడదు కాబట్టి నువ్వెళ్లి వాళ్ళందరినీ పిలిచి complete చేయమన్నాడు అప్పుడు శుక్రాచార్యుడు అన్నాడు చూడండి వీడెవడు నాకు చెప్పటానికి అని అనలా ఎందుకు వాళ్ళలో కూడా పరిణామం వచ్చింది వచ్చి ఏమన్నాడంటే యజ్ఞ భోక్తవైన నీవే యజ్ఞ స్వీకారం చేయటానికి ఉన్నటువంటి నీవే ఇక్కడికి వచ్చిన తర్వాత యజ్ఞం పూర్ణం కాకే ఉంది కాకుండానే నువ్వు వచ్చావంటే యజ్ఞం పెట్టిన ముహూర్తం ఎంత గొప్పదో అని అంటూ పరమాత్మని అది నీ అనుగ్రహం చేత ఇప్పటికే ఇది పావనమైపోయింది పావనమైనటువంటి యజ్ఞగుండంలో హోమాగ్నులన్నీ కూడా ప్రజ్వరిల్లుతున్నాయి ఇక్కడ అగ్ని వాయువు ఇంద్రుడు బ్రహ్మ సరస్వతి అనేకమైనటువంటి దేవీదేవతలంతా కూడా యజ్ఞ ఆవరణం నిండా కాచుకొని ఉన్నారు నీ దర్శనం కోసం అని శుక్రాచార్యుడు తన శిష్యుడికి జరిగినటువంటి అంటే బలికి జరిగినటువంటి ఒక పరాభవంగా భావించిన వాడు దివ్యానుభవం ఇచ్చావయ్యా హరి అని సంకీర్తనం చేశాడు అంటే పరమేశ్వరుడు నాయందే ఉన్నాడు మరొకడి యందు ఉండడు అనటానికి వీల్లేదు ఎవరి యందు ఎట్లా ఉండాలో అట్లాగే ఉంటాడు ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు ఒక్కొక్క రీతి ఒక్కొక్క భావన ఒక్కొక్క potency దానిలో ఉంటాడు గనుక దివ్య భావనా సీమలోకి వెళ్ళటానికి వామన చరిత్రం వామన ఆవిర్భావం త్రివిక్రమ అవతారం నిజానికి వామనుడిది ఆవిర్భావమే అవతారాలు ఏమిటంటే త్రివిక్రమ అవతారం అందుకని త్రి విక్రమ ఏమిటి విక్రమం అంటే సక్రమంగా జీవించమని చెప్పటానికి పరాక్రమాన్ని వెనక్కి గనక నెట్టినట్లయితే అక్రమ అనాచార అస్పష్ట అవిద్యలను సంహారం చేయగలిగితే జీవుడు త్రివిక్రముడవుతాడు అని తనలో ఉన్న మూడు గుణాలని తాను అధిగమించగలడు అని తనలో ఉన్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలు దాటితే కనపడని మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనే నాలుగు ప్లస్ మూడు ఏడు గనక దాటగలిగితే మిగిలింది ఏమిటి అంటే దాని పేరు ఆత్మ అది అఖండము చిద్ఘనము సర్వవ్యాపకము సార్వకాలికము విశ్వజనీనము సర్వ ప్రామాణికము కాబట్టి అటువంటి ఆత్మైక స్థితిలోకి జీవుడు సంచారం చేయాలి బలి కూడా చూడండి ముక్తి ఏమి ఇవ్వలేదు ఆయన మోక్ష సామ్రాజ్యాన్ని ఇవ్వలా ఒక లోకం నుంచి ఇంకో లోకానికి పంపాడు పో ఏమన్నాడు నువ్వు ఇంద్ర పదవిని ఇంకా అనుభవించాలి ఎందుకంటే దానం చేసావుగా వివేక చూడామణి లో శంకర భగవత్పాదులు చెప్పారు మూడు ఆనందాలు ఐహికానందం ఆముష్మికానందం కైవల్యానందం ఐహికానందం ఏమిటంటే వస్తువులు కొనుక్కోవటం ఆనందపట్టం దాచుకోవటం తుడుచుకోవటం అది అది అలా చేస్తూ ఉంటాం ఆముష్మికానందంలో దానం ధర్మం త్యాగం యోగం యాగం ఇవన్నీ చేస్తాం చేస్తాము చేసినందువలన పుణ్యం కాస్త మన దగ్గర balance ఉంటుంది మరి balance అనుభవించాలిగా ఐహికానందంలో చేసిన పాప కర్మల వలన జన్మ ఎత్తాలి ఆముష్మికానందం పేరు మీద చేసిన అనేక కార్యకలాపాల వలన అనేక పుణ్య కార్యకలాపాల వలన దానిని అనుభవించటానికి జన్మ ఎత్తాలి కైవల్యానందాన్ని కావాలనున్న వాడికి మాత్రమే జన్మ రాహిత్యం అన్నాడాయన అది యజ్ఞం చేసి వాడు ముక్తుడయినాడు అనకూడదు రాసేస్తుంటారు అలాగ యజ్ఞం చేస్తే ముక్తి రాదు ఉన్నత స్థితి ఏర్పడుతుంది ఒక ప-పవిత్రత ఏర్పడుతుంది పరిశుద్ధత ఏర్పడుతుంది విస్తృతమైనటువంటి open mind expand అవుతుంది అంతే తప్ప వాడు ముక్తుడైపోయి మళ్ళీ జన్మ రాకుండా ఏం ఉండదు పుణ్యం ఎక్కువ చేశాము అంటే మళ్ళీ పుణ్య ఫలాన్ని అనుభవించటానికి జన్మ ఎత్తి రావాలి పాపం ఎక్కువ చేశామంటే కర్మ ఫలాలు అనుభవించటానికి రావాలి కర్మ ఫలాలు ఎలా ఉంటాయివేడు గంటలో చేయబడితే కాలినట్లుగా పాపం చేస్తే పాపం account పెరుగుతుంది పుణ్యం చేస్తే పుణ్యం account పెరుగుతుంది. పుణ్యం account ఎప్పుడు తరిగిపోతుందయా అంటే bank లో మనం ఒక లక్ష రూపాయలు వేసుకున్నాం ప్రతి నెలా ఒక పది వేలు draw చేసుకుంటూ వచ్చాం ఎప్పుడూ వేసిన వాళ్ళం కాదు అనుకున్నాం. పది నెలలు అయిపోయిన తర్వాత అప్పటి దాకా కూర్చి "రండి రండి" అన్నటువంటి manager గారు "పొండి పొండి" అంటాడు. ఎందుకంటాడయా అంటే balance లేదు అక్కడ draw చేయటానికి ఏమి లేదు. కాబట్టి నిస్సారమైనటువంటి పుణ్య సంపదని మనం పొందుతూ ఉండాలి. అది తరగని నిధిలా ఉంచుకోవాలి. ఎక్కడ నిక్షిప్తం చేయాలి? దానము, ధర్మము, త్యాగము, యోగము, యాగము, సద్దోష్టి, సదాచారం, సమ్యక్ సంకీర్తన, సదాచారం, సద్విద్య వీటన్నింటి ద్వారా పుణ్య ఫలాన్ని నిలబెట్టుకుని ఉన్నట్లయితే కొన్ని జన్మలు ఎత్తినా ఉత్తమ జన్మలు ఎత్తుతాడు. ఆనందాన్ని అనుభవిస్తాడు జీవితానికి ఇక్కడికి వచ్చి కూడా. ఇక కైవల్యానందంలో యజ్ఞయాగాదులు లేవు, పూజా పుష్పాలు లేవు, క్రతువులు లేవు, కార్యకలాపాలు లేవు, విచార ధార లేదు మరి ఏం మిగిలిందయా? ఏమీ లేదు పరమాత్మ నేను ఒక్కటే. తండ్రి తన కొడుకు ఆత్మవై పుత్ర నామాసి అన్నట్టుగా తండ్రి కొడుకులు ఎట్లా అభేదంగా ఉన్నారో, తల్లి బిడ్డలు ఎట్లా అభేదంగా ఉన్నారో, తల్లి లేక బిడ్డలు లేరు బిడ్డలు ఉన్నారు గనుక తల్లి ఉన్నది అని లెక్క backward integration లో. కాబట్టి పరమాత్మ ఉన్నాడు ఆయనలో నుంచి వచ్చాం గనుక మనం పరమాత్మ కంటే భిన్నం కాదనేటువంటి ఒక ఉదాత్త శైలి లోకి జీవుడు వెళ్ళాలి. ఎట్లా? సూర్యుడున్నాడు, సూర్య ఆదిత్య కిరణాలు ఉన్నాయి. కిరణాలు సూర్యుడు ఉన్నాయి గనుక వచ్చినాయి. కిరణాలు ఏమంటున్నాం? సూర్య కిరణాలు అంటున్నాం. వాటిని ఏదో అనటం లేదు. సూర్యుడికి సంబంధించినవి. అలాగే చంద్ర కిరణాలు, సుషుమ్నా కిరణాలు ఉన్నాయి. సుషుమ్నా కిరణాలు చంద్రుని కంటే భిన్నం కాదు. అలాగే అలలు, తుప్పరలు, కెరటాలు సముద్రం కంటే భిన్నం కావు. ఆకారాలు మార్చుకుంటున్నాయి, ఎగురుతున్నాయి, విరుగుతున్నాయి, మళ్ళీ దాంట్లోనే కలుస్తున్నాయి. సంసార జీవితం కూడా అంటే ప్రపంచం కూడా, సంసారం అంటే కుటుంబం కాదు సంసారం అంటే ప్రపంచం. ప్రపంచంలో కలిగే మన అనేకానేకమైనటువంటి స్పందనలు, వికారాలు, భావనలు, పుణ్య భావనలు, దివ్య భావనలు అన్నీ కూడా పరమేశ్వరాయేతం చేయాలి, మనీషాయేతం చేయాలి, జ్ఞానాధిక్యం చేయాలి, పూర్ణమైనటువంటి ఆనంద తారక స్థితిలో మనం సంచారం చేయాలి. బలి ఎటువంటి ఆనందాన్ని పొందాడు? పరమేశ్వరుని మెప్పించాడు. ఆయన ఎంత తప్పిద్దామని ప్రయత్నించినా పరమేశ్వరుడిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ప్రయత్నంలో సర్వమూ త్యాగం చేశాడు. కనుక దీనిలో చిట్టచివరగా సహస్రారం మీద నా-- నీ పాదం మోపమని అడిగాడు. అది విసుగుతో అనలేదు చూడండి విసుగుతో అనలే, "నీ పాదం నా తల మీద పెట్టవయ్యా" అన్నాడు. ఎందుకని అంటే అది అత్యుత్తమమైనటువంటి స్థాయి అది. అక్కడ వినమ్రుడయినాడు. 'నా' అన్నటువంటి వ్యక్తిత్వం లేదు, ఉనికి లేదు, అస్తిత్వం లేదు. నేను బలిని లేదు ఫలానా ఇంద్రసేన మహారాజుని ఏమీ లేదు. అన్నీ పోగా ఏం మిగిలిందంటే శుద్ధ జ్ఞానైక మూర్తిగా బలి నిలబడినటువంటి వేళ పరమేశ్వరుడు అంత త్రివిక్రముడు వామనుడయినాడు. దానం పొందినప్పుడు ఇంత వామనుడు త్రివిక్రముడయినాడు. బలి పరీక్షలో బలి నెగ్గగానే అంతటి త్రివిక్రముడు చిన్నవాడైపోయాడు. పరమేశ్వరుడు సంకోచ వ్యాకోచాలకు రెండు సంకల్పాలు ఆయన చేతిలో ఉంటాయి. He can expand at one point of time, he can also contract at one point of time as required by the situation. సన్నివేశాన్ని బట్టి కుచించుకో గలడు, వ్యాపించగలడు, ఇమడ గలడు, వదల గలడు, పట్టగలడు, పట్టు వీడగలడు. కానీ జీవుడు ఏం చేయాలంటే "పట్టిన పట్టు పట్టనీయ పట్టితివి, పట్టు విడునందాక అట్టే ఉండు" అన్నారు స్వామి. ఎలా పట్టుకున్నావ్? పట్టుకున్నావ్, గురువుని పట్టుకున్నావ్. గురువుని పట్టుకున్నాం మధ్య మధ్యలో ఆయన సరిగ్గా సమయానికి ఏమీ అందుబాటు చేయటం లేదు, సదుపాటు చేయటం లేదు. గురువుని మార్చేసి ఫోటో మారుద్దాం అని అనకూడదు. ఎందుకంటే అనన్య భక్తి ఉండాలి, చిత్త ఏకాగ్ర స్థితి ఉండాలి. పరమేశ్వర మనమే ఉన్నామండి. మన పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేస్తున్నామా? వాళ్ళు పాపం వంద అడిగితే మూడు ఇస్తాం. మూడు ఇస్తేనే వాళ్ళు మురిసిపోతారు. పరమాత్మ కూడా అంతే. మనకు ఏది ఆనందం కలుగుతుందో, దేని వలన మనకు దుఃఖం కలగదో, దేని వలన మన జీవితం అతలాకుతలం కాదో దానిని ఇస్తాడు. ఎంత ఇస్తాడంటే మనం ఎంత మొయ్యగలమో అంత ఇస్తాడు. మొయ్యలేనంత ఇచ్చి మనల్ని పడగొట్టడు ఆయన. అలాగే పరమేశ్వరుడి నుంచి మనం కోరవలసింది ఒక్కటే సంతత సాయిరామ నామ స్మరణాంచితమైన దేహాన్ని కోరుకోవాలి. దేహంలో ఉన్నంత కాలం స్వామి యొక్క సంకీర్తన. స్వామి అంటే జ్ఞాని అని అర్థం. స్వామి సత్య సాయి రూపం కావచ్చు, షిరిడి సాయి రూపం కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. రూపాలు ఏమైతేనేమి దాని నిండా ఉన్నటువంటి చైతన్యాన్ని మనం పరిపూర్ణమైనటువంటి స్థాయిలో అనుభవించాలి. అందుకే ఇరవై నాలుగు వేల పద్యాలు పైగా రాసినటువంటి విశ్వనాథ్ వారు ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, "పద్యోనిర్గమమైన సర్వభావనా సంభారంబు ఎల్ల నైవేద్యం బిచ్చితి నీకు రామచంద్ర ప్రభువా! విశ్వాసమున్ పూనవే" అన్నాడు. "ఆద్యంబగు జీవలక్షణము సంహారంబు కావింపవే! హృద్యంబై చలితోచు నీ దివ్య తేజంబు సారింపంగదే నా గుండియన్" అన్నాడు. ఇదిగోనయ్యా నువ్వు నమ్ముతావో నమ్మవో శుద్ధ చైతన్యం లో నుంచి వచ్చినటువంటి సర్వ భావనలు తయారుచేసి నీకు నైవేద్యం ఇచ్చేశా రామాయణ కల్పవృక్షంగా. నువ్వు నమ్ము. "విశ్వాసమున్ పూనవే" అన్నాడు. మీకు ఎక్కడన్నా అపనమ్మకం ఉన్నా ఇవేళ అక్కర్లే. కానీ ఆద్యంబగు మొట్టమొదట నేను జన్మలో ఎన్ని జన్మలు ఎత్తానో లెక్కే లేదు. ఇప్పటికిట్లా వచ్చా. కానీ నాతో రెండు వస్తూ ఉన్నాయి జీవ లక్షణాలు రెండు అహంకారం, మమకారం. సంహారం చేసేసేయ్ ఇంకా నాకు జన్మ అక్కర్లేదు.అక్కడ లేదంటే ఏం కావాలో అడిగాడు. హృజంబైతని తోచు నీ దివ్య తేజంబు సరింపంగదే నా గుండಿಯన్. నా హృదయ స్థానం మీదికి నీ దివ్యమైన అనుగ్రహ కిరణాలు ప్రసారం చెయ్ అని అడిగాడు. అడిగిన వేళ విశ్వనాథ హృదయం పాడుకున్నది హంసానంది. ఈవేళ బలి సుతల లోకానికి వెళుతున్నప్పుడు పరమేశ్వరుని వీడలేక వీడలేక హంసానంది వైపు వెళ్ళాడు. శుక్రాచార్యుడు యజ్ఞం పూర్తి నీవు చేసినప్పుడే నువ్వు వచ్చినప్పుడే అయిపోయిందయా ఇంకా నేను పూర్తి చేసేది ఏమిటి? లౌకిక రీతిలో అన్ని నీ రాకతో అన్ని అయిపోయినాయి అన్నాడు. వాడిది హంసానంది. అలాగే నా పతిని రక్షించమని అడిగింది వింజావడి, బలి భార్య. అలాగే నువ్వు సుతల లోకంలో నీ భార్యతో సహా చక్క-- భర్తతో ఆనందంగా ఉండమని మాంగల్యాన్ని అనుగ్రహించాడు పరమాత్మ. అంతకంటే ఆమె పాడుకున్నది హంసానంది, శుక్రాచార్యుడి హంసానంది, ఇహ ప్రహ్లాదుడిది అది నిరంతర హంసానంది. ఆయన ఆత్మతోనే పరమాత్మతోనే అనుసంధానం చేసుకున్నాడు గనుక సత్య సాయి భగవానుడు అనుగ్రహించినటువంటి హంసానంది రాగంలో ఇవాళ నిజానికి అష్టమ స్కంధం పూర్ణమైపోతున్న-- అయ్యింది క్షణాన. ఎనిమిది స్కంధాలు తెలియకుండానే అయిపోయినయి. ఎన్నాళ్లో ఎన్నాళ్లో అంటే ఇక రేపు ఏడో రోజు ఏడో రోజు కూడా చెప్పాలి కనుక స్వామి ఇక్కడ ఉన్నారు గనుకే ఇవాళ ముగించవచ్చు. శుక్రాచార్యుడికే exemption ఉందిగా మనకు కూడా ఉంది. కానీ రేపు నవమ స్కంధం ప్రారంభిద్దాం. దానిలో ప్రధానమైనవి రెండే. ఒకటి చాలా చిన్నదైనటువంటి మత్స్యావతారం, పదిహేను నిమిషాలు కూడా పట్టదు. అంబరీషోపాఖ్యానం చాలా ప్రధానమైనది. అంబరీషోపాఖ్యానము ఇక అది భక్తి పారమ్యంలో అతులితమైనటువంటి స్థాయి. అంబరీషుడు తర్వాత మత్స్యావతారం రెండు పూర్తి చేసుకున్నట్లయితే ఇక కృష్ణుడు పుట్టే వేళ. అది ఎప్పుడు? వేసంకాలం పుడతాడా? ఎప్పుడు పుడతాడు? మన ప్రాపంచికమైన కార్యకలాపాలన్నీ చక్కగా ముగించుకొని ఒక నిర్ణయమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమయంలో దశమ స్కంధం పూర్ణం చేసుకుందాం. దశమ ఏకాదశ ద్వాదశ. అయితే ఏకాదశ ద్వాదశాలు కూడా చాలా చిన్నవే. అదంతా తత్వ విచారానికి సంబంధించింది. పరమ ఆనందం కలిగించేటువంటిది దశమ స్కంధం కృష్ణమూలము. నిజానికి అది లలిత స్కంధం కృష్ణమూలము సుఖాలాపాభిరామం. శుకుడు ఆలాపించినటువంటి అభిరామమైనటువంటి ఆలాపన అది. శుకుడు ఆలాపన ఎట్లా ఉంటుంది? అది వేదోనాదం అయి ఉంటుంది గనుక దాని వైపు మనం మళ్ళీ నిర్ణయం రేపు తీసుకుందాం. అప్పటి వరకు హంసానందితో సర్వాత్మకుడైనటువంటి పరమాత్మ సాయికి కైంకర్యం చేద్దాం. సాయిరాం.
SSSMC · audio

Bhagawata Navaneetham - 47

Home

Bhagawata Navaneetham - 47

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 15:01

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

    Now playing
  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67