No transcript for this section.
పరీక్షిత్ మహారాజు మనలాగానే ఒక చిన్న ఆలోచన ఆయన మనస్సులో అలా కలిగింది. వైకుంఠం అట్లు వేలు అట్లా చూపించి హరి హరి హరి అన్నాడే, ఆయనే ఈ కృష్ణుడు అంటున్నాడే ఎట్లా? ఆయన ఈ రూపం ఎలా తీసుకొని వచ్చాడు? వచ్చి వచ్చి మా ఇంట్లో ఎలా వచ్చాడు? మా వాళ్ళతో ఎలా ఉన్నాడు అంటే పరిష్కారం చెప్తున్నాడు. జననం బందుట లేని ఈశ్వరుండు తా జన్మించుటెల్లన్ విరోధి నిరాసార్థము వీత కర్ముడగు ఆ దేవుండు కర్మ ప్రవర్తనుడవుటెల్ల చరాచర ప్రకట భూత శ్రేణులన్ కర్మవర్తనులన్ చేయదలంచి కాక కలవే దైత్యారికిన్ కర్మముల్. ఈ పద్యం సాయి భక్తుడైన ప్రతి వాడు కంఠస్తం చేసుకోవాల్సిన పద్యం. ఎందుకంటే పుట్టువే ఎరగనటువంటి ఒక పరమాత్మ రూపెత్తి వచ్చాడు అంటే, ఎందుకు అంటే ఈ చరాచరమైనటువంటి ప్రపంచాన్ని తనతో పాటు నడిపించటానికి ఈ జన్మ ఎత్తుకొచ్చాడు ఆయన. అది. వీత కర్ముడు, కర్మలు లేవసలు ఆయనకి. వీగిపోయినయి, ఎప్పుడో పోయినయి. అసలు కర్మే లేనివాడు. వీత కర్ముడైన దేవుండు. ఆయనకేం కర్మలున్నాయి ఇక్కడ? కానీ కర్మానుష్టానం చేస్తున్నాడాయన. హాస్పిటల్స్ కట్టిస్తున్నారు, water project అంటున్నారు, ఓ యాభై ప్రోగ్రామ్లు వేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి ఎవరి కోసమంటే పరమాత్మ ఈ జగత్తుని అధ్యాత్మ వాతావరణంలో కూర్చోబెట్టి మన కర్మలన్నింటినీ కూడా జ్ఞానయోగంతో సమన్వయం చేయటానికని ఈ programs అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. కనుకనే లేకపోయినట్లయితే సంకల్ప మాత్రం చేత, కేవలం తన అనుగ్రహం చేత, ఒక మహిమా వైభవం చేత ఈ సర్వ జగత్తు యొక్క భవరోగాన్ని పోగొట్టగలిగిన పరమాత్మ అయ్యుండి, కర్మలు లేనివాడయ్యుండి, అసలు పుట్టువే ఎరుగని వాడయ్యుండి ముందు పుట్టువెత్తి, పుట్టువెత్తి కర్మలు లేనివాడయ్యుండి కర్మలు చేసి, ఎందుకట అంటే కర్మ ప్రవర్తనుడవుటెల్ల చరాచర ప్రకట భూత శ్రేణులను కర్మవర్తనులన్ చేయదలంచి గాక మనందరి చేత ఈ సత్కర్మలు చేయించాలి అని తప్ప కలవే దైత్యారికిన్ కర్మముల్. అసలు ఆయనకు కర్మలున్నాయా? ఏదో మంచి ఆత్ చేయించాలి అని కదా. అనే అనగానే ఓహో ఇందువల్లనా అని పరీక్షిత్, పరీక్షిత్ మహారాజు ఎవరో కాదు మనమే. అటు సందేహం, దేహం ఉంది కాబట్టి సందేహం తప్పదు. డోలాయమానమైనటువంటి పరిస్థితి. ఈ కృష్ణుడే హరియా? సాక్షాత్తు శుకదేవుడు చెప్తున్నా అది నిజమేనా? మరి అట్లా అయితే ఇట్లా ఎందుకు వచ్చాడు? ఇన్ని కర్మలు ఎందుకు చేశాడు? పాండవులతో ఆ కష్టాలన్నీ తాను కూడా వెంబడి ఉండి ఎందుకు అనుభవించాడు? వాళ్ళ చేత ఎందుకు అనుభవింప చేయించాడు? ఏముంది ఒక్క నిమిషంలో వంద మంది కౌరవుల్ని సంహారం చేయాలంటే ఆయనకి పెద్ద పని కాదు. కానీ ఆ పని ఆయనది కాదు. ఆ పని ఎవరిదంటే జన్మ ఎత్తిన జీవుడిది గనుక వాడికి ఒక మనోబలాన్ని, ఒక ఆంతరంగికమైనటువంటి స్థైర్యాన్ని, ఒక బుద్ధి విశేషాన్ని, ఆత్మ శక్తిని వాటన్నింటినీ కూడా ప్రచోదితం చేయాలి గనుక పరమాత్మ వీరిని ఎన్నుకొని, అంటే పరమాత్మ ఈ ప్రపంచాన్ని మరమ్మత్తు చేయాలి అంటే కోటానుకోట్ల మంది ఆయనకి అక్కర్లేదు. ఐదుగురు పాండవులు చాలు. ఒక ద్రౌపది, ఒక కుంతి. ఆ ఏడుగురు ఆయన team. అంతే కదా. ఆ ఏడుగురితో సర్వ ప్రపంచాన్ని ఆయన దాటించగలడు, మార్చగలడు. అలాగే ఏ మార్చగలడు కూడా. ఆ ఏం మార్చినా, ఏ మార్చినా ఆయన చేతిలోనే ఉన్నది గనుక ఘటనా ఘటన సమర్ధుడు అని పరీక్షిత్ మహారాజు మనసుకు రాగానే ఆ క్షణంలో పరీక్షిత్ మహారాజుకు ఒక చిన్న దర్శనం అయిందట. దర్శనాలు అవుతాయి. మనం పరమాత్మను గురించి గనుక తీవ్ర విచారణలో ఉన్నట్లయితే బయటకు మనమేం చెప్పక్కర్లే. విశ్వనాథవారు రామాయణ కల్పవృక్షంలో మనకి బోధించారు ఓ మాట. ఎన్ని సార్లు నేను ఆ రాముణ్ణి చూశానో అన్నాడాయన. ఆ ఎన్ని సార్లు చూశానో అన్నప్పుడల్లా అందంగా రాశాడు పద్యం. కదా. ఆ రాసినప్పుడల్లా ఆయనే రాశాడని కూడా చెప్పాడు చివరికి. లోపలుండి రాశాడన్నాడు. సరే ఆయన సహజమైన జీవ లక్షణం ఒకటుంది గనుక రాస్తే రాశాడు, ఉండి అయిపోయిందిగా పోడేం అన్నాడు. నా లోపల ఇంకా ఉన్నాడేంటి ఇక్కడ పని అయిపోయినయి ఇంకా వీడడేమిటన్నాడు. నన్నా రాముడు వీడడు, భయం భయ్యడు అన్నాడు. ఇంకా ఎందుకున్నాడు అని అట్లా పరీక్షిత్ మహారాజుకి కంటిన్ కంటి చూశాడట. కంటిన్ కంటి భవాబ్ధి దాటగ కంటి ఆశ్రిత రక్షకున్ కంటి యోగ జనంబు డెంద ముంగెంటి చుట్టముగంటి ముక్కంటి కింకనరాణి ఎక్కటి కంటి తామర కంటి చేకొంటి ముక్తి విధానమున్ తలకొంటి సౌఖ్యములందగన్. ఆ పరమేశ్వరుడు, ఈశ్వరుడు కూడా దర్శించటానికి వీలు లేనంత పరమాత్మని తేజోమయంగా నేనిప్పుడే చూశాను అన్నాడు పరీక్షిత్ మహారాజు. శుకదేవుడి యొక్క బోధ దృశ్యమానం. అది పరమాద్భుతమైన శ్రవణ దృశ్యం. ఆ శ్రవణ దృశ్యంలో పరీక్షిత్ మహారాజుకి పరమాత్మ యొక్క తేజోమయమైన దర్శనం కలిగింది. ఆ కలిగినప్పుడు చూశాను చూశాను మోక్ష ద్వారం దాటించేవాణ్ణి, పుండరీక నయనుణ్ణి చూశాను అని ఒక ఆనంద ఉమ్మత్తుడైనటువంటి భావంతో చెప్తూ అన్యకథా లాపములు అహర్నిశములన్ పఠించి, అంటే పరమేశ్వరుడి కథ గాని అనేక పుస్తకాలు చదివి, దాంట్లో పరమాత్మ గురించి ఏం లేదట. ఎన్ని books చదివావంటే nearly five thousand అంటాడు. చాలా వీడు voracious reader అని మనం అంటాం. అవి విష్ణుమూర్తి ఎక్కడ వాడు ఎలా అవి ఇంకా చదవలేదంట. అవి అరవై రావాలి. అరవై వచ్చాక అప్పుడు ముట్టుకుంటా ఇప్పుడు కాదు. ఇప్పుడన్నీ నేను మిగతావన్నీ చదువుతున్నానన్నాడు. అన్యకథానులాపములు అహర్నిశమున్ పఠించి చాల మాలిన్యము ఆత్మశోభన విలీనత నుండు మదీజిహ్వ సౌజన్యము నుండె నేడు హరి సద్గుణ దివ్య కథా అమృతంబు సన్మాన్య చరిత్రమైన గడు మద్గురు వాక్య పదంబు చందగన్ గురు స్థానంలో ఉన్న ఓ శుకదేవుడా నీవు చెప్పిన ఈ నాలుగు మాటలతో అన్య కథలు చదివి చదివి మాలిన్యంతో ఉన్నటువంటి నా నాలుక ఈరోజు హరినామ సంకీర్తనంతో పావన భావనామయం అయిపోయింది పుణ్య సంకీర్తనం చేసుకున్నాను అయ్యా అంతా నీ దయవల్ల అన్నాడు అందుకనే రామాయణ కల్పవృక్షంలో వారిని వాళ్ళ తండ్రిగారు ఓ మాటన్నాడు వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితివని పించుకో వృధాయాసము గాక కటుకథలు ఐహికమా పరమాయటన్న ఆ తండ్రి ఆజ్ఞయును జీవుని వేదన రెండు నేకమై నా సకలోహ సనాథ నాథ కథం రచించెదన్ సకలోహాలు పెట్టి ఆ రాముని గురించి రాస్తాను అన్నాడు ఎందుకంటే మా నాన్నగారు పిలిచి రాస్తే రాముని గురించి రాయరా ఎందుకు ఇవన్నీ రాస్తున్నావ్ అన్నాడు కనుక రాముని గురించి రాస్తాను అన్నాడు ఎట్లా నా సంస్కార విశేషం చేత రాస్తాను అన్నాడు పరీక్షిత్ మహారాజు కూడా అలాగే చేసుకోమని చెప్తున్నాడు చెప్తూ నరునకు ఆత్మదేహజ గుణంబుల బాపగనోపు పంకజోదర చరణారవింద మహిత స్పుట భక్తియు ఏం కావాలి నరుడు అంటే సాధకుడు మన బోటి వారికి ఏం కావాలి అంటే శ్రీమన్నారాయణ పద పద్మాధీన చేతస్కమైనటువంటి ఒక మనస్సు కావాలి దానిని గురించే నిరంతరము ఆలోచించగలిగిన ఒక మనస్సు మనకు ఏర్పడాలి కాలక్షేపానికి కాక కాలం మనకు నిక్షేపంగా అక్కరకు వచ్చేట్లుగా చేసుకోవటానికి ఆ పరమాత్మ యొక్క దివ్య నామం మనకు కావాలి ఇది ఒకటి ఇంద్రియములు ఈశ్వర విషయంబులైన మది సంచిత నిశ్చల తత్వమైన సో ఇంద్రియాలు చరాచరంగా ఉన్నాయి చలచలితంగా ఉన్నాయి వాటి అధీనమైనటువంటి ఒక మనస్సు వాటిని పరిగెత్తిస్తున్నది అవి పరిగెత్తటానికి అలవాటు పడ్డాయి ఒక్క మనస్సును గనుక నియంత్రించగలిగితే ఆ ఇంద్రియాలు కూడా నియంత్రింపబడినప్పుడు నియంత్రింపబడినటువంటి ఇంద్రియాలతో జితేంద్రియమైనటువంటి జీవితం గనుక గడపటం ప్రారంభిస్తే అప్పుడు నా మనస్సు మనీషా యత్తమవుతుంది ఆ మనీషా స్థిరమైనటువంటి జ్ఞానాధిక్యమైనటువంటి జ్ఞానానికి అతీతమైనటువంటి ఒక స్థాయిలో నా మనస్సు నిలబడుతుంది కదా దానికి మళ్ళీ మూలం ఏమిటంటే ఇప్పటిదాకా విన్న ఈ హరిగుణ నామ సంకీర్తనం కదా అనుకుంటూ సరసిజ నేత్రు కీర్తనమి చాలు విపద్దశలం జయింపగన్ దశలు ఏర్పడతాయి మనకి దిశలు ఎనిమిదే ఆ ఎనిమిదిని మళ్ళీ గనుక సంక్షిప్తం చేసినట్లయితే దిశలు నాలుగే తూర్పు పడమర ఓదానికొకటి కుదరదు ఇది ఉత్తరం అది దక్షిణం అంటాం కదా వీళ్ళకి ఇప్పుడే పెళ్లయింది ఉత్తరం దక్షిణానికి పెళ్లయింది అంటాం తూర్పు పడమరకి పెళ్లయింది అంటాం అంటే కలవవు అవి ఆ కలవకుండా ఉన్నాయి గాని కలిసి ఉండాలి నాలుగు దిక్కులు దీనికి ప్రాకారం ఏర్పడింది గనుక ఈ ప్రాకారంలోనే అనేక దశలు ఏర్పడతాయి మనకి యోగ దశలు వియోగ దశలు నియోగ దశలు ఆయోగ దశలు అనేకమైనటువంటి దశలు ఆ అన్ని దశలలోనూ ఉత్తమోత్తమ దశ ఏది అంటే యోగ దశ ఎవరితో కూడి స్వామి చెప్పారు ప్రపంచంతో కూడి ఉన్నవన్నీ ఒకరోజు ఊడిపోయేవే అన్నారు ఎంత అస్తతెలుగులో చెప్పారో చూడండి కూడి ఉన్నవన్నీ ఊడిపోయేవే మరి ఊడకుండా ఉండి ఎప్పుడూ కూడి ఉండేది దేంతో అంటే ఒక్క పరమాత్మ తోనే ఆ పరమాత్మతో గనుక కూడి ఉన్నట్లయితే మన ఇంద్రియాలు మన మనస్సు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇదిగో ఈ మనస్సు ఈ పదకొండు తర్వాత ఐదు పంచభూతాలు పదకొండు ఐదు పదహారు ఇవన్నీ కూడా ఈ పదహారు తత్వాలు అన్నీ కూడి ఉన్నాయి ఒకచోట నిలబడి ఉంటాయి గనుక ఆ పరమేశ్వరుడి యొక్క కీర్తనము చాలు అని ఒక ఆలోచనకు వచ్చాడు వచ్చి పరమయోగీంద్రులు యోగమార్గముల భావంబందు ఏ నీ మనోహర రూపంబు తలచి యోగంలో కూర్చుంటాడు కళ్ళు మూసుకున్నాడు అన్నారు ఏం మనిషి శరీరం కదలటం లేదు పర్ఫెక్ట్ గా కూర్చున్నాడు దేన్ని దర్శిస్తున్నావు అయ్యా అంటే పరమాత్మ దర్శనం కోసం స్థిమితంగా ఉన్నాను అన్నాడు అటువంటి వాడు ఎవడంటే పరమయోగీంద్రుడు పరమయోగీంద్రులు యోగమార్గముల భావంబందు ఏ నీ మనోహర రూపంబు తలంచి ఏ గుణగణ జ్ఞానంబు కావింతురో అప్పురుష శ్రేష్ఠి సర్వ పరిగ్రహంబునకు నై పొల్పార తజ్జ్ఞాన గోచర మూర్తిన్ ధరియంతు గాదే పరమోత్సాహుండనై మాధవా! నీ యొక్క స్వరూపం తెలిసింది నీ యొక్క గుణాలు తెలిసినయి ఇదిగో ఈ గురు స్థానంలో ఉన్న శుకదేవుడి యొక్క బోధ వర్ణన ఓహో! ఇటువంటి సుందర రూపం కోసమా ఎందుకని ఇందాక పద్యంలో ఆ కంటిన్ కంటి అనే పద్యంలో కంటిన్ చుట్టమున్ అన్నాడు కృష్ణ పరమాత్మకి ఒక చుట్టం చుట్టరిక ఉంది ఆయనకి ఆ చుట్టంగా కూడా చూశాను అన్నాడు కాబట్టి చూడవలసిన దానిని చూశాను ఏ పరమయోగీంద్రులంతా కూడా ఏ దురి-దర్శనం కోసం ఇంత తహతహలాడుతున్నారో దానికోసమే నా మనస్సుని ఆయత్తం చేసుకుంటాను అయ్యా అటువంటి మాధవాన్ని ప్రమాణం చేస్తున్నాడు ఆ ప్రమాణం ఎవరికి చేస్తున్నాడంటే దృగ్గోచరము కాని దృక్కులకు కంటికి కనపడని కానీ హృదయానికి మాత్రమే కనపడేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి రమణీయ మూర్తి దర్శనం చేస్తున్నాడు ఆ బొమ్మను చూసుకుంటున్నాడు అర్రయ్యా! అంటే విచారం చేయగా ఇలా అనుకుంటూ ఉండగా నిష్క్రామ ధర్ములైనట్టి భక్తులందు నీవు ప్రసన్నుడవైన రీతికొలిచిన ప్రతి వాడికి భగవంతుడు దొరకడన్నాడు ఇక్కడ నిష్కామంతో ఆయనకి దగ్గరికి వెళ్ళాలి అంట ఇందాక నుంచి మనం అనుకున్నది అదే ఆయన్ని ఏమి అడగొద్దు ఎందుకంటే స్వామిది ఒక English quotation ఉంది ఆ quotation ఏంటంటే ఒక interview room లో quotation చాలా పాతది ఒక ఎనభై ఐదు ఎనభై ఆరు ప్రాంతంలో "If you ask for something it is yours it is given" నువ్వు ఏదైనా అడిగితే అది ఇవ్వబడుతుంది "If you don't ask everything is yours" నువ్వు అడక్కపోయినావా అంతా నీదే "When everything is yours there is nothing to ask" అన్నారు స్వామి ఆ everything is ours stage మనం వెళ్ళాలి అంటే అసలు ఇచ్చాడు ఏం తక్కువ చేశాడు ఆయన అనుకోవాలి అంతా తక్కువే చేశాడు అనుకునే కంటే అసలు ఏం తక్కువ చేశాడు నాకు జన్మించాడు పరమాత్మని గురించి ఆలోచన చేసే ఒక చిన్న బుద్ధి ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు నలుగురిలో కూర్చుని సత్సంగం చేసుకునేటువంటి ఒక మహా యోగాన్ని ఇచ్చాడు ఇంకా ఇంతకంటే ఏం కావాలి అనుకున్నాం అనుకోండి ఆయనకి ఆనందం అట్లా కాకుండా రోజూ ఆయన దగ్గర పట్టణానికి ఒక దండ వేసేసి నువ్వు అది చేస్తానన్నావు ఇది చేస్తానన్నావు నువ్వు చేయలేదు వాడికి చేశావు నాకు చేయలేదు అంటూ ఉంటే ఆయన అంటాడు నువ్వు వద్దు నీ దండ వద్దు అని ఆ పట్టణంలో నుంచి ఆయన పారిపోతాడు అది కాబట్టి మనం ఏం అడగకూడదు ఆయన్ని అడగనప్పుడు ఏం చేస్తాడంటే అడక్కపోతే పరమాత్మ మనకు ఏం కావాలో ఇస్తాడు అడిగితే మనకు ఏం కావాలో తెచ్చుకోగలుగుతాం అందుకే అడిగి పొందే దాని పేరు వరం అడగకుండా పొందేది కరుణ మనకు వరాలక్కర్లా కరుణ కావాలి కరుణ ఉంటే వరాలన్నీ పక్కనే ఒక వరసగా నుంచుంటాయి అవి వరసలో ఉంటాయి గనుకే వరాలవి కదా వరాలు ఎప్పుడు తీరుతాయంటే వరసలో ఉన్న కోరిక ఒక్కోటి తీరుతున్న కొద్ది వరం ప్రారంభం అవుతుంది కాబట్టి కరుణ నిశ్చలము అందుకనే "స్వాంగారంభిత నిత్యసత్య కరుణా సాకార సాకారమా" అన్నాం స్వామిని అసలు ఆ కరుణే ఆ స్వామి యొక్క దేహంగా కనిపిస్తున్నదే అది ఊరికే అంగీ ఆ జుట్టు అదంతా వదిలేసేయండి ఏమున్నది ఆయన ప్రవాహం అంటే చిరునవ్వులో కంటి చూపులో అభయంలో నడకలో కదలికలో మెదలికలో చూడని తనంలో చూసిన తనంలో కరుణా ప్రవాహమే నిండి ఉన్న తప్ప అన్యం లేదు చూస్తేనే కరుణ ఉన్నట్టా చూడక్కర్లా ఏం చూడాలి ఆయన మనల్ని అనుకోవాలా అనుకోవాలి చూడాలి చూడాలి అనుకోవాలి ఆయన అనుకున్న కొద్ది చూడకుండా వెళుతూ ఉంటారు అది సాయి తత్వం మనం ఈ పూట స్వామి చూడరు అని మీరు నిర్ణయించుకోండి మీ దగ్గరకు వచ్చి హాయిగా నుంచుంటారు ఆ స్వామి ఆడుకునే ఒక చిన్న ఆట ఆయనకు కూడా relief కావాలి కదా ఎవరితో ఆడుకుంటారు ఆయన మన బోటి వాళ్ళతోనే ఆ సద్భక్తి ఎక్కడ ఉన్నదో అదే చెప్తున్నాడు "అరయ నిష్కామ ధన్ములైనట్టి భక్తులందు నీవు ప్రసన్నుడవైన రీతి హృదయముల బద్ధకాములయ్యనయు దేవగణంబులందు ప్రసన్నత కలుగవీవు" ఎవరు నిన్ను కోరుకుంటారో వారికి చెందవయ్యా నువ్వు ఎవరు నిన్ను కోరుకోరు వాణ్ణి నువ్వు కోరి ఏరి దగ్గర తీసుకుంటావు ఇది నీ తత్వం కదా అంటున్నాడు కాబట్టి పరీక్షిత్ మహారాజు అనుభవించిన శ్రీకృష్ణ తత్వానికి ఈ వేళ మనం అనుభవిస్తున్న సత్య సాయి తత్వానికి ఏం భిన్నం లేదు కదా ఇది ఇదే అది అదే "హరినిజదాస కోటికి గుహాశయుడై రమియించు" ఆయన ఎక్కడ ఉన్నాడు గుహాశయుడై ఉన్నాడట గుహ అంటే హృద్గుహ "అహమాత్మా గుడాకేశ" నీ ఆత్మ యందు నేనున్నాను అన్నాడు పరమాత్మ అలాగే ఇక్కడ కూడా హరి నిజదాస కోటికి అందరు దాసకోటి కాదు నిజదాస కోటికి నిజమైనటువంటి భక్తుడికి గుహాశయుడై రమియించు ఆయనకు ఆనందం ఎక్కడ అంటే సద్భక్తుడి హృదయంలోనే ఆయన ఆనందంగా ఉండగలడు "అట్టి సత్పురుషులకు ఇష్ట వస్తు పరిపూర్ణ మనోరథ సిద్ధి కల్గు" ఎప్పుడైతే పరమాత్మ మన యందు ఉన్నాడో మన మనోరధలన్నీ ఈడేరుతూ ఉంటే మనం అడగక్కర్లే ఎందుకంటే ఆయన మన వాకిట్లో ఉన్నారుగా మన ఇంట్లో ఉన్నారు కదా "అస్థిరమగుచున్న ముక్తియును సిద్ధముగా చెలువారు" కనపడి కనపడనట్లుగా అంది అందనట్లుగా చేతికి వచ్చి జారిపోతున్నట్లుగా ఉన్నటువంటి ముక్తి కూడా పరమాత్మని గనక మన హృదయ స్థానంలో నిలబెట్టుకున్నట్లయితే ఆ ముక్తి కూడా స్థిమితపడుతుంది అంతే కాదు "చెలువారు అన్నాస్థిరతర తుచ్ఛ సౌఖ్యములు సేకురుటల్ మరి చెప్ప నేతికిన్" కాన కాబట్టి ఏం చేయాలి అంటే చివరగా శుకుడు పరీక్షిత్ మహారాజుకి ఇచ్చినటువంటి ఒక final advice ఒకటి ఇచ్చాడు చిట్టచివరగా ఇహ ఎక్కడిదాకా అయింది అయిపోతుంది "సరోజలోచను జగత్సవనీయ కథాసుధారసం వానిన యట్టి జిహ్వ అసధన్య కథాలవడోదకంబులన్ పానవు సేయ చూచునే" పరమేశ్వరుడి యొక్క కథ అనబడేటువంటి అమృతాన్ని తాగటానికి అలవాటు పడిన ఈ నాలుక కట్టెదుట ఉన్న ఈ సంసార మహాసముద్రంలో ఉప్పునీటి కోసం వెళుతుందా వెళ్ళదు సముద్రం సముద్రమే అది ఎంత గొప్పది ఎంత లోతైనది ఎంత గంభీరము వైశాల్యం ఉన్నప్పటికీ కూడా దాని నిండా ఉన్నది ఉప్పునీరే ఈ పరమ భాగవతోత్తముడు అమృతం తాగటానికి అలవాటు పడ్డాడు ఏ అమృతము భగవంతుడు అనేటువంటి వాడి యొక్క దివ్య నామామృతాన్ని గ్రోలుతున్నాడు భజన ద్వారా సంకీర్తన ద్వారా విచారణ ద్వారా తత్వ నవనీత సాధన ద్వారా ఉన్నాడే వాడు వెళ్లి వెళ్లి ఆ సముద్రం ఎదురుగా ఉన్న ఆ ఉప్పు నీళ్లు తెచ్చుకుంటాడా తెచ్చుకోడు అలాగే "సుపర్వ మహీచ మరంధ పానలా అనుభవంబునొందు మధుప్రభు యగునే వేప చెట్లకున్"హాయిగా ఒక కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షం నిండా అనేకమైనటువంటి పూలన్నీ కూడా ఉన్నాయి. ఆ పూల నిండా దివ్య నామ మకరందాలు బిందువులు బిందువులుగా కావలసినంత ఉన్నది. ఒక తేనెటీ అంటే ఒక తుమ్మెద అది వెళ్ళి ఇక్కడ ఇంత చక్కగా మధుపానం చేయటానికి, ఆ మధురసాన్ని గ్రోలటానికి ఇంత అవకాశం ఉంటే పోయి పోయి వేగునే వేప చెట్లకున్-- "వేప చెట్టు దగ్గరికి పోతుందా? ఎందుకు వెళ్తుంది?" అంటాడు. వేప చెట్టు పువ్వుకి-- వేప చెట్టు పువ్వులో కూడా తేనె ఉంటుంది. కానీ ఆ తేనె కూడా చేదుగా ఉంటుంది. కానీ తుమ్మెద వెళ్ళి ఎప్పుడు తెస్తుందయ్యా అంటే ఇవన్నీ అయిపోగా చిట్టచివరకెళ్ళి కొద్దిగా తెచ్చుకుంటుంది. ఎందుకని? వేప పువ్వే చిన్నది. ఆ పువ్వుని కొల్లగొట్టి దానిలో ఉన్నటువంటి ఆ మకరందం అనేటువంటి ఆ బిందువుని తేవటం, తేవటం వలన ఇంత దానికి కొద్దిగా చేదు ఏర్పడాలి. జీవితం ఎంత-- చంద్రుడు ఎంత గొప్పవాడైనా మచ్చ ఉంది కదా. ఉందా లేదా? మచ్చను బట్టి వాణ్ని చంద్రుడన్నాం. మచ్చలేని చంద్రుడు ఆకాశంలో వచ్చాడనుకోండి, వింత. అట్లా చిన్నప్పటి నుంచి దాంట్లో చందమామలో కథలు చెప్పుకున్నాం కదా, అలా ఉండాలి కదా అని. కాబట్టి జీవితం ఎంత సాధు జీవితం గడిపినా, ఎంత పరమోత్కృష్టమైన జీవితం గడిపినా, ఎంత భాగవత జీవితం గడిపినా, ఎంత పరమ భాగవతోత్తముడుగా జీవించినా, ఎంత పరితృప్తుడుగా జీవించినా ప్రాపంచికము అనబడేటువంటి ఈ ప్రపంచం ఉండనే ఉన్నది. దీనిని కాదు అనటానికి లేదు, లేదు అనటానికి లేదు. అది ఇచ్చే అనుభవాలన్నీ కూడా మనం దాంతో ఎలా ఉన్నామో దాన్ని బట్టి ఏర్పడతాయి. దాంతో మమేకమైతే ప్రాపంచిక అనుభవాలు మనకు ఎక్కువ దొరుకుతాయి. దాంట్లో ఉంటూనే, దాంతో మనకేం సంబంధం లేనట్లుగా గనక ఉండగలిగినట్లయితే ప్రాపంచికానుభవాలు దాటి లోక లోకాంతర ప్రాణాలు మనకున్నాయి. ఆ లోకాంతర ప్రాణాలలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క దివ్యకాంతులు, దివ్యశబ్దాలు అవన్నీ కూడా మనకి శ్రవణ శుభంగా, శ్రవణ ఆనందంగా, శ్రవణ దృశ్యంగా పరమాత్మ యొక్క దృశ్యాలు మనవన్నీ చూడగలిగిన స్థాయికి మనం వెళ్తాం గనక, పరీక్షిత్ మహారాజు శాపవశాత్ అంత గొప్ప వంశంలో పుట్టి, అంత మేటి అయినటువంటి తాతలను గని తండ్రియే గొప్పవాడు. సరే, కృష్ణ భగవానుడు ఎలాగూ పక్కనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఒకానొక చాంచల్యం చేత, అభిజాత్యం చేత, రాజ్యాధికారం కట్టబెట్టిన చిన్న అహంకారం చేత, తొట్రుపాటు చేత నిబ్బరం లేని కారణంగా శాపాన్ని పొందాడు. ఆ శాపాన్ని ఎంత గౌరవంగా అనుభవిస్తున్నాడో ఆయన చూడండి. అలాగే తాను ఎవరికి అపకారం చేశాడో ఆ మహాముని కూడా ఇటువంటి ధర్మాత్ముడైనటువంటి రాజుని మనం బాధించకూడదని కుమారుడికి బోధించాడు. కాబట్టి అప్పుడు దీనికి ముక్తి ఏమిటి అని అడిగినప్పుడు ఏడు రోజులు గనక భాగవతం హరికథా శ్రవణం చేయగలిగినట్లయితే, ఏడు రోజులలో ఆ భాగవతాన్ని గనక అంటే భగవత్ తత్వాన్ని గనక అర్థం చేసుకోగలిగినట్లయితే ఇక్కడ ఉండగానే జీవన్ముక్తుడువి అవుతావు. మనమందరం కూడా మరణానంతరం ఏమవుతామో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వెళ్ళి వెనక్కి వచ్చి చెప్పిన వాడు లేడు ఇంతవరకు. అంతా వెళ్ళేవాడే గాని వచ్చి చెప్పిన వాడు లేడు. కాబట్టి అది మనకి లెక్క లేలిపోయింది. మనకిప్పుడు చేరవలసింది ఏంటంటే ఇక్కడ ఉండగానే అటువంటి జీవన్ముక్త స్థాయికి మనం వెళ్ళాలి. అన్నీ ఉండనివ్వండి. ప్రపంచం అంతా ఉండనివ్వండి, సంసారం ఉండనివ్వండి, సంసారం ఇచ్చే సుఖాలు ఉండనివ్వండి, అవి ఏర్పరిచే అనుకూలాలు ఉండనివ్వండి, సంపాదనలు ఉండనివ్వండి, ఐశ్వర్యాలు ఉండనివ్వండి, ఐహిక కర్మలన్నీ ఉండనివ్వండి. కానీ ఒక చిన్న స్ఫురణ, ఇవి ఏవీ మనకు చెందవు. అలాగే మనం కూడా ఏ ఒక్కదానికి చెందము. ఇది విశుద్ధమైనటువంటి వైరాగ్య భూమిక. ఆ వైరాగ్య భూమికలో ఎదురుచూపు లేదు, ఆకాంక్షలు లేవు, జయాపజయాలు లేవు. నిశ్చల నిర్మలమైనటువంటి నికేతనమైన నిరంజనమైనటువంటి ఒక వేదాంత భూమిక. ఆ వేదాంత భూమికలో ఎప్పుడైతే ఆశ లేదో ఆశ నశించదు. ఎప్పుడైతే కోరిక లేదో దుఃఖము లేదు. ఎప్పుడైతే సుఖం లేదో సంతోషము లేదు. ఎప్పుడు సుఖ సంతోషాలు లేవో కేవల ఆనందం మాత్రమే మిగులుతుంది. ఆ కేవల ఆనందం మనం ఒక్కళ్లమే అనుభవించినట్లయితే దాని పేరు మనుష్య ఆనందం. ఇంకో వ్యక్తితో కూడి అనుభవించినట్లయితే అది మనీషా ఆనందం. దానిని ప్రజ్ఞతో అనుభవించినట్లయితే దాని పేరు గాంధర్వ ఆనందం. అందునా ప్రాపంచికమైనటువంటి విద్యతో గనక అనుభవిస్తే అది మానవ గాంధర్వ ఆనందం. పరిపూర్ణమైన యోగ భూమికలో అనుభవిస్తే దాని పేరు దేవగాంధర్వ ఆనందం. ఆ దేవగాంధర్వ ఆనందం వలన మనల్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆనందం కలిగినట్లయితే, కలిగించగలిగినట్లయితే దాని పేరు పితృ పితా ఆనందం. ఆ పితృ పితా ఆనందం వలన సర్వ జగత్తు "ఫలానా వారి అబ్బాయి" అన్నట్లయితే అది ప్రజాహిత ఆనందం అయింది. ఆ తర్వాత అన్ని ఆనందాలకి పరమ చరమమైనటువంటి బ్రహ్మపదం ఏదైతే ఉన్నదో ఆ స్థాయికి వెళ్లగలిగితే దాని పేరు బ్రహ్మానందము లేక హిరణ్యగర్భానందము అన్నారు. ఆ హిరణ్యగర్భానంద స్థాయికి మనం వెళ్ళాలి. జీవితం బేరీజు వేసుకుని ఆనందం పొందావా అంటే ఇంకా తెలియదు. సుఖం తెలుసు. సుఖం వలన కలిగిన సంతోషము తెలుసు. అప్పుడప్పుడు కలిగే ఆనందము తెలుసు. కానీ హిరణ్యగర్భానందం పరితృప్తిలో నుంచి పరమాత్మకు సమర్పణము, శరణాగతి, వినయము అన్నటువంటి మూడు భావనల వలన కలుగుతుంది గనుక ఆ మూడు భావనలని కూడా మనం చక్కగా గమనించుకుని మనందరికీ ప్రధానంగా ఈ యుగంలో ఇంకా రాబోయే పదకొండు సంవత్సరాల వరకు కూడా ఒక అదృష్టం ఏమిటంటే శ్రీరామచంద్ర ప్రభువుకి ఇద్దరు గురువులు. ఒకడు లోకగురువు విశ్వామిత్రుడు, ఒకడు జ్ఞానగురువు వశిష్టుడు.శ్రీకృష్ణ పరమాత్మకి సాందీపుడు అనే ఒక గురువు. మనకి భగవంతుడే గురువు. సత్యసాయి భగవానుడే మనకు direct గా గురువు. మధ్యలో intermediaries లేరు. ఎవరు లేరు. అయితే ఈ గురువు ఎటువంటి వాడు అంటే గురువులే లేని గురువు స్వామి. చూసారా! గురువులు లేని స్వామి మనకు గురువు అయినటువంటి వేళ అధ్యాత్మలోకి వెళ్ళాలి మనం. వెళ్ళకపోయినట్లయితే జీవితం చెల్లిపోతుంది. ఒక్క మానవ జన్మ, పరమోత్కృష్టమైన మానవ జన్మ వృధా అయిపోతుంది గనుక నిత్య నైమిత్తికమైన అంటే day to day life అంతా కూడా కర్మానుష్టానంలో, భక్తి పారాయణంలో, జ్ఞానం అనేటువంటి వెలుగులో అది నిండుగా వెలిగిపోవాలి. ఆ వెలిగిపోవటానికి పరమాత్మని అన్యవతి ఉపాసనగా, అంగవతి ఉపాసనగా. అంగవతి ఉపాసన అంటే ఇప్పుడు ఈ పటం. దానికో దండ, దాని చుట్టూ అలంకారం. అంటే అంగాంగీ భావంతో కనబడుతున్న పరమాత్మకి మనం చేసే ఉపచారం పేరే అంగవతి ఉపాసన. కన్ను ఎంత బాగుందో, స్వామి చేతులు ఎంత బాగున్నాయో, స్వామి అంగీ ఎంత బాగుందో, ఇదంతా కూడా కనిపిస్తున్నది. ఈ కనిపించని స్వామిని అంటే మనం సూక్ష్మ శరీరంతో ఒకానొక ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు మనం స్వామి యొక్క దర్శనాన్ని ఆంతరంగికంగా పొందినప్పుడు అప్పుడు కలిగేటువంటి ఆ ఉపాసన పేరు అన్యవతి ఉపాసన. అక్కడ అంగం లేదు భావం మాత్రమే మిగిలింది. ఆ తర్వాత మూడవది ఉదాత్త వైఖరి. దాని పేరు నిదానవతి ఉపాసన. సగుణం లేదు, నిర్గుణం లేదు. ఒక్క తత్వం మాత్రమే మిగిలింది. ఆ నిదానవతి ఉపాసనే నిదానంగా చేర్చుకునేటువంటి ఆ నవనీతం. ఆ వెన్నని పట్టుకునేటువంటి ప్రయత్నం. ఆ వెన్న అంటే వేద సారం, భాగవత సారం. అటువంటి పూర్ణమైనటువంటి ఈ భగవత్ కథాసుధాలహరిని మనందరం కూడా అన్నివేళలా చక్కగా, సాకల్యంగా, పూర్ణంగా అనుభవించటానికి రాబోయే రోజులన్నీ పరమాత్మ మనకు అనుగ్రహించారు. ఇవాళ విశేషం ఏమిటంటే, రాజేందర్ రాలేదు. కనుక ఆ బాధ్యత కూడా అనేది-- ఆ ఓ సరే. ఆ ఆ బాధ్యత సరే నేను చెప్తాను. ప్రారంభించా కదా. జనవరి నుంచి ఆగస్టు వరకు ప్రతి first week of every month almost ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఆ శివరాత్రి వచ్చిన కారణంగా చిన్న gap వచ్చింది తప్ప వాటన్నింటినీ కూడా అక్క-- వచ్చేసాయి cards. వాటన్నింటినీ dates తో సహా invitation print అయింది. ఇవాళ మీరంతా invitation దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా మార్పనే జరగదు. కానీ చెప్పలేం. ఏదన్నా మార్పు గనక ఉంటే ఒక రెండు రోజుల ముందే ఆ numbers వేశారు దాంట్లో కరుణాకర్ గారి numbers. వారికి మీ అంతట మీరొక phone చేయండి. మామూలుగా seven to eight thirty. అట్లా అయితే భాగవతం చక్కగా మళ్ళీ మనం గురుపూర్ణిమ నాటికి ఇది పూర్ణం చేసుకుంటే, చేసుకుంటేనే కానీ మళ్ళీ ఎనభై ఆరవ birthday కి మనం వెళ్ళలేం స్వామి దగ్గరికి. అక్కడే సేవ చేయాలి మనం. కాబట్టి ఆ సమయానికి భాగవతాన్ని మనం ఇక్కడే పూర్తి చేద్దాం. చేసుకోవటానికి ఒక వేదిక పరమేశ్వర అనుగ్రహం చేత కరుణాకర్, కాత్యాయని వాళ్ళ ఇంట్లో జరుగుతున్నది. ఇది స్వామి సంకల్పం. ఇది ఎవరు plan చేసింది కాదు. ఇది ఇలా జరిగిపోయింది అంతే. దాన్ని సాక్షిభూతంగా మనం కూడా చక్కగా, ఆనందంగా ఏ లోటు ఉంది ఇక్కడ? అన్నింటికంటే ఇంటికంటే గుడి పదలే ఉన్నట్టు వెచ్చగా ఉంది ఇక్కడ. కాబట్టి ఈ వెచ్చగా ఉన్నటువంటి చోట ఏం చేస్తున్నామయ్యా అంటే పరమాత్మను గురించి విచారణ చేస్తున్నాం. అందులో రోజూ ప్రతిరోజూ స్వామిని తత్వానుసంధానం చేసుకునే దిశగా మన యొక్క ఈ ప్రస్థానం సాగుతున్నది గనుక సత్యసాయి భగవానుడు సర్వేశ్వరుడు ఆయన మన అందరి యందు ఏ రామాయణ కల్పవృక్షం ఎట్లా అయిందో అలాగే భాగవత కల్పవృక్షం కూడా. దీని పేరు అసలు భాగవత కల్పవృక్షమే. దీన్ని కూడా స్వామి సంపూర్ణంగా He will draw to a logical conclusion. ఎలాగైతే దశమ స్కంధం వచ్చిన తర్వాత గాని హృదయాబ్జములు పల్లవించవు, భక్తి పారమ్యాలు గట్లు తెగి ప్రవహించవు. అక్కడ పరమేశ్వర గుణగాన సంకీర్తనంలో మనం ఒంటరి వాళ్ళం కాదు. ఇప్పటిదాకా మనము పరీక్షిస్తే అప్పుడు అసలు ఇంకా అంబరీషుడు, ధ్రువుడు, ఇటు రుక్మిణి రకరకాల వాళ్ళంతా వచ్చి ఆ కృష్ణ గానం చేస్తున్నప్పుడు మన హృదయాలు కూడా ఆనందతాండవం చేస్తాయి. ఆ చేసినప్పుడు సాయిరామ ప్రియ రాగంలో ఎట్లాగైతే మనం ఒక సంకీర్తన రామ పరంగా, స్వామి పరంగా చేసి స్వామికి సమర్పించుకున్నామో అలాగే మనస్సుని ఆయత్తం చేయండి. చిత్తాన్ని మనీషాయత్తం చేసి గోపికాగీతంగా హంసానంది రాగంలో స్వామికి మళ్ళీ ఈ కల్పవృక్షం పూర్తయ్యేలోగా ఒక కొత్త గీతాన్ని మనం సృష్టించాలి. చేసి స్వామికి దాన్ని-- రాగం కూడా హంసానంది రాగంలోనే దాన్ని స్వరపరచుకోవాలి. ఎందుకంటే ఆ హంసానంది హంస గీత, జీవ గీత. అందుకనే అరయ ప్రశాంతినలయమ్ము జీవహంసల దేవి. పరమహంస పరమాత్మ సాయి. మృ-- మృణ్మయ శరీరధారియై చిన్మయ రూపుడై చెన్నార చెన్న చిత్ర స్వామి. మనకోసం ఆ చిన్మయ దేహాన్ని, మృణ్మయ దేహాన్ని తీసుకున్నారు తప్ప భాగవతం కూడా ప్రామాణికంగా చెప్పింది పుట్టుకే అక్కర్లేదు అసలు ఆయనకి. రమణ మహర్షిని కూడా ఓ మాట అడిగారు. ఇటువంటి వారంతా ఈ చెట్టు కింద పుట్టలో, గుహలో కూర్చున్న వాళ్ళ వల్ల ఈ ప్రపంచానికి ఏమిటి ప్రయోజనం అని అడిగారు. అటువంటి వారు అసలు ఈ జన్మ ఎత్తడమే జగదోద్ధరణ కోసమన్నారు. వారి ఉనికి వల్లనే అంతా పావనమైపోతుంది అన్నారు. చూశారా! వాళ్ళు ఏం చేయక్కర్లే. కానీ వాళ్ళు చేస్తారు. ఎంత గొప్పగా చేస్తారంటే మనబోటి వారందరినీ సన్మార్గంలో పెట్టడానికి, జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్లడానికి మహిమలు దాటాం, లీలలు దాటాం, స్వామి వైభవం దాటాం. వీళ్ళ కొలవటానికి, తలచటానికి మన దగ్గర తూనికలు, తూకాలు రెండూ లేవు. అది అనంతమైనటువంటి మహా శక్తి అది. సర్వ భువాలనీ కూడా నిలబెట్టగలిగిన, కుంభకం చేయగలిగినటువంటి మహా పరిపూర్ణ అద్వైత అవతారమూర్తి, ప్రేమమూర్తి భగవాన్ సత్యసాయి దివ్యానుగ్రహం మనందరి యందు ఉండాలి. స్వామి యన్-- సమర్పణ జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఆ invitation తీసుకెళ్ళండి. ఎనిమిది నెలలు జాగ్రత్తగా పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ ఇవ్వరది. ముందే చెప్తున్నా జాగ్రత్త-- అంటే సాధన. అంటే ఆ dates అన్నీ మీ దగ్గర గనక ఉన్నట్లయితే మీరందరూ చెప్పుకోవల్సిన వాళ్ళకి చెప్పుకోవచ్చును. స్వామి దయా విశేషం చేత సాగుచున్నటువంటి ఈ శ్రీమద్భాగవత నవనీతం అనేటువంటి ఈ యాగం, ఈ సత్ర యాగం పరిపూర్ణమై, జగత్ శ్రేయోదాయకమై, జగద్ధితమై, జగత్ శోభాంకితమై, జగత్ కళ్యాణకారకమై, జగద్ధితమై, లోకకళ్యాణమై, समस्त लोकाः सुखिनोभवंतु అన్నటువంటి స్వామి యొక్క ఆశీర్వచనానికి అనుగుణంగా భాగవత కథ కొనసాగుగాక. సాయిరాం.
SSSMC · audio
Bhagawata Navaneetham - 20
Bhagawata Navaneetham - 20
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 31:16
More in this series