No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ వేదవ్యాస ప్రోక్తమై బ్రహ్మర పోతనామాత్య క్రితమైనటువంటి శ్రీమద్భాగవతంలో దశమ స్కంధాన్ని ఆరంభించుకున్నాం అసలు శ్రీకృష్ణ జననమే జగన్మోహం ప్రతి కదలిక వెనుక ఒక మార్మికత ప్రతి మెదలిక వెనుక ఒక తాంత్రికత అన్నిటా అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాసుదేవ తత్వానికి శ్రీకృష్ణావతారం ఒక పతాక స్థాయి పరమోత్కృష్టమైనటువంటి భక్తి, కర్మ, జ్ఞాన ఈ మూడు యోగాలని ఏకకాలంలో విశ్వకల్యాణ కాంక్షి అయి జ్ఞాన వరదాయి అయినటువంటి శ్రీకృష్ణుడు తన జీవితం అంతా పాటించాడు అందుకనే అలా పాటించాడు కనుకనే చివరలో భగవద్గీత చెప్పేటువంటి ఒక అర్హతను పొందగలిగాడాయన తాను చేయనిది బోధించలేదు తాను ఏం చేశాడో అది బోధించాడు పద్దెనిమిది అధ్యాయాలుగా బోధించాడు అందులో మొదటి ఆరు కర్మయోగం గా మధ్యలో ఆరు భక్తి యోగం గా చివరి ఆరు జ్ఞాన యోగం గా మూడు ఆరులు పద్దెనిమిది ఈ పద్దెనిమిది యోగాలలో ఏమున్నది అనంటే మానవ జీవితం ఇమిడి ఉన్నది మనం నిద్రలేచింది మొదలు పడుకో పోయేదాకా అంటే మళ్ళీ నిద్ర లేచే దాకా అంటే పుట్టినది మొదలుగా గిట్టి మళ్ళీ పుట్టే దాకా మన జీవితమే ఒక దివ్య భాగవతం మన ఆలోచనలే ఉత్కృష్టమైనటువంటి భగవద్గీత మన ఉచ్వాస నిశ్వాసాలే శ్రీకృష్ణుడి వేణుగానం మన ఆలోచనా సౌందర్యమే శ్రీకృష్ణుడి సౌందర్యం మనలో కలిగేటువంటి చాతుర్యము, ధీశక్తి, యుక్తి, శక్తి, భుక్తి, ముక్తి ఇవన్నీ కలిగిన ట్లయితే కలబోసుకున్నట్లయితే అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఘనీభవించినటువంటి ప్రసాదేశం ఇవన్నీ ఇంతగా పరుచుకున్నటువంటి అవతారం మనం ఎక్కడ కనం వినం రెండే రెండు ఉన్నాయి ఒకటి శ్రీరామావతారం పరమ కారుణ్యమూర్తి ఆయన శ్రీకృష్ణావతారం ఇది లీలా వైభవం దీంట్లో అంతా చమత్కారమే అందుకనే సత్యసాయి భగవానుడు తన అవతార ప్రకటన చేసిన తొలినాళ్లలో ఈ అవతారం ఎందుకు వచ్చింది అనేదానికి ఆయన నాలుగు దశలు నిర్దేశించారు ఏదో స్వామి కూడా నాలుగు ప్రాస మాటలు మాట్లాడారు అనుకున్నారు గాని అరవై డెబ్భై ఏళ్ళు నడిపితే తప్ప దాని వెనుక ఉన్న అంతరార్థం తెలియదు సత్యసాయి అవతారం వచ్చింది చమత్కారంతో ఆ చమత్కారం సంస్కారం వైపు దారి తీస్తుంది ఆ సంస్కారం పరోపకారం వైపు పరుగులు పెట్టిస్తుంది చివరగా సాక్షాత్కారాన్నిస్తుంది అన్నారు అంటే చమత్కార, సంస్కార, పరోపకార, సాక్షాత్కార ఈ నాలుగు విధాలుగా సత్యసాయి భగవానుడి యొక్క అవతారం అలాగే సాగుతూ ఉన్నది చూస్తున్నాం ఇవాళంతా సాక్షాత్తు ఆకారమే అది అది సాక్షాత్కారం అంటే. సాక్షాత్కారం అంటే ఎవడో కొత్తవాడు వచ్చి కనపడటం కాదు మనకి మనం కనపడటం అది మనల్ని మనం చూసుకోగలిగిన ఒక స్థాయిని పొందటం సమాంతరంగా విచారణ చేస్తూ ఈ దశమ స్కంధం అంతా గనుక చేసుకోగలిగినట్లయితే భాగవతమే అధునాతన కాలంలో సత్యసాయి దివ్య జీవన విధానం మై లైఫ్ ఈస్ మై మెసేజ్ అన్నది ఈయన కూడా ఆచరించి బోధించారు తన గ్రామాన్ని తాను ముందు బాగుచేసి గ్రామ సేవలోకి వెళ్ళండన్నారు తాను భజన రాసి, తాను నేర్పి, తాను పాడి, తాను కూడి, తాను ఆడి మీరు భజనలోకి వెళ్ళండి అన్నారు అలాగే ఏం చేసినా తాను చేసిన తర్వాతే జగత్తుకు బోధించారు నేను ఊరికే బోధిస్తూ ఉంటాను మీరు అంతే చేస్తూ ఉండండి అనలే ఆయన చూసే అవతారం కాదు ఇది చేసే అవతారం చేయించే అవతారం శ్రీరాముడు చేయించే అవతారం కాదు స్వయంగా చేసే అవతారం అంటే మానవుడు ఒక ఉత్కృష్టమైనటువంటి స్థాయికి వెళ్లాలంటే చతుర-చతుర్విధమైనటువంటి పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటిని కూడా ఒక జీవన ఉపాయనంగా జీవితంలో ఒక భాగంగా ఒక సాధనా మార్గంగా ఎలా స్వీకరించాలో రాముడు తన జీవితం ద్వారా బోధించాడు కృష్ణుడు తాను ఎడగా, పెడగా, దూరంగా, సాక్షి భూతంగా ఉంటూ సర్వ జీవుల చేత ఈ కార్యకలాపాలలో వారి మనస్సును నిమగ్నం చేసి తనలోకి సాయుజ్యాన్ని అనుగ్రహించాడు కాబట్టి పూర్ణావతారులైన రామకృష్ణ అవతారాలు రెండు ఈ జాతి, ఈ ప్రపంచం, ఈ-ఈ సృష్టి ఉన్నంత కాలం ఇలాగే చెప్పబడుతూ ఉంటాయి ఏదో సమయంలో ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు ఆయా కాలాలలో ఎవరు వినవలసిన వారున్నారో వారంతా అక్కడ ఏర్పడే ఉంటారు కాబట్టి ఇది కూడా ఒక భగవంతుడి యొక్క దివ్య లీలా విలాసంలో ఒక భాగం కాబట్టి ఈ పరమోత్కృష్టమైనటువంటి భాగవతాన్నివ్యాస భగవానుడి యొక్క కుమారుడు అయినటువంటి శుకదేవుడు శుకావధూత ఆయన ముక్తావధూత శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు బోధ చేస్తుంటే ఆయన అధ్యాత్మ ఆత్మవిద్య యోగవిద్య అన్నింటి తొమ్మిది స్కంధాలలో పూర్ణం కాగా దశమ స్కంధంకి వచ్చేసరికి ఆయన అడిగాడు కృష్ణుడి కథ చెప్పు అని నిన్న చెప్పుకున్నాం అట్లా చెప్పుకుంటున్న సమయంలో కృష్ణుడు పుట్టాడు నిన్న ఈ సమయానికి కృష్ణుడు పుట్టాడా ప్రభవించాడు ఆ ప్రభవించాడు ఎలా ప్రవేశించాడు అంటే తన అన్నగారుగా ఆదిశేషుడిని పంపాడు దేవతలందరినీ కూడా గోపిక వ్రజ సమూహంగా పంపాడు తాను ఎన్నుకున్నటువంటి ప్రదేశం అంతా కూడా పరమాద్భుతమైన ప్రదేశంగా తాను తీర్చిదిద్దాడు తాను ఒక కులాన్ని ఎంచుకున్నాడు కులము అంటే సంఘము అని అర్థం ఆ కులం ఏమిటి అంటే అది యాదవ కులం యాదవ కులానికి గోవులకి సంబంధం ఉన్నది గనుక ఎక్కడ జ్ఞానం రక్షించబడుతుందో అటువంటి ప్రదేశాన్ని కూడా ఆయన ఎన్-ఎన్నుకున్నాడు మనకి నెమ్మదిగా విచారణ సాగుతూ ఉన్నప్పుడు విషయాలు తెలుస్తాయి కథా కథన రీతిలో శ్రీకృష్ణుడు పుట్టాడు నిజరూప దర్శనం ఇచ్చాడని ఆ నిజరూప దర్శనం అంతా చతుర్భుజులతో గదా చక్రం వీటితో నిన్న సాయంకాలానికి దేవకీ దేవి తన పక్కన ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని దర్శనం చేసిందని చూచి తిలకించి పులకించి అబ్బురపడి అది కదా నిన్నంత అద్భుతపడి ఆనందపడింది ఇన్ని దశలలో ఏకకాలంలో అయితే వసుదేవుడికి కొంత దేవ రహస్యం తెలుసు ఎలా తెలుసు అంటే ఈ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కృష్ణి సుతాపుడి గర్భంలో కృష్ణి గర్భుడిగా ఆనాడు అనిపించుకున్నాను ఆ తర్వాత వామనుడిని అనిపించుకున్నాను ద్వాపర యుగంలో మాత్రం నన్ను కృష్ణుడు అని పిలుస్తారు అన్నాడు అంటే కృష్ణ దేహానికి పేరు ఎవరు పెట్టారు నామకరణం అంటే చెరసాలలో నామకరణం చేసే వాడు ఎవడున్నాడు ఆయనకు ఆయనే పెట్టుకున్నాడు మళ్ళీ ఆయనకు ఆయనే పెట్టుకున్నటువంటి అవతారం అధునాతన కాలంలో ఒకటి ఉంది దాని పేరు షిరిడి బాబా ఆయనకెవరూ పేరు పెట్టలే మహల్ సాపతి చేత ఆలో సాయి అనిపించుకున్నాడు ఆయన అంతే ఈయన సాయి అన్నవాడు లేడు ఈయనకు పేరు పెట్టినటువంటి తల్లిదండ్రులు లేనే లేరు అడవిలో కన్నారు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయినారు ఆయన కూడా స్వయంభువే ఈశ్వరుడే కనుక నామకరణం చేసుకున్నాడు వెలుగు చెరసాల అంతా కూడా పరిపూర్ణమైనటువంటి వెలుగుతో నిండిపోయిందట కానీ జాతక చక్రం ప్రకారం పురాణాల ప్రకారం మనం తెలుసుకున్న దాని ప్రకారం అష్టమి అర్ధరాత్రి చెరసాల చీకటి ఇంతట్లో అందులో రోహిణి రోహిణి అంటే ఆ రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని వాళ్ళ అద్దంలో చూసుకోండి కాస్త కోపం ఎక్కువుంటుంది గట్టిగా ఉంటారు వాళ్ళు వాళ్ళు అనుకున్నదే చెల్లాలి కృష్ణుడి లాగానే అనుకున్నదే చెల్లాలి వాళ్ళు అనుకున్నదే శాసనం అంతే ఏ రెండో మాట లేదు రోహిణి నక్షత్రానికి ఉన్నటువంటి లక్షణం అది అలాగే ఎంత గొప్ప వంశంలో పుట్టిన ప్రాపంచికమైన యాతనలు కూడా వాళ్ళు అనుభవిస్తారు అలాగే స్తుతులు తక్కువ నిందలు ఎక్కువ ఉంటాయి అందుకనే శ్రీకృష్ణ గాధ అంతా ఒక మధుర విషాద గాధ అది ఎంత మాధుర్యంగా ఎంత ఆనందంగా వినటానికి ఉంటుందో ఆ పాట్లు పడ్డ కృష్ణుడు మీద మాత్రం అది విషాదమే ఆయన్ని దేవుడు అన్నవాడే లేడు ఇప్పుడు మనం ఉంటున్నాం పోనీ ఎవరన్నారో ఆయన ఉన్న కాలంలో అంటే పంచ పాండవులు కుంతి ద్రౌపది భీష్ముడు విదురుడు అక్రూరుడు వీళ్ళని వినయ ఇస్తే నువ్వు దేవుడివి అయ్యా అన్నవాడు లేనే లేడు నువ్వు దేవుడివి కాదు అన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ జీవితంలో ఉన్నటువంటి paradox ఏదైతే ఉన్నదో ఒక వైరుధ్యం ఏదున్-ఏమైతే ఉన్నదో అదంతా మన కృష్ణావతారంలో నెమ్మది నెమ్మదిగా మనకు అర్థమవుతుంది అలాగే పోతనామాత్యుడు నిజానికి విశ్వనాథవారు వాల్మీకి కంటే ఎంత గొప్పగా తెలుగులో కల్పవృక్షం రాశారో వ్యాసులవారి కంటే చాలా గొప్పగా పోతనామాత్యుడు రాశాడు ఎక్కడ దానిని పెంచాలో ఎక్కడ అక్కరలేదో దాన్ని ఆయన edit చేసుకున్నాడు చేసుకొని సహజమైన తన పాండిత్య గరిమ చేత భక్తి పారవ్యం చేత కృష్ణ జీవితాన్ని సుమధురం గా గానం చేసుకున్నాడు ఆయన ఆ ఒక్కొక్క లీల లో నుంచి ఒక మంత్రాత్మకమైన తంత్రాత్మకమైన యంత్రాత్మకమైనటువంటి దివ్య భావనలంతా కూడా అందుకున్నటువంటి వాడు పోతనామాత్యుడు మనమందరము అటువంటి వాళ్ళకి దండం పెట్టాలి నిద్ర లేవగానే ఆ భాగవతం ఆయన రాయకపోతే ఈ వేళ దిక్కేది ఆ కృష్ణుడి కథ ఎవడికి తెలుసు అటువంటి ఆ పోతన అక్కడ వర్ణిస్తాడు తర్వాత కొన్ని విశేషాలు ఉన్నాయి ఆ తల్లి ఒక మాట అన్నది నాయనా అష్టమ గర్భంలో నా అష్టమ గర్భంలో వచ్చిన వాడే మా అన్నగారికి కాలుడు అని చెప్పింది యోగమాయ ఎదురు చూస్తున్నాడు వాడు ఇట్లా గనుక నువ్వు కౌస్తుభ మణితో శంఖ చక్ర గదాధారివై గనుక ఉన్నట్లయితే ఇంత వెలుగు రూపంగా ఉన్నట్లయితే ఇదేదో నన్ను మించిన లోకాతీతమైన శక్తే పుట్టింది అనుకుంటాడు నిన్ను ఇలాగే సంహరిస్తాడేమో నాయనా కాబట్టి ఈ రూపాన్ని ఉపసంహరించుకొని మామూలు పసిబాలుడి వలే ఉండమన్నది ఆవిడ జీవుడి ప్రారబ్ధమే చూశారా ఒక పక్కన ఆయన పరమాత్మ అని దేవకికి తెలుసు అయినా ఏమంటున్నది కంసుడు నిన్ను చంపుతాడేమో అంటుంది ఓసారి1987 ప్రాంతంలో eighty six స్వామి హైదరాబాద్ వచ్చారు. వస్తే sudden గా ఒక మాట ఏమన్నారంటే ఫలానా ఆయనతో "నేను మీ ఇంటికి వస్తున్నాను" అన్నారు. ఆయన అసలు ఈయన్ని పిలవలే. "నేను నీ ఇంటికి వస్తున్నాను" అన్నారు. అనగానే త-- దర్శనానికి వచ్చాడు ఆయన. తత్తరపడిపోయాడు ఆయన. "ఏం చేయాలి స్వామి?" అన్నాడు. "ఏం చేయొద్దు నేను వస్తున్నాను" అన్నాడు. "నువ్వు చేసేదేమి నేను వతున్నాను అంతే కదా" అన్నాడు. స్వామి రావటం అంతేనా? అంత తేలిగ్గా ఉంటుందా? అయినా సరే పాపం దండం పెట్టుకొని స్వామి దగ్గర విభూతి తీసుకుని మళ్ళీ car లో వెళ్ళిపోయాడు. అప్పటికీ జూబ్లీహిల్స్ పుడుతున్న వేళ. ఇంటికి ఇంటికి సుమారుగా ఒక kilometer దూరం current లేదు. '86 లో మనం current లేక అనుభవించాం. రోజుకి రెండు గంటలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ. సరే స్వామి అనుకున్న ప్రకారం వచ్చేసారు. లోపల ఇంకా గృహప్రవేశం కాలే కొత్త ఇల్లు అది. స్వామి తలుపు తీసుకుని లోపలికి వెళ్లారు. అందులో నేను కూడా వెంబడి వెళ్ళాం. మేమంతా ఒక ఆరుగురం వెళ్ళాం. స్వామి అన్ని గదులు, ప్రతి గదిని చూశారు. లోపలికి వెళ్లారు. bathrooms తో సహా. అంతా అయిపోయింది స్వామి వస్తున్నారు కదా అని ఇట్లాగే ఒక కుర్చీ వేసి స్వామి సింహాసనం అని అక్కడ పెట్టారు. "ఏమీ వేణుగోపాల్ మంచి ఇల్లు కట్టుకున్నావు. ఇల్లంతా చూశాను. చాలా బాగుంది. ఒకటే అర్థం కాలేదు. ప్రతి చోట ఒక candle ను ఒక అగ్గిపెట్టె పెట్టావేమప్ప" అన్నారు. [నవ్వు] అదొకటి. అనగానే ఆయన "ఆహా స్వామి చాలా జాగ్రత్తగా గమనించారని, స్వామి మీరు వస్తే చీకటి-- light పోతుందేమోనని" "స్వామి వస్తే light పోతుందా? లేని light వస్తుంది బంగారు" అంటూ కూర్చున్నారు. [నవ్వు] లేని light వస్తుందని ఈయన అన్నారు చప్పున current పోయింది. [నవ్వు] చూశారా ఆట? రెండు నిమిషాల్లో ఆడుకున్నారు స్వామి. current ఉన్న current కాస్త పోయింది. అనగానే "బయటికి వెళ్లి చూసిరా" అన్నారు. బయటికి వెళ్లి చూసేస్తే, ఆ-- ఈయన ఈ గదిలో నుంచి బయటకు వెళ్లారో లేదో ఈ ఒక్క ఇంట్లోనే light ఉంది. జూబ్లీహిల్స్ మొత్తం చీకటి అయిపోయింది. అది. స్వామి వస్తే light రావటం అంటే అది. స్వామే వెలుగు. అది. [చప్పట్లు] స్వామి మళ్ళీ వెలుగుగా రావటం, వెలుగై రావటం కాదు. వెలుగే స్వామి. వెలుగు అంటే జ్యోతి స్వరూపం. అది జ్ఞాన స్వరూపం. శ్రీకృష్ణావతారం అంతా జ్ఞానబోధ చేయడానికి వచ్చినటువంటి పూర్ణ అవతారం. అవి వాళ్ళకి విశేషణాలు, బిరుదులు కావు. పూర్ణమైన అవతారం అంటే ఏమిటంటే, ఏ లోటూ లేని, ఏ రకమైనటువంటి మచ్చ లేనటువంటి అవతారం. మానవుడికి మార్గనిర్దేశనం చేసే అవతారం కాబట్టి ఆమె ఉపసంహారం చేయమంది. మామూలు వాడిగా ఉండమంది. ఈ పొరపాటు యశోద పడ్డది. ధృతరాష్ట్రుడు పడ్డాడు. తర్వాత, తర్వాత అర్జునుడు పడ్డాడు. విశ్వరూపం చూపిస్తే నాకు మా-- భావగానే ఇష్టం అన్నాడు. నాకా విశ్వరూపం భయం వేస్తుంది. ముందు ఉపసంహరించుకొని మామూలు మా బావ లాగా కనిపించమన్నాడు. మనకి భావాలంటే ఇష్టం తప్ప దేవుడంటే ఇష్టం లేదు. దేవుడు అలా వస్తే మనకు భయం. అది. అందుకే ఆయన అలా రాడు. చతుర్భుజులతో ఆయన వచ్చినట్లయితే ఆయన్ని మనం అంగీకరించలేం. భయానకమైనటువంటి భయద రూపం కాబట్టి ఆ స్థితి రాకూడదని అటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనంద తారక స్థితిని చెందించేటువంటి పూర్ణ స్వరూపమే కృష్ణావతారం. ఇక వసుదేవుడికి విషయం తెలుసు కాబట్టి ఆ వసుదేవుడు ఈయనని అక్కడి నుంచి తప్పించాలి. ఎక్కడికి తప్పించాలి? నందుడి దగ్గరికి చేర్చాలి. పరమ రహస్యం అంతా ఇక్కడ ఉంది. ఆ పరమ రహస్యంలో యమునా నదికి ఇవతల మధుర ఉన్నది. మధుర దాని పేరంటే మధురము అంటే తీయనిది అని. అంతే కదా sweetest of the sweet. కానీ దానికి రాజు ఎవడో తెలుసునా? తామస గుణ స్వభావం ఉన్నటువంటి కంసుడు. వాడున్న ప్రదేశానికి మధుర అని పేరు. ఈ మధుర, ఈ తీయదనానికి అవతలి గట్టున ఉన్నటువంటి వ్రేపల్లె. దీనికి అది వ్రజభూమి అన్నారు. ఆ వ్రజభూమి అంటే అది ముముక్షు భూమి. ముముక్షు భూమి అంటే తపస్వులంతా ఉండేటువంటి చోటది. మరి శ్రీకృష్ణ పరమాత్మ చెరసాలలో పుట్టి కంసుడు ఉన్న చోట ఆయన ఎందుకుంటాడు? ఆ time వచ్చేదాకా అక్కడ ఉండడు. ఇది పరమ అవతార పురుషుల యొక్క జీవితాలలో ఉండే ఒక నిగూఢమైనటువంటి రహస్యం. కాబట్టి ఆయన ఆరోజు అప్పటికప్పుడే ఆ క్షణమే ఆ చీకట్లోనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి. వసుదేవుడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే ఇలా తీసుకెళ్ళమన్నాడు. వసుదేవుడు ఎంత గొప్పవాడంటే యమునా నది. యమునా, యముడి చెల్లెలు. యముడు నలుపు, కాలుడు నలుపు. కాలం ఎప్పుడూ నలుపే. అది సూర్యుడి వలన పగలు, రాత్రివ-- చంద్రుడి వలన వెలుగుతున్న తప్ప కాల స్వరూపం ఏమిటంటే చిమ్మ చీకటి. నలుపు. అటువంటిది దాటగలడా? అందులో యమునా నది పరవళ్ళు తొక్కుతున్నటువంటి యమునా నది. దాటలేను అనుకున్నాడా వసుదేవుడు. పద్నాలుగు భువనాలని తన పొట్టలో నిలుపుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని చిన్న బుట్టలో పెట్టుకున్నాడు. ఆ తట్టలో పెట్టుకొని, తల మీద పెట్టుకొని యమునా నదిని అలా దాటే ప్రయత్నం చేశాడో లేదో ఉప్పొంగి పారుతున్నటువంటి యమునా చీలింది. దారిచ్చింది. దారి ఇవ్వటానికి ఎవడు సంకేతం ఇచ్చాడు? పరమాత్మ సంకేతం ఇచ్చాడు. వసుదేవుడికి ఎప్పుడైతే ఒక దేవ రహస్యంగా నన్ను ఫలానా చోట యశోద పొత్తిళ్ళలో నన్ను పడేయ్ మన్నాడు. అక్కడున్న ఆడపిల్లని తెచ్చి ఇక్కడ పెట్టమన్నాడు. ఆయన చెప్పిందే. వసుదేవుడు ఎక్కడా నోరు విప్పడు. దేవకితో సహా. దేవకికి కూడా కొడుకు పుట్టాడని తెలుసు గానీ ఆరోజు రాత్రే యోగమాయ కారణంగా, ఏ తల్లైనా ఈ కొడుకుని తీసుకెళ్లి అక్కడిచ్చేసి ఆ పిల్లని తెచ్చి ఇక్కడ పడుకోబెట్టమంటే, అదేమన్నా Niloufer ఆస్పత్రే? కాదుగా. అది.కాబట్టి ఒప్పుకోదు ఏ తల్లి ఒప్పుకోదు అందులో వరపుత్రుడు ఆయన పూర్ణపురుషుడు దర్శనం చేసుకున్నది అప్పుడే ఆనందంలో ఉన్నది కనుక ఆవిడ కూడా యోగమాయ కమ్మింది యోగమాయ కమ్మిన కారణంగా వసుదేవుడు వెళ్ళాడు ఆదిశేషువు పడగ పె-- విప్పాడు ఎక్కడ వసుదేవుడి మీద కూడా చుక్క నీళ్ళు పడకుండా అని మన కథ భగవంతుడితో కూడి ఉంటే మన మీద కూడా చుక్క నీళ్ళు పడవు అది దాని అర్థం ఆయనకు గొడుగు పెడితే ఆయనకే గొడుగు పెడితే ఆ గొడుగు కిందే ఆయన ఉంటే ఆయనతో మనం ఉంటే మనకి ఎండ లేదు Anan లేదు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ శేషువుని ఎందుకు పంపాడు ఏమిటి శేషత్వం ఇది సత్య సాయి భగవానుడి భక్తులుగా మనం ఇది ఎరగాలి ఇది తెలుసుకోకపోయినట్లయితే స్వామి కూడా అర్థం కారు జ్ఞాని ఏమనుకుంటాడు అంటే దైవం నన్ను రక్షిస్తూ ఉంటుంది అనుకుంటాడు జ్ఞాని నన్ను అంటే ఆత్మని అని అర్థం జ్ఞాని భాషలో అనన్య భక్తి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి మనం రక్షిద్దాం అనుకుంటాడు అందుకనే మనకు ఈమెయిల్ వస్తుంది ఆ ఈమెయిల్ లో ఏముంటుందంటే స్వామి కాస్త నలతగా ఉన్నారు అందరూ ఇళ్లలో ఒక రెండు వేల సాయి గాయత్రి చేసేయండి అని సాయి గాయత్రే స్వామి అయినప్పుడు ఆయనకి మనం మళ్ళీ మంత్రం చదవటం ఏంటి అర్థం ఉందా దానికి అయితే అది అనన్య భక్తి మాత్రమే అనన్య భక్తి అత్యుత్తమ స్థాయి మాత్రం కాదు అది ఒక మంచి స్థాయి అత్యుత్తమ స్థాయి ఏది అంటే జ్ఞాని అయినటువంటి వాడు పరమాత్మే నన్ను రక్షిస్తాడు అసలు పరమాత్మకి రక్షణ అక్కరలేదు అని నిశ్చలమైన భావంతో ఉంటాడు గనుక మనం స్వామి ఆరోగ్యాన్ని గురించి సాయి గాయత్రులు చేయకూడదు అది దోషం చేసినట్లయితే అది అజ్ఞాన భూమికే తప్ప జ్ఞాన భూమిక కాదు అది మన కోసం చేసుకోవచ్చు మన తోటి వాడి కోసం చేయొచ్చు ఇంకోటి కోసం చేయొచ్చు ఆయన సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మమే స్వరూపంగా వచ్చింది గనుక శేషువు అంటే నాకోసమై నా వారి కోసమై నాకు మాత్రమే జరిగేటువంటి విశేషం ఉన్నది అని గనుక ఎవడన్నా అనుకుంటే అది కేవలము ఒక భౌతిక స్థాయి ఇది జరుగుతున్నదంతా ఇప్పుడు ఈ భాగవత నవనీతం ఎవరు అంటున్నది ఎవరు వింటున్నది ఎవరు అంటే వారికోసం వారి వలన వారి చేత వారిదే అయినా అనే భావన ఎప్పుడైతే ఉంటుందో దాని పేరు శేషత్వము అని పేరు ఆ శేషత్వంలో ఉత్-- అత్యుత్తమ స్థాయికి చెందినటువంటి వాడు ఆదిశేషువు గనుక రామావతారంలో లక్ష్మణ స్వామిగా కృష్ణావతారంలో బలరాముడిగా పరమాత్మని వెన్నంటి ఉన్నాడు ఆయన అది అంటే పరమాత్మ కోసం పరమాత్మ వలన పరమాత్మ ప్రేరితంగా జీవనం చేయటం వేరు నాకోసం నా వారి కోసం జీవనం చేయటం వేరు నాకోసం జీవనం చేయటం ఒక ప్రాథమిక స్థాయి పరుల కోసం చేయటం మరొక మధ్యమ స్థాయి పరమాత్మ కోసమే జీవించటం బహుత్కృష్టమైన స్థాయి గనుక భాగవతం మనకు స్థూలంగా నేర్పేటువంటి విషయం అది అలాగే ఈ అవతార పురుషులు అక్కడి నుంచే ఉండి వాసుదేవుడి దగ్గరికి నిన్న కథ మనం విన్నాం ఏమని దేవకి గర్భంలో ఉండగా దేవతలంతా చెరసాలలోకి వచ్చి గర్భస్థ శిశువు అయినటువంటి పరమాత్మని కీర్తించారు ఆయన్ని గుణగానం చేశారు రావయ్యా తొందరగా వచ్చి ఈ ప్రపంచాన్ని రక్షించమని అడిగారు అని చెరసాల కదా వాళ్ళంతా లోపలికి ఎలా వెళ్లారు అని వెళ్లగలరా అని వాళ్ళు దేవతలు గనుక వెళ్లగలరు దేవతలే వెళ్లగలిగినప్పుడు దేవాది దేవుడు వెళ్లలేడా బయటికి సంకెళ్ళు విడిపోయినాయి తాళాలు ఊడిపోయినాయి మనకది అద్భుతమా ఆశ్చర్యమా మనకి ఆశ్చర్యం పరమాత్మకి సహజం అది స్వామి ఓ ఉంగరం సృష్టించినా వస్తువును సృష్టించినా అది ఆయన సహజ శక్తి మనకి మాత్రం అది ఒక మానవాతీతమైన దివ్య శక్తి గనుక అక్కడ ఆశ్చర్యపోవటం మన వంతు ఏ రకమైన వికారం లేకుండా వస్తువును సృష్టి చేయటం పరమాత్మ యొక్క తత్వం అంతే కాదు ఇక్కడ నుంచి నన్ను అక్కడకు చేర్చు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడే ఎందుకని అన్నాడు అక్కడే ఉండొచ్చు కదా అంటే మధురలో కంసవధ అయితే తప్ప మళ్ళీ శ్రీకృష్ణ ప్రవేశం జరగటానికి వీలు లేదు తామసం గాఢంగా అక్కడ పేరుకుపోయి ఉన్నది పైగా కేవలం తన ప్రాణభయం తన ప్రాణాన్ని తన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కంసుడు అప్పటికే సుమారు ఏడు శరీ-- ఆరు శరీరాలు చంపాడు మొదటి బిడ్డని చంపలే వాడు వసుదేవుడు ఎప్పుడైతే మొట్టమొదటి తొలికాంపు వచ్చిందో ఆ బిడ్డను తీసుకెళ్లి కంసుడికి ఇస్తే కంసుడికి సహజమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి వాడన్నాడు మాట నిలబెట్టుకున్నావు వసుదేవా వీణ్ణి మాత్రం నేను చంపను తీసుకెళ్ళమన్నాడు నేను ఎక్కడికి తీసుకెళ్తాను ఇక్కడే ఉండని అన్నాడు బయట వదిలిపెట్టాడు కానీ ఆరుగురిని మాత్రం సంహారం చేశాడు ఈ ఆరు ప్లస్ ఒకటి పోగా ఈ ఎనిమిదవది అయినటువంటి ఈ అష్టమ గర్భమే ఆత్మ పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబయే నీ శరీరంబు నీదే కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగకెట్లు ఏతదధిష్ఠాత ఎవడో యజమానుడనిన అష్టమ తనువు వాడు ఆ అష్టమ తనువు కృష్ణుడు అంటే పరమాత్మే ఆత్మగా జీవాత్మగా ఒక దేహాన్ని తీసుకుని ఒక మూర్మయ శరీరాన్ని తాల్చి చిన్మయ రూపుడై వచ్చాడు అని అర్థం అక్కడే ఉండి ఆచరసాలుడు అనే పెరిగి వెళ్ళొచ్చు కదా అంటే ఉండడు అక్కడ మరి ఎక్కడికి వెళ్ళాలి ముముక్షు ప్రాంతంలోకి ఆ క్షేత్రంలోకి వెళ్ళాలి ఆ ముముక్షు క్షేత్రం ఏది తాను ఎంచుకున్నటువంటి వ్రజభూమిలోకి వెళ్ళాలి ఆ వ్రజభూమిలో ఎవరి దగ్గర పెరగాలి యశోద దగ్గర పెరగాలి యశోద మంత్రం నందుడు గురువుదేవకి మంత్రం వసుదేవుడు గురువు. మంత్రము గురువు ఒక చోట ఉన్నట్లయితే జ్ఞానం లభిస్తుంది. గురువు ద్వారా వచ్చే మంత్రమే మంత్రం నిజానికి మిగతావి మంత్రాలు కావు. మరి మా-- ఆ గురువు ఎవడు? అసలు దర్శనం చేసిన వాడు మంత్ర ద్రష్ట అయిన వాడు సకల బీజాక్షరాల వెనుక ఉన్నటువంటి సర్వాధిష్టాన దేవతలని ఒక్కసారి చూసి ఆయా శక్తులని ఆవాహన చేసుకున్నటువంటి వాడు మాత్రమే గురువు తప్ప మిగతా వారు గురు స్థానంలో ఉన్నవారే. ఆ కుర్చీలో కూర్చున్న వారే అంతే. అసలు గురువు ఎవడయ్యా అంటే ఆయనొక మంత్రం ఇస్తాడు. ఆ మంత్రం ఎలా ఇస్తాడంటే మంత్రం ఎప్పుడూ కూడా స్త్రీ స్వరూపం. కనుకనే యశోదాదేవి ఒక మంత్రం. నందుడు పరమానందమైనటువంటి ఆయనకు ఆనందమే ఆనందం తప్ప ఇంకోటి తెలియదు. ఆ ఆనంద స్వరూపుడైనటువంటి నంద యశోదల దగ్గరకి చర్చమని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకని అంటే మంత్రానికి ఎక్కడ గౌరవం ఉంటుంది అక్కడ దేవతలుంటారు. దేవతలు ఎక్కడ ఉంటే మంత్రాలు అక్కడ బలం పుంజుకుంటాయి. కానీ మంత్రానికి దేవతకి మధ్య ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది పురుష రూపంలో నందుడిగా ఉంటుంది. భగవాన్ రమణ మహర్షిని తీసుకోండి. అలగమ్మకు పుట్టారాయన. అలగమ్మ సుందరయ్యన్ ఎక్కడో తిరుచ్చుళులో. ఉన్నారా అక్కడ? కొన్నాళ్ళు ఉన్నారు. అరుణాచలానికి చేరుకున్నారు. అరుణాచలానికి ఎలా చేరుకున్నారు? దేవాలయం మీదకో దేవాలయం పైకో లేకపోతే కొండ పైకో వెళ్ళలే. అరుణాచల గర్భాలయ ప్రవేశం చేశారు లింగాన్ని ఆలింగనం చేసుకున్నారు. తండ్రిని ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను ఇకపై అంతా నీ ఇష్టం అన్నాడు. అంటే తాను ఉండవలసినటువంటి తండ్రి ఎవరు ఎక్కడ నిర్ణయించుకున్నారు అంటే అరుణాచలంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడిని. పక్కన అపీత కుచాంబిక అమ్మవారున్నది. ఆమె స్తన్యం ఇచ్చేది లేదు ఈయన తాగేది లేదు. ఎందుకంటే రావటం రావటమే విభూతి స్థాయిలో జ్ఞానైకమూర్తిగా దక్షిణామూర్తి స్వరూపంగా వచ్చాడు గనుక ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా ఒక జ్ఞానం పొందటం అంటూ లేదు. మరి అరుణాచలాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే అరుణాచలం అనేటువంటిది సాక్షాత్తు శివుడు గనుక శివుడుడు-- శివుడు అచలుడు గనుక అక్కడ ఏ రకమైన వికార భావం లేనటువంటి స్థిమితమైనటువంటి జ్ఞానమూర్తి గనుక అరుణాచలం చేరుకున్నాడు. అంటే తాను కన్న తల్లిదండ్రులు భౌతికమైన తల్లిదండ్రుల నుంచి దూరంగా వైదొలుగుతాడు అవతారమూర్తి. ఆ తల్లిదండ్రుల దగ్గర ఆయన పెరగడు. ఎందుకని పెరగడంటే తన కారణంగా వారికి మమతా, మమకారము, అహంకారము పెరగకూడదు గనుక వాళ్ళ దగ్గర ఉండడు. అది. శ్రీరామచంద్రుడు అంతే. కౌసల్యానందనుడై పుట్టాడు పెరిగింది కైకమ్మ దగ్గర. అది విచిత్రం. ఈ అంతఃపురం నుంచి ఆ అంతఃపురానికి స్నానం చేసి పరిగెత్తుకు వెళ్ళేవాడు. సహజమైన సత్వగుణ ప్రధాన శీల అయినటువంటి కౌసల్యని దాటి కైక దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే తామస సంహారం జరగాలి. అహంకార మమకారాలు రెండూ నశించాలి. కనుక రామచంద్రుడు అక్కడి దాకా నడిచి వెళ్ళాడు. అలాగే షిరిడి బాబా తాను జన్మ ఎత్తినటువంటి తాను ప్రభవించినటువంటి ప్రదేశాన్ని దాటి శిలాడీ అనేటువంటి గ్రామాన్ని చేరుకున్నాడాయన.
SSSMC · audio
Bhagawata Navaneetham - 54
Bhagawata Navaneetham - 54
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 27:57
More in this series