Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాంస కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ స్వామి డివోటీ గా ఉన్నామని అనుకున్న మరుక్షణం ఆయన డివోటీ లాగానే ఉండాలి. ఆయన మన తండ్రి అని అనుకున్నప్పుడు ఆయన బిడ్డవలె సంచారం చేయాలి. అప్పుడు ప్రపంచం మనకి స్వామికి గౌరవాన్ని ఒక కీర్తిని ఒక భక్తిని ఒక విశ్వాసాన్ని కలిగి మన యందు ఉంటుంది గనుక వీరభద్రుడు ఎలా పుట్టాడు ఇవన్నీ కూడా ఆయన చాలా అందంగా. అసలు అమ్మవారు ఎందుకని యోగాగ్నిని రగుల్చుకున్నది అనేది పోతనామాత్యుడు చాలా అద్భుతంగా చెప్తాడు. ఆమె చితి పేర్చుకోలేదు. యోగాగ్ని రగుల్చుకున్నది. యోగాగ్ని రగుల్చుకున్నది అని విచారణ చేశాం మనం. త్రికూటనాముని స్థిమితే అంతరంగే అని శంకర భగవత్పాదులు చెప్పారని మూలాధారం లోనుంచి యోగాగ్నులు వాయువులన్నీ బయల్దేరి సత్ చక్రాలు దాటి విశుద్ధాన్ని దాటి ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చి శూన్యంలో లయమై అక్కడ సుషుమ్నా నాడి పడగ విప్పి దానిలోకి వెళుతుందని మనం విచారణ చేశాం. విచార ధారకు అనుగుణమైనటువంటి ఒక యోగ ప్రస్థానమే వీరభద్ర విజయం. వీరభద్ర విజయంలో, చెప్పాం కదా సర్వ దిక్కుల వారు చనుచుండిరి. ఎలా వెళ్తున్నారు మనం సర్వ దిక్కుల వారట నాలుగు దిక్కుల నుంచి అంటే తూర్పు ఇంద్రాది దేవతలందరూ కూడా బయల్దేరారు. ఉత్తరంలో ఉన్నటువంటి కుబేర స్థానంలో ఉన్న వారంతా బయల్దేరారు. అలాగే దక్షిణంలో ఉన్నటువంటి యమకింకరులంతా కూడా బయల్దేరారు. ఎందుకంటే యజ్ఞం జరిగినప్పుడు అక్కడ జరిగేటువంటి వినాశనం ఏదైతే ఉన్నదో వినియోగింపబడిన ప్రతి వస్తువుని కూడా స్వక్షేత్రానికి చేర్చడానికి వీళ్ళు కూడా కాపాలికులు ఉండాలి. కాపాలికులంతా కూడా బయల్దేరారు. అలాగే పశ్చిమ దిశలో నుంచి పరిపూర్ణమైనటువంటి జ్ఞానమూర్తులంతా కూడా బయల్దేరారు. అంటే జ్ఞానులు, విజ్ఞానులు, తపస్సులు, తాత్వికులు, ముముక్షువులు, దేవీదేవతా స్వరూపాలు, సమూహాలు సకుటుంబంగా భార్యా సమేతంగా వాళ్ళంతా కూడా దక్ష ప్రజాపతి దానికి వెళుతూ ఉన్నారు. తన రారు నవరత్న సాటంక రోచులు చెకుటద్ధములతో చెలిమి చేసి వాళ్ళు వెళుతుంటే చెవులకి వేసుకున్నటువంటి లోలాకులున్నాయే వాటి యొక్క కాంతి చెక్కల మీద పడి ప్రతిఫలిస్తున్నాయిట. ఒకటికి రెండుగా కనిపిస్తున్నాయిట. సాటంక అంటే చెవి కమ్మ. మహనీయ తపనీయ పద గజ్జెతులు అంప భాగంబులు ఆదరింప అంచిత చినిచినాంబర ప్రభలతో మేఖలా కాంతులు మేలమాడ కట్టుకున్నటువంటి చీరలు చీరల మీద వేసుకున్నటువంటి వడ్డాణాలు, ఇవన్నీ కూడా చీరతో వడ్డాణమా వడ్డాణంతో చీరా. ఎందుకని వెళుతున్నారు దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి కాబట్టి సాలంకృతమైనటువంటి స్త్రీమూర్తులంతా వెళుతున్నారు. చంచల సారంగ చారు విలోచన ప్రభలు నల్దిక్కుల అభికొనగ మించు వేడుక భద్రుసమేతలగుచు మానితంబుగ దివ్యవిమాన యానలగుచు ఆకాశ పధాన అరుగుచున్న ఖచర గంధర్వ కిన్నరాంగనల చూచి అప్పటికే విమానాలున్నాయి. ఇప్పటికే కాదు ఎవరి విమానం వాళ్ళు ఎక్కెళ్లారట. ఎవరి విమానంలో వాళ్ళు ఎలా వెళుతున్నారంటే సర్వ దిక్కులు చూస్తూ వెళుతున్నారట. ఎందుకని వెలుతు చూస్తున్నారు అంటే వాళ్ళంతా ఒక్కొక్క దిక్కులో ఉండటానికి అలవాటు పడ్డవారు. ఇవాళ మొట్టమొదటి సారిగా శూన్యంలో ఆకాశంలోకి వచ్చారు. నాలుగు దిక్కులు చూసుకుంటూ ప్రకృతిని ఆకాశ గమనాన్ని అంతా కూడా ఆనందిస్తూ నెమ్మదిగా వెళుతున్నారు. ఆకాశమే కాంతివంతమైపోయింది అంటాడు పోతన పరమాద్భుతంగా. వెళుతూ ఉంటే ఊరికే వెళతారా? జాతరకి గాని వేడుకకి గాని మాట్లాడకుండా మౌనంగా వెళ్ళేవాడు ఎవడు? మౌనంగా వెళ్ళరు. అట్లా ఉంది, ఇట్లా ఉంది, ఆహా! ఎంత బాగుంది అని ఒకడు, ఏం బాగాలేదు అని రెండో వాడు. మాటలు మాటల పోగులతో వెళుతున్నారట. ముదమున తన్మపోద్భవ విభూతి కనంబున నవ్య కామినుల్ పరువులు వట్టి భూషణ విభాసితలై నిజనాభయుక్తులై మదకలహంస పాండుర సమంచిత దివ్యవిమాన యానలై అదే చనుచున్నవారు కనుము అభ్యపదంబున నీలకంధరా. అరెగోనయ్యా అలా వెళుతున్నారు నన్ను అడుగుతావేంటి? వాళ్ళంతా మన వాకిట్లో నుంచి పోతుంటే ఏమవుతుందో చెప్పమంటావేంటి నువ్వు చూడు. నీలకంధరా కాస్త కళ్ళు తెరవవయ్యా అని అమ్మవారు అంటే అని అనఘా విను లోకంబున లోకం లోకరీతి చేస్తున్నది అమ్మవారు అయ్యవారితో. అమ్మవారైనా అయ్యవారికి అలాగే చెప్పాలి. ఏదే రకంగా చేస్తే ఆయన వినుడుగా? అనఘా విను లోకంబున జనకుని గేహమున కలుగు సకల సుఖంబుల్ కనయలు అవి సంప్రీతిన్ కనుగొనక ఏరీతి నిలుచు కాయము అభవా. నీకంటే పుట్టుక లేదు గానీ నాకు పుట్టుకుందిగా.శివా! నీకు తండ్రి ఎవడో నాకు తెలీదు, అభవా! అది శబ్దం ప్రయోగం అనమాట. నీకు పుట్టుక లేదు కాబట్టి నీకు పుట్టిల్లు లేదు. నీవు అమ్మా నాన్న ఎవరంటే నువ్వే చెప్పలేవు. అందరికీ నేను నాన్న అని చెబుతున్నావు గానీ నువ్వెవడివి? మీ నాయన ఎవడు అంటే లేదు నీకు కథ లేదు మాకుంది. మేము ఎక్కడ పుట్టాం అంటే మా తండ్రి హిమోత్పర్వతరాజు. ఆయనకు ఇల్లు, ఆవాసం, కొండో ఏదో ఒకటి ఉంది ఆయనకి. అంటే నాకు అడ్రస్ ఉంది, డ్రెస్ కూడా ఉంది. నీకవి రెండూ లేవు అన్నాడు అది. కాబట్టి నా అడ్రస్ ఏంటంటే మా నాన్న ఇల్లు లోకంలో. తండ్రి ఇచ్చేటువంటి సుఖాన్ని పొందటానికి బిడ్డలు అక్కడికి చేరుతారయా. అందుకే అందరూ వెళుతున్నారు అన్నది. కాబట్టి నా యందు ప్రసన్నుడవై నా మనో అభిష్టం ఏంటంటే మా తండ్రి చేసే యాగం చూసి వస్తా అని పంపించు అని అడిగింది. కళ్యాణీ! నీ మాట కడు నొప్పు. నువ్వు చెప్పింది perfect. నువ్వేం తప్పు చెప్పలే. అంటే సరే అనకుండా ఉండటానికి ఇది ముందు, ముందు కాళ్ళ బంధనం. చెప్పినవన్నీ రైతే కానీ అంటాడు. ఈయన కూడా అదే పద్ధతిలో, కళ్యాణీ! నీ మాట కడు నొప్పు. బంధువుల్ పిలవకుండి నన్ సంప్రీతించనుదు రంటివి. ఇదియు లెస్సయైనను దేహాభిమాన మదమున అమర్షణను కడగి ఆరోపిత ఘనకోప దృష్టులు కారేని పోదగు దాని వినుము. వినుత విద్యా తపో విత్తవయో రూపకులములు సుజనులకు గుణంబు ఇవియ కుజనుల యెడ దోషహేతంబులై వివేకంబు చెరచు మహాత్ములైన వారి మాహాత్మ్యము ఆత్మగర్వమున చేసి జడులు పొడగాన జాడరు జలజనేత్రా. నువ్వు చెప్పినవన్నీ ఎవరి గురించి? ఎటువంటి తండ్రి గురించి? హిమోత్పర్వతరాజు గురించి చెప్పు, ఒప్పుకుంటా. మళ్ళీ దక్ష ప్రజాపతి కూతురుగా ఉన్నావంటున్నావే! దక్ష ప్రజాపతి వేరు, హిమవంతుడు వేరు. అంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని తండ్రులందు పుణ్య తండ్రులు వేరయా? అందరూ తండ్రులే, జన్మిస్తారు. కానీ తండ్రి ఎవడు? విచారణ చేసుకోవాలి. గుణవంతుడా? కులవంతుడా? భాగ్యవంతుడా? ప్రేమ పూరితమైనటువంటి హృదయం ఉన్నవాడా లేడా? అంతేగాని జన్మ ఇచ్చాడు గనుక తండ్రి కావటానికి వీల్లేదంటున్నాడు శివుడు. జన్మ ఇచ్చిన ప్రతి వాడు తండ్రే గనక అయితే ప్రతి బిడ్డ కూడా తన తండ్రి యింట ఆనందాన్ని పొందాలి. అట్లా లేదు కదా! వాళ్ళంతా కుమతులు కదా అంటున్నాడు. అని కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగ వారు అనాదరమున బొమ్మలు ముడివడంగ భూరి రోషాక్షులై చూతురు అదియు గాక సుదతి వినుము. నిన్ను పిలిచాడా? దక్ష ప్రజాపతి పిలవలే. రారమ్మని ఏం అనలేదు. ఆహ్వానం లేదు. కానీ నువ్వు వెళ్ళినట్లయితే, నువ్వెందుకు వచ్చావు? అని వాడు కనుబొమ్మలు ముడుస్తాడు. వాడి సంగతి నాకు తెలుసు. నిన్ను పిలిచానా అంటాడు. అంతే కాదు విను అని సమదిరిప్పు ప్రయుక్త పటు పాయక జజ్జితంగుడయ్యు దుఃఖమున తరంగి నిద్రగనుగాని కృశింపడు మానవుండు. యమా! హో భుమా! వినుము ఇష్ట బాంధవ దురుప్తులు మర్మములంట నాట చిత్తమున అహర్నిశంబు పరితాపము నుందు కృశించు ఇప్పుడున్. పిలవని ఆహ్వానం వందని చోటికి గనక మనం వెళ్ళినా, వీడు ఎందుకు వచ్చాడని చూసినా, తామస గుణం చేత ఒక మాట గనక పొరపాటున ఏదన్నా మనల్ని అన్నా, అన్నవాడు మరిచిపోతాడు, అనిపించుకున్నవాడు జీవితాంతం కృశించిపోతాడు. నువ్వు చెప్తున్న లోకరీతి ఉన్నదో నేను కూడా ఉమా! నీకు కూడా నేను ఇదే చెప్తున్నాను అన్నాడు. ఆవిడకు ఒక మాట అన్నది. నువ్వేమన్నా అనుకో, ఒక్కసారికి ఏమనద్దు సీతాదేవి కూడా అదే అంది. రామా! నిన్నేమన్నా అడిగానా? ఏదన్నా ఇది నాకు కావాలి అని నోరు తెరిచి ఎప్పుడన్నా అడిగానా? ఒక్క బంగారు నీడిని తప్ప అన్నది. అది చాలు. ఏది అడగకూడదో అది అడిగింది. ఇక్కడ కూడా అమ్మవారు, అంటే చూడండి యోగం అనుభవించవలసి వచ్చినప్పుడు మన బుద్ధి అటు వైపు నడిపిస్తుంది. కర్మానుసారంగా బుద్ధే నడిపిస్తుంది. ఇటా అటా, ఇక్కడికి వెళ్దామా, అక్కడికి వెళ్దామా అనుకుంటాం, ఇక్కడికి వస్తాం. కాసేపు ఏదో స్వామి సంగతులు మాట్లాడుకొని వెళ్ళిపోతాం. అప్పుడొక బానే ఉంటుంది. రోజూ స్వామి సంగతులు ఇరవై మూడు దాకా ఉంది. ఇవాళ వెళ్ళకపోతే ఏమనుకున్నావనుకోండి. అనుకొని ఇంకో చోటికి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళాక ఏమనిపిస్తుందంటే, హాయిగా అక్కడికి వెళ్తేనే బావుండేదేమో యాతనంతా పడ్డామనిపిస్తుంది. అమ్మవారి పరిస్థితి కూడా లోకంలో ఉన్న స్త్రీ కంటే భిన్నంగా లేదు. కుపితాత్మయై స్వస్వమాన రహితు ఆత్మ దేహంబు సగమిచ్చినట్టి భవుని విడిచి మూఢాత్మయగుచు అం వెలది చనియే జనకు చూచటి వేడుక సందడింప. మనస్సులో నిన్న కతుడుడు చెప్పాడు. కోరిక ఒకటి పుట్టుతూ ఉండగానే దానిని సంహారం చేయమన్నాడు. లేకపోతే కోరిక ఆశగా మారుతుంది. ఆశ దురాశగా మారుతుంది. దురాశ దుర్దశ వైపు దారి తీస్తుంది. సగభాగం ఇచ్చినటువంటి పరమాత్మని కూడా, పరమేశ్వరుడిని కూడా అమ్మవారు వదిలిపెట్టి ఎంత చెప్పినా ఈయన వినటం లేదు.అయినా నేను వెళ్తున్నాను అని చెప్పి ఆవిడ బయలుదేరితే కరుణాపూర్ణ సుహాబ్ధి అయినటువంటి పరమేశ్వరుడు అమ్మవారిని ఒంటరిగా పంపిస్తాడా? పోనీ అయ్యవారికి చెప్పాలా భటులు వాళ్ళంతా ఉన్నారుగా ప్రమద గణాలు అన్నీ ఉన్నాయి అనేకమంది దేవతా స్వరూపాలన్నీ నిత్యమూ సదాశివ దర్శనం కోసం నించొని ఉంటాయి. ఎందుకంటే సదాశివుడు eternal విశ్వేశ్వరుడు ప్రపంచం ఉన్నంత కాలం ఉంటే ఆయన పేరు విశ్వేశ్వరుడు. విశ్వానికి ఈశుడు విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుడు ఇక్కడ manifest అయి అభివ్యక్తమైనప్పుడు విశ్వేశ్వరుడు ఎట్లా అయినాడు? అభివ్యక్తం కాకుండా యోగ మార్గంలో గనక అనుభవంలోకి తెచ్చుకుంటే ఆయన పేరు సదాశివుడు. అన్ని అవస్థల్లో ఉంటాడు గనక. మానిని తనుచుండ మణిమన్మదాది సహస్ర సంఖ్యాక రుద్రానుచరులు వేలకు వేలుగా రుద్ర అనుచరులంతా అమ్మవారి వెనక వెళ్తున్నారట position లోకి వచ్చేశారు వాళ్ళు అమ్మవారు ఒక్కతే వెళ్ళటానికి వీల్లేదు గనక. యక్షులు నిర్భయులై వృషభేంద్రుడి మున్నిడుకొనుచు సముద్రిత గాల్చు కందు కాంబుజ శారికా తాళవృంత దర్పణ ధవళాత పత్ర ప్రసూన మాలికా సౌవర్ణమణి విభూషణ ఘనసారస సూర్యకా చందనాది వస్తువులు కొంచు నేగి అమ్మవారు వెళ్తున్నది అంటే కస్తూరి చందనం ఆవిడ ఆభరణాలు ఆవిడ మణులు ఆవిడకున్న చీరలు అన్నీ కూడా వస్తువులన్నీ పట్టుకొని వీళ్ళంతా వెళుతూ వస్తువులు కొంచు నేగి సర్వాణి కదిసి అమ్మవారిని దగ్గరకు కదిసి సమీపించి శంఖ దుందుభి వేణు నిస్వనములప్ప శంఖము దుందుభి వేణువు అనేటువంటి మూడు నాదాలు వినిపించేట్లుగా మానితంబైన వృషభేంద్ర యాన చేసి అమ్మవారిని వృషభం తీసుకొని వచ్చారు అమ్మా దీని మీద ఇవాళ ఎక్కు దీని మీద బయలుదేరు నువ్వు సింహవాహినివని మాకు తెలుసు అయినా ఇవాళ శివుడేం రావటం లేదు అంటే ఆయన కారు free గా ఉంది దీన్ని ఎక్కమన్నాడు అప్పుడు వృష-వృషభేంద్ర యాన చేసి అది చేసి యజ్ఞ భూమాగ్గులై అగ్ని నరిగి అరిగి యజ్ఞం ఎక్కడ జరుగుతున్నదో భూమార్గం వైపు నెమ్మదిగా నడిచి వెళుతుంటే యజ్ఞశాల ప్రవేశించింది అమ్మవారు. అమ్మవారు ఒక్కతే కనబడుతూ ఉన్నదట. యజ్ఞ ప్రాంగణంలో రుద్రులంతా కనపడట్లే అదృశ్య రూపంగా ఉన్నారు. దృశ్య రూపంగా ఎవరున్నారంటే ఒక్క అమ్మవారే. ఎందుకని అమ్మవారు అంటే దక్షుడు ఇంట ప్రవేశించినప్పుడే ఆమె అదృశ్య రూపాన్ని వదిలిపెట్టాలి వ్యక్త రూపం కావాలి. వ్యక్త రూపం వస్తేనే సతీదేవి వచ్చిందని వాళ్ళకి ఒక ఊహ కలుగుతుంది. చనుదెంచిన మగువను జననియు సోదరులు తక్క సభగల జనులెల్లను దక్షులవల భయమున అణయమునప్పుడు ఆదరింప రేయిరి మహాత్మ తల్లి చూడలేదట. సోదరీమణులు దగ్గర తీయలేదట. ఆమెకు సోదరులున్నారు వాళ్ళు దగ్గర తీయలేదు అంతెందుకు అసలు సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్క దక్షుడి యొక్క భయం వలన వాళ్ళు ఈమెను పలకరించలేదు. ఎవరైనా మన ఇంటికి వస్తే ఎంత ఆదరించాలి ఎంత దగ్గర తీయాలి వచ్చారా అనాలి ఎట్లా ఉన్నారని అనాలి కుశల ప్రశ్నలు వెయ్యాలి అవేం లేవసలు ఆమెని పట్టించుకోలేదట. ఇక జన కూడా అటువైపు తల కూడా తిప్పి చూడలేదట వస్తే వచ్చింది పోతే పోయిందని కూర్చున్నాడు వాడు. అవమానం భరించలేక పాపం వాళ్ళందరినీ కథ అంతా ఉందిగా పద్యాలు మనకక్కర్లా ఒక్కొక్కళ్ళని అడిగింది ఎందుకని నాతో మాట్లాడటం లేదు. ఎంత ఆయాసం ఎంత ప్రయాణం చేసి వచ్చాను నేను. అందునా ఎందుకు వచ్చాను ఇదేం వేడుకా జాతరా కాదే. నా తండ్రి వాజపేయ యజ్ఞం చేస్తుంటే యజ్ఞ ఫలాన్ని పంపించడానికి నేను రావలసిన అవసరం లేదా? లేదనుకున్నాడు దక్షుడు కావాలనుకున్నది అమ్మవారు. సరే ఎవరూ ఏం ఉలకలేదు ఏం పలకలేదు ఎందుకంటే అప్పటికే దక్ష ప్రజాపతి అనేకమైనటువంటి శక్తుల చేత మదోన్మతుడై ఉన్నాడు వాడు. బ్రహ్మనీ విష్ణువునీ కూడా మీరు రండి అని దగ్గరికి వెళ్లి పిలిచిన వాడు కాదు కబురు పెట్టాడు వాళ్ళకి కబురు పెడితే వస్తారు వాళ్ళు అని వాడి ఊహ. కానీ వాళ్ళు కూడా అలా వెళ్లారు ఎందుకనంటే శివుడు సంహారకాండ ఆయన పని గనక ఆయన చూసుకుంటారు వరాలు ఇచ్చేవాడు వేరు వరాలు పుచ్చుకొని తుంచేసేవాడు వేరు గనక యజ్ఞ సభా మధ్యంలో దక్షుడు దగ్గరగా ఉండగా తండ్రిని సమీపించి మాట అడిగింది. ఎప్పటికైనా పలకరిస్తావా? అని అడిగింది దక్షుడు చలించలే. చలించకుండా పెడముఖంగా ఉన్నాడట వాడు పెడముఖం వేయించి నుంచున్నాడట. నుంచున్నాడు యజ్ఞం కొనసాగించండి అంటున్నాడు. ఎవరో వస్తే మన యజ్ఞం ఆగుతుందా ముహూర్తం ప్రకారం ప్రారంభించమంటున్నాడు. కామ క్రోధాది శత్రు విఘాతియగు సతీదేవి ఉదన్ముఖియై జలంబులాచనంబుజేసి సుచియై మౌనంబు ధరించి చూడండి ఎప్పుడైతే ఎవరూ పలకరించలేదో ఆమెను మౌనం ఆశ్రయించింది. అక్కడున్నటువంటి పుణ్య జలాలు చేతిలో తీసుకున్నది ఆచమనం చేసింది శుచి చేసుకున్నది అంటే ఆమెకు శుచి లేదా అమ్మవారు కదా అంటే దక్షుడుయం దక్షుడి వంటి యజ్ఞ వాటిలో ప్రవేశించినందువలన అమ్మవారికి ఆభరణ దోషం ఏర్పడింది అది. అందుకనే మనం కూడా అన్ని చోట్లకి వెళ్ళకూడదు.ఆవరణ దోషం, విక్షేప దోషం, మల దోషం అని మూడు ఉంటాయి జీవుడికి. ప్రధానంగా ఆవరణ దోషం. ఆవరణ దోషంలో స్వామిని గురించినటువంటి అనేక మంచి విషయాలు వినబడేటువంటి చోటకి గనక మనం వెళితే మన మనస్సు ఆనందతాండవం చేస్తుంది. ఓహో! స్వామిని గురించి ఇలా కూడా అనుకోవచ్చు కదా, ఇంతవరకు తోచలేదే, ఇట్లా ఉపాసన చేద్దాం అని మనస్సు స్వామి వైపు వెళుతుంది. ఆవరణ మంచిదే, చండాలు బానే ఉంది, మైకులు బానే ఉంది, అంతా బానే ఉంది అక్కడ స్వామి లేరు. ఏమైనా ఆనందం కలుగుతుందా? కలగదు మనకి. కలగనటువంటి దక్ష ప్రజాపతి ఆవరణంలోకి వచ్చింది గనక ఆవిడకి ఏకకాలంలో ఆవరణ దోషం, మల దోషం, విక్షే మల అంటే మాలిన్యం, భావ మాలిన్యం. ఎవరూ పలకరించరు అంతా తిరస్కారమే, అంతా లోచూపు, అంతా కిందచూపు, ఎవరూ పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆమె జగజ్జనని, మామూలు ఆవిడ కాదు వెళ్ళింది. అయినా సరే పరిస్థితి అది. బుధన్ ముఖియై జలంబులా శమనంబు జేసి సుచియై మౌనము ధరించి, మాటలు ఇంకా అయిపోయినాయి. ఇంకా ఆవిడ వెళ్ళి పలకరించడానికి మనుషులే లేరక్కడ. చితాసనయై భూమియందు అసీనయగుచు, నేల మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నది. యోగమార్గంబున శరీరత్యాగము చేయ తలంచి, యోగ మార్గంలో శరీరాన్ని వదిలిపెట్టేద్దామనుకుంది. "ఏముంది ఒకవేళ తండ్రి పలకరించలేదు, తోబుట్టువులు మాట్లాడలేదు, ఏదో నిరాదరించారు ప్రాణాలు పోగొట్టుకుంటామా?" ఆమె అన్నది, "ఈ శరీరాన్ని నేను వదిలి పెడతాను" ఎందుకు అయిందో అమ్మ పరమ రహస్యం చెప్తాది అది నవనీతం. ఎందుకని అమ్మవారు శపిస్తే దక్షుడు ఒక నిమిషంలో పోయేవాడు. శపించదు కారణం, వాడు ఎంత దుర్మార్గుడైనా జన్మకు కారణమైన తండ్రి అయినాడు. రెండు, అమ్మవారు యజ్ఞాన్ని ప్రోద్బలం చేసి నిలబెడుతుందే తప్ప యజ్ఞ వాటికని దేహంతో ధ్వంసం చేయదు, రెండు. మూడవది, తన వెనక వచ్చినటువంటి రుద్ర గణాలన్నీ కూడా ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళని వెనక-- ఒక్కసారి ఒక order వేసినట్లయితే దక్ష వాటికంతా అటూ ఇటూ కకావికలం చేయగలరు వాళ్ళు. వాళ్ళ అవసరం తనకి లేదు. మరి శరీరాన్ని ఎలా వదిలిపెట్టాలి? ఏదో కుప్పకూలిపోయి గుండె ఆగిపోయి మరణించినట్టు మరణించడానికి వీల్లేదు. యోగ మార్గాలున్నాయి. యోగ మార్గంలో శరీరాన్ని వదిలిపెట్టినటువంటి వారు మన కాలంలో మనకి తెలిసి కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని. కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని తన చుట్టూ ఉన్నటువంటి వారికి అందరికీ చెప్పాడు, "రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకి నేను శరీరం వదిలి పెడుతున్నా, కపాల భేదనం జరగబోతున్నది. నేను యోగ మార్గంలో శరీరాన్ని ఇక్కడ వదిలి పెడుతున్నాను" అన్నాడు. అంత గట్టివాడేనని నమ్మకం ఉన్నా వాళ్ళు practical గా ఎప్పుడూ చూసిన వాళ్ళు కారు గనుక వాళ్ళంతా గడియారాలు సరి చూసుకుని పెట్టుకున్నారు. ములక మంచం మీద పద్మాసన స్థితుడై యోగ మార్గంలో మూలాధారంలో ఉన్నటువంటి వాయువును ఒక్కసారి బిగదీసి పైకి తీసి మనం చెప్పుకున్న మూల బంధనం, జాలంధర బంధనం, ఓజ్జాన బంధనం, మూడు బంధనాలు చేశాడు ఆయన. మూల బంధం అంటే మూలాధారం నుంచి నడుము వరకు ఉన్నటువంటి, నాభి వరకు ఉన్నటువంటిది మూల బంధం. గాలిని బంధించాడు. గాలిని ఎప్పుడైతే బంధిస్తామో physics ప్రకారం అది వేడెక్కుతుంది. వేడెక్కిన దాన్ని ఇంకా బిగಿಯాలాగాడు. దానిని ఓజ్జాన బంధనం చేశాడు. ఓజ్జాన బంధనం చేసి బిగించిన దానిని జాలంధర బంధనం చేశాడు విశుద్ధ చక్రం దాకా. అక్కడిదాకా జాలంధర బంధనం అయి- అయిపోగానే మూడు బంధనాలు కాగానే ఇక్కడ ఉన్నటువంటి వేడి గాలి సుషుమ్నా అనేటువంటి పడగను తాకింది. ఇది యోగ విశేషం. యోగ మార్గంలోకి అట్లా శరీరాన్ని ఒక్కసారి కుంభింపజేస్తాను, ఒక్కసారి బిగబట్టినట్లయితే ప్రాణం పోతుంది అని ఆమె నిర్ణయించుకుంది. యోగ మార్గం ద్వారా గనక శరీరాన్ని వదిలిపెట్టినట్లయితే శరీరం సుమారుగా ఇరవై ఒక్క రోజులు ప్రాణం వదిలిపెట్టినప్పుడు ఎట్లా ఉంటుందో, ఇరవై ఒకటవ రోజు కూడా అట్లాగే ఉంటుంది. అలా ఉన్నటువంటి వారు ఇద్దరు మళ్ళీ, అందులో అరవింద యోగి ఒకరు. అరవింద యోగి కూడా శరీరాన్ని అలాగే యోగ నిద్రలో ధారణ ముద్రలో దాన్ని వదిలిపెట్టారు. అలాగే పరమహంస యోగానంద. పరమహంస యోగానంద క్రితం రోజు సాయంకాలం British Ambassador తో మాట్లాడారు ఆయన. చాలా విషయాలు మాట్లాడారు. He was like a, a blossom of flower. వికాసమానం చెందినటువంటి సహస్ర దళాలతో ఉన్నటువంటి ఒక పద్మంలా ఉన్నాడు పరమహంస యోగానంద. మర్నాడు Ambassador చెప్పారు, "Again at the same time I will come and meet you sir" అన్నాడు. మళ్ళీ ఇదే సమయానికి రేపొచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని అన్నాడు. For you there is tomorrow, for this body there is no tomorrow. That's it. correct గా time క్రితం రోజున కలిశారో అలాగే ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత ఆయనది కూడా ఇరవై ఒక్క రోజు శరీరంలో ఉన్న పరిమళాలు ఇంకా మామూలుగా ఉన్న స్థాయి కంటే గొప్పగా ఉన్నాయి. ఇది మన చరిత్రలో అటువంటి వాళ్ళని కూడా మనం చక్కగా స్మరించుకోవాలి. ఎందుకంటే యోగశాస్త్రం ఎవడికి-- యోగం అంటే ఆసనాలు అయిపోయినాయి. యోగా, యోగా master అంటే వాడు మూడు ఆసనాలు నేర్పేసి మూడు వేలు కాజేస్తున్నాడు. అది, అంతే. అది కాదు యోగం అంటే అంతరంగమైన సాధన. దానిలో మూలాధారం నుంచి సహస్రారం దాకా వాడు ప్రయాణం చేయాలి. దానికి అధ్యాత్మ విద్య ఉండాలి. ఏమో నియమాలన్నీ ఉండాలి. నిన్న చెప్పుకున్నవన్నీ ఉన్నట్లయితే అధ్యాత్మ plus యోగ విద్య, శాస్త్రం. రెండూ కలిస్తే సాంఖ్య అని చెప్పుకున్నాం. సాంఖ్య విద్యలో వాడు పూర్ణుడు కావాలి గనుక అమ్మవారికేముంది యోగ విద్య, ఆమె-ఆమే అసలు యోగం.
SSSMC · audio

Bhagawata Navaneetham - 25

Home

Bhagawata Navaneetham - 25

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 24:35

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

    Now playing
  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67