No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతామ్మి పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ మందర పోతనామాత్యుడు భగవంతుడు కాదు జ్ఞానం కోరి ముక్తి కోరి జగద్గృహితం కోరి శ్రీ కైవల్య పదాన్ని కోరి భాగవతం రాస్తున్నాడు గనుక జ్ఞాన సముపార్జనలో మనస్సుని మనీషాయత్తం చేసిన పరమ భాగవతోత్తముడు అయినటువంటి వాడు అంతేకాదు ఈ మనుజేశ్వరాధము లకిచ్చి అన్నాడు కొన్ని సొమ్ములు తీసుకుని అన్నాడు కాబట్టి నేనేం చెయ్యను అన్నాడాయన అటువంటి వాడు చెప్పినప్పుడు కొన్ని కవితా కల్పనలు కాస్త అతిశయోక్తిగా ఉన్నప్పటికీ అది ఆయన సంస్కారం పరమేశ్వరుడిని ఆయన ఊహించినటువంటి తీరుతెన్నులు అవి నిజానికి మనక్కూడా ఆనందాన్ని కలిగిస్తాయి గనుక అది ఒకనాడు ఈ దేశంలో ఆంధ్రదేశంలో ప్రధానంగా భాగవత పద్యం రాని తెలుగు పిల్లవాడు గాని తెలుగు బిడ్డ గాని లేరు అయితే ఇవాళ తెలుగు పద్యం మనకు అక్కర్లేదు ఒకటి అర్థం కాదు రెండోది గుర్తుండదు మూడోది నాలుగోది పలకటమే కష్టం ఇక పద్యం ఎక్కడ నోట పడుతుంది అయితే తెలుగు పద్యాన్ని గనక చక్కగా చదవటం నేర్చుకున్నట్లయితే పద విభజన లో నుంచే భావార్థం పుడుతుంది మళ్ళీ పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లే రెండోది మెమరీ పవర్ పెరుగుతుంది ధారణా శక్తి పెరుగుతుంది సమృద్ధమైనటువంటి భాషా సంపద ఏర్పడుతుంది నాల్గవది భగవంతుణ్ణి ప్రార్థించటానికి కావలసిన పూకంతో కూడినటువంటి భాష appropriate language అంటామే ఆ correct పదాలు ఏం పదం వాడితే ఆయన కదులుతాడు ఏం పదం వాడితే ఆయనకు ఆనందం కలుగుతుంది ఆయన కంటే మళ్ళీ మనకే ఆ మనలో ఎందుకంటే తొమ్మిది స్కంధాలలో ఆత్మ విచారణ పూర్ణం చేసుకున్నాం మళ్ళీ భగవంతుడు అనగానే ఎక్కడో పైన ఉన్నాడని అనుకోకూడదు ఉన్నవాడు లోపలే ఉన్నాడు అందరిలో ఉన్నాడు అంతటా ఉన్నాడు అందరితో ఉన్నాడు ఆ ఆత్మానందమే అత్యుత్తమమైనటువంటి ఆనంద స్థాయి గనుక ఆ ఆనంద స్థాయికి వెళ్ళటానికి దశమ స్కంధాన్ని గురించి ప్రారంభం చేద్దాం అన్నాడు శ్రీ కృష్ణుడు అంటే ముందు విష్ణువు యొక్క కథ నేర్చుకోవాలి పరీక్షిత్ మహారాజ విష్ణువే కృష్ణుడుగా వచ్చాడు గనుక ఆ విష్ణు కథలు హరి కథలు అన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క దివ్య శక్తిని అనంతమైనటువంటి చైతన్య పారమ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాయి గనుక ఇదిగో నువ్వు అడుగుతున్నావ్ నేనిక హరికథ చెప్తూ ఉన్నాను హరికథ అంటే దేవాలయాల్లో గంటలు వేసే హరికథ కాదు భావోద్వేగానికి లోనై దారి తప్పేటువంటి ప్రవచనమూ కాదు మనీష్ పదే పదే ఈ రెండు శబ్దాలు వాడుతుంటాం స్ఫురహ కోసం మనీషాయత్తమైనటువంటి చిత్తంతో జ్ఞానాధిక్యమైనటువంటి ఒక సంస్కృతితో సంస్కారంతో భాగవతాన్ని వినాలి భాగవతాన్ని వినాలి కాదు భాగవతాన్ని అనాలి కూడా ఈ రెండూ ఎక్కడ లోపిస్తాయో ఊరికే కాసేపు కథ చెప్పుకొని వెళ్ళిపోతాం ఇది పాలు అంతవరకు తెలుస్తుంది పాలల్లో ఒక వెన్న ఉందని ఆ వెన్నలో నుంచి నెయ్యి వస్తుందని నెయ్యి అంటే నెయ్యము అని నెయ్యము అంటే స్నేహమని ఆ స్నే ఆ స్నేహం పరమాత్మతో కూడి ఉండాలని నిజానికి మనకు మిగిలేటువంటి ఒకే ఒక్క స్నేహితుడు ఎవడు అంటే వాడు పరమాత్మేనని తెలుసుకోవాలి అంటే నిదానవతి ఉపాసన చేయాలి ఇక దశమ స్కంధం ఆ ప్రవేశం చేసేటప్పుడు శుకుడి ఆనందాన్ని చూడండి విను తొల్లి రాజ లంచ మముల వేల సంఖ్యల దైత్య విభులు తన్ను ఆక్రమించిన భారమాగ జాలక భూమి రాక్షసులంతా ఈ భూదేవిని ఆక్రమించేశారట మంచి వాడికి చోటు లేని పరిస్థితి ఏర్పడిందట ఇప్పట్లాగానే ఇప్పుడదేగా మంచివాడు అంటే వాణ్ణి కొట్టమంటున్నారు వాణ్ణి మనం దూరంగా వెలివేయమంటున్నారు చెడ్డవాళ్ళందరూ ఓ చోటుకొచ్చి కూడి ఓచోట ఉందామంటున్నారు ఇది ఇప్పటిది కాదు ఆ కాలం నుంచి కూడా ఉంది అక్కడ ఒక భూమి గోరూపయై బ్రహ్మ చేరబోయి కన్నీరు మున్నీరుగా రోదనము చేయ కరుణతో భావించి కమలభవుడు ఎవరైనా సరే ముందు బ్రహ్మ లోకానికి వెళ్ళాలి ఆ బ్రహ్మ లోకానికి ఎందుకు వెళ్ళాలి అంటే విధి నా నొసట ఇట్లా రాశాడు అని ముందు వాణ్ణి తలుచుకుంటాం ఈ బ్రహ్మ నాయందు దయ లేదు నాకు సరైన ఆకారమూ లేదు సరైన సౌందర్యమూ లేదు సరైన జీవితమూ లేదు ఏమిటో నా కథ విచిత్రంగా రాసి పంపించాడు అని వాణ్ణి నిందిస్తాం ఆయన దగ్గరకు వెళ్తాం మొరపెట్టుకుంటాం విష్ణువు దగ్గరకు వెళ్తాం పూజిస్తాం కోరుతాం శివుడి దగ్గర బేలతనంతో జారిపోయి పడిపోతాం నిజానికి ఈ ముగ్గురిలో రక్షించేవాడు ఎవడయ్యా అంటే నిజానికి శివుడే ఆయనకి ఎందుకు జాలి అంటే ఈ జీవులన్నీ పొయ్యవే కదా వీళ్ళందరూ పోవటం నేను చూడాలి కదా ఆ దయ వాళ్ళు అడగ్గానే చేసేస్తే ఉన్నన్నాళ్ళు హాయిగా ఉంటారు కదా అని శివుడు నారాయణమూర్తి ఏమనుకుంటాడంటే అసలు స్థితి నేనురక్షించేవాడిని నేను కాపాడేది నేను ఏది వచ్చినా చక్రం అట్ట వేసేవాడిని నేను కాసేపు ఏడవని అంటాడట ఆయన కాబట్టి భాగవతంలో కథలన్నీ వాళ్ళ వాళ్ళ దుఃఖాలకు అంతు ఉండదు కానీ చివరికి వస్తాడు ఆయన చక్రమో గదో సంకల్పమో స్వయంగా తాను రావటమో వీళ్ళందరూ వెళ్ళేసరికి ధరణి నూరడ పల్కి ధాత్రియు వేల్పులు కదలిరా విష్ణుని కాననేగి విష్ణువు దగ్గరికి వెళ్లారు వెళ్ళాక ఏం చేశారో తెలుసా పురుష సూక్తం బుజదివి అది అందుకనే పురుష సూక్తం చదవాలి. ఎవడు పురుషుడు అంటే నారాయణుడు పురుషుడు శివుడు పురుషుడు బ్రహ్మ పురుషుడు కానీ వాళ్ళు ముగ్గురు గారు శివుడిని స్తుతించిన వాళ్ళ భాగం వాళ్ళకి చేరుతుంది మూడుగా కనిపిస్తున్న ఏక వస్తువు గనుక అక్కడ పురుష సూక్తం చదివారు అద్భుత సమాధి నుండ ఒక మాట విని వారి జోద్భవుండు వినుడు వేల్పులు ధరయు నేను విన్న యెట్టి పలుకు వివరింతునని ఈ దేవతలంతా ఏం చెప్తారో నేను ఏం విన్నానో అదంతా నీకు చెప్తున్నానయ్యా అన్నాడు శుకదేవుడు అంటూ యాదవ కులమున అమరులు ఇది చాలా ప్రధానమైనటువంటి భూమిక ఇది ఈ భూమికలో ఎవరు ఈ యాదవులు అంటే వీళ్ళంతా దేవతా స్వరూప వాళ్ళందరికీ ఏం నిర్ణయించుకున్నారు అంటే ఈ యాదవ కులంలోకి వెళ్లి అక్కడ జన్మ ఎత్తుదాం అని అనుకున్నారు వాళ్ళు కాబట్టి యాదవులు is equal to వాళ్ళు దేవతలు మేదినిపై పుట్టజనుడు మీ అంశములం శ్రీ దైతుడు వాసుదేవు కాదరమున పుట్టి భారమంతయు బాపున్ శ్రీమన్నారాయణుడే వసుదేవుడు వాసుదేవుడుగా వస్తాడు అంటే తన తండ్రి నామాన్ని చెప్తాడు వసుదేవుడు ఆయన తండ్రి దేవకి గర్భంలోకి వెళ్తానని చెప్పిన వాడు నారాయణ ముడి కనుక మీరు మీరు వెళ్ళండి అన్నాడు హరి పూజార్థము పుట్టుడు ఎంత గొప్ప సందేశం చూడండి ఎందుకు పుట్టాలి మేమంతా యాదవ కులంలోనో ఫలానా చోటో ఎందుకంటే హరి పూజార్థము పుట్టుడు హరిని సేవించటం కోసం పుట్టండి మీరు ముందు చేయవలసిన పని అది సురకన్యలు భూమియందు సుందర తనులై హరి కద్రజుడై శేషుడు బలరాముడు ఆదిశేషువే బలరాముడై వస్తాడు ఇక్కడ ఉన్నటువంటి అప్సర-- అప్సరస భానులంతా కూడా అక్కడ అనేకమైనటువంటి యాదవ స్త్రీలుగా అక్కడ పుడతారు హరి కళతో పుట్టుట ప్రియారంభుడై ఈ ప్రపంచమెల్ల ఏ మాయచే మోహితాత్మనగుచు నుండు అట్టి మాయ కమలనాభు ఆజ్ఞ కార్యార్థమై నిజాంశంబు తోడ పుట్టు జగతి యందు మరి ఎవడయా ఈ కృష్ణుడు అంటే సాక్షాత్తు విష్ణువు యొక్క నిజ అంశం అది విష్ణువే కృష్ణుడుగా రాబోతున్నాడు కాబట్టి యాదవులుగా దేవతలు గంధర్వ అప్సరస భానులంతా కూడా సుందరతరమైనటువంటి స్త్రీమూర్తులు హరి పూజ చేయటం కోసం మీరందరూ పుట్టండి సాక్షాత్తు భూభారాన్ని వహించటానికి తీర్చటానికి అలాగే గో బ్రాహ్మణేభ్యః గో బ్రాహ్మణేభ్యః అంటే గో అంటే జ్ఞానం అని బ్రాహ్మణ అంటే బ్రహ్మ చన్-- బ్రహ్మ స్థితి యందు సంచారం చేసే జీవుడు అని విచారణ చేశాం కాబట్టి కులము చేత గోవు-- రూపం చేత జాతి చేత గోవులు కారు కులం చేత బ్రాహ్మణుడు కాదు అని అర్థం గో బ్రాహ్మణేభ్యః అని మిగతా కులం లేదా అని ఘర్షణ పడేకంటే అసలు అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ అని ఆ జన్మ ఎత్తినటువంటి వాళ్ళు జ్ఞానంతో కూడి ఉండాలి ప్రతిరోజూ బ్రహ్మ నిష్ఠలో ఉండాలి కనుక ఆయన వస్తాడు అని వేల్పులందరినీ కూడా పిలిచి ఇచ్చేసిన తర్వాత శూరసేనుడు మధుర శూరసేనంబు అని రెండు రాజ్యాలు వాటి పేర్లు ఆ శూరసేనుడు ఓ రాజైతే శూరసేన రాజ్యానికి ఉగ్రసేన మహారాజు ఒక రాజైతే ఆ ఉగ్రసేన మహారాజు శూరసేనుడి యొక్క వంశంలో వచ్చినటువంటి వాడే కంసుడు ఆ కంసుడి యొక్క చెల్లెలే దేవకి ఆ దేవకి భర్తే వసుదేవుడు తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళకి అన్నీ తెలుసు ఈ చిన్న relation చెప్పకపోతే మనకసలు చెల్లెల్ని చంపే అన్నడి గాడు ఎందుకు ఆశ్చర్యపోతున్నామో తెలియట్లేదు వీడు మనకు మొదటి వాడు వీడు చెల్లెల్నైనా చంపేస్తాను అన్నాడు ఎందుకు ప్రాణ రక్షణ కోసం కాబట్టి వాళ్ళు అప్పటినుంచి ఉన్నారు ఏ మధుర యందు నిత్యము శ్రీమన్నారాయణ N ఉండు చలగు ప్రియ మమమై ఆ మధుర సకల యాదవ భూమీషులకెల్ల మొదటి పురి అయ్యే అది మొట్ట మొదటి పురమైంది అంటే దేవతలంతా ఈ నేల మీద అడుగు పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కడో ఒకటే ఒక ప్రదేశానికి ఒక నగరానికి చేరాలి దాని పేరు మధుర మధురా నగర ప్రదేశంలో విష్ణువు యొక్క అంశాలన్నీ దేవతాంశాలన్నీ జీవుడుగా మానవ జన్మ ఎత్తి అక్కడికి వచ్చినాయి ఆ శూరసేనునకు ఆత్మజుండగు వసుదేవుండు ఆ పురి ఒక్క దినమందు దేవకి పెంగియే కథ నడిపిస్తున్నాడు వసుదేవుడు దేవకిని పెళ్లి చేసుకున్నాడు దేవకి అన్నగారు కంసుడు వాడికి ఆ చెల్లెలు అంటే ఎంత ఇష్టం అంట అంటే వాడు స్వయంగా రాజై యుండి కూడా నా చెల్లెల్ని వాళ్ళ అత్తవారింట నేనే స్వయంగా రథం నడుపుతూ తీసుకెళ్తానన్నాడు ఆ దేవకి యందు అంత ప్రేమ ఉన్నది.ఆ ప్రేమ అంతా ఎందుకు ఉన్నది అంటే సహజంగానే ఉన్నది వాడికి కానీ ఆ చెల్లెలు కడుపున పుట్టిన వాడే వీడి కాలాంతకుడన్నప్పుడు మాత్రం ఆ ప్రేమే ద్వేషంగా మారిపోయింది. అన్నా చెల్లెళ్ళ ప్రేమ అది చెడిపోవడానికి మూడు కారణాలు ఉంటాయి. ఒకటి అన్నయ్య గారికి బాగా డబ్బు ఉండి వదినగారు ప్రదర్శిస్తుంటే చెల్లెలుకి నిద్ర పట్టదు అది. అదంతా మా అన్నయ్య డబ్బు అంటుంది మీ అన్నయ్య డబ్బు వాడికి చెందుతుంది నీకు చెందదు కానీ స్పృహ ఉండదు. రెండవది అన్నకి చెల్లెలి యందు ఎప్పుడు చెడిపోతుంది అంటే తన వాటాజనకాము అడ్డం వచ్చినట్లయితే చెల్లెలు లేదు ఏం లేదు నేను ఇస్తే తీసుకోవాలి గానీ నేను ఏదన్నా అట్లా పడేస్తే తీసుకోవాలి పిలిస్తే పెడితే ఏదో ఒక సారే కుంకుమ పసుపు తీసుకెళ్లాలి గానీ ఆస్తులు పట్టుకెళ్లడానికి చెల్లెళ్లు ఎలా అవుతారు అంటాడు వీడు. కాబట్టి కంసాంశతో కూడా వీళ్ళు కూడా వస్తారు కాబట్టి అటువంటి అన్నయ్యలు ఉన్నట్టయితే వాడి పేరు కంసుడు అని పెట్టుకోండి హాయిగా సుఖం వాడు అలా వచ్చాడు అని. మరి విష్ణు అంశతో కృష్ణుడు వచ్చినప్పుడు కంసుడు అంశతో వాడు రాడా? వాడు రావాలి వాడు రాకపోయి ఉన్నట్లయితే విష్ణువుకి ఇక్కడ ఏం పని లేదు. వాడు వచ్చాడు గనుకనే ఈయన కూడా వచ్చాడు అని అర్థం. దేవకీయుతాము కడువేక్క రథమెక్కి కదలు వేన ఉగ్రసేనిని పుత్రుడుల్లాసి కంసుండు చెల్లెలు మరదియు ఉల్లసిల్ల హరుల పగ్గముల చేనంది. హరులు అంటే గుర్రాలు. ఆ పగ్గాలు పట్టుకొని రొప్పదడంగె ముందట భేరులు ఉరజములును శంఖ పటహములు జడిగొని మ్రోయంగ కుతుతోడి వేడ్క కొసలు సాగ దేవకుండు సుతకు దేవకీదేవికి అరణమీ తలంచి ఆదరించి. అనేకమైన రథాలు గుర్రాల మీద చీర సారె అన్నీ పట్టుకెళ్తున్నాడు అరవం తీసుకొని స్వయంగా వెళ్తున్నాడు. అదే సమయంలో చూడండి విధి ఎట్లా ఉంటుందంటే వాడి దారిన వాడిని వెళ్ళనివ్వచ్చు కదా అలా జరగలా. పగ్గలును వదిలి వేగిరను అగ్గలనుగా రథము కడుపు నా కంసుండు లో వెగ్గిలి ఎక్కిలి తలపగ దిగ్గన అశరీరవాణి దివినిట్లనియెన్. ఏదో ఒక మాట ఓ శబ్దం శరీరం లేదు ఆకృతి లేదు అది అశరీరవాణి అందుకే మన వాళ్ళు దానికి ఆకాశవాణి అని పేరు పెట్టారు ఏ ఏఐఆర్ అంటే అది. ఆ ఆకాశవాణి అశరీరవాణి ఆ గగనంలో నుంచి ఒక మాట అన్నది. ఏమన్నదయ్యా అంటే సృష్టయగు భగిని మెచ్చగ భగిని అంటే సోదరి నిష్ఠుడవై రథము గడపె ఎరుగవు మీదన్ ఇంత ఉత్సాహంగా నీ చెల్లెల్ని తీసుకెళ్లి ఇంత సంతృష్టి చెందినటువంటి ఆమెకు చెప్తున్నావే ఏం ముందేం జరగబోతున్నదో నీకు తెలియటం లేదా? అని సృష్టయగు మీ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరియించుంచుమీ. అష్టమ గర్భం నీ చెల్లెలి ఎనిమిదవ గర్భంలో పుట్టేటువంటి వాడి వలన ఆ గర్భం వలన నీకు మరణం సంభవిస్తుంది. అనగానే ఒక్కసారి ఇదేమిటి చెల్లెల్ని కాపరానికి తీసుకెళ్లే వేళ ఆ చెల్లెలు కడుపులో పుట్టిన వాడే నీకు కాలాంతకుడు ఆ నర రూపంలో ఉన్న యముడవుతాడు అని చెప్తున్నది ఇదేదో అశరీరవాణి అన్నాడు. లోపల దానవ గుణాలు ఉన్నాయి విచక్షణ కోల్పోతాడు జీవుడు ఆగ్రహం చెందాడు భయం చెందాడు. భయము ఆగ్రహము రెండూ కలిసిపోతే అది నిప్పు నెయ్యి కలిసినట్టే ఆ మంట ఆరేది కాదు భయముంటే ఎలాగైనా తగ్గించవచ్చు ఆగ్రహముంటే పది నిమిషాల తర్వాత తగ్గుతుంది రెండూ కలిస్తే ఏమిటిది భయంతో కూడి దానికి కారణంగా ఏర్పడినటువంటిది నా వంటి వాడికి కూడా ఇటువంటిది ఉంటుందా అని. అప్పుడు వెనకాల ఉన్నాడు వసుదేవుడు ఆ వసుదేవుడు ఏమన్నాడో తెలుసా ఆ వాళ్ళకి కూడా వినిపించింది. వినిపిస్తే అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో. ఏదన్నా డబ్బు ఇవ్వాలి చీరలివ్వాలి నువ్వు ఆమెకి సోదరుడివి మన్నన సేయుటో మధుర మంజుల భాషలాదరించుటో మిన్నుల మోతలే నిజము వేలని చంపకుమన్నా. నిన్ను ఆకాశంలో పుట్టినటువంటి ఒక మాట విని ఈమెను చంపేస్తానంటావు ఏమిటి? మాని రానన్న సహింపుమన్న సగజన్న వధింపకుమన్న వేగజన్. అంతే కాదు ఇంకా చెల్లెలి పట్ల అంటే సామాజికమైనటువంటి ఒక బంధాన్ని ఇక్కడి నుంచి ఏమవుతుందంటే ప్రపంచాన్ని ప్రపంచాతీతమైనటువంటి స్థితిని పోతనామాత్యుడు రెండు జోడు గుర్రాలుగా సాగిస్తాడు ఆయన. ప్రాపంచిక ధర్మం మనోధర్మం ఆర్షధర్మం స్వధర్మం ఆత్మధర్మం వీటన్నింటిని సమన్వయం చేయాలి లేకపోతే అది భాగవతం కాదు. కనుక చెల్లెలు కన్నె ముత్తరాలు అపల నీ క్షేమంబు చింతించు. ఎప్పుడూ నీ క్షేమమే కోరుకుంటూ ఉంటుంది నీ చెల్లెలు. నిర్మల దీనిన్ బయటవాడు మాటకులై మర్యాద పోదు అట్టి సత్కుల సంజాతుడవు పుణ్యమూర్తివి అకటా కోపంబు పాపంబు. పాపం ఏంటంటే కోపమే పాపం. నెచ్చెలిని ఓహో తెగబ్రేయ పాడి యగునే చింతింపుము భోజేశ్వరా భోజరాజ్యమది ఆ భోజరాజ్యానికి చెందినటువంటి ఒక అంశుడా! నీ చెల్లెల్ని అయ్యా ఆదరించాలి, అనాదరించకూడదు ఇలా చంపుతావా? అని ఏచ్-- కాస్త ఆత్మ విచారణ చేయాలి కదా శుకదేవుడు మరి పరీక్షిత్ మహారాజు కథ చెప్పి రంజిల్లో చేస్తాడా? ఆయన్ని మళ్ళీ ఆ మృత్యువుకి prepare చేయాలి. కనుక ఏం చెప్తున్నాడు అంటే "మేనితోడన పుట్టు మృత్యువు జనులకు" శరీరం తల్లి గర్భంలో పడగానే, ప్రారంభం కాగానే దాని వెంటనే మృత్యువు కూడా ఉన్నది. తర్వాత అని రాలేదు, తర్వాత ఏదో పదేళ్ళు అయ్యాక రాదు. ఆ తల్లి గర్భంలో ఉండగా కూడా ఉంటుంది. చి-- "ఎల్లి నేడైనా" ఇవ్వాళ కావచ్చు "నూనేళ్ళకైనా తల్లంబు మృత్యువు" It is certain one has to go. "దేహంబు పంచజనంద కర్మానుగుణై శరీరి మారు దేహంబు నూది మరి తొంటి దేహంబు పాయును తన పూర్వ భాగమెత్తి వేరుంటిపై బెట్టి వెనక భాగంబెత్తి గమనించు తృణజలుకయు బోలె వెంట వచ్చు కర్మ వివరంబున మును మేలు కన్న వేళ నరుడు కన్న విన్న తలపబడిన కార్యతంత్రము కలలోన పాడితోడ కనబడియ నట్లు" మనం ఉన్నాం, రెండు కాళ్ళు ఒకేసారి నేల మీద పెట్టి నడుస్తామా? నడవము. ఓ కాలు ముందుకేస్తాం అడుగు ముందుకెళ్తాం, మళ్ళీ అందుకోవడానికి ఎడం కాలు జాపుతాం, కుడి కాలు వెనకబడుతుంది. కాబట్టి నడక ఎలా సాగుతుంది అంటే ఇలాగే సాగుతుంది. మనిషి అనుకుంటాడు ఈరోజు ముందుకెళ్లాను అనుకుంటాడు. మృత్యువు నేనేం వెనకబడలేదు, నువ్వు ఆ కాలు వేయగానే నేను ముందుకెళ్తా అంటుంది. సో కుడికాలు, ఎడంకాలు ఏమిటయ్యా అంటే జీవుడు మృత్యువు కలిసి ఉన్నటువంటిది. ఫలానా రోజు అయ్యో పాపం నిన్నటిదాకా నిన్న రాత్రి కూడా మాట్లాడాడు, పొద్దున్న పట్టి లేదంటే అక్కడే ఉన్నాడు వాడు. వాడి time వచ్చింది పట్టుకుపోయారు వాళ్ళు. దాని గురించి విచారించొద్దు అంటున్నాడు పరీక్షిత్ మహారాజు. అంటే వైరాగ్యం చెప్పకపోతే ఆ కృష్ణుడు అసలు ఎంతమందిని ఎన్ని రకాలుగా ఉద్ధారణ చేశాడో ఆశ్చర్యపోతాం రాను రాను. మనకందరికీ పూతను చంపాడు, శకటాసురుడిని చంపాడు, ఫలానా వాడిని చంపాడు, చంపాడు, చంపాడు, చంపాడు అని చెప్పారు మనకి. చంపలే అందరికీ ఉద్ధారణ ఇచ్చాడు ఆయన. ఎలా ఇచ్చాడు? దానికి రహస్యాలు దీంట్లో మనకి నెమ్మదిగా బయట పడతాయి. "తన తొంటి కర్మ రాశికి అనుచరముల్లీ బహు వికారమై మనసు పడించను ఇంద్రియముల తరవుల తనువులు పైక నచడవు తన కర్మంబుల్" ఇవ్వాళ ఈ శరీరం వచ్చింది, ఈ జీవితం వచ్చింది, ఈ సుఖము, ఈ శాంతి అనబడేటువంటివి ఏర్పడుతున్నాయి, జీవితంలో స్థితి ఏర్పడింది అంటే ఇప్పుడు సాధించుకున్నవి కావు. ఎప్పటివో. కష్టం వచ్చింది నేను ఏం చేయలేదండి కష్టం. నువ్వు ఇప్పుడేం చేయలా అప్పుడేదో చేశావ్. అందుకని ఇప్పుడు వచ్చింది అది. చేయగానే వస్తుందా? విత్తనం పెట్టగానే ఒక వృక్షం వచ్చేసి రాత్రికి రాత్రే మామిడి కాయలు, మామిడి పండ్లు వస్తాయా? విత్తనం అలా వేశావు నెమ్మది నెమ్మదిగా ఓ పదేళ్ళు, పదిహేనేళ్ళు అయింది. దానికి కొమ్మలు, రెమ్మలు, బలం ఏర్పడింది అప్పుడు దాని ప్రతాపం చూపిస్తుంది. కర్మ ఫలాలు కూడా అలాగే ఏర్పడతాయి అని చెప్తున్నాడు. అలాగే శరీరాలు ఎలా ఏర్పడతాయి అంటే పుణ్య కర్మ విశేషం చేత శరీరాలు ఏర్పడతాయి. కొంతమంది అంగవిహీనులుగా పుడతారు పాపం. వాళ్ళు ఏం పాపం చేశారో అనుకుంటాం. అది కూడా కర్మానుసారమే శరీరం కూడా ఆ కృతి చెందుతుందట. పాపకర్మం వలన కాదు, పాప భావం వలన. పాప భావం ఎక్కడ ఉన్నది? తల్లి గర్భంలో ఒక అండంగా, పిండంగా ఉన్నప్పుడు పూర్వ స్మృతులన్నీ తాను వదులుకోలేదు గనుక అంత గొప్ప శరీరాన్ని ఇచ్చిన, అంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన పాపకర్మలు వీడు చేశాడు గనుక వీడికి మళ్ళీ ఇంత గొప్ప జన్మ, ఇంత శరీరం ఇవ్వక్కర్లేదు అనుకుంటుంది. కాబట్టి కర్మలన్నీ కూడా ఒక శరీరంగా రూపాంతరం చెందుతాయి. ఈ బొమ్మలన్నీ ఎవడో బ్రహ్మ గీశాడని అనుకుంటాం. మన బొమ్మ మనమే గీస్తాం, దాని మీద ఊరికే ఆయన ముద్ర వేస్తాడు. post office కి వెళ్తాం, ఇంగ్లాండ్ letter మన డబ్బుతో మనం కొంటాం కదా. మన ink తో మనం రాస్తాం. మన విషయాలే రాస్తాం. ఊళ్లో ఎల్లరు రాయంగా అవీ వస్తాయి. సరే రాస్తాం, అంటిస్తాం, post చేస్తాం. తీసుకెళ్లేవాడు ఎవడో తీసుకెళ్తాడు. కానీ ఆ ఉత్తరంలో ఉన్న విషయానికి మోసుకెళ్లిన వాడికి సంబంధం లేదు. రాసిన వాడికే దాంతో సంబంధం ఏర్పడింది. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మ కలరాతలు రాయటమే ఉండదు. మనం ఏం చేస్తే దాన్ని బట్టి ఆయన కలం అలా సాగుతుంది అంతే. మంచి చేశామా మంచి, చెడు చేశామా చెడు. అనుభవించాలి కాస్త ముందో వెనకో అని ఉంటున్నాడు ఆయన. ముందు కాలో వెనక కాలో ఎక్కడో ఒకడ మాత్రం అది ఉండవలసింది. అంతే కాదు ఇంకొకటి "కర్మలు మేలు నిచ్చును కర్మంబులు కీడు నిచ్చు" అంటే సత్కర్మలు, దుష్కర్మలు రెండు ఉన్నాయి. దుష్కర్మ అంటే ప్రపంచానికి హాని చేసే ఏదైనా దుష్కర్మే, అది పాపం. సత్కర్మ అంటే ప్రపంచానికి మనం చేసిన మంచి పని వలన వాళ్ళందరూ ఆనంద పడుతున్నప్పుడు ఆ ఆనందంలో మనం కూడా భాగస్వాములం అయినప్పుడు అది పుణ్యంగా లెక్క. దానం, జపం, తపం, త్యాగం ఇవి ఏవీ కూడా సత్కర్మలు మాత్రమే తప్ప అవి పూర్ణ పుణ్యకర్మలు మాత్రం కాదు. అందుకనే "న కర్మణా న ప్రజయా ధనేన చాగేనైక అమృతత్వమానశుః" కర్మ వలన, ధర్మం వలన, డబ్బు వలన, బంధుజనం వలన ముక్తి రాదు. అమృత పుత్రుడివి కావు నువ్వు. నీకు శాశ్వతత్వం కలగాలి అంటే "చాగేనేనైక" త్యాగం చేత మాత్రమే. కాబట్టి "కర్మమును బ్రహ్మకైనను కర్మ గుడై పరుల తడవగా ఏటికిన్ వాని చెల్లెలు గాని పుత్రిక వంటిది ఉత్తమురాలు సంభావనీయ చరిత్ర" ఇదెందుకు చెప్తున్నాడంటే వ్యాసులవారు దేవసి యొక్క గర్భం ఎంత ఉదాత్త గర్భమో చెబుతున్నారు. ఎంత ఉత్తమ గర్భమో అది కాకపోతే భగవంతుడు వస్తాడా? ప్రవేశిస్తాడా? అందుకనే ఆమె గురించి చెప్తున్నాడు. "సంభావనీయ చరిత్రం వీరు బాల మోత్ర వివాహ సుశ్రీ విలాసిని దీన కంపిత చిత్త నీకిద ముఖదం కావవే కరుణామయాత్మక కంసా మానస వల్లభా" నీ చెల్లెలు ఎంత గొప్పది, ఎంత మంచిదయా! కరుణతో కాస్త చూడు నీ చెల్లెల్ని కాపాడుకో అన్నాడు. అని అనేకమైనటువంటి విషయాలు చెప్తూ "లవనకు పుట్టిన కుమారుని వలనన్ తెగదంచు గగర వాణి పలికెన్ అల్చు అలిగెద వేని మృగాక్షికి కల కొడుకుల చంప నిత్తు క్రమమున నీకున్"
SSSMC · audio
Bhagawata Navaneetham - 52
Bhagawata Navaneetham - 52
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 25:48
More in this series