No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం అలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాం పరమమహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ షిరిడీ షిరిడీ అంటున్నదంతా దాని పేరు శిలాది. శిలాది అంటే చెరుకుతోట. మళ్ళీ చూడండి మధురా నగరంలో కంసుడు ఉన్నట్టుగా ఆ శిలాదిలో అన్ని చెరుకుతోటలు ఉన్నాయి మధ్యలో ఒక్క వేప చెట్టు ఉంది. ఈ గురువు వెళ్ళి దేనిని ఆశ్రయించాడంటే చెరుకు తోటలో కూర్చోలే పోయి వేప చెట్టు కింద కూర్చున్నాడు. తమస్సు ఎక్కడ ఉంటుందో తపస్సు అక్కడ ప్రారంభమవుతుంది. తపస్సు ఎక్కడ అంతమవుతుందో పెను వెలుగు మన వశం అవుతుంది, కైవశం అవుతుంది. అలాగే శ్రీరామచంద్రుడు అంటే, రమణ మహర్షి అంటే, శంకర భగవత్పాదులు అయితే మరి అతి పిన్న వయసులోనే తల్లి నుంచి దూరం కావటానికి నిర్ణయించుకున్నారు. సన్యాసం తీసుకో ఇవ్వమని అడిగారు. ఇస్తూనే ఆ తల్లి, "నాయనా మరి ఇప్పుడంటే నేనున్నాను, నీకు ఎవరు నీకు ఆకలి అయినప్పుడు అన్నం ఎవరు పెడతారు?" అని అన్నప్పుడు, "అమ్మా! ఇప్పటివరకు నువ్వు ఒక్కదానివి వేళకు అన్నం పెట్టావు. ఇకపై ఏ వేళకి నాకు ఎవరు అన్నం పెడతారో ఆ తల్లులంతా నా కోసం ఎదురు చూస్తున్నారు" అన్నాడు. ఆ మాతృభావన ఉప్పొంగిపోయింది శంకర భగవత్పాదులకి. ఎంత అతి చిన్న వయసులో ఈ జగత్తుకి అంకితమైపోయినారాయన. జాతిని నడిపించాలి వాళ్ళ జన్మలే అటువంటివి. ఆ ప్రవేశం, ప్రసవం, ప్రభావం ఇవన్నీ కూడా జగత్ కల్యాణం కోసం ఉంటాయి. అలాగే మన సమకాలీనంగా సత్యసాయి భగవానుడిని గనక చూసినట్లయితే పక్క వీధిలోనే ఇక్కడ ప్రభవించింది ఈశ్వరమ్మ ఇంట, పెరిగిందంతా కరణం సుబ్బమ్మ ఇంట. ఏ ఇక్కడికి అక్కడికి ఏమిటి తేడా అని ఉన్న తేడా ఏముంది ఆయనే చెప్పారు. నేను ఉండవలసిన ప్రదేశం అక్కడేనన్నారు. అందుకనే స్వామి తన sixtyeth birthday అప్పుడు ఎవరు ఈ కరణం సుబ్బమ్మ అని foreigners స్వామిని అడుగుతూ ఉన్నప్పుడు యూనివర్సిటీ వైపు కారులో తీసుకెళుతున్నారు. ఈశ్వరమ్మ స్వామిని కన్న తల్లి. కరణం సుబ్బమ్మ కనుగొన్న తల్లి అన్నారు. అది. ఈయన పరమాత్మే అని కనుగొన్న తల్లి ఎవరంటే ఈశ్వరమ్మ కాదు కరణం సుబ్బమ్మ. కాబట్టి అవతార పురుషుడు పుట్టిన చోట ఉండడు. ఈ తనువుకి కారణమైన వారి దగ్గర ఆయన ఉండడు. ఎందుకంటే మమతా రాహిత్యమే వైరాగ్యం కాబట్టి, ఆ వైరాగ్యమే కదలని సిరి కాబట్టి దానిని అందించటానికి అవతార మూర్తుల జీవితాలని ఆ దిశగా గమనించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెరసాలలో ఉండటానికి వీలులేదు. లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో చెప్తాడు. కృష్ణున్ని ఎక్కడన్నా కనపట్టలేదు కనపట్టలేదు అంటే రెండు ప్రదేశాలు చెప్తాను వెళ్లి వెతుక్కోండి అన్నాడు. యోగీశ్వర హృదయాలలో హాయిగా నిద్రిస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళండి అన్నాడు. అంటే ఒక్క యోగిని గనక పట్టుకున్నట్లయితే భగవంతుణ్ణి పట్టుకున్నట్లే. ఆ యోగి యొక్క శరీరం ఆ పరమాత్మ ఉన్నటువంటి ఇల్లు అని అర్థం. అక్కడికి వెళితే చాలు. మరి రెండో చోట ఎక్కడ? అంటే యశోద వంటి స్త్రీమూర్తి గనక ఉన్నట్లయితే, అటువంటి స్త్రీమూర్తి గనక నీకు దొరికినట్లయితే ఆ హృదయంలో పరమాత్మ ఉంటాడు పట్టుకోమన్నాడు. అంటే తాను కన్న బిడ్డలతో పాటు సర్వ ప్రపంచాన్ని తన బిడ్డలుగా భావించగలిగిన స్త్రీమూర్తి ఆ మాతృ స్థానంలో ఆ మాతృదేవతలుగా పూజింపబడతారు గనుక పరమాత్మ సాయి అయినా, షిరిడి సాయి అయినా, రాముడైనా అలాగే ఈవేళ మన కృష్ణుడైనా ఆ తల్లిని వెతుక్కుంటూ వెళ్ళాడాయన. శేషభోగం, భోగం అంటే పడగ, శేషము అంటే నిశ్శేషమైన భావన. నాది అంటూ ఏమీ లేని ఒకానొక దివ్యమైనటువంటి వైరాగ్య స్థితి. వైరాగ్యం వేషంలో ఉండక్కర్లా. ఆంతరంగిక వైరాగ్యం చాలా ప్రధానమైనది. చూడండి దేవకీ వసుదేవులకు పుట్టినటువంటి లేదా ప్రభవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి ముక్తిని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ముందు దర్శనం ఇచ్చాడు, స్పర్శనం ఇచ్చాడు, మాట్లాడాడు, సంభాషణ కూడా ఇచ్చాడు. ఎందుకని ఇచ్చాడు అంటే ఇక తర్వాత కాలంలో వాళ్ళకి ఆ యోగం లేదు, అయిపోయింది అక్కడికి. ఆ చెరసాలలోనే అయిపోయింది. ఇక మిగతాదంతా ఎవరికివ్వాలంటే ప్రపంచంలో ఎవరు అందుకోవాలో వాళ్ళకి. ఈ మార్మికతని, ఈ అనుభవాన్ని జీవుడు పొందాలి. పొందకపోయినట్లయితే ఏదో యమునా దాటాడు, అదొక మహి-మహిమ కాదు. వసుదేవుడికి దేవి-దేవ రహస్యం తెలుసు గనుక, పరమాత్మే అక్కడికి వెళుతున్నాడు గనుక ఆయన దారికి, ఆయన అవతార కార్యక్రమానికి ఏ విధంగానూ ఎవరూ అడ్డం కాకూడదు గనుక పాయలుగా విడిపోయింది, అక్కడికి వెళ్ళాడు. యోగ మాయలో ఉన్నటువంటి ఆ స్త్రీ శిశువుని తీసుకొచ్చాడు. ఆడపిల్లని ఇక్కడ, మగపిల్లవాడిని అక్కడ చేర్చాడు. ఆయన పని అయిపోయింది మళ్ళీ వచ్చాడు. వచ్చినవాడు ఈయనే వెళుతున్నప్పుడు తలుపులన్నీ, సంకెళ్ళన్నీ ఎట్లా విడిపోయినాయో, ఈయన వస్తుండంగా అన్నీ మళ్ళీ ఆయనకి తగులుపోవడం మొదలు పెట్టినాయి. జీవుడి ప్రారబ్ధం కూడా అంతే. చాలా వదిలేశాం అనుకుంటాం. ఓ నా అంతటి వాళ్ళు లేరనుకుంటాం. అన్నీ తగులుకుంటాయి మళ్ళీ. కాళ్ళకి సంకెళ్ళు, మెడకి సంకెళ్ళు, సంసారం సంకెళ్ళు. అదెట్లా, ఇదేట్లా, అదేమైపోతుందో, ఇదేమైపోతుందో, అక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నారో, ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నారో. ఇదంతా మనకి మనం వేసుకునే సంకెళ్ళు. మళ్ళీ కంసుడికి ఏ రకమైనటువంటి అనుమానాలు రాకుండా వసుదేవుడు వచ్చి తన సంకెళ్ళు తానే వేసుకున్నాడట. ఇది మహా దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకంటే వాడు అడుగుతాడు. వాడు అసలే రాజు కదు.సంకెళ్ళలో ఉండగానే నా-ఇప్పుడు వాళ్ళ పొద్దున్న చూసి వెళ్ళాను మళ్ళీ రాత్రయ్యే అప్పటికి లేకుండా ఎలా ఉన్నావ్ ఎలా విప్ప తీసుకున్నావ్ అంటాడేమో అని మళ్ళీ తనకు తానే తగిలించుకున్నాడట. అంటే చిందేవి కొన్ని చెందేవి కొన్ని. కొన్ని చింది మీద పడతాయి కొన్ని మనంతట మనం పోసుకుంటాం. మనంతట మనం చేసుకునే కర్మలు కొన్ని ఉంటాయి మనకు తెలియకుండా అట్లా బజారున వెళ్తుంటా ఎవడో పైనుంచి ఏదో వేస్తాడు. ఆహ్ వొళ్ళంతా పైన పాడైపోతుంది. పైన పాడైపోతే ఏం పర్లేదు బయట పడేయొచ్చు, లోపల పాడైపోతే సంగతి ఏమిటి? ఆ లోపల పాడవకుండా ఉండటానికి ఆ చడని పదార్థం అంటారు నిమ్మాచార్యుల వారు. చడని పదార్థాన్ని పట్టుకోవటానికే భాగవతం అనాలి, భాగవతం వినాలి. శ్రీకృష్ణ గాథ అంతా కూడా పరమోత్కృష్టమైనటువంటి ఉదారమైనటువంటి గాథ. అంతేకాదు యశోద మంత్రమని అలాగే నందుడు గురువని, దేవకి మంత్రమని, వసుదేవుడు మంత్రమని గురువని భావన ఎందుకని చేయవలసి వచ్చిందంటే, ఈ మంత్రం ద్వారా జ్ఞానాన్ని వాళ్ళు పొందారు. ఎలా పొందారు? ప్రభవించిన కారణంగా తొలి దంపతులు, చేరుకున్న కారణంగా మలి దంపతులు. ఇక్కడ ఈ నందుడు ఉన్నాడే, వాడికి ఆనందం తప్ప మరొకటి తెలియదు. వాడి పేరు అందుకే నందుడు అని పేరు పెట్టారు వ్యాసులవారు. అందరికీ అలా ఆనందం ఇస్తాడంటే వాడు ఒక సామంతరాజు పాపం. ఎవరికి సామంతరాజు? మధురా నగరానికి సామంతరాజు. ఒకరోజున ఈ కప్పం అంతా కట్టడానికి కంస సామ్రాజ్యానికి వెళ్ళాడు. వెళితే అక్కడ వసుదేవుడిని కూడా చూశాడు. చూట్టాలేగా మరి. చూస్తే వసుదేవుడికి కొన్ని దేవ రహస్యాలు తెలుసు గనుక, "మా పిల్లవాడు ఎలా పెరుగుతున్నాడు?" అని అడిగాడు. మామూలు ధోరణిలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు నందుడు. శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడని ఆంతరంగికంగా అడిగాడు నందుడు. కానీ ఆ ఉన్న శ్రీకృష్ణుడు ఆయన బిడ్డ అని ఈయనకి తెలియదు. నీ పిల్లవాడే నా పిల్లవాడన్న భావనలో నందుడు చెప్తున్నాడు, ఆడుకుంటున్నాడు, పాడుతున్నాడు, ఉయ్యాలలో ఊగుతున్నాడు. అసలు వాడిని చూస్తేనే ఆనందం. చందమామ ముక్క, వాడొక ఆహ్ మేఘడ, వాడొక జున్ను, వాడొక చెరుకు ముక్క. మధురమైనటువంటి పదార్థాలు ఏవున్నాయో అవన్నీ మన శ్రీకృష్ణుడేనని చెప్పుకుంటూ ఆనందంగా పరవశంగా చెప్తున్నాడు. అప్పుడు వసుదేవుడు ఒక చిన్న హెచ్చరిక చేశాడు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలిసిపోయినాయి. కంసవధ ఎప్పుడు జరుగుతుందో కూడా వసుదేవుడికి తెలుసు. కానీ దేవకికి కూడా చెప్పలేదు ఆయన. దేవ రహస్యాలు అందరికీ చెప్పకూడదు. గురువు ఆజ్ఞ అని భార్య అయినా సరే ఆమెకి చెప్పకూడదు. అది అధర్మం కాదు. ఎందుకు కాదో చెప్తా. తనుకులో ఓ మహా పండితులు, వేద పండితులు, జనాపాఠి స్వామి చేసినటువంటి వేద యజ్ఞానికి ఒకసారి వస్తే, స్వామి ఆయన విద్వత్తుకి చాలా ఆనందపడిపోయి పరమాద్భుతమైన నవరత్న మాల ఇక్క సృష్టించి మెళ్ళో వేశారు స్వయంగా. వేసి వదిలి పెట్టొచ్చుగా. ఈయన ఆ పని చేయడు. ఇచ్చి ఓ చిన్న condition supply అన్నారు. ఎవరు అడిగినా సరే నీ మెళ్ళో నుంచి తీసి ఎవరికీ ఇవ్వకు ఎవరూ తాకకూడదు అని ఏదో మాట చెప్పారు. కేవలం పరీక్ష చేయటానికే. అట్లాగే స్వామి మీరు మీ ఆజ్ఞ ఆవరణలో ఉన్నాడుగా అన్నీ వేస్తే. వచ్చాడు వచ్చేప్పటికి ఏమిచ్చారంటే, "ఇదిగో శాలువా ఇచ్చారు చాలా బాగుంది, ఇటువంటి శాలువా ఇంతవరకు ఇవ్వలేదు. ఇదిగో" ఆ రోజుల్లో పదివేల రూపాయలు ఇచ్చారు స్వామి. అబ్బో! చాలా గొప్ప విషయం. ఇంకా ఆనందపడిపోతున్నది ఆవిడ. ఇంతలోకి ఆయన పైన కండువా కప్పుకుంటే, ఈ హడావుడిలో కాస్త తొలగింది. "ఏంటండీ మీ మెళ్ళో మెరుస్తున్నది?" అన్నది. "ఆ అదే అది చెప్పకూడదులే" అన్నాడు. "ఇన్ని చెప్పి అది ఎందుకు చెప్పకూడదు? అది ఎవరు ఇచ్చారో చెప్పండి" అంది. "ఆది స్వామే ఇచ్చారు నాకి" అన్నాడు. "మరి స్వామి ఇస్తే నాకు కూడా భాగం ఉంది చూడొచ్చు నాకు దోషం లేదు. మీరు రోజూ మరి అగ్ని కార్యం చేసేటప్పుడు నాతో సహా చేయిస్తారు కదా, ప్రారంభం నేను లేకుండా మీరు చేయటానికి లేదు కాబట్టి నాకు ముందు అది ఒకసారి ఇవ్వండి" అన్నది. అప్పుడు పాపం ఆయన నెమ్మదిగా, ప్రశాంతంగా, "స్వామి ఇది ఎవరికీ ఇవ్వకూడదు నీతో సహా" అని అనకుండా కాస్త ఆహ్ లౌకికంగా ఏమన్నాడంటే, "నేను ఇస్తా లే కాస్త కాస్త ఆగు ముందు ఇవన్నీ చూడు" అన్నాడు. "ఇవన్నీ చూసేశాను చూడని ఆ వస్తువు ఏమిటో ముందు నాకివ్వు" అని. "చూసిందే మళ్ళీ మళ్ళీ ఎక్కడికి చూడాలి? చూడనిది నాకివ్వు చూపించమంది" అంది. తీశాడు తప్పలే. తీసి, "ఇదిగో" అని ఇచ్చాడు. ఇలా ముట్టుకున్నాడో లేదో అది మొత్తము ముక్కలైపోయి అక్కడ అక్కడ ఇల్లంతా పడిపోయి హాలు అంతా నిండిపోయిందని ఆరోజు పొద్దున్నే జరిగింది ఇది. జరగ్గానే పాపం ఆయన జ్ఞాని చదువుకున్నవాడు. ఏదో గురు ఆజ్ఞను నేను ధిక్కరించాను ఇది నాకు తప్పదు అనుకొని తానే స్వయంగా అన్నీ ఏరుకొని మళ్ళీ ఒక పొట్లం కట్టుకొని గుడ్డలో కట్టుకొని అదేరోజు సాయంత్రం మళ్ళీ పుటపర్తి ప్రయాణమై వెళ్ళాడు. ఆ రోజుల్లో పుటపర్తి ప్రయాణం అంత తేలిక అయింది ఏం కాదు. చాలా కష్టం. అయినా చేరుకున్నాడు. స్వామి ఆయన వస్తూ ఉండగానే ఆయనకు అర్థమైంది. వీడు పశ్చాత్తాప పడ్డాడు అంటే చాలు ఆయనకి. "ఏమి ఏమైంది? మళ్ళీ వచ్చావేంటి? అన్న మర్చిపోయినావా వస్తువు?" అంటే. "మర్చిపోలే స్వామి పోగొట్టుకున్నాను" అని. "ఏం పోగొట్టుకున్నావ్?" అన్నారు. సరే ఈ కథ అంతా చెప్పాడు. అప్పుడు స్వామి చెప్పారు, "గురువుకి సేవ చేయటమంటే గురు ఆజ్ఞను పాటించటమే. ఇంకేం లేదు. గురువుకి నువ్వేం సేవ చేయగలవు? కాళ్ళుత్తాలా? కళ్ళుత్తాలా? ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లే. ఆయన ఏం చెప్పారో తూచా తప్పకుండా పాటించు." వసుదేవుడు ఆ మాటని ఆ ఒక్క గురు ఆజ్ఞని పాలించిన కారణంగా యమునా దారి ఇచ్చింది ఆయనకి. శేషుడు అంత భయంకరమైన కాలరాత్రి వర్షం అయినప్పటికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం మన వెంట ఉంటుంది అని ఈ భాగవతంలో మనకివ్వాళ లభించేటువంటి అది వెన్న. మనం కూడా స్వామి ఎన్నో చెప్పారు కొన్ని వేల వందల మాటలు చెప్పారు. ఒక్కొక్కటి ఒక్కొక్క సూచన, ఒక్కొక్క ఆజ్ఞ, ఒక్కొక్క ఆదేశం.తూచా తప్పకుండానే పాటించాలి పాటించి ఆ కఠినతరమైనటువంటి జీవితాన్ని సాధనడం చాలా కష్టం చెప్పడం చాలా తేలిక సాధన చేస్తూ ఉన్నప్పుడు మనల్ని నెగ్గిస్తాడు ఆయన చూడండి మన ఇంట్లో మనవడో మనవరాలు పుట్టింది సరే అసలు వాళ్ళు పుట్టినప్పుడు time ఉండదు వాళ్ళు ఎట్లా గడప దాటారు time ఏ ఉండదు మనకి కానీ మనవడు పుట్టేటప్పటికి అంత పనే ఉండదు కదా ఖాళీగా ఉంటాం సరే వాడు దాటే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడు పాపం చాలా విశ్వ ప్రయత్నం చేస్తుంటాడు మన ఆనందం ఏంటంటే వాడు దాటితే కుడుములు చేద్దామో ఏదో ఇంకా బూరెలు చేద్దామా గారెలు చేద్దామా వాడు దాటాలి వాడు కష్టపడుతున్నాడని మనకు తెలుసు దాటుతాడు అని తెలుసు ఆ time వచ్చిందని తెలుసు మనమేమైనా దేవుడిని ప్రార్థిస్తామా గడప దాటించు స్వామి అని ప్రార్థించం వాడు దాటేస్తే అది మనకు ఆనందం అలాగే పరమేశ్వరుడు కూడా ఆయన మనకిచ్చేటువంటి అనేక సన్నివేశాలలో మనను గెలిపించటానికే ఆ కష్టాలు ఆయన ఇస్తాడు కష్టం రూపంలో ఇస్తాడు కానీ అది కష్టం కాదు నిజానికి అదొక అనుభవం ఆ అనుభవాన్ని వసుదేవుడు పరిపూర్ణంగా distinction లో pass అయినాడాయన కనుకనే మళ్ళీ ఆ స్వధర్మం కారణంగా తన కాళ్ళకు తాను సంకెళ్ళు తొడిగించుకున్నాడు తొడుక్కున్నాడు ఇది సన్నివేశం ముముక్షు ప్రాంతంలోనే శ్రీకృష్ణుడు చేరుకున్నాడు జాగ్రత్తగా ఇవి మనకి భాగవతం అయ్యేదాకా ఈ మాటలు పునః అనుకుంటూ ఉండాలి ఎందుకని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు అప్పటికి అప్పుడే ఎందుకని వెళ్ళిపోయినాడు అంటే తామసం లో చీకట్లో పరమాత్మ ఉండడా అంటే ఆవరించి ఉన్నటువంటి చోట యోగము సంభవించే దాకా పరమాత్మ కూడా అవతార ప్రకటన చెయ్యడు ఏం స్వామి నిన్న శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు ఏం జరిగిందో స్వామి పుట్టినప్పుడు అవన్నీ జరిగినయని చదివాం కదా మరి అప్పుడే నేనే సాయిబాబా అని చెప్పేయొచ్చుగా మరి చెప్పారా చెప్పలే పధ్నాలుగేళ్ళు ప్రాపంచికమైనటువంటి జీవితాన్ని గడిపి నెమ్మది నెమ్మదిగా దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళి అందుకోగలిగినటువంటి ఏ నలుగురో ఐదుగురో ఆయనకి దొరుక్కుంటారు ఆ time లో అందుకనే అది ప్రకటన చేశారు అది శ్రీరామచంద్రుడు కూడా పదహారవ ఏడు వచ్చే దాకా దేశాటనం చేసి వచ్చి భగ్నమైన మనసుతో ఉన్నటువంటి వాడు నాకు ఈ ప్రపంచం వద్దన్నవాడు మళ్ళీ ప్రపంచం పట్ల ఒక కర్తవ్యాన్ని స్వీకరించాడు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ తల్లిదండ్రులు అయినటువంటి దేవకీ వసుదేవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అపేక్ష లేకుండా చేశాడు నిజరూప దర్శనం ఇచ్చాడు మళ్ళీ మామూలు పశుపాలుడు వలే ఆయన పడుకున్నాడు ఆ వెళ్ళాడు అటువంటి సన్నివేశంలో ఇక కథా కథనంలో ఏమిటంటే అక్కడికి ఆయన చేరాడు ఎక్కడికి యశోద దగ్గరకు చేరాడు ఈ మధ్యలో వ్యాసర-- వ్యాసభాగవతం గాని పోతన గాని ఆ వర్ణన అంతా చేస్తాడు ఆ కాల వర్ణన ప్రకృతి వర్ణన ఇవన్నీ కూడా మనకి వాటి అవసరం లేదు గనుక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అది విచారణ మనం చేయాలి. ఎట్లు యమునా దాటి అక్కడి నుంచి మొదలు పెడదాం ఎట్లు దాటాడంటే ఇదిగో ఇప్పుడు అనుకున్నాం గా ఆదిశేషువు పడగ విప్పాడు తర్వాత తట్టలో కూర్చున్నాడు చతుర్దశ భువనాలను పొట్టలో నింపుకున్న పరమాత్మని వసుదేవుడు మోశాడు ఎంత అదృష్టం ఆయనకి అక్కడితో ఉద్ధారణ అయిపోయింది ఎలా మోయ్యగలిగాడు అంటే ఆ మోయ్యగలిగిన శక్తిని కూడా ఆయనే ఇచ్చాడు మామూలుగా అయితే ఎత్తగలడా ఎత్తలేడు తర్వాత తర్వాత ఎత్తగలిగారా ఎవడు ఆయనను బట్టుకోలేకపోయినారు కానీ ఆ రోజున మాత్రం తీసుకుని వెళ్ళాడు తనకు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని తాను నిష్టగా చేశాడు దానిని మించిన తపస్సు మరొకటి లేదు నిజానికి రెండు రకాల officials లు ఉంటారు తమకు ఇచ్చిన పని ఎక్కడ rule break చేయకుండా సర్వజన హితంగా కర్తవ్యాన్ని చేసేవాడు ఒక officer లొసుగు ఎక్కడుంటే దానిని advantage తీసుకుని పైకి వచ్చేవాడు రెండో వాడు రెండో వాడు జైల్లో పోతాడు మొదటి వాడు జైలుకే వెళ్ళడు జైల్లో ఉన్నవాణ్ణి పరామర్శిస్తాడు కాబట్టి జైలు అంటే చెరసాలలో పుట్టిన కృష్ణుడు liberate అయినాడు ఎవరు చేశారు ఆయన్ని తనను తానే liberate చేసుకున్నాడు చేస్తూ వాళ్ళిద్దరికీ ఉత్తమోత్తమమైనటువంటి గతిని ప్రాప్తిని ఇచ్చాడు ప్రాప్తి అంటే వాళ్ళిద్దరూ మరణించారా మరణించడానికి వీల్లేదు వాళ్ళు ఆనందాన్ని అనుభవించాలి మళ్ళీ రాజ్యం ఏలాలి ప్రపంచంలోకి రావాలి పోగొట్టుకున్న భోగాన్ని కొంత మళ్ళీ రుచి చూడాలి మళ్ళీ మాయలో పడాలి మాయలో పడేయటం పరమాత్మకి మహా సరదా పడకుండా ఉండే ప్రయత్నం సాధకుడు చేసుకోవాలి ఆ సాధనలో నందుని దగ్గరకు వెళ్ళాడు వనజాక్షుని తెచ్చుటయు తన సుత కొని పోవుటయు తాయెరుగక మాగిన మూగిన నిద్ర చొక్కి ఉందే వనజాక్షి యశోద రేయి వసుదాధీశ. పిల్లవాడు పుడితే పిల్ల పుడితే లేకపోతే యశోద హాయిగా నిద్రపోయింది ఏమి అని ఎందుకు నిద్రపోయింది అంటే యోగమాయ కమ్మిందక్కడ యోగమాయ కమ్మకపోతే ఆమె కూడా ఆడపిల్లని ఆయన చేతిలో ఇచ్చి పంపేది కాదు మగ పిల్లవాడు వచ్చాడు కన్నానని అనుకోలేదు ఆమె కృష్ణున్నే కన్నాననుకున్నది ఆమె అలాగే నందుడికి కూడా వసుదేవుడు అడిగినప్పుడు పిల్లవాడు ఎలా పెరుగుతున్నాడు అన్నప్పుడు తన పిల్లవాడైన కృష్ణుడి గురించి ఆ గాథలన్నీ చెప్తూ ఉంటాడు ఇలా పెరిగాడు అలా పెరుగుతున్నాడు ఇలా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు అని వసుదేవుడు చాలా ఆనందపడతాడు కానీ అక్కడ కూడా ఆ వాడు నా కొడుకు నా బిడ్డ అని మాత్రం చెప్పడు అప్పుడు యశోద పొత్తిళ్ళలో ఉన్నటువంటి ఆ యోగమాయ ఒక్కసారి రోదించింది ఆ రోదనమనేటువంటిది నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను అని చెప్పేటువంటి తొలి కేక ముందు తొలి కేకలతోనే వస్తాం పోలికేకలతో జీవితం ముగించుకుంటాం అంతే తేడా.తొలికేక సంకేతం ఆగమన సంకేతం తొలికేక నిర్గమన సంకేతం అక్కడ అమ్మ అంటూ వెళ్ళామా అయ్యా అంటూ వెళ్ళామా అయ్యయ్యా అంటూ వెళ్ళామా తెలియదు ఆ అమ్మ అంటూ అన్నా వెళ్ళాలి అయ్యా అంటూ అన్నా వెళ్ళాలి రెండు జరగటానికి వీలు లేదు. అంత బాలికా ఉరని ఏడ్చు చిరు చప్పుడాలించి ఏకన నాక ఇంటి కావలివారు మేల్కొని చూచి తలుపులు తాళముల్ తొంటి వితంబున నుండ తెలిసి చక్కన వచ్చి దేవకి నీళ్ళాడే తీసుకొచ్చి ఇక్కడ పెట్టగానే యశోద మాగందుగా నిద్రపోయింది దేవకి వచ్చింది ఆమెకు మెలకువ వచ్చేప్పటికి ఈ పిల్ల ఏడుస్తున్నది ఏడ్చేప్పటికి అంత కావలి వాళ్ళంతా మాయలో పడిపోయి ఉన్నట్టు ఉన్నారు అంతా లేచారు తలుపులు గడియలు వేసి ఉన్నాయి ఎక్కడివి అక్కడ ఇదివరకు పూర్వ యధాస్థితి ఏదైతే ఉన్నదో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ కాపలాదారులంతా దేవకి నీళ్ళాడే బిడ్డను ప్రసవించింది రమ్మని ఆ భోజరాజు తోట చెప్పిన ఆ అతడు సిడిముడితో పాటు కలత చెందాడు. ఏమిటి అష్టమ గర్భం వచ్చిందా వాడి-వాడికంత ప్రాణభయం తనువు తన దేహం కోసం ఏదైనా చేస్తాడు వాడు అందుకనే ఎంత భ్రూణహత్యలు చేశాడు వాడు. సిడిముడితో తల్గంబుపై లేచి తత్తరమున వెంట్రుకలు వీడ పైచీర వెలియాడ తాన్మికిలూడ రోషాగ్ని దర్పమాడ భురివైరంబుతో గూడ పురిటి ఇంటిజాడ తనుదించి ఆ చాపాప చంపగదియా గదియా అంటే దగ్గరకు వెళ్ళాడు సమీపంగా వెళ్ళాడు వెళ్ళి ఆ పాపని చంపాలి అని నిర్ణయించుకున్నవాడు వాడు ఎదురు చూసిందే దానికోసం అష్టమ గర్భంలో ప్రస-ప్రసవిస్తే దేవకీదేవి అడ్డం వచ్చింది. ఆవిడ లాజిక్ చూడండి ఇవాళ స్త్రీవాదం స్త్రీలంతా వెనకబడిపోయినారు అంటున్నారు గానీ గార్గి మైత్రేయి ద్రౌపది కుంతి వీళ్ళంతా ఎటువంటి ధర్మ నిర్ణయాలు చేశారు అలాగే ధర్మ వాదం చేశారు ఆ ధర్మ వాదంలో దేవకీదేవి అడుగుతున్నది అష్టమ గర్భంలో పుట్టినవాడు అని ఒక అశరీరవాణి అన్నదని వీడు అన్నాడు. అన్న శమింపుమన్న జగదు అల్లుడు కాడిది మేనగోడలు అల్లుడైతే చంపాలి గానీ ఇంత ఆడపడుచు మేనగోడలు అన్నది. మన్నన సేయుమన్న వినుమానెని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములను పుత్రోవ పోదన్న భవత్ సహోదరికదన్న నినున్ శరణంబు వేడెదన్ వ్యాఖ్యానం అక్కర్లే నువ్వు ఇటువంటి వాడివి మర్యాదగా ఉండాలి మంచిగా ఉండాలి మన కులంలో పుట్టిన ఆడపిల్ల చంపొచ్చునా వీడేం మేనల్లుడు కాదు మేనగోడలు అని ఆర్గురు కడుపున బట్టి వధించితివి ఆడపడుచుది కోడల్ నట్టన చంపగ వలెనే కట్టడ నిగదన్న అన్న కరుణింపగదే పుత్రుడు నీ బ్రతుకునకు శత్రుండని వింటి గాన పుత్రుడు పుడితే నీకు పుత్రుడు పుట్టేశాడు వాడి మృత్యువు పుట్టింది అక్కడే కానీ వీడికి తెలియదు పుత్రుడు పుడితే నీకు శత్రువైన విన్నావు అంతే కదా కానీ పుట్టలేదుగా అంటుంది. అని సమయింపన్ పుత్రుల నోచనేతి పుత్రీదానం బుజేసి పుణ్యము గనవే పుత్రులందరినీ కన్నాను పోగొట్టుకున్న పుత్రీదానం చెయ్ ఈ కన్యాదానం చెయ్ నాకున్నటువంటి నా పిల్లను నాకు నిలబెట్టు దానివల్ల నువ్వు పుణ్యాన్ని పొందుతావు అన్నది. తోబుట్టువుని తిట్టి ఆ ఆ పిల్లని రెండు కాళ్ళు పట్టుకొని నేలకేసిలా కొట్టే ప్రయత్నం చేశాడు నేలకి తగులుతుందా యోగ మాయ వీడు కొట్టేలోగా చే-చే జారింది ఆకాశంలోకి ఎగిరింది. ఎనిమిది బాహువులతో దర్శనం ఇచ్చింది కంసుడు అదృష్టవంతుడు చూడండి వగచేత పగచేత ఎట్లాగో నువ్వు దర్శనం అయితే నీకు దొరికింది యోగ మాయ అనంత బాహువులు ప్రధానంగా అష్ట బాహువులతో దర్శనం చేసి ఇచ్చి మింట నుండి కంటబడి కంసుడితో ఏమన్నదంటే చంపరివై పొరిం పొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలన్ చంపితివి అంతనైన ఉపశాంతి వహింపక రాళ్ళమీద ఒప్పింపగ ఇసిరో వాళ్ళని చంపటం కాకుండా నన్ను తీసుకెళ్లి రాతికేసి కొట్టదాం అనుకున్నావే ఇది యుబీరమే ఇదేమన్నా శౌర్యమా కంసా అంటున్నది. నా సరసం జనించి నిన్ చంపెడి వీరుడొక్కటస సత్కృతి వందడి వాడు దుర్మతి నాతోనే సహజన్ముడై ఒకడు పుట్టాడు అన్నది డూమూ ఊరిలో వాడికి డూ వినిపించింది అయిపోయింది. డూ వాడికి డూ వినపడలా ఏదో ఉన్నది ఆడపిల్ల మగవాళ్ళనే చంపేశానని ఆడపిల్ల అని తనుకున్నాడు నేను పుట్టిన సమయంలోనే ఒక మగ పిల్లవాడు పుట్టాడు కాబట్టి వాడు పెరిగి పెద్దవాడై నిన్ను సంహరిస్తాడు అని మళ్ళీ అప్పుడు అశరీరవాణిగా ఇప్పుడు శరీరవాణిగా ప్రకటన చేసింది అది కేవలం భ్రాంతి అనుకోవటానికి వీల్లేదు ఎందుకంటే ఈ పిల్లను తీసుకున్నాడు ఆకాశంలోకి ఆమె ఎగిరింది ఎనిమిది బాహువులతో దర్శనం ఇచ్చింది కంఠమిప్పి మాట్లాడింది గనుక వాడి భయం ప్రారంభమైంది భయమే మృత్యువు మృత్యు భయం కాదు భయమే మృత్యువు భయపట్టం మొదలుపెడితే ఆ క్షణం నుంచి మనం మరణించినట్లే లెక్క.మరణం ఒక సెకండ్ లో ఏర్పడేది దానికి భయపడక్కర్లా భయానికి కూడా మనం భయపడకూడదు భయాన్ని దూరం వైదొలగించాలి కంస జీవితం అంతా చూడండి ఎలా పరిణామం చెందుతుందో. మహనీయ గుణాస్పదయై మహిలో మా దేవి జనము మన్నింపంగా బహు నామ నివాసంబుల బహు నామములంచరించే భద్రాత్మికయై అనగానే వాడు ఉలిక్కిపడ్డాడు నాస్-- నేను పుట్టినప్పుడే పుట్టిందన్నాడే అంటుందే అయితే ఎక్కడున్నాడు ఎక్కడ పుట్టాడు ఎవరికి తెలుసు ఎక్కడ అని వెతికేట్టు ఈ సువిశాలమైనటువంటి భూలోకంలో ఆ పుట్టినవాడు ఎక్కడున్నాడు పట్టుకోగలడా కంసుడు వల్ల మాత్రం కాదు మథురా నగరం అంతా గాలించ వచ్చు ఆ చుట్టు రూపు ఉన్నటువంటి గ్రామాలు రాజ్యాలు వాడు గాలించవచ్చు గానీ సమస్త సృష్టిని గాలించలేడు అంటే మృత్యువుని మనం గాలించే అవసరం లేదు మనలో మనతో పరమాత్మ ఎట్లా ఉన్నాడో మనతో మనలో మన వెంట నీడగా మృత్యువు మన యందే మన పక్కనే అది ఉన్నది ఎలా ఉన్నది అంటే ఎప్పుడొస్తావని అడగక్కర్లా అది దేని చెప్పదు వస్తుంది అంతే ఎందుకొస్తుంది అది రావాలి గనుక వస్తుంది ఎప్పుడొస్తుంది చెప్పి రాదు ఎవరికొస్తుంది అందరికీ వస్తుంది ఇందులో ఎవరిని వదిలిపెట్టేది ఏం లేదు మరి దేనికి భయపడతాడు జీవుడు అంటే ఈ ప్రపంచం వద్దనుకుంటాడు కానీ ఇక్కడ సుదీర్ఘం జీవించాలని అనుకుంటాడు చూసారా వైరుధ్యం ఈ ప్రపంచం ఏం బాగోలేదండి పరిస్థితులు ఆ ఏదో డెబ్బై ఎనభై ఏళ్ళు ఇక్కడ ఉన్నాను బానే ఉంది ఇంకా ఆయనేదో పట్టుకుపో-- ఆయన పట్టుకుపోడు పట్టుకు పోడు రప్పించడు వచ్చేది మనమే పోయేది మనమే ఈ వైరాగ్య భూమికంతా కూడా మనకి దశమ స్కంధంలో ఒకవైపు చూడండి పరిమళించినటువంటి భక్తే వైరాగ్యం పరిమళించినటువంటి వైరాగ్యమే జ్ఞానం జ్ఞానంలో నుంచి వైరాగ్యం పుట్టదు వైరాగ్యంలో నుంచి జ్ఞానం పుడుతుంది అది జ్ఞానంలో పుట్టడానికంటేం లేదు ఇక పుట్టటానికంటూ ఏమీ లేదో దాని పేరు జ్ఞానం అది దానిలో నుంచి బై ప్రాడక్ట్ మాత్రం వైరాగ్యం కాదు వైరాగ్య భూమికలో ఒక ఉత్తమ స్థాయికి వెళ్ళిన వాడు జ్ఞాని అయి ఉంటాడు జ్ఞాని అంటే జీవితాన్ని అన్నింటినీ కూడా స్పష్టంగా అనుభవించేటువంటి వాడు వాడికి కష్టము సుఖము రెండూ సమానంగానే ఉంటాయి కాచేవాడు ఇందాక అనుకున్నాం కదా జ్ఞాని వేరు అనన్య భక్తితో ఉన్నవాడు వేరు అనన్య భక్తుడు జ్ఞాని కాడు జ్ఞాని జ్ఞాని కూడా భక్తుడు కూడా రెండు ఉంటాయి అప్పుడు ఈ పిల్ల కాదు అని వాడికి తెలిసిపోయింది అష్టవ గర్భం ఈ ఎదురుగా వినపడి ఆకాశంలోకి వెళ్ళింది మాట్లాడింది అదృశ్యం అయిపోయింది కాబట్టి ఆడపిల్ల పైగా ఈ ఆడపిల్ల కాదు అనుకోగానే వాడికి అంతర్మధనం ప్రారంభమైంది.
SSSMC · audio
Bhagawata Navaneetham - 55
Bhagawata Navaneetham - 55
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 27:05
More in this series