Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. సురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం సబ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, కేచరియై వచ్చి అంగుమాయా ప్రయుక్తి కామరూపిణియై చొచ్చి కానకుండ అరిగి ఇల్లు ఇల్లు తప్పక అరసి కొనుచు ప్రతి ఇంటికి వెళ్ళిందట. వీడు ఎక్కడున్నాడు కంసుడిని చంపే పిల్లవాడు పుట్టాడు కొత్తగా అని అంటున్నారు ఎక్కడున్నాడని. నందగృహమున బాలిని నాదమొకటి విని ప్రమోదించి నందయించె ఉన్నటువంటి బాలుడి యొక్క రోదనం ఆనందం కిలకిల విన్నది అట. దానితోనే దానికి ఒక ప్రమోదం కలిగింది. ఇంకా అసలు బాలకృష్ణుడిని చూడలేదు. ఉయ్యాల దాకా వెళ్ళలేదు. చిన్న పసిపిల్లవాడి కేక వినే దానికి ఆనందం కలిగి సుందరీ వేష యగుచు సౌందర్యవంతమైన స్త్రీమూర్తిగా వేషం వేసుకుని వచ్చింది. వచ్చి, యశోద కడ్డం పడి పసిపిల్లవాడితో మాట్లాడుతున్నది. ఏం మాట్లాడుతున్నది? మనకి స్వామి interview ఇచ్చారని చెప్పుకుంటామే interview లో ఆయనే మాట్లాడుతారు మనం మన ఆయనతో ఏం మాట్లాడుతాం. ఒకవేళ పిలిచారనుకోండి దాన్ని వాళ్ళు నీతో మాట్లాడతారని గుండె పగిలిపోదు. దాన్నా మాట్లాడతావా దాన్నా ఉందా మన దగ్గర? ఏవో ఆయన మాట్లాడారు ఇప్పుడే వచ్చాను అని చెబుతుంటారు. అవేం నమ్మకూడదు. ఆయనే ఆయనే మాట్లాడుతారు మనమేం మాట్లాడం. ఆయన బయట చెప్పింది మనమే వినాలి లోపల చెప్పింది మనమే వినాలి ఎంత గ్రహించాం అన్నదే తేడా. అప్పుడు ఇది అంటున్నది, నా చెలువా యొక గుక్కెండో చిన్ని కుమార త్రావుమొయెన పిదపన్ నీ చెలువ మెరుంగ వచ్చు నా చెలువము సఫలమగు నళిన దలాక్షా. అసలు దాని భావం చూడండి. అసలే తాను ఒక సౌందర్యవంతమైనటువంటి స్త్రీమూర్తి. నా దగ్గర గనుక ఒక గుక్కడు పాలు గనుక నువ్వు తాగితే చిన్న కుమారా కృష్ణా! నువ్వు అసలే అంధగాడివి అయ్యా. నా దగ్గర గనుక పాలు తాగినట్లయితే నీ అందం వేయింతలవుతుంది. దానితో నా అందం కూడా మెరుగుపడుతుంది అన్నది. అందమంతా తన దేహ సౌందర్యాన్ని గురించిన మాటలు కావివి. పడుకున్నవాడు పరమాత్మ అని దానికి అర్థమైంది. నళిన దలాక్ష అంటున్నది. సంసారి అని పిలవవచ్చుగా. వీడే వీడి వల్లే మా వాడు పోతాడు అనటం లేదు. దానికి ఒక సంస్కారం ఉంది. సంస్కారం ఏమిటనేది మనకి చివర తెలుస్తుంది. పణితా ముట్టకుమమ్మ ఇది ఎవరో కొత్త వాళ్ళు మన కొత్త వాళ్ళు రాగానే రమ్మని మనం అక్కడ కూర్చోండి అంటాం. ఇక్కడికి రావటానికి చాలా time పడుతుంది అక్కడ కూర్చో అంటాం కదా. అలాగే కొత్త వాళ్ళు రాగానే పిల్లవాడిని ముట్టుకోవద్దు అన్నారు. అంటే పిల్లల ఎత్తుకెళ్ళేవాళ్ళు నందుడికి తెలుసుగా వచ్చి చెప్పాడు ఇంట్లో అప్పటికే. కానీ ఇంత తొందరగానే పూతన వస్తుందని ఆయనకీ తెలియదు. చెనుగుడు పందల దమ్మమా తనయుడొల్లడు వాసిపొమ్మని యశోదా రోహిణుల శీర దైకొన తైక్షించుచు మాయబన్ని తెలుచన్ కోశంబులో వాలువెల్పున రాజిల్లుచు మాట నెట్టదన ముల్లో వాడియు ఏర్పడన్. ఒక వరలో దాచుకున్నటువంటి కత్తిలాగా ఉన్నదట పూతన. వద్దు వద్దు అని ఇద్దరూ అంటున్నారు యశోద రోహిణి. రోహిణి యశోదలు ఇద్దరూ కూడా అంటున్నా సరే కత్తి లోపల ఉన్నట్టుగా కనబడి కనబడనట్టుగా వాళ్ళందరినీ దాటుకుంటూ పూతన చేరవలసిన ప్రదేశానికి చేరింది. అని శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి దగ్గర తీసుకున్నది. దగ్గర తీసుకుంటే, నేల్కొన్న తరగున నల్ల నఖను విచ్చి క్రెగంట చూచుచు. ఇహ ఆయన లీల ప్రారంభమైంది. పడుకున్నాడు కదా. యశోద అయితే ఆయన్ని చూసేవాడు కాదు ఆయన నిద్రపోయేవాడు సమయంలో కూడా. పూతన వచ్చి పాలిచ్చేటటువంటి వేళ శ్రీకృష్ణ పరమాత్మ ఒక కన్నలా తెరిచి దాన్నే చూశాడు. ఎందుకంటే రావలసింది వచ్చిందా ఇంకా రాలేదా అని అది. యోగం. కిదికి నీల్గి ఆవులించుచు ఎన్ని వేషాలు పోతున్నాడో చూడండి. పాలు మాత్రం తాగటలే. ఆవులించుచు చేతులాద రంగున జూచి ఎదిగిలి కొన్న ఓజమాయె దిగిసొందుగ వకేల పీడించి కబళించి గుక్క గుక్కకు గుటుకు గుపుకు మనుచు ఒక రెండు గుక్కలవు విడ ప్రాణంబులు సైతము మేనిలో సత్వ నెల్ల ద్రావే. రెండే గుటకలు వేశాడట. ఒక్కొక్క గుటకలోనూ ఒక్కొక్క ప్రాణాన్ని హరించాడాయన. ఒక్కొక్క ప్రాణాన్ని లోపలికి తీసుకుంటున్నాడు. నదియును గుండెలు తల్లడిల్ల ఇదేమిటి? పాలిస్తే నా అందం నీ అందం పెరుగుతుందని ఇక్కడికి వస్తే గుండెలు అదిరిపోతున్నది ఏమిటి? నీరసం వస్తున్నది ఏమిటి? అంటున్నదది. ఎందుకంటే ప్రాణాలు లాగుతున్నాడాయన. జిమ్మ దిరుగుచు మిలువక శిరము బ్రాల ఇతర బ్రాలు రకుయ వాడవివు గావు నన్ను విడువుమో విడువుమో చాలు చాలనియే. మిగతా పిల్లల్లాగా లేడురా వీడు నన్ను వదిలిపెట్టురా వదిలిపెట్టురా అంటుందట. భగవంతుడు దొరికినా వదిలిపెట్టరా అంటాం జీవ లక్షణం అది. కదా.భగవంతుడు సాక్షాత్తు నీ ఇంట్లో ఉంటాను అని వెనుక బల్ కొట్టి వస్తే ఇప్పుడు కాదు స్వామి ఏప్రిల్ కుదరదు మే లో రండి అంటాం. స్వామినైనా సరే ఆయన పిలిచిన అంటే ఇప్పుడు నాకు తీరిక లేదు తీరికున్న టైం లో వస్తాం అని పిలిచినప్పుడు వెళ్ళాలి పిలుపు కోసం ఎదురు చూడాలి చూడాలా చూడక్కర్లా అని పిలుస్తాడు అప్పుడు అధరం కొండల తోడ భూమి శ్రీ కృష్ణుడు పుట్టినప్పుడు సర్వ ప్రకృతి పులకించిపోయింది అది విన్నాం పూతన శరీర త్యాగం చేసేటువంటి ప్రాణం పోగొట్టుకునేటువంటి వేళ ఏం జరిగింది అధరం కొండల తోడ భూమి గ్రహ తారాళికలు మింటిపై దడరన్ దిక్కుల మారు మోత సనగన్ భీతిల్లి లోకంబులున్ కదలంబారెను వజ్రభిన్న గిరి రేఖంబు పుర దేహంబుతో త్రిదశ ధ్వంసిని కూలి కుయ్ ఇడిన తద్గీ ఘోర ఘోషంబునన్ తల వాల్చింది నేల మీద నెమ్మది నెమ్మదిగా పడిపోయింది పడిపోతూ ఒక్కసారి కుయ్ అన్నది అంటే అరిచింది అని కుయాలిచ్చి సంరంభియై కుయ్ అంటే కేక ఒక్క కేక పెట్టింది ప్రాణం పోయేటప్పుడు కొంతమంది మౌనంగా దేహం వదులుతారు కొంతమంది అరుస్తూ పోతారు అరుస్తూ పోయేటువంటి వాడు ఇంకా ప్రపంచం పట్ల అపారమైన మమకారం ఉన్నవాడు అయ్యో వెళ్తున్నా వెళ్తున్నా నన్ను పట్టుకోండి అని అరుస్తాడు హాయిగా వెళ్లిపోయే వాడు వాడికి దీంతో ఏం పని లేదు వచ్చిన పని పూర్తి చేసుకుంటాడు ఇల్లు వదిలి పెట్టి వెళ్ళినట్టుగా శరీరం వదిలి పెట్టి వెళ్తాడు అప్పుడు తెప్పర మగువా చప్పుడు హృదయంబుల చొచ్చి సందడి వెట్టెన్ ముప్పిరిగని పడిరి పెరుకలు దప్పి దరెన్ గొల్లలెల్ల తల్లపడుచున్ ఒక్కసారి ఏం జరిగింది మన ఇంట్లో పాలు పెట్టడానికి వచ్చిన మనిషి కింద పడిపోయింది ఏంటి ఇదేంటి అన్న ఏం జరిగింది అని మాత్రం అందరూ ఒక ఉద్వేగానికి లోనైతే నేలం కూలినదాని శ్రీ కృష్ణుడు ఏం చేస్తున్నాడు అప్పుడు అని వీళ్ళంతా కంగారు పడుతున్నారు ఆయన మాత్రం నేలం కూలినదాని పెన్నురముపై దాని పొట్ట మీద ఎక్కాడట నిర్భీతిన్ క్రిడింప బాలారమ్మని మోపు చేర్చుకొని సంస్పర్శించి ఊడార్చుచున్ గోరాంగూలము తిప్పి గోపుర జనమున్ గోమూత్రముం జల్లి తద్బారాంగంబుల గోమయంబులబిరి పన్నెండు నామంబులన్ నిన్న ఉయ్యాలలో పడుకోబెట్టి పన్నెండు నామాలతో కీర్తించారో పన్నెండు నామాలతో మళ్ళీ ఆయనకి దృష్టి తీశారట అందరూ ఆయన్ని పట్టుకుని పైకి తీసుకు వచ్చి శిరస్సు బాగుందా చెవులు బాగుందయ్యా ముక్కు బాగుందా నిన్నేనయ్యా నిన్న సాయంకాలం ఇటువంటి వాడు ఇటువంటి వాడు త్రివిక్రముడు సురంలో ఉన్నాడు అక్కడ కూర్చున్న వాడు శ్రీయప్ప తన్నావ్ ఇంకో తన్నావ్ ఇంకో తన్నావ్ అవన్నీ సక్రమంగా ఉన్నాయా అని గోమయం గోమయాన్ని తీసుకువచ్చారు గోవు యొక్క మూత్రాన్ని శుద్ధి చేశారు అక్కడ దుష్ట పీడలు లేకుండా ఒక శాంతి వచనం పాటించారు అప్పుడు నందుడు మొదలైన గోపకులంతా మధుర నుంచి వచ్చి పడిపోయినటువంటి పూతన శరీరం సహజ శరీరంతో పడిపోయి ఉంటే అప్పుడు నందుడికి ఒక్కమాట గుర్తొచ్చింది మొన్ననే వసుదేవుడు నాకు మాట చెప్పాడు ఇటువంటి వాళ్ళు ఎవరో మనూరు వస్తారు మీ ఊరు జాగ్రత్త అన్నాడు ఆయన మహా యోగి కాకపోతే ఎలా చెప్పాడు ఆయన అన్నకే అయింది సుమా అన్నాడు ఆయన మహా యోగి అయ్యానో కాదో గాని అలాంటి వాళ్ళు వస్తారు అని వసుదేవుడికి తెలుసు కానీ ఖచ్చితంగా ఫలానా రోజు టైం కి వస్తారు అని మాత్రం చెప్పలేదు అప్పుడు మళ్ళీ పొగిడి పూతన వడలు కుఠారంబుల నరికి గొడ్డలి తెచ్చి దాని శరీరం నరికేశాడట తన కుటీరంబులకుందబ్బగు ప్రదేశంబున కటీరంబుల దహనంబు సంగ్రహించి దహించిరి శరీరాన్ని అర్ధవ శరీరాన్ని ముక్కముక్కలు చేసి దానికంతా కూడా చేయవలసిన అంత్యక్రియలు చేశారు చేస్తే ఏమి రాక్షసి రాక్షసికి అంత్యక్రియలు ఏమిటని దేశం ఎంత గొప్పది అంటే పాము చచ్చిపోయినా మంత్రోక్తంగానే అంత్యక్రియలు చేస్తారు జాతి సంస్కారం అది పాముని అది విషనాగుని గాని ఒక దుర్భరమైన జీవి అని గాని ఎవ్వడూ అనుకోడు దానిలో ఒక సుబ్రహ్మణ్య స్వామిని చూస్తారు చూడగలిగిన సంస్కారం ఒక్క భారతదేశానికి మాత్రమే ఉన్నది ఇంకెక్కడా అది పాము ఈస్ ఈక్వల్ టు పాము అంతే మనకి పాము ఈస్ ఈక్వల్ టు ఈస్ పాము బట్ ఐడెంటికల్లి ఈక్వల్ టు సుబ్రహ్మణ్యస్వామి అది అవన్నీ కూడా సంకేతకమైనటువంటి ಜೀವ శబ్దాలుగా మనం భావన చేస్తాం సమయంలోట శరీరంలో నుంచి పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళమున పొగలు వెడలే అగరుబత్తులు వెలిగించినట్లుగా దివ్య పరిమళాలు శరీరంలో నుంచి వచ్చినయి రాక్షసి కదా కామరూపిణి కదా కృష్ణుడిని చంపుదామని వచ్చింది కదా కంసుడి భృతిక ఒక చెలికత్త లాంటిది కదా పరిచారిక కదా అయినా శరీరంలో నుంచి దివ్య పరిమళాలు వచ్చాయి దేహతోమ శంభులు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూభరేణ్య పూతన శరీరంలో ఉన్నటువంటి విషాన్నంతా కూడా ఎవరికి ఇచ్చింది శ్రీ మహావిష్ణువుకి ఇచ్చింది పాల రూపంలో తనలో ఉన్నటువంటి అనేకమైన దోషాలు విషమయమైనప్పుడు విషాన్ని ఆయనకి నైవేద్యం ఇచ్చింది అన్నాడు అందుకనే దీనిలో నుంచి దేహంలో నుంచి అగరు సెగలు పొగలు వచ్చినయి అన్నారే దానిని ఒకసారి పూతన అంటే దాని అర్థం ఏమిటంటే పూచిన తనువు కలిగినది అని అర్థంపూచిన అంటే పుష్పించిన, పరిమళభరితమైనటువంటి. అందుకే "జపవశత్ పుష్పాశ్చ సద్వాసనల్ జ్ఞానానంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి" అంటారు శివానందలహరిలో శంకర భగవత్పాదులు. కాబట్టి వాసనలు ఎటువంటివి రావాలంటే దివ్య పరిమళాలతో కూడినటువంటివి. ఆమెకు ఎలా వచ్చినయి పూతనకి అంటే పరమాత్మకు విష్ణువుకి చక్కగా తనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ నైవేద్యం చేసింది. అవన్నీ పోగా ఏం మిగిలింది? ఆమె శరీరంలో కూడా ఆత్మ, పరమాత్మ మిగిలింది. ఎట్లా? దర్శనం ఇచ్చాడు ఉయ్యాలలో, స్పర్శనం ఇచ్చాడు ఓ-ఓడిలో. అలాగే ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా ఆమె మాట్లాడింది ఆయనతో "నీకు పాలిస్తాను, నిన్ను పోషిస్తాను, నిన్ను దగ్గర తీసుకుంటాను, ముద్దాడుతాను" అని సంభాషించింది కదా! కాబట్టి దర్శన, స్పర్శన, సంభాషణ అనేటువంటి ద్వారా కల్మషాన్నన్ని కూడా పాలుగా స్వీకరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మూడు గుటకలతో ఉద్ధారణ ఇచ్చాడు. ఉద్ధారణ ఇచ్చినక-కారణంగా పూతన అనబడేటువంటి ఒక స్త్రీమూర్తి పూచిన తనువైనటువంటిదిగా మారింది. అప్పుడు హరి తనమీదం పదములు కరములు ఇడి కడిపిన మాత్రం. శరీరం మీద ఆడుకున్నాడు కదా కాసేపు, పరమాత్మే ఆడిన అమృత కళేబరమే ఒక దివ్యక్షేత్రం అంటున్నాడు వేదవ్యాసుడు. పూతన శరీరం దివ్యక్షేత్రం. ఎందుకని? సజీవమైన చైతన్యంమూర్తి అయినటువంటి పరమాత్మ పూతన శరీరం మీద ఆడుకున్నాడు కాసేపు. అటూ ఇటూ నిర్భయంగా తిరిగాడట. అందువలన హరి తనమీదం పదములు కరములు. పారాడుతున్నవాడు కదా! రెండు కాళ్ళు, రెండు చేతులు రెండు ఆంచి చక్కగా దానిమీద పారాడు. అందువలన "హరి జనని పగిది పరగతి కరిగెను తురితముల బాసి అసురాంగనయున్". అసలు ఎలా ఉన్నది అంటే శ్రీ మహావిష్ణువుకి ఒక్క క్షణం తల్లిగా ఉన్నందుకే ఇంత ఉద్ధారణ జరిగిందా అని ఆశ్చర్యపోతున్నాడు వేదవ్యాసుడు. అందుకే స్వామి మాట చెప్పారు. చాలా అందమైన మాట. స్వామిని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. అక్షరం అక్షరంలో వెతుక్కుంటూ వెళ్ళాలి. స్వామి దగ్గర ఒక student రాముడి వేషం వేసి బెంగళూరులో white field లో మర్నాడు ఇంత వెండి కప్పు తీసుకొని వచ్చి స్వామికి చూపించాడు. "ఏమి? ఎందుకొచ్చింది కప్పు?" అని అడిగారు. ఈయన ఏం తెలియనట్టు అడగటం భగవంతుడి లక్షణం. తెలిస్తే అడిగేదేం లేదుగా! మీ కప్పు వచ్చింది వెళ్ళు అంటారు. "ఏమి కప్పు ఏమి?" అని అడిగారు. "స్వామి, రాత్రి రాముడి వేషం వేశాను. ఆహ్ కప్పు నాకు వచ్చింది స్వామి." నిజానికి వాడెంత సత్యవంతుడో స్వామి student కాబట్టి మాటన్నాడు. "నాకంటే రావణుడి వేషం వేసిన వాడు నాకంటే బాగా చేశాడు స్వామి. ఆహ్ వాడికి మాత్రం రాలేదు, నాకు వచ్చింది" అన్నాడు. "మరి బాగా చేశాడు అని నువ్వే అంటున్నావ్ మరి వాడికెందుకు రాలేదు? నీకెందుకు వచ్చిందిరా?" అంటే "రాముడి వేషం వేసినంత సేపు మిమ్మల్ని తలుచుకున్నాను స్వామి. వాళ్లందరికీ మీరు కనిపించి ఉంటారు అందుకని కప్పు ఇచ్చారు" అన్నాడు. అనగానే స్వామి అప్పుడేమన్నారు, అంతటితో ఆగలే స్వామి అలా బోధ చేసి, అదొక దివ్య బోధ. "ఏమిరా? రాముడి వేషం వేసుకున్న నీకే కప్పు ఇస్తే, రాముడినైన నాకేమిస్తుందిరా లోకం?" అన్నాడు. అది చమత్కారం. అంటే ఆయనకేం అక్కర్లా. రాముడి వేషం వేస్తేనే ఇంత గౌరవం, ఇంత ప్రేమ, ఇంత గుర్తింపు. అదేగా విశ్వనాథరావు గారి ఉన్నది. హరికథ చెబితే డబ్బులేమిటి బాబయ్యా అని వాడంటే, "అవునురా, రాముడి కథ చెప్పి లక్ష రూపాయలు కొట్టేశాను government దగ్గర. నేను దీన్ని మాత్రం నా దగ్గర ఉంచుకొని కన్ను తెరిపించాను" అన్నాడాయన. కల్పవృక్షంలో చెప్పుకున్నాం. రాముడి కథ చెబితేనే జ్ఞానపీఠం వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చారు. నువ్వు ప్రతిరోజూ రాముడి కథ చెప్తున్నావు. నీకేం తాంబూలంలో రూపాయి కూడా దక్కటం లేదు. "అవును నిజమే. నేనే, నువ్వు నమ్ముకున్న వాడిని, నేను నమ్ముకున్నవాడిని" అన్నాడాయన. ఉదాత్త స్థాయి. కాబట్టి ఒక్క క్షణం పరమాత్మకి తల్లి భావన ఉందో లేదో కొట్టమీద పారాడినందువల్లనే ఆమెకు ఉద్ధారణ జరిగింది. "వెన్నుని కొకమరి విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చన నట దివికిన్". పాలిస్తాను పాలిస్తానని విషమిచ్చినటువంటి దానికే ఉద్ధారణ ఇచ్చాడే! అసలు ఆ-ఆ భావన చూడండి, భావ సంపద చూడండి. "వెన్నుని కనిపెంచుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే". విషమిచ్చిన పూతనే దివి-దివిజలోకాలకు వెళ్ళిపోయింది. అద్భుతమైన స్వర్గ లోకానికి వెళ్ళిపోయింది. పూర్ణ ముక్త అయిపోయింది. కానీ పెంచి పాలిచ్చిన యశోదా దేవకులు, వాళ్ళకి మళ్ళీ జన్మంటూ ఉంటుందా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. సమాధానం లేదు అని అర్థం. విషమిస్తేనే రాహిత్యం ఉన్నప్పుడు పంచి పోషించి పాలించినటువంటి ఇద్దరు తల్లులకి ఏమున్నది అంటే ఏమీ లేదు. పునరావృత్తి రహితమైనటువంటి ఒక మోక్ష సామ్రాజ్యంలో వాళ్ళు చేరుతారు. "ఆ పూతన మిహి గంధము గోపాలులు ఎరిగి ఎట్టి కువిత ఒడలందు పాటి స్వాదుగంధము ప్రాపించునే". ఇంత దుర్-- మిగతా కథంతా వాళ్ళకి తెలియదు, గోప గోపికలకి. ఇంత దుర్మార్గురాలి శరీరం కాలితే శవం కాలిన వాసన రావాలి, అగరుబత్తుల వాసన వస్తున్నది ఏమిటి అనుకుంటూ వాళ్ళలోనే ఇదేం మహత్యమో, ఇదేమిటో మనం కూడా అనుకుంటాం కదా! స్వామిని గురించి. అలాగే ఏం మహత్యమో, ఏం చేసాడో పిల్లవాడు. అలా, అలా వెళ్ళిపోయిందది. ఎంత అదృష్టవంతురాలు అంటూ వెళ్తుంటే "అంత ఒకనాడు వసుదేవు పంపున యాదవ పురోహితుండై నగర్ గుండు మందకు చనుదెంచిన నందుడు అతనిన్ కనుగొని లేచి నిలిచి కృతాంజలియై". యాదవ కులానికి ఒక పురోహితుడున్నాడు. ఆయన పేరు గర్గుడు.ఆ గర్భుడు అదే సమయంలో వచ్చాడు ఇంతకీ పూతన కంసుడు వేలు అంటే వచ్చిందా వచ్చి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి రాగలిగిందా తనంతట తాను ఎవరో కొత్త స్త్రీమూర్తి కదా గోప గోపికలంతా వాళ్ళని లోపలికి ఎలా రానిచ్చారు శ్రీకృష్ణుడి దాకా ఎలా వెళ్లగలిగింది అసలు ఎవరు పూతన ఎవరు పూతన అంటే వామనావతార ఘట్టంలో వామనుడు త్రివిక్రముడై దానికి ముందు బలిదైత్యేంద్ర కరద్వయీ కృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచే యోగిస్సు మనస్సం ప్రార్థిత శ్రీదమున్ కలితా నమ్ర రమాలరాక పదవీ కస్తూరికా శాతమున్ నళినా లోధము రత్ననూపురిత నానా వేదమున్ పాదమున్ పరమాత్మ యొక్క విష్ణువు యొక్క రెండు పాదాలు చూసింది ఎవరు బలి చక్రవర్తి యొక్క కూతురు కూతురికి చిన్న వటువును చూసినప్పుడు ఎటువంటి వాడు గనుక నాకు కొడుకుగా పుట్టినట్లయితే వాడికి నేను పాలిచ్చి పోషించుకునే దాన్ని కదా అని ఒక ఆలోచన కలిగింది సద్భావన కారణంగా ఆవిడ పూతనగా పుట్టింది మరి ఇంత సద్భావన ఉన్నప్పుడు గోపగోపికల్లో ఒకతెగా రావచ్చుగా అంటే లేని ఏంటి పని కదా రాక్షస వంశంలో ఉన్నది క్రమం క్రమంలోనే వచ్చింది తన తండ్రి ఎట్లా పాతాళంలోకి వెళ్ళాడో అలాగే బిడ్డ అయినటువంటి పూతన కూడా పరమాత్మని భక్తి పారవ్యం చేత వాత్సల్యం చేత ప్రేమ చేత అనన్య భక్తి చేత పరమాత్మకి నేను ఇచ్చేయాలి అనుకోవటం అనన్య భక్తి ఆయనకి నేను చేసేది ఏమిటి అనుకోవటం జ్ఞానం అనన్య భక్తి నుంచి జ్ఞాన తారక స్థితికి జీవుడు వెళ్ళాలి ఏదో ఒక రోజున అలా వెళ్లలేదు ఇంకా పూతన అందువలన పూతనకి ఆయన ఉద్ధారణ ఇచ్చాడు అంటే ఎప్పటి వామనావతారం ఎప్పటి మళ్ళీ కృష్ణావతారం మనం వదిలిపెట్టాము గాని పరమాత్మ మనల్ని వదిలిపెట్టడు స్వామి అంటారు యు మే లీవ్ మీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అవుట్ ఆఫ్ ఫిట్ ఆఫ్ ఎమోషన్ బట్ విల్ నెవర్ లీవ్ యు నిన్ను నేను వదిలిపెట్టేదే లేదు ఎక్కడ ఉండు రాను రాను రానులో మూల కూర్చో పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాక్కొచ్చుకుంటా నేను చూసుకుంటా అంటాడు మనమేమంటాం అంటే నేను చూస్తా అంటాం చూస్తా అంటే అహంకారం చూసుకుంటా అంటే ప్రేమ అంతే తేడా పైకేం పెద్ద తేడా అనిపిస్తే చూట్టానికి చూసుకోవటానికి ఏంటంటే చూసుకోవటంలో చాలా చాలా చేస్తేనే చూసుకున్నట్టు లెక్క చూస్తా అంటే చుట్టూ అని చూపు అన్నమాట ఏదో వస్తాడు కాసేపు ఉంటాడు పోతాడు వెళ్లేం పెద్ద పట్టించుకోడు చూస్తాం అనేటువంటి వాడు మాత్రం కడదాకా చూస్తాడు చూడగలిగిన వాడు ఒక పరమాత్మ అని భాగవతం చెప్తున్నది అటువంటి వేళ పూతన ఉద్ధారణ అయినటువంటి సమయంలోనే హిత పురోహితుడు అయినటువంటి గార్గి వచ్చాడు వస్తే సగౌరవంగా నందుడు తీసుకొని వచ్చాడు ఇవాళ మనం అందరం అనుకునేటటువంటి ఊరకరారు మహాత్ములు సడన్గా ఎవరింటికో మనం బెల్ కొట్టి వెళ్ళాం అనుకోండి ఏదో ఒక పని లేకపోతే ఆయన మన ఇంటికి ఎందుకు వస్తారు ఊరకరారు అందరూ మహాత్ములు మిగతా వాళ్ళు పోస్ట్ మాన్ వస్తాడు పాలవాడు వస్తాడు వాళ్ళు మనందరికీ పరిచయమే మహాత్ముడు బెల్ కొట్టి ఎందుకు వచ్చాడు అంటే ఏదో పని ఉంటే తప్ప రాడు అని అక్కడ ఊరకరారు మహాత్ములు నా రథముల ఇల్లకడకు వచ్చుట ఎల్లం కారణము మంగళములకు నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా ఇదిగో పూతన వధ అయింది పూతన పోయింది మా బాలకృష్ణుడు బతికి బట్టకట్టాడు ఇటువంటి సమయంలో మీరు రావటం ఇదేదో శుభసూచకం అని ఆనంద పడుతుంటే జ్యోతిష్యాస్త్రులకల్లా మేటవివి తేజోమూర్తివి అశాంత విఖ్యాత స్ఫూర్తివి బ్రహ్మబోధనుడవు ఆకర్ణింపు నా పల్కు నిర్ణీతుండైన గురుండు మానవులకున్ విప్రోత్రముండండ్రు నీ చాతుర్యంబున నీ కుమారులకు సంస్కారంబు కావింపవే పురోహితులు కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే మన ఇంట్లో పెళ్లి అనుకుంటే ముహూర్తం దగ్గర నుంచి పెళ్ళి అయి పిల్ల అత్తవారింటికి వెళ్ళేదాకా మన వెంబడి పురోహితుడు ఉంటాడు అసలు పురోహితుడు వస్తూనే సెల్ఫోన్ చెవిలో పెట్టుకొని వస్తాడు వాడు ఇదేదో ముగించి ఇంకోదానికి పోవటానికి అట్లా లేదు రోజుల్లో ఒక పని ఒక సమయంలో ఒకరి కోసమే చేయాలి అలాగే మహాత్ములంతా కూడా మన ఇళ్లల్లో రోజు సత్యనారాయణ వ్రతం మన తాత ముత్తాతలు చేశారో లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది చేశామో చెయ్యమో కాదు వాళ్ళు వచ్చి గుర్తు చేస్తారు అయ్యా మీ తాతగారు ఫలానా రోజు పౌర్ణమి నాడు చేసేవారు మీరు మీ నాన్నగారు చేశారు మీరు కూడా వాళ్ళతో అయిపోయిందండి మీరు ఇప్పుడు అదేం చేయటం లేదు మీ దారిన మీరు పోండి అని మనం చెప్పేస్తాం ఆయన ఎంత నమ్రతగా చెప్తాడో మనం కూడా అంత నెమ్మదిగా పంపించేస్తాం మనం ఏమనుకుంటాం అంటే ఆయన పాపం డబ్బు కోసం వచ్చాడు అని వాడు డబ్బు కోసం రాడు హిత పురోహితుడు అవుతాడు వాడు కుల గురువు అవుతాడు కులం సంరక్షించినట్లయితే తాను కూడా రక్షణలో పోషింపబడతాడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి గనుక వస్తాడు గర్గి మరి ఇప్పుడే ఎందుకు రావాలంటే ఇది చెప్పటానికి వచ్చి మీ పిల్లలు ఇద్దరికీ కూడా ఇటువంటి ఉత్పాతాలు జరుగుతూ ఉంటాయి కనుక వాళ్ళిద్దరికీ కూడా మంచి మంగళ పుణ్యాహ వచనం మళ్ళీ చేయమన్నాడు అని అనగానే ఈయన ఏం చేశాడంటే మాకు ఒక అబ్బాయి కాదండి ఇద్దరు ఉన్నారు అని బలరామ కృష్ణులు ఇద్దరినీ కూడా తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చి ఇదిగో వీడు వీడు ఫలానా ఇదిగో ఎర్రగా ఉన్నవాడు బలరాముడు నీలంగా ఉన్నటువంటి వాడు మా కృష్ణయ్య కన్నయ్య అని ఆనందంగా చెబుతున్నాడు చెప్తే అప్పుడు బలరాముడు అంటే ఎవరో తెలీదు ఈయనకి ఎవరికి నందుడికి గర్గుడు చెప్పాడు మున్ను కంసు చేత వేటువడి దివి కదసిపోయిన చరవ శెత్తిన తెరంగు తేటపరచి దేవకీ దేవి కొడుకుగని కృష్ణుని కంసుండు తలంచుగాన రహస్యంబున సంస్కారంబు చేయుట కార్యంబని ఒక్కోసారి అది అదృష్టం దురదృష్టం కాలం కలిసి రాకపరిస్థితులు అనుకూలించకపోతే గుళ్లో పెళ్లి చేయాల్సి వస్తుంది కదా! అలా జరుగుతూ ఉంటాయి ముహూర్తం చేస్తాడు ఇది దాటితే ఆడది దాకా లేదంటే పిల్ల తండ్రికి గండం నడిచిపోతే చాలు మళ్ళీ ఆడది దాకా ఎవడు చూస్తాడు అప్పుడు ఏం చేస్తాడు పబ్లిక్-- ఫంక్షన్ హాల్స్ మనుషుల్ని పిలవటం ఇదంతా ఉండదు ముందు గుళ్లో పెళ్లి చేద్దాం తర్వాత డిన్నర్ ఇద్దాం అంటారు అట్లా కాబట్టి రహస్యంగా చేయమన్నాడు రహస్యంగా ఎందుకు చేయమన్నాడు అంటే ఇక్కడ గనక నీవు ఉపనయనము లేకపోతే ఇంకేదో పుణ్యాహవచనం పబ్లిక్ గా చేస్తే కంసుడికి వార్త వెళ్తుంది. వెళితే మీ ఇద్దరు పిల్లల్ని వాడు బట్టుకుపోతాడు అని. పరతు లేక బట్టుకుపోయాడుగా క్రూరుడ్ని పంపాడు వాడు క్రూరత్వం లేని వాడ్ని పంపాడు సరే. జనులు రమయం పతిరిగడి అనువు కలిమి రాముడని జనులందరితో కలిసిమెలసి ఉంటాడు అందరికీ ఆనందం ఇస్తాడు గనుక ఎర్రగా ఉన్నటువంటి పిల్లవాడిని రాముడు అని పిలుచుకో. చెప్పినాడాయన నామకరణం చేశాడు. యదు సంకర్షంబున యదుకులాన్ని చివరి వరకు నిజానికి మహాభారత సంగ్రామమై శ్రీకృష్ణుడు ద్వాపరకు ద్వారకకు వెళ్ళేదాకా సంతతిని కాపాడిన వాడు ఎవడంటే బల్లరాముడు దేవుడు అందువలన ఆయనకి శంఖర్షుడు అని పేరు. భనబలమున బలుడన బలరాముడని పిలువు మోన్రుపా. పేర్లు పెట్టడానికి కూడా దీని వెనుక ఇంత అంతరార్థం ఉంది అని. ఇప్పుడు వెంకటేశ్వర అని పెట్టాం అనుకోండి వెంకటేశ్వరరావు అని పెట్టాను వాడు వెంకట్ కట్ అయిపోతాడు వెంకటేష్ అంటే ఏష్ అయిపోతాడు వెంకటేష్ లేదు వెంకట్ లేదు మనమే కుదించుకుంటున్నాం మన పేరుని మన జీవితాన్ని కూడా మనంతట మనం పలకలేమనో ఇంత పెద్ద పేరు పెట్టారనో కాదు. వేం అంటే పాపం కట ఖండించే ఈశ్వర అది వెంకటేశ్వర శబ్దం వాళ్ళ వెంకట్ వే-- వెంకట్ కూడా కాదు అది వేం అంటే సంస్కృతం కట్ అంటే ఇంగ్లీషు రెండు కుదరవు ఇది చాలా దురదృష్టం జాతి చాలా విలువలు పోగొట్టుకుంది. సరే కృష్ణుని ఉద్దేశించి కృష్ణుని గురించి ఆయన చెప్పాడు రహస్యం ఏమంటే. శిశువు కవళావర్ణ పీత వర్ణుండై ఇప్పుడు నల్లనైన కతంబున కృష్ణుండయ్యే. ఇప్పుడు నల్లగా కనిపిస్తున్నాడు గనుక కృష్ణుడు అని పేరు పెట్టండి అన్నాడు. వసుదేవునకు ఒక్కడ జన్మించిన కారణంబున వాసుదేవుండయ్యే. ఇప్పటివరకు వీడు నందరందరుడు కానీ వీడెవరో తెలుసునా వసుదేవుడి కొడుకు. పురోహితుడు సత్యం చెప్పాలి ఉన్న విషయం చెప్పాలి ఉన్న విషయం చెబుతున్నాడు ఈయన వసుదేవుడి కొడుకు గనుక నల్లగా ఉన్నాడు గనుక కృష్ణుడని వసుదేవుడి కొడుకు గనుక వాసుదేవుడని అంతే కాదు పాపనికి గుణ రూప కర్మంబులు అనేకంబు కలుగుటం జేసి నామంబులు అనేకములు గలవు అది విష్ణు సహస్ర నామం. ఆయనకు అనేకం అంటే వెయ్యి అనే కాదు వెయ్యి రాశారు అంతే. సహస్రము అంటే అనేకము అని అర్థం సహస్రం అంటే thousand అంటారు not at all అనేకం ఏకము కానిది. ఆయనకి ఏక నామం లేదు కృష్ణుడను వాసుదేవుడను మాధవాను నారాయణాను పేరు పెట్టి పిలిచినా ఆయనకే చెందుతాయి. శావకుని వలన మీరు దుఃఖంబుల తరియింతురు. అద్భకుని చేత అంటే పిల్లవాడి చేత దుర్జన శిక్షణంబు సజ్జన రక్షణంబునగు కుమారుండు నారాయణ సమానుండని నారాయణుడే అని చెప్పడానికి వీల్లేదు చెప్పరు నారాయణ సమానుడు నారాయణుడితో సమానమైన వాడు అని తన గృహమునకు వెళితే నందుడు పరమానందంతో. పూతన పోయింది పూతన ఒంటిమీద మా పిల్లవాడు ఆడుకున్నాడన్న యాతన నుంచి నందుడి యొక్క మనసు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ యందు ఆయన దివ్యత్వం యందు తన ఇద్దరు బిడ్డల యందు కూడా వాత్సల్య రేఖా విలసితంగా పరమానందదాయకంగా నిలబడిపోయింది. ఇది భాగవత నవనీతంలో ఇవాళ ఒక పూతనే చెప్పుకునేటువంటిది కారణం ఏంటంటే చెప్పాలిగా మీకు. వెంకటేశ్వర భక్తి ఛానల్లో ధర్మక్షేత్రం మీద రికార్డింగ్ కి వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళు నాకు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం నన్ను ఆరు గంటలకే కారు ఎక్కించారు కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేప్పటికి సమయం పట్టింది. సరే ఇవ్వవలసిన వాళ్ళకి మెసేజ్ ఇవ్వటం జరిగింది. దానిలో ఏమిటి అంటే ఆధునిక మానవుడికి భగవద్గీత రకంగా ఉపయోగిస్తుంది. ప్రధానంగా యువకులకి అది subject సరే అది తర్వాత మీరు చూద్దురుగా అందువల్ల late అయ్యింది late అయినా పూతన ఉద్ధారణ దాని గత జన్మ పరమేశ్వరుడు జీవుణ్ణి ఎలా వదిలిపెట్టడు ఎలా కాపాడుకుంటాడు అనేటువంటి విషయాలలో ఇవాళ ఎవరిది హంసారంది అనే ప్రశ్న అందరిదీ హంసారంది అందులో చాలా ప్రధానమైనటువంటిది పూతనది. పూతన ఉద్ధారణ పొందింది దానికి జన్మ లేదు పరమేశ్వరుడికే తల్లిగా ఉండగలిగిన స్థాయికి వెళ్లగలిగింది. తనలో ఉన్న సమస్త విష భావాలు సమర్పించింది. విషమే ఒక్కొక్కసారి జాడ్యం అతిశయించినటువంటి వేళ అది అమృతం అవుతుంది. పాతకాలంలో ఆయుర్వేద ఆచార్యులు ఇక కాస్త కింద పడుకోబెట్టండి ఇక వీడు బతకడు అన్నప్పుడు చిట్టచివరి ప్రయత్నంగా విషం పోస్తారు గరళం అంటారు. పోస్తే వాడు లేచి చక్కన మళ్ళీ కూర్చొని వంద ఏళ్ళు పూర్తి చేసి అప్పుడు మళ్ళీ తా పెప్పుతారు అంతే. కాబట్టి గరళమే క్షణాన విషమవుతుంది విషమే వాడికి అమృతమవుతుంది. క్షణాన శ్రీకృష్ణ పరమాత్మ గరళాన్ని స్వీకరించి అమృతత్వాన్ని అంటే మృతి లేని ఒక స్థితిని పూతనకి అనుగ్రహించాడు.ఆమె కూడా ఎంతకాలం వేచి ఉన్నది తన తండ్రి బలి కాలం నుంచి రామావతారం అయిపోయింది అనేక అవతారాలు దాటిపోయినాయి అయినా శ్రీకృష్ణ పరమాత్మ అవతారం వచ్చిన తొలినాళ్లలోనే మొట్టమొదట ఉద్ధారణ పొందినటువంటి స్త్రీమూర్తి పూతన అలాగే మొట్టమొదటి విశ్వరూప నిజ దర్శనాన్ని పొందింది చెరసాలలో దేవకీ వసుదేవులు ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి విశ్వరూప సందర్శనం అనంగానే ఒక అర్జునుడే గుర్తొస్తాడు వాడు last వాడు last వాడు కాదు వాడి తర్వాత ఉద్ధవుడికి ఇచ్చాడు ఆయన ముందు దేవకీ వసుదేవులకు ఇచ్చాడు తర్వాత యశోదకి ఇచ్చాడు తర్వాత అక్రూరుడికి ఇచ్చాడు తర్వాత ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు తర్వాత అర్జునుడికి ఇచ్చాడు తర్వాత ఉద్ధవుడికి ఇచ్చాడు విశ్వరూపం అంటే ఆకాశమంతా పరుచుకున్నటువంటి రూపం కాదు పెద్ద మర్రిచెట్టు ఒక విత్తనంలో దాగినట్టుగా అణోరణీయం అంటాడు భగవద్గీతలో అణువులో పరమాణువుగా ఉన్నదే విశ్వరూప దర్శనం దాన్ని చూడగలిగిన నేర్పరితనం మనకు కావాలి gross గా ఉన్నదేదో ఒక పెద్ద wall poster ని అంటించామనుకోండి చూస్తేనే పెద్ద శ్రమ ఉంది ఎటు ఎగిరి చూసినా కనపడుతుంది చిన్నది అక్కడ స్వామి బొమ్మ అంటించాం ఇంతే parcel ఏంటి వెయ్యాలి పైకెత్తాలి ఏం బొమ్మ ఎటువంటి బొమ్మ ఏం dress లో ఉన్నారు చూడాలంటే అది విశ్వరూపం సూక్ష్మంగా ఉన్నది విశ్వరూపం సూక్ష్మ సూక్ష్మీతరంగా ఉండి స్థూలంగా కనిపించేది విశ్వరూపం కాదు అది దేహ బాహ్య స్వరూపం మాత్రమే కాబట్టి రెండింటినీ జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే సమయంలో బలరామకృష్ణులు ఇద్దరికి కూడా పేర్లు పెట్టబడ్డాయి అది అందువలన గర్గుడికి ఆనందం కలిగింది బిడ్డలు రక్షింపబడినందువలన యశోదా రోహిణులు అంతేకాదు నందుడు ఆనందపడ్డారు గార్గికి ఆనందం కలిగింది పూతనకి మహదానందం కలిగింది మహదానంద కారణమైనటువంటి హంసానందితో స్వామికి మనం చక్కగా సంకీర్తనం చేద్దాం ఇవాళ ఒక అరగంట మీ time నేను తీసుకున్నందుకు మరి దానికేదో punishment వేసుకోవాలిగా ఎవరు వేస్తారు నాతో నేను నేనే వేసుకోవాలి రేపు ఏం చేద్దాం అంటే చక్కగా ఆరున్నరకి వద్దాం రేపేం ఇబ్బంది లేదుగా ఏం లేదు ఇవాళ గురువారం బాగా భజన చేయించుకున్నారు ఆయన that's extended భజన ఆయనకిష్టం సరే రేపు instead of seven we will start at six thirty six thirty రేపు last day నెలకి ఇరవై ఒకటి కాదు ఎందుకంటే ఎల్లుండి నుంచి నేను Vizag వెళ్తున్నాను one week మరి మా మూడు రోజులు ఏమిటని అడిగారు కరుణాకర్ గారు auditor కదు ఉన్న ఉన్న కాగితాలు ఉన్న లెక్కలు వాళ్ళకి లెక్కలు అవి కాదు లేని కాగితాలు లేని లెక్కలు అవి చేరితే మేము manage చేస్తాం అంటారు కనుక మూడు రోజుల సంగతి ఏమిటి అన్నారు వచ్చే నెల కలుపుకోండి పది రోజులు చెప్తాను అని చెప్పేశారు balance sheet పూర్ణమైపోయింది I am
SSSMC · audio

Bhagawata Navaneetham - 58

Home

Bhagawata Navaneetham - 58

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 33:29

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

    Now playing
  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67