Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. సూర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం. ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం మే. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ. యోగాన్ని ఎందుకు ఇచ్చాడయ్యా అంటే అతల వితల సుతలాన్ని దాటిన పాతాళంలో ఉన్నట్లు అయితే పాతాళ లోకంలో నారాయణుని యొక్క స్మృతిని నారాయణుని యొక్క దర్శనాన్ని ఎందుకని నారాయణుని యొక్క దివ్య పాదాలని బలి చక్కగా హేమ పాత్రలో తీసుకొచ్చి బంగారు పళ్ళెంలో పెట్టి [పాఠాలు చదువుతున్నారు] దాన్ని తాకాడు. స్వామి పాదం తాకటం అంటే నాలుగు వేదాలు తాకినట్టు అది ఇవాళ మనకు ఎట్లా లెక్కో వామనావతారంలో కూడా బలి చక్రవర్తి పొందినటువంటి దివ్యానుభూతి. కనుక మూడవ సారి అప్పుడు నా పేరు నారాయణుడు తర్వాత మాధవుడు ఇప్పుడు ఇదిగో ఇట్లా వచ్చానే కృష్ణ అనబడేటువంటి నామంతో నేను పిలవబడతా అన్నాడు. భగవంతుడికి పేరు ఎవరు పెట్టరు స్వామి అన్నారు అన్ని పెట్టు పూరు పేర్లే పుట్టు పేరు లేని వాడు ఒక్కడే వాడి పేరు భగవంతుడు అన్నాడు. భగవంతుడు అనేటువంటి వాడికి మహా మంత్రా రత్న గ్రంథంలో ఒకే ఒక్క పేరు ఇవ్వబడింది సహ అంతే సర్వభ్యః సర్వ సర్వభ్యః సహ అంటే కూడి ఉన్నవాడు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వానికి ఒక పేరు ఉన్నది దాని పేరు ఓం అంతే. శబ్దమయుడైన అటువంటి పరమాత్మ నిశ్శబ్దంలో నుంచి శబ్దంలోకి రావాలి అంటే ఓంకారం చేయాలి ఓంకారంలో నుంచి మళ్ళీ నిశబ్ద భూమిక లోకి మౌన భూమిక లోకి వెళ్ళాలి అంటే సహ అనుకోవాలి స్వాహా కాదు సహ అంటే కూడి ఉన్నవాడు అని ఎవరితో కూడి ఉన్నవాడు అంటే జీవుడితో కూడి ఉన్నవాడు. ఎవడు జీవుడు అంటే జీవుడు మనమే అనేటువంటి భావన. తర్వాత కపీలుడు వచ్చాడు అన్నమాచార్య వారు అంటారు తానే తానే ఇందరి గురుడు వెంకటేశ్వర స్వామిని చక్కగా కీర్తిస్తాడు. తొలినాళ్లలో కపిలుడై దత్తాత్రేయుడై అంటాడు. కపిలుడు దత్తాత్రేయుడి కంటే ముందు అవతారం. కపిలుడు ఏం చెప్పాడయ్యా అంటే అధ్యాత్మ యోగం విచారణ అంతా చెప్తున్నట్లే చెప్తూ యోగాన్ని కూడా దాంతో సమన్వయం చేశాడు. యోగాన్ని సమన్వయం చేశాడు? లయ యోగ, హఠ యోగ, రాజ యోగ, మనోన్మనీ యోగ, ఉన్మనీ యోగ, యోగ ముద్ర, అమనస్క నిద్ర అనేటువంటి వీటన్నింటినీ కూడా సమన్వయం చేసి అష్టాంగ యోగాలు, పతంజలి అష్టాంగ యోగాలు కావివి. శాస్త్ర పరమైన వేద విహితమైనటువంటి ఎనిమిది శాస్త్రాలని కూడా తీసుకొచ్చి యోగాలని అధ్యాత్మలో సమన్వయం చేసి. ఎందుకంటే అధ్యాత్మ విచారణ కేవలం ప్రబోధంగా, ఉపన్యాసంగా, విచారణగా, వాక్కుగా ఉన్నట్లయితే అది పూర్ణం కాదు. దానికి యోగం కూడా కూడి ఉండాలి. యోగం గనక కూడి ఉన్నట్లయితే అందులో ప్రధానంగా లయ యోగంతో లీనమైన యోగంతో గనక కూడి ఉన్నట్లయితే పరమాత్మే వాక్కై ఇక్కడికి వస్తాడు గనక. భగవత్పాదులే యోగ తారావళి లో మాట చెప్తారు [పాఠాలు చదువుతున్నారు] లక్షా ఇరవై ఐదు వేల యోగాలు భారతదేశంలో ఉన్నాయి. ఇవి ఎవరు చెప్తారయ్యా అంటే రాముడు కృష్ణుడు చెప్పలేదు సదాశివోక్తాని. మహేశ్వరుడు కాదు కైలాసంలో ఉన్న శివుడు కాదు కైలాస శివుడికి కూడా మూలమైనటువంటి సదాశివ ఉక్తాని చెప్పినటువంటి లక్షా ఇరవై ఐదు వేల శ్లోక-- యోగాలలో ప్రధానమైనటువంటిది నాదానుసంధాన యోగం. నాభి నుంచి ప్రారంభమై అంటే మూలాధారం నుంచి ప్రారంభమై సహస్రారమును దాటి ద్వాశ-- ద్వాదశాంత స్థానంలో చంద్రకళా స్థానం దాకా వెళ్ళేటువంటి పరబ్రహ్మ తత్వాన్ని యోగించే దిశగా ఏది బోధించాడో దానిని కపిలుడు సాంఖ్యంగా బోధించాడు. దానికి సాంఖ్యము అని పేరు పెట్టారు. తర్వాత వచ్చిన వాడు దత్తాత్రేయుడు నిన్న చెప్పుకున్నాం. నిన్నటి వేళ దత్తాత్రేయుడు కాలాగ్ని సమరుడై వచ్చాడని మళ్ళీ తదియ నాటికల్లా యోగిరాజ వరదుడుగా వస్తాడని నిన్న విచారణ చేశాం. అయితే దత్తావతారాలు రామకృష్ణది అవతారాల వలె కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చి వెళ్ళేవి కాదు. ఇది నిరంతరమైనటువంటి ఒక అవతార ప్రవాహం ఇది. అవతార ప్రవాహంలో ఒక గురువు ఒక దత్తాత్రేయుడు ఒక రూపం గనక ఎత్తి వచ్చినట్లయితే తన శక్తులు ఇరవై నాలుగు చోట్ల నిక్షిప్తం చేస్తాడు. ఇరవై నాలుగు మంది ఆంధ్రదేశంలో మూడు వేల ఆరు వందల మంది యోగులకు శక్తిని ఇస్తాడు. మూడు వేల ఆరు వందల మంది అఖండ భారతావనిలో ముప్పై ఆరు వేల మంది యోగులకి పరమేశ్వరుడి యొక్క శక్తిని పంచిపెట్టి భూమండలాన్ని భారతీ భూమండలాన్ని చక్కగా నిలబెట్టి అధ్యాత్మ భూమికలో నిలకడ చెందిస్తాడు. అందుకే స్వామి గాని తదితరమైన అవతార మూర్తులు గాని గురు స్వరూపాలు గాని రామకృష్ణ పరమహంస గాని అరవిందుల వారు గాని భగవాన్ రమణ మహర్షి గాని ఒక్క మాట చెప్పారు. ప్రపంచం మొత్తానికి గరిమనాభి భారతదేశం. ఎందుకని అంటే ఇక్కడ నుంచి అధ్యాత్మ తరంగాలు వెళతాయి. ఇది యోగ భూమిక మిగతా భూమి-- భోగ భూమికలన్నీ కూడా యోగ భూమిక వైపు ఏదో ఒకరోజును రావాలి. మనం కూడా భోగ భూమికలో ఉన్న వాళ్ళమే.ఇరవై ఏళ్ల నాటి ఇరవై ఏళ్ల వయస్సులో మనకున్న ఆలోచనలు వేరు, ప్రపంచం పట్ల మనకున్న అపేక్షలు వేరు, మనకున్న లాలసలు వేరు. పరిణామం జరిగినప్పుడు, పరిపాకం చెందినప్పుడు వయస్సు చేత, అనుభవం చేత, ప్రాప్తి చేత, ప్రారబ్ధం చేత, పరమేశ్వరుడి యొక్క దయ చేత, పరమేశ్వర స్వరూపం యొక్క సాంగత్యం చేత అవి ఏవీ కాదు అసలు వస్తువు ఇదేని పట్టుకునే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కపిలుడు ఆద్యుడు అయినాడు, తర్వాత దత్తాత్రేయుడు వచ్చాడు, తర్వాత యజ్ఞుడు అని ఒకడు వచ్చాడు. ఆయన కూడా విష్ణువు యొక్క అవతారమే. అంటే పాలన చేశాడు యజ్ఞుడు. ఆద్యుడు అంటే తెలియని వాడు అని. యజ్ఞుడు అంటే తెలిసిన దానితో కూడి ఉన్న వాడు అని. తెలి-- తెలియబడింది ఏది అంటే వేదం. తెలుసుకోవలసింది ఏన్-- ఏది అంటే వేదం. వేదమే వేద స్వరూపంగా యజ్ఞుడుగా వచ్చాడు, అదొక అవతారం. తర్వాత వృషభుడు అని ఇంకొక అవతారం వచ్చింది. ఇది ఎనిమిదో అవతారం. వృషభుడు యోగులకు ధర్మం బోధించాడు. యోగులకు ధర్మం తెలియదా? ధర్మం తెలియకుండానే వాళ్ళు యోగులయ్యినారా అంటే, యోగులకు ధర్మం తెలిసినా యోగ ధర్మాన్ని గనక ప్రపంచానికి పంచి పెట్టకపోతే వాడు యోగి కాదు. ఎందుకోసం యోగి అయినాడు? యోగాని, నాలుగు సిద్ధులు సంపాదించి నేను యోగిని అనుకుంటే సరిపోయిందా? కాదే. నీవు దేనివలన యోగాన్ని పొందావో మార్గాన్ని, ఉపాయనాన్ని, విద్యని ప్రపంచానికి అప్పచెప్పాలి, యోగి బాధ్యత అది. మన రోగం తీయటం, మన రుణాలు తీర్చటం, మనకి అకాల మరణాలు లేకుండా చేయటం దీనికోసమై యోగులు రారు అట్లా అనుకున్నవాడు వాడు నిజానికి యోగి కాదు. మృత్యుంజయ భావన ఎవరికి ఉన్నదో వాడు యోగి అయినాడు. ఎవడు నిత్య తత్వానుసంధాన మూర్తి అయి ఉన్నాడో వాడు యోగి అయి ఉన్నాడు. ఎవడు ప్రపంచంలో ప్రాపంచిక కార్యకలాపాలు అన్నీ దేహంతో చేస్తున్నా ఏదీ అంటకుండా, దేనినీ అంటించుకోకుండా ఉన్నాడో వాడు యోగి అయినాడు కాబట్టి యుగ ధర్మాన్ని పాలించేటువంటి వాడు యోగ ధర్మాన్ని కూడా పాలించాలి అని బోధించటానికి విష్ణువు [గొంతు సవరించిన శబ్దం] అలా వచ్చాడు. తర్వాత పృథువు అని ఒక రాజుగా వచ్చాడు. వేనుడు అనేటువంటి ఒక రాజు ఒక దుష్ట పరిపాలన చేస్తున్నటువంటి వేళ వేనున్ని సంహారం చేస్తే, "నిజమేనయ్యా మంచి పనే చేశావు. ఉన్నవాడిని పోగొట్టావు. మరి మమ్మల్ని ఎవరు ఏలుతారు?" అన్నాడు. "పరమేశ్వరుడి యొక్క దయ చూడండి మిమ్మల్ని నేనే ఏలుతాను" అన్నాడు. ఎందుకు ఏలవలసి వచ్చిందంటే వేనుడి యొక్క దుష్ట పరిపాలన వలన ప్రజలు ఇబ్బంది పడ్డారు. నరకయాతనకు గురైనారు. మళ్ళీ కడుపు నిండాలి, మనసు పండాలి, గుండె నిండాలి అప్పుడే అధ్యాత్మ లోకి వస్తాడు. అందుకే వివేకానంద స్వామి చెప్పాడు హాయిగా మంచి వేదాంత విషయాలు, మంచి బోధ చేయాలంటే ఆకలి ఉన్న వాళ్ళ దగ్గర ఎప్పుడూ విషయాలు మాట్లాడొద్దు అన్నాడు. వాడిలో నుంచి దానవుడు విజృంభిస్తాడు. అన్నీ ఉన్నవాడికి, స్థిమితంగా ఉన్నవాడికి, పెద్ద లోటేమీ లేని వాడికి వాడి దగ్గరికి వెళ్ళి వేదాంత బోధ చేయమన్నాడు. అలాగే అది చేయటానికి పృథువు మార్గం చూపించాడు గనుక ఆయన ఎట్లా వచ్చాడంటే గోరూపంలో వచ్చాడు. గోరూపంలో వచ్చి సముద్ర మధ్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఔషధులు, భూమిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఔషధులన్నీ కూడా తీసుకొని వచ్చాడు. ఇవాళ స్వామి అంటారు "అల్లోపతి ట్రై చేశాను, హోమియోపతి ట్రై చేశాను, నాచురోపతి ట్రై చేశాను. స్వామి ఏం తగ్గలేదు, ఏం గుణం కనిపించలే" అంటే ఉమాపతిని మర్చిపోయినావు బంగారు అన్నాడు. అది, ఉమాపతే అన్ని పతులకి మూలం కాబట్టి ఉమాపతి ఎవడు అంటే ఇదిగో పృ-- పృథువు అనేటువంటి రాజు. తర్వాత మనకు తెలిసిన మత్స్యావతారం. మత్స్యావతారం తర్వాత కూర్మావతారం, దాని కథ మనకు తెలుసు. అక్కడి నుంచి పని చేయమే చిన్నప్పటి నుంచి. మందర పర్వతం అటూ ఇటూ కదలకుండా తన వీపు మీద నిలబెట్టి దాన్ని క్షీరసాగర మథనంలో తన కార్యక్రమాన్ని తాను నిర్వర్తించాడు. అయితే, దీని తర్వాత మరొక అవతారం వచ్చింది. ఔషధులు బయటకు తెచ్చాడుగా మత్స్య రూపంలో, అవన్నీ ఏమైపోవాలి, ఎవరికి తెలియాలి అంటే మళ్ళీ పాపం తానే ధన్వంతరి రూపంలో వచ్చి వైద్యాన్ని, ఆయుర్వేదాన్ని మనకిచ్చాడు. ఆయుష్షు ఎలా నిలబెట్టుకోవాలో, నిలబడిన ఆయుష్షుతో ఎలా జీవించాలో, జీవిస్తున్న జీవితంతో సర్వానందమయమైన జీవితాన్ని సమాజహితంగా ఎలా చేయాలో చెప్పిన వాడు ధన్వంతరి గనుక ఆయన. తర్వాత వచ్చిన వాడు మోహిని. మోహినీ అవతారం తెలుసు. అలాగే వచ్చిన నరసింహావతారం. నరసింహావతారం కూడా చాలా విచిత్రమైన అవతారం. ప్రహ్లాదుడేమో హరి ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంటూ జీవితం గడిపితే హిరణ్యకశిపుడేమో ఉన్నాడా ఉంటే చూపించమనే దాకా తెచ్చాడు. సరే తీరా సమయం వచ్చింది రాత్రి కాదు పగలీ-పగలు కాదు, ఇల్లు కాదు, బయట కాదు దేహలి, గడప మీద కూర్చున్నాడు. వాడిని పిలిచాడు. ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. కలుష రక్తాన్నంతా తాగాడు. హిరణ్యకశిపుడి యొక్క కర్మమాళలు, పేవులన్నీ కంఠమాలగా చేసుకున్నాడు. వాడికి యోగ నరసింహ మూర్తిగా యోగమిచ్చాడు. ఇదేం విచిత్రం? నువ్వు లేవో ఉన్నవాడికి ఒళ్ళో పడుకోబెట్టుకొని యోగమిచ్చాడు. నువ్వు ఉన్నావ్ ఉన్నావ్ నువ్వు తప్ప ఇంకెవ్వడూ లేడన్న ప్రహ్లాదుడికి మాత్రం వాడికి భోగమిచ్చాడు. "నువ్వు రాజ్యం ఏలుకోరా" అన్నాడు. ఇంత చేసి ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడంటే ఆనందం కలిగింది వాడికి, పద్యాలు, పాటల్లో ప్రహ్లాదుడికి. తీరా నరసింహ స్వరూపంగా స్వామి రాగానే స్తంభం చాటుకెళ్ళి దాక్కున్నాడు. తర్వాత వస్తుంది వెనక్కి. ఎలా దాక్కున్నాడంటే భయం వేసింది అన్నాడు. పరమేశ్వరుణ్ణి మనం పై పైన చూట్టం ఆనందమే. స్వామి యొక్క అసలు రూపాన్ని, స్వరూపాన్ని గనక అనుభవించే యోగం ఎప్పుడైనా కలిగితే అది ఆనందం ఇస్తుందా, భయం కలుగుతుందా అంటే ఆనందం ఇవ్వదు భయం ఇస్తుంది. భయం ఎందుకు వేస్తుందంటే రూపాన్ని దర్శించే శక్తి మన దగ్గర లేదు గనుక, దానికి తగిన మానసికమైన శిక్షణ మన దగ్గర లేదు గనుక.కనుకనే విశ్వనాథవారు కల్పవృక్షం లో పద్యం గుర్తొస్తుంది. "ఈ రామాయణం ఇట్లు పూర్తి చేసితిని ధ్యానించెదన్" కదా. ఇట్లా రాశాను, ధ్యానించాను, రామాయణం అలా చెప్పాను, ఇలా ఆనందిస్తున్నాను. అయ్యా! రామాయణం రాసేశాను, అయిపోయే దాకా నా దగ్గర ఉండమన్నాను గానీ అయిపోయినా ఇంకా ఉన్నావేమిటి? భయం బయ్యాడున్నన్నాడు. భయం కలగటం జీవ లక్షణం. భయం లేకపోతే మానవుడు జీవించలేడు. భయం వల్లొ, భక్తి వల్లొ, భగవల్లొ, భగవల్లొ, భగవంతుని గురించి మనం అనుకోవాలి. ఆయన తర్వాత వచ్చినటువంటిది పరశురామ అవతారం. పరశురామ అవతారం తర్వాత వచ్చిన పదిహేడవ అవతారమే వ్యాసులవారు. ఈయన కృష్ణ ద్వైపాయనుడని, కృష్ణ నామంతో ఉన్నాడని మనం చెప్పుకున్నాం మనకు తెలుసు. తర్వాత రాముడు వచ్చాడు, తర్వాత కృష్ణుడు వచ్చాడు, తర్వాత కృష్ణుడితో పాటు బలరాముడు వచ్చాడు కాబట్టి రెండింటికీ ఒక నెంబరే ఇస్తారు. తర్వాత బుద్ధుడు వచ్చాడు. బుద్ధుడు అంటే శాక్యముని అయినటువంటి వాడు కాదు. ఇవాళ చెప్పేటువంటి బుద్ధిజం లోకి సంబంధించిన బుద్ధుడు కాడు. బుద్ధుడు ప్రబుద్ధ మానవుడైనటువంటి వాడు. తర్వాత ఇరవై యొక్క అవతారాలు పూర్ణమైతే, ఇరవై యొక్క అవతారాలు అన్నీ కూడా అంశావతారాలుగా, అర్చావతారాలుగా, కళావతారాలుగా, ఆవేశావతారాలుగా, అనుప్రవేశ అవతారాలుగా, ప్రసవావతారాలుగా, ప్రభవావతారాలుగా వచ్చినాయి. దీనిలో రెండే రెండు పూర్ణావతారాలు, అది రాముడు త్రేతాయుగాన్ని ప్రభావితం చేసిన వాడు. అదే ప్రభావాన్ని మళ్ళీ ద్వాపర దాకా కొనసాగిస్తూ కృష్ణ చైతన్యంగా వచ్చాడు గనుక రామ కృష్ణ అవతారాలు రెండింటినీ కూడా మనం పరిపూర్ణ అవతారాలుగా మనం చెప్పుకుంటాం. కనుకనే రామ అవతారం తర్వాత వచ్చినటువంటి శ్రీకృష్ణుడి యొక్క కథ చెప్పండి అని నైమిశారణ్యంలో సూతుడ్ని మన వాళ్ళంతా కూడా వేళ అడిగారు. దేవకీ వసుదేవులకు పుట్టిన కృష్ణుడి గురించి చెప్పమని. ఎంత జాగ్రత్తగా అడిగారో చూడండి. దేవకీ దేవులకు పుట్టనటువంటి ఇంకో కృష్ణుడు ఉన్నాడా అంటే, ఏమో కృష్ణోర్నామకంగా కొన్ని వందల మంది ఉండొచ్చు. స్వామి ఒక కథ చెప్పారు. మొట్టమొదటి విద్వన్ మహాసభ జరిగినప్పుడు పుట్టపర్తిలో కోనసీమ నుంచి వేద పండితులు వచ్చి రోజు సాయంకాలం ప్రవచనం చేస్తున్నారు. ప్రవచనం చేస్తూ, చేస్తుంటే ఒకాయన సమయం, ఆయనకి టర్న్ వచ్చింది. ఆయన మైక్ దగ్గరికి వెళ్ళి, "ఎవడో నా బోటి వాడు" అంటే ఆయన గురించి, "నా బోటి వాడు విష్ణులోకం దాకా వెళ్ళాడు. వెళితే రోజున విష్ణులోకం ఎంత కూడా చీకటి పడిపోయినట్లు అయింది. ఎందుకు అంటే విష్ణువుకో ధనుస్సుంది చేతిలో. ధనుస్సునక్కడ ఒక ఎలుక కొరికింది. అందువల్ల అంతా చీకటి పడిపోయింది" అని ఆయనేదో చెబుతుంటే స్వామి నెమ్మదిగా మైక్ దాకా వెళ్లారు. వెళ్ళి చెవిలో ఏదో చెప్పి ఏమీ తెలియనట్టుగా వచ్చి కూర్చున్నారు. మహాప్రభువు అంటూ కాళ్ళ మీద పడ్డాడు. "ఏం చెప్పొచ్చారయ్యా" అంటే, "నువ్వు చెప్పే మహావిష్ణువు కథ కాదిది. విష్ణోర్నామకమైనటువంటి ఒక దేవత యొక్క కథ అది. అందరూ అసలు విష్ణువుకు కూడా విల్లుందని, ఎటువంటి బలహీనమైన విల్లు అంటే ఎలుక కొరికైతే తెగిపోయే విల్లు అని, పైగా ఎవరూ వెళ్ళలేని బొందితో కైలాసమో విష్ణులోకమో వెళ్లినట్టుగా ఎలుక వెళుతుందా?" అని తర్వాత ప్రశ్నించారు. కాబట్టి చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి, అడిగేటప్పుడు కూడా జాగ్రత్తగా అడగాలి గనుక సూతుడ్ని వాళ్ళు ఏమడిగారంటే దేవకీ వసుదేవులకు పుట్టిన శ్రీకృష్ణుడి యొక్క కథ చెప్పండి అని అడిగారు. అప్పుడే కథ కరెక్ట్ గా వస్తుంది. "సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసియై ఒంటిపోవ మహాభీతివోహో కుమార అంసున్ యాసుడు చిరంగ వృక్షంబులన్ సంభయక్తం ప్రతిధ్వనులు చకంజేసె మున్ను అట్టి భూతమయున్ మొక్కెద బాదరాయణి తపోధన్యాగ్రణిన్ భీమణిన్" వ్యాసుడు శకుడు తల్లిదండ్రులు తండ్రీ కొడుకులని చెప్పుకున్నాం కదా! భాగవతంలో భాగవత తత్వ నవనీతానికి వెళ్ళేటప్పుడు మనసుకు అతీతమైన విచారణ చేయాలి. మనసుకు అతీతమైన విచారణ ఎలా చేయాలంటే మనస్సును ఒక పక్కన పెట్టి విచారణ చేయాలి అని. లేదా చేయగలిగితే శుద్ధ మనసుతో చేయాలి అని. శకుడు ప్రయాణం చేస్తున్నాడు. ఒంటిమీద నూలుపోగు లేదు. ఆయనకసలు ఏమీ తెలియదు. అవధూతగా వెళ్తున్నాడు. పక్కన ఒక కలనులో ఆడవాళ్ళంతా కూడా స్నానం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈయనను చూసి ఏమీ సిగ్గుపడలే. వాళ్ళు స్నానం చేసే పనిలో వాళ్ళున్నారు, ఈయన దారిన ఈయన పోయినాడు. ఏమిటి మా శకుడు ఇలా వెళ్ళిపోతున్నాడు అని తండ్రి అయినటువంటి వ్యాసుడు "హా శుకా! శుకా!" అంటూ అరుస్తూ వెనక వెళ్తున్నాడట. ఎప్పుడైతే శకుడు అట్లా దాటి వెళ్ళి వ్యాసులవారు వచ్చారో ఆడవాళ్ళంతా కూడా చీరలు కప్పుకొని తమ మానాన్ని తాము చక్కగా మర్యాదపూర్వకంగా కాచుకున్నారట. ఎందుకని వ్యాసులవారు అనుకున్నాడు. శకుడు వెళితే వీళ్ళకేం కలగలేదే, నేను వెళ్ళగానే వీళ్ళంతా ఎందుకు ఒళ్ళు దాచుకున్నారు? అని ఒక ప్రశ్న వేసుకున్నాడు. కారణం ఏమిటంటే శకుడు అవధూత, వ్యాసుడు అవధూత కాదు. అవధూత స్థాయికి వెళ్ళిన వాళ్ళకి స్త్రీ లేదు, పురుషుడు లేడు. బాలుడు లేడు, వృద్ధుడు లేడు. పామరుడు లేడు, పండితుడు లేడు. అసలు పరమాత్మ లేడు, ప్రకృతి లేదు. ఉన్నదంతా ఒక్కటే "సర్వం ఖల్విదం బ్రహ్మ". చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ. స్వామి చెప్పకుండా ఏమీ వదిలిపెట్టారా? కాబట్టి ఉన్నదంతా బ్రహ్మమనే ఒక పదార్థంగా ఉన్నదని, పదార్థాన్ని గనక యదార్థం వైపు తీసుకెళ్ళి సత్పదార్థంగా, సద్విద్యగా ఆత్మను గనక ఎరిగినట్లయితే పూర్ణమైనటువంటి స్థాయికి వెళతాడు గనుక అటువంటి బాదరాయణుడు అనేటువంటి వాణ్ని గురించి ముందు చెప్తున్నానయ్యా అన్నాడు. బాదరాయణుడు ఎవరు మధ్యలో అని కొత్తగా, ఇదేదో కొత్త పేరే అని.బాధరాయనుడన్నా వ్యాసుడన్నా ఒకటే ఎందుకంటే మనకో మామిడి తోట ఉందనుకోండి మనకి ఇల్లు కూడా మామిడి తోటలోనే ఉందనుకోండి ఏమంటాం మామిడి తోట సుబ్బారావు గారు అంటాం అలాగే వ్యాసుల వారు ఒక ఆశ్రమంలో ఉన్నారు ఆశ్రమం నిండా రేగు చెట్లు ఉన్నాయి రేగు చెట్ల మధ్యలో ఈయన వ్యాసుడు ఉన్నాడు గనుక ఆయన బాదరాయనుడు అయినాడు అది బాదరాయనుడు తర్వాత ప్రగడలైనారు పదహారు మంది ప్రగడలలో బాదరాయణ ప్రగడ ఒకడు ప్రగడ అంటే ప్రజ్ఞని ఆధారం చేసుకుని జీవించేవాడు అని ప్రజ్ఞలు రెండు లోక ప్రజ్ఞ అంటే జీవ ప్రజ్ఞ రెండవది దైవ ప్రజ్ఞ కాబట్టి అటువంటి వ్యాసుడికి నేను నమస్కరిస్తున్నాను అంటూ చక్కగా ప్రారంభం చేశాడు సరే ఇంతలోకే ఇదంతా ఎక్కడ వ్యాసులవారు అక్కడ కూర్చున్నాడు నారదులవారు వచ్చారు నువ్వో పని చెయ్ ఎందుకు ఇంత చింతాక్రాంతుడవై ఉన్నావ్ అంటే ఏమో పద్దెనిమిది పురాణాలు రాశాను చతుర్వేదాలన్నీ పరిష్కారం చేశాను పద్దెనిమిది వేల విషయాలన్నీటినీ కూడా గ్రహణం చేసుకున్నాను కానీ నాకు మాత్రం చిత్తశాంతి లేదు చిత్తశాంతి కలగాలంటే నేనేం చేయాలి అని అడిగాడు అడిగినప్పుడు నారదుడు ఏం చెప్తాడు నువ్వు యజ్ఞం చెయ్ యాగం చెయ్ అని చెప్పడు ఏం చెప్పాలో అదే చెప్పాడు ఏం చెప్పాడంటే హరి నామ స్తుతి కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచి భ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుగొందు మానస సరోవరం హిమాలయాల దాకా వెళ్ళక్కర్ల మన మనసును గనక అటువంటి సరోవరంగా చేసుకోగలిగితే పరమహంస అక్కడ ఆడుతుంది అక్కడ నిలకడ చెందుతుంది అక్కడ ఊగుతుంది శ్రీహరి నామాస్తుతి లేని కావ్యము విచిత్రార్ధాన్వితంబయ్యు శ్రీహరిని గురించి నువ్వు రెండు మాటలు రాయ్ దానికి మనం నమస్కారం చేస్తాం నువ్వు వేయి పేజీలు రాయ్ దాంట్లో దేవుని గురించి ఒక్క మాట కూడా లేదు మనం దాన్ని ముట్టుకోం అంతే కదా శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మదన దత్కా కోలగతా కృతిన్ కాబట్టి నువ్వు ఏం చెప్పినా పరమేశ్వరుని గురించి చక్కగా విచారణ చేసేటువంటి రీతిలో నువ్వు భారతాన్ని చెప్పమన్నాడు శ్రీకృష్ణ కథని విష్ణు నామాన్ని దివ్య నామాన్ని విన్నట్లయితే సంసార బంధాలు తొలగిపోతాయో దివ్యుడి యొక్క తలపు మన మనసున కలిగినట్లయితే తలపులన్నీ కూడా అణగిపోతాయో పరమేశ్వరుడి యొక్క ఒక వృషాధిష్కృతమైనటువంటి ఒక భావన కలిగిందో భావనలో నుంచి ఆత్మనిష్ఠ కలుగుతుందో ఆత్మనిష్ఠని నువ్వు పెంపొందించుకోమని చెప్పి విను విను మీ సంసారంబను వననిధిలో మునిగి కర్మ వాంఛలచే వేదన పొందెడు వానికి విష్ణుని గుణ వర్ణము తెలుపుము మునీంద్రా శ్రీ మహావిష్ణువు యొక్క గుణగణాలన్నీ కూడా హాయిగా చెప్పవయ్యా గుణగణాలన్నీ గనక చెప్తూ ఉంటే వాణ్ని వింటూ వింటూ పాప తాప శాప వశంతో ఏర్పడినటువంటి జన్మ జన్మ వలన ఏర్పడిన కర్మ కర్మ వలన ఏర్పడినటువంటి అనుభవాలన్నీ కూడా నశించిపోతాయి గదా అని అంటూ నారదుడు వ్యాసముని ఇంద్రుడికి చెప్పి ఏం చేసాడంటే వీణ వాయించుకుంటూ వెళ్ళిపోయాడు అన్నాడు వీణ వాయించుకుంటూ వెళ్ళాలి వెళ్ళాడు అని ఎందుకు చెప్పాడు అని మామూలుగా అలా వెళ్ళాడు అని చెప్పొచ్చుగా పోతున్నాం అచ్చు వీణ వాయించుకుంటూ ఎందుకు వెళ్ళాడు అంటే మనకి సంగీత పరికరాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎవరు వీణ వాయించు-- వాయించగలరో సుస్వరంగా సస్వరంగా నిస్తంద్ర మంద్రంగా పరవ ఉత్కృష్టంగా తంత్రీనాద రమ్యాకృతిగా ఎవరు వాయించగలరో వాళ్ళకి ముక్తి తజ్జ్యము అలా వాయించగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఒక్కడుండేవాడు వాడి పేరు యాజ్ఞవల్క్యుడు కాబట్టి యాజ్ఞవల్క్య స్థాయికి వెళ్లాలంటే ఫ్లూటు వాయించ కృష్ణుడు కనపడతాడు ముక్తి కాదుగా మన ముక్తి కృష్ణుడు కనపడితేనే ముక్తి కాదు మనల్ని మనం చూసుకునేదే ముక్తి కృష్ణుడ్ని చూడటం దర్శనం ఇంకా దర్శనం చేయటం దర్శనాలు చూపులు దాటి మనల్ని మనం చూసుకోవటమే పూర్ణమైనటువంటి ముక్తి కాబట్టి ముక్త స్థాయికి వెళ్ళేట్లుగా హాయిగా విష్ణుకథా గానం చేయమన్నాడు అనగానే అదృచ్ఛా మార్గంలో వెళ్ళాడు వ్యాసుడు కూడా తన మందిరానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఎట్లాగైతే పోతనామాత్యుడు భక్తియుతంగా ఉన్నాడో వ్యాసుడు కూడా అలాగే కూర్చుని ఉన్నాడు కూర్చొని అప్పుడు ఆయనకి అనిపించింది ఏం రాయాలి అసలు ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి కృష్ణుడి సంగతి ఏమిటి ఇవన్నీ విచారణ చేయవలసి వచ్చింది చేయవలసి వస్తే నిన్న చెప్పుకున్నాం రామాయణం అంతా కూడా ఒక శోకంలో నుంచి పుట్టింది అని అలాగే కలియుగం మహాభారత సంగ్రామ వేళ జరిగినటువంటి భగవద్గీత వ్యాఖ్యానం అయిపోయిన తర్వాత కలి ప్రవేశించాడు ఎక్కడ ప్రవేశించాడు అంటే మహాభారత సంగ్రామ రంగం అంతా వాడు ఆక్యుపై అయి ఉన్నాడు ఆవరించి ఉన్నాడు కనుక యుద్ధం అయిపోగానే అర్జునుడిని రథం దిగమన్నాడు అర్జునుడు ఇంకా జీవుడు వాడికి జీవ లక్షణాలు ఉన్నాయి మనం కూడా అంటాం ఇది అచ్చొచ్చిన ఇల్లు ఇక్కడే ఉంటాం అని అచ్చొచ్చేది లేదు బుచ్చొచ్చేది లేదు అక్కడ ఉన్నంత వరకు బాగున్నాం అంతే ఇంతకంటే బాగా ఉండే ఇల్లు దొరకదా అనుకోవాలి.అనుకుంటేనే మానవుడికి ఆనందం లేకపోతే దానికి బంధం అయిపోతుంది మనస్సు గనుక ఇక్కడ కూడా అర్జునుడు అన్నాడు యుద్ధం అంతా అయిపోయింది నేను విజయుడుగా వస్తున్నాను రధం నాకు చాలా బాగుంది ఇంతవరకు రధం ఇంత అందంగా ఉందని చూడలేదు ఎందుకంటే నా చూపు అంతా ముందు ఉన్నటువంటి సైన్యం మీద శత్ర శత్రువు సైన్యం మీద ఉంది వెనకాడ చూడటానికా నువ్వు ఉండనే ఉన్నావు నిన్ను చూసి నీ వెనుక చూడటానికి లేదు కనుక నేను రధాన్ని వాడుకున్నానో దాని మీద కాసేపు ఉండని అన్నాడు ఒక్క క్షణం ఉన్నావా ప్రమాదం దిగమన్నాడు ఈయన దిగాడో లేదో రధం భస్మం అయిపోయింది ఎందుకైంది అంటే కొన్ని వేల లక్షల కోట్ల అస్త్రశస్త్రాలన్నీ కూడా నరదృష్టి అంతా శాత్రవ దృష్టి అంతా యుద్ధంలో పాండవ మధ్యముడైనటువంటి యోగేశ్వర కృష్ణుడితో కూడి ఉన్నటువంటి ఒక్క రధం మీద నిలబడి ఉన్నది అందరి చూపులు దాని మీద ఉన్నాయి కనుక నరదృష్టి సోకింది నారాయణ దృష్టి కాపాడింది అప్పటి వరకు నారాయణుడు ఉన్నాడు గనుక రధం కాలలే నారాయణుడు దిగాడో లేదో వీటన్నింటి యొక్క ప్రభావం చేత అర్జున రధం కూలిపోయింది కూలిపోయిన తర్వాత ఏమరి యుద్ధం అయిపోయింది భాగవతం కూడా అవమాన భూమిక లో నుంచి ప్రారంభించాడు ఎందుకని అవమాన భూమిక లో ప్రారంభించాడు మానము దేహాభిమానం గనుక వదిలి పెట్టకపోతే దైవాభిమానం పెరగదు దైవానికి కూడా ఒక దేహం ఉంటుంది స్వామి అనేక సార్లు హెచ్చరిక చేశారు దురదృష్టవశాత్తు విషయం ఏమిటంటే స్వామి తన అరవయ్యవ సంవత్సరం వరకు పూర్ణాద్వైత అచల అమృత బోధ చేశారు అరవయ్యవ సంవత్సరం తర్వాత అంటే అరవై వరకు వచ్చిన సనాతన సారథులు ఎక్కడైనా దొరికితే చూడండి అంతా ఆత్మ బోధే ప్రత్యేకం ఇంకొక విషయమే చెప్పలేదు అరవయ్యవ ఏట ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నారు స్వామి నెమ్మదిగా ఏం చేశారంటే మధ్య మధ్యలో చిన్న కథలు చెప్పడం మొదలు పెట్టారు కథలు ఎందుకు చెప్పారు జనరంజకం కోసం కాదు తాను చెప్పినటువంటి విషయాన్ని substantiate చేయటానికి దానికి ఇంకా support ఇవ్వటానికి కథలో ఇలా జరిగింది ఇవాళ నేను చెప్తున్న ఉపన్యాసానికి దీనికి link ఉన్నది అన్నాం మనం ఏం చేశామంటే చిన్న కథల పుస్తకాలు కొనుక్కున్నాం అధ్యాత్మను వదిలిపెట్టేసాం కాబట్టి ఆయన అధ్యాత్మ చెప్పొద్దు అక్కర్లేదు అనుకున్న వేళకి మనకు అది దక్కకుండా పోయింది కథని పట్టుకున్నాం అసలు విషయాన్ని వదిలి పెట్టాం అలా జరగకుండా అవమానంలో నుంచి భాగవతాన్ని అంటే దేహాభిమానాన్ని అప్పటికే వదిలిపెట్టిన అటువంటి తన శుకుడే వ్యాసుల వారికి కొడుకే గురువు అయినాడు గురువు ఎట్లా అయినాడంటే ఈషణత్రయాలు ఉన్నాయి అవి ఏమిటంటే బంధనాలు మూడు ఉన్నాయి పశు పత్ని సుతాలయ పశువు పత్ని అంటే పత్నికి పతి పతికి పత్ని సుత ఆలయ ఇల్లు కొడుకులు భార్య ఇదిగో ప్రపంచం కాబట్టి పశు పత్ని సుతాలయ అలాగే పశువు కూడా ఒక పెద్ద బంధన మనం అనుకుంటాం ఎప్పుడో ఒకసారి మంచి ఆవును చూసినప్పుడు జీవితంలో ఎప్పుడైనా ఒక ఆవును పెంచుకోవాలి అనుకుంటాం అమ్మ ఇక మొదలవుతుంది యాతన పెంచడం అంత easy కాదు అది చాలా కష్టం దానికంటే ఒక అరలీటర్ పాలు కొనుక్కొని ఆవు పాలు రోజు శివుడికి అభిషేకం చేయటం మంచిది కనుక బంధనాలు దాటమని చెప్పటానికి స్వామి చెప్పారు భాగవతం అంతా దాకా మాట గుర్తు పెట్టుకోవాలి భక్తి అంటే భక్తి అంటే జ్ఞానం అంటే వైరాగ్యం అంటే తత్వం ము అంటే ముక్తి ఇది భాగవతం ఇందులో ఇవన్నీ పడుగు పేకగా కాస్త simultaneous గా alternate గా అటు ఇటుగా అన్ని విషయాలు వస్తూ ఉంటాయి గనుక ఎవరికి అవమానం జరిగింది అసలు ఏం జరిగింది మహాభారతంలో దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టేశాడు దుశ్శాసనుడు వాడి ప్రతిజ్ఞ వాడు తీర్చుకున్నాడు వాడు మడుగులో నుంచి బయటకు రప్పించి మరి యుద్ధం చేసి వాడిని కొడితే వాడు నేలమీద ఊరువులు తెగిపోయి పడిపోయి ఉన్నాడు నడవలేడు వాడు ఇంకా సరే అదొక విషాదం అధికారాంతము నందు చూడవలె గదా అయ్య సౌభాగ్యముల్ అని అధికారం ఉన్నప్పుడు అంతా మెరుపు glow ఉంటుంది అధికారం పోగానే ఏమీ ఉండదు మరి ఏముంటుందో మనకు తెలియదు నిన్న మొన్నటి దాకా Prime Minister post లో కూర్చున్న వాడు మనకంటే కూడా వాడికి డెభై ఏళ్ళు ఉన్నవి ఎనభై ఏళ్ళు ఉన్నవి ఉన్ననివ్వండి మనకంటే మెరిసిపోతుంటాడు పదవి పోయిన మరుక్షణం వాడు సహజ కళతో బయటకు వస్తాడు అలాగే ఇక్కడ కూడా దుర్యోధనుడి స్థితి అట్లాగే ఉంటే ఆవేశం కలిగింది ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామకి కలిగి వీడి సభలో మేము ఉన్నాం కదా వీడి ఉప్పు తిన్నాం కదా వీడి అన్నం తిన్నాం కదా వీడికి ఆనందం ఎలా కలిగించాలి అని వాడికి అనిపించింది కౌరవులంతా పోయారు ఇంకెవరూ మిగలలేదు దుర్యోధనుడు ఒక్కడు చివరికి పాండవులన జయించలేరు ఎందుకంటే కౌరవులే నశించారు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నంత వరకు పాండవులకు క్షితి లేదు ఇది వాళ్లకు అర్థమైపోయింది అశ్వత్థామకు కూడా కాబట్టి అశ్వత్థామ ఏమనుకున్నాడంటే నిద్రపోతున్నటువంటి ఉపపాండవ సంహారం చేసినట్లయితే పాండవ వంశాన్నే గనుక నాశనం చేస్తే పాండవులు ఏదో నాలుగు రోజులు రాజ్యం చేసుకొని పోతారు తర్వాత కౌరవులు లేరు పాండవులు లేరు అంతా కాలగమనంలో కలిసిపోతుందని ఒక విపరీత బుద్ధి కలిగి వెళ్ళాడు పడుకున్న వాళ్ళని చంపాడు అది కథ.
SSSMC · audio

Bhagawata Navaneetham - 05

Home

Bhagawata Navaneetham - 05

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 30:08

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

    Now playing
  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67